డా॥ కిరణ్ మార్టిన్ పిల్లల వైద్యురాలు. ఓసారి ఆమె దక్షిణ దిల్లీలోని ఓ మురికివాడలోకి వెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందు ఎప్పుడూ ఆమె మురికివాడల్లోకీ, అందులోని పూరిగుడిసెలలోకీ అడుగుపెట్టనే లేదు. దాంతో అక్కడ తనకి కనిపించిన దృశ్యానికి కిరణ్కు మతిపోయినంత పనయ్యింది. మురికివాడల్లోని పిల్లలు ఎక్కడ పడితే అక్కడ మలవిసర్జన చేస్తున్నారు. గుడిసెలలో ఇంతెత్తున చెత్త పేరుకుపోయి ఉంది. ఆ చెత్తలోనే పసిపిల్లలు ఆడుకుంటున్నారు. వారు తాగే నీరు పరమ మురికిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం సంగతి చెప్పేదేముంది? వాడవాడంతా కలరాతో బాధపడుతోంది. ఆ మహమ్మారిని తప్పించుకునే పరిస్థితి కానీ, కలరా సోకిన తరువాత వైద్యం చేయించుకునే స్తోమత కానీ వారికి లేవు.     మురికివాడలో పరిస్థితిని చూసి కిరణ్ చలించిపోయారు. తను వారికి ఉచితంగా వైద్యం చేయాలని అనుకున్నారు. వెంటనే ఓ చెట్టు కింద కలరా రోగులకు ఉచితంగా వైద్యం చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ఒకరిద్దరి సహకారంతో ఆ మురికివాడలోనే ఒక చిన్న ఇంట్లో క్లినిక్ను తెరిచారు. మరో అడుగు ముందుకు వేసి ఆ మురికివాడలోని జీవితాలను బాగుచేసేందుకు ‘ఆశా’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఇదంతా 1990 నాటి పరిస్థితి. ఆ తరువాత ‘ఆశా’ దిల్లీ మురికివాడల తీరునే మార్చివేసింది. అదంతా మరో కథ!       ఆశా ప్రారంభంలోనే డా॥ కిరణ్ మురికివాడల్లోని ఆడవారిని భాగస్వాములుగా చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటివరకూ ఎంతోమంది తియ్యటి మాటలు విని మోసపోయిన వారు... ఆమెను అంతగా నమ్మలేదు. క్రమేపీ కిరణ్ అంకితభావం, నిస్వార్థంగా వైద్యం చేస్తున్న విధానం చూసి దగ్గరయ్యారు. తాగే నీరు అన్న మాటే ఎరగని ఆ వాడలో కిరణ్ మంచినీటిని ఏర్పాటు చేయడంతో ఆమెకు అనుసరించేంత నమ్మకం ఏర్పడింది. ఆడవారి సంగతి అలా ఉంచితే మగవారు మాత్రం కిరణ్కు సహకరించలేదు సరికదా... ఆమెను వేధించే ప్రయత్నం చేశారు. కిరణ్ వారిని పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోయేవారు. పైగా మగవారిలోని అభద్రతా భావాన్ని తొలగించేందుకు,  ‘ఆశా’ సమావేశాలకి వారిని కూడా ఆహ్వానించేవారు. అలాంటి వ్యక్తిత్వానికి లొంగనివారుంటారా! ఇప్పుడు దిల్లీలోని మురికివాడల్లో ‘ఆశా’ గురించి తెలియనివారు ఉండరు. ఆశాలో శిక్షణ పొందిన కార్యకర్తలు సాధారణ అనారోగ్యాలన్నింటికీ చికిత్స చేసేందుకు సన్నద్ధంగా ఉంటారు. వాడవాడలా క్వాలిఫైడ్ వైద్యులు, నర్సులతో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఆశా కేవలం దక్షిణ దిల్లీలోని ఒక మురికివాడకే పరిమితమైన సంస్థ కాదు! దిల్లీ అంతటా 60 మురికివాడల్లో ఉన్న ఐదు లక్షలమంది జనాలని ప్రభావితం చేసే ఓ ఉద్యమం. అందుకే ఆశా ఆవిర్భవించిన తరువాత దిల్లీ మురికివాడల్లో శిశు మరణాలు, అంటువ్యాధులు, పోషకాహార లోపాలు వంటి సవాలక్ష ఆరోగ్య సమస్యలు గణనీయంగా తగ్గిపోయాయి.     ఆశా కేవలం పేదల అనారోగ్యాన్ని దూరం చేసేందుకే ప్రయత్నించదు. ఆ అనారోగ్యానికి కారణమైన నిరక్షరాస్యత, పేదరికాలను కూడా రూపుమాపే ప్రయత్నం చేస్తుంది. సేవింగ్స్ ఖాతాలను ఎలా తెరవాలి? బ్యాంకుల నుంచి రుణాలు పొందడం ఎలా? వ్యాపారం కోసం ఎలాంటి రణాలు లభిస్తాయి? లాంటి విషయాల మీద అవగాహన కల్పించడం ద్వారా కొందరి ఆదాయం అమాంతం పదిరెట్లు పెరిగిపోయిందట! ఇక మురికివాడల్లోని తెలివైన కుర్రకారుకి ఉన్నత విద్యావకాశాలు కల్పించడం మరో ఎత్తు. ఇలా దాదాపు 1200 మంది మురికివాడ విద్యార్థులు దిల్లీ యూనివర్శిటీ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలలో అడుగుపెట్టగలిగారు. ఇదీ కిరణ్ కథ! ‘నేను ఒక్కదాన్ని. ఆడమనిషిని. మురికవాడల్లో అంతా మొరటుజనాలు, మురికి మనుషులు.’ అని కిరణ్ అనుకొని ఉంటే..... - నిర్జర.
  మన పండుగలని రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి- పూజలు, పిండివంటలతో హడావుడిగా సాగే భౌతికమైన ఆచారం, రెండు- ఆ పండుగ ద్వారా పెద్దలు మనకి చెప్పదలచిన జీవితసారం. మొదటి సందర్భాన్ని మనం పాటించినా పాటించకపోయినా రెండో సందర్భాన్ని మాత్రం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలా ఉగాది నుంచి కూడా ఏమైనా మంచి విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తే, ఉగాది అణువణువూ ఏదో ఒక జీవితపాఠం కనిపిస్తూనే ఉంటుంది.   తైలాభ్యంగనం – ఉగాది రోజున లేవగానే నువ్వులనూనెతో స్నానం చేయాలని చెబుతారు పెద్దలు. ఒంటికి నువ్వులనూనెని పట్టించి, ఆపై సున్నిపిండితో నలుగుపెట్టుకుని స్నానం చేయడం వల్ల ప్రతి స్వేదరంథ్రమూ శుభ్రపడుతుంది. ఏ పండుగలో చేసినా చేయకున్నా ఉగాదినాడు మాత్రం ఈ ఆచారం పాటించితీరాలంటారు. ఉగాది మన సంవత్సరపు ఆరంభం కాబట్టి, ఆ రోజుని శుచిగా మొదలుపెట్టాలన్నది ఈ నియమం వెనుక సూచన కావచ్చు. శరీరం క్షణభంగురమే కావచ్చు! కానీ ఉన్న ఆ కాస్త కాలమూ దానిని ఆరోగ్యంగా, శుచిగా కాపాడుకోవాల్సిందే! మనసుని పరిశుద్ధంగా, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందే!   కాలమే దైవం – హిందువులకు ముక్కోటి దేవతలు ఉన్నారు. కానీ ఉగాది రోజున కాలమే దైవం. కొన్ని సందర్భాలలో కాలాన్ని కేవలం ‘సమయం’గా కాకుండా ఈ ప్రకృతిలోని సమన్వయాన్ని నెలకొల్పే శక్తిగా (రుతం) వేదాంతులు భావిస్తూ ఉంటారు. అంత లోతుల్లోకి వెళ్లకున్నా... జీవితంలో కాలం విలువని తెలియచేసే సందర్భంగా, కాలాన్ని విభజించే లెక్కగా ఉగాదిని చూడవచ్చు.   తీపిచేదుల కలయిక – జీవితమంటే కష్టసుఖాల కలయిక. వీటితో పాటు సంతోషం, కోపం, బాధ, వైరాగ్యం, గర్వం, వినయం... వంటి సవాలక్ష భావాలన్నీ మనిషిని పలకరిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ అదుపులో ఉంచుకోవాలని, ఎటువంటి ఒడిదొడుకులనైనా ఎదుర్కోవాలనీ సూచించేదే ఉగాది పచ్చడి. అందుకే పులుపు, తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం అనే ఆరురుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినందే పండుగకి అర్థం లేదంటారు పెద్దలు.   పంచాంగ శ్రవణం – మన ప్రాచీనుల ఖగోళశాస్త్రానికి కాస్త నమ్మకాన్ని జోడిస్తే అదే పంచాంగం. రాబోయే సంవత్సరంలో రాజకీయం, వ్యవసాయం, వాతావరణం వంటి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న అంచనా ఎలాగూ ఉంటుంది! ఇక వ్యక్తిగతంగా ఆదాయవ్యయాలు, అవమానం రాజపూజ్యం వంటి వివరాలూ కనిపిస్తాయి. వీటిపట్ల నమ్మకం ఉన్నా లేకున్నా ఖర్చులను అదుపులో ఉంచుకోవాలనీ, ఏ సందర్భంలోనూ వినయాన్ని కోల్పోకూడదనీ పెద్దల సూచనగా భావించవచ్చు.   పరోపకారం – ఉగాది రోజున చలివేంద్ర పెడితే బోలెడు పుణ్యమని చెబుతారు. అలా కుదరకున్నా కనీసం నీటితో నిండిన కుండని దానం చేయమన్నారు. ఇక ఉగాదినాడు చెప్పులు, గొడుగు దానం చేసినా విశేష ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. ఎండాకాలంలో తోటివారికి నీరు, చెప్పులు, గొడుగులు అందించడాన్ని మించిన సాయం ఏముటుంది! మన స్తోమతను అనుసరించి కాలానుగుణంగా తోటివారికి సాయపడేందుకు సిద్ధపడాలన్న ఆశయం ఈ ఆచారంలో కనిపిస్తుంది.     - నిర్జర.
  ప్రపంచం విద్యుత్తు మీద విపరీతంగా ఆధారపడుతోందనీ, ఆ విద్యుత్తుని ఉత్పత్తి చేసే ప్రయత్నంలోనూ, విద్యుత్ పరికరాల వల్లా విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోందని పరిశోధనలు రుజువు చేస్తున్న విషయం తెలిసిందే! ఈ విషయమై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 2004లో World wildlife fund (WWF) ఏదన్నా కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంది. కానీ ఏం చేస్తే తాము చెప్పదల్చుకున్న విషయం ప్రజల్లోకి వెళ్తుందో ఆ సంస్థకి తెలియలేదు. చివరికి 2007లో ‘EARTH HOUR’ అనే ప్రచారం చేపట్టింది. ఒక గంటపాటు విద్యుత్ వాడకం లేకుండా చేయడమే ఈ ఎర్త్ అవర్ లక్ష్యం.   ఇలా 2007 మార్చి 31న సిడ్నీలో (ఆస్ట్రేలియా) సాగిన ఎర్త్ అవర్ కార్యక్రమం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇక అప్పటి నుంచి ఈ ప్రయోగానికి తిరుగులేకుండా పోయింది. 2008లో ఈ కార్యక్రమంలో 35 దేశాలలోని 400 నగరాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయంటే ఈ ఆలోచన ఎంత విజయవంతమైందో తెలిసిపోతుంది. అది మొదలు ఏటా ఎర్త్ అవర్కు ప్రచారం, ప్రాధాన్యత పెరుగుతూ వస్తున్నాయి. నేషనల్ జాగ్రఫిక్, గూగుల్ వంటి సంస్థలు ఒకొక్కటిగా ఎర్త్ అవర్ను ప్రచారం చేసేందుకు సిద్ధపడుతున్నాయి.     ఎర్త్ అవర్ వల్ల ఓ గంట పాటు విద్యుత్తు వాడకం తగ్గుతుంది. దీని వల్ల కొన్ని టన్నుల కొద్దీ కార్బన్ డై ఆక్సైడ్ గాల్లోకి చేరకుండా ఆపినవారవుతాం. అంతేకాదు! ఎర్త్ అవర్ని పాటించడం వల్ల ప్రజల్లో పర్యావరణం పట్ల స్పృహ పెరుగుతోందని తేలింది. ఒక అంచనా ప్రకారం ఎర్త్ అవర్ తర్వాత, ప్రజల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాలనే తపన ఓ నాలుగు శాతం పెరిగిందట. చాలా సంస్థలు విద్యుత్తు పొదుపుని ఎర్త్ అవర్కే పరిమితం చేయకుండా... దీర్ఘకాలికంగా విద్యుత్తుని పొదుపు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయట.   ఒక గంటసేపు విద్యుత్తు వాడకాన్ని తగ్గిస్తే ఏం ఒరుగుతుంది అని పెదవి విరిచేవారూ లేకపోలేదు. ఎర్త్ అవర్కు వ్యతిరేకంగా వీరు వినిపించే వాదనలూ లేకపోలేవు. ఎర్త్ అవర్ సమయంలో లైట్ల బదులు కొవ్వొత్తులను వెలిగించడం వల్ల వచ్చే కార్బన్ డై ఆక్సైడ్ సంగతి ఏంటి అని వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రపంచాన్ని చీకటిలో మగ్గించే ఎర్త్ అవర్ సమయంలో నేరాలు, ప్రమాదాలు ఎక్కువయే ప్రమాదం ఉందని ఎత్తి చూపుతున్నారు.     ఎన్ని విమర్శలు ఎదురైనా ఎర్త్ అవర్ వెనుక ఉన్న ఉద్దేశం ఉన్నతమైనదే అని చాలామంది అభిప్రాయం. అందుకే ప్రభుత్వాలు సైతం ఇందులో పాలుపంచుకుంటున్నాయి. ఈఫిల్ టవర్, బకింగ్హామ్ ప్యాలెస్, ఒపెరా హౌస్ వంటి ప్రముఖ పర్యటక స్థలాలన్నీ ఎర్త్ అవర్లో పాలు పంచుకుంటున్నాయి. మన దేశంలోనూ ఎర్త్ అవర్కు ఏటా ప్రాచుర్యం పెరుగుతూ వస్తోంది. గత ఏడాది రాష్ట్రపతి భవన్లో సైతం ఎర్త్ అవర్ను పాటించారు. ఈ ఏడాది ఎర్త్ అవర్ను మార్చి 25 రాత్రి 8:30 నుంచి 9:30 వరకూ జరుపుకోవాలని WWF పిలుపునిస్తోంది. మరి ఈ పిలుపుని అందుకునేదెవరో. ఎవరో దాకా ఎందుకు! మనమే ఓ గంటపాటు ఇంట్లో వీలైనన్ని విద్యుత్ పరికరాలను నిలిపివేస్తే సరి! - నిర్జర.      
