Publish Date:Nov 11, 2016
Publish Date:Nov 8, 2016
Publish Date:Nov 2, 2016
Publish Date:Oct 21, 2016
Publish Date:Oct 17, 2016
Publish Date:Oct 14, 2016

EDITORIAL SPECIAL
సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతుంటే... చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన విమర్శలు నిజమేననిపిస్తున్నాయి. మాట తప్పం... మడమ తిప్పమని చెప్పుకునే జగన్... అధికారంలోకి వచ్చాక అనేక హామీల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నేను విన్నాను... నేను ఉన్నానంటూ చెప్పే సీఎం జగన్... కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల గోస మాత్రం వినడం లేదంటున్నారు. ముఖ్యంగా మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. మంత్రుల దగ్గర పీఆర్వోలుగా చేరి ఆర్నెళ్లు అవుతున్నా ఇఫ్పటివరకు జీతం ఇవ్వలేదని, కనీసం అపాయింట్ మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదని మాజీ జర్నలిస్టులు ఆవేదనకు గురవుతున్నారు. మంత్రులు తమకు నచ్చినవాళ్లను పీఆర్వోలుగా ఏర్పాటు చేసుకున్నాక అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని జీఏడీకి లేఖలు రాశారు. అలాగే నెలకు 30వేలు వేతనం ఇవ్వాలని సూచించారు. అయితే, 30వేలు సరిపోవని, కనీసం 50వేలు ఇవ్వాలంటూ మరో లేఖ రాశారు. మంత్రుల లేఖలు ఆర్ధికశాఖకు వెళ్లాయి. అయితే, పీఆర్వోలకు 30వేలు సరిపోతాయని ఆర్ధికశాఖ మెలిక పెట్టడంతో ఆ ఫైల్ ఎటూ కదలకుండా అక్కడే ఆగిపోయింది. ఇది జరిగి దాదాపు ఆర్నెళ్లు కావొస్తున్నా, పీఆర్వోలు మాత్రం మంత్రుల దగ్గర గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఇవాళోరేపో అపాయింట్ మెంట్ ఆర్డర్స్ వస్తాయని, జీతాలు కూడా వస్తాయన్న ఆశతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అయితే, ఆర్నెళ్లు దాటినా ఇంకా అపాయింట్ మెంట్లు, జీతాలు రాకపోవడంతో పీఆర్వోలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. కనీసం టీ తాగేందుకు కూడా డబ్బుల్లేక... తమ పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమలిపోతున్నారు. అయితే, మంత్రుల పీఆర్వోలకు సంబంధించిన ఫైలు ఇప్పటివరకు సమాచారశాఖకు అందలేదని అంటున్నారు. అక్కడ్నుంచి ఫైలు ముందుకు కదిలితే తప్ప పీఆర్వోలకు జీతాలు వచ్చే అవకాశమే లేదంటున్నారు.  తమ పాలనలో ఉద్యోగులకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానంటూ గొప్పుగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి... ఆచరణలో మాత్రం చూపెట్టడం లేదని అంటున్నారు. కనీసం మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోలకే జీతాలు ఇవ్వకపోతే, ఇక మిగతా ఉద్యోగుల బాధలు ఎలా అర్ధమవుతాయని అంటున్నారు. నేను విన్నాను... నేను ఉన్నాననే జగన్మోహన్ రెడ్డికి... సచివాలయంలో మంత్రుల దగ్గర పనిచేసే పీఆర్వోల దుస్థితి వినిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. మరి, మంత్రుల పీఆర్వోల గోస... జగన్ కు ఎప్పుడు వినబడుతుందో... వాళ్ల కష్టాలు ఎప్పుడు తీరతాయో... ఆ దేవుడికే తెలియాలి.
  తీవ్ర నిరాశా నిస్పృహలు.. ఆవేదన.. కూడకట్టుకున్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. భేషరతుగా ఉద్యోగాల్లో చేరొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్ కోర్టుకు పంపగలదని అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడిపోతాయి కాబట్టి తాము అలా చేయటం లేదని ఊరటనిచ్చారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ.100 కోట్ల రూపాయల ఇస్తున్నారని కూడా ప్రకటించారు. సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ పేరిట చార్జీలనూ కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచేశారు. డిసెంబర్ 2 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. సమ్మె కాలంలో తాత్కాలికంగా పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బెదిరించినా.. అవమానించినా.. భరిస్తూ కష్టకాలంలో పని చేశారని భవిష్యత్తులో తప్పకుండా వారి గురుంచి ప్రభుత్వం ఆలోచిస్తుందని హామీ ఇచ్చారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.  ప్రభుత్వం ఎన్నో సంస్థలను కాపాడింది.. ఎంతో మందికి అన్నం పెట్టింది.. అలాంటిది ఆర్టీసీ కార్మికులను బజారున పడేస్తే ప్రభుత్వానికి వచ్చేది ఏముందని..చివరిగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని కేబినెట్ చర్చల్లో మంత్రులు తెలిపినట్లుగా కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున.. ఆర్టీసీ సంస్థ తరుపున.. సదరు కార్మికుడికి చెబుతున్నా.. " ఇక ఇప్పటికైనా మీరు తెలుసుకోండి.. అందరి మాటలు నమ్మి మీరు మోసపోకండి.. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాను వెళ్లి ఉద్యోగాల్లో చేరి మంచిగ బ్రతకండి.. మీ సంస్థను బ్రతికించుకోండి " అని పిలుపునిచ్చారు కేసీఆర్. మీరు మా బిడ్డలని ఎన్నడో చెప్పాము అలానే చూసుకుంటాము. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల పొట్టనింపామే కానీ పొట్టలు కొట్టిన దాఖలాలు లేవని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆశా వర్కర్లకు,హోమ్ గార్డులకు ఇలా చాలా మందికి ఎక్కువ వేతనం ఇస్తుంది కేవలం తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు 30% శాతం రిస్క్ అలవెన్సు ఇస్తున్నామని.. ఇండియాలో తెలంగాణ ఒక్కటే దీనిని ఇస్తోందన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వారికి పింఛను ఇవ్వట్లేదని, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇవ్వడం లేదని వివరించారు. యూనియన్ల మాటలు నమ్మి కార్మికులు పెడదారి పట్టారని సంస్థను దెబ్బతీస్తున్నారని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
# (అక్టోబర్‌ 21)న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా... బీజేపీ-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్-ఎన్సీపీ మరో కూటమిగా బరిలోకి దిగాయి. # (అక్టోబర్‌ 24)న మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 288 స్థానాలకు బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే, కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ-శివసేనకు కలిపి 161 స్థానాలు రావడంతో... ఎప్పటిలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా భావించారు.  # (అక్టోబర్‌ 25)న బీజేపీ, శివసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన... ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం మేరకు ము‌ఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. అయితే, శివసేన డిమాండ్‌ను బీజేపీ తిరస్కరించడంతో మహా డ్రామా మొదలైంది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శివసేన... ఎన్సీపీ అండ్ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపింది. మరోవైపు, శివసేనను చీల్చి, ఇండిపెండెంట్ల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదిపింది. ఇలా అక్టోబర్ 25నుంచి నవంబర్ 9వరకు మహారాష్ట్రలో నెంబర్ గేమ్ సాగింది. # (నవంబర్ 9) మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడంతో, ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు.  # (నవంబర్ 10) తగినంత సంఖ్యాబలం లేనందున తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ తేల్చిచెప్పడంతో, సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన శివసేనను ఆహ్వానిస్తూ, 24గంటల గడువిచ్చారు. # (నవంబర్ 11) అయితే, ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికొచ్చిన శివసేన... చర్చల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు 3రోజులు గడువు ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది. శివసేన విజ్ఞప్తిని తిరస్కరించిన గవర్నర్... మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన ‎ఎన్సీపీకి ఆహ్వానం పలికారు.  # (నవంబర్ 12) అయితే, ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే, రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడంతో... కేంద్రం, రాష్ట్రపతి ఆమోదంతో ఆగమేఘాల మీద, ప్రెసిడెంట్‌ రూల్ విధించారు. # (నవంబర్ 13) గవర్నర్‌ నిర్ణయంపై మండిపడ్డ శివసేన... ప్రభుత్వ ఏర్పాటుకు తాము గడువు కోరినా, ఇవ్వలేదంటూ, సుప్రీంను ఆశ్రయించింది. # (నవంబర్ 13-21) ఒకవైపు సుప్రీంలో కేసు నడుస్తుండగానే... మరోవైపు కాంగ్రెస్‌, ఎన్సీపీలతో శివసేన సంప్రదింపులు సాగించింది. అయితే, శరద్ పవార్‌‌ను మోడీ ప్రశంసించడం... వెంటనే ప్రధానితో పవార్ సమావేశం కావడంతో... బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయేమోనంటూ ప్రచారం జరిగింది. # (నవంబర్ 22) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య చర్చలు కొలిక్కిరావడంతో, ఉద్ధవ్‌కు మద్దతిచ్చేందుకు సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహారాష్ట్ర వికాస్ అఘాడీ పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు. # (నవంబర్ 23) అయితే, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవడంతో... బీజేపీ రాత్రికి రాత్రే వేగంగా పావులు కదిపింది. ఎవరూ ఊహించనివిధంగా ఉదయం 5:47కి రాష్ట్రపతి పాలన ఎత్తేయగా, ఆ కొద్దిసేపటికే ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా... ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో, దేశం మొత్తం నివ్వెరపోయింది. ఇక, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ అయితే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాయి. ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంతో... ఎన్సీపీలో చీలిక వచ్చిందేమోనని భావించారు. అయితే, అజిత్ వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని శరద్ పవార్ ప్రకటించడంతో మహా డ్రామా మరో కొత్త మలుపు తిరిగింది. అదే సమయంలో, గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సుప్రీంను ఆశ్రయించాయి.  # (నవంబర్ 24) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పిటిషన్లపై అత్యవసర విచారణ జరిపిన సుప్రీం... గవర్నర్‌కు బీజేపీ సమర్పించిన మద్దతు లేఖలను తమ ముందు పెట్టాలని ఆదేశించింది. # (నవంబర్ 25) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌లు బల ప్రదర్శనకు దిగాయి. 162మంది ఎమ్మెల్యేలతో మహా పరేడ్ నిర్వహించాయి.  # (నవంబర్ 26) మహారాష్ట్ర వివాదంపై తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.... బలనిరూపణ చేసుకోవాలంటూ ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఒక్కరోజు టైమిచ్చింది. అయితే, సుప్రీం తీర్పు తర్వాత మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే, బలపరీక్షకు ముందే చేతులెత్తేసిన ఫడ్నవిస్‌... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  # (నవంబర్ 26-27) బలపరీక్షకు ముందే బీజేపీ చేతులెత్తేయడంతో... ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ముందడుగు వేసింది. మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి నేతగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను అందజేశారు. దాంతో, డిసెంబర్ ఒకటిన శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే‌.... డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్... కాంగ్రెస్ లీడర్‌ బాలా సాహెబ్‌ థోరాట్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ALSO ON TELUGUONE N E W S
చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ మొదటి సినిమాకు ఎటువంటి అడ్డంకులు ఎదురు కాలేదు. సాఫీగా షూటింగ్ జరిగింది. హ్యాపీగా విడుదలైంది. కానీ, రెండో సినిమాకు కళ్యాణ్ దేవ్ ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడో జనవరిలో సినిమా అనౌన్స్ చేశాడు. ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు. మధ్యలో కొన్ని సమస్యలతో సినిమాకు బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ మొదలైంది. కెమెరా ముందుకు కళ్యాణ్ దేవ్ వచ్చాడు.  క‌ల్యాణ్‌ దేవ్‌ హీరోగా పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తున్న సినిమా 'సూప‌ర్‌మ‌చ్చి'. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. కళ్యాణ్ దేవ్ సరసన క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతకు ముందు రియా చక్రవర్తి హీరోయిన్‌గా, కళ్యాణ్ దేవ్ హీరోగా ఒక సినిమా షూటింగ్ జరిగింది. విశాఖలో కొన్ని సీన్స్ తీశారు. అదే సినిమాలో ఇప్పుడు హీరోయిన్ మారింది. అదీ సంగతి. ఈ సినిమాకు సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్‌. తమన్ పని చేస్తున్నాడు.
