Publish Date:Aug 6, 2018
Publish Date:Aug 6, 2018
Publish Date:Aug 2, 2018
Publish Date:Aug 2, 2018
Publish Date:Aug 1, 2018
Publish Date:Aug 1, 2018
Publish Date:Aug 1, 2018
Publish Date:Aug 1, 2018
Publish Date:Jul 31, 2018
Publish Date:Jul 31, 2018
Publish Date:Jul 31, 2018
Publish Date:Jul 30, 2018
Publish Date:Jul 30, 2018

LATEST NEWS
ALSO ON TELUGUONE N E W S
  మహేష్ బాబు అంటే పడిచచ్చే అభిమానులు ఎంతోమంది వున్నారు. అందులో ఆరేళ్ళ నుంచి అరవై ఏళ్ళ వ్యక్తులు వుంటారు. మహేష్‌తో ఒక్క ఫొటో దిగాలని కలలు కంటారు. ఫొటో దిగితే ఎంత సంబర పడతారో మాటల్లో వర్ణించలేం. వాళ్ళ ముఖంలో చిరునవ్వుఆ వెలుగులు చూస్తే తెలుస్తుంది. మహేష్ కూతురు ముఖం ప్రస్తుతం అలా వెలుగుతోంది. ఎందుకో తెలుసా? తనకు ఇష్టమైన కథానాయికతో ఒక ఫొటో దిగింది సితార. ఇంతకూ  మహేష్ కుమార్తె సితారకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా? హిందీ హీరోయిన్ అలియా భట్. ఈ సంగతిని మహేష్ సతీమణి నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు.  ప్రస్తుతం మహేష్ బాబు అమెరికాలోని న్యూయార్క్‌లో వున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న 'మహర్షి' షూటింగ్ కోసం వెళ్ళారు. అతడితో పాటు నమ్రత, గౌతమ్ కృష్ణ, సితార వెళ్లారు. అలియా భట్ కూడా అమెరికా వెళ్ళడంతో ఆమెను కలిసే అవకాశం సితారకు దక్కింది. అప్పుడు ఒక ఫొటో దిగారు. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన నమ్రత "సితారకు ఇష్టమైన అమ్మాయి (అలియా భట్). సితార ముఖంలోని చిరునవ్వుకు కారణమైనందుకు అలియాకు ధన్యవాదాలు అలియా" అని పేర్కొన్నారు.  
  రంగ‌స్థ‌లంతో రామ్ చ‌ర‌ణ్‌ని  1980 లోకి తీసుకెళ్లి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన  సుకుమార్ ...అదే ఫార్ములాతో  మ‌హేష్ ని 1930 లోకి  తీసుకెళ్తున్నాడు . రంగ‌స్థ‌లం త‌ర్వాత మైత్రీ మూవీ మేక‌ర్స్ లో మ‌హేష్ , సుక్కు కాంబినేష‌న్ లో సినిమా ఓకే అయిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం  1930 బ్యాక్ డ్రాప్ లో ఒక పీరియాడిక‌ల్ స్టోరీని   సిద్ధం చేశాడ‌ట సుక్కు.  మ‌హేష్ ఇప్ప‌టి వ‌ర‌కు పీరియాడిక‌ల్ ఫిల్మ్స్ లో న‌టించ‌లేదు. అందుకే ఓసారి ట్రై చేద్దామ‌న్న‌ట్లుగా ఉన్నాడ‌ట మ‌హేష్‌.  అందుకే స‌కుమార్ ఆ నేప‌థ్యంలో క‌థ‌ను సిద్దం చేశాడ‌ట‌. ప్ర‌స్తుతం మ‌హేష్ `మ‌హ‌ర్షి` సినిమా షూటింగ్ కోసం న్యూయార్క్ వెళ్లాడు. అక్క‌డ షెడ్యూల్ పూర్తి చేసుకుని వ‌చ్చాక సుక్కు స్టోరీని మ‌హేష్ కు నేరేట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  ఒకే అయితే వెంట‌నే మిగ‌తా ప‌నులు ప్రారంభించాల‌న్న ఆలోచ‌న‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఉ న్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో   వ‌న్ నేనొక్క‌డినే  చిత్రం వ‌చ్చినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడ‌లేదు. ఈసారైనా ఈ కాంబోలో వ‌చ్చే సినిమా తో హిట్ కొట్టాల‌న్న క‌సితో సుక్కు స్ట్రిప్టు రెడీ చేశాడ‌ని తెలుస్తోంది.
  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అలియాస్‌ మెగాస్టార్‌ చిరంజీవి మూడు రోజుల క్రితమే జార్జియా నుంచి వచ్చేశారు. అందరూ 25 రోజుల నుంచి అక్కడ చేస్తున్న యుద్ధం ముగిసిందని అనుకున్నారు. కానీ, అసలు యుద్ధం ఈ రోజు ముగిసింది. చిరంజీవి లేని వార్‌ ఎపిసోడ్స్‌ ఈ రోజు వరకూ తెరకెక్కించారు. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా తొలితరం తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పతాక సన్నివేశాల చిత్రీకరణ కోసం గత నెలాఖరున జార్జియా వెళ్ళారు. గతంలో ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాల్లో యుద్ధ సన్నివేశాలను క్రిష్‌ జార్జియాలోనే తెరకెక్కించారు. అక్కడే సురేందర్‌రెడ్డి ‘సైరా’ పతాక సన్నివేశాలను తెరకెక్కించారు. శనివారంతో జార్జియాలో తీయాలని ప్లాన్‌ చేసిన యుద్ధం మొత్తం పూర్తయ్యింది. మూడు రోజుల క్రితమే చిరంజీవి నటించాల్సిన సన్నివేశాలు పూర్తి కావడంతో ఆయన ఇండియాకు బయలుదేరారని సమాచారం. చిత్రబృందం రెండు మూడు రోజుల్లో రానుంది. ‘బాహుబలి’లో యాక్షన్‌ సన్నివేశాలను కొరియోగ్రాఫీ చేసిన లీ విట్టేకర్‌ ‘సైరా...’లో యుద్ధ సన్నివేశాలను తీర్చిదిద్దుతున్నారు.