  పర్యావరణం నాశనం అయిపోతోంది! చెట్లని అనవసరంగా నరికేస్తున్నాము! మనిషి ప్రకృతిని కాపాడుకోలేక పోతున్నాడు! ఇలాంటి మాటలని మనం ప్రతి రోజూ వింటూనే ఉన్నాము. కానీ దీనికి విరుగుడు ఏమిన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన జవాబులు లభించడం లేదు. జనంలో చిత్తశుద్ధి లేకపోతే ఎవరు ఎంత మోగినా కూడా ప్రయోజనం ఉండదు కదా! కానీ ఇందుకో ఉపాయం ఉందంటున్నారు కెనడా శాస్త్రవేత్తలు.   కెనడాలోని Okanagan విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పర్యావరణానికీ, బాల్యానికీ మధ్య సంబంధం ఉందేమో అని కనుగొనే ప్రయత్నం చేశారు. దీని కోసం వారు 18 నుంచి 25 ఏళ్ల వయసున్న యూనివర్సిటీ విద్యార్థులని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇందులో చిన్నప్పుడు ఆరుబయట ఆడుకున్నవారిలో 87 శాతం తాము ఇప్పటికీ ప్రకృతిని ప్రేమిస్తున్నమని చెప్పుకొచ్చారు. ఇక వీరిలో ఒక 84 శాతం మంది తాము ప్రకృతిని రక్షించుకునేందుకే ప్రయత్నిస్తామని వెల్లడించారు. అనవసరంగా చెట్లని కొట్టేయక పోవడం, చిన్న చిన్న దూరాలకి వాహనాలను వాడకపోవడం, రీసైకిల్డ్‌ వస్తువులను వాడటం, విద్యుత్తును వృధా చేయకపోవడం వంటి చర్యల ద్వారా తాము ఎప్పుడూ ప్రకృతికి చేటు చేయకుండా జీవించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.   ఇంతకుముందు పిల్లలు ఆరుబయట ఆడుకునేందుకు పెద్దలు అంగీకరించేవారు. బడిలో కూడా విశాలమైన ఆటస్థలాలు ఉండేవి. పైగా స్కౌటింగ్‌, ఎన్‌సీసీ, సమ్మర్‌ క్యాంప్స్‌ వంటి కార్యక్రమాల ద్వారా పిల్లలను బయట తిప్పేవారు. కానీ ఇప్పటి ఆటలు, చదువు అన్నీ ఇంటికే పరిమితం అయిపోతున్నాయి. ఇవి పిల్లల మానసిక, శారీరిక వికాసాన్ని దెబ్బతీస్తాయని ఇంతకుముందే అనేక పరిశోధనలు వెల్లడించాయి. పర్యావరణం పట్ల కూడా వారికి ప్రేమ లేకుండా పోతుందని తాజా పరిశోధన తేల్చి చెబుతోంది. కాబట్టి... పిల్లలని కనుక ఆరుబయట ఆడుకోనిస్తే వారిలో పర్యావరణం పట్ల సృహ ఏర్పడుతుందనీ, అది వారి ఆలోచనా విధానం మీద ప్రభావం చూపుతుందనీ చెబుతున్నారు.   - నిర్జర.
  పిల్లలు సరిగ్గా నిద్రపోకపోవడం అనేది కనిపించని వేదన. దాని వల్ల అటు పిల్లలూ ఇబ్బంది పడతారు, వారితో పాటుగా పెద్దలూ బాధపడతారు. పిల్లలలో నిద్రలేమి, భవిష్యత్తులో కూడా వారిలో అనేక ఆరోగ్య సమస్యలకి దారితీస్తోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు పరిష్కారంగా Stephanie Zandieh అనే నిపుణుడు కొన్ని సలహాలను అందిస్తున్నారు. ముఖ్యంగా 1- 5 ఏళ్లలోపు పిల్లలకి ఈ సలహాలు దివ్యంగా పనిచేస్తాయంటున్నారు.   - పిల్లలు నిద్రపోయేందుకు ఓ సమయాన్ని అలవాటు చేయాలి. అంతేకానీ నిద్రపోతే వారే అలసిపోయి పడుకుంటారులే అనుకోవద్దు. నిజానికి అలసిపోయి పడుకునే పిల్లలు నిద్ర మధ్యలో లేచే సందర్భాలు ఎక్కువగా ఉంటాయట!!!   - పిల్లలు నిద్రపోయేటప్పుడు తమ పక్కన ఏదన్నా బొమ్మనో, బొంతనో ఉంచుకోవడాన్ని గమనించవచ్చు. ఇది మంచి అలవాటే అంటున్నారు నిపుణులు. ఇలా ఏదో ఒక వస్తువుతో వారి అనుబంధం వల్ల, పిల్లలు ఒక సురక్షితమైన భావనలో ఉంటారట. తద్వారా ప్రశాంతంగా నిద్రపోతారు.   - పిల్లవాడు ప్రశాంతంగా నిద్రలోకి జారుకునేలా ఒకే తరహా వాతావరణాన్ని కొనసాగించండి. నిద్రపోయే ముందర స్నానం చేయించడమో, కథలు చదివి వినిపించడమో, జోలపాటలు పాడటమో చేస్తూ ఉండటం వల్ల.... పిల్లవాడు నిద్రలోకి జారుకుటాడు.   - పిల్లవాడి పక్కని కానీ, అతను పడుకునే ప్రదేశాన్ని కానీ, అక్కడి వెలుతురిని కానీ తరచూ మార్చడం అంత మంచిది కాదు.   - పిల్లవాడు తనంతట తానుగా నిద్రలోకి జారుకునేలా అలవాటు చేయడం మంచిది. దానివల్ల రాత్రిళ్లు ఉలిక్కిపడి లేచిన తరువాత తనంతట తానుగా మళ్లీ నిద్రపోగలడు. లేకపోతే మీరు అతణ్ని గమనించుకుని మళ్లీ నిద్రపుచ్చేదాకా ఇబ్బందిపడుతూనే ఉంటాడు.   - పిల్లలు వేరే గదిలో పడుకుంటే, వారిని రాత్రి మధ్యలో అప్పుడప్పుడూ గమనిస్తూ ఉండటం మంచిది. పిల్లలు ఉలిక్కిపడి లేచినట్లు అనిపిస్తే, బద్ధకించకుండా లేచి వారి దగ్గరకి వెళ్లాల్సిందే! అవసరం వచ్చినప్పుడు మీరు వారి పక్కనే ఉంటారనే భద్రతా భావం వారికి ప్రశాంతతని కలిగిస్తుంది.   - పిల్లలని వేరే గదిలో ఉంచడం అన్న మార్పుని ఒక్కసారిగా చేయడం మంచిది కాదు. ముందు పిల్లవాడు తనంతట తానుగా పడుకునే అలవాటు చేయాలి. ఆ తరువాత మీరు అతని కనుచూపు మేరలో ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించాలి. అవసరం అయినప్పుడు మీరు తన పక్కనే ఉంటారన్న భద్రతని అందించాలి. అప్పుడు మాత్రమే అతణ్ని వేరే చోట పడుకోపెట్టే ప్రయత్నం చేయాలి. అలా కాకపోతే అతని నిద్ర దెబ్బతినడం సంగతి అటుంచితే తల్లిదండ్రులకీ, పిల్లలకీ మధ్య లేనిపోని దూరాలు ఏర్పడతాయి. - నిర్జర.    
కష్టాలు ఒకోమనిషిని ఒకో తీరులో పలకరిస్తాయి. కొంతమంది ఆ కష్టాలకి కుంగిపోయి వాటినే నెమరేసుకుంటూ నిలబడిపోతారు. మరికొందరు మాత్రం అవి జీవితంలో మరో మార్గాన్ని చూపిస్తున్నాయన్న సూచనను అందుకుంటారు. అందుకనే వాళ్లు విజేతలుగా నిలిచిపోతారు. అలాంటి ఓ జీవితమే ‘నాగ నరేష్ కరుటుర’ అనే కుర్రవాడిది.   నాగనరేష్‌ది పశ్చిమగోదావరి జిల్లాలోని తీపర్రు అనే పల్లెటూరు. నరేష్‌ అందరిలాంటి కుర్రాడే. ఇంకామాట్లాడితే స్తోమతలో అందరికంటే చిన్నవాడు. అతని తండ్రి ఓ సాధారణ లారీ డ్రైవరు, తల్లి గృహిణి. చదువులో నరేష్ ఎప్పుడూ ముందే ఉండేవాడు. తీపర్రులో అలా ఆడుతూపాడుతూ చదువుతున్న నరేష్‌ ఓసారి అనుకోని ప్రమాదానికి లోనయ్యాడు. సంక్రాంతి పండగని ఊరికి వెళ్లే ప్రయత్నంలో, నరేష్‌ ఓ లారీ మీద నుంచి కిందపడిపోయాడు.   ప్రమాదం జరిగిన మాట వాస్తవమే కానీ... అదేమీ ప్రాణాంతకం కాదు! కానీ వైద్యుల నిర్లక్ష్యం మాత్రం అతనికి ప్రాణాంతకంగా మారింది. ప్రమాదంలో గాయపడిన నరేష్‌కు ఓ చిన్న బ్యాండేజీ కట్టి పంపేశారు వైద్యులు. ఆ గాయం లోలోపలే కుళ్లిపోయి చివరికి అతని రెండు కాళ్లనీ తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పక్క పేదరికం, మరో పక్క వైకల్యం. ఇంకరైతే ఈ పరిస్థితికి క్రుంగిపోయేవారేమో! కానీ నరేష్‌ మాత్రం తనకి కాళ్లు లేవన్న కారణంతో వెనక్కి తగ్గకూడదని అనుకున్నాడు. దానికి తోడు నరేష్‌కు తగిన వైద్యం కోసమని తండ్రి తణుకు పట్నానికి మకాం మార్చాడు. తీపర్రులోనే ఉంటే నరేష్ చదువు పదోతరగతితోనే ఆగిపోయేది. కానీ తనకి కాళ్లు పోవడం వల్లే తణుకులోని మిషనరీ స్కూల్లో చదివే అవకాశం వచ్చిందంటాడు నరేష్‌.   తణుకులో చదువుకునే సమయంలోనే నరేష్‌కి ఉన్నత చదువులకి అవకాశం ఇచ్చే JEE పరీక్ష గురించి తెలిసింది. అంతే! తన దృష్టినంతా JEE ఎంట్రెన్స్‌ పరీక్షల మీద కేంద్రీకరించాడు. ఆ పరీక్షలలో జాతీయస్థాయిలోనే వికలాంగుల కోటాలో నాలుగో ర్యాంకుని సంపాదించాడు. దాంతోపాటే మద్రాసు ఐఐటీలో సీటునీ సంపాదించాడు. నరేష్‌ గురించి విన్న జయపూర్‌ హాస్పిటల్‌వాళ్లు అతని చదువుకి అయ్యే ఫీజులని భరించేందుకు సిద్ధపడ్డారు. మద్రాసు ఐఐటీలోని అతని సహవిద్యార్థులు నరేష్‌ కోసం ఓ బ్యాటరీ కుర్చీని కొనిపెట్టారు. వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయలేదు నరేష్. ఐఐటీ కోర్సుని సమర్థంగా పూర్తిచేశాడు. గూగుల్‌ బెంగళూరు క్యాంపస్‌లో ఉద్యోగాన్ని సాధించాడు.   ఏం జరిగినా అంతా మన మంచికే అనీ, తన చుట్టూ ఉన్న మనుషులంతా మంచివారేననీ నరేష్‌ నమ్మకం. పరిస్థితులన్నీ అతని నమ్మకాన్ని బలపరిచేలాగానే సాగాయి. రైళ్లో అతనితో పాటు ప్రయాణించినవారు కూడా నరేష్ పట్టుదలని చూసి సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజమే మరి! మన దృక్పథం ఎలా ఉంటుందో... ప్రపంచం కూడా దానికి అనుగుణంగానే కనిపిస్తుందన్నది పెద్దల మాట కదా. సాధించలేను అనుకుంటే ఎన్ని సులువులు చేతికందినా ముందుకు వెళ్లలేము. సాధించి తీరాలి అనుకుంటే ప్రతి అడుగూ అవకాశం దిశగానే పడుతుంది.   - నిర్జర.
టాటా కేపిటల్, ఖాతాదారులకు రుణాలను అందించే సంస్థ. చదువులు, ఇల్లు కట్టుకోవడం వంటి అవసరాలతో పాటుగా పెళ్లి కూడా జేబులని గుల్లచేసే సందర్భమే అని ఈ సంస్థ గ్రహించింది. మన దేశంలో పెళ్లి ఖర్చుల పేరుతో దాదాపు 700 కోట్ల రూపాయల వరకూ వ్యాపారం జరుగుతోందట. ఇక అనధికారికంగా సాగే ఖర్చులు, కట్నాల గురించి చెప్పేదేముంది. అందుకే పెళ్లిళ్లకి కూడా అప్పులు ఇస్తాం అంటూ టాటా కేపిటల్‌, బజాజ్ ఫిన్‌సర్వ వంటి సంస్థలు ముందుకువస్తున్నాయి. పెళ్లి కోసం 25 లక్షల వరకూ అప్పులు ఇస్తున్నాయి.   ఈ నేపథ్యంలోనే టాటా కేపిటల్‌ సంస్థ పెళ్లి ఖర్చుల గురించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. 2,500 మంది పాల్గొన్న ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.   - నూటికి 74 శాతం మంది పెళ్లి ఖర్చుల బడ్జట్ పది లక్షల వరకూ పెట్టవచ్చన్న అంచనాలో ఉన్నారు.  - 27 శాతం మంది పెళ్లి కోసం అవసరమైనదానికంటే ఎక్కువ ఖర్చుపెట్టామన్న పశ్చాత్తాపంలో ఉన్నారు. - ఒకప్పుడు పెళ్లంటే బంధువులకి మర్యాదలు చేయడం, బాజాభజంత్రీలు, హనీమూన్‌కి వెళ్లడం వంటి ఖర్చులకే అధిక ప్రాధాన్యతని ఇచ్చేవారు. కానీ ఇప్పటి తరంలో దాదాపు 66 శాతం మంది వివాహ దుస్తులు, ఆభరణాలు, మేకప్‌ వంటి ఆడంబరాలకే అధిక ప్రాధాన్యత అని చెప్పేశారు. - టాటా కేపిటల్‌వారి గుండెల అదిరిపోయేలా 44 శాతం మంది అసలు పెళ్లిళ్లకి అప్పులు ఇస్తారన్న విషయమే తమకు తెలియదని చెప్పారు. అయితే పెళ్లి ఖర్చుల కోసం ఒకవేళ రుణం దొరుకుతుంటే... దానిని అందిపుచ్చుకునేందుకు 58 శాతం మంది సిద్ధంగా ఉన్నారు. - 30 ఏళ్లలోపు వారు ఆర్భాటంగా పెళ్లి చేసుకునేందుకే ఇష్టపడుతున్నారు. 30 ఏళ్లు పైబడినవారు మాత్రం ఏదో నామమాత్రంగా పెళ్లిసాగిపోతే చాలు అనుకుంటున్నారట. - 50 శాతం మంది మగవారు ఓ ఐదు లక్షల రూపాయలలోపు ఖర్చుతో పెళ్లి ముగించేయాలని అనుకుంటున్నారు. కానీ ఆడవారిలో 32 శాతం మాత్రమే ఇలా తక్కువ ఖర్చులో పెళ్లి జరిగేందుకు ఇష్టపడుతున్నారు. - తమ పెళ్లి ధూంధాంగా 30 లక్షల వరకూ ఖర్చుతో సాగాలని ఒ 22 శాతం మంది మగవారు కోరుకుంటున్నారు. ఆడవారిలోనేమో ఆర్భాటంగా పెళ్లి జరగాలని కోరుకునేవారి సంఖ్య 36 శాతంగా ఉంది. - తీరా పెళ్లి చేసుకుని పద్దులన్నీ చూసుకున్నాక, జరిగిన ఖర్చులని చూసి లబోదిబోమంటున్నారు కుర్రకారు. కనీసం మూడోవంతు మంది యువతులు, తమ పెళ్లి ఖర్చులు అనుకున్నదానికన్నా పదిలక్షలు ఎక్కువగా తేలాయని బాధపడ్డారట.   - నిర్జర.
