Publish Date:Aug 2, 2018
Publish Date:Aug 1, 2018
Publish Date:Aug 1, 2018
Publish Date:Aug 1, 2018
Publish Date:Aug 1, 2018
Publish Date:Jul 31, 2018
Publish Date:Jul 31, 2018
Publish Date:Jul 31, 2018
Publish Date:Jul 30, 2018
Publish Date:Jul 30, 2018
Publish Date:Jul 30, 2018

EDITORIAL SPECIAL
  ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ అధినేత వైస్ జగన్ బాబాయ్ వైఎస్‌ వివేకానందరెడ్డి మృతి సంచలనం రేపుతోంది. ఆయన మరణం పలు అనుమానాలకు దారి తీస్తుంది. మొదట ఆయన తెల్లవారు జామున బాత్ రూమ్ కి వెళ్లి గుండె పోటుతో అక్కడే కుప్పకూలిపోయి చనిపోయారని వార్తలొచ్చాయి. కాసేపటికి ఆయన మృతదేహం రక్తం మడుగులో పడి ఉందని.. ఆయన తలకి, చేతులకి గాయాలు ఉన్నాయని.. ఆయన పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన మృతిపై అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలను నిజం చేస్తూ పోలీసులు కూడా వివేకాది హత్యే అని ప్రాధమికంగా నిర్దారించారు. వివేకానంద రెడ్డిది సహజ మరణం కాదని, ఆయన హత్యకు గురైనట్టు పోస్టుమార్టం నివేదికలో ప్రాథమికంగా నిర్థారణ అయిందని పోలీసులు వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నట్లు, పదునైన ఆయుధంతో వివేకా తల, శరీరంపై దాడి చేసినట్లు వైద్యులు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికను బట్టి చూస్తే వివేకా హత్యకు గురయ్యారని అర్ధమవుతోంది. అయితే ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన రక్తపు మడుగులో పడి ఉంటే.. ఆయనది సహజం మరణమని, ఆయన గుండెపోటుతో మరణించారని ఎందుకు ప్రచారం చేశారు?. అసలు తొలుత అలా ఎవరు ప్రచారం చేశారు? అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?. వివేకా సౌమ్యుడని, వివాదాలకు దూరంగా ఉంటారని పేరుంది. మరి అలాంటి వ్యక్తిని చంపాల్సిన అవసరం ఎవరికుంది?. ఆయన హత్య వెనుక రాజకీయ కోణాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఇలా పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వేళ ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతకి స్వయానా బాబాయ్ అయిన వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంతో.. ఆయన మృతి రాజకీయ కోణం సంతరించుకుంది. ఇప్పటికే వివేకా మృతిపై కొందరు వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిమీద ఒకరు అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు వివేకా మృతిపై విచారణకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ నివేదిక వస్తే కానీ వివేకా మృతి వెనుక రాజకీయ కుట్ర ఉందో, మరేదైనా కక్ష ఉందో తెలీదు.
  2019-20 సంవత్సరానికి రూ.1,82,017 కోట్లతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌‌ను సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా ఎన్ని నిధులు వస్తాయో స్పష్టంగా తెలియదన్నారు. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రంలోనూ పూర్తి బడ్జెట్ ప్రవేశపెడతామని వెల్లడించారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఆరవ బడ్జెట్‌ అని చెప్పారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలు సహకారం అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు గుజరాత్‌, కేరళ అభివృద్ధి గురించే దేశవ్యాప్తంగా చర్చ జరిగేదని, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరుగుతోందని అన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న ప్రణాళిక దేశంలో చర్చకు కేంద్ర బిందువైందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. రైతుల్లో నిరాశను తొలగించామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణ రైతులకు కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. 2018 డిసెంబరు 11వ తేదీలోగా తీసుకున్న రైతు రుణాలు రూ.లక్ష వరకూ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయాభివృద్ధి కోసం రూ.20,107కోట్లు కేటాయించారు. రైతు బంధు సాయం కింద ఎకరానికి రూ.10వేలు అందిస్తుండగా, ఇందుకోసం రూ.12వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రైతు బీమా కోసం రూ.650కోట్లు కేటాయించిన కేసీఆర్‌ ప్రభుత్వం.. నీటిపారుదల శాఖకు రూ.22,500కోట్లు కేటాయించింది. తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు: వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు రైతు రుణమాఫీకి రూ.6వేల కోట్లు రైతు బంధుకు రూ.12 వేల కోట్లు రైతు బీమా రూ.650 కోట్లు నీటిపారుదలశాఖకు రూ.22,500కోట్లు నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు ఎస్సీల అభివృద్ధికి రూ.16,581 కోట్లు ఎస్టీల అభివృద్ధికి రూ.9,827 కోట్లు మైనార్టీల సంక్షేమానికి రూ.2004 కోట్లు ఈఎన్‌టీ, దంత పరీక్షలకు రూ.5,536 కోట్లు ఆసరా పెన్షన్లకు రూ.12,067 కోట్లు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ.1450 కోట్లు రూపాయికి కిలో బియ్యం పథకానికి రూ.2,744 కోట్లు దివ్యాంగుల పెన్షన్లకు రూ.12వేల కోట్లు ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు
  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేతల జంపింగులే హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే నేతలు వరుసపెట్టి టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. నేతల జంపింగులపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన వారే పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరి పనితీరు ఏంటో చంద్రబాబుకు తెలుసునని చెప్పుకొచ్చారు. పార్టీలో, చంద్రబాబుతో విభేదాలు ఉంటే ఎప్పుడో వెళ్లి ఉండేవారని, ఎన్నికలకు రెండు నెలల ముందు కాదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 150 సీట్లలో గెలిచి చంద్రబాబు సీఎం అవుతారని లోకేష్ ధీమా వ్యక్తం చేసారు. నాలుగేళ్ల 10 నెలలు ప్రయాణం చేసి, ఇప్పుడు బాబు మీద విమర్శలు చేయడంలో పరమార్ధాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నిన్న మొన్నటిదాకా జగన్ ను తిట్టి, ఇప్పుడు ఆయన దగ్గరకే వెళ్లడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నేతలు పార్టీలు మారినా ఏమీ కాదని.. సంక్షేమం, అభివృద్ధే టీడీపీకి అండగా నిలుస్తాయని లోకేష్ స్పష్టం చేసారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ ఎన్నికల బరిలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ మరియు కాంగ్రెస్ దిగనున్నాయి. టీడీపీ, వైసీపీల పొత్తు అసలు ఆప్షనే లేదు. ఇక టీడీపీ, బీజేపీలు గత ఎన్నికల్లో కలిసి పనిచేసినా.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాబట్టి బీజేపీతో పొత్తు ఉండే అవకాశం లేదు. జనసేన విషయానికొస్తే.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉండి టీడీపీకి మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, కేవలం వామపక్షాలతో కలిసి నడుస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికైతే జనసేనతో పొత్తు కూడా కష్టమే. మరి ఎన్నికల ముందు ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. ఇక మిగిలింది కాంగ్రెస్. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి.. అదేవిధంగా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే తెలంగాణలో వచ్చిన చేదు ఫలితాల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీలో ఎంతవరకు కలిసి పనిచేస్తాయో కూడా ఆలోచించాలి. కొందరు టీడీపీ నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాం కానీ రాష్ట్రంలో మాత్రం విడిగా పోటీ చేస్తేనే టీడీపీకి లాభమని అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు లోకేష్ ఏమో టీడీపీ, ఇతర పార్టీలతో పొత్తు అంటున్నారు. దీంతో అసలు టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అంటూ చర్చలు మొదలయ్యాయి. చూద్దాం మరి ఎన్నికల ముందు టీడీపీ పొత్తుల విషయంలో ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తుందో.