  మూడే మూడు సినిమాల‌తో ఓ రేంజ్ హీరోగా ఎదిగిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.  వ‌రుస‌గా సక్సెస్ లు కొడుతూ...త‌న లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ తో విప‌రీత‌మైన ఫాలోయింగ్ పెంచుకున్నాడు ఈ క్రేజీ హీరో. గీత గోవిందం చిత్రం వంద కోట్లు పై చిలుకు సాధించి విజ‌య్ కు ప‌ట్ట ప‌గ్గాలు లేకుండా చేసింది. దీనితో విజ‌య్ కూడా ప్రెస్ మీట్స్ ల‌లో , ఇంట‌ర్వ్యూ ల‌లో చెల‌రేగిపోయాడు. ఈ వేగాన్ని ఒక్క‌సారిగా `నోటా` సినిమా వ‌చ్చి మాట రాకుండా చేసింది. ఎంతో హైప్ ని తీసుకొచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.  దాంతో విజ‌య్ స్పీడ్ కి కాస్త బ్రేకు లు ప‌డ్డ‌ట్లైంది. ఇదిలా ఉంటే ఎప్పుడో రావాల్సిన `టాక్సీవాలా` చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆలస్యం వ‌ల్ల విడుద‌ల వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్‌. న‌వంబ‌ర్ 16న గ్రాండ్ గా వ‌ర‌ల్డ్ వైడ్ గా టాక్సీవాలా చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నారు.  గ‌త ఇంట‌ర్వ్యూస్ లో విజ‌య్ మాట్లాడుతూ `టాక్సీవాలా` ఎప్పుడొచ్చినా పెద్ద హిట్టవుతుంది. దాని మీద నాకు చాలా కాన్ఫిడెంట్ ఉందంటూ చెప్పుకొచ్చాడు. మ‌రి ఆ న‌మ్మ‌కాన్ని, ఈ స్పీడ్ ని టాక్సీవాలా పెంచుతుదా? ఇంకా త‌గ్గిస్తుందా? అన్న‌ది తెలియాలంటే న‌వంబ‌ర్ 16 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.
  అవును చిరంజీవి కోసం రామ్ చ‌ర‌ణ్ ఈగ‌ర్లీ వెయిటింగ్.  ఎంద‌క‌నుకుటున్నారా?  రామ్ చ‌ర‌ణ్ , బోయ‌పాటి కాంబినేష‌న్ లో ఒక సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే.  అయితే ఈసినిమాకు సంబంధించిన టైటిల్ కానీ ఫ‌స్ట్ లుక్ కానీ ఇంత వ‌ర‌కు బ‌య‌ట‌కు రాలేదు. మెగా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే టైటిల్ ఏంటి? ఫ‌స్ట్ లుక్ ఎలా ఉండబోతుంది ? అంటూ అభిమానుల్లో ప‌లు ర‌కాల ప్ర‌శ్న‌లు మొద‌ల‌య్యాయి.  ద‌స‌రా పండుగ కానుక‌గా ఫ‌స్ట్ లుక్ వ‌స్తుంద‌ని ఎంతో ఆశ‌గా ఎదురు చూసిన అభిమానుల‌కు నిరాశే మిగిలింది.  దీంతో త్వ‌ర‌లో సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయాల‌ని ఫిక్స‌య్యార‌ట చిత్ర యూనిట్‌.  అది ఎప్పుడంటే ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి `సైరా` సినిమా షూటింగ్ కోసం జార్జియా వెళ్లారు. త్వ‌ర‌లో అక్క‌డ షెడ్యూల్ పూర్తి కానుంది. చిరంజీవి ఎప్పుడు హైద‌రాబాద్ వ‌స్తే అప్పుడు చ‌ర‌ణ్ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలుస్తోంది.  `విన‌య విధేయ రామ‌` టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చిరంజీవి వ‌చ్చాకే అన్ని క‌న్ ఫ‌ర్మ్ అయ్యే అవ‌కాశాలున్నాయి. సో లెట్స్ వెయిట్ ఫ‌ర్ మెగాస్టార్.
  తెరాసను గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో తెదేపా, సీపీఐ, తెజస మహా కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే.ఉమ్మడి ఎన్నికల ముసాయిదా కూడా సిద్ధమైంది.కానీ పలుమార్లు భేటీలు జరిగినప్పటికీ సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రాలేదు.తెరాస పార్టీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది.బీజేపీ నాయకులు కూడా తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడికి అందించారు.టీడీపీ,తెజస,సీపీఐ పార్టీలు కాంగ్రెస్ చుట్టూ తిరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం పొత్తులో సీట్ల సర్దుబాటుపై తేల్చకుండా తమ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు మొదలుపెట్టింది.దీంతో కాంగ్రెస్ వ్యవహారశైలిపై తెజస అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 48 గంటల్లో సీట్ల సర్దుబాటుపై తేల్చండి అంటూ అల్టిమేటం కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే.టీటీడీపీ అధ్యక్షుడు రమణ తొందరపడొద్దని సూచించటంతో శాంతించారు కోదండరాం. రోజు రోజు ఎన్నికల సమయం దగ్గర పడుతూనే ఉంది.కానీ భేటీలకు గంటల సమయం వెచ్చించినా పార్టీల మధ్య పొంతన కుదరట్లేదు.ఒకప్పుడు నాలుగు పార్టీల ముఖ్య నేతలు కూర్చొని చర్చించుకునేవారు.కానీ కొన్ని రోజులు క్రితం కాంగ్రెస్,తెజస నేతలు మాత్రమే భేటీ అయ్యారు.కూటమిలోని ఏయే పార్టీలకు ఎన్నిసీట్లు ఇవ్వాలనే అంశంపై చర్చించారు.భేటీ అనంతరం మాట్లాడిన కోదండరాం కాంగ్రెస్‌ గుర్తుపై పోటీచేయబోమని స్పష్టంచేశారు.పొత్తులపై రెండు రోజుల్లో పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.ఎన్నికల సంఘం నుంచి తమ పార్టీకి గుర్తింపు వచ్చిందని, త్వరలోనే తమ పార్టీకి గుర్తు కూడా వస్తుందని,తమ పార్టీ గుర్తుమీదే తమ అభ్యర్థులు పోటీ చేస్తారని స్పష్టంచేశారు.ఇదిలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో రమణతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ తదితరులు విడివిడిగా భేటీ అయ్యారు.అనంతరం విలేకరులతో చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ... కూటమి అన్నాక అనేక సమస్యలుంటాయని, రెండు మూడు రోజుల్లో అన్నీ సమసిపోతాయన్నారు. అలాగే మహాకూటమి మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారని విమర్శించారు.రమణతో ఎన్నికల వ్యూహంపై చర్చించామని, కూటమిని ఏర్పాటు చేసింది సీపీఐ, టీడీపీలేనన్నారు. కలిసి ఉన్న పార్టీలు విడి విడిగా సమావేశం అవ్వటం ఏంటా అని సర్వత్రా చర్చగా ఉండగా ఎవరికి వాళ్ళు సమావేశ అనంతరం పొత్తులు అన్నాక సమస్యలు ఉంటాయి ,తొందర్లోనే సర్దుకుంటాయి అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరి ఎత్తుడలు వాళ్ళు వేసుకుంటున్నారని తెలుస్తుంది.కూటమి  ఏర్పాటు చేసింది మేమే అంటున్న సీపీఐ, టీడీపీ లు సీట్ల కోసం కాంగ్రెసుపై ఆధారపడాల్సిన పరిస్థితి.కానీ కాంగ్రెస్ మాత్రం తమ పార్టీ అభ్యర్థుల జాబితాపై ఓ అవగాహనకి వచ్చింది.అలానే ఇంకా పార్టీ గుర్తు కూడా రాని తెజస కూడా అభ్యర్థుల జాబితాను ప్రకటించగలం అనే ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలోనే  సీపీఐ, టీడీపీ పార్టీలు తమ సత్తా చాటేందుకు తమ పార్టీల తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై చర్చినట్టు సమాచారం. ఒకవేళ పొత్తులో పొంతన కుదరక ఎవరి దారి వాళ్ళది అయినా కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమి లేదు.ఎలాగో అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేసింది కాబట్టి ప్రతి నియోజక వర్గంలో అభ్యర్థిని నిలబెట్టగలదు.అసలు పొత్తుపై క్లారిటీ ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ సుముకంగా లేదోమో అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.వాళ్ళు అడిగినన్ని సీట్లు ఎలాగో ఇవ్వలేం కాబట్టి,కొన్నాళ్ళు పొత్తుపై నాంచితే అప్పటికప్పుడు మిగతా పార్టీలు ధైర్యం చేసి పొత్తు నుంచి బయటకి వెళ్లి అభ్యర్థులను ప్రకటించలేవనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం.
