Publish Date:Mar 6, 2017
Publish Date:Mar 4, 2017
Publish Date:Mar 4, 2017
Publish Date:Mar 2, 2017
Publish Date:Feb 21, 2017
Publish Date:Feb 21, 2017
Publish Date:Feb 20, 2017
Publish Date:Feb 18, 2017
Publish Date:Feb 14, 2017

LATEST NEWS
ALSO ON TELUGUONE N E W S
పుండు మీద కారం పెట్టినట్టు... అసలే... సినిమా డిజాస్టరై నిర్మాత, బయ్యర్లూ బాధలో మునిగిపోయుంటే...  మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు.. ‘నా సినిమాను నా పర్మిషన్ తీసుకోకుండా కాపీ కొట్టేసి.. కనీసం అపాలజీ అయినా చెప్పకుండా మౌనంగా ఉండిపోయిన ‘అజ్ఙాతవాసి’ టీమ్ పై లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నా..’  అని ఫ్రెండ్ డైరెక్టర్ జెరోం సల్లే ట్వీట్టర్ ద్వారా తెలియజేసి.. ‘అజ్ఙాతవాసి’ టీమ్ కి కొత్త షాక్ ఇచ్చాడు. వివరాల్లోకెళ్తే.. తన సినిమా ‘లార్గో వించ్’ కథను కాపీ చేసి ‘అజ్ఙాతవాసి’ తీసినట్టు ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోం సల్లే గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల రోజునే ‘అజ్ఙాతవాసి’ సినిమా చూసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే... ఆయన ప్రకటనకు ‘అజ్ఙాతవాసి’ టీమ్ సమాధానం ఇవ్వలేదు  ప్రస్తుతం ‘లార్గో వించ్’ ఇండియా హక్కులు టీ సీరీస్ వారి దగ్గరున్నాయ్. వారికి త్రుణమో ఫలమో ముట్టజెప్పి.. సైలెంట్ గా ఉండిపోయారు దర్శక, నిర్మాతలు. డబ్బు తీసుకొని టీ సీరీస్ వారు కూడా సైలెంట్ అయిపోయారు. అయితే... మాతృక దర్శకుడు జెరోం లల్లే మాత్రం ఈ పరిణామాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.  ‘లార్గో వించ్’ హక్కులు టీ సిరీస్ వారి వద్ద ఉన్న మాట నిజమే. అయితే.. వారి దగ్గరుంది కేవలం ఇండియా హక్కులు మాత్రమే. ‘అజ్ఙాతవాసి’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కాబట్టి... మా అనుమతి కూడా అవసరం. కానీ... ‘అజ్ఙాతవాసి’ టీమ్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. కనీసం అపాలజీ అయినా చెప్పలేదు. ఇండియన్ సినిమాపై నాకు అమిత గౌరవం. కాపీ చేయకుండా క్రియేటివీటీతో సినిమాలు తీయగల సత్తా భారతీయ సినీ దర్శకులకు ఉంది. అయితే... ‘అజ్ఙాతవాసి’ టీమ్ నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రావడంలేదు. అందుకే.. నేను లీగల్ గా ప్రొసీడ్ అవ్వనున్నాను’ అని తేల్చిచెప్పేశాడు జెరోం సల్లే.  మరి ఈ గొడవ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి. దెబ్బ మీద దెబ్బ తగలడం అంటే ఇదే. 
Mega Power Star Ram Charan and sensational director Boyapati Srinu’s new film regular shoot has begun today in Hyderabad. DVV Danayya is producing the high budget entertainer under DVV Entertainments banner, wherein Smt Parvathi is the presenter. Tamil actor Prashanth of Jeans fame is said to be playing a role with negative shades in the film. Bollywood actor Vivek Oberoi will be seen as main antagonist. Kiara Advani who makes her Telugu debut with Mahesh Babu’s Bharath Ane Nenu essays lead actress. Producer Danayya said, “Expectations will be quite high among fans and audience on the film to be made in the crazy combination of mega power star Ram Charan and sensational director Boyapati Srinu. Cine goers are eager to watch this film on screen. Known for showing heroes in massy best roles, Boyapati Srinu will be presenting Ram Charan in different avatar. We will be making the film on grand scale without compromising on budget. Bollywood actress Kiara Advani plays female lead in the film. Tamil actor Prashanth and Bollywood actor Vivek Oberoi will be seen in key roles. Rock star Devi Sri Prasad composes music, while Rishi Punjabi handles cinematography. Regular shooting of the film has commenced from today (Friday). First schedule will continue till end of this month, whereas second schedule will begin in February. This film will definitely reach the expectations of mega fans and normal audience.” Ram Charan, Kiara Advani, Prashanth, Vivek Oberoi, Sneha, Himaja, Praveen are the prominent cast in the film.