ALSO ON TELUGUONE N E W S
  రవిబాబు 'నువ్విలా' సినిమాతో హవీష్ హీరోగా పరిచయమయ్యాడు. తరవాత 'జీనియస్', 'రామ్ లీలా' సినిమాలు చేశాడు. కొంత విరామం తరవాత 'సెవెన్' అని ఒక డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇందులో రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు. వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో స్పెషల్ ఏంటంటే... హీరో ఒక్కడే. హీరోయిన్లు మాత్రం ఆరుగురు. ఆ ఆరుగురితోనూ హీరో ప్రేమకథలు నడుపుతాడు. ఒకేసారి అంతమందిని ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతణ్ణి ఎందుకు కోరుకుంటోంది? అనేది సినిమా అట! హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడ‌క్ష‌న్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నాలుగో వారంలో సినిమాలో తొలి పాటను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా రమేష్ వర్మ మాట్లాడుతూ "ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. సినిమా బాగా వచ్చింది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్  ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ట్విస్ట్ వెనుక కథలో భాగంగా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఏప్రిల్ నాలుగో వారంలో హవీష్, రెజీనాపై తెరకెక్కించిన తొలి పాటను విడుదల చేస్తున్నాం. మేలో సినిమాను విడుదల చేస్తాం" అన్నారు.
  తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వివాదాస్పద సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మకు ఎందుకంత కోపమో? వరుస సినిమాలతో చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. ఇక ట్విట్టర్ సంగతి చెప్పనక్కర్లేదు. సినిమాల విషయానికి వస్తే... 'లక్ష్మీస్ ఎన్టీఆర్'లో చంద్రబాబును నెగిటివ్ షేడ్‌లో చూపించారు వర్మ. అందులో 'వెన్నుపోటు' పాటతో చంద్రబాబుకు ఎంత చేటు చేయాలో అంతా చేశారు. మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బ‌యోపిక్‌లోనూ ఆయన్ను టార్గెట్ చేసినట్టు స్పష్టమవుతోంది. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కెసిఆర్ బయోపిక్ 'టైగర్ కెసిఆర్' ఫస్ట్ లుక్ విడుదల చేస్తానన్న వర్మ, సినిమా లుక్ విడుదల చేయలేదు. "మా భాష మీద న‌వ్విన‌వ్‌. మా ముఖాల మీద ఊసిన‌వ్‌. మా బాడీల మీద న‌డిచిన‌వ్ ఆంధ్రోడా. వ‌స్తున్నా... వ‌స్తున్నా... మీ తాట తీయ‌డానికి వస్తున్నా. టైగర్ కెసిఆర్... కమింగ్ సూన్" అని వర్మ ఒక వీడియో విడుదల చేశారు. "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు/విభజన తరవాత ప్రశాంతంగా కలిసి మెలిసి జీవిస్తున్న తెలంగాణ, ఆంధ్ర ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న రామ్ గోపాల్ వర్మ" అని నెటిజన్లు కామెంట్ చేశారు. వాటిపై వర్మ స్పందించారు. "నా సినిమాలో ఆంధ్ర‌వాళ్ళ‌ను విల‌న్లుగా చూపించ‌డం లేదు. విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన ప‌రిస్థితుల‌ను క‌ల్పించి కోట్లాది మంది ఆంధ్రోళ్ళ‌కు వెన్నుపోటు పొడిచిన కొంద‌రు ఆంధ్ర‌వాళ్ళ‌ను విల‌న్లుగా చూపిస్తున్నా" అని వర్మ పేర్కొన్నారు. అంతే కాదు "బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడి పీస్ ఫుల్ గాంధీ ఇండియా ఎలా సాధించారో... ఆంధ్రులపై అగ్రెస్సివ్ గాంధీ పోరాడి తెలంగాణ సాధించారు" అని ట్వీట్ చేశారు. దాంతో వర్మపై తెలుగుదేశం, చంద్రబాబు అభిమానులు మండిపడుతున్నారు.
  రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే సంద‌ర్బంగా ఇటీవ‌ల బిగ్ బి ఓ వీడియో చేసి సోష‌ల్ మీడియా లో పెట్టి షాక్చిచ్చిన సంగ‌తి తెలిసిందే.  ఇక సల్మాన్ ఖాన్, రామ్  చ‌ర‌ణ్ కు మ‌ధ్య ఉన్న స్నేహం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. చ‌ర‌ణ్ జంజీర్ సినిమా చేసే త‌రుణంలో స‌ల్మాన్ ఎంతో హెల్ప్ చేసాడు. అప్ప‌టి నుంచి మొద‌లైంది వీరి స్నేహం. అదే స‌మ‌యంలో తెలుగులో విడుద‌లైన స‌ల్మాన్ సినిమా `ప్రేమ ర‌త‌న్ ధ‌న్ పాయో` సినిమాకు డ‌బ్బింగ్ చెప్పాడు చ‌ర‌ణ్‌. అయితే మ‌రో సారి స‌ల్మాన్ కోసం రామ్ చ‌ర‌ణ్ త‌న గొంతుని అరువిస్తున్న‌ట్లు తెలుస్తోంది.  స‌ల్మాన్ ఖాన్ తాజాగా న‌టించిన `భార‌త్` చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ విడుద‌ల కానుంది. ఈ సినిమాకు స‌ల్మాన్ పాత్ర‌కు మ‌రోసారి చ‌ర‌ణ్ త‌న గొంతుని అరువిస్తున్నాడు. త్వ‌ర‌లో డ‌బ్బింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.  జూన్ 5న ఈ సినిమా విడుద‌ల కానుంది.