  తిత్లీ తుఫాన్ రూపంలో శ్రీకాకుళంని కష్టం ముంచెత్తింది. తిత్లీ బాధితుల కన్నీళ్లు తుడవడానికి, వారికి అండగా నిలబడడానికి పలువురు ముందుకొస్తున్నారు. కొంత మంది సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు కూడా విరాళాలు ప్రకటించాయి. హెరిటేజ్ సంస్థ రూ. 66 లక్షల చెక్కును సీఎంకి అందించింది. ఇక సీఎం చంద్రబాబు అయితే తిత్లీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి ధైర్యం చెప్తున్నారు. ఇలా ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ కూడా రూ. కోటి సాయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అయితే వైసీపీ రూ. కోటి సాయం ప్రకటనకే పరిమితమా అంటూ చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే వైసీపీ ఆ కోటిని సీఎం సహాయనిధికి ఇచ్చినట్లు కానీ లేదా మరేదైనా మార్గంలో సాయం చేసిన దాఖలాలు కానీ లేవు. దీంతో వైసీపీ కోటి సాయం ప్రకటనకే పరిమితమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే గతంలో వైసీపీ ప్రకటించిన ఆర్థికసాయాల విషయంలో కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వైజాగ్ ను హుదూద్ కుదిపేసినప్పుడు.. జగన్ రూ. 50 లక్షల సాయం ప్రకటించారు. ప్రభుత్వానికి ఇవ్వబోమని వైఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో ఖర్చు పెడతామని తన పత్రికలో ప్రకటించి పాఠకుల దగ్గర్నుంచి విరాళాలు సేకరించారు. ఇలానే అప్పట్లో మరో ప్రముఖ పత్రిక కూడా సేకరించి మత్య్సకారులకు ఇళ్లను కట్టించింది. కానీ జగన్ ప్రకటించిన ఆ రూ. 50 లక్షలు.. సేకరించిన విరాళాలను ఏ విధంగా ప్రజలకు సాయం అందించారో బయటపెట్టలేదు. ఇక కేరళ వరదల సమయంలో సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకు ఎవరికి తోచిన సాయం వారు చేసి కేరళకు అండగా నిలబెట్టారు. ఆ సమయంలో జగన్ కూడా కోటి సాయం ప్రకటించారు. కానీ ఇంతవరకు ఆయన ప్రకటించిన సాయాన్ని కేరళకు అందించలేదని తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాత్రం.. తన కంపెనీ తరపున కేరళకు రూ. కోటి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు కేరళకు వెళ్లి సీఎంకు ఇచ్చి వచ్చారు. కానీ జగన్ చేసిన సాయం మాత్రం బయటకు రాలేదు. తమ పార్టీ వాళ్లే కాబట్టి వాళ్లు చేసినా నేను చేసిన ఒకటే అనుకున్నారా? ఏంటో తెలియట్లేదు. మరి జగన్ వైజాగ్ కు ప్రకటించిన రూ. 50 లక్షలు, కేరళకు ప్రకటించిన రూ. కోటి.. ప్రకటనకే పరిమితం చేసారా? లేక నిజంగానే సాయం చేసారా?. ఒకవేళ సాయం చేసుంటే సోషల్ మీడియాలో, సొంత మీడియాలో గట్టిగానే ప్రమోషన్ చేసేవాళ్లుగా?. దీనిబట్టి చూస్తుంటే ఆ సాయం ప్రకటనలకే పరిమితం అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి తిత్లీ బాధితుల కోసం ప్రకటించిన రూ. కోటి సాయమైనా బాధితులకు చేరుతుందా? లేక ప్రకటనగానే మిగిలిపోతుందా?. లేదా అసలు ఇవన్నీ ఆరోపణలు మాత్రమే.. మా సాయం ప్రకటనలకే పరిమితం కాదు.. సాయం చేసి చూపిస్తామని నిరూపించుకుంటారా?. చూద్దాం ఏం జరుగుతుందో.
  ఎన్నికలకు 8 నెలల సమయమున్నా కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు శ్రీకారం చుట్టారు. ఈసారి 60, 70 కాదు ఏకంగా వందకి పైగా సీట్లు గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. కానీ ఎప్పుడైతే మహాకూటమి తెరమీదకు వచ్చిందో అప్పటినుంచి ఆ ధీమా తగ్గుతూ వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ బలంగానే ఉంది. టీడీపీ కూడా నాయకులు దూరమైనా పలుచోట్ల కేడర్ బలంగానే ఉంది. మరి ఈ రెండు పార్టీల బలం ఒక్కటైతే తెరాసకు ఇబ్బంది తప్పదు. దీంతో మొన్నటివరకు వచ్చే ఎన్నికల్లో తెరాసదే విజయం అని బల్లగుద్ది చెప్పినవాళ్లు కూడా.. ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టుంది పోరు అనే అభిప్రాయానికి వచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ ని మహాకూటమి బాగా ఆలోచనలో పడేస్తుంది. అందుకే ఆయన మహాకూటమి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబుని, టీడీపీని బాగా టార్గెట్ చేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా ఈ మహాకూటమిని ఎలా ఎదుర్కోవాలని వ్యూహాలు రచిస్తూనే.. మరోవైపు ఆయన ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్‌ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెడుతున్నారట. 2014 ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలుపొందారు. అయితే ఆయనకి ఆ విజయం అంత ఈజీగా రాలేదు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వంటేరు ప్రతాప్‌రెడ్డి.. కేసీఆర్ గట్టి పోటీనే ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ 44 % ఓట్లు సాధించగా.. ప్రతాప్‌రెడ్డి 34% ఓట్లు సాధించారు. ఇక కాంగ్రెస్ నుండి బరిలోకి దిగిన నర్సారెడ్డి 17 % ఓట్లు సాధించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతాప్‌రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మహాకూటమితో కాంగ్రెస్, టీడీపీలు దగ్గరయ్యాయి. అంటే ఇప్పుడు ప్రతాప్‌రెడ్డి బలం మరింత పెరిగింది. అదీగాక ఆయనపై ప్రజల్లో అభిమానం ఉంది. ప్రజలకి