Publish Date:Aug 9, 2018
Publish Date:Aug 8, 2018
Publish Date:Aug 7, 2018
Publish Date:Aug 7, 2018
Publish Date:Aug 7, 2018
Publish Date:Aug 6, 2018
Publish Date:Aug 6, 2018
Publish Date:Aug 6, 2018
Publish Date:Aug 6, 2018
Publish Date:Aug 2, 2018

LATEST NEWS
ALSO ON TELUGUONE N E W S
 పెరిగిన సాంకేతిక‌త‌,  మారిన ట్రెండ్ ప్ర‌కారం థియేట‌ర్స్ కు వ‌చ్చే ఆడియ‌న్స్ త‌గ్గార‌న‌డంలో సందేహం లేదు. అందుకే సినిమా థియేట‌ర్ల బంద్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.  ఆ నలుగురులో  సీడెడ్ కు చెందిన ఇద్ద‌రు నిర్మాత‌లు ఆ ఏరియాలో భారీగా థియేట‌ర్స్ క‌లిగి ఉన్నారు. వీళ్లు క్ర‌మ‌క్ర‌మంగా థియేట‌ర్ల‌ను త‌గ్గించుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌నాద‌ర‌ణ ఉన్న థియేట‌ర్ల వ‌ర‌కూ ఓకే కానీ, సరిగా ఫీడింగ్ లేక‌పోతే ఆ థియేట‌ర్లు త‌గ్గించుకునే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఒక‌వైపు థియేట‌ర్లు రాబ‌డి త‌గ్గ‌డం ఎగ్జిబీట‌ర్ల‌లో ఆందోళ‌న పెంచుతోంద‌ట‌. ఏదైనా ఫెస్టివ‌ల్ వ‌స్తే ఆ స‌మ‌యాల్లో థియేట‌ర్ల‌కు స‌మ‌స్య లేదు కానీ, మిగ‌తా స‌మ‌యాల్లో మాత్రం మెయింటెనెన్స్ కూడా రావ‌ట్లేద‌ట‌.  మ‌రోవైపు ఇటీవ‌ల మాల్స్ లో  పార్కింగ్ ఫీజును తీసివేయ‌డం తో ఆ మేర‌కు భారీగా ఆదాయం ప‌డిపోయింద‌ట‌.  ఇన్ని స‌మ‌స్య‌ల కార‌ణంగా మార్చిలో థియేట‌ర్స్ బంద్ కు పిలుపునివ్వాల‌ని థియేట‌ర్స్ యాజామాన్యాలు ఆలోచిస్తున్నార‌ట‌.  నైజాంలో కూడా ఈ బంద్ ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌.  ఇదే జ‌రిగితే స‌మ్మ‌ర్ లో వ‌చ్చే సినిమాలకు థియేట‌ర్స్ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశాలు లేక‌పోలేదు.  సంవ‌త్స‌రానికి 150 సినిమాల‌కు పైగా సినిమాలు నిర్మిస్తున్నా థియేట‌ర్స్ కు స‌రైన ఫీడింగ్ ఉండ‌టం లేద‌ని ఎగ్జిబీట‌ర్స్ ఒక‌వైపు వాపోతున్నారు.  మ‌ల్టీప్లెక్స్ కు వ‌చ్చే ఆదాయం సాధార‌ణ థియేట‌ర్స్ కు ఉండ‌టం లేద‌ట‌.  అందులో టిక్కెట్స్ రేట్స్ కూడా పెర‌గ‌డం కూడా ఓ స‌మ‌స్య‌గా చెబుతున్నారు.  చూద్దాం మార్చిలో ఎలా ఉండ‌బోతుందో.
మ‌హేష్ బాబు ఇటీవ‌ల హైద‌రాబాద్ లో  లో ఏఎమ్ బి సినిమాస్ పేరుతో  మ‌ల్టీప్లెక్స్ థియెట‌ర్స్ నిర్మించిన విష‌యం తెలిసిందే. రీసెంట్ గా సూప‌ర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఈ మ‌ల్టీప్లెక్స్ ప్రారంభ‌మ‌య్యాయి. వ‌ర‌ల్డ్ క్లాస్ రేంజ్ లో థియేట‌ర్స్ ఉండ‌టంతో టికెట్ ధ‌ర కూడా అదే స్థాయిలో పెంచారు.  దీంతో ఇప్పుడు ఇది స‌మస్య‌గా మారి మ‌హేష్ కు షో  కాజ్ నోటీసులు పంపించార‌ట జిఎస్టీ అధికారులు. ఒక‌సారి వివరాల్లోకి వెళితే....గ‌తంలో టికెట్ ధ‌ర రూ.100కు పైగా ఉన్న థియేట‌ర్స్ లో జిఎస్టీ టాక్స్ ను 28 శాతం నుంచి 18శాతానికి త‌గ్గించారు. కానీ, ఇప్పుడు ఆ టాక్స్ ను 18 నుంచి 12 శాతానికి కేంద్ర ప్ర‌భుత్వం త‌గ్గించింది.  త‌గ్గించిన ఈ టాక్స్ జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి అమ‌లులోకి  వ‌చ్చింది.  కానీ , మ‌హేష్ మాత్రాం ఏఎమ్ బి సినిమాస్ లో జిఎస్టీకి అనుగుణంగా టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌క పోవ‌డంతో అధికారులు నోటీసులు జారీ  చేసిన‌ట్లు తెలుస్తోంది.  ఈ మ‌ధ్య‌నే మ‌హేష్ కు జిఎస్టీ కు మ‌ధ్య పెద్ద ర‌చ్చే జ‌రిగింది.  2007-8 ఏడాదికి సంబంధించి  కొన్ని బ్రాండ్స్ కు అంబాసిడ‌ర్ గా చేశాడు. కానీ , దానికి ప‌న్ను క‌ట్ట‌లేదంటూ రెండు బ్యాంక్ అకౌంట్స్ కూడా  సీజ్ చేసిన సంగ‌తి తెలిసింది. మెల్ల‌గా ఆ స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగే స‌మ‌యంలో జిఎస్టీ వారు మ‌రో షాక్ ఇచ్చారు ప్రిన్స్ కు.  మ‌రి దీన్ని ఎలా ఫేస్ చేస్తాడో చూద్దాం.