ఓ ఐదారేళ్లుగా సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు, యాక్టింగ్ నుండి రిటైర్ అవుదామని అనుకుంటున్నట్లు విక్టరీ వెంకటేష్ తెలిపారు. కానీ, కుదరడం లేదని ఆయన అన్నారు. మేనల్లుడు అక్కినేని నాగచైతన్యతో కలిసి ఆయన నటించిన సినిమా 'వెంకీ మామ'. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల అవుతోంది. అదే రోజు వెంకటేష్ పుట్టిన రోజు, పెళ్లిరోజు కూడా కావడం విశేషం. తాజా ఇంటర్వ్యూలో 'వెంకీ మామ' సినిమా గురించి వెంకటేష్ మాట్లాడుతూ "మామ అల్లుళ్ళ కాంబినేషన్ మాత్రమే సినిమాలో హైలైట్ కాదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనకు తెలియని శక్తి ఏదో మనల్ని నడిపిస్తుంది అని నేను నమ్ముతాను. ఈ సినిమా కూడా అటువంటి కథాంశంతో తెరకెక్కింది. జాతకాలు, విధి నేపథ్యంలో కథ సాగుతుంది. అలాగని, ప్రేక్షకులకు బోర్ కొట్టే టాపిక్ కింద ఉండదు. కమర్షియల్ వాల్యూస్ ఫుల్ గా ఉన్నాయి. ఫస్టాఫ్ అంతా ఫుల్ కామెడీ. సెకండాఫ్ కొంచెం ఎమోషనల్ గా వెళ్తుంది" అని అన్నారు. ఓషో గురించి, తాను నమ్మే ఫిలాసఫీ గురించి వెంకటేష్ చాలా విషయాలు చెప్పారు.  సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నట్లు వెంకటేష్ చెప్పారు. ఐదారేళ్లుగా ఆయన మనసులో ఆ ఆలోచన ఉందట. అయితే... మంచి కథలు వస్తుండడంతో రిటైర్ కావడం కుదరడం లేదని వెంకటేష్ తెలిపారు. 'వెంకీ మామ' తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళంలో విజయం సాధించిన 'అసురన్' చిత్రాన్ని రీమేక్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
  సినిమా పేరు: అమ్మరాజ్యంలో కడపబిడ్డలు తారాగణం: అజ్మల్ అమీర్, ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభునే, బ్రహ్మానందం, అలీ, నిధి కుశలప్ప, ధీరజ్ కె.వి., అరవింద్ రావ్, ధన్‌రాజ్, రాం చైతన్య, జబర్దస్త్ రాము, స్వప్న, కత్తి మహేశ్, శ్రీ సాయిదుర్గ సంగీతం: రవిశంకర్ సినిమాటోగ్రఫీ: జగదీశ్ చీకటి ఎడిటింగ్: అన్వర్ అలీ నిర్మాత: అజయ్ మైసూర్ దర్శకత్వం: సిద్ధర్థ తాతోలు బ్యానర్స్: టైగర్ కంపెనీ ప్రొడుక్షన్స్, అజయ్ మైసూర్ ప్రొడక్షన్స్ విడుదల తేదీ: 12 డిసెంబర్ 2019 మొదట 'కమ్మరాజ్యంలో కడపబిడ్డలు' అనే పేరుతో సినిమా తీసి, సెన్సార్ అభ్యంతరాలతో రాజీపడి, 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు'గా టైటిల్‌ను మార్చిన రాంగోపాల్ వర్మ, ఈ సినిమాని సిద్ధార్థ తాతోలు అనే తన శిష్యుడితో కలిసి ఈ సినిమాని డైరెక్ట్ చేశానని ప్రెస్‌మీట్లలో, ఇంటర్వ్యూల్లో నొక్కి వక్కాణించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో, ఎన్నికల ముందు, తర్వాత పరిణామాలపై, రానున్న రోజుల్లో ఏం జరగనున్నదో ఊహిస్తూ ఈ సినిమా తీశామని కూడా ఆయన ప్రకటించారు. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతోటే ఆయన నారా చంద్రబాబునాయుడును టార్గెట్ చేసుకున్నారనే విషయం మనందరికీ తెలిసింది. ఈ సినిమాతో దాని తీవ్రత పెరిగిందనే అభిప్రాయం ట్రైలర్‌తోనూ, పాటలతోనూ, ఆర్జీవీ ట్వీట్లతోనూ మరింత స్పష్టమైంది. ఈ నేపథ్యంలో 'అమ్మరాజ్యంలో కడపబిడ్డలు' మూవీ ఎలా ఉంటుందనే ఆసక్తి జనంలో కలగడం సహజం. సెన్సార్ ఇబ్బందుల్లో చిక్కుకొని, ఎట్టకేలకు రివైజింగ్ కమిటీ ఇచ్చిన క్లియరెన్సుతో ఇప్పుడు సినిమా మన ముందుకు వచ్చింది. అయితే టైటిల్స్‌లో డైరెక్టర్‌గా తన పేరును ఆర్జీవీ వేసుకోకపోవడం గమనార్హం. కేవలం సిద్ధర్థ తాతోలుకే ఆ క్రెడిట్ ఇచ్చారు. కథ: ఎన్నికల్లో అధికార వెలుగుదేశం పార్టీ (వీడీపీ) ఓడిపోయి, అంతదాకా ప్రతిపక్షంలో ఉన్న ఆర్‌సీపీ 151 సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తుంది. కేవలం 23 సీట్లను మాత్రమే తమ పార్టీ గెలుచుకోవడం, అనూహ్యంగా ఆర్సీపీ అధికారంలోకి రావడం జీర్ణించుకోలేకపోయిన వీడీపీ పార్టీ అధినేత బాబు, ఆయన తనయుడు ఆకాశ్ అలియాస్ చినబాబు, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎలాంటి ఎత్తులు వేశారు, వాటిని ఆర్సీపీ అధినేత వీఎస్ జగన్నాథరెడ్డి ఎదుర్కోగలిగాడా, లేదా? బెజవాడకు చెందిన వీడీపీ ముఖ్యనేత 'దయలేని రమ' నగరం నడిబొడ్డున హత్యకు గురైతే, దాన్ని సాకుగా చేసుకొని కేంద్రం.. రాష్ట్రపతి పాలన విధించి మధ్యంతర ఎన్నికలను తీసుకొస్తే, ఆ ఎన్నికల్లో ఆర్సీపీ మరింత ఘనవిజయం సాధించి, వీడీపీ కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకోవడం క్లైమాక్స్. ఈ రెండు పార్టీల మధ్యలో 'మనసేన' అనే పార్టీ, దాని నాయకుడు మనసేనాని, వరల్డ్ పీస్ పార్టీ నాయకుడు పీపీ చాల్ చేసే హంగామాలూ ఈ ఆత్మలేని కథలో భాగం. విశ్లేషణ: ఇది స్పూఫింగ్ సినిమా. అంటే ఈ సినిమాలోని క్యారెక్టర్లు రియల్ లైఫ్‌లోని పలు పొలిటికల్ లీడర్లను పోలి కనిపిస్తుంటాయి. సినిమా మొదట్లో వేసిన డిస్‌క్లైమర్‌లో 'ఇందులో పాత్రలు, సన్నివేశాలు, ప్రదేశాలు ఎవర్నీ ఉద్దేశించినవి కావు, అంతా తూచ్' అని చెప్పుకున్నారు. అయినప్పటికీ అనేక పాత్రలు మనకు అవి ఎవర్ని ఉద్దేశిస్తున్నాయో స్పష్టం చేస్తుంటాయి. సిద్ధార్థ తాతోలు ఈ మూవీని సీరియస్ సినిమాగా తియ్యాలనుకున్నాడు కానీ, చివరకు స్పూఫింగ్ సినిమాగా తయారుచేశాడు. ఈ సినిమాలో ఒక కథంటూ ఏమీ ఉండదు. ఒక పార్టీని పూర్తిగా డీగ్రేడ్ చేసే విధంగా, మరో పార్టీని అందలం ఎక్కించే విధంగా, ఒక పార్టీ నాయకుల్ని విలన్లుగా, ఇంకో పార్టీ నాయకుడిని హీరోగా చూపించే సీన్లు రాసుకొని, వాటిని ఒకదారానికి గుచ్చి సినిమాగా తీసి జనం మీదకు వదిలారంతే. దాంతో సహజంగానే ఒక పార్టీ వాళ్లకు ఈ సినిమా చేదుగా, ఇంకో పార్టీ వాళ్లకు తియ్యగా ఈ సినిమా కనిపిస్తుంది. డైరెక్టర్ తన ఇమాజినేషన్‌తో విజయవాడకు చెందిన ఒక పేరుపొందిన నాయకుడిని పోలిన 'దయలేని రమ' అనే క్యారెక్టర్‌ను సృష్టించి, ఆ క్యారెక్టర్‌ను హత్య చేయించడం గమనార్హం. అది ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా. అంటే భవిష్యత్తులో ఆ నాయకుడు హత్యకు గురవుతాడని జోస్యం చెబుతున్నారన్న మాట. పైగా దయలేని రమ తమ పార్టీవాడిని తామే హత్య చేసి, ఆ హత్యను ముఖ్యమంత్రి పైకి వెళ్లేలా ప్లాన్ చేస్తే, అది వికటించి, అతడే హత్యకు గురవుతాడు. క్లైమాక్స్‌లో మధ్యంతర ఎన్నికల్లో ఆర్సీపీ పార్టీ మొత్తం 175 సీట్లలో 174 సీట్లు గెలుచుకుందనీ, దీనికి కారణం దయలేని రమ హత్యను జగన్నాథరెడ్డి చేయించలేదని జనం నమ్మారు కాబట్టే ఏకపక్షంగా గెలిపించారనీ స్వయంగా తెరపైకి వచ్చి రాంగోపాల్ వర్మ చెప్పారు. వీడీపీ తరపున బాబు ఒక్కరే గెలిచారంటే, ఏమూలో ఆ హత్యను ఆయన చేయించలేదని జనం అనుకోబట్టేనని కూడా వాక్రుచ్చారు. సినిమా మొత్తమ్మీద పది పేజీల డైలాగ్స్ కూడా ఉండవు. ప్రధానంగా హావభావాలు, రీరికార్డింగ్‌తో సినిమాని నడిపారు. ఏతావాతా వీడీపీ చినబాబు ఏడుపులు, పప్పన్నం