  హోళీ అంటే భారతీయులకి మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఎక్కడో ఈశాన్యంలోని మణిపూర్లో ఉన్నా, ఖండాలు దాటుకుని ఏ అమెరికాలో ఉన్నా.... హోళీనాడు రంగు చేతపట్టని భారతీయుడు ఉండదు. ఇందులో ఒకో ప్రాంతానిదీ ఒకో ప్రత్యేకత. ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రపంచంలో బహుశా మన హోళీ సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది. కానీ జీవితాన్ని రంగులమయం చేసుకునే ప్రయత్నం మాత్రం చాలా దేశాల్లో ఉంది...     టమాటాల పండుగ స్పెయిన్‌లోని వలెన్‌సియాన్ నగరంలో ఏటా ఈ పండుగ చేసుకుంటారు. ఆగస్టు చివరి బుధవారం  జరుపుకొనే ఈ పండుగలో ఒకరి మీద ఒకరు టమోటాలు విసురుకుంటారు. 1945 నుంచి మొదలైన ఈ పండుగ రాన్రానూ ప్రచారాన్ని అందుకుంటోంది. నిజానికి ఈ సంప్రదాయం ఎలా మొదలైందో ఎవరికీ తెలియదు. కొందరు కుర్రకారు టమాటాలతో కొట్టుకున్న గొడవ ఇలా మారిందనీ, ఓ టమాటా లారీ బోల్తా పడటంతో ఈ సంప్రదాయం మొదలైందనీ, ఊళ్లో కౌన్సిల్‌ సభ్యుల మీద కోపం వచ్చిన పౌరులు టమాటాలను విసరడంతో ఈ ఆచారానికి పునాది ఏర్పడిందనీ రకరకాల వాదనలు ఉన్నాయి. కారణం ఏదైనా ఆ రోజు సంబరం మాత్రం అంబరాన్ని అంటుతుంది. ఆ సందర్భంగా ఎవ్వరికీ ఎలాంటి గాయం జరగకుండా చాలా నియమాలనూ పాటించాల్సి ఉంటుంది.     ఒకటే రంగు నెదర్లాండ్‌ రాజుగారైనా విలియం అలగ్జాండర్ పుట్టినరోజు సందర్భంగా ఆ దేశంలో జరుపుకొనే సంబరాలే ‘Koningsdag’. ఈ రోజున నెదర్లాండ్స్ యావత్తూ ఆ దేశపు రంగైన నారింజరంగుతో నిండిపోతుంది. గోడల మీద నారింజ రంగు కనిపిస్తుంది. జనమంతా నారింజరంగు బట్టలు వేసుకుని తిరుగుతారు. ఆఖరికి జుట్టుకి కూడా నారింజ రంగు వేసుకుంటారు.     ద్రాక్ష ఎరుపులో మందుప్రియులందరి నోరూరేలాంటి ఓ పండుగ ఉంది. అదే స్పెయిన్‌లో జరిగే ‘హారో వైన్‌ ఫెస్టివల్‌’. ఏటా జూన్‌ 29న ఆ దేశంలోని క్రైస్తవ సన్యాసి ‘శాన్‌ పెడ్రో’ జ్ఞాపకార్థం ఈ పండుగ జరుగుతుంది. హారో అనే ఊరిలో జరిగే ఈ పండుగలో ఊరి జనమంతా ఉదయం నుంచే ద్రాక్షసారాయి నిండిన పాత్రలతో బయల్దేరతారు. దారిలో తమకు ఎదురుపడినవారందరి మీదా ఈ సారాయిని ఒంపుతూ ముందకుసాగుతారు. సాయంత్రం అయ్యేసరికి ఊరంతా ద్రాక్షమయంగా మారిపోతుందన్నమాట. ఇక ద్రాక్షసారాని ఒంపుకోవడమే కాదు... దానిని తాగడంలో కూడా బోలెడు పోటీలు జరుగుతాయి.     నారింజ యుద్ధం ఇటలీలోని ఇవ్రియా అనే పట్నంలో జరిగే పండుగ ఇది. దీని మూలాలు ఎప్పుడో 13వ శతాబ్దంలో ఉన్నాయని చెబతారు. అప్పట్లో రాజవంశానికి చెందిన వ్యక్తి, ఓ పల్లెటూరి పిల్లని బలాత్కారం చేయబోయాడట. దానికి తిప్పికొట్టిన ఆ అమ్మాయి, ఏకంగా ఆ వ్యక్తి తలని నరికేసిందని చెబుతారు. అంతేకాదు! విషయం తెలుసుకున్న పౌరులంతా కలిసి రాజవంశం మీద తిరగబడ్డారట. ఆనాటి ప్రతిఘటనకు గుర్తుగా ఇవ్రియావాసులు నారింజపండ్లని ఒకరిమీద ఒకరికి విసురుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా హోళీని తలపిస్తూ రంగులతో నిండే ఇలాంటి పండుగలు చాలానే ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం పైన పేర్కొన్నవే!   - నిర్జర.
  కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ, షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ... అంటూ మంచి భార్యకి ఉండాల్సిన లక్షణాలు చెబుతాయి ధార్మిక గ్రంథాలు. కానీ స్త్రీ అంటే కేవలం భార్యేనా? కుటుంబాన్ని చక్కదిద్దడంలోనే ఆమె జీవితానికి సార్థకత దక్కుతుందా? అనే ప్రశ్నకు జవాబుగా ఆరుగురు విజయగాథలను గర్వంగా చెప్పుకుందాం...   సుచీ ముఖర్జీ - ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్ హవా నడుస్తోంది. బయటకు వెళ్లే ఓపిక లేకనో, ధరలు తక్కువనో.. కారణం ఏదైతేనేం! అంతా ఆన్లైన్లో షాపింగ్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. అలా గుర్గావ్కి చెందిన ‘సుచీ ముఖర్జీ’ కూడా ఆన్లైన్ ద్వారా తనకి నచ్చిన బట్టలు కొనాలనుకున్నారు. ప్చ్!! ఎన్ని దుస్తులు చూసినా ఆమెకి నచ్చలేదు. అందరికీ నచ్చేలా కేవలం దుస్తుల కోసమే ఒక ఆన్లైన్ షాపింగ్ సైట్ ఉంటే బాగుండు అనుకున్నారు. ఎవరో దాకా ఎందుకు... తనే limeroad.com పేరుతో ఒక వెబ్సైట్ ప్రారంభించారు. ఈ ఆలోచన ఏమేమరకు ఫలితాన్ని ఇచ్చిందో అనుకుంటున్నారా! ఒక్కసారి limeroad.comలోకి వెళ్లి చూడండి. కళ్లు చెదిరిపోతాయి.   మిథాలీ టండన్ - నగర జీవితం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పగలంతా సమస్యలతో నలిగేవారు సాయంవేళకి కాస్తోకూస్తో మందుపుచ్చుకోవడం అలవాటైపోయింది. ఇక శనాదివారాలు వస్తే చాలు.... వీకెండ్ పార్టీలలో పాల్గొని తీరాల్సిన పరిస్థితి. కానీ పొద్దున్నే లేచి ఆఫిసులకి పరుగులు తీసేదెలా! మద్యం మత్తులో నిస్సత్తువగా, తలనొప్పిగా ఉండే శరీరాన్ని ఉరుకెత్తించేదెలా! ఈ సమస్యకు పరిష్కారం కనుగొని దాన్ని ఓ వ్యాపారచిట్కాగా మార్చేశారు ‘మిథాలీ టండన్’. Morning Fresh పేరుతో హ్యాంగోవర్ తగ్గించే డ్రింక్ను ఉత్పత్తి చేస్తూ... మందుబాబులకు పరిష్కారాన్నీ, తనకి విజయాన్నీ సాధించారు. కావాలంటే drinkmorningfresh.com చూడండి.   రష్మీ దాగా - IIM అహ్మదాబాద్లో చదువుకున్న రష్మీ దాగా, బెంగళూరులో కళ్లు చెదిరే జీతంతో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగపు ఒత్తిడిలో పడి అప్పుడప్పుడూ రష్మీ బయటనుంచి భోజనం ఆర్డరు చేసేవారు. ఆ భోజనంతో ఆమెకి ఆకలి తీరేదేమో కానీ తృప్తి మాత్రం కలిగేది కాదు. ఎప్పుడూ ఒకటేరకం కూరలు, ఏదో అమ్ముకోవడం కోసం వండినట్లుగా యాంత్రికంగా తోచే రుచి... దీంతో ఇంటి భోజనంలా ఎప్పడికప్పుడు రుచికరంగా, వైవిధ్యంగా ఉండే ఆహారాన్ని అందచేస్తే ఎంత బాగుండో అనిపించింది. వెంటనే తన ఆలోచనను అమలుచేసేశారు. ఫలితం ఆమె స్థాపించిన హోం డెలివరీ ఆహారం ఇప్పుడు నాలుగు నగరాలలో దొరుకుతోంది. (freshmenu.com)   కోమల్ అగర్వాల్ - సెల్ఫోన్ లేని నరమానవుడు కనిపించడం అరుదు. మరి అలాంటి సెల్ఫోనుకి అవసరమయ్యే సదుపాయాలని కొనుక్కోవాలంటే ఒకోటీ ఒకో కంపెనీది కనిపిస్తుంది. దీనికి విరుగుడుగా పవర్బ్యాంక్ల దగ్గర నుంచీ చార్జర్ల వరకూ ఒకే చోట అందిస్తే ఎలా ఉంటుంది అనిపించింది కోమల్ అగర్వాల్ అనే అమ్మాయికి. ఫలితం ‘పెబుల్స్’ బ్రాండ్ ఆవిర్భావం. ఇప్పుడు పెబుల్స్ ఓ వంద కోట్ల సంస్థ.   రిచా కౌర్ - ఆడవారి లోదుస్తులు అనగానే అదేదో అసభ్యమైన పదంలా తోస్తుంది. ఆరోగ్యం కోసమో, సౌకర్యం కోసమో మంచి లోదుస్తులు తీసుకోవాలంటే దేశీయంగా ఉత్త పనికిమాలిన సరుకు లభిస్తుంది. ఈ పరిమితులను దాటాలనుకున్నారు ‘రిచా కౌర్’. మన దేశంలోనే మహిళలకు ఆంతర్జాతీయ స్థాయి లోదుస్తులకు ఓ బ్రాండ్ రూపొందించే ప్రయత్నం చేశారు. అదే Zivme. ఆ బ్రాండ్ ఎంత విజయవంతం అయ్యిందో చూడాలంటే zivame.com/లోకి వెళ్లాల్సిందే!   సైరీ చాహల్ ¬- సైరీ చాహల్ అవకాశాలను అందిపుచ్చుకునే ఓ వ్యాపారవేత్త. అందుకనే ఇంటర్నెట్ మొదలైన రోజుల్లోనే ఓ వెబ్సైటుని ప్రారంభించి లాభాలను సాధించారు. తన సంగతి సరే! కానీ ప్రతిభ ఉన్నా ఇంటిపనులలో సతమతం అయిపోయే స్త్రీల పరిస్థితి ఏంటి అన్న ఆలోచన వచ్చింది సైరీకి. అంతే! SHEROS పేరుతో ఒక సంస్థను ప్రారంభించారు. ప్రతిభకు తగిన ఉపాధిని కల్పించడంలో వేలాదిమంది స్త్రీలకు SHEROS సంస్థ ఓ మాధ్యమంగా నిలుస్తోంది (sheros.in). (బిజినెస్ ఇన్సైడర్ సౌజన్యంతో) - నిర్జర.    
  2012లో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మహిళలలో ఓ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ అమ్మాయి తాము ఎదుర్కొంటున్న వేధింపుల గురించి చెబుతూ భోరున ఏడ్చేసింది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటే బాగుండు అని అనిపించింది అఖిలేష్కి. వెంటనే నవనీత్ సకేరా అనే ఒక పోలీసు ఉన్నతాధికారిని పిలిపించి పరిస్థితిని వివరించారు. అలా వారిద్దరి మధ్యా పుట్టిన ఆలోచనే – 1090.   ఉత్తర్ప్రదేశ్లో ఆడపిల్లలని ఫోన్లో వేధించే సందర్భాలు చాలా ఎక్కువ. సాధారణంగా అమ్మాయిలు రీచార్జి కోసం ఏదన్నా దుకాణానికి వెళ్లినప్పుడు అక్కడ వారి నెంబర్లను నోట్ చేస్తారు కదా! అలా నోట్ చేసిన నెంబర్లను దుకాణదారులు ఆకతాయిలకు అమ్ముతారట. అమ్మాయి బాగా అందంగా ఉంటే ఆ నెంబరుకి 500 రూపాయల వరకూ చార్జ్ చేస్తారు. ఇలా ‘కొనుక్కున్న’ నెంబర్లకి ఏదో రాంగ్ కాల్ అన్నంత అమాయకంగా ఫోన్ చేయడంతో వేధింపు మొదలవుతుంది. అది క్రమేపీ స్త్రీలను ఉచ్చులోకి దింపేందుకో, వారిని లైంగికంగా వేధించడానికో దారి తీస్తుంది. ఇలా నెంబర్లని ‘కొనుక్కునే’ స్తోమత లేని ఆకతాయిలు మరో విధంగా ఆడవారి నెంబర్లను సేకరించే ప్రయత్నం చేస్తారు. దీనికోసం వరుసగా నెంబర్లకి డయల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే తమకి ఓ ఆడగొంతు వినిపించిందో... ఇక అప్పటి నుంచీ ఆ నెంబరుని వేటాడటం మొదలుపెడతారు.     తమని ఫోన్లో ఆకతాయిలు వేధిస్తుంటే ఏం చేయాలో ఉత్తర్ప్రదేశ్ ఆడవారికి తోచేది కాదు. పోనీ పోలీస్ కంప్లయింట్ ఇద్దామంటే... అది ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయం, నేరస్తులకు శిక్ష పడుతుందా అన్న అనుమానం వారిని వేధించేవి. కానీ ఇప్పుడు 1090కి ఫోన్ చేస్తే చాలు, వారి సమస్యని ఓ కాల్ సెంటరులోని వ్యక్తులు నమోదు చేసుకుంటారు. తరువాత ఏ నెంబరు నుంచైతే వారు వేధింపులను ఎదుర్కొంటున్నారో, ఆ నెంబరుకి ఫోన్ చేస్తారు. ‘మీ నుంచి వేధింపు కాల్స్ వస్తున్నట్లుగా మాకు ఫిర్యాదు అందింది. తీరు మార్చుకోకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది,’ అంటూ హెచ్చరిస్తారు.   వేధింపులని ఆపమంటూ పోలీసుల నుంచి ఫోన్ రాగానే రకరకాల స్పందనలు వినిపిస్తాయి. తమకేమీ తెలియదని కొందరు బుకాయిస్తారు, ఆ అమ్మాయంటే తమకి ఇష్టమని మరికొందరు వాదిస్తారు, తప్పయిపోయింది క్షమించమంటూ ఇంకొందరు వేడుకుంటారు. మొత్తానికి చాలా సందర్భాలలో 1090 నుంచి వచ్చే హెచ్చరికతో వేధింపులు ఆగిపోతాయి. అలా కాకుండా ఇంకా వేధింపులు కొనసాగితే మాత్రం సదరు ఆకతాయిలను వారి కుటుంబసభ్యులతో సహా పిలిపించి కౌన్సిలింగ్ను నిర్వహిస్తారు. ఇకమీదట వేధింపులకు పాల్పడనని భగవద్గీత మీద ప్రమాణం చేయించుకుంటారు. మరికొందరు ముదర్లు ఉంటారు. ఈ కౌన్సిలింగ్ స్థాయి దాటిన తరువాత కూడా వేధింపులను కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి అరుదైన సందర్భాలలో వారి మీద కేసు నమోదు చేసి ‘మామగారింటికి’ పంపిస్తారు.     1090 హెల్ప్లైన్ ఏదో కంటితుడుపు చర్యగా మొదలుపెట్టిన వ్యవస్థ కాదు. దీని కోసం బోలెడంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి ప్రత్యేకమైన కార్యాలయం ఉంది. ఇంతేకాకుండా 1090 గురించి వాడవాడలా తెలిసేందుకు బోలెడు ప్రచారమూ చేస్తుంటారు. ఫలితం! 2012 నుంచి ఈ ఏడాది ఆరంభం వరకూ 6.81 లక్షల ఫిర్యాదులు అందాయి. వీటిలో ఆకతాయిలు వేధిస్తున్నారంటూ వచ్చే ఆరోపణల దగ్గర్నుంచీ సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపుకి గురవుతున్నాం అని వచ్చే ఫిర్యాదుల వరకూ ఉన్నాయి. వీటిలో దాదాపు 98% ఫిర్యాదులను పరిష్కరించడం విశేషం! ప్రస్తుతానికి ఉత్తర్ప్రదేశ్లోని ఆడవారు తమకి ఏదన్నా ఇబ్బంది ఎదురైతే ‘దస్ నబ్బే’ (1090)కి ఫోన్ చేస్తే సరి అని ధీమాగా ఉన్నారు. అంతకంటే మరేం కావాలి!!! - నిర్జర.    