మహేశ్ బాబుకు కోపం వచ్చిందట! దర్శకుడు కొరటాల శివపై అంతెత్తు లేచాడట!. ‘ఏంటిది.. అర్థం లేకుండ? చండాలంగా ఉంటుంది. జనాలు అసహ్యించుకుంటారు.’ అని సీరియస్ గా చెప్పేశాడట!. ఏంటి? ఎందుకొచ్చింది సూపర్ స్టార్ కి అంత కోపం అనుకుంటున్నారా?  ప్రస్తుతం కొరటాలశివ దర్శకత్వంలో మహేశ్ బాబు ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ‘భరత్ అను నేను’ అని టైటిల్ కూడా ఈ సినిమాకు ఫిక్స్ చేశారు. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రిగా నటిస్తున్నాడు. ఈ సినిమా సెకండాఫ్ లో ఓ ఐటమ్ సాంగ్ కి ప్లాన్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. సరిగ్గా అక్కడే మహేశ్ కి కోపం తన్నుకొచ్చింది. దానికి కారణం లేకపోలేదు. ‘భరత్ అను నేను’ సందేశాత్మక చిత్రం. సినిమా ద్వారా వినోదంతో పాటు కాస్తంత సందేశం కూడా ఇవ్వాలని భావించారు మహేశ్, కొరటాల శివ. సినిమా కూడా చాలా బాగా వస్తోందని టాక్. ఫస్టాప్ సినిమా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ లోని కీలక సన్నివేశాలు ఎక్కువుంటాయ్. కాస్త సీరియస్ మోడ్ లో కథ సాగుతుంది. ఇలాంటి టైమ్ లో మధ్యలో ఓ ఐటమ్ సాంగ్ ఉంటే బావుంటుందని దర్శకుడి భావన. అయితే... మహేశ్ మాత్రం దానికి పూర్తి భిన్నంగా స్పందించాడు. అందరూ కథలో ఉంటారు. మనం చెబుతున్న సమస్యలో మునిగి ఉంటారు. అలాంటి సమయంలో ఇలాంటి పాట పెడితే.. చండాలంగా ఉంటుంది. జనాలు అసహ్యించుకుంటారు. ఉండటానికి వీల్లేదు. అని కరాఖండీగా చెప్పేశాడట.  రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా! పేరు దర్శకుడు కెప్టెనే అయినా... హీరోదేగా ఇండస్ట్రీలో హవా. అదండీ విషయం. కైరా అడ్వాణీ మహేశ్‌కు జోడీగా నటిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు.
‘ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా... గుండు దిగిందా లేదా.. అనేది ముఖ్యం‘ అనే  డైలాగ్ పవర్ స్టార్ కి సరిగ్గా సరిపోయేది. ఏ హీరో ఎన్ని  రికార్డులైనా కొట్టనీ... కేవలం ఓపెనింగ్ తో రికార్డులన్నింటినీ మట్టి కరిపించేసేవాడు. ఆయన కంటే  సీనియర్ స్టార్లు సైతం.. ఆయన పవర్ దెబ్బకి వెనక్కెళ్లిపోయారు. అయితే... పవర్ స్టార్ ఆటలు ప్రతి చోటా సాగాయ్ కానీ.. ఒక్క చోట మాత్రం సాగలేదు. అదెక్కడ? అనేగా మీ ప్రశ్న? అయితే... వివరాల్లోకెళ్దాం.. ఎప్పుడో ‘శంకర్ దాదా జిందాబాద్’  తర్వాత ఇన్నేళ్లకు మెగాస్టార్  ‘ఖైదీ నంబర్ 150‘ చేశారు. మెగాస్టార్ హీరోగా ఉన్నంతవరకూ ఆయన దరిదాపులకు కూడా ఎవరూ రాలేకపోయారన్నది జగమెరిగిన సత్యం. ఎప్పుడైతే..ఆయన పాలిటిక్స్ అని వెళ్లిపోయారో.. అక్కడ్నుంచి ఆయన వదిలి వెళ్లిన ‘నంబర్ వన్’ స్థానం ఖాళీగానే ఉండిపోయింది. క్లారిటీగా.. క్లియర్ గా ‘ఈయనే నంబర్ వన్’ అని చెప్పగలిగే స్టార్  ఇప్పటివరకూ ఒక్కరూ లేరు.  వసూళ్ల పరంగా ఆ స్థానాన్ని పవర్ స్టార్ కైవసం చేసుకున్నాడనే అందరూ భావించారు. ‘బాహుబలి’ సినిమాలను పక్కన పెడితే... హీరో ఓరియెంటెడ్ మూవీస్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ‘అత్తారింటికి దారేది’. తొలివారం 40 కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టి.. 2017 సంక్రాంతి దాకా రికార్డుగా నిలిచిందా సినిమా. అయితే... 2017లో చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చారు. అంతే.. రికార్డులన్నీ మళ్లీ బద్దలు బద్దలైపోయాయ్. ‘ఖైదీ నంబర్ 150‘ తొలివారం ఏకంగా 77 కోట్ల షేర్ రాబట్టి... బాక్సాఫీస్ నివ్వెర పోయేలా చేసింది. దటీజ్ మెగాస్టార్. ఇప్పుడు తాను వదిలెళ్లిన నంబర్ వన్ ఛైర్ పై మళ్లీ ఆయనే కూర్చున్నట్టయ్యింది.  సరే... ‘ఏదో రాక రాక వచ్చాడు.. అందుకే అలా జనాలు ఇరగబడి చూశారు’ అనుకుందాం. మరి వెంటనే... పవర్ స్టార్ సినిమాలు ఓపెనింగ్ పరంగా అయినా.. మెగా రికార్డును తుడిచేయాలి కదా. ‘ఖైదీ నంబర్ 150‘ తర్వాత పవర్ స్టార్ వి రెండు సినిమాలొచ్చాయ్. అవే... కాటమరాయుడు, అజ్ఙాతవాసి. రెండూ డిజాస్టర్లు. ఓపెనింగుల పరంగా కూడా దారుణం. వేల కొలదీ థియేటర్లలో విడుదలైన ‘అజ్ఙాతవాసి’ సైతం... 50 కోట్ల వసూళ్ల దగ్గర చతికిలబడిపోయింది. దీన్ని బట్టి... అర్థమైందేంటి? ‘గుండు దిగడం కాదు ముఖ్యం అది సరైన చోట దిగిందా లేదా అనేది ముఖ్యం’..  అలా దిగాలంటే... అనుభవం ఉండాలి. ఏమంటారు? 