అందుబాటులో ఉంటాడని మంచి పేరుంది. దీంతో మహాకూటమి తరుపున ఆయన బరిలోకి దిగితే ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది. కేసీఆర్ ప్రతాప్‌రెడ్డి చేతిలో ఓడిపోతారని చెప్పలేం కానీ.. ప్రతాప్‌రెడ్డి మీద స్వల్పతేడాతో గట్టెక్కే అవకాశాలు ఉన్నాయి. వేరే నేతలకి ఈ గెలుపు ఓకే కానీ.. సీఎం స్థాయి నేతలకు, ముఖ్యంగా కేసీఆర్ లాంటి నేతలకు ఈ గెలుపు సరిపోదు. ఆయన లాంటి నేతలు భారీ మెజారిటీతో ఖచ్చితంగా గెలవాలి. అందుకే ఆయన అవసరమైతే వేరే స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. మొన్నటివరకు ఆయన గజ్వేల్ తో పాటు.. మేడ్చల్ నుంచి కూడా పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే కేసీఆర్ దృష్టి మాత్రం హరీష్‌రావు ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేట మీద ఉందట. సిద్దిపేటలో తెరాసకి బలముంది. తిరుగులేని మెజారిటీ వస్తుంది. అందుకే కేసీఆర్ సిద్దిపేట నుండి బరిలోకి దిగాలనుకుంటున్నారట. దీనివల్ల కేసీఆర్ తన నియోజకవర్గం గురించి ఏ ఆలోచనలేకుండా.. రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల మీద దృష్టి పెట్టొచ్చని భావిస్తున్నారట. మరి కేసీఆర్ మిగతా నియోజకవర్గాల మీద దృష్టి పెట్టాలని.. గజ్వేల్ నియోజకవర్గాన్ని వదిలేస్తారా?.. ఒకవేళ కేసీఆర్ సిద్దిపేట నుండి బరిలోకి దిగితే మరి హరీష్ రావు ఎక్కడినుండి పోటీ చేస్తారు?.. గజ్వేల్ నుండి పోటీ చేస్తారా? లేక అసలు పోటీకి దూరంగా ఉంటారా? ఇవన్నీ తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
  చిరంజీవి..తెలుగు చిత్ర సీమలో ఓ వెలుగు వెలిగి మెగా స్టార్ గా ప్రేక్షకాదరణ పొందిన నటుడు.నటుడుగా తనదైన ముద్ర వేసిన చిరంజీవి రాజకీయాలవైపు అడుగులు వేశాడు.2008 లో ప్రజా రాజ్యం పార్టీ స్థాపించారు.2009 ఎన్నికల్లో ప్రజా రాజ్యం పార్టీ బరిలోకి దిగగా అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను 18 స్థానాలను మాత్రమే పార్టీ గెలుచుకోగలిగింది.తిరుపతి,పాలకొల్లు అసెంబ్లీ స్థానాల నుంచి చిరంజీవి పోటీ చేయగా సొంత నియోజక వర్గం అయిన పాలకొల్లులో పరాజయం చవి చూశారు.తిరుపతి స్థానం లో గెలుపొందారు.రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించాలి అనుకున్న చిరంజీవికి ఈ ఫలితాలు నిరాశనే మిగిల్చాయి.ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవటంతో కొంత కాలానికి పార్టీని 2011 లో  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు.కాంగ్రెస్ పార్టీ లో చేరటంతో 2012 ఏప్రిల్ లో ఆ పార్టీ రాజ్య సభ పదవి కట్టబెట్టింది.అదే సంవత్సరం అక్టోబర్ లో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014 లో పరిస్థితులు తారుమారు అయ్యాయి.అప్పటికే తెలంగాణ ఉద్యమం ఉపందుకోవటంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది.చిరంజీవికి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రచార కమీటీ చైర్మన్ గా భాద్యతలు అప్పగించింది.కానీ చిరంజీవి ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అది నామమాత్రమే అని చెప్పుకోవాలి.ఎందుకంటే రాష్ట్రము విడిపోవటం తో ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ విజయం కాయం అని అందరు ఉహిచిందే.దీనికితోడు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి టీడీపీ కి మద్దతు ఇవ్వటం,కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయటం చిరంజీవిని విస్మయానికి గురిచేశాయి.2018 ఏప్రిల్ లో చిరంజీవి రాజ్య సభ సభ్యత్వం ముగిసింది.మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరుపున ఏదైనా పదవి వచ్చే పరిస్థితులు ప్రస్తుతం లేవు.దీంతో గత కొంత కాలంగా క్రీయాశీల రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యే పరిణామాలే కనిపిస్తున్నాయి.తాజాగా చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా దాన్ని పునరుద్ధరించుకోలేదు.దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం.దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు.అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం కూడా చిరంజీవి పార్టీకి దూరం అవ్వటానికి కారణంగా తెలుస్తోంది.గత ఎన్నికల్లో టీడీపీ కి మద్దతు ఇచ్చిన పవన్ రానున్న ఎన్నికల్లో స్వతహాగా పోటీ చేస్తున్నది తెలిసిందే.అయితే ప్రస్తుతం కాంగ్రెస్,టీడీపీ పార్టీలు కాస్త సాన్నిహిత్యంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేయవలిసి వస్తే తమ్ముడు పవన్ పై విమర్శలు గుప్పించక తప్పదు.అది ఇష్టపడని చిరంజీవి యాక్టీవ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారని సమాచారం. రాజకీయాలకు దూరం అవుతూవస్తున్న చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు.150వ చిత్రం ‘ఖైదీ నం.150’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిరంజీవి ప్రస్తుతం స్వాతంత్ర్య సమరయోధుడు సైరా నరసింహారెడ్డి బయోపిక్‌ ‘సైరా’లో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మరిన్ని సినిమాల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.  