చాలామంది జీవితంలో కష్టాలు వస్తాయి. కలలా సాగిపోతున్న జీవితం కాస్తా తలకిందులైపోతుంది. అలా తారుమారైన జీవితాన్ని తల్చుకుని తల్చుకుని వారు కుమిలిపోతుంటారు. కానీ కొందరు మాత్రం తాము పడిన కష్టానికి ఉపశమనంగా, అలాంటి కష్టంలో ఉన్న తోటివారందరికీ ఓదార్పుగా..... ఓ భిన్నమైన మార్గాన్ని ఎన్నుకొంటారు. తన కష్టాన్ని సమాజానికి ఓ వరంగా అందిస్తారు. అలాంటి ఓ వ్యక్తే సరోజనీ అగర్వాల్‌!   లక్నోలో ఉండే సరోజనీది ఓ అందమైన కుటుంబం. చక్కగా చూసుకునే భర్త, రత్నాల్లాంటి పిల్లలు... అంతా బాగుంది. హిందీలో పీ.హెచ్‌.డీ చేసిన సరోజనీకి కథలన్నా, కవితలన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతో స్వయంగా ఎన్నో రచనలు చేశారు. ఓ రోజు సరోజనీ తన కూతురుతో కలిసి ప్రయాణిస్తుండగా... అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆమె నడుపుతున్న బండి ప్రమాదానికి లోనై, ఆమె కళ్ల ముందే కూతురు చనిపోయింది.   కళ్లముందే కూతురు చనిపోవడం, అది కూడా తను నడుపుతున్న బండి వల్లే చనిపోవడంతో సరోజనీ తేరుకోలేకపోయింది. కానీ అందరిలా ఆమె ఆవేదనతో మిగిలిపోలేదు. తన కూతురు జ్ఞాపకాలకు విలువనిచ్చేలా ఏదన్నా చేయాలనుకున్నారు. అలా 1985లో తన ఇంట్లోనే ఆడపిల్లల కోసం ఓ అనాథ శరణాలయాన్ని నెలకొల్పారు. ఆ శరణాలయానికి తన కూతురు పేరు మీదుగా ‘మనీషా మందిర్‌’ అని పేరు పెట్టారు. తన రచనల మీద వచ్చే రాయల్టీలతో దాన్ని నడపసాగారు.   మనీషా మందిర్‌ను మొదలుపెట్టడమే ఆలస్యం... ఎందరో పిల్లలకి అది ఆసరాగా మారింది. వికలాంగులుగా ఉన్నారనో, పెంచే ఆర్థిక స్తోమత లేదనో... వదిలేసే ఆడపిల్లలకు మనీషా మందిర్‌ నీడనిచ్చింది. రోడ్ల మీద తనకు అనాథలా కనిపించినవారినీ, వేశ్యాగృహాలలో పుట్టినవారినీ కూడా సరోజనీ అక్కున చేర్చుకునేవారు. మనీషా మందిర్లో అనాథలను చేర్చేందుకు ఆ ఇంటి ముంగిట ఒక ఊయల కట్టి ఉండేదంటే... ఆమె నిశ్చయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.   మనీషా మందిర్‌లో ఇప్పటివరకూ 800 మందికి పైగా ఆడపిల్లలకు ఆశ్రయం లభించింది. అలాగని వారిని కేవలం అనాథలుగా చూడలేదావిడ. వారందరిలోనూ దూరమైన తన కూతురిని చూసుకుని మురుసుకునేవారు. ఒక కూతురి కోసం ఎలాంటి సుదాపాయాలు కల్పించాలని తల్లి తాపత్రయపడుతుందో... తన ఆశ్రమంలో ఉన్నవారికి అలాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తారు సరోజని. లైబ్రరీ, కంప్యూటర్‌ లాబ్‌, బాడ్మింటన్ కోర్ట్‌... లాంటివన్నీ మనీషా మందిర్‌లో కనిపిస్తాయి. ఇక అందులోని పిల్లలకు విద్య, వృత్తి నైపుణ్యాలని అందించడం సరేసరి!   మనీషా మందర్‌లో రోజుల వయసులో చేరిన పిల్లలు, తమ కాళ్ల మీద తాము నిలబడేవరకూ చేయూతగా నిలుస్తారు సరోజనీ. అలా మనీషా మందిర్‌లో ఎదిగిన ఎందరో పిల్లలు బ్యాంక్‌ మేనేజర్లుగా, టీచర్లుగా, ప్రభుత్వోద్యోగులుగా గౌరవప్రదమైన స్థానాలకు ఎదిగారు. మరికొందరు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ‘‘ఇంతమందికి సాయపడేందుకే భగవంతుడు నా కూతురిని తీసుకువెళ్లిపోయాడేమో! ఇన్ని వందల మందిలో నా కూతురిని పదిలంగా చూసుకునే అవకాశం కల్పించినందుకు ఆయనకి నేను రుణపడిపోయాను,’’ అంటారు సరోజనీ. మనీషా మందిర్‌ ముంగిట ఉన్న మనీష విగ్రహంలోని చిరునవ్వుని గమనిస్తే... ఆమె ఈ మాటలను వింటున్నట్లుగానే తోస్తుంది.   - నిర్జర.
  కట్నం తీసుకోవడం శిక్షార్హం అని ప్రభుత్వం తెగ ప్రకటనలు చేస్తుంటుంది. కట్నం అడిగేవాడు గాడిదతో సమానం అంటూ టీవీలు చెడ తిడుతుంటాయి. కానీ కట్నం తీసుకునే ఆచారంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మునుపటిలా కట్నం తేలేదని కిరసనాయిలు పోసి తగటబెట్టేసిన వార్తలు వినిపించకపోవచ్చు. కానీ వేధింపులు మాత్రం యథాతథంగానే సాగుతున్నాయి. ఇలాంటి ఆచారానికి ముగింపు పలుకుతున్నాడు ఓ యోధుడు....   జార్ఖండ్లోని పొఖారీ గ్రామానికి చెందిన హాజీ ముంతాజ్ అలీకి కట్నం అంటే మా చెడ్డ చిరాకు. ఆ కట్నం కారణంగానే తన తోటి ముస్లిం కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయన్నది అతని అభిప్రాయం. కానీ మిగతావారిలాగా ముంతాజ్ అలీ ఈ దురాచారం గురించి బాధపడుతూ కూర్చోలేదు. కట్నం తీసుకోవడం ఎంత అనాగరికమో, దాని వల్ల పేద కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయో, యువత ఎలా అత్యాశలో కూరుకుపోతోందో ఊరిలో ఇంటింటికీ వెళ్లి చెప్పసాగాడు.   2016 ఏప్రిల్లో ముంతాజ్ అలీ మొదలుపెట్టిన ప్రచారం నెలలు గడిచేసరికి సత్ఫలితాలను ఇవ్వసాగింది. తాము కట్నం తీసుకోమంటూ తోటి ముస్లిం కుటుంబాలన్నీ ముంతాజ్ అలీకి మాట ఇచ్చాయి. అంతేకాదు! ఇప్పటికే కట్నం తీసుకున్నవారైతే తాము తీసుకున్న కట్నాన్ని ఆడపిల్లల కుటుంబానికి తిరిగి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 800 కుటుబాల వారు ఆరుకోట్ల రూపాయల కట్నాన్ని తిరిగి ఇచ్చేశారు.   కట్నానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ముంతాజ్ అలీ పోరాటం రానురానూ ఓ ఉద్యమం స్థాయికి చేరుకుతంది. జార్ఖండ్లోని లాతేహర్, పాలము జిల్లాలలోని ముస్లిం కుటుంబాలు ఇప్పుడు కట్నం అంటేనే మండిపడుతున్నారు. ఆఖరికి పెళ్లిళ్లు చేయించే మతగురువులు (మౌల్వీలు) కూడా కట్నం తీసుకునేవారి పెళ్లిళ్లు చేయించం అంటూ ప్రతిజ్ఞ చేశారు. తన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు దల్తోన్గంజ్ అనే ఊరిలో ఈ నెల 7వ తేదీన ఓ పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నారు ముంతాజ్ అలీ.   మతం ఏదైనా కానీ... కట్నం ఇచ్చే ఆచారం వెనుక ఒకప్పటి ఉద్దేశం వేరు. ప్రస్తుతం మాత్రం అది ఆడపిల్లల జీవితాలని తలకిందులుగా మార్చేస్తోంది. అలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టుకున్నారు ముంతాజ్ అలీ. అతను ఆశయం అసాధ్యం కాదని 800 కుటుంబాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒక్క ముంతాజ్ అలీ ఒంటరిగా ఇంత సాధిస్తే... గంటల కొద్దీ కబుర్లు చెప్పే మన సమాజ సేవకులు ఇంకెంత సాధించాలి! - నిర్జర.        
  జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఘట్టం పెళ్లి. పెళ్లిలో దక్కిన జీవితభాగస్వామి కనుక సరైనవాడైతే జీవితం పల్లకీలో సాగిపోతుంది. లేకపోతే తల్లకిందులైపోతుంది. అందుకే తమతో కలిసి నడవబోయేవారు ఎలా ఉండాలనే విషయం మీద ప్రతి ఒక్కరికీ బోలేడు ఆశల ఉంటాయి. భారత్ మేట్రిమోనీ సంస్థ ఈ ఆశలు ఏ తీరుగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసింది.   - ఫేస్బుక్, ట్విట్టర్ వేదికగా సాగిన ఈ సర్వేలో 1500 మంది పాల్గొన్నారట. వీరిలో 37 శాతం మగవారు కాగా 63 శాతం స్త్రీలు కావడం గమనార్హం. పైగా తమకి ఎలాంటి వధువు/ వరుడు కావాలో ఎవరన్నా హీరోతోనో హీరోయిన్తోనో పోలుస్తూ చెప్పమంది ఈ సంస్థ. ఆ సర్వేలో తేలిన విషయాలు ఏమిటంటే...   - ఓ పదిహేనేళ్ల క్రితం దుమారంలా దూసుకువచ్చిన హృతిక రోషన్ ప్రస్తుతం ఫ్లాప్లతో సతమతం అవుతూ ఉండవచ్చుగాక. భార్య సుసాన్ నుంచి దూరం కావడం, మాజీ ప్రేయసి కంగనాతో గొడవలు పడటంలాంటి సమస్యలు సరేసరి! అయినా తమకు కాబోయే భర్త హృతిక్లాగా అందంగా ఉండాలంటూ ఏకంగా 70 శాతం మంది స్త్రీలు కోరుకున్నారట.   - జీవితభాగస్వామి అందంగా ఉంటే సరిపోదు కదా! నిజాయితీగా కూడా ఉండాలిగా! అందుకే 55 శాతం మంది స్త్రీలు తమకు కాబోయే భర్త షారుక్ ఖాన్ అంత నిజాయితీగా ఉండాలని కోరుకున్నారట. షారూక్ నటించిన పాత్రలు చూసే ఈ మాట అన్నారో లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్నే గమనించారో కానీ... ఆడవారిలో అధికశాతం ఆయనకే ఓటు వేశారు. నిజాయితీలో షారుక్ తరువాత స్థానాలని అజయ్ దేవగన్ (30 శాతం), ఎం.ఎస్.ధోనీ (15 శాతం) అందుకున్నారు.   - నిజాయితీ సంగతి అలా ఉంచితే మీకు ఎవరిలా కష్టపడే వ్యక్తి భర్తగా రావాలి అన్న ప్రశ్నకు విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్లాగా కష్టపడే భర్త కావాలని కోరుకుంటున్నారట. ఈ రంగంలో వీరిద్దరికీ చెరో 25 శాతం ఓట్లు దక్కాయి.   - ఇక 70వ ఒడిలో పడినా బాలీవుడ్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటున్నా అమితాబ్ ఈ జాబితాలోనూ చోటు దక్కించుకున్నారు. అది కూడా రెండు సందర్భాలలో! ఇతరులను గౌరవంగా చూడటంలో ఎలాంటి భర్తని కావాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు 50 శాతం మంది అమితాబ్కే ఓటు వేశారు. అంతేకాదండోయ్... ఇతరులను అర్థం చేసుకోవడంలో ఎలాంటి భర్త కావాలనుకుంటున్నారని అడిగినప్పుడూ ఇదే పరిస్థితి.   - స్త్రీల సంగతి అలా ఉంచితే.... యువకులు మాత్రం తమకు కావల్సిన స్త్రీ అచ్చు ‘ద్రష్టీ ధమీ’లా ఉండాలని కోరుకున్నారట. ఈ ద్రష్టీ ధమీ ఎవరో తెలుగువారికి అంతగా తెలియకపోవచ్చు. కానీ హిందీ నుంచి డబ్బింగ్ చేయబడిన మధుబాల సీరియల్లో హీరోయిన్గా ద్రష్టీ ధమీ తెలుగు తెరలకి పరిచయమే!   అదీ విషయం! మీ భర్తలో ఎలాంటి గుణాలు కావాలో ఎవరో ఒక తారతో పోల్చి చూపించండి అని అడిగినప్పుడు బయటపడిన నిజాలివి. మిగతా సర్వేలకు విభిన్నంగా ఉంది కాబట్టే దీనిని దాదాపు రెండుకోట్ల మంది వీక్షించారని భారత్ మాట్రిమోనీ సంస్థ చెప్పుకొస్తోంది.     - నిర్జర.      