బాలీవుడ్ విలక్షణ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన పద్మావత్‌.. ప్రేక్షకులు ముందుకు రావడానికి ఎన్ని ఇబ్బందులు పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ రాణికథను వక్రీకరిస్తున్నారంటూ రాజ్‌పుత్ కర్ణీసేన షూటింగ్‌ను.. సినిమా విడుదలను అడ్డుకుంది. చరిత్రకారుల సూచన మేరకు మార్పులు చేర్పులు చేసిన తర్వాత సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు అనుమతినిచ్చింది. ఇదే సమయంలో పద్మావత్ థియేటర్లలోకి వస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించారు. దీనిపై నిర్మాతలు సుప్రీంకోర్టుకు వెళ్లడం.. అత్యున్నత న్యాయస్థానం ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగింది. అయితే రాజ్‌పుత్ సంఘాలు మాత్రం సుప్రీం ఆదేశాలను ధిక్కరించేలా వ్యవహరిస్తున్నాయి. పద్మావత్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడనివ్వబోమని దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో రాజ్‌పుత్ సంఘాలు ఆందోళనను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో హింసాత్మక, విధ్వంసక చర్యలకు పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి. తమ మాట కాదని సినిమాను విడుదల చేస్తే.. ఆ థియేటర్లను తగులబెడతామని వారు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే పద్మావత్‌ను థియేటర్లలో కూడా బతకనిచ్చేలా కనిపించడం లేదని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. సినిమా విడుదలై మొదటి షో బయటకు వస్తేనే కాదని అందులో ఏం చూపించారో తెలియదు.. అప్పటిదాకా ఆందోళనలు ఆగవు అంటున్నారు సినీ జనాలు.
  అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లో వస్తున్న ఆదరణతో ఈ సారి కూడా అధికారం తమదేనని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్న వేళ.. అలా జరిగితే తమ పార్టీ మనుగడ కష్టమని.. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని జగన్ కాళ్లకు బలపాలు కట్టుకుని తిరుగుతున్న సమయంలో వెలువడిన ఒక సర్వే రిజల్ట్.. టీడీపీకి షాక్‌ని.. వైసీపీకి మంచి బూస్ట్‌ని అందించింది. 2019 సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ స్థానాల్లో రిపబ్లికన్ టీవీ, సీ ఓటర్ సర్వే నిర్వహించాయి. దీని ప్రకారం 2019లో మళ్లీ ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఏపీలో వైసీపీకి, తెలంగాణలో టీఆర్ఎస్‌కి, తమిళనాడులో రజనీకి ఆధిక్యం ఉన్నట్లుగా తెలిపింది.   ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-బీజేపీ కూటమికి 12 పార్లమెంట్ స్థానాలు దక్కుతాయట.. అంటే గత ఎన్నికలతో పోలిస్తే 5 స్థానాలు తగ్గుతాయని అభిప్రాయపడింది. అదే సమయంలో ఇతరులకు అంటే.. ఏపీలో మరో పార్టీ లేదు కాబట్టి వైసీపీకి 13 స్థానాలు వస్తాయని తేల్చింది. రిపబ్లిక్ టీవీ వెలువరించిన కథనంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అధికార పార్టీ మైండ్ గేమ్‌కు చిత్తవుతున్న వేళ.. తమ పార్టీకే ప్రజాదరణ దక్కుతుందని కథనం రావడం పెద్ద బూస్టప్ ఇచ్చినట్లే. ఎన్నికలకు ఇంకా ఏడాది గడువున్న టైంలో ఇలాంటి వార్తలు రావడం వెనుక ఏదో ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.   సర్వే నిర్వహించిన రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి బీజేపీ పక్షపాతి అన్నది ఓపెన్ టాక్. సీట్‌లో ఎంతటి వారున్నా సరే తన వాగ్ధాటితో ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించే అర్నాబ్‌... 2014 ఎన్నికల సమయంలో మోడీని చేసిన ఇంటర్వ్యూతో తాను ప్రధానికి పరమ భక్తుడిని అని చెప్పకనే చెప్పాడు. తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎన్డీఏ 335 సీట్లు సాధిస్తుందని చెప్పి బీజేపీ భజన చేసిన అర్నాబ్‌‌.. మరి అదే ఎన్డీఏ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని తక్కువ చేసి చూపడం అనుమానాలకు తావిస్తోంది. పోలవరం స్పిల్ వే టెండర్లను నిలిపివేయాల్సిందిగా ఏపీ సర్కార్‌ను కేంద్రప్రభుత్వం ఎప్పుడైతే ఆదేశించిందో అప్పటి నుంచి బీజేపీ-మోడీ‌ బంధం తెగిపోవడానికి కౌంట్‌డౌన్ స్టార్టయ్యిందని అందరూ భావించారు.   అందుకు తగ్గట్టుగానే నిధులివ్వమంటే ఇవ్వరు.. మా బాధలు మేం పడి పనులు పూర్తి చేసుకుంటుంటే మీకు ఎందుకు అంత నొప్పి అంటూ కొంతమంది టీడీపీ నేతలు బీజేపీని ఓపెన్‌గానే కార్నర్ చేస్తున్నారు. మరి వాళ్లు తక్కువ తింటారా..? టీడీపీకి బలంగానే కౌంటర్ వేస్తున్నారు. చంద్రబాబు కూడా మోడీతో తాడో పేడో తేల్చుకుంటారని.. ఢిల్లీ టూర్‌లో మొత్తం తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. తీరా సీఎం.. పీఎంలు గంటపాటు రాష్ట్ర సమస్యల గురించి చర్చించుకున్నారు.. నవ్వుతూ బయటకు వచ్చారు. తాము ఎంతగా ప్రయత్నిస్తున్నటికీ బాబును ఆపడం సాధ్యం కాకపోవడంతో బీజేపీ పెద్దలు అర్నాబ్‌ను రంగంలోకి దించారట. తద్వారా ఎన్నికలు దగ్గరపడే లోగా చంద్రబాబు నైతిక స్థైర్యాన్నీ దెబ్బ తీయాలన్నది కమల నాథుల మైండ్‌గేమ్‌గా చెబుతున్నారు విశ్లేషకులు. ఈ గేమ్‌లో ఫస్ట్ స్టెప్‌‌లో భాగంగానే సర్వే చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