  కాంట్ర‌వ‌ర్సీల‌తో నిత్యం కాపురం చేసే రామ్ గోపాల్ వర్మ ...ఇటీవ‌ల ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తో చేయాల్సినంత కాంట్ర‌వ‌ర్సీ చేసాడు. ఇక ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్ర సాధ‌కుడు, తెలంగాణ మ‌ఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌యోపిక్ ను తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే వ‌ర్మ ఎనౌన్స్ మెంట్ చేసాడు. ఈ సినిమాకు `టైగ‌ర్  కేసీఆర్' అంటూ టైటిల్ కూడా ప్ర‌క‌టించాడు. ఇదిలా ఉంటే  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సంద‌ర్భంగా కేసీఆర్ బ‌యోపిక్ `టైగ‌ర్ కేసీఆర్` ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు వ‌ర్మ‌. అంతే కాదు వ‌ర్మ త‌నే స‌వ్వ‌యంగా సినిమాకు సంబంధించిన ఒక పాట‌ను పాడుతూ ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పెట్టాడు.  `నీ తాట తీయ‌నీకి వ‌స్తున్నా`` అంటూ సాగే ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో  వైర‌లో అవుతోంది.  కేసీఆర్ ఉద్య‌మ నేప‌థ్యంలో సాగే ఈ  సినిమా ఆ స‌మ‌యంలో ఉన్న నాయ‌కుల పాత్ర‌లన్నీ ఈ సినిమా లో ఉండబోతున్న‌ట్లు చెప్పుకొచ్చాడు వ‌ర్మ‌. మ‌రి ఈ సినిమాతో ఎంత ర‌చ్చ చేయ‌నున్నాడో వ‌ర్మ‌. వెయిట్ అండ్ సీ.
Cast - Raghava Lawrence, Kovai Sarala, Vedika Oviya & others Director - Raghava Lawrence Music Director - S Thaman Producer - Kalanidhi Maran Release Date - 19th April 2019 Kanchana movie sequel - Kanchana 3 which released today falls under the category of Comedy Thriller & is directed by Raghava Lawrence. So has this movie thrilled the audience with a scoop of laughter or has just made the audience laugh? Lets read the review.   Story: We all know Raghava Lawrance’s love towards his mother & this time he has taken this concept for his movie Kanchana 3. Kali (Lawrance) is extremely influenced by his mother who likes helping the needy & he also starts an orphanage for this kids. But a few politicians plan to make money with the orphanage for which Kali does not agree. What happens later? Does Kali successfully takes care of the orphanage? Answers to all these questions form the thriller comedy Kanchana 3   Plus Points: Raghava Lawrence acting Thaman Music Good Cinematography Graphics Glamorous Heroine & their acting   Minus Points: Regular Horror Concept High Tamil Nativity First Half stretchy   Analysis: From the beginning, Lawrance has made his mark with the horror movies. This time along with horror he has mixed a few emotional scenes too & done a good job as a director. Like always he has impressed the audience with great acting.   Finally: Though the audience may feel that the Tamil nativity is high, the mass audience will enjoy the movie thoroughly. Though it may be a regular horror concept, the entertaining comedy coupled with horror will entertain the audience. Rating - 2.75/5
  కేఏ పాల్.. ఒకప్పుడు మత ప్రభోదకుడిగా, శాంతి దూతగా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక కామెడీ పీస్ లా మిగిలిపోయాడు. అవమానాలు ఎదుర్కొన్న స్థాయి నుంచి ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగాడు. అంతలోనే నేలకు జారి హేళనలు ఎదుర్కొంటున్నాడు. అసలు కేఏ పాల్ కి ఏమైంది? ఎందుకిలా తయారయ్యాడు? క్లుప్తంగా తెలుసుకుందాం. కేఏ పాల్ పూర్తి పేరు కిలారి ఆనంద్ పాల్. ఆంధ్రప్రదేశ్ లోని చిట్టివలస అనే చిన్న గ్రామంలో జన్మించాడు. వారిది హిందూ మతం అయినప్పటికీ వారి కుటుంబం క్రిస్టియన్ మతంలోకి మారారు. దీంతో కేఏ పాల్ కి చిన్నతనం నుంచి జీసస్ ని పూజించడం అలవాటైంది. అయితే పాల్ చదువులో చాలా వెనుక ఉండేవాడు. పదో తరగతి రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు. అతికష్టం మీద మూడో సారి పాస్ అయ్యాడు. తరువాత మళ్ళీ ఇంటర్ లో కూడా ఫెయిల్. ఆ టైం లో పాల్ చిన్న చిన్న పనులు చేసి కూడా డబ్బులు సంపాదించుకునేవాడు. కానీ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆ అవమానాలే అతన్ని అందనంత ఎత్తుకి ఎదిగేలా చేశాయి. టెన్త్ కూడా పాస్ కానీ పాల్ పట్టుదలతో ఇంగ్లీష్ బాష మీద పట్టు సాధించాడు. మత ప్రభోదకుడిగా మారిపోయాడు. అనతికాలంలోనే ప్రపంచదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఒకానొక టైంలో 20 నిమిషాల ఉపన్యాసానికి 20 కోట్ల రూపాయలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. బోయింగ్ 747 ఎస్పీ విమానం కూడా ఆయన సొంతమైంది. ఆయన ట్రస్ట్ ద్వారా ఎందరో అనాధ పిల్లల్ని ఆదుకొని చదివించాడు, ఎందరో విదువరాళ్లకు ఆర్థికసాయం చేశాడు. అయితే అలా ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న కేఏ పాల్ రాజకీయాల పుణ్యమా అని కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు చేసిన కుట్రల్లో కేఏ పాల్ బలైపోయారు అంటుంటారు. కొందరు నాయకులు ఆయనను కోట్ల డబ్బులు ఇవ్వమని బెదిరించేవారట, కొందరైతే మత ప్రభోదనలు ఆపివేయాలని ఒత్తిడి తెచ్చేవారట. ఇలా రకరకాల ఒత్తిడులు, బెదిరింపులు.. మరోవైపు 2008 లో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ స్థాపించాడు. తరువాత ఒత్తిడులు మరింత పెరిగాయి. దీంతో ఆయన ఆ రాజకీయ కుట్రలు, ఒత్తిడులు తట్టుకోలేక 2009 ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఇంతలో సోదరుడిని హత్య చేశారన్న ఆరోపణలతో జైలు. అయితే తనని కుట్ర ప్రకారం జైలుకు పంపించారని కేఏ పాల్ చెప్తుంటారు. ఈ వరుస సంఘటనలతో పాల్ మెంటల్ గా బాగా డిస్ట్రబ్ అయ్యారు. మత ప్రభోదనలకు దూరమయ్యాడు. ఒకప్పుడు విమానాల్లో ప్రపంచ దేశాలు చుట్టొచ్చిన ఆయన.. ఇప్పుడు తన వింత చేష్టలు, వింత మాటలతో 2019 ఎన్నికల్లో ఒక కమెడియన్ గా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆయన చేష్టలు చూసి మనం నువ్వుకుంటున్నాం కానీ ఒకప్పుడు ఆయన్ని చూసిన వారు మాత్రం ప్రస్తుత ఆయన పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు.
  తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే 2014 ఎన్నికలు, 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగా తగ్గింది. 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 62.25 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. రాష్ట్రం మొత్తం మీద ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 75.61 శాతం పోలింగ్‌ నమోదైంది. అతితక్కువగా హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో 39.49 శాతం నమోదైంది. సాధారణంగానే హైదరాబాద్ లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో 53.27 శాతం ఉండగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 47.29 శాతం నమోదైంది. ఇక తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనీసం 40 శాతం కూడా నమోదు కాలేదు. అదేవిధంగా.. మల్కాజిగిరిలో 42.75 శాతం, సికింద్రాబాద్ లో 45 శాతం నమోదైంది. దీంతో ఓటర్లు మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలింగ్ శాతం తగ్గిపోవడానికి ముఖ్యంగా రెండు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు భారీ సంఖ్యలో హైదరాబాద్ లో నివసిస్తూ ఉంటారు. వీరిలో చాలామంది హైదరాబాద్ తో పాటు, సొంత ఊరిలో ఓటు కలిగి ఉన్నారు. ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీ కి కూడా ఎన్నికల జరగడంతో, చాలామంది హైదరాబాద్ నుండి తమ సొంత ఊళ్లకు వెళ్లి అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు.హైదరాబాద్ లో ఓటింగ్ శాతం తగ్గడానికి ఇది ఒక కారణంగా కనిపిస్తోంది. ఇక మరో ముఖ్య కారణం.. ఎవరికి ఓటేసి ఏం లాభం అనే అభిప్రాయం ఓటర్లలో ఏర్పడటం. అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ తరువాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ కు క్యూ కట్టారు. దీంతో అసెంబ్లీ అంతా దాదాపు గులాబీమయం అయింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ హవా కొనసాగేలా ఉంది. ఒకవేళ వేరే పార్టీ అభ్యర్థికి ఓటేస్తే.. వారు గెలిచినా టీఆర్ఎస్ గూటికి చేరే అవకాశముంది. ఈ మాత్రం దానికి ఓటేయడం ఎందుకనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పలు కారణాల పుణ్యమా అని తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గిపోయింది.
  ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్.. వరుసపెట్టి పలువురు నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ చేరికలు చూసి వైసీపీ శ్రేణులు ఆనందపడుతున్నారు. అయితే వారి చేరిక వల్ల వైసీపీకి కొత్తగా ఒరిగేది ఏముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే దాదాపు వారంతా గతంలో వైసీపీని వీడి, జగన్ మీద తీవ్ర విమర్శలు చేసిన వారే. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి, తర్వాత పార్టీని వీడి.. జగన్‌ మీద విమర్శలు గుప్పించిన వారు వరుసగా ఇప్పుడు వైసీపీలో చేరుతున్నారు. వీరిలో కొందరు ఎన్నికలకు ముందుగానే పార్టీ ఫిరాయించిన వారున్నారు. కొందరు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఫిరాయించిన వారున్నారు. గతంలో వైసీపీని వీడి తనమీద విమర్శలు చేసిన వారిని జగన్ ఏరికోరి మరి పార్టీలో చేర్పించుకుంటున్నారు. రీసెంట్ గా వైసీపీలో చేరిన దేవినేని చంద్రశేఖర్, రఘురామకృష్ణంరాజు, దాడి వీరభద్రరావు లాంటి వారు ఆ కోవలోకే వస్తారు. మంత్రి దేవినేని ఉమా సోదరుడు దేవినేని చంద్రశేఖర్.. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. జగన్ టికెట్ ఇస్తారేమో అని ఆయన ఆశపడ్డారు. కానీ ఇవ్వలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో.. అనంతరం మళ్లీ ఆయన సోదరుడు ఉమాకి దగ్గరయ్యారు. ఆ సమయంలో.. ఆయన జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మళ్లీ జగన్ పంచకు చేరారు. జగన్‌ కూడా హ్యాపీగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక రఘురామకృష్ణంరాజు అయితే గతంలో జగన్ ని నపుంసకుడు అంటూ హద్దు దాటి విమర్శలు చేశారు. తనని వ్యక్తిగతంగా దూషించిన వ్యక్తిని కూడా జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించేశారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా అంతే. ఆయన వైసీపీకి రాజీనామా చేసినప్పుడు.. జగన్‌ వ్యక్తిత్వం పై చేసిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. జగన్ పై విమర్శల దాడి చేసిన ఆయన చాలా కాలం పాటు ఏ పార్టీలోనూ చేరలేదు. ఈ మధ్య టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు అంటూ వార్తలొచ్చాయి. కానీ టికెట్ విషయంలో టీడీపీ సానుకూలంగా స్పందించక పోవడంతో వెనకడుగు వేశారు. ఇక ఎన్నికల సమయం వచ్చే సరికి.. మళ్లీ వైసీపీ వైపే చూశారు. ఇలా తనను విమర్శించిన వారిని.. జగన్ పిలిచి మరీ పార్టీలో చేర్చుకోవడంతో.. ఆయనకు ఇంతకు మించిన నేతలు దొరకడం లేదా? వారి చేరికల వల్ల జగన్‌కు లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  'రాజకీయ నాయకుల మధ్య పార్టీల సిద్ధాంతపరమైన వ్యతిరేకతే తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వ్యక్తిగతంగా ఒకరినొకరు దూషించుకోరు.' ఇది ఒకప్పటి మాట. ఈ తరంలో కొందరు నేతలు హద్దు దాటి వ్యక్తిగతంగా విమర్శలు చేసున్నారు. అందులో ముందువరుసలో ఉంటారు వైసీపీ నేత విజయసాయి రెడ్డి. ట్విట్టర్ వేదికగా విజయసాయి.. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మీద హద్దు దాటి విమర్శలు చేస్తున్నారు. ఆయన కూడా విమర్శల పాలవుతున్నారు.   కొండవీడులో రైతు కోటయ్య మృతికి టీడీపీ, ఏపీ పోలీసులే కారణమని వైసీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అలాగే రైతు కులాన్ని ప్రస్తావిస్తూ జగన్ ట్వీట్ చేసారు. దీనిపై స్పందించిన లోకేష్.. జగన్ కులరాజకీయాలు చేస్తున్నారని, శవాలపై పేలాలు ఏరుకునే జగన్ మరోసారి శవరాజకీయం మొదలుపెట్టారని విమర్శించారు. అయితే ఈ విమర్శలకు విజయ సాయి ఘాటు రిప్లై ఇచ్చారు. 'లోకేష్.. మేం శవాల మీద పేలాలు ఏరుకుంటున్నాం అని ట్వీట్ పెట్టావ్. ఇంతకీ శవం ఎవరు. నువ్వా? మీ నాన్నా?' అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శలు చేయాలి గానీ.. మరీ ఇలా బ్రతికున్నవాళ్లను శవాలంటూ వారి చావుని కోరుకోవడం ఏంటని పలువురు తప్పుపట్టారు. కొందరైతే గతంలో జగన్ నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబుని నడిరోడ్డు మీద ఉరి తీయాలంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అధినేత బాటలోనే మిగతా నేతలంతా నడుస్తున్నారు. మీ పార్టీ నేతలు ఎదుటి వ్యక్తుల చావుని కోరుకుంటున్నారు, మీరేం ప్రజా నాయకులు అసలు? అంటూ విమర్శిస్తున్నారు. అయినా విజయ సాయి వ్యక్తిగత విమర్శలు ఆపలేదు. తాజాగా లోకేష్ బాడీ గురించి హద్దు మీరి కామెంట్స్ చేసారు. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ కలిసిపోయాయని టీడీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్నీ లోకేష్ ట్విట్టర్ లో వ్యంగంగా ట్వీట్ చేసారు. 'ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు.' అని ట్వీట్ చేసారు. అయితే దీనికి కౌంటర్ గా విజయ సాయి లోకేష్ బాడీ గురించి కామెంట్స్ చేసారు. 'లోకేష్.. నీకు జగన్ గారిలోనూ కేసీఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని వ్యగంగా ట్వీట్ చేసావు. మోడీ సంగతి తర్వాత ఆలోచిద్డువులే.. ముందు నీ బాడీ, ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో.మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.' అంటూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ పై కూడా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. నేతలు హుందాగా విమర్శలు చేయాలి, తమపై వచ్చిన విమర్శలను హుందాగా తిప్పికొట్టాలి. అంతేకాని ఇలా బాడీ, మైండ్ గ్యారేజ్ లో చూపించుకో, మతిస్థిమితం లేదంటూ హద్దు దాటి వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మరి విజయ సాయి ఇప్పటికైనా తన తీరు మార్చుకొని హుందాగా విమర్శలు చేస్తారో లేక ఎన్నికలు వస్తున్నాయిగా అని ఇంకాస్త డోస్ పెంచి విమర్శలు పాలవుతారో చూడాలి.
  వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మాకు పోటీ ఇస్తుంది, కాంగ్రెస్ పోటీ చేస్తే మా పార్టీకి ఇబ్బంది అని టీడీపీ, వైసీపీ పార్టీలు అనుకునే అవకాశముందా?. అబ్బే అసలే ఛాన్సే లేదు అంటారా?. కానీ వైసీపీ ఎందుకో కాంగ్రెస్ ని చూసి ఉలిక్కిపడుతుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో బస్సు యాత్రకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు నెల్లూరు జిల్లా వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్‌ బస్సులను వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకొని నల్లజెండాలతో నిరసన తెలిపారు. ‘కాంగ్రెస్ గో బ్యాక్’ అంటూ గట్టిగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి భరోసాయాత్ర చేసే హక్కు లేదంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. భరోసా యాత్ర పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కాంగ్రెస్ యాత్రను వైసీపీ నేతలు అడ్డుకోవడం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. విభజన ఎఫెక్ట్ తో ఏపీలో కాంగ్రెస్ కి గట్టి దెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవలేదు. అయితే ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేకహోదాని ఇస్తామని కాంగ్రెస్ భరోసా ఇస్తోంది. ఇప్పటికే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీ ప్రత్యేకహోదా ఫైల్ మీద పెడతామని పలుసార్లు స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రజల్లో కాంగ్రెస్ మీద విభజన కోపం కాస్త తగ్గింది. అదీగాక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హోదా విషయంలో మొండిచెయ్యి చూపింది. దీంతో హోదా రావాలంటే కాంగ్రెస్సే మనకున్న ఏకైక మార్గం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. హోదా హామీతో కాంగ్రెస్ పట్ల ఏపీ ప్రజలు కాస్త సానుకూలంగా స్పందిస్తుండటంతో.. ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదే సరైన సమయం అని భావించిన కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేపట్టింది. అదేవిధంగా నిన్న ఏపీ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ.. మోదీ మాట ఇచ్చి తప్పిన తిరుపతి సాక్షిగానే ఏపీకి హోదా ఇచ్చి తీరుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఈరోజు బస్సు యాత్రలో మరింత ఉత్సాహంతో పాల్గొన్నారు. అయితే వైసీపీ నేతలు యాత్రని అడ్డుకొని వాగ్వాదానికి దిగారు. ఏపీకి హోదా ఇస్తానంటున్న కాంగ్రెస్ బస్సు యాత్రని అడ్డుకోవాల్సిన అవసరం వైసీపీకి ఏమొచ్చింది? అంటే కాంగ్రెస్ వల్ల.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎంతోకొంత నష్టం జరిగే అవకాశముంది. అందుకే వైసీపీ ఉలిక్కిపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీ ఓటు బ్యాంకంతా ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకే.. మరి ఇప్పుడు హోదా హామీతో కాంగ్రెస్ కాస్తోకూస్తో బలపడి ఎంతోకొంత ఓట్లు చీలిస్తే వైసీపీకి నష్టమేగా? అందుకే వైసీపీ కాంగ్రెస్ బస్సుకి బ్రేకులు వేయాలని చూస్తుందట. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసీటైనా గెలుస్తుందో లేదో తెలీదు కానీ.. ఎన్నికలకు ముందే ఓట్లు చీలుస్తుందేమో అని వైసీపీలో భయం కలిగేలా చేసింది. చూద్దాం మరి హోదా హామీతో ఏపీలో కాంగ్రెస్ ఎంతలా బలపడుతుందో.
  ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీ, అధికార పార్టీ టీడీపీని ఇబ్బంది పెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తుంది. పోలీసుశాఖ పదోన్నతులు, చింతమనేని వీడియో, రైతు కోటయ్య మృతి.. కాదేదీ టీడీపీని విమర్శించడానికనర్హం అంటూ కొత్త కొత్త టాపిక్స్ తో టీడీపీ మీద ఆరోపణలు, విమర్శలు చేస్తుంది. తాజాగా వైసీపీ పరోక్షంగా మరో టాపిక్ తో టీడీపీని టార్గెట్ చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య డీల్ కుదిరింది అంటూ  జగన్ కి సంబంధించిన పత్రికలో ఓ ఆర్టికల్ ప్రచురితమైంది. ముసుగులో స‌ర్దుబాటు అంటూ ఒక క‌థ‌నం ప్ర‌చురించారు. దాని సారాంశం ఏంటంటే.. సీఎం చంద్ర‌బాబు, ప‌వ‌న్ కళ్యాణ్ ల మ‌ధ్య ర‌హస్య ఒప్పందం కుదిరిపోయింద‌ట‌, సీట్ల స‌ర్దుబాటు కూడా జ‌రిగిపోయిందట‌! అంతేకాదు.. ఈ మ‌ధ్య చంద్ర‌బాబు, ప‌వ‌న్ లు ఓ ర‌హ‌స్య స్థ‌లంలో భేటీ అయ్యార‌నీ, పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌ ఈ భేటీకి ఏర్పాట్లు చేశారంటూ రాశారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటు, ఎన్నికలకు ఎలా వెళ్ళాలి వంటి అంశాలు చర్చించారట. జనసేనకు 25 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు ఇచ్చేలా డీల్ కుదిరిందట. అంతేనా ‘ఇన్నాళ్లూ తిట్టుకొని ప్రజల ముందుకు వెళ్లాం. ఇప్పుడు జనం  ముందుకు ఏ ముఖం పెట్టుకొని వెళ్లగలుగుతాం? ఇప్పటికిప్పుడు కలసి పోటీ చేస్తామంటే ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు. ఏం చెప్పి నమ్మించగలం?’ అని ప్రధానంగా చర్చించారంటూ రాసుకొచ్చారు. మొత్తానికి 2014 లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్.. తరువాత టీడీపీకి దూరమై విమర్శలు చేసారు. ఈమధ్య చంద్రబాబుతో మళ్ళీ డీల్ కుదరడంతో విమర్శలు తగ్గించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారు అని ఆ క‌థ‌నం సారాంశం. మరి పవన్ కళ్యాణ్ ఏమో ఎవరితో పొత్తులుండవు.. వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో మాత్రమే కలిసి పనిచేస్తాం అన్నారు. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం కమిటీ ఏర్పాటు చేసి దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు ఆయన సోదరుడు నాగబాబు యూట్యూబ్ లో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ పత్రికలో వచ్చిన కథనం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.  