ఒక‌ప్పుడు హీరోయిన్స్ గా టాప్ హీరోస్ తో సంద‌డి చేసిన న‌టీమ‌ణులు ఇప్పుడు అత్త‌, అమ్మ‌, అక్క పాత్ర‌ల్లో రీ ఎంట్రీ ఇస్తూ అల‌రిస్తున్నారు. ఇప్ప‌టికే న‌దియా, ఖుష్బూ ,మీనా , ర‌మ్య‌కృష్ణ లు ఈ కోవ‌లో వ‌చ్చిన‌వారే.  ప్ర‌జంట్ ఈ లిస్ట్ లో గ్లామ‌ర్ క్వీన్ న‌గ్మా చేరుతున్నారు. గ‌తంలో త్రివిక్ర‌మ్ న‌దియా, ఖుష్బూల‌ను త‌న సినిమాల్లో ప‌వ‌ర్ ఫుల్ పాత్రలు ఇచ్చి అద్భుత‌మైన రీ ఎంట్రీ క‌ల్పించాడు. ఇప్పుడు న‌గ్మా కూడా త్రివిక్ర‌మ్, బ‌న్నీ కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని టాక్ వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీకి త‌ల్లిగా న‌టించ‌నుంద‌ట న‌గ్మా.   త్వ‌ర‌లో ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇదిలా ఉంటే మ‌రో హీరోయిన్ రేణూ దేశాయ్ కూడా రీ ఎంట్రీ కి సిద్ద‌మైంది. ప‌వ‌న్ క‌ళ్యాన్ `బ‌ద్రి ` సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యమైంది రేణూ దేశాయ్‌.  తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ఆ త‌ర్వాత రేణు ప‌వ‌న్ తోనే `జానీ` సినిమాలో న‌టించింది. ప‌వ‌న్ ను వివాహం చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు పూర్తిగా దూర‌మైంది. ప‌వన్ క‌ళ్యాన్ తో విడిపోయాక తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా దూర‌మైంది.  తాజాగా ఓ టీవీ షోతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌ళ్లీ ద‌గ్గ‌రైంది. త్వ‌ర‌లో సిల్వ‌ర్ స్క్రీన్ పై కూడా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.   ``దొంగాట ఫేం` వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమాకు సైన్ చేశాను.  గొప్ప రైట‌ర్, సామాజిక వేత్త హేమ‌ల‌త ల‌వ‌ణం గారి పాత్ర‌లో న‌టించ‌డం గౌర‌వంగా భావిస్తున్నా.  అలాగే మ‌రో సినిమాకు కూడా సైన్ చేశాను.  తొంద‌ర‌లోనే షూటింగ్ లో పాల్గొంటాను`` అని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా ప్ర‌క‌టించింది రేణు దేశాయ్.  చూద్దాం రేణు రీఎంట్రీ ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో మ‌రి.