మళ్లీ పూర్వవైభవాన్ని తీసుకొస్తాడనుకున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో తెలంగాణ తెలుగుదేశం శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయాయి. అయినప్పటికీ సీనియర్లు మోత్కుపల్లి, రావుల, ఎల్ రమణ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ వర్థంతి వేళ మోత్కుపల్లి నర్సింహులు అన్న మాటలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.   తెలంగాణ ప్రాంతంలో టీడీపీ రోజు రోజుకి ప్రాభవం కోల్పోతోందని.. అలాంటి మాటలు వింటుంటే మనసుకి బాధనిపిస్తోందని.. పార్టీని భుజాన వేసుకుని నడుపుదామన్నా.. అందుకు సహకరించేవారు లేరని.. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు.. ఓటర్ల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు మంత్రులు, మెజారిటీ నేతలు అందరూ టీడీపీ నుంచి వెళ్లినవారే. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ మోత్కుపల్లి వ్యాఖ్యానించడంతో అక్కడున్న కార్యకర్తలు, నేతలు అవాక్కయ్యారు.   ఎంతగా ప్రజల్లోకి వెళుతున్నా వారి నుంచి సరైన స్పందన లేకపోవడానికి తోడు.. ఎన్నో ఏళ్లుగా ఆశిస్తున్న గవర్నర్ గిరి ఇక దక్కే అవకాశం లేదు..? కనీసం రాజ్యసభకైనా పంపిస్తారా అన్న గ్యారెంటీ చంద్రబాబు నుంచి లేకపోవడంతో ఆయనలో కాస్త అసహనం పెరిగిందంటున్నారు. అందుకే తన దారి తాను చూసుకోవాలని మోత్కుపల్లి భావిస్తున్నారని.. దీనిలో భాగంగానే పార్టీ మారతానని చెప్పకుండా.. పార్టీని టీఆర్ఎస్‌లో వీలినం చేయాలంటూ కొత్తరాగం అందుకున్నారు అంటూ పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు అప్పట్లో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా నర్సింహులను టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు కేసీఆర్ సిద్దంగానే ఉన్నప్పటికీ ఆయన వైపు నుంచి స్పందన రాలేదు. అయితే నర్సింహులు నోటి వెంట విలీనం మాట రావడంతో తెర వెనుక ఏదో జరిగిందన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.   టీఆర్ఎస్ నుంచి ఆఫరైనా వచ్చి ఉండాలని లేదంటే.. ఎంత కష్టపడినా పార్టీ బండి నడవటం కష్టమేనని భావించి ఆ మాటలు అన్నారా అంటూ శ్రేణుల్లో ఒకింత అయోమయం నెలకొంది. ఈ విషయంపై అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా స్పందించాల్సి ఉంది.. ఉదయం అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో ఉన్న ఆయనకు పార్టీ నాయకులు మోత్కుపల్లి మ్యాటర్‌ను చెప్పారట. ఆ మాట విన్న వెంటనే సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే నర్సింహులు వంటి సీనియర్ నేతే విలీనం పాట పాడటం వల్ల పార్టీ పరిస్థితిపై శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి అని.. ఈ విధమైన ప్రకటన చేయడం ద్వారా పార్టీకి నష్టం కలుగుతుందని తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఓపెన్‌గానే అంటున్నారు. మరి నర్సింహులుపై అధినేత ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో.. శ్రేణులకు ఏం సమాధానం చెబుతారో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
  ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ఇక వచ్చే ఏడాది ఎన్నికలు కూడా ఉండటంతో నేతలందరూ తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పటినుండే కసరత్తులు చేస్తున్నారు. ఇక చంద్రబాబు కూడా తమ పార్టీ గురించి తగు జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఇప్పటికే మిత్రపక్షమైనప్పటికీ టీడీపీ-బీజేపీల మధ్య విబేధాలు ఉన్నాయి. అప్పుడప్పుడు బహిరంగానే అవి బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తుపై కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు మే నెల వరకూ గడువు తీసుకున్నట్టు తెలుస్తోంది   నిజానికి అవ్వడానికి మిత్రపక్షమైనా మోడీ ఏపీకి చేసింది పెద్దగా ఏం లేదనే చెప్పొచ్చు. చంద్రబాబు కేంద్రం చుట్టూ తిరగి.. తిరిగి... వాళ్లని అడిగి అడిగి సాయం చేయండయ్యా బాబు అంటే ఆ మాత్రం నిధులన్నా ఇచ్చారు. నిజానికి కేంద్రం విషయంలో చంద్రబాబు చాలా ఓపికగా ఉన్నట్టే. నాలుగేళ్ల సమయం ఇవ్వడం అనేది చిన్న విషయం ఏం కాదు. నాలుగేళ్లే ఇచ్చారు.. ఇంకా ఈ నాలుగు నెలలు ఇవ్వడం పెద్ద మేటర్ ఏంకాదు. అంతకన్నా ఎక్కువ టైం ఇచ్చినా టీడీపీకే నష్టం. ఎందుకంటే ఇంకా ఎదురుచూపులు చూస్తే జనం టీడీపీని అపార్ధం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చంద్రబాబు కూడా కావాలనే టైం తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి కారణం లేకపోతే..   