కుటుంబసభ్యులు కానీ.. బంధు మిత్రులు కానీ.. ఆఫీసులో సహోద్యోగులు కానీ నిత్యం ఇంతమందిని చూస్తుంటాం.. మరి వీరందరివి వేరు వేరు మనస్తత్వాలు. మనతో ఎంత బాగా ఉన్నప్పటికీ అసలు వ్యక్తిత్వం వేరు. మరి వారి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోవడం ఎలా..? ఒక చిన్న ఐస్‌క్రీమ్‌తో ఈ చిక్కు ముడి విప్పొచ్చు అంటున్నారు నిపుణులు. అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=WuXFWRrbPdc
  టీవీలోనో.. హోమ్ థియేటర్‌లోనో మంచి సాంగ్ వస్తుంటే దానిని హమ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు కొంతమంది. వారిని చూసి ఇంట్లో పెద్దవారు. ఓరేయ్.. ఆ కుప్పిగంతులేంట్రా అంటూ మందలిస్తూ ఉంటారు. అయితే ఇకపై అలా చేయకండి. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండటానికి డ్యాన్స్ చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు పరిశోధకులు. అది శారీరకంగాను.. మానసికం గాను. డ్యాన్స్ చేసేటప్పుడు మెదడు, శరీరాల మధ్య సమన్వయం బాగా ఉంటుందట. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=CplfifflLPc    
    ఇంటర్నెట్‌ గురించి అవగాహన ఉన్నవారు ‘PRACTO’ అన్నపేరు వినే ఉంటారు. మనకి దగ్గరలో ఉన్న వైద్యుల వివరాలను అందచేస్తూ, అవసరమైతే వారితో ఆన్‌లైన్‌ అపాయింట్‌మెంట్‌ లేదా చికిత్సను అందించే సంస్థే practo. వైద్యుల కోసం తమ సైట్‌ను సంప్రదించే వ్యక్తుల వయసు, అవసరాల ఆధారంగా ఈ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికను చూడగానే ఇప్పటి యువత మానసిక సమస్యలతో సతమతం అయిపోతుదని తేలిపోతోంది. ఆ నివేదికలో ముఖ్య అంశాలు ఇవిగో…   - మానసిక సమస్యల కోసం వైద్యులను సంప్రదించేవారిలో 79 శాతం మంది 30 ఏళ్ల లోపువారే! - 25 నుంచి 34 వయసువారితో పోలిస్తే.... 24 ఏళ్లలోపువారే మానసిక వైద్యులని సంప్రదించడం ఆశ్చర్యం కలిగించే విషయం.   - గతంతో పోలిస్తే డిప్రెషన్, ఉద్వేగం వంటి సమస్యలతో మానసిక వైద్యులని సంప్రదించేవారి సంఖ్య ఏకంగా 62 శాతం పెరిగిందట.   - తమ మానసిక సమస్యలకు ఆన్‌లైన్ ద్వారా వైద్యుల పరిష్కారాన్ని కోరాలనుకునేవారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగిందట. మానసిక సమస్య అనగానే సమాజం చిన్నచూపు చూడటం వల్లే ఎక్కువమంది ఆన్‌లైన్లోనే వైద్యులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు.   - ముంబై, దిల్లీ, బెంగళూరు నగరాల్లో మానసిక వైద్యులను సంప్రదించేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. అలాగని మిగతా నగరాలు కూడా ఏమంత ప్రశాంతంగా ఉన్నాయని అనుకోవడానికి లేదు. గతంతో పోలిస్తే చెన్నై, కోల్‌కతా వంటి మహానగరాల్లో కూడా మానసిక వైద్యులని ఆశ్రయించేవారి సంఖ్య గణనీయంగానే పెరిగింది.   Practo అందిస్తున్న ఈ నివేదికని పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే యువత ఎక్కువగా ఆన్‌లైన్ మీద ఆధారపడుతుంది కాబట్టి... 30 ఏళ్లలోపు వారే ఈ సౌకర్యాన్ని ఎక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంది. పైగా ఒకప్పుడు మానసిక సమస్య కోసం వైద్యుడి దగ్గరకి వెళ్లడం అంటే ‘నాకేమన్నా మెంటలా!’ అని నొచ్చుకునేవారు. కానీ ఇప్పటి యువత వైద్యుల కౌన్సిలింగ్ తీసుకోవడానికి  జంకడం లేదని తృప్తిపడాలేమో కూడా! కానీ ఇప్పుడిప్పుడే జీవితంలోకి అడుగుపెడుతున్న యువత మానసిక సమస్యలతో ఎందుకు సతమతం కావాల్సి వస్తోంది అన్నదే ఆలోచించాల్సిన విషయం. పిల్లలు ఎదుగుతున్న తీరులోనూ, ఎదిగాక వారు జీవించే విధానంలోనూ ఏదో లోటు ఉందేమో విశ్లేషించి తీరాల్సిందే! - నిర్జర.  