కేసీఆర్ సంచలన నిర్ణయాలకు పెట్టింది పేరు. ఎన్నికలకు 8 నెలలముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సిద్ధమయ్యారు. తొలివిడతగా ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇలా దూకుడు మీదున్న కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే మేడ్చల్ నుండి పోటీకి సిద్దమవ్వడం. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు కేసీఆర్ మళ్ళీ అధికారం తమదేనని ధీమాగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మహాకూటమి ఏర్పడిందో.. ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. మహాకూటమి నుండి బలమైన పోటీ తప్పదని కేసీఆర్ కి అర్థమైంది. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.     టీడీపీకి తెలంగాణలో ఓటుబ్యాంకు బాగానే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు నగర శివార్లలోని నియోజక వర్గాల్లో బలంగా ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో దోస్తీ చేయడానికి ముఖ్యకారణం. కాంగ్రెస్ తెలంగాణలో బలంగానే ఉంది కాని ఒంటరిగా బరిలోకి దిగి అధికారాన్ని పొందే అంత బలమైతే లేదనే చెప్పాలి. అందుకే కాంగ్రెస్ మహాకూటమి వైపు అడుగులు వేసింది. దీంతో కాంగ్రెస్, తెరాసకు ధీటైన ప్రత్యర్థిగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల టీడీపీ ఓటుబ్యాంకు బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతెందుకు గత గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. అందుకే కేసీఆర్ ఆ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.     కాంగ్రెస్ కి టీడీపీ బలం తోడైంది. ఈ బలాన్ని తట్టుకొని హైదరాబాద్ చుట్టుపక్కల అధిక స్థానాలు గెలవాలంటే తాను ఏదైనా స్థానం నుండి బరిలోకి దిగడం కరెక్ట్ అని కేసీఆర్ భావిస్తున్నారట. కేసీఆర్ లాంటి బలమైన నేత, సీఎం అభ్యర్థి బరిలోకి దిగితే ఆ చుట్టుపక్కల స్థానాల మీద ఆ ప్రభావం ఉంటుంది. అది తెరాసకు బోలెడంత మైలేజీ తీసుకొస్తుంది. అందుకే కేసీఆర్ ప్రస్తుతం ఆయన ప్రాతినిద్యం వ‌హిస్తున్న గజ్వేల్ నియోజ‌కవ‌ర్గంతో పాటు మేడ్చ‌ల్ నుంచి కూడా పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ నిజంగానే మేడ్చల్ నుండి బరిలోకి దిగుతారా? ఒకవేళ దిగి.. అనుకున్నట్టే మహాకూటమి జోరుకి చెక్ పెడతారా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
  తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ మొదటి నుండి కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు బలంగా ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగేది.. ఒకసారి కాంగ్రెస్ పైచేయి సాధిస్తే మరోసారి టీడీపీ పైచేయి సాధించేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ పార్టీలు మహాకూటమితో దగ్గరయ్యాయి. అసలే జిల్లాలో బలమైన పార్టీలు. ఈ మూడు పార్టీలు మహాకూటమితో దగ్గరవడం.. ఖమ్మంలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న తెరాసను కలవెరపెడుతుంది. తెరాసకు ముందు నుండి ఖమ్మం సమస్య ఉంది. గత ఎన్నికల్లో దాదాపు అన్ని జిల్లాల్లో తెరాస ఎంతో కొంత తన మార్క్ చూపింది కానీ.. ఖమ్మంలో మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల అనంతరం టీడీపీ నుండి సీనియర్ నేత తుమ్మల, కాంగ్రెస్ నుండి ఖమ్మం ఎమ్మెల్యేగా గెలిచిన పువ్వాడ అజయ్, సిపిఎం మద్దతుతో వైసీపీ నుండి ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇలా పలువురు నేతలు తెరాసలో చేరారు. తెరాస నాయకులతో కళకళలాడింది కానీ కాంగ్రెస్, టీడీపీ కేడర్ మాత్రం అలాగే ఉంది. కాంగ్రెస్ లో రేణుక చౌదరి, భట్టి లాంటి సీనియర్ నేతలున్నారు. ఇక టీడీపీలో కూడా మాజీ ఎంపీ నామా, సత్తుపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర లాంటి సీనియర్ నేతలున్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు దగ్గరయ్యాయి. ఓవైపు సీనియర్ నేతలు, మరోవైపు బలమైన కేడర్.. దీంతో ఖమ్మంలో మహాకూటమిని తట్టుకొని తెరాస నిలబడటం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.     తెరాస మళ్ళీ అధికారం తమదే అనే ధీమాతో ముందస్తుకు సిద్ధమైంది. అయితే ఆ ఆశలకు మహాకూటమి ఆనకట్టలా మారింది. మొన్నటివరకు తెరాస వందకి పైగా సీట్లు వస్తాయి.. ఖమ్మంలో కూడా పాగా వేస్తామంటూ ధీమాగా ఉంది. అయితే మహాకూటమితో పరిస్థితి మారిపోయింది. నిన్నటిమొన్నటి దాకా తెలంగాణలో ఇంకా టీడీపీ ఎక్కడుంది? అన్నవాళ్ళే ముక్కున వేలేసుకుంటున్నారు. ఖమ్మంలో కూడా టీడీపీ ఒకప్పటిలా బలంగా లేదన్న వాళ్ళకి మొన్న బాలకృష్ణ పర్యటనతో కళ్ళుతెరుచుకున్నాయి. స్వచ్చందంగా కార్యకర్తలు కదిలొచ్చారు.. బాలయ్య వెంటనడిచి ఖమ్మంలో పసుపుదళం బలంగా ఉందని నిరూపించారు. దీంతో తెరాస నేతలు ఆలోచనలో పడ్డారు. ఖమ్మంలో మహాకూటమిని తట్టుకొని తెరాస నిలబడుతుందా? అని అనుమానం మొదలైంది. మిగతా స్థానాల్లో ఎలా ఉన్న మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహించిన పాలేరులో అయినా తెరాస జెండా ఎగురుతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు పాలేరులో కూడా పరిస్థితి మారిపోయినట్టు తెలుస్తోంది. అక్కడ సర్వేలు కూడా మహాకూటమికే అనుకూలంగా వస్తున్నాయట. నిజానికి తుమ్మల ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయారు. తరువాత తెరాసలో చేరి మంత్రి పదవి పొందారు. అయితే అప్పుడు పాలేరులో ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించడంతో అక్కడ ఉపఎన్నికలు జరిగి తుమ్మల గెలుపొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినా ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఉపఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయింది. అయితే 2014 ఎన్నికల్లో పాలేరులో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఉపఎన్నికల్లో తుమ్మల విజయం సాధించినా ఈ రెండు ఏళ్లలో పరిస్థితులు మారిపోయాయి. తాజా సర్వేల ప్రకారం పాలేరులో మహాకూటమే ముందుందట. దీనిబట్టి చూస్తుంటే ఖమ్మంలో పాగా వేయాలని చూస్తున్న తెరాస అసలు బోణి అయినా చేస్తుందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ అంచనాలను తారుమారు చేస్తూ తెరాస మహాకూటమిని మట్టి కరిపిస్తుందో లేదో చూడాలి.
