Publish Date:Jan 24, 2014
Publish Date:Jan 24, 2014
Publish Date:Jan 24, 2014
Publish Date:Jan 23, 2014
Publish Date:Jan 23, 2014
Publish Date:Jan 22, 2014
Publish Date:Jan 22, 2014
Publish Date:Jan 21, 2014
Publish Date:Jan 21, 2014
Publish Date:Jan 21, 2014
Publish Date:Jan 21, 2014
Publish Date:Jan 20, 2014

EDITORIAL SPECIAL
తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది.  టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ALSO ON TELUGUONE N E W S
  నితిన్ టైటిల్ రోల్ చేసిన 'భీష్మ' సూపర్ హిట్ రేంజిలో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వైజాగ్‌లో ఫిబ్రవరి 29న థాంక్స్ మీట్ ఏర్పాటు చేశారు నిర్మాతలు. దీనికి చీఫ్ గెస్ట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్ హాజరవుతుండటం గమనార్హం. వైజాగ్‌లోని సిరిపురంలో ఉన్న గురజాడ కళాక్షేత్రంలో 29 సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను నిర్వహించనున్నారు. 'భీష్మ' విడుదలకు ముందు ప్రి రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించిన నిర్మాతలు, ఇప్పుడు సినిమా పెద్ద హిట్ కావడంతో, దాన్ని ప్రజల ముందు సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వైజాగ్‌ను వేదికగా ఎంపికచేశారు.  నిజానికి చీఫ్ గెస్ట్‌గా పవన్ కల్యాణ్‌ను పిలిచారు కానీ, ఆయన కొన్ని కారణాల రీత్యా రాలేనని చెప్పారు. దాంతో అదే ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్‌ను ఆహ్వానించారు. పవన్‌కు నితిన్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. సినిమా విడుదలయ్యాక నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల, ప్రొడ్యూసర్ నాగవంశీ ముగ్గురూ పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లడం, ఆయన వారిని అభినందించడం తెలిసిందే. ఐదు రోజుల్లోనే బ్రేకీవెన్ సాధించిన 'భీష్మ' ఓవర్సీస్‌లోనూ దూసుకుపోతోంది. రష్మికా మందన్న నాయికగా నటించిన ఈ మూవీ నితిన్ కెరీర్‌లో 'అ ఆ' తర్వాత రెండో స్థానంలో నిలవడం ఖాయం.
  ప్రస్తుతం 'ఓ డియర్' మూవీ చేస్తోన్న ప్రభాస్, దాని తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌తో సినిమా నిర్మిస్తున్నట్లు వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ ప్రకటించారు. రెండే రెండు సినిమాలు.. 'ఎవడే సుబ్రమణ్యం', 'మహానటి'లతో నాగ్ అశ్విన్ కీర్తి ప్రతిష్ఠలు దేశవ్యాప్తమయ్యాయి. సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన 'మహానటి' అయితే ఏకంగా మూడు జాతీయ అవార్డులు సాధించింది. చిరంజీవి సైతం అప్పట్లో అతని డైరెక్షన్‌లో సినిమా చెయ్యాలనుకుంటున్నట్లు చెప్పారు. దానికు అనుగుణంగా 'మహానటి' తర్వాత అతను చిరంజీవి కోసం ఒక స్క్రిప్ట్ రూపొందిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి.  అశ్వినీదత్ కూడా చిరంజీవితో ఒక సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. టైమ్ ట్రావెల్ కథతో నాగ్ అశ్విన్ తయారుచేసిన ఆ స్క్రిప్ట్.. ఇప్పుడు ప్రభాస్ చేతికి వచ్చిందని వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ వినిపించగానే ప్రభాస్‌కు బాగా నచ్చేసిందనీ, వెంటనే ఓకే చెప్పేశాడనీ అంటున్నారు. అయితే చిరంజీవి చేయాల్సిన ఆ ప్రాజెక్ట్ ప్రభాస్‌కు ఎందుకు వెళ్లిందనే దానిపై క్లారిటీ లేదు. మొదట ఆ స్క్రిప్టును చిరంజీవికే వినిపించారనీ, కానీ అది తనకంటే ప్రభాస్‌కు బాగా సూట్ అవుతుందని ఆయన సూచించడం వల్లే ప్రభాస్ వద్దకు నాగ్ అశ్విన్ వెళ్లాడంటూ ఒక ప్రచారం నడుస్తోంది. అందులో నిజం ఎంతుందో తెలియరాలేదు. 2021లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది.
  సంక్రాంతికి విడుదలైన 'అల.. వైకుంఠపురములో' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎంత వసూలు చేసిందనే దానిపై కాంట్రవర్సీ నడుస్తున్నప్పటికీ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్టయ్యిందనే విషయంలో కాంట్రవర్సీ లేదు. ఈ మూవీన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణతో పాటు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామి. 'అల.. వైకుంఠపురములో' మూవీని 'ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్' అని కొండంత అక్షరాల్లో, దాని పక్కనే 'నాన్-బాహుబలి2' అంటూ కంట్లో నలకలంత చిన్న అక్షరాలతో భారీ ఎత్తున ప్రచారం చేయడం వెనుక ఉన్న వ్యక్తి అరవింద్ అనే విషయం కూడా ప్రపంచానికంతటికీ తెలుసు.  ఆ విషయం అలా ఉంచితే, ఈ సినిమా అమెజాన్ లేదా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కాదని డిస్ట్రిబ్యూటర్లకు గతంలో నిర్మాతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకే యు.ఎస్. డిస్ట్రిబ్యూటర్లు 'అల వైకుంఠపురములో' మూవీ ఆ రెండు ప్లాట్‌ఫామ్స్‌పై స్ట్రీమింగ్ కాదంటూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఓటీటీలో సినిమా వస్తుందని తెలిస్తే, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందనే భయం డిస్ట్రిబ్యూటర్లలో ఉంటుంది. ప్రధానంగా ఓవర్సీస్‌లో ప్రేక్షకులు థియేటర్ల కంటే ఓటీటీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ ఫిబ్రవరి 26న ఇండియాలో ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యక్షమవడంతో డిస్ట్రిబ్యూటర్లతో పాటు, బన్నీ ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. నిజానికి ఈ మూవీ జెమిని టీవీకి చెందిన స్ట్రీమింగ్ చానల్ సన్ నెక్స్ట్‌లో 26న స్ట్రీమింగ్ కావాలి. ఆ మూవీ డిజిటల్ హక్కులు కొనుగోలు చేసింది ఆ చానలే. కానీ దానికంటే ముందు నెట్‌ఫ్లిక్స్‌లో ఆ సినిమా స్ట్రీమింగ్ కావడంతో అంతా హతాశులయ్యారు. యు.