తినడాలు, బాబు క్రూర చూపులు, అసెంబ్లీలో జగన్నాథరెడ్డి వెటకారపు నవ్వులు, ఆ పార్టీకే చెందిన పూజ అనే ఎమ్మెల్యే కేకలు, స్పీకర్ నిద్రలు, వివిధ రకాల హావభావాలు, మనసేనాని, పీపీ చాల్ మేనరిజాలు, వాళ్ల డైలాగులు కొంత హాస్యాన్ని పుట్టించాయి. ఓపిగ్గా సగం సినిమా చూడగలిగినవాళ్లు, రెండో సగాన్ని చూడాలంటే చాలా సహనవంతులై ఉండాలి. అంత సహనం ఉన్నవాళ్లకే ఈ సినిమా మొత్తం చూసే భాగ్యం దక్కుతుంది. ఏ డిపార్టుమెంటూ మనసుపెట్టి పనిచేసినట్లు కనిపించలేదు. ప్రొడక్షన్ విలువలు నాసిరకంగా ఉన్నాయి. స్పూఫింగ్ సినిమా కావడంతో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, ఇతర టెక్నీషియన్లు కూడా ఏదో సరదాగా పనిచేసి, సినిమా పేరిట జనం మీదికి వదిలారు. వరస్ట్ అవార్డులు ఇచ్చేపనైతే ఈ సినిమాకి చాలా వస్తాయి. ప్లస్ పాయింట్స్: హాస్యాన్ని పంచిన పీపీ చాల్ పాత్ర మైనస్ పాయింట్లు సరైన కథ లేకపోవడం ముళ్లమీద కూర్చోపెట్టే స్క్రీన్‌ప్లే చెవులు వాయగొట్టే రీరికార్డింగ్ ఒకే తరహా ఎక్స్‌ప్రెషన్స్‌తో భయపెట్టే నటులు కడుపులో దేవినట్లుండే డైరెక్షన్ తారల అభినయం:  వీఎస్ జగన్నాథరెడ్డిగా 'రంగం' ఫేం అజ్మల్ అమీర్, బాబుగా ధనుంజయ్ రుక్మకాంత్ ప్రభునే ప్రధాన పాత్రలు పోషించారు. అజ్మల్‌కు వాయిస్ సూట్ కాలేదు. అతను నోరు ఆడిస్తుంటే, ఇంకెవరో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ధనుంజయ్ యాక్టర్ కాదు కాబట్టి ఉత్సవ విగ్రహం తరహాలో ఎప్పుడూ ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో కనిపిస్తుంటాడు. బ్రహ్మానందం (బాబు కారు డ్రైవర్) ఏడెనిమిది సీన్లలో కనిపించి చివరలో ఒక్క డైలాగ్ మాత్రమే చెప్పారు. అలీ (స్పీకర్), ధీరజ్ కేవీ (చినబాబు అలియాస్ ఆకాశ్), నిధి కుశలప్ప (బాబు కోడలు రమణి), శ్రీసాయిదుర్గ (ఆర్సీపీ ఎమ్మెల్యే పూజ), శ్రీకాంత్ అయ్యంగార్ (దయలేని రమ), అరవింద్ రావ్ (మనసేనాని), జబర్దస్త్ రాము (పీపీ చాల్), ధన్‌రాజ్ (గంగవీటి భవాని), సిట్ ఆఫీసర్ (స్వప్న), సీబీఐ ఆఫీసర్ (కత్తి మహేశ్) సినిమాలో పాత్రధారులుగా భాగమయ్యారు. తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్ సినిమా చూద్దామని కాకుండా కొన్ని నిజ జీవిత రాజకీయ పాత్రల స్పూఫ్‌లను తెరపై చూడాలనుకొనే వాళ్లు, అత్యంత సహనవంతులు ఈ సినిమాకు వెళ్లవచ్చు. రేటింగ్: 0.5/5 - బుద్ధి యజ్ఞమూర్తి 
నటీనటులు: మమ్ముట్టి, ఉన్ని ముకుందన్, ప్రాచి తెహెలాన్, మాస్టర్ అచ్యుతన్, తరుణ్ రాజ్ అరోరా తదితరులు తెలుగు పాటలు: భువనచంద్ర తెలుగు మాటలు: కిరణ్ యాక్షన్ కొరియోగ్రఫీ: శ్యామ్ కౌశల్ సినిమాటోగ్రఫీ: మనోజ్ పిళ్ళై నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా & అంకిత్ బల్హారా సంగీతం: ఎం. జయచంద్రన్ దర్శకత్వం: ఎం. పద్మకుమార్ నిర్మాత: వేణు కున్నపిళ్లి తెలుగులో విడుదల: గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల తేదీ: 12 డిసెంబర్ 2019 'బాహుబలి', తర్వాత 'కె.జి.యఫ్' భారీ బడ్జెట్ సినిమాలకు కొత్త దారి చూపించాయి. భాషాబేధం లేకుండా కథ బావున్న చిత్రాలను దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ దక్కుతుండడంతో పాన్ ఇండియన్ సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఆ కోవలో తెలుగులోకి వచ్చిన సినిమా 'మామాంగం'. ఈ ఏడాది ఫిబ్రవరిలో 'యాత్ర'తో మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు మరోసారి దగ్గర కావడం కూడా ఓ కారణమే. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో చూడండి. కథ: నాలుగు శతాబ్దాల వెనక్కి వెళితే... కేరళలో ప్రతి 12 ఏళ్లకు జరిగే 'మామాంగం' మాహోత్సవానికి  సాముద్రి మహారాజును అంతం చేయాలనే లక్ష్యంతో వెళ్లువనాడు నుండి చావేరుళ్ వంశస్థులు ఒక్కరైనా వస్తారు. ఓసారి చంద్రోత్ వీర పానికర్... సాముద్రి మహారాజును చేరుకుంటాడు. కానీ, రాజును అంతం చేయకుండా వెళ్ళిపోతాడు. మళ్ళీ 24 ఏళ్లకు చావేరుళ్ నుండి చంద్రోత్ వంశంలో చివరి పానికర్ (ఉన్ని ముకుందన్), అతడి మేనల్లుడు (మాస్టర్ అచ్యుతన్) వస్తారు. మార్గమధ్యలో వీరు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కృపాచారి (మమ్ముట్టి) సహాయం చేస్తాడు. అతడి నిజరూపం ఏంటి? చావేరుళ్ కి ఎందుకు సహాయం చేశాడు? సాముద్రి మహారాజును చావేరుళ్ చంపగలిగారా? లేదా? చివరికి ఏమైంది? అనేది సినిమా.  విశ్లేషణ: మొదటగా చెప్పాల్సింది ఏంటంటే... ఇది యుద్ధ నేపథ్యంలో రూపొందిన హిస్టారికల్ వార్ మూవీ కాదు. కేరళలో ప్రాచీన యుద్ధవిద్య కలరి నేపథ్యంలో రూపొందిన ఎమోషనల్ మూవీ. ఒక ఆసక్తికర యుద్ధంతో సినిమా మొదలవుతుంది. అక్కణ్ణుంచి కథ ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవడానికి ప్రేక్షకుడికి చాలా సమయం పడుతుంది. మమ్ముట్టి కూడా తెరపై ఎక్కువసేపు కనిపించడు. ఉన్ని ముకుందన్, మాస్టర్ అచ్యుతన్ తదితరులు వస్తారు.  చావేరుళ్, సాముద్రి మహారాజులు మధ్య వైరం గురించి.... ఓపక్క మామాంగం మహోత్సవంలో భర్తలు, పిల్లలను కోల్పోయిన మహిళల బాధను, కోల్పోతామేమోనని బాధ పడుతున్న మహిళల ఆవేదనను చూపించే సన్నివేశాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తాయి. మధ్యలో సాముద్రి మహారాజు అనుచరులు ప్రజలను ఏ విధంగా బాధ పెడుతున్నదీ చూపించే సన్నివేశాలు వస్తాయి. అవేవీ ఆకట్టుకోవు. యుద్ధం కంటే ఎమోషన్ మీద దర్శకుడు ఎక్కువ కాన్సంట్రేట్ చేశాడు. ఆ ఎమోషన్ కానీ, ఆ రాజుల కథ కానీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేవు. కేరళ ప్రజలకు మాత్రమే కనెక్ట్ అయ్యే కథ ఇది. ఈలోపు విసుగుతో పాటు విశ్రాంతి వస్తుంది. తర్వాత కూడా సినిమా నత్తనడకన సాగుతుంది. క్లుప్తంగా కథను చెప్పాలంటే... యుద్ధం కంటే శాంతి ముఖ్యమని చెప్పే బుద్ధుడి లాంటి ఓ రాజు కథ ఇది. దాన్ని దర్శకుడు నేరుగా చెప్పకుండా... మలుపులతో చెప్పాలని ప్రయత్నించాడు. దాంతో మధ్యలో అసలు కథ కంటే కొసరు కథలు ఎక్కువ అయ్యాయి. ఆ మలుపులను ప్రేక్షకులు ఎవరైనా సులభంగా ఊహించవచ్చు. కథనం, దర్శకత్వంలో లోపాలు ఉన్నప్పటికీ... ఛాయాగ్రహణం, సంగీతంతో సరి చేయాలని సాంకేతిక నిపుణులు కృషి చేశారు. కానీ, సీరియల్ లా సాగుతున్న సన్నివేశాల ముందు వారి ప్రతిభ వెలవెలబోయింది. నిర్మాణ విలువలు, కాస్ట్యూమ్స్ బావున్నాయి.  