CONNECTING THE DOTS

Publish Date:Mar 2, 2017

  It started before I was born. My biological mother was a young, unwed college graduate student, and she decided to put me up for adoption. She felt very strongly that I should be adopted by college graduates, so everything was all set for me to be adopted at birth by a lawyer and his wife. Except that when I popped out they decided at the last minute that they really wanted a girl. So my parents, who were on a waiting list, got a call in the middle of the night asking: "We have an unexpected baby boy; do you want him?" They said: "Of course." My biological mother later found out that my mother had never graduated from college and that my father had never graduated from high school. She refused to sign the final adoption papers. She only relented a few months later when my parents promised that I would someday go to college.   And 17 years later I did go to college. But I naively chose a college that was almost as expensive as Stanford, and all of my working-class parents' savings were being spent on my college tuition. After six months, I couldn't see the value in it. I had no idea what I wanted to do with my life and no idea how college was going to help me figure it out. And here I was spending all of the money my parents had saved their entire life. So I decided to drop out and trust that it would all work out OK. It was pretty scary at the time, but looking back it was one of the best decisions I ever made. The minute I dropped out I could stop taking the required classes that didn't interest me, and begin dropping in on the ones that looked interesting.   It wasn't all romantic. I didn't have a dorm room, so I slept on the floor in friends' rooms, I returned coke bottles for the 5¢ deposits to buy food with, and I would walk the 7 miles across town every Sunday night to get one good meal a week at the Hare Krishna temple. I loved it. And much of what I stumbled into by following my curiosity and intuition turned out to be priceless later on. Let me give you one example:   Reed College at that time offered perhaps the best calligraphy instruction in the country. Through out the campus every poster, every label on every drawer, was beautifully hand calligraphed. Because I had dropped out and didn't have to take the normal classes, I decided to take a calligraphy class to learn how to do this. I learned about serif and san serif typefaces, about varying the amount of space between different letter combinations, about what makes great typography great. It was beautiful, historical, artistically subtle in a way that science can't capture, and I found it fascinating.   None of this had even a hope of any practical application in my life. But ten years later, when we were designing the first Macintosh computer, it all came back to me. And we designed it all into the Mac. It was the first computer with beautiful typography. If I had never dropped in on that single course in college, the Mac would have never had multiple typefaces or proportionally spaced fonts. And since Windows just copied the Mac, it's likely that no personal computer would have them. If I had never dropped out, I would have never dropped in on this calligraphy class, and personal computers might not have the wonderful typography that they do. Of course it was impossible to connect the dots looking forward when I was in college. But it was very, very clear looking backwards ten years later.   Again, you can't connect the dots looking forward; you can only connect them looking backwards. So you have to trust that the dots will somehow connect in your future. You have to trust in something — your gut, destiny, life, karma, whatever. This approach has never let me down, and it has made all the difference in my life.   (This is an extract from the speech delivered by Steve Jobs in Stanford University. Steve Jobs is a famous inventor and co- founder of Apple Inc. He was diagnosed with Cancer in 2003 and succumbed to it in 2011. Steve continues to inspire generations with his life and attitude.)
  మీకు ఎప్పుడైనా ఓ మనిషిని చూడగానే ఇతని పేరు బహుశా ఫలానా అయి ఉంటుందని తోచిందా! ఇలా స్ఫురించడం కేవలం సిక్స్త్ సెన్స్ వల్ల కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మనిషి పేరుకీ అతని రూపానికీ మధ్య తగినన్ని పోలికలు ఉండవచ్చని చెబుతున్నారు. 40 శాతం ఖచ్చితంగా అపరిచిత వ్యక్తులకి సంబంధించిన పేర్లని మనం ఏమేరకు గుర్తుపట్టగలం అనే విషయాన్ని తేల్చేందుకు హిబ్రూ యూనివర్శిటీవారు ఓ పరిశోధన చేశారు. ఇందుకోసం కొంతమందికి... వారికి ఏమాత్రం పరిచయం లేని వ్యక్తుల ఫొటోలను చూపించారు. వాటితో పాటుగా ఓ నాలుగైదు పేర్లని చెప్పి, ఆ ఫొటోకి ఏ పేరు నప్పుతుందో ఊహించమని అడిగారు. ఆశ్చర్యంగా దాదాపు 40 శాతం సందర్భాలలో ఫొటోకి తగిన పేరుని సూచించారట అభ్యర్థులు. కేవలం ఊహామాత్రంగా కనుక ఇలాంటి విషయాల్ని అంచనా వేయగలిగితే అది 25 శాతానికి మించి నిజమయ్యే అవకాశం ఉండకూడదు! ఈ పరిశోదనలో తేలిన మరో విషయం ఏమిటంటే ఏ దేశంవారు, తమ దేశపౌరుల పేర్లనే ఖచ్చితంగా ఊహించగలగడం. ఉదాహరణకి పరిశోధనలో పాల్గొన్న ఫ్రెంచి పౌరులు తమ దేశానికి చెందినవారి పేర్లని మరింత సులువుగా గుర్తించారు. అలాగే ఇజ్రాయేల్ వాసులు, హిబ్రూ జాతివారి పేర్లని త్వరగా పసిగట్టారు. కారణం ఉంది లోకంలో ప్రతి జాతికీ ఓ సంస్కృతి ఉంటుంది. ఆ సంస్కృతికి అనుగుణంగానే మనం పేర్లు పెట్టుకుంటాము. వందల ఏళ్లతరబడి అలాంటి పేర్లకి అలవాటుపడటంతో... మనకి తెలియకుండానే ఆ పేర్లకి అనుబంధంగా కొన్ని లక్షణాలను ఊహించుకుంటాము. ఉదాహరణకు రాముడు అన్న పేరు ఉన్న వ్యక్తి కాస్త శాంతంగా కనిపిస్తాడనీ, లక్షణ్ అన్న పేరు వెనుక వినయం ఉట్టిపడుతుందనీ, శివ అన్న పేరు కలిగినవాడు కాస్త కోపంగా కనిపిస్తాడనీ.... రకరకాల అంచనాలు మనకి తెలియకుండానే మెదడులో తిష్టవేసుకుని ఉండిపోతాయి. చిత్రం ఏమిటంటే మనకి ఎలాగైతే ఫలానా పేరుని వినగానే ఓ రూపం గుర్తుకువస్తుందో... ఆ పేరు ఉన్న మనిషి మీద కూడా అలాంటి ప్రభావమే ఉంటుందట. ఆ ప్రభావానికి అనుగుణంగా, తనకి తెలియకుండానే కట్టుబొట్టులలో మార్పు చేసుకుంటాడట. ఇలా తలదువ్వుకునే తీరులోనూ, చూసే చూపులోనూ, కట్టుబొట్టులోనూ అతను చేసుకునే చిన్నచిన్న మార్పులు సైతం తను కనిపించే తీరు మీద ప్రభావం చూపుతాయి. రాముడు అన్న వ్యక్తి బుద్ధిగా నూనెరాసుకుని, పక్క పాపిడి తీసుకుని, బొట్టు పెట్టుకున్నాడే అనుకోండి... నిజంగా అతను రాముడే అనిపిస్తాడు. అదీ విషయం! ఊహ తెలిసినప్పటి నుంచీ మనం పెరిగే సంస్కృతి, మన చుట్టుపక్కల వాతావరణం, చదివే చదువు, స్నేహితులు, ఎదురయ్యే సమస్యలు... లాంటివన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయని ఇంతవరకూ అనుకునేవారం. కానీ ఎవరో పెట్టే పేరు కూడా మన మనస్తత్వం మీద ముద్రవేస్తుందనీ, దానికి అనుగుణంగానే మనం మారిపోతామనీ ఈ పరిశోధన రుజువుచేస్తోంది. కాబట్టి ఇక మీదట పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలండోయ్! - నిర్జర.      
    ఒకప్పుడు చైల్డ్కేర్ సెంటర్ అంటే ఏమిటో ఎవ్వరికీ తెలియదు. ఒకవేళ వాటి గురించి విన్నా... అదేదో పాశ్చాత్య దేశాలకి మాత్రమే చెందిన సంస్కృతి అనుకునేవారు. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు చైల్డ్ కేర్ కేంద్రాలు మన దేశంలోనూ కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరూ పనికి వెళ్లే సందర్భాలలో ఈ కేంద్రంలో పిల్లలను వదిలి వెళ్లవచ్చన్న భరోసా పెరిగిపోయింది. కానీ తప్పనిసరి అయితే కానీ పిల్లలను ఈ కేంద్రాలలో.... అది కూడా ఎక్కువసేపు ఉంచవద్దని అనేక పరిశోధనలు రుజువుచేస్తున్నాయి.   నార్వేకి చెందిన కొందరు పరిశోధకులు చైల్డ్ కేర్ సెంటర్లకీ పిల్లలలో ఒత్తిడికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో అని పరిశీలించారు. దీనికోసం వారు 85 చైల్డ్ కేర్ సెంటర్లలో 112 మంది పిల్లలను గమనించారు. వీరిలో 8 నుంచి 9 గంటల పాటు చైల్డ్ కేర్ సెంటర్లో గడుపుతున్న పిల్లలలో కార్టిసాల్ అనే రసాయనం చాలా ఎక్కువగా కనిపించింది. మన శరీరంలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కార్టిసాల్ ఉత్పత్తి జరుగుతుంది. పిల్లలు ఎంత ఎక్కువసేపు చైల్డ్ కేర్ సెంటర్లో గడిపితే అంత ఎక్కువగా ఈ కార్టిసాల్ పరిమాణం కనిపించింది.   చైల్డ్ కేర్ సెంటరులో ఉండే పిల్లల్లో ఇలా ఒత్తిడి పెరిగిపోవడానికి కారణం ఏమిటి అనే ప్రశ్నకు బదులిచ్చే ప్రయత్నం చేశారు పరిశోధకులు. చైల్డ్ కేర్ అయినంత మాత్రాన పిల్లలు సంతోషంగా ఉంటారన్న భరోసా ఏమీ లేదట. అక్కడ ఉండే సవాళ్లు అక్కడా ఉంటాయి. సెంటర్లోని ఇతర పిల్లలతో మెలగడం, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండటం, గుంపులో గోవిందలా బిక్కుబిక్కుమని గడపడం... లాంటి సమస్యలన్నీ వారి మనసుని క్రుంగదీస్తాయట! పసివయసు పిల్లలకి వారి కుటుంబసభ్యుల సాహచర్యం, స్పర్శ, సాంత్వన చాలా అవసరం అని ఇప్పటికే అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం వింటున్న పరిశోధన ఇదే రుజువుచేస్తోంది.   చైల్డ్ కేర్ సెంటర్లలో పిల్లల అభద్రతా భావం గురించి ఇదివరకు చాలా పరిశోధనలే జరిగాయి. పిల్లల ఉద్వేగ స్థాయి ఇంట్లో స్థిరంగానే ఉంటోందని, చైల్డ్ కేర్ సెంటర్లలో అదుపు తప్పుతోందనీ ఆయా పరిశోధనలు రుజువు చేసే ప్రయత్నం చేశాయి. చైల్డ్ కేర్ సెంటర్లలో పిల్లలను బలవంతంగా పడుకోపెట్టే పద్ధతి కూడా ఏమంత మంచిది కాదని ఈమధ్యే ఓ పరిశోధన తేల్చింది. దీని వల్ల రాత్రిపూట వారు సరిగా నిద్రపోలేకపోతున్నారనీ... తద్వారా ఎదుగుదలకి సంబంధించి అనేక సమస్యలకు లోనవుతున్నారనీ ఆస్ట్రేలియాకు చెందిన ఈ పరిశోధన నిరూపించింది.   మొత్తానికీ ఒత్తిడికీ, చైల్డ్ కేర్ సెంటర్లకీ మధ్య ఉన్న లంకెని నిరూపించిన తాజా పరిశోధనతో నార్వే తల్లిదండ్రులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే నార్వేలో రెండేళ్లలోపు పిల్లలు చాలామంది వారానికి 40 గంటల పాటు చైల్డ్ కేర్ సెంటర్లలోనే గడుపుతున్నారట. అయితే ఈ సమస్య కేవలం నార్వేది మాత్రమే అనుకోవడానికి లేదు. మన దగ్గర కూడా ఈ సంస్కృతి మొదలైంది కాబట్టి... మనమూ భుజాలు తడుముకోవాల్సిందే! మన దగ్గర ఉమ్మడి కుటుంబ సంస్కృతి ఉంది కాబట్టి, పిల్లల్ని చైల్డ్ కేర్ సెంటర్లో కాకుండా అమ్మమ్మల ఒడిలో పెంచే అవకాశం ఉందేమో ఆలోచించుకుంటే మంచిది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి సెంటర్లో చేర్పించినా... ఓ ఆరేడు గంటలకు మించి వారు అందులో మగ్గిపోకుండా చూసుకోవాలి. - నిర్జర.    