ఎస్. డిస్ట్రిబ్యూటర్లయితే అల్లు అరవింద్‌పై కారాలు మిరియాలు నూరుతున్నట్లు సమాచారం. ఎందుకంటే యు.ఎస్.లో ఆ మూవీ ఇంకా ఆడుతూనే ఉంది. అక్కడ ఈ రోజు రాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. ఓటీటీలో ఈ సినిమా ప్రత్యక్షమయితే కలెక్షన్లపై అది తీవ్ర ప్రభావం పడుతుందని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. మరోవైపు సంక్రాంతికే విడుదలైన మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' ఇంకా ఓటీటీలో దర్శనమివ్వలేదు. ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. మార్చి 2న ఆ చానల్లో 'సరిలేరు నీకెవ్వరు' స్ట్రీమింగ్ అవుతుందనే విషయం ప్రచారంలోకి వచ్చింది కానీ, అది కన్ఫాం కాలేదు. మార్చి 2న కాకపోతే 6న స్ట్రీమింగ్ అవుతుందని కూడా ఇంకో ప్రచారం నడుస్తోంది. ఏదేమైనా 'సరిలేరు నీకెవ్వరు' కంటే తమ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని చెప్పుకుంటూ వచ్చిన బన్నీ ఫ్యాన్స్, ఇప్పుడు ఆ సినిమా కంటే ముందే 'అల వైకుంఠపురములో' ఓటీటీపై ప్రత్యక్షం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ థియేటర్ల నుంచి షేర్ వస్తుండగా, ప్రొడ్యూసర్లు ఇలా చేయడం ఏమిటంటూ వాళ్లు ఫైర్ అవుతున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు లేటు వయసులో ఘాటుగా పెళ్లి చేసుకోనున్నాడని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ కోడై కూస్తోంది. ఆయన ఎవరిని పెళ్లి చేసుకోనున్నాడు? ఆ అమ్మాయి ఎవరు? ఆయన పెళ్లి పై ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారు? తదితర ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ ఇంగ్లీష్ డైలీ పేపర్ డెక్కన్ క్రానికల్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మొన్న మంగళవారం ఆయన పెళ్లి చేసుకున్నాడు అనే వార్త రాసింది. దీనిపై దిల్ రాజు టీమ్ మండిపడింది. ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదని ఘాటుగా ఆ పత్రిక వాళ్లకు ఒక ప్రెస్ నోట్ పంపింది. మీ కరస్పాండెంట్ కి ఇదే విషయం చెప్పినా ఎందుకు వార్త రాశారని ఘాటుగానే అడిగారు. ఈ క్రమంలో ఒక విషయం కన్ఫామ్ చేశారు. అదేంటంటే.... కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ తో ఆయన పెళ్ళికి రెడీ అవుతున్నారు అని! సో... కుమార్తె నుండి గాని, ఇతర కుటుంబ సభ్యుల నుండి గాని పెళ్లి విషయంలో దిల్ రాజుపై ఎటువంటి అభ్యంతరాలు లేవన్నమాట. అదే సమయంలో మూడేళ్లుగా దిల్ రాజు ఒంటరిగా ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజెంట్ దిల్ రాజు వయసు 50 ఏళ్ళు. అయినా ఆయన హ్యాండ్సమ్ అండ్ ఫిట్ గానే ఉంటారు. పెళ్లి ఆయన వ్యక్తిగత విషయం. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉన్నప్పుడు ఎవరేమన్నా పట్టించుకుంటారా?? త్వరలో ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారనేది కూడా బయటకి వస్తుంది.
అవును... తాప్సి మొగుడిని కొట్టింది. అయితే... అది రియల్ లైఫ్‌లో కాదు, రీల్ లైఫ్‌లో! రియల్ లైఫ్‌లో ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు కదా! తెలుగులో గోపీచంద్ సరసన తాప్సి నటించిన సినిమాల్లో 'మొగుడు' ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ గుర్తుందా? ఒకవేళ ఎవరికైనా గుర్తు లేకపోతే యుట్యూబ్‌కి వెళితే, అందులో సినిమా ఉంది. చూడండి. పెళ్లి తర్వాత అమ్మాయి అప్పగింతల సీన్ అది.  పెళ్ళికొడుకు, పెళ్లి కుమార్తె కుటుంబాల మధ్య అభిప్రాయబేధాలు రావడంతో ఇరు వర్గాల వారు కొట్టుకుంటారు. కొట్టుకోవడం అంటే చెంపదెబ్బలు అన్నమాట. మొదట గోపీచంద్ బావను రోజా కొడుతుంది. 'మా అల్లుడిని కొడతావా? నువ్వసలు ఆడదానివేనా?' అని ఆమెను రాజేంద్రప్రసాద్ కొడతాడు. వెంటనే ఆమెను చెప్పు తీసుకుని రోజా కొడుతుంది. 'మా నాన్ననే కడతావా?' అని రోజాను గోపీచంద్ కొడతాడు. గోపీచంద్‌ని తాప్సి కొడుతుంది. ఇప్పుడీ సీన్ ప్రస్తావన ఎందుకంటే... హిందీలో తాప్సి ప్రధాన పాత్రలో నటించిన 'తప్పడ్' (చెంపదెబ్బ) ఈ శుక్రవారం (ఫిబ్రవరి 28న) విడుదలవుతోంది. ఆ సినిమా పబ్లిసిటీలో భాగంగా ఇటీవల తాప్సి ఒక ప్రమోషనల్ వీడియో చేసి రిలీజ్ చేశారు.  క్లుప్తంగా అందులో కంటెంట్ ఏంటంటే... "సినిమాల్లో ఎవరైనా సిగరెట్ కాల్చినా, మందు తాగినా 'సిగరెట్, మందు ఆరోగ్యానికి హానికరం' అని డిస్‌క్లైమర్ వేస్తున్నారు. జంతువులతో సన్నివేశాలు ఉంటె 'జంతువులను హింసించలేదు' అని కూడా డిస్‌క్లైమర్ వేస్తున్నారు. మరి, మహిళల మీద హింసను ప్రేరేపించేలా సన్నివేశాలు ఉంటే ఎందుకు డిస్‌క్లైమర్ వేయడం లేదు? సిగరెట్, మందు కంటే మహిళలు తక్కువా?" అని తాప్సి ప్రశ్నించారు. దీనిపై సోషల్ మీడియాలో ఒక సెక్షన్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ సెటైర్స్ వేస్తున్నారు. "అమ్మా... 'మొగుడు'లో హీరోయిన్ నువ్వే కదా? ఇంటర్వెల్ సీన్ ఉంటుంది?" అని ఆమెకు గుర్తు చేస్తున్నారు. మగాళ్లను మహిళలు కొట్టే సన్నివేశాలు ఉంటే ఏం చేయాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. 'తాప్సి మొగుడిని కొట్టిందిగా' అని కామెంట్స్ చేస్తున్నారు.