అసలు సంగతేంటంటే.. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. అయితే మే నెలలోపు  కర్ణాటకతో పాటు మరో మూడు ఈశాన్య రాష్ట్రాలకు ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీకి ఉన్న సామర్ధ్యం ఏంటో.. బీజేపీ భవితవ్యం ఏంటో తెలుస్తుంది. కాబట్టి మే నెలలో ఒక డెసిషన్ తీసుకోవచ్చు అని చంద్రబాబు ఆలోచన అని రాజకీయ విశ్లేషకుల మాట. బీజేపీతో ఇప్పుడే తెగతెంపులు చేసుకుంటే.. ఒకవేళ ఎన్నికల్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా ఉంటే.. రాష్ట్రానికి అందుతున్న ఈ పాటి సాయం కూడా అందదని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఫలితాలు అటూ ఇటూ అయి.. బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే.. టీడీపీ బయటకు వస్తుంది. మరి టీడీపీని కాదని.. బీజేపీ వైసీపీ తో చేయి కలిపి... ఇప్పుడు చెప్పిన సోది... హామీలు ఇచ్చినా నమ్మే పరిస్థితిలో అయితే జనం లేరు. అందుకే చంద్రబాబు ముందు చూపుతో ఆలోచించి మే వరకూ టైం తీసుకున్నట్టు వినికిడి. మరి అందుకేనేమో చంద్రబాబును రాజకీయ చాణక్యుడు అన్నది. అంత ముందు చూపుతో ఆలోచిస్తారు కాబట్టే ఆయనకు ఆపేరు వచ్చింది.
  ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటారో చెప్పాల్సిన పని లేదు... మనకి ఇదే పెద్ద పండుగ... ఉద్యోగరిత్యా ఎక్కడ ఉన్నా, అన్నీ వదిలిపెట్టి, సొంత ఊరు వచ్చేసి, ఈ మూడు రోజులు అన్నీ మర్చిపోయి సంక్రాంతి పండుగ జరుపుకుంటాం... అంతగా మనం ఈ పండుగకు కనెక్ట్ అయిపోయాము.. అలాగే తెలంగాణాలో మనంత జరుపుకోకపోయినా, అక్కడ కూడా పండుగ జరుపుకుంటారు... దేశ వ్యాప్తంగా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, ఇలా వివిధ రాష్ట్రాల్లో పొంగల్ అని, లోహ్రి అని, ఉత్తరాయణ్ అని, ఇలా వివిధ రకాల పేర్లతో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు...   యాదృశ్చికమో.. లేక అనుకోకుండా జరిగిపోయిందో తెలియదు కానీ మరోసారి మోడీకి ఏపీపై ఉన్న చిన్నచూపు బయటపడింది. ఇప్పటికే మోడీకి ఏపీపై ఉన్న చిన్నచూపు ఏంటో చాలా సార్లు బయటపడింది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సాక్షిగా ఏపీపై ఉన్న చిన్న చూపు బయటపడింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా జరుపుకుంటారో చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు పండుగల్లో.. కొత్త ఏడాది ప్రారంభంలో వచ్చే సంక్రాంతి పండుగ మనకి పెద్ద పండుగ. ఈ పండక్కి ఎక్కడెక్కడ ఉన్న వాళ్లందరూ సొంతఊరుకు వచ్చి  ఈ మూడు రోజులు అన్నీ మర్చిపోయి సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఇక మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటామో.. తెలంగాణాలో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ వివిధ రాష్ట్రాల్లో పలు రకాల పేర్లతో జరుపుకుంటారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు విషయం ఉంది. నరేంద్ర మోడీ గారు, నిన్న తమిళనాడు,గుజరాత్, మరాఠీ, పంజాబ్, నార్త్ ఇండియన్ సోదరుల అందరికి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. తమిళ్, కన్నడ, పంజాబీ వారి వారి భాషల్లో  వేరు వేరు భాషల్లో ట్వీట్ చేశారు. అలాగే మన ఏపీ ప్రజలకు కూడా చెబుతారు అని అనుకున్నారు. కానీ మోడీ గారు మాత్రం మనల్ని మరిచిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న తెలుగువారికి, వారి తెలుగు భాషలో కాని, ఇంగ్లీష్ లో కాని, పండుగ శుభాకాంక్షలు చెప్పలేదు ప్రధాని. అంతే మరోసారి మోడీకి ఏపీ అంటే ఎంత గౌరవం... ఏపీ ప్రజలంటే ఎంత మర్యాద.. అని అనుకుంటున్నారు. ప్రధాని మోడీకి ఇవాళ మన తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని తెలీదా ? గుర్తు రాలేదా? లేక వచ్చినా, అవసరం లేదు అనుకున్నారా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే..రాహుల్ గాంధీ అయితే, కేవలం కర్ణాటక రాష్ట్రానికి మాత్రమే విషెస్ చెప్పారు. ఎందుకో తెలుసా... కర్ణాటకలో త్వరలో ఎన్నికలు ఉన్నాయి కదా... మొత్తానికి రాజకీయ నాయకుల బుద్ది మరోసారి బయటపెట్టారు. అంతేకాదు మోడీకి కూడా ఏపీ ప్రజలపై ఉన్న చిన్నచూపు మరోసారి బయటపెట్టాడు. అంతేకాదు తెలియకపోతే,పెద్ద ఇబ్బంది ఏమి లేదు.. అదే కావాలి అని చేస్తే, మాత్రం ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న, అయిదు కోట్ల ఆంధ్రులు ఆలోచించుకొని, జాగ్రత్తపడవలసిన అవసరం ఉంది మరి.