ఆడవారి కోసం రూపొందించే వస్తువులు, దుస్తులలో తప్పకుండా లేతగులాబీ రంగు (పింక్) కనిపించి తీరుతుంది. వాళ్లకి ప్రేమలేఖ రాయాలన్నా, కానుకని అందించాలన్నా కూడా అది పింక్ రంగులో ఉంటే... వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని మన నమ్మకం. దానికి అనుగుణంగానే స్త్రీలు కూడా పింక్ రంగంటే ఇష్టపడటాన్ని గమనిస్తూ ఉంటాము. ఇంతకీ ఈ నమ్మకంలో నిజం ఎంత?   ఆడవారికి గుర్తుగా పింక్ రంగునీ, మగవారికి గుర్తుగా నీలం రంగునీ ఫ్యాషన్ ప్రపంచం గుర్తిస్తోంది. ఈ ఇష్టాల వెనుక శాస్త్రీయ కారణాన్ని తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు జరిగాయి కూడా! ఉదాహరణకు ఇంగ్లండులోని  న్యూకేస్టిల్ విశ్వవిద్యాలయం వారు 2007లో ఓ ప్రయోగం చేశారు. ఇందుకోసం ఓ వేయిమంది జంటలకి కంప్యూటర్లో వేర్వేరు రంగులను చూపించారు. వీటిలో ఆడవారు ఎక్కువగా గులాబీని తలపించే ఎరుపుని ఇష్టపడుతున్నారని తేలింది. మగవారేమో నీలం రంగుని ఎంచుకుంటున్నట్లు గమనించారు.   స్త్రీలు పింక్ రంగునీ, మగవారు నీలం రంగునీ ఎంచుకోవడం వెనుక మన కుటుంబవ్యవస్థ ఏర్పడిన తీరే కారణం అని విశ్లేషించారు సదరు శాస్త్రవేత్తలు. ఒకప్పుడు ఆడవారు పండ్లని కోసుకురావడం, పిల్లల బాగోగులను గమనించుకోవడం వంటి పనులలో నిమగ్నమయ్యేవారు. మగవారేమో పొలం పనులు, వేట వంటి పనులు చేస్తుండేవారు. పండ్లని కోసేటప్పుడు బాగా ఎర్రగా పండిన పండ్ల మీదకి దృష్టి మళ్లడం సహజం. ఇక పిల్లల బాగోగులను గమనించుకునేటప్పుడు కూడా వారి మొహంలో ఎరుపుదనం మరీ ఎక్కువైనా, తక్కువైనా అది అనారోగ్యానికి చిహ్నంగా భావించి.... వారి చర్మపు రంగుని గమనించుకోవడమూ సహజమే! ఇక మగవారేమో పొలం పనులు చేసేటప్పుడూ, వేటాడేటప్పుడూ ముదురు రంగులే వారి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంటుంది. అలా కుటుంబంలోని శ్రమవిభజన వల్ల ఆడవారికీ పింక్ రంగు, మగవారికి నీలం రంగు మనసులో ఉండిపోయింది.   పింక్ రంగు, నీలం రంగు అనే తేడాలు కేవలం మనం సృష్టించుకునేవే అన్న వాదనలూ లేకపోలేదు. 19వ శతాబ్దంలో ఫలానా రంగు ఆడవారికీ, ఫలానా రంగు మగవారికీ అన్న తేడాలు ఉండేవి కావట. ప్రపంచీకరణ మొదలైన కొద్దీ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు, ఇలాంటి చిట్కాలను ప్రయోగిస్తున్నారని కొందరి భావన. ఈ విషయాన్ని నిరూపించేందుకు 2011లో ఓ పరిశోధన జరిగింది. ఇందులో-  రెండేళ్లలోపు పిల్లలు గులాబీ లేదా నీలం రంగుని ఎంచుకోవడంలో పెద్దగా పట్టింపులు చూపలేదు. కానీ రెండేళ్లు దాటిన పిల్లలు ఆడపిల్లలైతే గులాబీ రంగునీ, మగపిల్లలైతే నీలం రంగునీ ఎంచుకోవడం మొదలుపెట్టారు. పిల్లలకి ఊహ తెలుస్తున్న కొద్దీ సమాజం వారిలో గులాబీ ఆడవారికీ, నీలం మగవారికీ అని రకరకాలుగా నూరిపోయడమే దీనికి కారణం అని తేల్చారు.   ఏతావాతా తేలేదేమిటంటే- రంగుల ఎంపికలో ఆడామగా తేడా ఉండే అవకాశం ఉన్నా... మన చుట్టూ ఉన్న వ్యాపారవ్యవస్థ దానిని పెంచి పోషించింది. ఈ విషయాన్ని నిరూపించేందుకు మార్కో అనే సామాజికవేత్త గూగుల్లో లభించే కొన్ని లక్షల పుస్తకాలను స్కాన్ చేసి చూశారు. ఇందులో 1880కి ముందు ఉన్న పుస్తకాలలో గులాబీ రంగు ఆడవారికి ఇష్టమైన రంగు అన్న మాట చాలా తక్కువగా కనిపించింది. కానీ కాలం గడిచేకొద్దీ ఈ తరహా వాక్యాలు తరచూ చోటు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ పరిస్థితి కనుక మరీ హద్దు మీరితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. గులాబీ రంగు ఆడవారిది, గులాబీ రంగు స్త్రీత్వానికి సూచన... అంటూ మోత మోగించేస్తే కొన్నాళ్లకి ఆ రంగంటేనే విరక్తి పుట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.   - నిర్జర
  మాతృభాషని నెగ్గించుకోవడం ప్రభుత్వానికో, అకాడెమీలకో పరిమితమైన లక్ష్యం కాదు. మేథావులకి చేతికి వదిలి చూస్తుండిపోయే విషయమూ కాదు! అమ్మభాషని కాపాడుకోవాలి అని ప్రతి ఒక్క వ్యక్తీ, సంస్థా తన బాధ్యతగా గుర్తించి చేరుకోవాల్సిన గమ్యం. ఆ వాస్తవం గ్రహించింది కాబట్టే తెలుగువన్ ప్రారంభం నుంచీ కూడా తెలుగుభాష పట్ల నిబద్ధతతో వ్యవహరించింది. ఎవరు కలిసి వచ్చినా రాకున్నా తన వంతుగా, తెలుగు కోసం ముందుకు నడిచే ప్రయత్నం చేసింది. ఆ దిశగా కొన్ని మైలురాళ్లు ఇవీ...   తెలుగువన్ సాహిత్యం   Sahityam   ఈ డిజిటల్ యుగంలో సాహిత్యాన్ని చదివేది ఎవరు? అన్న సందిగ్థంలో సాహిత్యాన్నే డిజిటల్ రూపంలో అందించే ప్రయత్నం చేసింది తెలుగువన్. కథలు, కవితలు, బాలసాహిత్యం, బ్లాగ్స్ వంటి అక్షరసంపదను నిరంతరాయంగా అందిస్తూ వస్తోంది. ఇవే కాకుండా గ్రంథాలయం పేరుతో తెలుగు సాహిత్యంలని అరుదైన గ్రంథాలను కంప్యూటర్లోనే చదువుకునే అవకాశం కల్పిస్తోంది. నాటి మేటి రచనలను, రచయితలను నిరంతరాయంగా పరిచయం చేసే ప్రయత్నమూ చేస్తోంది. ఇక ‘తెలుగు సాహిత్యంలో హాస్యం’ అంటూ గరికపాటి ప్రేక్షకులను అలరించినా, ‘చరిత్రలో ప్రబంధపరమేశ్వరుడు’, ‘కాశీయాత్ర,’ వంటి భక్తి ధారావాహికలను అందించినా... తెలుగు అక్షరం ఉన్నంతవరకూ సాహిత్యం నిలిచి ఉంటుందని నిరూపించే ప్రయత్నం చేస్తోంది.   కిడ్స్ వన్  kidsone   ఇప్పటి పిల్లలు పట్టుమని పది కాదు కదా నాలుగు వాక్యాలు కూడా తెలుగులో చెప్పలేని పరిస్థితి. పంటికింది రాయిలాగా పదాల మధ్య ఆంగ్లం లేకుండా మాట్లాడలేని దుస్థితి. దీనికి ఎవరినో నిందించి ఉపయోగం లేదు. ప్రపంచీకరణ ఫలాలను అందుకోవాలనే అత్యాశలో మనమే ఏర్పరుచుకున్న వాతావరణం ఇది. ఇలాంటి పిల్లలకు సులువుగా, స్పష్టంగా తెలుగు తెలిసిరావాలంటే వారి దారిలోనే నడవాలని గుర్తించింది తెలుగువన్. అందుకోసం కిడ్స్వన్ పేరుతో ఓ అనుబంధ వెబ్సైటుకి రూపకల్పన చేసింది. ఇందులో కంప్యూటర్ ద్వారానే పెద్దబాలశిక్షని నేర్చుకునే సదుపాయం కల్పించింది. తెలుగు అక్షరాలను ఆటల రూపంలో అందించింది. తెలుగు పట్ల మక్కువ ఏర్పడేలా వందలాది కథలూ, పద్యాలకు దృశ్యరూపాన్ని ఇచ్చింది. తెలుగు సంస్కృతినీ, శతకసాహిత్యాన్ని కూడా పిల్లలకు అందించేలా వీడియోలను రూపొందించింది. తరం తరువాత తరానికి తెలుగుని పరిచయం చేసే ఏ ప్రయత్నాన్నీ కిడ్స్వన్ వదులుకోలేదు.   టోరీ  TeluguOne Radio TORi   రెండు వందల దేశాలు. ఎనిమిదికోట్లకు పైగా తెలుగువారు. వీరందరి మధ్యా ఆత్మీయవారధిగా నిలిచే ప్రయత్నం తెలుగువన్ రేడియోది (TORI). తెలుగు భాష పట్ల అనురక్తి తగ్గిపోవడంతో... వారి నట్టింటి నెట్లోనే నిత్యం తెలుగుని వినిపించేందుకు మొదలైన మాధ్యమం ఇది. సాధారణ ఎఫ్.ఎమ్ రేడియోలకి భిన్నంగా స్వచ్ఛమైన తెలుగులో స్వరాలు వినిపించే ప్రయత్నం టోరీది. సాహిత్యం దగ్గర నుంచీ సైనికుల భావాల వరకూ ప్రతి ఒక్క రంగాన్నీ స్పృశించే యత్నం టోరీది. అందుకనే భారతదేశంలోనే తొలి పది ఇంటర్నెట్ రేడియోలలో ఒకటిగా టోరీ నిలుస్తోంది. ఏ దేశమేగినా తెలుగు పదం వినిపించే అవకాశం కల్పిస్తోంది.                     - నిర్జర.  
  మంచులా చల్లబడిపోయిన దుప్పటి మీద నడుం వాల్చాలంటే చిరాకే! మనకే ఇలా ఉంటే రక్తం గడ్డకట్టేంత చలి ఉండే పాశ్చత్య దేశాల పరిస్థితి చెప్పేదేముంది. అందుకనే వాళ్లు తమ మంచాలను వెచ్చగా ఉంచేందుకు రకరకాల bed warming పరికరాలను వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఓ యువతి మీ మంచాన్ని నేను వెచ్చగా ఉంచుతానంటూ విభిన్నమైన సేవను అందచేస్తోంది. రష్యాకు చెందిన ‘విక్టోరియా ఇవాచ్యోవా’ ప్రపంచంలోనే తొలి ‘human bed warmer’గా పేరు తెచ్చుకొంది. ఎవరన్నా క్లైంట్లు తమ మంచాన్ని వెచ్చపరచమంటూ విక్టోరియాను సంప్రదించగానే... ఆమె నిర్దిష్ట సమయానికి అక్కడికి చేరుకుటుంది. పైజమా వేసుకుని ఓ గంటసేపు క్లైంట్ మంచం మీద పడుకొని, పక్క వెచ్చబడేలా చేస్తుంది. ఆ గంటసేపూ కావాలంటే క్లైంట్ కూడా ఆమె దగ్గరే కూర్చుని ఏమన్నా కబుర్లు చెప్పవచ్చు. తమ బాధలు పంచుకోవచ్చు. కానీ ఆ సంభాషణ శృతి మించకుండా ఉండేలా విక్టోరియా జాగ్రత్తపడుతుంది. క్లైంట్ ఏదన్నా హద్దుమీరి ప్రవర్తిస్తే బయటపడేందుకు ఆమె తన దగ్గర ఓ అలారంను కూడా సిద్ధంగా ఉంచుకుంటుంది.   వినడానికి విచిత్రంగా ఉన్నా విక్టోరియా సేవల కోసం ఎగబడేవారి సంఖ్యలో ఏమాత్రం లోటు లేదు. అందుకు ఆమె వసూలు చేసే ఫీజూ తక్కువేమీ కాదు. ఒక గంటసేపు మంచం మీద పడుకునేందుకు ఆమె అక్షరాలా 5 వేల రూపాయలు చార్జ్ చేస్తుంది. ఇక రోజుకి గంటపాటు, నెలంతా సేవలు అందించాలంటే లక్షరూపాయలకు పైమాటే వసూలు చేస్తుంది. విక్టోరియా ఫీజులు చూసి కూడా క్లైంట్లు వెనక్కి తగ్గకపోవడం ఆశ్చర్యకరం. పైగా చాలారోజుల తరువాత సుఖంగా నిద్రపోయానని ఒకరంటే, పొద్దున నిద్ర లేచిన తరువాత జీవితం మీద కొత్త ఆశలు మొదలయ్యాయి అని మరొకరు మురిసిపోయారు. ఇలా తన సేవల కోసం తపించిపోయేవారి కోసం విక్టోరియా www.she-is-generator.ru/ పేరుతో ఒక వెబ్సైటుని కూడా ప్రారంభించి, ఆన్లైన్ సేవలను అందిస్తోంది.     విక్టోరియా చేస్తున్న పని మనకు వింతగా కనిపించవచ్చు. కానీ తను విజయం అయితే సాధించింది కదా! ఎవరూ ఊహించని రంగంలో అడుగుపెట్టి తనకంటూ ఓ బాట వేసుకుంది కదా! ఇలా Human bed warmingను ఓ వ్యాపారంలా మార్చేందుకు తను చదివిన ఓ పుస్తకమే ప్రేరణగా నిలిచిందని చెబుతోంది విక్టోరియా. ఆ పుస్తకంలో ఓ రచయిత వద్ద పనిచేసే టైపిస్టు, తన యజమానికి త్వరగా నిద్రపట్టేందుకు తను కాసేపు అతని మంచం మీద పడుకునేదట. నవల్లో ఉన్న ఆ విషయాన్ని నిజం చేయాలనుకుంది విక్టోరియా! పైగా తను మంచం మీద పడుకోవడం వల్ల తనలోని సానుకూలమైన విద్యుత్ తరంగాలు మంచానికి బదిలీ అవుతాయని చెబుతోంది. అన్నింటికీ మించి... సదరు మంచం మీద ఒరిగిన వెంటనే క్లైంట్లు ఆ వెచ్చదనానికి గాఢంగా నిద్రపోతారని హామీ ఇస్తోంది. - నిర్జర.    