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది? అంటున్నారు జనాలు. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రెండు పడవలపై కాళ్లు పెట్టి అటూ ఇటు కాకుండా పోతోంది. అధికార వైసిసి పట్ల ఏం వైఖరి అవలంబించాలనే విషయంలో పార్టీ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. వైసిపి లోక్ సభ సభ్యులతో బిజెపికి పని లేకపోయినా రాజ్యసభ సభ్యులతో మాత్రం ఆ పార్టీకి ఇంకా పని ఉంది. పైగా వచ్చే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలతో తెలుగుదేశం పార్టీకి ఉన్న సీట్లు బాగా తగ్గి అన్ని సీట్లూ వైసీపీకి రాబోతున్నాయి. అందువల్ల వైసిపి రాజ్యసభ సభ్యులతో బిజెపికి పని ఉంది. ఈ కారణంతో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి వేస్తోంది. ఈ బలహీనతతో బాటు వైసిపిని పూర్తిగా కట్టడి చేస్తే మళ్లీ తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందేమోననే అనుమానం, బెంగ  బిజెపిని పట్టి పీడిస్తున్నాయి.  అందుకోసం కూడా బిజెపి అనుకున్న విధంగా వైసీపీని కట్టడి చేయలేకపోతున్నట్టు కనపడుతుంది. వైసిపికి వ్యతిరేకంగా పూర్తి స్థాయి ఉద్యమం నడుపుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విపరీతమైన స్పందన వస్తోంది. జనసేన పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయినా ఆయన చేపడుతున్న కార్యక్రమాలతో ప్రజల్లో తిరుగుబాటు మనస్తత్వం కనపడుతోంది.. పవన్ కల్యాణ్ వెనుక ఉండేది అందరూ యూత్ కాబట్టి ఆయన మాటలపై వారికి  విశ్వాసం ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో వేగంగా విస్తరిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ కు పార్టీ నిర్మాణం చేయడం, అందుకు ఆర్ధిక వనరులు లేకపోవడం లాంటి బలహీనతలు ఉన్నాయి. ఈ బలహీనతలను ఆసరాగా చేసుకుని జనసేన తమ ఆధీనంలోకి వచ్చే విధంగా బిజెపి చేసుకుంది. ఈ ఎత్తుగడతో వైసిపికి వ్యతిరేకంగా ఉద్యమం చేసే పవన్ కల్యాణ్ ను కూడా కట్టడి చేసి వైసిపిని బిజెపి అన్ని రకాలుగా రక్షిస్తున్నట్టు సామాన్యులు సైతం అనుకుంటున్నారు. అమరావతి నుంచి రాజధానిని ఎత్తేయడం పై ఒక దశలో పెద్ద ఎత్తున వచ్చిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొనేందుకు బిజెపి ముందుకు వచ్చింది. అయితే కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతోనే బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆ ఉద్యమాన్ని పూర్తిగా నీరుగార్చే విధంగా మాట్లాడారని ప్రజలు అనుకుంటున్నారు. జీవీఎల్ చేస్తున్న వ్యాఖ్యలకు అనుగుణంగానే కేంద్రం నుంచి సంకేతాలు వస్తుండటంలో రాష్ట్ర బిజెపి పూర్తిగా నీరుగారి పోయింది. ఉద్యమం చేస్తున్న పవన్ కల్యాణ్ ను కూడా చల్లార్చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట మార్చిన బిజెపి తొలి ఐదేళ్లలో ఏపిలో బిజెపి పెరిగే అవకాశాన్ని చేజేతులా కొల్పోవడమే కాక  ఏపి ప్రజలకు విరోధిగా మారింది. తెలుగుదేశం ఘోరంగా ఓడిపోయిన తర్వాత  బీజేపీకి ఏపిలో మళ్లీ పెరిగే అవకాశం వచ్చింది. అయితే అమరావతి తరలింపు తదితర అంశాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ బిజెపి తన పెరుగుదలకు తానే పాతర వేసుకుంటోంది.  ఆంధ్రా రాజకీయాల్లో కమలం పార్టీ కన్స్యూజన్ లో ఉందని, తాజా పరిణామాలతో నేతలు అయోమయంలో వున్నారన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తోంది. ఆంధ్ర నాయకులు ఒకలా.. ఢిల్లీ నాయకులు మరోలా మాట్లాడుతూ నానా  గందరగోళాన్ని సృష్టిస్తున్నారు.  మూడు రాజధానుల నుంచి మండలి రద్దు అంశం వరకూ  బీజేపీ నేతల వైఖరి భిన్నమైన దారుల్లో వెళ్లడంతో రాష్ట్ర పార్టీ వ్యూహానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో కమలం పార్టీలో అసలేం జరుగుతోందో అర్థంకాక నేతలతో పాటు జనాలు కూడా జుట్టు పీక్కుంటున్నారు. ఈ పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైసీపీలను వ్యతిరేకించినా ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.
60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు. కానీ దాదాపు అర్ధ శతాబ్దం తర్వాత అమరావతిలో విభజన ఏపీ రాజధాని కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే విశాఖ ఉక్కు ఉద్యమం నాటి పరిస్ధితులు మాత్రం కనిపించడం లేదు. విశాఖ ఉక్కు వల్ల మిగతా ప్రాంతాలకు ఎలాంటి లాభనష్టాలు లేకపోయినా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉద్యమించిన ప్రజలు ఇప్పుడు అమరావతి నుంచి రాజధాని తరలింపు వల్ల నష్టమని తెలిసినా కూడా ఉద్యమాన్ని మాత్రం ఎందుకు తమదిగా భావించలేకపోతున్నారు? 1965లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఐదు ప్రాంతాల్లో భారీ ఉక్కు కర్మాగారాల్ని నిర్మించాలని భావించింది. అందులో విశాఖపట్నం కూడా ఒకటి. అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కూడా దీనికి అంగీకరించారు. అయితే 1966లో శాస్త్రి మరణం తర్వాత ప్రధాని అయిన ఇందిరా గాంధీ తన రాజకీయ అవసరాల కోసం ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ లో కాకుండా వేరే రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల  ప్రజలు కుల, మత, ప్రాంతాలకతీతంగా వ్యతిరేకించారు. ప్రస్తుత రాజధాని అమరావతిలోని తాడికొండకు చెందిన కాంగ్రెస్ దళిత నాయకుడు టి.అమృత రావు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి, సొంతపార్టీకి వ్యతిరేకంగా 1966 అక్టోబర్ 14న ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు కోసం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఉద్యమంలో 32 మంది పోలీస్ కాల్పులలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖలో ఉక్కు పరిశ్రమ రాకతో స్ధానికులకే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని తెలిసినా, మిగతా ప్రాంతాల వారు సంకుచితంగా ఆలోచించలేదు. ఉక్కు పరిశ్రమ రాకతో తెలుగు జాతి ఆర్ధికంగా వృద్ధి చెందుతుందని భావించారు.  