ప్లస్ పాయింట్స్: ప్రాచీన యుద్ధవిద్య కలరి నేపథ్యంలో సన్నివేశాలు  నేపథ్య సంగీతం నిర్మాణ విలువలు మైనస్ పాయింట్స్: మలయాళీలు మాత్రమే కనెక్ట్ అయ్యే కథ ఏం జరుగుతుందో అర్థం కాని ప్రథమార్థం  నత్తనడకన సాగిన కథనం, దర్శకత్వం ఏమాత్రం ఆకట్టుకొని మలుపులు నటీనటుల అభినయం:  మమ్ముట్టి మంచి నటుడు. ఆయన నటన గురించి కొత్తగా చెప్పడానికి ఏం లేదు. తన పాత్ర పరిధి మేరకు బాగా చేశారు. కృపాచారిగా కాసేపు నవ్విస్తారు కూడా! ఉన్ని ముకుందన్‌కు మజిల్ బాడీ చూపించి, యాక్షన్ చేసే అవకాశం వచ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సినిమా ప్రారంభంలో, ముగింపు సన్నివేశాలకు ముందు యాక్షన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. వీళ్లిద్దరికీ ఏమాత్రం తీసిపోని రీతిలో మాస్టర్ అచ్యుతన్ యాక్షన్ సీన్స్ చేశాడు. ప్రాచి తెహెలాన్ అందంగా కనిపించింది. తరుణ్ రాజ్ అరోరా ప్రతినాయకుడిగా కనిపించాడు. మిగతా నటీనటుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ. తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్: ఈ సినిమా చూడాలంటే... కేరళ కలరి విద్య నేపథ్యంలో సన్నివేశాలు చూడాలనే ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు. సహనం, శాంతి, ఓపిక కూడా కావాలి. చారిత్రక నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలతో కూడిన సినిమా చూడాలని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తప్పకుండా నిరాశ పరిచే చిత్రమిది.  రేటింగ్: 1.75/5
టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు (80) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గొల్లపూడి 1939, ఏప్రిల్‌ 14న విజయనగరంలో జన్మించారు. ఆయన భార్య పేరు శివకామసుందరి. వారికి ముగ్గురు కుమారులు ఉన్నారు. గొల్లపూడి మారుతీరావు 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. మాటల రచయితగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. రచయితగా చేసిన మొదటి సినిమా 'డాక్టర్ చక్రవర్తి'కి ఉత్తమ రచయితగా నంది పురస్కారం అందుకున్నారు. గొల్లపూడి రచనలు కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి. నాటక రంగం మీద ఆయన రాసిన వ్యాసాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా ఉంది.
కొత్త నీరు వచ్చి పాతనీరు కొట్టుక పోవడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. అలాంటిది కృష్ణాజిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. నిజానికి రాజకీయ చైతన్యానికి మారుపేరు కృష్ణా జిల్లా అని అంటూ ఉంటారు. కానీ అక్కడ రాజకీయంగా ఎప్పుడూ ఏదో ఒక కలకలం జరుగుతూనే ఉంటుంది. మొన్నటి వరకు గన్నవరం నియోజకవర్గం వార్తల్లో నిలిచింది. 2019 ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరుపున వల్లభనేని వంశీ మోహన్ పోటీ చేశారు. ఆయనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి వీరిద్దరూ ఒకనాడు మంచి స్నేహితులు అయినప్పటికీ రాజకీయాల్లో ఇరువురి మధ్య వైరం పెరిగింది. వీరిద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన గుడివాడ ఎమ్మెల్యే పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చొరవ చూపడంతో ఎట్టకేలకు వీరిరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ మోహన్ టిడిపికి రాజీనామా చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుకు ఆయన వాట్సప్ లో పంపించిన లేఖ ఆ తర్వాత చేసిన వ్యతిరేక వ్యాఖ్యల పై టిడిపి హైకమాండ్ సీరియస్ గా స్పందించింది. వంశీని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.  మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ తన పై టిడిపి సస్పెండ్ వేటు వేయడానికి ముందే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే ఆయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారని తెలుసుకున్న గన్నవరం పార్టీ శ్రేణులు యార్లగడ్డ వెంకట్రావు నివాసం వద్దకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వెంకటరావుతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి బాలశౌరిలు చర్చలు జరిపారు. ఆ తర్వాత ఆయనను జగన్ తో కూడా మాట్లాడించారు. వంశీని పార్టీలో చేర్చుకునేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ యార్లగడ్డ వెంకట్రావును వదులుకునేందుకు మాత్రం ససేమిరా ఇష్టపడలేదు. ప్రస్తుతానికి వంశీ శాసన సభలో తటస్థ ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటారు. అవసరమైనపుడు ఆయనతో రాజీనామా చేయించి తిరిగి గన్నవరం నియోజక వర్గం నుంచి పోటీ చేయించాలా లేదా అనేది నిర్ణయం తీసుకుందామని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించింది. ఇదిలా వుంటే జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొత్తవారొచ్చినా పాతవారిని వదులుకోకూడదు అనేది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధానంగా కనిపిస్తుంది. తను ఇచ్చిన మాట ప్రకారం యార్లగడ్డ వెంకట్రావుని వెంటనే జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా జగన్ నియమించారు. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఘన చరిత్రే ఉంది. ఇలాంటి బ్యాంకు చైర్మన్ గా నియామకం కావడం వెంకట్రావు కూడా సంతృప్తినిచ్చింది. ఆయనకు పదవి ఇవ్వడంతో పాటు వల్లభనేని వంశీకి కూడా ఎలాంటి తలనొప్పి లేకుండా జగన్ లైన్ క్లియర్ చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అనుకుంటున్నారు. అలాగే గన్నవరం నియోజక వర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న యార్లగడ్డ వెంకట్రావు కూడా న్యాయం చేశారని వారు చెప్పుకుంటున్నారు. ఇక పెడన లోనూ ఇదే విధానాన్ని సీఎం జగన్ అనుసరించారు. ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో చివరి నిమిషం వరకు పార్టీ టిక్కెట్ ని ఆశించి భంగపడిన ఉప్పాల రాంప్రసాద్ కి కూడా సంతృప్తి కలిగేలా వ్యవహరించారు. జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని రాంప్రసాద్ కు కట్టబెట్టారు. నిజానికి పెడనకు గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన జోగి రమేష్ కు చివరి నిమిషంలో పార్టీ టికెట్ ఇచ్చారు. అప్పట్లో రాంప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఎంపీ బాలశౌరి రంగంలోకి దిగి ఆయన్ను బుజ్జగించారు. అధికారం లోకొచ్చిన తర్వాత రాంప్రసాద్ కు న్యాయం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సహకార మార్కెటింగ్ సొసైటీ అధ్యక్ష పదవిని ఉప్పాల రాంప్రసాద్ కు ఇచ్చారు. దీంతో జోగి రమేష్ కి కూడా పెడన నియోజకవర్గంలో పార్టీ పరంగా తలనొప్పి తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న వారికి సీఎం జగన్ న్యాయం చేయడంతో పాటు పార్టీలోకి రావాలనుకునే వల్లభనేని వంశీ వంటి ఎమ్మెల్యేలకు మార్గం సుగమం చేస్తున్నారు. ఈ పరిణామం పై పార్టీ కేడర్ లో కూడా ఎటువంటి సందిగ్ధం లేకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు పావులు కదుపుతున్నారు. మరి ఆ వ్యూహాలు మున్ముందు ఏ మేరకు సత్ఫలితాలిస్తాయే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి.
  కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే నిలుస్తాయి. అక్కడి ప్రజాప్రతినిధులు ఒకరి పై ఒకరు చేసుకునే ఆరోపణలు రాజకీయంగా వేడి రాజేస్తాయి. రాజకీయపరంగా విమర్శలు.. ప్రతివిమర్శలు..ఉంటేనే రాజకీయం కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా రాజకీయ విమర్శలన్ని ఆస్తులు.. అవినీతి ఆరోపణల చుట్టూ తిరుగుతుంటాయి. చివరికీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగించడమే కాదు రాజకీయంగా ఇరకాటంలో పడవేస్తుంటాయి. ఇలాంటి వ్యవహారాలు గతంలో కూడా చాలానే జరిగాయి.  రాష్ట్ర విభజన అనంతరం.. చొప్పదండి నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొడిగ శోభపై కూడా ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలే ఎక్కుపెట్టాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధికి ఎమ్మెల్యే మాములు వసూలు చేసే వారని.. కమీషన్ లేనిదే సంతకాలు పెట్టేవారు కాదంటూ.. ఆరోపణలొచ్చాయి. ఇది రెండేళ్ళ క్రితం నాటి కథ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆమె స్థానంలో సుంకె రవిశంకర్ తెరమీదకొచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. అవినీతి ఆరోపణలతో చొప్పదండి నియోజక వర్గ రాజకీయాలు మళ్లీ రెండేళ్లు వెనక్కి వెళ్లాయి. రవిశంకర్ పై కూడా అక్రమాస్తులకు సంబంధించి ఆరోపణలు రావడంతో చర్చ మొదలైంది. శోభకు ఎదురైన పరిస్థితులే ఇప్పుడు రవిశంకర్ కు ఎదురవుతున్నాయి. మరిప్పుడు ఆయన ఎలా ఎదుర్కొన్నాడనే డిస్కషన్ కార్యకర్తల్లో మొదలైంది.  మరోవైపు ప్రతిపక్షాలకు తమ పార్టీ నుంచే ఎవరో ఒకరు లీకులిస్తున్నారనే అనుమానాలు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో కలుగుతున్నాయి. ఎక్కడి నుంచి లీకయిందనే విషయం తెలిసినా బయటకు చెప్పలేకపోతున్నారు. దీనిని ఉపయోగించుకొని కాంగ్రెస్ తన వద్ద ఉన్న సమాచారంతో ఎమ్మెల్యే పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. ఎమ్మెల్యే రవిశంకర్ పాత ఎమ్మెల్యేనే ఫాలో అవుతున్నారనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ నేతల సైతం కౌంటర్ ఎటాక్ చేయడం మొదలెట్టారు. తమ ఎమ్మెల్యే నీతి నిజాయితీని శంకిస్తే సహించేది లేదంటూ మండిపడుతున్నారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలను పక్కనబెడితే ఇదంతా అధికార పార్టీ నుంచే కాంగ్రెస్ కు సమాచారం వెళుతుందని అనుకుంటున్నారు. ఓవరాల్ గా చొప్పదండిలో వస్తున్న అవినీతి ఆరోపణల విషయం మాత్రం ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. దీంతో ఆ పదవిలో ఉండేవాళ్లు ఇదేం ఖర్మరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు.
  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగిన నాయకులు.. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన రవీందర్ రెడ్డి పక్కా టీఆర్ఎస్ కాండిడేట్ అని చెప్పుకోవచ్చు. 2004 లో రాజకీయ అరంగేట్రం చేసిన రవీంద్రరెడ్డి ఇంతవరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే స్థానానికి ఆరుసార్లు పోటీ చేయగా నాలుగు సార్లు గెలిచారు, రెండుసార్ల ఓడిపోయారు. 2008 ఉప ఎన్నికల్లో ఓసారి, 2018 ఎన్నికల్లో మరోసారి పరాజయం పాలయ్యారు. మిగతా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఇతర పదవులు పదోన్నతులు మాత్రం పొందలేకపోయారు. పార్టీ అధిష్టానంలో ఆయన పట్టు సాధించలేకపోవడం ఒక కారణమైతే జనంలో వ్యతిరేకత పెరగడం మరో కారణంగా మారింది. దీంతో గత ఎన్నికల్లో రవీందర్ రెడ్డి పరిస్థితి ఆశాజనకంగా లేదని నిఘా వర్గాలు ముందుగానే సంకేతాలిచ్చాయి. అభ్యర్థిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఎల్లారెడ్డి స్థానం గెలిచే అవకాశం లేదని గులాబీ బాస్ కు ముందస్తుగా వర్తమానం కూడా అందింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలో ఎనిమిదింటిని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఎల్లారెడ్డిలో మాత్రం పరాజయం పాలైంది. ఇక్కడ కాంగ్రెస్ కు చెందిన నల్లమడుగు సురేందర్ చేతిలో సుమారు 34 వేల ఓట్ల తేడాతో రవీందర్ రెడ్డి పరాజయం పాలయ్యారు.  రాష్ట్రమంతటా అనుకూల పవనాలు వీచినప్పటికీ ఎల్లారెడ్డిలో మాత్రం ఎదురుగాలి తగలడంతో పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. ఇది కేవలం రవీందర్ రెడ్డి స్వయంకృతాపరాధమేనని తేల్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నల్లమడుగు సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమో.. తన మనుగడ కోసమో తెలీదు కానీ నల్లమడుగు సురేందర్ గులాబీ గూటిలో చేరడంతో ఎల్లారెడ్డి రాజకీయం రంజుగా మారింది. స్వపక్షంలోనే విపక్షం తయారు కావడంతో టిఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ రెడ్డి తన ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 15 ఏళ్లుగా తన వెంట ఉంటున్న అనుచరుల కోసం గట్టిగా పని చేయాలని ఆయన భావించారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన వర్గీయులకు టికెట్లు ఇప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ వర్గాన్ని ఢీకొనేందుకు సొంతంగా ప్రతి మండలంలో తన అనుచరులను రంగంలోకి దింపారు. ఈ ఇరువర్గ పోరు కారణంగా నియోజకవర్గంలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఎల్లారెడ్డి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నాగిరెడ్డిపేట ఎంపిపి కుర్చినీ స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. మిగతావన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడినప్పటికీ వారంతా ఎమ్మెల్యే సురేందర్ వర్గీయులు కావడం విశేషం. అప్పటి నుంచి రవీందర్ రెడ్డి తన పంథా మార్చారు. మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని భవిష్యత్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. వారి అనుచరుడిగా చలామణి అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.  ప్రధానంగా తాను హరీశ్ రావు వర్గియుడనని చాటుకునే ప్రయత్నాలను ఏనుగు రవీందర్ రెడ్డి ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని తన వర్గీయులను హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు. ఇటీవల వరుసగా 3 రోజుల పాటు తన వారిని తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కల్పించారు. ఎల్లారెడ్డి, లింగంపేట, సదాశివనగర్, గాంధారి మండలాలకు చెందిన నాయకులను పరిచయం చేసి ఇదంతా తన వర్గమని చూపించారు. హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇలా దూకుడు పెంచారు. దీంతో పాటు ఎల్లారెడ్డిలో తన వర్గీయులతో ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యేక శిబిరం నడుపుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే పార్టీ సమావేశాలు చర్చలు రవీందర్ రెడ్డి శిబిరంలోనే జరుగుతున్నాయి. అధికారికంగా ఎమ్మెల్యే సురేంద్ర నడుపుతున్న ఆఫీస్లో ఈయన వర్గీయులెవరూ కనిపించడం లేదు. రవీందర్ రెడ్డి వర్గీయులు ఇంత వరకు ఎమ్మెల్యే ఆఫీసు గడప కూడా తొక్కలేదు,అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, ఎమ్మెల్యే నిర్వహించే పార్టీ సమావేశాలు సభలకు హాజరవడం లేదు, రవీందర్ రెడ్డి వచ్చినపుడు మాత్రమే వారు ఎల్లారెడ్డిలో దర్శనమిస్తున్నారు, అది కూడా రవీందర్ రెడ్డి వెంట ఆయన ఉన్నంత సేపు హడావుడి చేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇరువర్గాల పోరు నానాటికీ ముదురుతున్నట్టు కనిపిస్తోంది.  ఇక త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వర్గపోరు ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అయ్యాక తొలిసారి జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తలు ఆందోళనకు చెందుతున్నారు. కౌన్సిలర్ ల టికెట్ లు మొదలు వారిని గెలిపించుకునే వరకు ఇటు నల్లమడుగు సురేందర్, అటు ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించే సూచనలున్నాయి. ఇప్పటికే రవీందర్ రెడ్డి తన అనుచరుల్ని మున్సిపల్ చైర్మన్ చేయాలని భావిస్తున్నారు, ఆ అభ్యర్థి పేరు కూడా ఖరారు చేశారు. దీనిపై హరీశ్ రావు ద్వారా అంతర్గత ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సురేంద్ర మాత్రం కేటీఆర్ ద్వారా తన పరువు ప్రతిష్ట కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. మొదటి నుంచి హరీశ్ రావు అనుచరుడిగా ఉన్న రవీంద్రరెడ్డిపై సహజంగానే కేటీఆర్ కు సానుభూతి లేదు. దీనికి తోడు ఆయన ఇటీవల హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వెంట తిరగడంతో కేటీఆర్ దృష్టిలో బలంగా నాటుకుపోయారు. ఈ వర్గపోరు కారణంగా ఏనుగు రవీందర్ రెడ్డిని మరింత దూరం చేసేందుకు ఎమ్మెల్యే సురేందర్ పావులు కదుపుతున్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఇంకా ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదని కార్యకర్తలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే అయోమయంలో స్థానిక గులాబీ దళం ఉండగా అన్నీ కలిసొస్తే హరీశ్ రావు నీడను మళ్లీ అందలం ఎక్కుతాననే ఆశ విశ్వాసం మాత్రం ఏనుగు రవీందర్ రెడ్డికి ఉంది. మరి ఎవరి ఆశలు నెరవేరుతాయో ఎవరి అంచనాలు ఫలిస్తాయో చూడాలి.