అందరికి టెస్ట్‌ చేయ‌డం ఆచరణ సాద్యం కాదు!

ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.

ఆదాయమైన వదులుకుంటా, జనం ప్రాణాలు నాకు ముఖ్యం

* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.

చంద్రబాబు సైకాలజీ పై సైంటిస్ట్ పేర్ని నాని రిపోర్ట్

* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.

ఆర్టీఏ ఆఫీసులో ప్ర‌త్య‌క్ష‌మైన ప్ర‌భాస్‌!

  నాలుగు నెల‌ల కాలం పైనుంచే సినీ స్టార్లెవ‌రూ బ‌య‌ట క‌నిపించ‌డం లేదు. క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి నిరోధంలో భాగంగా అమ‌ల్లోకి వ‌చ్చిన నిబంధ‌న‌ల‌తో పాటు ఇంట్లో ఉండండి.. క్షేమంగా ఉండండి అనే స్లోగ‌న్ కూడా దీనికి కార‌ణం. యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌కు కూడా ఇది వ‌ర్తిస్తుంది. అలాంటిది అత‌ను బ‌య‌ట‌కు వ‌చ్చాడంటే.. అందునా జ‌నంలోకి వ‌చ్చాడంటే వాళ్ల‌కు ఎంత సంబ‌రం! అదే అనుభ‌వంలోకి వ‌చ్చింది ఖైర‌తాబాద్‌లోని ఆర్టీఏ ఆఫీసుకు వ‌చ్చిన వాళ్ల‌తో పాటు, అక్క‌డి సిబ్బందికి కూడా. త‌మ అభిమాన పాన్ ఇండియా స్టార్‌ను చూడ‌గానే ఒక్క‌సారిగా సంభ్ర‌మం చెందిన వాళ్లంతా త‌మ సెల్‌ఫోన్‌ల‌కు ప‌ని క‌ల్పించి అత‌డిని ఫొటోలు తీయ‌డానికి ఎగ‌బ‌డ్డారు. లాక్‌డౌన్ కాలం నుంచీ ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చినా మాస్క్ వాడ‌ట‌మ‌నే క‌నీస నిబంధ‌న‌ను తూచా త‌ప్ప‌కుండా పాటిస్తూ వ‌స్తోన్న ప్ర‌భాస్‌.. ఇప్పుడు కూడా మాస్క్ ధ‌రించి ప‌ర్స‌న‌ల్ వ‌ర్క్ మీద ఆర్టీఏ ఆఫీసుకు వ‌చ్చాడు. బ్లాక్ ష‌ర్ట్‌, వైట్ అండ్ బ్లూ క‌ల‌నేత ట్రౌజ‌ర్ ధ‌రించాడు. షూటింగ్ లేక‌పోయినా, ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వ‌స్తున్నా బ‌రువు పెర‌గ‌కుండా చూసుకుంటున్నాడ‌ని అత‌డి ఫిజిక్ చూస్తే అర్థ‌మైపోతోంది. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ డైరెక్ష‌న్‌లో రాధే శ్యామ్ మూవీ చేస్తున్నాడు.

శృతి హాసన్ ఇవ్వబోయే సర్‌ప్రైజ్ అదే!

శృతి హాసన్ హీరోయిన్ మాత్రమే కాదు... ఆమెలో సంగీత కళాకారిణి కూడా ఉన్న సంగతి తెలిసిందే. శృతి మంచి సింగర్. అలాగే, మ్యూజిక్ డైరెక్టర్ కూడా! తండ్రి కమల్ నటించిన 'ఈనాడు'కి ఓ పాట కంపోజ్ చేసి ఇచ్చారు. లేటెస్టుగా లాక్‌డౌన్‌లో కొత్త మ్యూజిక్ ప్రొడ్యూస్ చేయడం మీద కాన్సంట్రేట్ చేశారు. కొన్ని రోజులుగా ఈ నెల 8న ఒక సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఉందని శృతి హాసన్ అభిమానులు, ప్రేక్షకులను ఊరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సర్‌ప్రైజ్ ఏంటంటే... కొత్త సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు.  'ఎడ్జ్' పేరుతో శనివారం శృతి హాసన్ ఒక ఒరిజినల్ ట్రాక్ (సాంగ్) రిలీజ్ చేయనున్నారు. మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలనే థీమ్‌తో ఈ సాంగ్ రూపొందించారట. ఈ పాటను శృతి హాసన్ రాయడంతో పాటు పాడారు. సిద్ధీ పటేల్‌తో కలిసి వీడియో షూట్ చేశారు. అందులో ఆమె నటించారు. ఈ సాంగ్ కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

రానాను పెళ్ళికొడుకు చేసేది ఈరోజే

దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. రానా పెళ్లి సందడి మొదలు కావడంతో దగ్గుబాటి ఫ్యామిలీ అంతా ఫెస్టివల్ మోడ్‌లో ఉంది. రెండు రోజుల క్రితం రానాకు కాబోయే శ్రీమతి మిహీకా బజాజ్ ఇంట పసుపు-కుంకుమ వేడుక జరిగింది. దానికి రానా సహా ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పెళ్ళికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. శనివారం పెళ్లి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ రోజు రానాను పెళ్ళికొడుకు చేయనున్నారు.  తెలుగు సంప్రదాయాల ప్రకారం శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు రానాను పెళ్ళికొడుకు చేయనున్నారు. అయితే, తోడు పెళ్ళికొడుకు లేకుండా ఈ శుభకార్యం జరగొచ్చని రానా తండ్రి సురేష్ బాబు తెలిపారు. సాధారణంగా కుటుంబ సభ్యులలో చిన్నపిల్లలను తోడు పెళ్లికొడుకుగా కూర్చోబెడతారు. దగ్గుబాటి ఫ్యామిలీలో చిన్న పిల్లలు ఎవరు లేరు. కరోనా నేపథ్యంలో ఇతర ప్రాంతాలలో ఉన్న బంధువులు పెళ్ళికి వచ్చే పరిస్థితి లేదు. అందుకని, రానా పక్కన తోడు పెళ్లి  కొడుకు లేకుండా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పెద్దగా హడావిడి లేకుండా చిన్నగా, సంతోషంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు.

150 రోజులుగా కాలు బ‌య‌ట‌పెట్ట‌ని మ‌మ్ముట్టి!