చివరికి ఎవ్నో పోరాటాల తర్వాత 1971 నుంచి ఉక్కు ఉత్పత్తి ప్రారంభమైంది. ఆ తర్వాత 90వ దశకం వరకూ కేంద్రంలో వివిధ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. నలుగురు ప్రధానులు కూడా మారారు. రాష్ట్రంలోనూ వివిధ పార్టీలు, 10 మంది ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చారు. రాజకీయ అవసరాల కోసమో, మరే ఇతర కారణాలతోనో విశాఖ స్టీల్ ప్లాంట్ ను మరో ప్రాంతానికి మార్చాలనే ఆలోచన ఏ ప్రభుత్వానికీ రాలేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 24 వేల ఎకరాల భూసేకరణ చేసిన అప్పటి ప్రభుత్వం..  మార్కెట్ ధర కన్నా 8 నుండి 10 రెట్లు ఎక్కువ నష్టపరిహారం కూడా ఇచ్చింది. భూములు కోల్పోయిన కుటుంబాలకు శిక్షణ ఇచ్చి, వేలాదిగా ఉద్యోగాలు కూడా ఇచ్చారు. ఇళ్ళు కోల్పోయిన వారికి ఇంటిస్థలం, ఇల్లు నిర్మించుకోవటానికి సాయం కూడా అందించారు. కానీ గతేడాది డిసెంబర్ 17న అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటన తర్వాత అమరావతి ప్రాంతంలో అనిశ్చితి మొదలైంది. వాస్తవానికి 2014 లో ప్రాంతీయ తత్వం కారణంగా ఏపీ విభజన జరిగితే, సెప్టెంబర్ 4వ తేదీన రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసర ప్రాంతాలలో  నిర్మాణం చేయాలని అసెంబ్లీ లో అధికార, ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. రాజధానికి 29 వేల రైతు కుటుంబాల నుంచి 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సమీకరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో చేపట్టిన ఈ భూసేకరణలో భూములిచ్చిన రైతులకు 25 శాతం అభివృద్ధి చేసిన ప్లాట్లను, పదేళ్ల పాటు కౌలు తప్ప చంద్రబాబు ప్రభుత్వం మరో పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత గతేడాది డిసెంబర్ లో వైసీపీ ప్రభుత్వం మూడేళ్లుగా అమరావతిలో ఉన్న సచివాలయం, హైకోర్టును విశాఖ, కర్నూలుకు తరలించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఆ తర్వాత దాన్ని సమర్ధించుకునేందుకు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ నివేదికలను తెరపైకి తెచ్చింది. చివరికి 10 మంది మంత్రులతో కూడిన హై పవర్ కమిటీ నివేదిక ఆధారంగా మూడు రాజదానుల నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది. అయితే మూడు రాజధానులకు ఉద్దేశించిన రెండు బిల్లులు అసెంబ్లీలో నెగ్గించుకున్నా.. మండలిలో మాత్రం ఛైర్మన్ వాటిని సెలక్ట్ కమిటీకి పంపడంతో ఈ నిర్ణయం భవితవ్యం ఏమిటన్నది ఇంకా తేలడం లేదు.  అయితే మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు నిత్యం రోడ్లపై ఉద్యమాలు చేస్తున్నారు. కానీ మిగతా ప్రాంతాల నుంచి మాత్రం వారికి తగిన సహకారం, మద్దతు లభించడం లేదు. చివరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ప్రతి రోజూ రాజధాని గ్రామాల్లో తిరుగుతూ అక్కడి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. మరోవైపు సీఎం జగన్ తో పాటు వైసీపీ ప్రభుత్వ పెద్దలు మాత్రం మూడు రాజధానులకు మద్దతుగా మిగతా ప్రాంతాల్లో మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. అయితే ఇప్పటికే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వంటి కట్టడాలతో కుదురుకుంటున్న రాజధానిని తరలింపు చేపట్టడం అనేది వాస్తవంగా అవసరమా కాదా అన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. గతంలో విశాఖ ఉక్కు ఉద్యమంలో కుల, మత , ప్రాంతాలకు అతీతంగా పోరాడిన ప్రజలు ఇప్పుడు అమరావతిలోనే రాష్ట్ర రాజధాని ఉండాలన్న వాదనకు మద్దతుగా నిలవకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గతంలో విశాఖ ఉక్కు కోసం ఊరూవాడా ఉద్యమించిన ప్రజలు రాజధాని విషయంలోనూ అదే చొరవ, తెలువ చూపితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే అవకాశం కూడా లభిస్తుంది. అదే సమయంలో మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా మీడియాత పాటు మేథావులు కూడా నిర్ణయాత్మక రీతిలో గొంతు విప్పితే అమరావతిలోనే రాజధాని ఉండాలన్న వాదనకు బలం చేకూరినట్లవుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు. అదే విధంగా భవిష్యత్తులో ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తానేనని తప్పక చెప్పుకుంటారని, అందుకు ఆస్కారం ఇవ్వకుండా ఉండేందుకే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతిని తరలించడమే కాకుండా అమరావతిని సర్వ నాశనం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కనపడుతోంది. అమరావతి అనే పేరు వినిపించకుండా చేసేందుకు వైఎస్ జగన్  నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని ఎడతెగని ఉద్యమం చేస్తున్న రాజధాని గ్రామాల ప్రజలపైకి వేరే ప్రాంత ప్రజలను యుద్ధానికి పంపుతున్నది. అమరావతి భూములలో దాదాపు నాలుగు వేల ఎకరాలను పేదలకు పట్టాలుగా పంచి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైందనే వార్తలు గుప్పు మనడంతో రాజధాని ప్రాంతాల రైతులు అలోలక్ష్మణా అంటూ ఏడుస్తున్నారు. రాజధాని తరలిపోవడం ఒక ఎత్తు అయితే రాజధాని ప్రాంతంలో పేదలకు పట్టాలు ఇచ్చేయడం మరొక ఎత్తు. పేదలకు పట్టాలు ఇచ్చేస్తే వారు వచ్చి ఆక్రమించుకుంటారు. దాంతో అమరావతి ప్రాంతంలో అంతర్యుద్ధం తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. వేరే ఊరుకు చెందిన ప్రజలు తమకు ప్రభుత్వం ఇచ్చిన ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారు, దాన్ని అమరావతి ప్రాంత ప్రజలు అడ్డుకుంటే అంతర్యుద్ధం తప్పదు. అమరావతి ప్రాంత రైతులు బాగా బలిసిన వారని అందుకే పేద ప్రజలకు భూములు ఇస్తుంటే అడ్డుకుంటున్నారని వైసిపి నేతలు ప్రచారం మొదలు పెడతారు. దాంతో ఈ సమస్య మరింత తీవ్ర తరం అయి అమరావతి సర్వ నాశనం అవుతుంది. దాదాపు నెల కిందటే అమరావతి భూములను పందేరం