రెండు మాసాలు సమ్మె చేశారు.. రెక్కాడితే కానీ డొక్కాడదని తెలిసి కూడా ఫలితం కోసం ముందడుగు వేశారు. ప్రభుత్వానికి.. విపక్షాలకి.. మధ్య కార్మికులు అనిగిపోయారనే విధంగా అనుకునే స్థాయిలో సమ్మె ముగింపు దారితీసింది. ఇదిలా ఉండగా.. సూర్యాపేట డిపో , ఎల్.కృష్ణ అనే ఆర్టీసీ కండెక్టర్.. సమ్మె కాలంలో తాను అనుభవించిన క్షోభను..మనోవేధనను ఒక లేఖలో సీఎం కేసీఆర్ గారికి రాసాడు. ఆ లేఖలో ఇలా రాసాడు." గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి , తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా.. ఆత్మగౌరవంతో బతుకుదామనుకున్నా..కానీ మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మ గౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను రా నాయనా అనే విధంగా తీవ్ర మానసిక వేదనకు గురై.. నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. మీకు మాట తప్పడం మాయ మాటలు చెప్పి మోసం చేయడం తెలుసని మా కార్మికలోకం లేటుగా తెలుసుకుంది. మీరు ఉద్యోగంలో నుండి తీసేయడం కాదు.. నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. దీనికి కారణం లేకపోలేదు సార్.. మా తెలంగాణలో నియంతృత్వం చూస్తా అని అనుకోలేదు. 1200 మంది ఆత్మహత్య చేసుకుంటే మన కేసీఆర్ సారూ ఉన్నారు కదా అనుకున్నాను. ఆంధ్రా పాలకులు నిజంగా మోసం చేశారేమో మనల్ని ఈయన బాగా చూసుకుంటారని అనుకున్నా కానీ సార్.. 20 మందికి పైగా కార్మికులు చనిపోతే మీరు కనీసం స్పందించలేదు చూడండి సార్ అప్పుడనిపించింది సార్ తెలంగాణ మా కోసం కాదు తెలంగాణ కేవలం మీలాంటి నాయకుల కోసమే అని. నా అక్క చెల్లెమ్మలు లాఠీ దెబ్బలు తింటారని కలలో కూడా ఊహించలేదు సార్.. కానీ మీ బంగారు తెలంగాణలో అది సాధ్యమైంది. సార్ నా చెల్లెళ్లు ఏడుస్తుంటే.. రోజూ నా సోదరులు బాధపడుతుంటే.. తట్టుకోలేకపోతున్నా.. సార్, కానీ ఒక్కటి మాత్రం నిజం సార్ నా ఆర్టీసీ అక్కాచెల్లెళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది. సార్ నేను సూర్యపేట డిపోలో ఆర్టీసీ కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మీలాంటి ఒక్క మోసకారి, ఒక్క మాటకారి, ఒక్క మానవత్వం లేని ఒక నిరంకుశ ప్రభుత్వంలో నా ఆత్మాభిమానాన్ని చంపుకుని ఉద్యోగిగా పని చేయలేను. అందుకే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా నా పేరు ఎల్ కృష్ణ, నా స్టాఫ్ నెంబర్ 176822, సూర్యాపేట డిపో సార్ నాది, నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను మీ సంస్థ నుండి నాకు రావలసిన బకాయిలు ఇప్పించి నా రాజీనామాను ఆమోదించగలరని నా యొక్క మనవి. అయ్యా సీఎం సార్ గారూ మీరు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకొండి. ఇప్పుడు మీ వైఖరి గుర్తు చేసుకోండి, పాపం సార్ ఆర్టీసీ వాళ్లు మిమ్మల్ని చాలా అభిమానించారు సార్. కానీ మీరు ఇలా చేస్తారని కలలో కూడా ఊహించి ఉండరు. సార్ ఆర్టీసీ కార్మికులు వాళ్లకొచ్చే రూ.16,000 రూపాయల జీతం తీసుకుని ఫ్యామిలీని చూసుకుంటూ చాలా గౌరవంగా బతుకుతున్నారు సార్.మీరు వాళ్ళకేమీ ఇవ్వకున్నా కనీసం పిలిచి మాట్లాడి ఉంటే మీ మీద గౌరవంతో ప్రాణాలిచ్చే వారు సార్. కనీసం నేను మీ బంగారు తెలంగాణలో సంతోషంగా లేను, కనీసం మా తల్లితండ్రులను అయినా సంతోషంగా ఉండేటట్లు నెలనెలా వాళ్ళకి వృద్ధాప్య పింఛన్ నివ్వండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి.. మా కేసీఆర్ అని ఓటు వేశారు సార్. ప్రతి రోజూ ఈ అరెస్ట్ లేంది, ఈ లాఠీ దెబ్బలు ఏంది సార్, నా ఆర్టీసీ సోదరులు ఏం తప్పు చేశారని ఇంకా ఎంతమందిని ఆత్మహత్యలూ చేసుకునేటట్టు చేస్తారు. అందుకే ఇవన్నీ భరించలేకనే నా ఆత్మాభిమానాన్ని చంపుకునే ఉద్యోగం చేయలేను, అందుకే నేను మీ బంగారు తెలంగాణలో ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని కాదు, మీ మాయ మాటలు నమ్మి మోసపోయిన తెలంగాణ సమాజంలోని వ్యక్తిని, నీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగిగా ఉన్నాను కాబట్టి తక్షణమే నా తల్లితండ్రులకు వృద్ధాప్య పింఛను ఒకటి ఇవ్వండి. పేరు మీద సెంటు భూమి లేదు కాబట్టి మూడెకరాల పొలం, అలాగే నా పిల్లలకి ప్రభుత్వ స్కూల్ లో చదువు, నాకు ఉండటానికి ఇల్లు లేదు కనుక డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వండి ఒకవేళ మీరు ఏమి ఇవ్వకున్నా సమాజంలో గౌరవంగా బ్రతికే అవకాశం కల్పించాలని కోరుతూ అలాగే నా ఉద్యోగ రాజీనామాను తక్షణమే ఆమోదించగలరు. ఇట్లు ఎల్ కృష్ణ, స్టాఫ్ నెంబర్ 176822, ఆర్టీసీ కండక్టర్ సూర్యాపేట డిపో. " ఇలా తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ గారికి పంపించాడు. ఇలా అందరూ రాస్తే రోజు పుస్తకాలు చదవడం మానేసి లెటర్లు చదువుకోవాలని కొందరు అంటుంటే.. అలా చదివితేనైనా మానవత్వం అనేది పుట్టుకొస్తది మా కేసీఆర్ కి అని కొందరు అంటున్నారు.
  2019 ఎన్నికల్లో శ్రీ కాకుళం జిల్లాలో ఫ్యాన్ గాలి బలంగానే వీచింది. సిక్కోలులో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 8 చోట్ల వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వీచిన వ్యతిరేక పవనాలు సిక్కోలును తాకాయి. దీంతో టిడిపి డీలా పడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీ నేతల్లో మంచి జోష్ కనిపించింది. ఇక సిక్కోలులో పార్టీకి తిరుగులేదనే తీరులో ఉన్నారు నేతలు. మెజారిటీ సీట్లు సాధించమన్న ధీమా వారిలో ఏర్పడింది. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చి 6 నెలలు గడవక ముందే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కేడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నాయని లోకల్ టాక్.  వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధర్మాన కుటుంబం పెద్ద దిక్కుగా చెప్పాలి. పార్టీ ఆవిర్భావ సమయంలో జిల్లాలో వైసీపీ జెండా చేపట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిని వదిలేసి ధర్మాన కృష్ణదాస్.. వైయస్ జగన్ కు బాసటగా నిలిచారు. అంతేకాదు ఆ పార్టీకి మేమున్నామంటూ కృష్ణదాస్ భార్య పద్మప్రియ పార్టీ జిల్లా బాధ్యతలు స్వీకరించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కృష్ణదాస్ కుటుంబానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సముచిత స్థానం కల్పించారు.తన క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా క్రిష్ణదాసును నియమించారు. దీంతో విధేయతకు జగన్ పట్టం గట్టారన్న భావన పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది.  ఇక రాజకీయ అనుభవం విషయానికొస్తే ధర్మాన సోదరుల్లో ప్రసాదరావు సీనియర్.. గతంలో ధర్మాన ప్రసాదరావు , క్రిష్ణదాసు వేర్వేరు పార్టీలు ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రసాదరావు సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు. మొన్నటి ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో, క్రిష్ణదాస్ నరసన్నపేట అసెంబ్లీ స్థానంల్లో విజయం సాధించారు. సీనియర్ కాబట్టి ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పీఠం దక్కుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ జగన్ వ్యూహాత్మకంగా ఈ సోదరుల్లో పెద్దవాడైన కృష్ణదాస్ కి మంత్రి కుర్చీ వేశారు.అంతే అప్పటి నుంచి ఈ ధర్మాన సోదరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.  సిక్కోలులో ఏదైనా ప్రభుత్వం  పథకాన్ని లేదా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు జిల్లా కేంద్రంలో శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. అందులో జిల్లా మంత్రిగా ఉన్న కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం సహజం. అయితే కృష్ణదాస్ అటెండవుతున్న కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొడుతుండటం కొత్త చర్చకు దారితీస్తుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాలు జారీ, సన్న బియ్యం పంపిణీ, అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ, వైయస్ఆర్ వాహన మిత్ర వంటి పలు కార్యక్రమాలనూ జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాకుళంలో అట్టహసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా ప్రసాదరావు జాడ కనిపించలేదు.  ఇటీవల జరిగిన ఓ పరిణామం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు తెరతీసింది. జిల్లా ఇన్ చార్జి మంత్రిగా నియమితులైన కొడాలి నాని నవంబర్ 14 న సిక్కోలు పర్యటనకు వచ్చారు. అయితే జిల్లా కేంద్రానికి వచ్చిన కొడాలి నాని స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. అదే సమయంలో మంత్రి క్రిష్ణదాస్ సైతం కొడాలి వెంట ప్రసాదరావు ఇంటికెళ్లారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఈ అన్నదమ్ములిద్దరి మధ్య మరింత దూరం పెంచాయని స్థానికంగా కొందరు చెప్పుకుంటున్నారు. ఈ జిల్లాలో మంత్రి క్రిష్ణదాస్ ఉండేమి లాభం? స్పీకర్ తమ్మినేని తప్ప మిగతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలెవరూ తెలుగుదేశం పార్టీ పై విమర్శలు చేయడం లేదు అంటూ కొడాలి నాని చురకలంటించారు. అక్కడితో ఊరుకోకుండా అక్కడే ఉన్న కృష్ణదాస్ వైపు చూస్తూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ కూడా తమ్మినేని గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయనను చూసైనా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న మంత్రి కృష్ణదాస్ అక్కడ్నించి వెళ్లిపోయారు. బయటకు వెళుతున్న సమయంలో కృష్ణదాస్ ను ధర్మాన ప్రసాదరావు చిరునవ్వుతొ ఆపి అన్న బయటకు వెళ్లాల్సిన దారి అటుకాదు ఇటూ అంటూ కాస్త వెటకారం ప్రదర్శించారు. అప్పటికే ఆవేశంతో ఉన్న క్రిష్ణదాసు ఆ దృశ్యాలను కెమెరాలో క్లిక్ మనిపిస్తున్న మీడియా వారిపై మండిపడ్డారు.  వాస్తవానికి కృష్ణదాస్ కి సున్నిత మనస్కుడని పేరుంది. అయితే ఇసుక వారోత్సవాలకు హాజరైన మంత్రి కృష్ణదాస్ తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారు. టిడిపి నేతలను ఉద్దేశించి అసభ్య పదాలు వాడేశారు. కృష్ణదాస్ నోటి వెంట అలాంటి మాటలు రావటం చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు. అయితే లోతుగా ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఈ అన్నదమ్ముల మధ్య కొడాలి నాని ఆజ్యం పోశారని స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చర్చించుకుంటుంది.నిజానికి మంత్రి కృష్ణదాస్ కు సిక్కోలులో సహాయనిరాకరణ జరుగుతోందనే చర్చ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. జిల్లా కేంద్రంలో జరుగుతున్న మంత్రి పర్యటనల్లో నరసన్నపేట కార్యకర్తల మినహా ప్రసాదరావు అనుచరులెవరూ కనిపించటం లేదు. ఈ తరుణంలో ధర్మాన సోదరుల మధ్య పెరుగుతున్న అంతరం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఆందోళన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
  కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక శాఖ కూరుకుపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేసి వాటికి యూసీలు చెల్లిస్తే తిరిగి నిధులు తెచ్చుకోవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్థిక శాఖనే తన అంచనాల్లో గణాంకాల రూపంలో అంగీకరించడం గమనార్హం. భూములు అమ్మడం, అప్పులు చేయటం ఈ నిధులను పథకాలకు మళ్లించటం తప్ప ఆదాయం పెంచుకునే మార్గం ఒక్కటి కూడా ఈ శాఖకు కనిపిస్తున్నట్లుగా లేదు. బడ్జెట్ లో కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి 32,040 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ మార్చి చివరికి ఈ పద్దు కింద రూ.14,235 కోట్లు వస్తాయని ఆ శాఖ భావిస్తోంది. అంటే దాదాపు రూ.17,805 కోట్లు తగ్గుతున్నాయి.  రాష్ట్ర ఆదాయ వనరుల తీరుతెన్నులపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం విజయవాడలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ రూ.2.26 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ వచ్చే మార్చి నాటికి కేవలం రూ.1.4 లక్షల కోట్ల ఆదాయం వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి. బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఆదాయం మధ్య తేడా రూ.86,000 ల కోట్లకు పైగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం లోటును పూడ్చడం అసాధ్యం. కేంద్రం నుంచి ఏకంగా గ్రాంట్ల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని బడ్జెట్ లో ప్రతిపాదించారు. మార్చి నాటికి ఆ పద్దు కింద రూ.17,665 కోట్లే వస్తాయని ఆర్థిక శాఖ అంచనాలు సిద్ధం చేశారు. అంటే గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయమే రూ.43,406 కోట్లు తగ్గిపోతుంది. రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం రూ.18,230 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.3,539 కోట్లు, పబ్లిక్ రుణాలు రూ.3,000 ల కోట్లు, కేంద్ర పథకాల నిధులు రూ.17,805 కోట్లు, పన్నుల్లో వాటా రూ.9,000 కోట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఈ లోటు నిధుల మొత్తం రూ.94,000 కోట్లకు పైగా ఉంది.  కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.34,883 కోట్లు వస్తాయని బడ్జెట్ లో పేర్కొన్నారు. కానీ మొదటి త్రైమాసికంలో ఈ పద్దు కింద రూ.6,398 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.6,623 కోట్లు వచ్చాయి, మూడో త్రైమాసికంలోని మొదటి రెండు నెలల్లో రూ.4,440 కోట్లు వచ్చాయి. డిసెంబర్ లో రూ.2,200 ల కోట్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాలుగవ త్రైమాసికంలో మాత్ర పన్నుల్లో వాటా అమాంతం రూ.15,188 కోట్లకు పెరుగుతుందని ఆర్థిక శాఖ భావిస్తున్నది. వాస్తవానికి నాలుగో త్రైమాసికం లోనూ పన్నుల్లో వాటా రూ.6,600 ల కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం రూ.82,792 కోట్లు వస్తుందని బడ్జెట్ లో పెట్టారు. ఈ ఆదాయం రూ.18,230 కోట్ల మేర తగ్గి, రూ.64,562 కోట్లకు పరిమితమవుతుందని ఆర్ధిక శాఖ భావిస్తోంది. పన్నేతర ఆదాయం రూ.7,354 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అది కూడా రూ.3,539 కోట్లకు తగ్గుతుందని అంటున్నారు. పబ్లిక్ రుణాల రూపంలో రూ.32,417 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కానీ కేంద్రం మొదటి మూడు త్రైమాసికాలకు రూ.29,000 ల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు డిసెంబరుతో ముగుస్తుంది. నాలుగో త్రైమాసికానికి కేంద్రం అనుమతి లభిస్తేనే ఇంకో రూ.3,417 కోట్లు అప్పు రూపంలో తెచ్చుకోగలం. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పబ్లిక్ రుణాలు తీసుకునే అవకాశం ఉండదు.
ఏపీ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంగ్లిష్‌ మీడియానికి టీడీపీ వ్యతిరేకం కాదని బాబు స్పష్టం చేశారు. జగన్‌ వల్లే ఇంగ్లీష్ మీడియం వచ్చిందనడం సరికాదని అన్నారు. గతంలో మున్సిపల్ పాఠశాలల్లో తమ హయాంలో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టామని గుర్తు చేసారు. మీరే ఇంగ్లిష్‌ను కనిపెట్టినట్టు మాట్లాడొద్దని ఎద్దేవా చేసారు. తాము మున్సిపల్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ను ప్రవేశపెడితే మీరు వ్యతిరేకించలేదా అని బాబు ప్రశ్నించారు. అంతేకాదు, మున్సిపల్‌ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సందర్భంలో సాక్షి పత్రికలో వచ్చిన వ్యతిరేక కథనాలను బాబు చదివి వినిపించారు. ఇంగ్లీష్ పై రెండు నాలుకల ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారని.. విపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని బాబు మండిపడ్డారు.  చంద్రబాబు మాటలు.. వైసీపీకి ఆగ్రహం తెప్పించాయి. ముఖ్యంగా సీఎం జగన్ అసహనానికి గురయ్యారు. సాక్షిలో ఏం రాశారో చర్చించడానికి అసెంబ్లీ లేదని.. మీరేం చేశారో, నేనేం చేశానో చర్చిద్దామని చెప్పారు. అసలు తాను ఏనాడు ఇంగ్లీష్ ని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. ఇంగ్లీష్ ను వ్యతిరేకించానని మీరు నిరూపించగలరా అని సవాల్ చేశారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే… నేను ఇంగ్లీష్ ను వ్యతిరేకించినట్టు నిరూపించమని జగన్ సవాల్ చేశారు. ప్రైవేట్ స్కూల్స్‌కు మేలు చేయడం కోసం మొత్తం ప్రభుత్వ పాఠశాలల విధానాన్ని భ్రష్టు పట్టించిన మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుతో తలదించుకోవాలని బాబుని ఉద్దేశించి జగన్ కామెంట్స్ చేశారు.   జగన్ వ్యాఖ్యలపై స్పందించిన బాబు.. తాను సిగ్గుతో తలంచుకోవడం కాదని, జగన్ సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు. సాక్షి పేపర్ మిమ్మల్ని మోసం చేసిందని ప్రజలకు క్షమాపణ చెప్పి, తాను మోసం చేయలేదని జగన్ చెప్పుకోవాలని బాబు అన్నారు. సాక్షిలో రాస్తే తనకు సంబంధం లేదనట్టుగా జగన్ మాట్లాడుతున్నారని బాబు ఎద్దేవా చేసారు. ఈ సమయంలో అసహనానికి గురైన జగన్.. ఈ మనిషికి ఏమన్నా బుద్ధి, జ్ఞానం ఉందా అని బాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసారు. సాక్షి అనేది ఒక మీడియా వ్యవస్థ అని, ఎవరి అనుకూల ఛానల్స్, పేపర్స్ వాళ్లకుంటాయని.. వాటిలో రాసినవి తీసుకొచ్చి మాట్లాడితే ఎలా కుదురుతుందని జగన్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై బాబు స్పందిస్తూ.. మీ పేపర్‌కు విశ్వసనీయత లేదా? అని ప్రశ్నించారు. మీ పేపర్ ఒక చెత్త పేపర్ అని బాబు ఫైర్ అయ్యారు. తనను బుద్ధి, జ్ఞానం లేదని సీఎం అన్నారని.. మరి సాక్షికి బుద్ధి, జ్ఞానం ఉందా? అని నిలదీశారు. తప్పుడు డబ్బులతో తాము పేపర్లు, ఛానల్స్ పెట్టలేదని బాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  
మీ శాసనసభ్యత్వానికి ఢోకా లేదని జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట చెబితే చాలు.... 13మంది టీడీపీ ఎమ్మెల్యేలు... తెలుగుదేశాన్ని వీడటానికి సిద్ధంగా ఉన్నారంటూ అసెంబ్లీ లాబీల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటామన్న జగన్ షరతులతోనే టీడీపీ ఎమ్మెల్యేలు ఆగుతున్నారని, లేదంటే ఎప్పుడు టీడీపీ ఖాళీ అయ్యేదంటూ కోటంరెడ్డి బాంబు పేల్చారు. అయితే, షరతులు పెట్టినా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, తనతో 8మంది టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటికే టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బయటికి రాగా, తనతోపాటు మిగిలిన 22మందితోనే చంద్రబాబు... అసెంబ్లీలో అధికారపక్షాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నారు. 67మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా జగన్ చేయలేనిది... కేవలం 22మంది ఎమ్మెల్యేలతో అధికార పక్షానికి బాబు చుక్కలు చూపిస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఏంటో చూపిస్తున్నారు. 40ఏళ్ల తన రాజకీయ అనుభవంతో జగన్ అండ్ టీమ్ ను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఒక్కరిని కాదు షేర్ ఖాన్... వంద మందిని ఒకేసారి పంపించు అన్న సినీ డైలాగ్ మాదిరిగా జగన్ టీమ్ పై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. యాభై మంది కాదు... నూట యాభైమంది ఒకేసారి వచ్చినా ఎదుర్కొనే దమ్ము... సమాధానం చెప్పే సామర్ధ్యం తనకుందంటూ వైసీపీపై చంద్రబాబు విరుచుకుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలను గమనిస్తే... 151మంది వైసీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఒక్కరే ధీటుగా సమాధానం చెబుతుండటం చూస్తుంటే... వన్ మేన్ ఆర్మీలా కనిపిస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు సంబరపడుతున్నారు.  