  దేశంలో లాక్‌డౌన్ స‌డ‌లింపులు వ‌చ్చేసినా, మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి మాత్రం స్వ‌యంగా కొత్త లాక్‌డౌన్ నిబంధ‌న‌లు విధించుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఆయ‌న త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఇప్ప‌టికి 150 రోజులై పోయిందంట‌. ఆ విష‌యాన్ని మ‌మ్ముట్టి కుమారుడు, 'మ‌హాన‌టి'లో జెమినీ గ‌ణేశ‌న్‌గా న‌టించిన దుల్క‌ర్ స‌ల్మాన్ వెల్ల‌డించాడు. మార్చిలో కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించిన రోజు నుంచీ ఇప్ప‌టి దాకా త‌న తండ్రి ఇంట్లో నుంచి బ‌య‌ట అడుగుపెట్ట‌లేద‌ని దుల్క‌ర్ తెలిపాడు. సొంత ల‌క్ష్యాల‌ను నిర్దేశించుకోవ‌డం మమ్ముట్టికి ఇష్టంలా అగుపిస్తోంది. బ‌య‌ట‌కు రాకుండా ఇంట్లోనే ఎంత కాలం ఉండ‌గ‌ల‌నో చూసుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో ఆయ‌న త‌న ఫొటోగ్ర‌ఫీ హాబీని కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. కారులో బ‌య‌ట‌కు తీసుకెళ్తాన‌ని తాను చెప్పినా తండ్రి నిరాక‌రించార‌ని కూడా దుల్క‌ర్ వెల్ల‌డించాడు. మ‌మ్ముట్టి నిబ‌ద్ధ‌త‌కు సెల్యూట్ చెయ్యాల్సిందే. ఈ ఏడాది లాక్‌డౌన్‌కు ముందు 'షైలాక్' సినిమాలో న‌టించిన ఆయ‌న ప్ర‌స్తుతం 'ద ప్రీస్ట్' అనే మూవీలో న‌టిస్తున్నారు.

సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై కేసు పెట్టిన సిబిఐ

బాలీవుడ్ లేటెస్ట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మర్డర్ మిస్టరీ మరో కొత్త మలుపు తీసుకుంది. అతను ఆత్మహత్య చేసుకున్నప్పటినుంచీ హీరోయిన్ రియా చక్రవర్తిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలు సైతం ఆమెను అభిమానించేలా చేస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే..‌. సుశాంత్ కుటుంబ సభ్యులు సహా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేసులో సీబీఐ విచారణ కోరడంతో కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ రంగంలోకి దిగిన సిబిఐ విచారణ మొదలు పెట్టింది. సుశాంత్ డైరీలో కొన్ని పేజీలు మిస్సింగ్ అయినట్టు గుర్తించింది. అందుకు రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసింది. ఆమెతో కుటుంబ సభ్యులు సహా మరో ఐదుగురిపై కేసు పెట్టారు. మిస్ అయిన పేజీలను రియా చేసినట్టు పలువురు అనుమానిస్తున్నారు. సుశాంత్ కి ‌ తమను ను దూరం చేసినట్టు ఇప్పటికే అతని కుటుంబ సభ్యులు రియా చక్రవర్తిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.‌ సుశాంత్ బ్యాంకు ఖాతాలో డబ్బులను అక్రమంగా ఇతర ఖాతాలకు మళ్ళించి ఉందనే ఆరోపణలు సైతం ఆమెపై ఉన్నాయి.

రాజకీయాలకు బలౌతున్న ఐఏఎస్ అధికారులు

ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.

ఆంధ్ర లో బీజేపీ 'పంచ్' తంత్రం...

  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

ఏపీలో వంద కోట్ల దందా.. రియల్ క్రైమ్ స్టోరీ

సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  

క‌విత‌, ష‌ర్మిలా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.

అధికారంలో ఉంటే ఒకలా... ప్రతిపక్షంలో ఉంటే మరోలా... వైజాగ్ ఎపిసోడ్ నీతి ఏంటి?

రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.

రాజీవ్ గాంధీ మరణించాక ఆ సీక్రెట్ బయటపెట్టిన వాజపేయి!!

అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!

ట్రంప్ గారి వ్యాక్సిన్ వచ్చేది అప్పుడేనట..

ప్రపంచం మొత్తం కరోనా తో సతమతమౌతూ వ్యాక్సిన్ ఎపుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా దీని పై స్పందించారు. కరోనా కు రోజులు దగ్గర పడుతున్నాయని, నవంబర్ 3 నాటికి ఈ వైరస్ ను అంతం చేసే వ్యాక్సిన్ అమెరికా చేతిలో ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గురువారం నాడు ఓ రేడియో కార్యక్రమం ద్వారా మాట్లాడిన ఆయన, అమెరికా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ సమాచారాన్ని చైనా దొంగిలించిందా అనే విషయం పై స్పందిస్తూ తాను ఆ విషయాన్ని చెప్పలేనని ఐతే అది చైనాకు సాధ్యమయ్యే పనేనని నమ్ముతున్నానని అయన వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ తయారీలో అమెరికా సంస్థలు ముందంజలో ఉన్నాయని ఆయన అన్నారు.   ఐతే అమెరికాలో ప్రెసిడెంట్ ఎన్నికలు కూడా నవంబర్ 3నే జరగనున్న నేపథ్యంలో నవంబర్ తొలివారంలోనే వ్యాక్సిన్ యూఎస్ వద్ద ఉంటుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికలను ఉద్దేశించి చేసారని అయన ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. ఇది ఇలా ఉండగా ఇప్పటి వరకు అమెరికాలో కరోనా కేసుల సంఖ్య దాదాపు 50 లక్షలకు చేరుకోగా, 1.61 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు.

కరోనాతో టీటీడీ అర్చకుడి కన్నుమూత

ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతి రోజు దాదాపు 10 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. అక్కడ ఇక్కడ అని లేకుండా అన్ని ప్రాంతాలను కరోనా చుట్టేస్తోంది. ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల కొండపై కూడా కరోనా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలువురు అర్చకులు కరోనా బారిన పడ్డారు. ఐతే వీరిలో కొందరు కోలుకోగా తాజాగా కరోనా రక్కసి కారణంగా అర్చకుడు ఎన్వీ శ్రీనివాసాచార్యులు కన్నుమూశారు. ఆయన వయసు 45 సంవత్సరాలు. నాలుగు రోజుల క్రితం ఆయన కరోనా సోకగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అయన వాస్తవానికి తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయంలో అర్చకులుగా ఉన్నారు. ఐతే డిప్యుటేషన్ పై తిరుమలకు వచ్చారు.

అమరావతిపై క్లారిటీ అడిగిన నేతపై వేటు వేసిన ఏపీ బీజేపీ

సోము వీర్రాజుకు ఏపీ బీజేపీలో ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. తాజాగా ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి అయన దూకుడు మరింత పెంచారు. హైకమాండ్ ఎటువంటి ఆదేశాలు ఇస్తుందో వాటిని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ పాటించాలని లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఇందులో ఎటువంటి మొహమాటం ఉండదని అయన స్పష్టం చేస్తున్నారు.   తాజాగా ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం విషయంలో మొదటి నుండి అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని దానికి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని ఐతే పార్టీపరంగా మాత్రం మేము అమరావతికి మద్దతు తెలుపుతామని సోము వీర్రాజు చెప్పడం తెలిసిందే. ఈ విషయం ఇలా ఉండగానే ఏపీ రాజధాని అంశంపై బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు డాక్టర్ ఓ వి రమణ "మూడుముక్కలాట తో నష్టపోతున్న బీజేపీ" అంటూ ఇటీవల ఓ ప్రముఖ తెలుగు దిన పత్రికలో వ్యాసం రాశారు. దీంతో ఆగ్రహించిన సోము వీర్రాజు ఆ వ్యాసం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటించి ఓవీ రమణ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసారు   ఐతే ఆ వ్యాసంలో డాక్టర్ రమణ రాసింది ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడు గా ఉన్న సమయం వరకు అమరావతి రాజధాని కి బీజేపీ అనుకూలంగా ఉందని దీక్షలు చేశారు మీడియా సమావేశాలు పెట్టి భారీ డైలాగులు వేశారు. అయితే అధ్యక్షుడు మారిపోగానే.. రాష్ట్ర రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని, అదే సమయంలో పార్టీ వేరు కేంద్ర ప్రభుత్వం వేరని కొత్తగా వ్యాఖ్యానాలు చేస్తున్నారని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇదే సమయంలో అమరావతి ప్రజల తరుఫున పోరాడతామని కొత్త అధ్యక్షులు చెపుతున్నారని పేర్కొన్నారు. దీంతో రాజధాని పై స్పష్టత లేని బీజేపీ పైన ప్రజలలో ఉన్న నమ్మకం పూర్తిగా పోతోందని దానితో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా అయోమయం లో పడ్డారని అందులో పేర్కొన్నారు. తాజాగా ఆ ప్రాంత రైతులు పోరాటం చేస్తున్నదే రాజధాని కోసం అయినప్పుడు, మరి రాష్ట్ర బీజేపీ మద్దతు దేనికి ఇస్తున్నట్లు? ఈ గందరగోళం వల్ల విలువలతో కూడిన బీజేపీ ని ప్రజలు శంకించే పరిస్థితి ఏర్పడిందని ఓ వి రమణ ఆ వ్యాసంలో ఏపీ బీజేపీని సూటిగా ప్రశ్నించారు. దీంతో సోము వీర్రాజు వెంటనే రమణ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.

5 Reasons Why You Need Soy Daily

1. It is proved to be the only natural supplement that can cure chronic diseases like heart, cancer, diabetes, kidney problems, liver problems and osteoporosis. It effectively takes care of menopause and PMS symptoms. It is a natural estrogen that reduces the risk of post menopausal disease. Those women who include soy in their daily diet will have reduced chances of suffering from hormonal replacements. 2. Soy protein is the most recommended protein as it is rich in amino acids. For the body development, proteins (essential amino acids) are very highly necessary. Generally, to assimilate protein, the organs like kidney and bones (for calcium) have to work hard. This gradually may lead to bone related and kidney related ailments. Soy delivers calcium that strengthens bones and increases density. 3. Soy is an immune booster. The peptides in soy beans boost immune system and acts like a power shield against diseases. It also contains vitamins and minerals that are rare and are not found in other supplements. It is the best detox and cleans liver. From treating bronchitis to nasal congestion to allergies. Soy benefits even those suffering from respiratory disorders. 4. One of the special nutrient in soy is the antioxidant called isoflavones. The benefits of isoflavones is worth mentioning. It prevents cell damage (cancerous) caused due to free radicals. Isoflavones also prevent aging (premature aging) and reduce the blood cholesterol levels. 5. Soy benefits beauty. It strengthens hair (prevents hair fall) and also prevents aging of skin. The proteins in soy tighten, soften and bring youthful glow to skin. It also improves complexion and will keep a check on body weight (soy slimming diet). The fiber in soy provides a sensation of fullness thus preventing over intake of food. The lecithin in soy improves memory and develops concentration. All in all the best organic food supplement.  

Fitness at 50

    Being fit and healthy has nothing to do with age and becomes all the more important as you age. Some women might have never exercised before and with the onset of menopause they start facing the problems of creaking knees , fatigue and other symptoms of aging. Then they consult doctors and are put onto a specific exercise regimes and diet plans. One is never too old to exercise and whether you have been exercising all your life, or have started recently due to new-found problems ,with help of exercise and a good diet you can age gracefully, cope with the symptoms of menopause and prevent serious diseases in the coming future. Exercise ward off  unhappy side effects of getting older. A study in the 2010 issue of “Obstetrics and Gynecology International” found that women between the ages of 45 and 65 who included both resistance and aerobic exercise three times per week for eight weeks experienced a decrease in menopausal symptoms and feelings of depression while experiencing better psychological health and quality of life. After the age of 50, you are also susceptible to bone weakening – often caused by osteoporosis. Strength training and weight-bearing cardiovascular exercise, such as walking, jogging or hiking, can help you maintain bone density and prevent frailty. Cardiovascular Exercise Walking, cycling and swimming are great ways to get your heart pumping and set the cardiovascular activity. These high impact exercises should be done carefully depending on your health conditions. If you have knee problems or osteoporosis it is better to go easy with the intensity of these exercises. Strength Training Aim for at least two strength-training sessions per week and perform them on non-consecutive days. These sessions should target most major muscle groups, including the legs, hips, back, abdomen, chest, shoulders and arms, using your own body weight, dumbbells, machine weights or resistance bands. Doing Yoga also counts as strength training. Allow yourself one or two rest days from cardiovascular activity per week. Flexibility Flexibility is an important component of fitness that should be regularly included in your program, as you tend to lose flexibility as a result of inactivity and the natural aging process. Stretching regularly helps keep your muscles and joints flexible so you continue to have freedom of movement and good posture. Hold a stretch for each of the major muscle groups for 15 to 30 seconds for added benefits. Fitness Plan Before embarking on any fitness routine, please consult your doctors beforehand. If you are exercising for the first time do it slowly and with a 10 minute increment. For example, instead of going for 30 minutes of power walking all at once – go for 10-minute walks before breakfast, around lunchtime and after dinner .If you have joint pains, consider using an elliptical machine rather than a treadmill. Other low-impact options include swimming and cycling. Take the help of professionals or certified instructors either by going to the gym or calling them home  

A Harmful Cup Of Tea!

Most people in India and in some other parts of the world, like to start their day with a delicious cup of tea. This is supported by the health benefits associated with having tea. But, its time people know the other side of the story. Tea is not as good as you may think it is. Most often it causes harm than doing good. Doctors agree with this claim after conducting a survey on people who drink tea, all over India. Research has revealed that over consumption of this beverage over many years, results in severe anemia. This is why instances of anemia are greater in the eastern part of the country, than elsewhere. In fact the trend of low hemoglobin starts in the east with 52.4% of the population suffering from anemia, followed by 48.6% in north, 39.3% in west and 27% in south. Coffee being the popular beverage in the southern region, people there are the least effected. Low hemoglobin is a direct result of lack of absorption of iron by the body. Having excessive amounts tea, prevents your body from absorbing the required amount of iron. Doctors say that tannins in tea bind with iron and stop the absorption process. Earlier it was believed that women were at a greater risk of being anemic because of menstruation and the habit of being the last one to eat in the family. However, this underwent a change because of the improvement in their social status and a drastic increase in the consumption of tea. Now the men are also equally at risk. So, next time you pick up a cup of tea, ask yourself if your ready to be deprived of iron. Kruti Beesam
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.