చేయాలనే ప్రతిపాదన పెట్టారు. అయితే ఆ విషయం బయటకు రాలేదు. గ్రామ సచివాలయం అధికారులు విజయవాడ గుంటూరు పట్టణాలలో భూముల కోసం అర్జీ పెట్టుకున్న పేదల నుంచి అమరావతి గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమా అనే అభిప్రాయ సేకరణ మొదలు పెట్టేసరికి విషయం అమరావతి రైతులకు తెలిసింది. దాంతో వారి కలలు పటాపంచలు కావడమే కాకుండా సాటి ప్రజలతో పోరాడే స్థితికి తమను ప్రభుత్వం నెట్టివేస్తోందని ఆగ్రహిస్తున్నారు. తాము భూములు ఇస్తే తమ ప్రాంతం సింగపూర్ హాంకాంగ్ లాగా అవుతుందని కలలు కన్నారు. ఇప్పుడు రాజధాని అక్కడ నుంచి వెళ్లిపోవడమే కాకుండా తమ భూములను అందరికి పంచే వ్యూహాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏమనాలో వారికి అర్ధం కావడం లేదు. కసితో కక్షతో ప్రవర్తిస్తున్న ప్రభుత్వాన్ని ఏం చేయాలో వారికి అర్ధం కావడం లేదు. నాలుగు వేల ఎకరాలు పేదవారికి పట్టాలిచ్చి పంచితే అక్కడకు లక్షల సంఖ్యలో జనాభా వచ్చేస్తారు. వారంతా కాలకృత్యాలు తీర్చుకోవడానికి, చెత్త డంప్ చేయడానికి, ఉపయోగించిన ప్లాస్టిక్ ను పడేయడానికి కృష్ణానదిని వాడితే ఇక కృష్ణమ్మ మరో మూసీగా మారక తప్పదు. కృష్ణా నది గర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలోనే కొందరు బడాబాబులు పెద్ద పెద్ద భవనాలు అక్కడ నిర్మించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబునాయుడు వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆ భవనాలన్నింటిని కూలగొట్టి కృష్ణా నదిని కాపాడతానని చెప్పడమే కాదు..దానికి నాందిగా చంద్రబాబు ప్రభుత్వ కార్యకలాపాల కోసం నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టారు కూడా. తర్వాత అక్కడ ఉన్న భవనాల యజమానులకు తాకీదులు కూడా ఇచ్చారు. కానీ కోర్టుల జోక్యంతో అక్కడ ఉన్న భవనాలను అంగుళం కూడా ఆయన కదిలించలేకపోయారు. ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తాన్ని జనాలతో నింపేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టు కనపడుతోంది. నది ఓడ్డున రాజధాని కడితే మునిగిపోతుందని ఉదర కొట్టిన జగన్ ప్రభుత్వం అక్కడ పేదలకు పట్టాలు ఎలా ఇస్తుంది? నది పొంగి పేదలంతా మునిగిపోతే ఫర్వాలేదా? ప్రజల పైకి ప్రజలనే రెచ్చగొట్టి చోద్యం చూసే ప్లాన్ ఇది..అని రాజధాని ప్రాంత రైతులు, ప్రతి పక్షాలు అంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి భవిష్యత్ లో ఏ విధంగా ఉంటుందనే విషయంలో ఆందోళనలు మొదలయ్యాయి. 2014-15 ఆర్ధిక సంవత్సరం నుంచి 2019-2020 జనవరి 23 వ తేదీ వరకూ, ఎక్కువ మొత్తం ఓ.డి. తీసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండడటం ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదు ఆర్ధిక సంవత్సరాలలో  ఓ.డి. పొందిన రోజులే 188 దినాలుగా నమోదు అయినట్టు, సమాచార హక్కు చట్టం (ఆర్టి ఐ యాక్ట్) కింద భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బిఐ) వెల్లడించింది.  వివరాల్లోకి  వెళితే, 2014-15 లో 14 రోజులకు గాను 4,313 కోట్లు, 2015-16 లో 6 రోజులకు గాను 95. 38 కోట్లు, 2016-17 లో 6 రోజులకు గాను 1,295.22 కోట్లు, 2017-18 లో 38 రోజులకు గాను 8,625. 81 కోట్లు, 2018-19 లో 88 రోజులకు గాను 19,616.71 కోట్లు, 2019 ఆర్ధిక సంవత్సరం మొదలనప్పటి నుంచి ఈ ఏడాది జనవరి 23 వరకూ మొత్తం 36 రోజులకు గాను 13, 736. కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుందని ఆర్బీఐ.. ఆర్టిఐ చట్టం కింద సమాచారం పొందు పరిచింది. తెలుగు దేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి, గడిచిన ఏడాది అంటే 2018-19 వరకూ అత్యధికంగా, 2018-19 లోనే ఆ ప్రభుత్వం అత్యధికం గా 88 రోజులకు గాను 19,616.71 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్నిడ్రా చేసింది. ఇప్పుడా పెను భారాన్ని, వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం కూడా మోయాల్సిన పరిస్థితి రావటం తో, 2019 ఆర్ధిక సంవత్సరం మొదలైనపట్టి నుంచీ , ఈ ఏడాది జనవరి 23 వరకూ కేవలం 36 రోజులలో 13,736.75 కోట్ల రూపాయల ఓ.డి. సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది. నిజానికి ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి మించి పోతోందంటూ, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ కు, నిరుడు జూన్ 11, జూన్ 12 తేదీల్లో ఆర్బీఐ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ రెండు లేఖలు కూడా పంపారు. 2019 జూన్ 10 వ తేదీ నాటికి ఓవర్ డ్రాఫ్ట్ మొత్తం 699. 99 కోట్ల రూపాయల మొత్తం గా నమోదైందని, ఆ త్రైమాసికం లో 16 రోజులు ఓ.డి. సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొందిందనీ, వరసగా 14 రోజుల పాటు ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఓ.డి. పొందిన పక్షం లో రిజర్వ్ బ్యాంక్ చెల్లింపులు నిలిపివేసే పరిస్థితి ఏర్పడుతుందని కూడా ఆ లేఖలో ఆర్బీఐ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ హెచ్చరించారు. నిరుడు జూన్ 12 వ తేదీన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం 17 వరస పని దినాల్లో 339. 17 కోట్ల రూపాయల ఓ.డి. పొందినట్టు పేర్కొన్నారు. తక్షణమే ఓవర్ డ్రాఫ్ట్ మొత్తాన్ని తిరిగి చెల్లించే ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆ లేఖలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ కార్యదర్శిని కోరారు. మొత్తం ఓవర్ డ్రాఫ్ట్ లెక్కలను పరిశీలించిన ఆర్ధిక నిపుణుల విశ్లేషణ ప్రకారం..రాష్ర ఆర్ధిక పరిస్థితి అంట ఆశాజనకం గా లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం ప్రభుత్వం అప్పచెప్పిన ఓవర్ డ్రాఫ్ట్ లెక్కల నుంచి బయటపడాలంటే, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికక్రమశిక్షణ చర్యలను తక్షణం చేపట్టాలని వారు సూచిస్తున్నారు.