  సుప్రీంకోర్టు.. దశాబ్దాలుగా భారతదేశ న్యాయవ్యవస్థను భుజాలపై మోస్తూ.. సంచలన తీర్పులతో.. ఎందరో దోషులను శిక్షించి ధర్మాన్ని నిలబెట్టి.. ప్రపంచం చేత జేజేలు కొట్టించుకున్న సర్వోన్నత న్యాయస్థానం. కింది కోర్టులలో న్యాయం జరగని వారికి మనకు సుప్రీంకోర్టు ఉందన్న భరోసాని అందించింది అంటే సుప్రీంకోర్టు గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. అటువంటి గొప్ప సంస్థ ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది. స్వతంత్ర్య భారత చరిత్రలోనే మునుపెన్నడూ జరగని పరిణామం ఇవాళ జరిగింది. న్యాయం చేయాలంటూ సుప్రీం జడ్జీల ముందు మనం నిలబడితే.. మీరే సుప్రీంను కాపాడాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని నడిపిస్తున్న న్యాయమూర్తులు దేశ ప్రజల ముందుకొచ్చారు.   ఒకేసారి నలుగురు జడ్జీలు ప్రెస్ మీట్ పెట్టి మరి సుప్రీంలో జరుగుతున్న అవతవకలను జాతికి తెలియజేశారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు మీడియా ముందుకు వచ్చి.. "భారత చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది.. స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. సుప్రీంలో పాలనా వ్యవస్థ సరైన క్రమంలో లేదు.. గత కొద్ది రోజులుగా అవాంఛిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాలపై మేం నలుగురుం చర్చించి.. పాలనా వ్యవస్థను సరిదిద్దాల్సిందిగా కోరుతూ కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం. అయితే ఆయనను ఒప్పించడంలో మేం విఫలమయ్యాం.. జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం తప్ప మా ముందు మరో మార్గం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం.. న్యాయమూర్తులుగా ఇలాంటి సమావేశం పెట్టడం బాధాకరమే అయినా.. సుప్రీంకోర్టు వ్యవస్థకు, దేశానికి మేం బాధ్యత వహిస్తున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అంటూ" చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు పంపిన లేఖను మీడియాకు చూపారు.   ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చీఫ్ జస్టిస్ వ్యవహార శైలి సవ్యంగా లేదంటూ.. ఏకంగా నలుగురు సీనియర్ జడ్జిలు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆరోపించడం.. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని మరింత తగ్గిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరిణామాలు తెర వెనుక ఏదో జరుగుతున్నదనే అనుమానం సామాన్యులకు కలిగేలా చేసిందని భావిస్తున్నారు. మరోవైపు న్యాయమూర్తుల మీడియా సమావేశం కేంద్రప్రభుత్వ వర్గాల్లో సంచలనం కలిగించింది. వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీ.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో అత్యవసరంగా సమావేశమై చర్చించారు. కేంద్రప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఈ సంక్షోభాన్ని చక్కదిద్దకపోతే.. దేశ ప్రజాస్వామ్య మౌలిక వ్యవస్థ సవ్యంగా పరిఢవిల్లేలా చేస్తున్న మూడు స్తంభాల్లో ఒకటిగా.. ప్రపంచం చేత జేజేలు పలికించుకుంటున్న భారత సర్వోన్నత న్యాయస్థానానికి కలంకాన్ని తీసుకువస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  
  రాజకీయాలు మరీ ఎంత దారుణంగా తయారయ్యాయి అంటే.. ఆఖరికి తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేవుళ్లను కూడా.. రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఎప్పటినుండో అభిమానులతో పాటు అందరినీ సస్పెన్స్ లో పెట్టి ఎట్టకేలకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చారో... లేదో..?అప్పుడే ఆయనపై విమర్శల దాడి పెరిగింది. పాపం ఆయన వల్ల దేవుడు మాటలు పడాల్సి  వచ్చింది. రజనీకాంత్ వల్ల దేవుడు మాటలుపడటం ఏంటని అనుకుంటున్నారా..? ఆ స్టోరీ ఏంటో చూద్దాం..   ఆద్యాత్మికత పేరుతో రజనీ రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడే డీఎంకే పార్టీ రివర్స్ లో వస్తుంది. రజనీ ఆద్యాత్మికత పేరుతో ప్రజల్లోకి రావాలని చూస్తుంటే... డీఎంకే పార్టీ ఇంకోసారి ద్రవిడ ఉద్యమ స్ఫూర్తి రగిలించేందుకు ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు డీఎంకే ద్రవిడ ఉద్యమ పునాదుల మీద నడిచేది. అయితే కాలనుగుణంగా మారుతూ.. కొన్ని పరిస్థితుల వల్ల ద్రవిడ ఉద్యమాన్ని పక్కన పెట్టింది. ఇక ఇప్పుడు...  