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఆంక్షలు పెట్టినా... తన వైఖరి మారదని, స్వతంత్రంగానే వ్యవహరిస్తానని మరోసారి చాటిచెప్పారు. మిగతా వైసీపీ ఎంపీల్లాగా తాను గిరితీసుకుని ఉండలేనని తేల్చిచెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీని, అలాగే కేంద్ర మంత్రి అమిత్ షాను రఘురామకృష్ణంరాజు కలవడం వైసీపీలో కలకలానికి దారి తీసింది. ఇక, ఇప్పుడు ఏకంగా కేంద్ర మంత్రులకు, ఎంపీలకు భారీ విందే ఇచ్చారు రఘురామకృష్ణంరాజు.  సబార్డినేట్ లేజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో విందు ఇచ్చినప్పటికీ... ఇది కూడా వైసీపీ కలవరం పుట్టిస్తోంది. ఈ విందుకు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల ఎంపీలు, వీవీఐపీలను ఆహ్వానించినా... కేంద్ర మంత్రుల్లో రాజ్ నాథ్ సింగ్ మాత్రమే హాజరయ్యారు. ఇక, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు... టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వర్రావు... వైసీపీ నుంచి మిథున్ రెడ్డి అటెండ్ అయ్యారు. అయితే, కేంద్ర మంత్రులకు, ఎంపీలకు  రఘురామకృష్ణంరాజు ఇచ్చిన విందుపై వైసీపీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ అనుమతి లేకుండా మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులను రఘురామకృష్ణంరాజు కలవడంపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో... ఈ విందుపై ఎలా స్పందిస్తారోనన్నది చర్చనీయాంశమైంది.  అయితే, కేంద్ర పెద్దలను బుట్టలో వేసుకునేందుకు, అలాగే బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకే రఘురామకృష్ణంరాజు ఈ భారీ విందును ఇచ్చారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా, వైసీపీ ఎంపీల్లో తన దారి సెపరేట్ అని మరోసారి నిరూపించుకున్నారు  రఘురామకృష్ణంరాజు.
  జుట్టుకి మనం ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందం గురించి పెద్దగా శ్రద్ధపెట్టని వారు సైతం చీటికీ మాటికీ జుట్టుని సరిచేసుకోక మానరు. ఆ జుట్టు రాలిపోతున్నా, తెల్లబడుతున్నా కంగారుపడని మానవుడూ ఉండడు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ఈ మధ్యనే జుట్టు గురించి కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. అవేమిటంటే... ఉక్కుకంటే గొప్పది మన వెంట్రుకలు, అంతే సన్నగా ఉండే ఉక్కతో సమానమైన బలం కలిగి ఉంటాయని చదివే ఉంటాము. కానీ ఉక్కుకంటే వెంట్రుకే గొప్పది అని చెప్పడానికి ఓ కారణం ఉంది. అదే స్థితిస్థాపకగుణము (elasticity). ఒక వెంట్రుకని దాదాపు ఒకటిన్నర రెట్లు లాగిన తరువాత కానీ అది తెగదు. మరే లోహంలోనూ ఇలాంటి గుణం కనిపించదు. చిత్రమేమిటంటే నిదానంగా లాగేకన్నా గబుక్కున జుట్టుని లాగినప్పుడే అది మరింత బలంగా కనిపిస్తుందట.   కారణం తెలిసింది ఒక పక్క దృఢంగా ఉంటూనే మరోపక్క సాగతీత గుణాన్ని కలిగి ఉండటం వెనుక కారణం ఏమిటా అని పరిశోధన మొదలుపెట్టారు. జుట్టులో ఉండే రెండు సూక్ష్మమైన వ్యవస్థలే దీనికి కారణం అని తేలింది. అవే కార్టెక్స్, మాట్రిక్స్లు! ఒక చిన్నపాటి కార్టెక్స్లో వేలాది ‘alpha helix chains’ అనే కణాలు ఉంటాయి. చుట్టలు చుట్టలుగా ఉన్న ఈ కణాలు జుట్టుని లాగినప్పుడు విచ్చుకుంటాయి. అంటే జుట్టుని లాగినా కూడా తెగకుండా నిలిపి ఉంచుతాయన్నమాట. మాట్రిక్స్ వ్యవస్థలో ఇలాంటి ఏర్పాటు ఏదీ లేకపోయినా, జుట్టు గట్టిదటానికి తోడ్పడుతుంది. అంటే ఈ రెండు వ్యవస్థలూ కలిసి జట్టు పాడవకుండా కాపాడతాయన్నమాట.   తడి జుట్టుని దువ్వకూడదా! జుట్టు దృఢత్వానికి కారణం తెలిసింది సరే! మరి అది ఉష్ణోగ్రతలకి ఎలా ప్రభావితం అవుతుందో కూడా చూడాలనుకున్నారు. అందుకోసం నీటిలో తేమశాతం ఎక్కువగా ఉన్నప్పుడు కార్టెక్స్, మాట్రిక్స్ల పనితీరుని గమనించారు. జుట్టులోకి అధికశాతం తేమ చేరినప్పుడు దానిలోని సాగతీత గుణం కొంత తగ్గి, వెంట్రుకలు త్వరగా తెగిపోతున్నట్లు తేలింది. అంటే తడిగా ఉన్న జుట్టుని దువ్వకూడదంటూ ఇప్పటివరకూ పెద్దలు చెబుతూ వస్తున్న మాట నిజమేనన్నమాట! అలాగే 60 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతల వద్ద వెంట్రుకలు శాశ్వతంగా దెబ్బతినిపోవడాన్ని కూడా గమనించారు. చీటికీ మాటికీ హెయిర్ డ్రయ్యర్ల వంటి పరికరాలు వాడద్దంటూ వినిపించే హెచ్చరికలు కూడా నిజమే అని అర్థమవుతోంది. పరిశోధకులు కనుగొన్న ఈ కొత్త విషయాలు జుట్టు విషయంలో కొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయని ఆశిస్తున్నారు. జుట్టుని దృఢంగా ఉంచేందుకు కొత్త చికిత్సలను రూపొందించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడవచ్చు. అంతేకాదు! జుట్టులోని కణజాలాన్ని గమనించడం ద్వారా, అదే తరహా కణజాలంతో కొత్తరకం లోహాలను ఉత్పత్తి చేయవచ్చని కూడా భావిస్తున్నారు. - నిర్జర.
    Cycling may be favorite pastime for many of us but it is certainly very useful in maintaining our health! As it is one of the easiest ways to exercise without producing fat bills, moreover it can be almost everywhere and any time during the year. The health benefits though are numerous, few to pen down are: The act of cycling involves the lower body. So, it strengthens and tones up the calf and thigh muscles. It also improvises the mobility of the hip and knee joints. Cycling effectively increases the stamina, thus you are able enough to fight against the physical strains more ably and for a longer time. Cycling does only good to your heart. It improves cardio-vascular fitness due to which our heart pounds steadily. Studies suggest that people who cycle at least 20 miles a week are least likely to suffer from heart diseases when compared to non-cycling people. Cycling is great of losing the extra pound you stare at! Steady cycling burns a great deal of calories. Cycling boosts our metabolic rates even after we have finished our ride thus, aiding more in calorie-loss! Any regular exercise is capable of reducing stress and depression. It improves the well-being and self esteem. Cycling outdoors is a awesome way of connecting with nature, which aids in rejuvenating the soul. As cycling involves every part of our body, the co-ordination among the body parts is improved! So, take some time out to indulge in a cycle ride. Take Care!! ...... SIRI
    There are certain foods are having the innate ability to cure some particular illness. By including these to your daily routines you can cure the illness and believe it or not these are the prescribed foods, thus having a full-proof recovery!! Memory loss, for this illness a quarter cup of sunflower seeds daily will be drug. These seeds are loaded with Vitamin-E which protects our neurons from oxidative stress. This memory boosting little ones can make our lives a lot easier! Well, all of us would like to freeze our age at the moment! As that is impossible, we can slow the process by the intake of one full orange a day. Vitamin-C and proteins help in healthy production of collagen and keep our skin youthful and graceful! Puffy Eyes, mostly seen when over-slept! This is due to the retention of fluids around the eye; these can also lead to dark circles! A cup of refreshing Green tea post-meal daily can reduce the puffiness and other unwanted swelling over the body. When you enter a new environment, the first organ to detect is the stomach! Stomach gets upset as it is away from its comfort-zone. Peppermints aid in digestion and also soothe the inflammatory pain through out the gut. One or two post dinner is more than enough! Lacking energy after a long day? Then grab a Banana, this energy rich fruit is packed with potassium and magnesium which are the key for energy production and storage! Instead of popping in the chemically loaded capsule try these! Take Care!! ....SIRI
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.