    ఒకరు సంక్షోభాలతో చెలిమి చేస్తే, మరొకరు పైనున్న దేవుడిపైన భారం వేశారు... ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు అంటూ ప్రజలను ఎమోషనల్ గా టచ్ చేసిన యువ నేత జగన్మోహన రెడ్డి. తనపై రుద్దబడిన లక్ష కోట్ల అవినీతి బురదను వదిలించుకోవటానికి లేదా దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికి ఈయనకు తొమ్మిదేళ్ల గడ్డు కాలం పట్టింది. నాయుడిదయితే  డిఫ్ఫరెంట్ స్టైల్. ఆధునికాంధ్ర ప్రదేశ్ టెక్నాలజీ పితగా తనను తాను  ఆయన మార్కెట్ చేసుకున్న తీరుకు నార్త్ ఇండియా ముఖ్యమంత్రులు సైతం ఫిదా అయిపోయి, ఆయన చేత రెండు దశాబ్దాలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పించారు. వివిధ జాతీయ పార్టీల గోసలకు , వాటి మధ్య సమన్వయానికి ఆయనే చుక్కాని అయ్యారు. అటువంటి నాయుడిని ఈ రోజు 24 గ్రామాల చక్రబంధంలో ఇరికించింది  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే , తాజాగా... ఆయన ఒకప్పటి పర్సనల్ సెక్రెటరీ పెండ్యాల శ్రీనివాస్ మీద కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు, అతడి నుంచి  విలువైన ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి సేకరింపచేసిన అమిత్ షా-మోడీ ద్వయం తెలుగుదేశాన్ని ఇరకాటం లో పెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఓ సారి నాలుగేళ్ల వెనక్కు రీలు తిప్పితే--అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2014లో విజయవాడ వచ్చేసి రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించిన తర్వాత 2015 మధ్యలో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఒక పాజిటివ్ అప్రోచ్ కనిపించింది. . 'విభజనలో అన్యాయం జరిగింది. అయినా రెట్టింపు ఉత్సాహంతో, ధృఢ సంకల్పంతో పనిచేయాలి. హైదరాబాద్ నగరాన్ని తలదన్నే మహా నగరాన్ని నిర్మించుకోవాలి' అనే పాజిటివ్ స్పిరిట్ఆ యన మాటల్లో ధ్వనించింది. ప్రజల్లో అనేక కొత్త ఆలోచనలు, ఆశలు రేకెత్తించే పదాలు ఆ సందర్భంలో వినిపించాయి. ఆ తర్వాత ఆలాంటి 'స్ఫూర్తి'నిచ్చే ప్రసంగాలే 2018 మార్చి వరకూ కొనసాగాయి. అయితే ప్రజలు ఆతర్వాత ఎన్నికల్లో భిన్నంగా స్పందించారు. ఇప్పుడు, అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి- రాష్ట్ర ఆర్ధిక వాస్తవ పరిస్థితి, తాను ప్రజలకిచ్చిన హామీలు, రెండింటి మధ్య సమన్వయము  చేస్తున్న తీరు, రాష్ట్ర పరిస్థితిపై తన ప్రణాళికలు చెపుతున్నప్పుడు వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్టు .'గాలిలో మేడలు, అసాధ్యమైన హామీలు ఇచ్చే ఆలోచన తనకు లేదని, మన రాష్ట్ర పరిస్థితి అర్ధం చేసుకుని ఆ మేరకు ఎంత చేయగలమో అంతే మాట్లాడాలి' అనే భావం వినిపించింది.మరి అయినా సారం జగన్మోహన్ రెడ్డి ఎందుకింతగా ఆఫీసర్ల మధ్యన సమన్వయము సాధించుకోలేకపోతున్నారు. ఏ రాష్ట్ర చరిత్ర లోనూ లేని విధంగా ప్రస్తుతం, ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ ల మధ్య ఆధిపత్య పోరుకు అమరావతి సెక్రెటేరియట్  వేదిక కావటం ప్రస్తుతం దేశం మొత్తం చూస్తున్న చోద్యం. ముఖ్యమంత్రులుగా అటు నాయుడు, ఇటు  జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి ని పరిశీలిస్తే, నాయుడి ఎడ్మినిస్ట్రేషన్ ఎప్పుడూ చాలా గుంభనం గా వ్యవహరించేది. లోపల తగువులున్నప్పటికీ, ఎక్కడా ఎవరూ బయటపడిన సందర్భాలు లేవు. ఇప్పుడు అందుకు భిన్నంగాఉంది... జాస్తి కృష్ణ కిషోర్, ఏ బి వెంకటేశ్వర రావు ల ఎపిసోడ్లు పరిశీలిస్తే, అమరావతి సచివాలయం నేషనల్ మీడియాకు కావలసినంత మసాలాను ఉత్తి  పుణ్యానికే అందించినట్టు తెలిసిపోతోంది. ఇది అవాంఛనీయ, అనభిలషణీయ పరిణామమని సీనియర్ అధికారులంటున్నారు. అమరావతి లో క్యాపిటల్ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు కానీ, ఇలాంటి సంఘటనల ద్వారా రాష్ట్రం పరువు ఢిల్లీ వీధుల్లో మార్కెట్ వస్తువుగా మాత్రం మారిపోయింది. ఇక నైనా , అధికారం లో ఉన్న వారు పూర్తిగా ఐ ఏ ఎస్ ల మీద ఆధారపడి పాలన సాగించే ఛత్రం నుంచి బయట పడాలి. నాయుడి ఓటమి కి కారణం ఆయన పూర్తిగా బ్యూరోక్రాట్లమీదే ఆధారపడటం అని తెలుగుదేశం లో సీనియర్ నాయకులు ఇప్పటికే, ఒక పార్టీ అధ్యక్షడుకి ఒక ధీసిస్ కూడా సమర్పించిన విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గుర్తు పెట్టుకోవాలి.
    "Accept everything about yourself--I mean everything, You are you and that is the beginning and the end--no apologies, no regrets." - Clark Moustakas Do see yourself accepting just the way you are? Notice how many conditions you attach when you look at yourself. Perhaps you feel you can accept yourself only when you have achieved something, or you want to look in a particular way, you have to lose enough weight to fit into the perfect pair of jeans or wait for others to acknowledge you. It usually leaves you feeling very dissatisfied, incomplete, or there is something incomplete unless you have those qualities or things that you want in life. What you see outside is only a reflection of what you are, what you think and what you feel deep within. Always remember, “The outer world reflects your inner feelings and thoughts”. Learning to accept yourself just the way you are is the key to positive change in your life. A very effective good way to start is by affirmations. Continuous and positive affirmations on a daily basis could change you and the situations are in. For example instead of saying “I am fat “you could say “I am the perfect weight”. When you feel stuck up in money issues and you feel the lack of it just say “I am a magnet for money”. Each situation and emotion you face can be cleared with these positive suggestions. Another powerful tool would be to look in to the mirror and say these affirmations and tell yourself how much you love yourself, this can bring a lot of change in your life.  The key to self acceptance is self awareness which will bring a major change in your life. “I Love and accept myself exactly as I am “    
The most common problem faced by both male and female is hair fall. There are several reasons for this hair fall. To name few, we can say vitamin deficiency, lack of proper care, even pollution around us. Embarrassingly this problem is most commonly seen in young people aged 15-30. Here are few simple home remedies to overcome problem of hair fall. 1. Do not comb your hair when it is wet because wet hair is more suspect able of breakage. 2. Massage your scalp as frequent as possible. This stimulates blood flow and helps in hair growth. 3. Avoid showers with hot water because hot water makes your hair dry and frizzy. 4. Most common tip and always suggestible is have lots of water which makes you hydrated and even results in glowing skin. Parlor like treatment at home: 1. Apply coconut milk to scalp gives nourishment to hair. 2. Boil neem leaves and rinse hair with that water weekly. 3. Mix henna, egg white and curd and apply to hair avoids hair fall. 4. Applying Aloe Vera gel directly also gives good results.