  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వం వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అమేథీలో రాహుల్ గాంధీ నామినేషన్‌ను తిరస్కరించాలని ఇండిపెండెంట్ అభ్యర్థి ధృవ్‌లాల్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. అఫిడఫిట్‌లో పేర్కొన్న వివరాలు సైతం తప్పుల తడకగా ఉన్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నామినేషన్ పరిశీలనను రిటర్నింగ్ అధికారి రాంమనోహర్ మిశ్రా ఈ నెల 22కు వాయిదావేశారు. ఇప్పుడీ వ్యవహారం దేశరాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనిపై ధృవ్‌లాల్ తరపు న్యాయవాది రవి ప్రకాష్ మాట్లాడుతూ.. తాము ప్రధానంగా మూడు అంశాలు ప్రస్తావించినట్టు చెప్పారు. 'యూకేలో రిజిస్టర్ అయిన ఒక కంపెనీ సర్టిఫికెట్‌లో యూకే పౌరుడిగా రాహుల్ డిక్లేర్ చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారతీయేతరుడు భారతదేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయరాదు. ఎందువల్ల ఆయన బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఇప్పుడు భారతదేశ పౌరసత్వం ఎలా పొందారు? దీనిపై ఒక స్పష్టత వచ్చేంత వరకూ రాహుల్ నామినేషన్ పేపర్లను ఆమోదించరాదని రిటర్నింగ్ అధికారిని మేము కోరాం' అని ప్రకాష్ తెలిపారు. యూకే కంపెనీకి సంబంధించిన ఆస్తుల వివరాలను ఎలక్షన్ అఫిడవిట్‌లో రాహుల్ ప్రస్తావించలేదని, రాహుల్ విద్యార్హతలపైనా అనుమానాలున్నాయని, డాక్యుమెంట్లలో ఆయన విద్యార్హతలు కూడా మ్యాచ్ కావడం లేదని అన్నారు. కాలేజీలో ఆయన పేరు 'రవుల్ విన్సి' అని ఉందని, రాహుల్ గాంధీ పేరుతో ఎలాంటి సర్టిఫికెట్ లేదని తెలిపారు. 'రాహుల్ గాంధీ, రవుల్ విన్సి ఒక వ్యక్తేనా అనేదే మా ప్రశ్న. అలాకాకుంటే ఆయన ఒరిజనల్ సర్టిఫికెట్ ఇస్తే వెరిఫై చేయడానికి వీలుంటుంది' అని రవిప్రకాష్ అన్నారు. దీంతో ఇప్పుడు రాహుల్ నామినేషన్‌పై రిటర్నింగ్ అధికారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.
  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ ఒక మహిళ చేసిన ఫిర్యాదు కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్ గా పని చేస్తున్న ఆమె.. తాజాగా 22 మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్ లో ఈ ఆరోపణలు చేశారు. గత ఏడాది అక్టోబరు 10, 11 తేదీల్లో జస్టిస్ గొగోయ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని.. తన కుటుంబాన్ని వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె ఆరోపించారు. ప్రధాన న్యాయమూర్తి వేధింపులను తిరస్కరించినందుకు తనను.. తన కుటుంబాన్ని తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు జడ్జిలను ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. కాగా దీనిపై రంజన్ గొగోయ్ స్పందించారు. ఇరవై ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలు అందించిన తనపై ఇలాంటి ఆరోపణలు చేయటాన్ని నమ్మలేకపోతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేసిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్... న్యాయవ్యవస్థలో అలజడి సృష్టించేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని అందులో భాగంగానే తనపై ఈ లైంగిక వేధింపుల ఆరోపణలు అని చెప్పారు. తను ఓ ముఖ్య కేసును వచ్చే వారం విచారణ చేయనున్నానని.. ఇందులో భాగంగానే న్యాయవ్యవస్థను భయపెట్టి మేనేజ్ చేయాలని చూస్తున్నారని జస్టిస్ రంజన్ గొగోయ్ మండిపడ్డారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయించిన వారి వెనక పెద్దల హస్తం ఉందని ధ్వజమెత్తారు. అంతేకాదు తనమీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తి అని.. ఆమెపై ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని గుర్తుచేశారు. 20 ఏళ్ల సర్వీసు తర్వాత తన బ్యాంకు ఖాతాలో రూ.6 లక్షలు, పీఎఫ్‌ ఖాతాలో రూ.40 లక్షలు ఉందని చెప్పిన రంజన్ గొగోయ్ డబ్బు అంశంపై తనను ఎవరూ పట్టుకుని ప్రశ్నించరని.. ఇక వేరే కారణం కోసం వెతికి తనను ఇరికించే ప్రయత్నంచేస్తున్నారని గొగోయ్ ధ్వజమెత్తారు. తనను ఎవరూ భయపెట్టలేరని చెప్పిన జస్టిస్ గొగోయ్ తన డ్యూటీని తాను చేస్తానని చెప్పారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు విచారణలో తన జోక్యం ఉండబోదని చెప్పిన గొగోయ్.. సీనియర్ జడ్జి అరుణ్ మిశ్రా బెంచ్ ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా అందుకు సమ్మతమే అని చెప్పారు. అయితే ఈ కేసు విచారణ చేయాలని చెప్పడంలో తానే బాధ్యత తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ కేసుపై భిన్నస్వరాలు వినిపిస్తున్నందున తానే స్వయంగా విచారణకు ఆదేశించినట్లు జస్టిస్ గొగోయ్ చెప్పారు.
  ఏపీ సచివాలయంలో జరిగిన సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. సివిల్ సర్వీస్ అధికారుల జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిదని సంచలన వ్యాఖ్యలు చేసారు. మనం ఒక్క బాల్ సరిగ్గా ఆడకపోయినా ఔట్ కావాల్సిందే అని అన్నారు. ఎవరు రెచ్చిగొట్టినా సహనంతో ముందుకు వెళ్లాల్సిందే అని స్పష్టం చేశారు. సహనం కోల్పోతే ఉద్యోగం కోల్పోతామని అన్నారు. అలా ఉద్యోగం పొగొట్టుకున్న వారి గురించి తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. నిజాయితీ, హుందాగా ఉండటం తన బాధ్యత అని చెప్పిన ఆయన.. అధికారులకు రోల్ మోడల్‌గా ఉండాల్సిన బాధ్యత నాపై ఉందని తెలిపారు. ఇక బ్లాక్ 2లో ఉద్యోగమైనా బ్లాక్ 1లో ఉద్యోగమైనా ఒకటే అని ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బ్లాక్ 1లో ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటుంది. అక్కడ పనిచేసే అధికారులకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనే భావన అధికారవర్గాల్లో కనిపిస్తుంటుంది. అయితే ఎక్కడ పనిచేసే అధికారులైనా ఒక్కటే అని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు తనపై చేస్తున్న విమర్శలకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పరోక్షంగా సమాధానం ఇచ్చారని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.