  కొంతమంది నలుగురిలో మాట్లాడాలన్నా.. ఏదైనా చెయ్యాలన్నా.. తెగ సిగ్గుపడిపోతుంటారు. దీనివల్ల చాలా నష్టపోతుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలలో సిగ్గువల్ల వాళ్లు అనుకున్నది చెప్పలేక ఉద్యోగాలు కోల్పోయేవాళ్లు ఉన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్ధానాలకు ఎదగాలంటే ముందు మనలో ఉన్న సిగ్గును వదిలిపెట్టాలి. అలాంటి ‘షై’తాన్ ను వదిలిపెట్టినప్పుడే మనం డెవలప్ అవుతాం. దానికోసం కొన్ని సలహాలు... సమస్యను గుర్తించాలి... ముందుగా ఎలాంటి పరిస్థితులకు ఎక్కువ షై ఫీలవుతున్నామో గుర్తించాలి. గుర్తించిన తరువాత ఆ సమస్యను ఎలా అధిగమించాలో చూడాలి. మీరే కోచ్... మనలో ఉన్న టాలెంట్ ని, మనం ఏం చేయగలమో గుర్తుచేసుకోవాలి. వాటిమీద మరింత కసరత్తు చేయాలి. దీనివల్ల మనలో ఉన్న కాన్పిడెన్స్ కనపడుతుంది. ఆ కాన్ఫిడెన్సే మనలో ఉన్న సిగ్గుని పోగొడుతుంది. సౌకర్యం చూసుకోవాలి... మనం ఎవరితో కంఫర్టుగా ఉంటామో వాళ్లే మన చుట్టూ ఉండేలా చూసుకోవాలి. మంచి రిలేషన్ షిప్స్ మెయింటెయిన్ చేసుకోవాలి.  ఇతరులకు సౌకర్యంగా... ముఖ్యంగా సానుకూల శరీర భాష కలిగి ఉండాలి. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎదుటివారి ముఖాన్ని సూటిగా చూడాలి. చెప్పాలనుకున్న విషయాన్ని డైరెక్టుగా చెప్పాలి. క్లియర్ గా చెప్పాలి.  సాధన చేయాలి... మనకు మనమే ఎసైన్ మెంట్స్ పెట్టుకోవాలి. గోల్స్ పెట్టుకోవాలి. మనకు తెలియని విషయాలను ఛాలెంజ్ గా తీసుకొని తెలుసుకోవాలి. అది మన కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది. ప్రతిరోజూ పరిచయం లేని వ్యక్తులతో సంభాషించడం కూడా మంచిదే మనం మనలా.. ఎప్పుడు అవతలి వ్యక్తులని అనుసరించే ప్రయత్నం చేయకూడదు. మనం మనలాగే ఉండాలి. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకూడదు. ఈ సూత్రాలు పాటించండి.. మీలోని ‘షై’తాన్ మిమ్మల్ని వదిలి పారిపోతుంది చూడండి.
  ఒకప్పుడు అందరూ సంతోషంగా ఉండేవారట. ప్రపంచమంతా నిత్యం ఆనందడోలికల్లో తేలిపోతుండేది. సంతోషంగా ఉండీ ఉండీ జనాలకి మొహం మొత్తేసింది. దాని విలువే తెలియకుండా పోయింది. ఎంతటి నీచులైనా, పనికిమాలినవారైనా హాయిగా సంతోషంగా ఉండసాగారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సృష్టికర్త ఒక సభను ఏర్పాటుచేశాడు.   ‘సంతోషం మరీ తేలిగ్గా దొరుకుతోంది. కాబట్టి దానికోసం ప్రజలు తపించిపోయేలా... దాన్ని ఎక్కడన్నా భద్రపరచాలి. ఎక్కడ భద్రపరచాలో మీమీ ఉపాయాలు చెప్పండి,’ అన్నాడు సృష్టికర్త.   ‘ఇందులో చెప్పేదేముంది. సంతోషాన్ని సముద్రగర్భంలో దాచిపెడితే సరి,’ అని సూచించాడో దేవత.   ‘అబ్బే! మనిషి అసమాన్యుడు. అతను సముద్రగర్భాన్ని సైతం చేరుకోగలడు. మరో మార్గం ఏదన్నా చెప్పండి,’ అని సూచించాడు సృష్టికర్త.   ‘హిమాలయ పర్వతాలలోని అడవుల మధ్య ఓ చిన్న పెట్టెలో దాచిపెడితే ఎలా ఉంటుంది,’ అని సూచించాడు మరో దేవత.   ‘అహా! మనిషి అక్కడకి కూడా తేలికగా చేరుకోగలడు. మరో మార్గాన్ని సూచించండి,’ అని పెదవి విరిచాడు సృష్టికర్త.   ఆ తరువాత చాలా సలహాలే వినిపించాయి. అగ్నిపర్వతంలో దాచమనీ, కొండల కింద పాతిపెట్టమనీ, ఆకాశంలో వేలాడదీయమనీ... ఇలా సంతోషాన్ని దాచేందుకు రకరకాల ఉపాయాలు సూచించారు దేవతలు. కానీ అవేవీ సృష్టికర్తకు తృప్తినివ్వలేదు. చివరికి ఒక యువదేవత లేని నిలబడ్డాడు...   ‘మీరంతా ఏమనుకోకపోతే నాది ఒక చిన్న విన్నపం. మనిషి ఈ ప్రపంచాన్నంతా శోధించే ప్రయత్నం చేస్తాడు కానీ తన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నమే చేయడు. కాబట్టి మనిషి మనసులోనే సంతోషాన్ని దాచిపెట్టేస్తే సరి! అతను ఎప్పటికీ తనలో ఉన్న సంతోషాన్ని కనిపెట్టలేడు,’ అని సూచించాడు.   ‘అద్భుతమైన ప్రతిపాదన. నిత్యం భౌతికమైన విషయాలలో మునిగితేలే మనిషి ఎప్పటికీ తనలో ఉన్న సంతోషాన్ని కనిపెట్టలేడు. తన విచక్షణకు విలువనిచ్చేవాడు మాత్రమే తనలోని సంతోషాన్ని పొందగలడు,’ అంటూ దేవతలంతా ఆ ప్రతిపాదనను ఏకాభిప్రాయంతో అంగీకరించారు.   అప్పటి నుంచి సంతోషం మన మనసులోనే ఉండిపోయింది. దాని కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాం.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
  తెలుసుకోవాలని ఉంది ఒక్కసారి ఒకే ఒక్కసారి విలువ దేనికి అనేది తెలుసుకోవాలని ఉంది. ప్రేమకా, ప్రాణానికా, మనిషికా, మనసుకా, డబ్బుకా, బలానికా, దేనికి విలువ..? ప్రపంచంలో అన్నీ మనకే కావాలనిపిస్తుంది. అన్నీ ఉన్నాక కొన్నే లేవు అన్నీ తప్ప అనిపిస్తుంది. ఇదే జీవితం! నిండా మునగాలనుంది- అలా మునిగిపోతూ పక్కన ఒడ్డున నిలబడి చూడాలనీ ఉంది.. సాధ్యంకాదు..! పోగొట్టుకుంటే రాబట్టుకోలేం... అదీ తెలుసు..! ఆశ- వెధవ మానవ జీవితం కదండీ అలానే అనిపిస్తుంది మరి. కట్టప్ప చంపింది కేవలం బాహుబలి పాత్రని మాత్రమే అని తెలుసు..? అయినా చిత్రాన్ని చూస్తుంటే దు.ఖం ఆగలేదండి ఈ చిన్ని ప్రాణానికి అలాంటిది మన ప్రాణమే పోయాక లోకంతో మనకింక పనేంటీ అంటారా..! ఉందండీ.. * ఒక్కసారి నువ్వంటే ప్రాణం, నువ్వు లేకపోతే నేను లేను బంగారం అనే భర్త మాటల విలువ ప్రేమదా..? అదే భర్త.. భార్య జీతం డబ్బులు ఓ నెల తక్కువ తెస్తే నీతో యిలా అయితే కష్టం అన్నాడంటే ఆ మాటల విలువ దేనిది..? * నా పిల్లలే నా ప్రాణాలు అంటాం..! వాళ్లకోసమే ఈ ప్రాణాలు అంటుంటాం.. ఖరీదైన ఫోన్లు, కార్లు కొని చేతిలో పెట్టి love you కన్నా అన్నారంటే ఆ మాటల విలువ బంధానిదా..? అదే నాన్న... పిల్లల చేతిలో జారిపోయిన ఖరీదైన ఫోన్ కోసం చావదెబ్బలు కొడితే ఆ విలువ దేనికంటారు..? * గోరు ముద్దలు తింటూ, లాలి పాటలు వింటూ చిట్టి కథలు వింటూ పెంచి పెద్ద చేసిన అమ్మ నాది మాత్రమే అనే ఆ మాట విలువ బంధానిదా..? అదే అమ్మ వయసు పైబడ్డాక అనారోగ్యం బారిన పడ్డాక కొడుకులు అమ్మ నీదంటే నీది అని అంటే ఆ విలువ దేనికంటారు..? * మనం నవ్వితే నవ్వుతాడు.. ఏడుస్తుంటే