  Are men from Mars and Women from Venus ??.Why do they think and behave exactly the opposite way on emotions basis?? It is a classic complaint we always hear, that men accuse women of being too emotional and women accuse men of not being emotional enough. They both think that why cant this be the other way round?? Or why cant they behave a bit different?? But the basic issue lies with the brain circuitry system. The emotional processing is different in men and women. Until recently, the chasm between how men and women feel and express emotions was thought to be due to upbringing .Of course, parental upbringing dose make a difference in thought process but still we should also know that the emotional processing in the male and female brain will not be the same genetically. Research suggests that our brains have two emotional systems that work simultaneously: system or MNS (which allows us to emotionally empathize with people); and the parietal junction system or TPJ (which fires the brain's analyze-and-fix-it circuits to look for solutions to emotional problems - cognitive empathy). Males use the latter far more. This prevents their thought processes from being clouded by emotions, strengthening their ability to find practical solutions, but this obviously make them appear to be uncaring and un emotional. Male or female, when we see an emotion on someone else's face, our MNS (emotional empathy system) activates. But, for reasons scientists don't understand, the female brain stays in the sympathetic MNS longer, while the male brain, not built to wallow in anguish, switches to the practical mode. His way of showing that he cares is to try to solve your problems.  So when you see men not reacting to your emotional outburst don’t get worked up, or go bananas, just keep reminding yourself that they are men and they want results soon.  - Pushpa Bhaskar
2017లో కర్నూలులో సంచలనం రేపిన సుగాలి ప్రీతీ బాయి అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ కేసును విచారించిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇప్పటికీ దోషులను పట్టుకోకపోవడం వంటి కారణాలతో ప్రీతి కుటుంబ సభ్యులు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే డిమాండ్ తో కర్నూలులో ర్యాలీ కూడా నిర్వహించారు. ఆ తర్వాత కర్నూలు పర్యటనలో ప్రీతి కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడిన సీఎం జగన్.. తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 2017లో కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీ బాయి క్లాసు రూమ్ లోనే ఉరేసుకుంది. తమ కుమార్తె ఉరేసుకుందన్న వాదనను అప్పట్లో తోసిపుచ్చిన ప్రీతి తల్లితండ్రులు పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. స్ధానికుల నుంచి కూడా ఒత్తిడి పెరగడంతో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు చివరికి ప్రీతి అత్యాచారానికి గురైందని, అనంతరం ఆమెను నిందితులు ఉరేసి చంపేశారని తేల్చారు. ఈ వ్యవహారంలో కర్నూలు జిల్లాకు చెందిన కొందరు పెద్ద మనుషుల పాత్ర ఉందని, ప్రభుత్వంలో కొందరు సీనియర్ అధికారుల సహకారం కూడా ఉందని తదుపరి దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రీతి తల్లితండ్రులు కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపిస్తే కానీ తమ కుమార్తెకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. తాజాగా కర్నూలులో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మృతురాలు ప్రీతికి న్యాయం జరగాలంటే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, ప్రీతికి న్యాయం చేయలేని వైసీపీ ప్రభుత్వం కర్నూల్లో హైకోర్టు పెట్టి ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని కూడా ప్రశ్నించారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఈ సంచలన కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇవాళ జీవో జారీ చేసింది.
విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తోన్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తల అడ్డుకోవడంతో చంద్రబాబు కాన్వాయ్ ముందుకు కదిలే పరిస్థితి కనపడలేదు. దాదాపు రెండు గంటల పాటు బాబు కాన్వాయిలోనే ఉండిపోయారు. వేలాదిగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు విమానాశ్రయ ప్రాంతానికి రావడంతో.. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ కార్యకర్తలు చంద్రబాబు వాహనంపై కోడిగుడ్లు, టమోటాలు, చెప్పులు విసిరారు. కొందరు చెప్పులు చూపెడుతూ 'గో బ్యాక్ బాబు' అంటూ నినాదాలు చేశారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు 'ఏ1- ఏ1' అంటూ నినాదాలు చేశారు. ఇలా ఇరు పార్టీల కార్యకర్తల నినాదాలు, తోపులాటలతో విశాఖ విమాశ్రయ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 151 సెక్షన్ కింద చంద్రబాబును అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి తరలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ఆయన్ను నిర్బంధింలోనే ఉంచాలని పోలీసులు భావిస్తున్నారు. ఆయనతో పాటు ఉన్న టీడీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పర్మిషన్ ఉన్నా అడ్డుకుంటారా అంటూ ఫైర్ అయిన ఆయన.. నన్ను షూట్ చేయండి.. నన్ను ఎన్ కౌంటర్ చేయండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను కోరుతూ ఆర్కే బీచ్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని తలపెట్టగా కార్యక్రమానికి ఎవరూ అనుమతులు తీసుకోలేదని, అదే సమయంలో గణతంత్ర దినోత్సవం, భాగస్వామ్య సదస్సు జరగనున్నది అని పోలీసులు ఆర్కే బీచ్ ను దిగ్భంధం చేశారు. ఎవరిని ఆర్కే బీచ్ దరిదాపులకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు.  వైజాగ్ విమానాశ్రయం చేరుకున్న జగన్ ను బయటికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా బయటికి అనుమతించలేదు. దీంతో జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వెనక్కి వెళ్లేది లేదని విమానాశ్రయంలోనే కూర్చుండి పోయిన విషయం తెలిసిందే. సరిగ్గా అదే సన్నివేశం నేడు పునరావృతం అయింది. కానీ అధికార పక్షం ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అయిందని ప్రతిపక్ష నాయకులు, జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రజలు అనుకుంటున్నారు. నాడు తెలుగుదేశం అధికారంలో ఉండగా జగన్ ఏడాది పాటు పాదయాత్ర చేశారని, ఏనాడూ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించాలని చూడలేదని, ఇవాళ్టి పరిస్థితులు ఆనాడు కల్పిస్తే జగన్ పాదయాత్ర జరిగేదా? అని తెలుగుదేశం వారు అంటున్నారు. ఇదే సమయంలో  ఈ రోజు చంద్రబాబుని విశాఖపట్నంలో వైసీపీ అడ్డుకోవటం రాజకీయంగా వైసీపీ చేసిన తప్పటడుగుగానే కనిపిస్తోంది. గతంలో విశాఖలో జగన్ కు జరిగిన దానిని మనసులో పెట్టుకొని విశాఖపట్నం లో బాబును అడుగుపెట్ట నివ్వకూడదు అని తీసుకుని అమలు చేసిన నిర్ణయం ముమ్మాటికీ రాజకీయంగా బాబు కలిసి వచ్చేదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వైసిపి నాయకులు, కార్యకర్తలు  ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఎంత విధ్వంసకారులో  ప్రజలకు చూపించడానికి బాబుకి ఇది కలిసివచ్చిన అవకాశమని విశ్లేషిస్తున్నారు. అందులోనూ ఎక్కువమందిని ఒక గంట అని చెప్పి 500 రూపాయలకు మాట్లాడుకుని తెచ్చుకున్నారు అనేది బయట పడటం, పెందుర్తి లోని వైసీపీ నాయకుడికి చెందిన ఓ కాలేజి నుంచి విద్యార్థులని తెచ్చి వారితో నినాదాలు ఇప్పించడం వంటివి కూడా ప్రజలకు తెలిసిందని ఈ పరిణామాలు వైసీపీకి మరింత నష్టం కలగజేస్తాయని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో  ఏది జరిగినా చంద్రబాబుకే అనుకూలమవుతాయని తెలుగుదేశం వర్గాలు ఒకింత ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