  వేసవిలో అధికంగా వేధించే సమస్య నోరు ఎండిపోవడం. మాటిమాటికీ తడి ఆరిపోయి నాలుక పిడచకట్టుకుపోవడం చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. నిజానికిది మంచిది కూడా కాదు. నోటిలో లాలాజలం ఎప్పుడూ ఊరుతూ ఉండాలి. లేదంటే నోటి ఇన్ఫెక్షన్లతో పాటు దంతాలు, చిగుళ్ల సమస్యలు కూడా వస్తాయి. జీర్ణక్రియలో లాలాజలానికి ఎంతో ముఖ్యమైన పాత్ర కాబట్టి జీర్ణక్రియా పరమైన ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అయితే నోరు ఎండిపోవడం అన్నది పెద్ద సమస్యేమీ కాదు. వేసవి వేడికి అలా అవుతూ ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తేలికగా పరిష్కారమవుతుంది.   పొద్దున్న లేవగానే నీటిలో ఉప్పు వేసుకుని బాగా గాగుల్ చేయండి. రోజంతా నోరు తేమగానే ఉంటుంది. రోజంతా తరచూ నీళ్లు, పండ్లరసాలు తాగుతూ ఉంటే కూడా నోటిలో తగినంత లాలాజలం ఊరుతుంది. సోంపు కూడా పొడిబారడాన్ని నివారిస్తుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ లాలాజల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే ఓ చిన్న గ్లాసుడు కలబంద జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా నిమ్మరసం. దీనిలో కాసింత తేనె కలుపుకుని ఉదయాన్నే సేవిస్తే రోజంతా నోటిలో లాలాజలం ఉత్పత్తి అయ్యి, నోరు ఎండిపోకుండా ఉంటుంది. ఓ గ్లాసు నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా, ఉప్పు, చక్కెర వేసి కలిపి తాగినా మంచిదే. కొత్తిమీరకు కూడా లాలాజలాన్ని ఉత్పత్తి చేసే లక్షణం ఉంది. అందుకే వేసవిలో వంటకాల్లో కొత్తిమీర మోతాదును పెంచండి. అప్పుడప్పుడూ ఓ యాలక్కాయనో, చిన్న అల్లం ముక్కనో నోటిలో వేసుకున్నా కూడా నోటిలో తేమ పెరిగి పొడిదనం మాయమవుతుంది.   ఇవేవీ పెద్ద కష్టమైన విషయాలు కాదు. తేలికగా అనుసరించదగ్గవే. కాబట్టి వేసవిలో చిరాకు పుట్టించే ఈ సమస్యకి సింపుల్ గా చెక్ పెట్టేయండి.   - Sameera
  మీ గుండె ఫిట్ గా ఉండాలా, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలా, కాన్సర్, బీపీ లాంటివి రాకూడదని కోరుకుంటున్నారా, కంటి చూపు చురుగ్గా కావాలా. ఒక్క మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్ హెల్త్ మీ సొంతం కావాలా. అయితే ఈ కూర తినండి. ఇంతకీ ఆ కూర ఏంటనుకుంటున్నారా, అయితే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=vGLoHsr_uKg      
మనుపటి రోజుల్లో అందం గురించి శ్రద్ధ అంతగా ఉండేది కాదు. ఉన్నా దాన్ని కాపాడుకునే మార్గాలు చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు! అందం గురించిన ఆసక్తీ ఎక్కువయ్యింది. దాన్ని సొమ్ము చేసుకునేందుకు లక్షల ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకోసారి మన అందాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యలు ప్రాణాంతకం కావచ్చునంటున్నారు పరిశోధకులు. అందుకు ఉదాహరణే సన్‌స్క్రీన్‌ లోషన్లు!   మొక్కలకీ మనుషులకీ మధ్య ఓ పోలిక ఉంది. మొక్కలు సూర్యకాంతి మీద ఆధారపడి తమ ఆహారాన్ని ఉత్పత్తి చేసుకున్నట్లుగానే, మనుషులు సూర్యుడి నుంచి విటమిన్ డిని పొందుతారు. అలా సహజంగా లభించాల్సిన విటమిన్‌ డికి దూరమైతే చాలా సమస్యలే వస్తాయి. ఊపిరితిత్తుల జబ్బులు, ఎముకలు బలహీనపడిపోవడం, కండరాలు పనిచేయకపోవడం, డయాబెటిస్‌, మెదడు ఎదుగుదలలో లోపాలు... లాంటి ఎన్నో ఇబ్బందులు డి విటమిన్ లోపంతో తలెత్తుతాయని చెబుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే- మన శరీరంలోని ప్రతి కణానికీ విటమిన్ డి చాలా అవసరం.   సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడటం వల్ల, సూర్యుడి నుంచి వెలువడే ultraviolet rays (అతినీలలోహిత కిరణాలు) నుంచి తప్పించుకునే ఉద్దేశం మంచిదే కావచ్చు. ఎందుకంటే వీటివల్ల శరీరం మీద మచ్చలు పడటం దగ్గర్నుంచీ, స్కిన్ కేన్సర్‌ వరకూ చాలా సమస్యలే వస్తాయి. కానీ బయటకి అడుగుపెట్టే ప్రతిసారీ సన్‌స్క్రీన్‌ లోషన్ రాసుకోవడం వల్ల మన శరీరం డి విటమిన్ను ఏమాత్రం ఉత్పత్తి చేసుకోలేదట. ఒక అంచనా ప్రకారం SPF 15 (sun protection factor) కంటే ఎక్కువ గ్రేడ్‌ ఉండే సన్‌స్క్రీన్‌ లోషన్లు డి విటమిన్‌ను దాదాపు 99 శాతం అడ్డుకుంటాయి. ఇప్పుడు మనకి మార్కెట్‌లో కనిపిస్తున్న సన్‌స్క్రీన్‌లు SPF 15 కంటే ఎక్కువగానే ఉంటున్నాయి.   సన్‌స్క్రీన్‌ లోషన్లతో మరో ప్రమాదం కూడా ఉంది. రంగు తక్కువగా ఉన్నవారు, ఎండలో మరింత నల్లబడతామేమో అన్న అనుమానంతో ఈ లోషన్లు తెగ వాడేస్తూ ఉంటారు. సాధారణంగా నల్లటి చర్మం ఉన్నవారిలో విటమిన్ డిని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం మరింత తక్కువగా ఉంటుంది. వీరు సన్‌స్క్రీన్‌ వాడటంతో అసలుకే ఎసరు వస్తుంది.   బయట ఎండ విపరీతంగా ఉన్నప్పుడు సన్‌స్క్రీన్‌ రాసుకుని సిద్ధం కావడం మంచిదే కానీ.... దానిని మీ మేకప్ కిట్‌లో భాగంగా మార్చుకోవద్దని సూచిస్తున్నారు. పౌడర్‌ వాడినంత తరుచుగా సన్‌స్క్రీన్‌ లోషన్ వాడితే డి విటమిన్ లోపం రాక తప్పదని హెచ్చరిస్తున్నారు. అసలే డయాబెటిస్ వంటి సమస్యలని అదుపు చేయడానికి విటమిన్ డి చాలా అవసరం కదా! ఇంతా చదివిన తరువాత మనకి విటమిన్‌ డి చాలా అవసరమనీ, దాన్ని సన్‌స్క్రీన్‌ లోషన్లతో అడ్డుకోవద్దనీ తేలిపోయింది. కానీ విటమిన్ డి కోసం ప్రత్యేకించి స్విమ్ సూట్లు వేసుకుని బీచ్ ఒడ్డున పడుకోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. వారానికి ఒక గంటన్నా ఒంటికి ఎండ తగిలేలా జాగ్రత్తపడితే కావల్సినంత డి విటమిన్‌ ఒంటికి పడుతుందట.   - నిర్జర.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.