ఓదారుస్తూ, గెలిస్తే భుజం తట్టి ప్రోత్సహించి ఓటమిలో ధైర్యాన్ని పంచే స్నేహితుల విలువ మనిషికా.. మనసుకా..? ఇలా అలోచిస్తే ప్రతీ బంధం విలువా తెలుసుకోవాలనే అనిపిస్తుంది. మనకి మన వాళ్లు ఇచ్చే విలువేంటో తెలుసుకోవాలనిపిస్తుంది. ఒక్కసారి చచ్చి మళ్ళీ బతకాలనిపిస్తుంది. నేనేంటో, నా విలువేంటో తెలుసుకోవాలనిపిస్తుంది. చేసిన తప్పులేంటో, బాధ పెట్టిన క్షణాలెన్నో, క్షమించాల్సిన మనసులెన్నో అన్నీ చూడాలని, వినాలని ఉంది. సాధ్యం కాదు అని తెలిసినా.. ఆ ఊహ వినడానికి బాగుంది..! * డాలర్ రేటు రాదు పడితే లేపడానికి మనిషి విలువ * సినిమా రివ్యూ కాదు రేటింగ్ యివ్వడానికి మనిషి విలువ * facebook posting కాదు like, comments ఇచ్చేందుకు మనిషి విలువ * Real estate, gold rate, IT boom కాదు మనిషి విలువ ఒక సినిమా లాంటిది మనిషి విలువ. మున్నాళ్ల జీవితం మూడు గంటల సినిమాలో ఒక పాత్రలాగా పాత్రని పోషించి, నవ్వించి, కవ్వించి, ఏడిపించి, అలరించి వెళ్లిపోతుంది. అందుకే సాటి మనిషిని ప్రేమిద్దాం.. ప్రేమను  పంచుదాం..
  కామారెడ్డిలో కాంగ్రెస్‌ ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.కేసీఆర్‌ కాంట్రాక్టుల పేరిట ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఆయనను రైతులకు కంటకప్రాయుడు.. కాంట్రాక్టర్లకు ప్రియుడు అని తాను గతంలో అన్నానని గుర్తు చేశారు.ప్రాజెక్టులన్నీ ఆంధ్రా గుత్తేదారుల చేతిలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరు ఆంధ్రా గుత్తేదార్లకు రూ.75వేల కోట్ల పనులు అప్పగించారని తెలిపారు. రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేస్తానని చెప్పి నాలుగేళ్లు చేశారు.దీంతో రుణమాఫీపై వడ్డీ పెరిగి ప్రజలపై భారంపడిందన్నారు. కాంగ్రెస్‌ ఇప్పుడు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామంటే.. కేసీఆర్‌ రూ.లక్ష మాత్రమే చేస్తామంటున్నారని తెలిపారు. సచివాలయానికి రాకుండా రాష్ట్రాన్ని పాలించిన ఏకైక వ్యక్తి కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ లాంటి భాష మాట్లాడేవారు రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేరన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని తన 50ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదని చెప్పారు. మైనార్టీలను మోసం చేసేందుకే మోదీతో కుమ్మక్కై కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలపై తాను చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా 70ఏళ్లు దాటాయి గనక తనకు మతి తప్పిందన్నట్టుగా కేసీఆర్‌ మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్‌కు మళ్లీ అధికారం ఇస్తే దోచుకుంటారని తెలిపారు.
  తెలంగాణలో ముందస్తు వేడి మొదలవడంతో రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఇప్పటికే భైంసాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. కేసీఆర్, మోదీ మీద విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అదే ఊపులో కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన రాహుల్.. అదే స్థాయిలో మళ్ళీ కేసీఆర్, మోదీపై విరుచుకుపడ్డారు. రాహుల్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంపై రాష్ట్ర ఉద్యమం కొనసాగిందని, ప్రజా ఉద్యమం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్‌ మాటలు నమ్మి ఆయనను గెలిపించారని, తెలంగాణలో కొత్త శకాన్ని తీసుకొస్తారని ప్రజలు ఆశించారని అయితే కేసీఆర్‌ పాలనలో ప్రజల ఆశలు అడియాసలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలోనే కేసీఆర్‌ నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహించారని అన్నారు. తెలంగాణలో 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మద్దతుధర అడిగినందుకు రైతుల చేతులకు బేడీలు వేశారని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కానీ, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని.. కుటుంబ పాలన తీసుకువచ్చారని విమర్శించారు. తెలంగాణలో ప్రతి ఒక్కరిపైన రూ. 2.60 లక్షల అప్పు ఉందని అన్నారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు డబ్బు లేవు కానీ, కేసీఆర్‌ తన ఇంటి నిర్మాణానికి రూ.300 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరుతో కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాలు ఇస్తామన్నారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామన్నారు. ఇంటింటికి నల్లా ఇస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ అవినీతికి పాల్పడుతున్నారు రాహుల్ అని అన్నారు. నోట్ల రద్దుపై మోదీ నిర్ణయం తీసుకోగానే దేశమంతా వ్యతిరేకించినప్పటికీ కేసీఆర్ బేషరతుగా మద్దతిచ్చారని రాహుల్ గుర్తు చేశారు. మోదీ, కేసీఆర్‌ ఒక్కటేనని, వారి పాలనలో ఒకేరకమైన పోలికలు ఉన్నాయని అన్నారు. పార్లమెంట్‌లో బీజేపీకి కేసీఆర్‌ అండగా నిలుస్తున్నారని, కేసీఆర్‌తో పాటు ఎంఐఎం కూడా మోదీకి మద్దతు ఇస్తోందని ఆరోపించారు. కేసీఆర్ గల్ఫ్‌ బాధితుల కోసం రూ.500 కోట్లు కేటాయిస్తామని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గల్ఫ్‌ బాధితులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుంది. చెప్పిన మాటలను వచ్చే కాంగ్రెస్‌ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తుంది. అబద్దపు మాటలు విని మోసపోవాలనుకుంటే మోదీ, కేసీఆర్‌ వైపు వెళ్లండి అన్నారు. నాలుగు విడతలు కాదు, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
  నిజామాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిది స్థానాల్లో గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కామారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్‌ ప్రజాగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ కేసీఆర్‌ పాలనపై విమర్శలు గుప్పించారు. " కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటోంది. ఆ డబ్బు ప్రభావంతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ సమాజం కాంగ్రెస్‌ కోసం ఎదురు చూస్తోంది. డిసెంబర్‌ 12న ఏర్పాటయ్యేది కాంగ్రెస్‌నేతృత్వంలో ప్రభుత్వమే. యావత్‌ తెలంగాణ రైతాంగానికి 2లక్షల రుణ మాఫీ చేస్తాం. నిజామాబాద్‌ జిల్లాలో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీకి ఎంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉన్నా.. మా ప్రభుత్వం ఆ ఫ్యాక్టరీని తెరిపిస్తుందని కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇస్తున్నా. బీడీ కార్మికుల దుస్థితికి కారణం కేసీఆర్‌, మోదీ ఘన కార్యమే. జీఎస్టీ 28శాతం పెట్టి కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు. బీడీలపై 28శాతం పన్ను విధించి వారి పొట్ట గొట్టారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.500 కోట్లతో గల్ఫ్‌ బాధితుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. అధికారం చేపట్టిన తొలి ఏడాదిలోనే ప్రభుత్వరంగంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగాలు దక్కనివారికి నెలకు రూ.3వేలుచొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ఇచ్చే పింఛను రెట్టింపు చేస్తాం" అని అన్నారు. "రేషన్‌ పద్ధతిలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం. కుటుంబంలో ప్రతిమనిషికి 7కిలోల సన్నబియ్యం ఇస్తాం. వాటితో పాటు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ఇస్తాం. తెలంగాణలో దళితులు, గిరిజనులకు మేలు చేసే విధంగా తెల్లకార్డు ఉన్నవారందరికీ సన్నబియ్యంతో సహా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా ఇస్తాం. వారి ఇళ్ల అవసరాలకు వాడే 200 యూనిట్ల విద్యుత్‌ ఉచితంగా ఇస్తాం. కాంగ్రెస్‌ పాలనలో ఒక వ్యక్తి, కుటుంబ పాలనకు అవకాశం ఉండదు.. సామాజిక న్యాయం ఉంటుంది. రైతులకు మద్దతు ధరతో పాటు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి బోనస్‌ కేటాయించి రైతులు పండించిన పంటలను మంచి ధరలకు కొనుగోలు చేస్తాం’’ అని ఉత్తమ్‌ ప్రకటించారు.
అప్సరసలాంటి అమ్మాయి ఎదురయితే గుండె దడదడ లాడిన పర్వాలేదు గానీ, మాములుగా ఉన్నప్పుడు కూడా అలా  కొట్టుకుంటుంటే? ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అని గుర్తుపెట్టుకోండి.    గుండెని పదిలంగా చూసుకోవాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు అసలు డాక్టర్ని కలవాల్సిన పనే ఉండదంటున్నారు ప్రకృతి వైధ్య నిపుణులు. మనం తీసుకునే ఆహారపు విషయంలో కొంతమేర జాగ్రత్త తీసుకుంటే చాలట.  రోజువారి నడక, వ్యాయామం తో పాటు కింద చెప్పినవి కొన్ని పాటిస్తూ మన గుండెని ప్రేమగా చూసుకుందాం.    *  ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలులో విటమిన్‌ - బి కాంప్లెక్స్ , నియాసిన్‌ అధిక మోతాదులో వుంటాయి. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుండా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్‌, పుల్లటి రుచిగల పండ్లలో కూడా ఎక్కువగా లభిస్తాయి.   * గింజ దాన్యాలలో సోయా చాలా ప్రత్యేకమైనది.త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చు.శరీరానికి అవసరమైన అమినోయాసిడ్లు, లైసీన్లతోపాటు ఇసోఫ్లేవిన్స్ ని కలిగిఉంటుంది. ఇది గుండెకు బలాన్నిస్తుంది. * ఆలివ్‌ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు ఉపయోగపడతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి.   * ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. * బాదాం పప్పు  గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంలో ఉండే  ఒమెగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్  ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది. *  గుమ్మడి కాయలలో బీటాకెరోటిన్‌ లు ఎక్కువగాఉంటాయి. ఇవి శరీరములో విటమిన్‌ ' ఎ ' గా మార్పుచెంది చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. గుండెజబ్బులు, క్యాన్సర్ కి కారణమయ్యే ఫ్రీరాడిలల్స్ ను ప్రారదోలడములో సహకరించి గుండెను కాపాడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉన్నందున గుండెకు మేలు జరుగుతుంది . ఇలా కొద్దిపాటి జాగ్రత్తలతో మన గుండెని పదిలంగా చూసుకుందాం. - కళ్యాణి
  కీళ్ల నొప్పులు, ఎముకలు అరిగిపోవడం, కూర్చుంటే లేవలేని పరిస్తితి, లేస్తే కూర్చోలేని పరిస్థితి, చాలా దారుణమైన హింస. ఇలాంటి హింస వయసు పైబడినవాళ్లకు తప్పట్లేదు. ముందుగా మేల్కొన్న వాళ్లకు మాత్రం ఈ విషయంలో ఇబ్బందులు కాస్త తక్కువే అని చెప్పాలి. మరి ఇలాంటి కాళ్లూ, కీళ్లూ నొప్పుల బెడదను ముందుగా గుర్తించడానికి మార్గమేదైనా ఉందా.. అని అడిగితే డాక్టర్లు ఇప్పుడు చాలా సులభమైన మార్గం కూడా రెడీగా ఉందంటున్నారు.   క్రమం తప్పకుండా డెంటల్ పరీక్షలు చేయించుకునేవాళ్లకు ఎముకలు బోలుగా మారుతున్నాయా లేదా అన్న విషయాన్ని కనిపెట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని లేటెస్ట్ పరిశోధనలు చెబుతున్నాయట. ఐదు వేల డెంటల్ ఎక్సరేల్ని క్షుణ్ణంగా పరిశీలించాక వైద్య శాస్త్రవేత్తలు ఈ విషయంలో ఓ నిర్థారణకొచ్చారు. ఎముకల పటుత్వం తగ్గిపోవడవల్ల ముందుగా దెబ్బతినేవి దవడ ఎముకలే కనుక, డెంటల్ ఎక్స్ రేలవల్ల ఇలాంటి విషయాల్ని తెలుసుకోవడానికి చాలా మంచి అవకాశాలున్నట్టుగా డాక్టర్లు చెబుతున్నారు. సో.. క్రమంతప్పకుండా పళ్లని పరీక్షచేయించుకుంటే పనిలోపనిగా ఎముకల పటుత్వం సంగతికూడా తేలిపోతుందన్న మాట.. పదిహేనునుంచి తొంభైనాలుగేళ్ల మధ్యలో ఉన్నవాళ్ల డెంటల్ ఎక్సరేలను పరీక్షించినప్పుడు ఈ వివరాలు బైటపడ్డాయ్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.