Adhesive Capsulitis of shoulder is the clinical term for the condition which we commonly call the 'Frozen Shoulder'. It is a painful and disabling disorder of the unknown origin, due to which the shoulder capsule and connective tissue of the shoulder joint become inflamed and stiff, estricting the movement and causing chronic pain. This pain is usually constant, but worsens at night and with cold weather.This condition sets at a slower pace and fades away gradually may be within a year or more. Frozen shoulder develops when the shoulder is seldom used due to pain, injury or health conditions like diabetes or stroke. Any shoulder problem may go further to develop into a frozen shoulder if its not employed to keep full range of motion. This obstructing disorder most often occurs after surgeries or injuries, in the age groups 40 - 70 years, in poeple with chronic diseases. It is more often seen in women than in men especially in post-menopausal women. Treatment includes the pain killer drug therapy and soothed by the application of heat to the affected area, followed by gentle streching. By applying ice the pain and swelling can be reduced. Physio-therapy can increase the range of motion of the shoulder. Most of the cases of frozen shoulder are preventable! Gentle, progressive range-of-motion exercises, stretching, and usage of the shoulder more often may help in preventing  frozen shoulder after surgery or an injury. But be patient and stick to your doctors advice, as frozen shoulder always get better over time! Take Care!! Stay Healthy!! ....SIRI
Obstructive sleep apnea is a serious disorder that occurs when a person's breathing is repeatedly interrupted during sleep, sometimes hundreds of times. Each time, the oxygen level in the blood drops, eventually resulting in damage to many cells in the body. The condition affects more that 20 million adults in the U.S. and is associated with a number of serious health consequences and early death. Women are much less likely to be diagnosed than men. A new study from the UCLA School of Nursing shows that the body's autonomic responses -- the controls that impact such functions as blood pressure, heart rate and sweating -- are weaker in people with obstructive sleep apnea but are even more diminished in women. Women with obstructive sleep apnea may appear to be healthy -- having, for instance, normal resting blood pressure -- and their symptoms also tend to be subtler, which often means their sleep problem is missed and they get diagnosed with other conditions. We now know that sleep apnea is a precursor to bigger health issues," said Paul Macey, lead researcher on the study ,"And for women in particular, the results could be deadly." For the study, men and women -- both with and without obstructive sleep apnea -- had their heart-rate responses measured during three physical tasks: The Valsalva maneuver: Subjects breathe out hard while the mouth is closed. A hand-grip challenge: Subjects squeeze hard with their hand. A cold pressor challenge: A subject's right foot is put in almost-freezing cold water for a minute. In all three tests, changes to the normal heart rate were lower and delayed in patients with obstructive sleep apnea, compared with healthy controls. The researchers found that the difference was even more pronounced in women. "The heart-rate results for these tests show that the impact of sleep apnea, while bad in men, is more severe in women," Macey said. "This may mean that women are more likely to develop symptoms of heart disease, as well as other consequences of poor adaptation to daily physical tasks. Early detection and treatment may be needed to protect against damage to the brain and other organs." The next step in the research is to see if the autonomic responses improve with treatments such as continuous positive airway pressure (CPAP), the usual sleep apnea therapy, in which a machine is used to help an individual breathe easier during sleep. Researchers also intend to investigate the affect of other treatments. Source:UCLA        
    We all know that Holy Basil or the Tulsi as it is commonly known in Indian households is an integral part of the Hindu household. Popularly known in the western world as Holy Basil, where it is used in salads and Italian cusines and the Latin name is Ocimum tenuiflorum or Ocimum sanctum. Medicinal Value Tulsi is widely used in Ayurveda for medicinal purposes. Eugenol which is found in the plant is believed to be the main element responsible for the medicinal properties of the Holy basil. The plant has also been found to have antimicrobial properties, because of  the ursolic acid and carvacrol constituents found in it. The tulsi/basil plant is used to cure most the common diseases, has anti-aging benefits as well as being useful for diabetics and people with heart disorders, cleans the skin when the juice is applied on the face.  For Respiratory problems The leaves of the tulsi are effective expectorants and promote the release of mucus in bronchitis and asthma, thus, facilitating breathing. A decoction made of tulsi leaves, honey and ginger is effective for asthma, bronchitis and influenza. Immune-enhancing Along with antimicrobial properties, the phytochemicals present in tulsi offer antioxidant as well as immune-enhancing qualities. It also has adaptogenic properties, which enhances the body's ability to adapt to stress. If you have a garden, grow the plant in a single line closely in front of the door or if you have French Windows you could grow it near them.  The idea is  to grow them like a hedge and get as much benefit of the plant. It Is believed that air around the house gets purified because of  the phytochemicals present in tulsi/amla. If you live in an apartment you can always grow the Holy basil in a small pot as well and purify the air in your balcony. If you are living in cold countries where there is no sunlight throughout the year and it is not possible to grow the plant, you could buy a  bottle of basil/ tulsi juice or oil or dried tulsi/basil powder and keep it  in your home. You can banish the common cold and cough and is a wonderful medicine for children too .You could add a spoon of honey to the juice and give it to the children. It also makes a great mosquito repellant and keeps them away from you when you rub the tulsi/basil oil. So try and make this wonderful plant an integral part of your home!  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.