ఇక ఇప్పుడు ఆధ్యాత్మిక రాజకీయం అని రజని రేసులోకి రాగానే.. మళ్లీ ద్రవిడ ఉద్యమం అంటూ నాస్తికతను తెరపైకి తెచ్చారు.   ఆ క్రమంలోనే ఇకపై తమిళనాడులో నాస్తిక సభలు విరివిగా జరిగేలా చూడాలని ఆ పార్టీ అనుకుంటోంది. అంతేకాదు ఇటీవల  తిరుచ్చి లో నాస్తిక సమాజ మహానాడు జరగగా... అందులో డీఎంకే ఎంపీ , కరుణ కుమార్తె , స్టాలిన్ సోదరి కనిమొళి పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కనిమొళి.. ఏకంగా తిరుమల ఏడుకొండలవాడి మీదే విమర్శలు గుప్పించింది. “ తిరుమల ఏడుకొండలవాడు డబ్బున్న వాళ్ళకే దేవుడు. సామాన్యుడు ఆయన్ని దర్శించుకోవాలంటే పడిగాపులు కాయాల్సిందే. పేద‌వాడిని కాపాడ‌లేని దేవుడు మ‌న‌కెందుక‌ని.. సొంత హుండీని కాపాడుకోలేని ఆయన ఇక భక్తులని ఏమి కాపాడతాడు. ఏడుకొండలవాడు దేవుడై,ఆయనకు శక్తులు ఉంటే ఇక ఆయనకు భద్రత ఎందుకు ? అని సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్కడితో ఆగకుండా.... అసలు మతాలు ప్రపంచంలో వున్న మనుషుల్ని విడగొడుతున్నాయని, వారిని ఒక్క తాటి మీదకు తెచ్చే శక్తి నాస్తికత్వానికే వుంది. ప్రపంచ యుద్ధాల కన్నా మతాల వల్లే ఎక్కువ రక్తం చిందింది. ఈ జాతి ,మత ఘర్షణలు ఆగిపోవాలంటే నాస్తికవాదంతో పాటు మానవతావాదం వ్యాప్తి చెందాలి “ అని కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కనిమొళి చేసిన వ్యాఖ్యలు ఒక్క తమిళనాట మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నారు. ఏది ఏమైనా.. ఎంతో మంది భక్తులు.. ఎన్నో ప్రాంతాల నుండి ఏడుకొండలవాడి దర్శనానికి వచ్చి.. శ్రీవారిని ఒక్క‌సారి ద‌ర్శిస్తే చాలు స‌క‌ల పాపాలూ హ‌రించుకుపోతాయ‌ని నమ్ముకునే వారు ఎంతో మంది ఉంటే.. రాజకీయాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. మరి ఈ వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతాయో చూద్దాం...
సాధారణంగా మనకు భయం వేస్తే ఏం చేస్తాం. దాన్ని అణచివేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాం. అది ఆటోమేటిక్ గా జరిగే ప్రక్రియ. ఒకవేళ, మనకి జాబ్ కోల్పోయే పరిస్థితి వస్తే ఎలా పేస్ చేస్తాం. ఉదాహరణకి, మనం వర్క్ చేస్తున్న ఆఫీస్ లో కొందర్ని తీసేస్తున్నారు అని వార్త వచ్చింది అనుకోండి, ఫ్లోర్ ఫ్లోరంతా టెన్షన్ పడిపోతారు. కొందరు తాము ఆ లిస్ట్ లో ఉన్నామా అని భయపడుతుంటే, ధైర్యవంతులు మాత్రం తమకేం కాదని నార్మల్ గా ఉంటారు. మరి ఇలాంటి సిట్యుయేషన్ ని ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=aybrrLOmweA            
చాలా మంది యువకులు చిన్న వయసులోనే థైరాయిడ్, డయాబెటిస్ లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఇవి కాకుండా ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలు ఎక్కువవడం... తరచుగా తల నొప్పి రావడం అనేది చాలా కామన్ అయిపొయింది. ఒత్తిడి వల్ల కోపం, చిరాకు ప్రదర్శించడం చేస్తూ ఉంటాం. ఈ జనరేషన్ మొత్తం తీసుకుంటే హ్యాపినెస్ కి దూరం అయిపోతున్నారు. యూత్ క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడం లేదు. మరి ఈ సమస్యని ఎదుర్కోవడం ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=sptOILN5xOY
  గత కొద్దికాలంగా ఆప్ నేతలపై ఎలాంటి ఫిర్యాదులు, ఎలాంటి కేసులు లేవని అనుకుంటుండగానే మరో సారి ఆప్ పార్టీకి గట్టి షాకే తగిలింది.  కేంద్ర ఎన్నికల సంఘం అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చింది. ఆప్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ఈసీ పేర్కొంది. వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సిఫారసు చేసింది. వీరంతా పార్లమెంటు సెక్రటరీలుగా లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నారని తెలిపింది. కాగా 70 మంది ఎమ్మెల్యేలు ఉండే ఢిల్లీ అసెంబ్లీలో 66 మంది ఆప్ కు చెందినవారే ఉన్నారు. దీంతో వీరిపై అనర్హత వేటు పడ్డా కేజ్రీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఒకవేళ ఈ 20 మందిని రాష్ట్రపతి అనర్హులుగా ప్రకటిస్తే... ఈ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతుంది.
ఏపీ ముఖ్యమంత్రిగారిని తెలంగాణ ముఖ్యమంత్రి గారి మాటలు బాధపెట్టాయట. ఇంతకీ అంతలా కేసీఆర్ ఏమన్నారు... చంద్రబాబును అంతలా బాధ పెట్టిన మాటలు ఏంటనుకుంటున్నారా..అసలు సంగతేంటంటే.... హైదరాబాద్ లోని పార్క్ హయత్ జరిగిన ఇండియా టు డే కాన్ క్లేవ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్...తెలంగాణను ఏపీతో పోల్చవద్దని, ఏపీ కన్నా తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కదా. ఈ మాటలే చంద్రబాబును బాధపెట్టాయట. అమరావతిలో కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు...ఏపీతో తెలంగాణను పోల్చవద్దంటూ తెలంగాణా సీఎం కేసీఆర్ అనడం బాధాకరమని.. దక్షిణాదిన తలసరి ఆదాయంలో ఏపీ అట్టడుగున ఉందని, ఇందుకు రాష్ట్ర విభజనే కారణమని ఆయన చెప్పారట. రాజధాని కాబట్టే ఏపీ ప్రజలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారని.. తెలంగాణను ఆంద్ర పాలకులు ధ్వంసం చేశారనడం సరికాదన్నారు. అంతేకాదు.. ఇతర రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చేవరకు ఆంద్ర ప్రదేశ్ ను కేంద్రం ఆదుకోవలసిందేనని...ఈ విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం అని కూడా చెప్పారట.
వైసీపీ నేత వంగవీటి రాధా టీడీపీలో చేరుతున్నట్టు గత నాలుగు రోజుల నుండి వార్తలు హల్ చల్ చేస్తున్నసంగతి తెలిసిందే కదా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌ను రాధ ఆశిస్తున్నారని, అయితే ఆ సీటును మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడడంతో అలక వహించి రాధ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రాధా స్పందించారు. దేనికైనా సమయం రావాలని...” నా పని నేను చేసుకుని వెళ్తున్నా.. పార్టీ మారాలని భావిస్తే పక్కా ప్రణాళికతోనే వెళ్తా. నా రాజకీయ భవిష్యత్ గురించి నాకు తెలుసు. పార్టీ మారాలని భావిస్తే కంగారు పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ” అని ఆయన చెప్పారు. అందరికీ చెప్పాకే వెళ్తానని అన్నారు. అంతేకాదు... తనకు టీడీపీ నేతల్లో బంధువులు, స్నేహితులు ఉన్నారని, వారితో కలుస్తుంటానని... ప్రతి సంబంధాన్నీ రాజకీయాలతో ముడిపెట్టరాదన్నారు. చిన్న చిన్న పదవులు ఆశించి పార్టీ మారబోనని, ఎమ్మెల్యేగా పని చేసిన తనకు ఎమ్మెల్సీ ఎందుకని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి రాధా సూటిగా సమాధానం చెప్పకపోవడంతో... భవిష్యత్తులో పార్టీ మార్పు ఉండచ్చు అని అంటున్నారు.
వంట వండడానికి ఎలాంటి ఆయిల్ ఉపయోగించాలి? రకరకాల నూనెల్ని ఎందుకు మిక్స్ చేయాలి? అసలు, ఒక మనిషి గరిష్టంగా ఎంత ఆయిల్ తీసుకోవాలో తెలుసా? 20 గ్రాములు అంటే 4 టీ స్పూన్స్. సో, ఒక మనిషి ఒక నెలకి దాదాపు 600 గ్రాముల మించి ఆయిల్ తీసుకోకూడదు. అయితే, మనకి తెలియకుండానే మోతాదుకు మించి నూనె వినియోగిస్తున్నాం. మరి, వంట చేసేప్పుడు నూనె సరైన మోతాదులో వాడేందుకు ఎలాంటి జాగర్తలు తీసుకోవాలో తెలుసుకోవాలనుంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=uKdp171Qksw
అనీమియా అంటే రక్తంలో అవసరం కన్నా తక్కువ మోతాదులో హిమోగ్లోబిన్ ఉండడం. ఈ సమస్య మన భారతీయుల్లో, అందులోనూ ఆడవాళ్లు మరియు చిన్నపిల్లల్లో కాస్త ఎక్కువగా ఉంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం వల్ల త్వరగా అలసిపోవడం, నీరసించిపోవడం, బుద్ది మందగించడం లాంటివి జరుగుతుంటాయి. మరి అనీమియా ప్రాబ్లెమ్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.. https://www.youtube.com/watch?v=yytNrsuoRKE
రక్త నాళాలకి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించడానికి డయాబెటిస్ అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా, డయాబెటిస్ వాళ్ళకి రక్తంలో గ్లూకోస్ నార్మల్ గా ఉండాలి కాబట్టి, షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండేలా జాగర్తలు తీసుకుంటాం. అలాగే, రక్తంలో కొవ్వు పదార్థాలు కూడా నార్మల్ గా ఉండేలా కేర్ తీసుకోవాలి. అయితే, రక్త నాళాలకి సంబంధించిన వ్యాధులు రాకుండా నివారించడానికి, ఒకవేళ వస్తే ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=MXtNCEqoojM