అవును `గూఢ‌చారి` సినిమాతో వారి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది.  ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా చిగురించింది. ఆ ప్ర‌యాణం స‌హ‌జీవ‌నంగా మారింది. ఆ స‌హ‌జీవ‌నం ఇప్పుడు ఏడ‌డుగుల బంధంగా మారనుంది. ఇదంతా ఎవ‌రి గురించి అన‌కుంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నా.... అక్కినేని మేన‌కోడ‌లు సుప్రియ‌-అడివి శేష్ పెళ్లి చేసుకోబోతున్నార‌నే వార్త‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రూ డేటింగ్ లో ఉన్నార‌ట‌. `గూఢ‌చారి` చిత్రం స‌మ‌యంలో వీరి మ‌ధ్య ప్రేమ పుట్టింద‌ట‌.  సుప్రియ‌కు గ‌తంలో పెళ్లి జ‌రిగినా ఆ త‌ర్వాత వ్యక్తిగ‌త‌ కార‌ణాల వ‌ల్ల విడిపోయారు. ఇక ఇటీవ‌ల అడివి శేష్ కూడా త్వ‌ర‌లోనే ఒక అనౌన్స్ మెంట్ ఇవ్వ‌బోతున్నానంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.  నెటి జ‌న్లు `పెళ్లి వార్త చెప్ప‌బోతున్నావా? అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్ర‌మంలో నిజంగానే అడివి శేష్ పెళ్లి వార్తలు వెలుగులోకి వ‌చ్చాయి.  అయితే సుప్రియ‌తో అడివి శేష్ పెళ్ళికి ఇరు వైపులా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా త్వ‌ర‌లో రాబోతుంద‌ని స‌మాచారం. ఈ పెళ్ళి వ్య‌వ‌హారాల‌న్నీ స‌మంత ద‌గ్గ‌రుండి చూసుకోనుంద‌ట‌.  మొత్తానికి అడివి శేష్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడన్న‌మాట‌.
ఢీ, రెడీ,  దూకుడు చిత్రాల‌తో స్టార్ డైరెక్ట‌ర్ గా మంచి పేరు తెచ్చుకున్న ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల ఆ త‌ర్వాత  ఆగ‌డు,  బ్రూస్ లీ , మిస్ట‌ర్  ప్లాఫ్ గా నిలిచాయి. దీనితో బాగా వెనుక‌ప‌డిపోయాడు. అయితే రొటీన్ కు భిన్నంగా త‌న స్టైల్ ను మార్చి  ర‌వితేజ తో `అమ‌ర అక్బ‌ర్ ఆంటోని` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. వ‌రుస విజ‌యాల‌తో అగ్ర నిర్మాణ సంస్థ గా వెలుగొందుత‌న్న మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిచండంతో ఈ సినిమా పై  భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. కానీ  అనుకున్న‌త విజ‌యం సాధించ‌లేదు.ఈ చిత్రం  శ్రీనువైట్ల‌కు , ర‌వితేజ కు మ‌రో డిజాస్ట‌ర్ ను అందించింది. ఇక ఈ చిత్రం త‌ర్వాత శ్రీనువైట్ల మ‌రో స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడు. అయితే స్టార్ హీరోలు ఇప్పుడు ఈయ‌న‌ను న‌మ్మి సినిమా చేసే ప‌రిస్థితిలో లేరు కాబ‌ట్టి శ్రీను వైట్ల ఈసారి మీడియం రేంజ్ హీరోను ఎంపిక చేసుకున్నాడ‌ట‌. ఆయ‌న ఎవ‌రో కాదు మంచు విష్ణు . `ఆచారి అమెరికా యాత్ర‌` త‌ర్వాత మ‌రో సినిమాను మొద‌లుపెట్ట‌లేదు విష్ణు. అయితే ఇప్పుడు శ్రీనువైట్ల కు డేట్స్ ఇచ్చాడ‌ని స‌మాచారం. ఇంత‌కుముందు వీరిద్ద‌రి కాంబినేష‌న‌ల్ వ‌చ్చిన `ఢీ`సూప‌ర్ హిట్ కావ‌డంతో మ‌ళ్ళీ అలాంటి విజ‌యాన్ని శ్రీనువైట్ల ఇస్తాడ‌ని బ‌లంగా న‌మ్ముతున్నాడ‌ట మంచు విష్ణు. మ‌రి ఈ చిత్రం మ‌ళ్ళీ వీరిద్ద‌రికి మ‌రో ఢీ అవుతుందో చూడాలి.
  ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో టీడీపీ నేతల జంపింగులే హాట్ టాపిక్ అని చెప్పాలి. ఎందుకంటే నేతలు వరుసపెట్టి టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. నేతల జంపింగులపై తాజాగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన వారే పార్టీలు మారుతున్నారని ఆరోపించారు. గెలుపు గుర్రాలకే పార్టీ టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరి పనితీరు ఏంటో చంద్రబాబుకు తెలుసునని చెప్పుకొచ్చారు. పార్టీలో, చంద్రబాబుతో విభేదాలు ఉంటే ఎప్పుడో వెళ్లి ఉండేవారని, ఎన్నికలకు రెండు నెలల ముందు కాదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గాను 150 సీట్లలో గెలిచి చంద్రబాబు సీఎం అవుతారని లోకేష్ ధీమా వ్యక్తం చేసారు. నాలుగేళ్ల 10 నెలలు ప్రయాణం చేసి, ఇప్పుడు బాబు మీద విమర్శలు చేయడంలో పరమార్ధాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. నిన్న మొన్నటిదాకా జగన్ ను తిట్టి, ఇప్పుడు ఆయన దగ్గరకే వెళ్లడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నేతలు పార్టీలు మారినా ఏమీ కాదని.. సంక్షేమం, అభివృద్ధే టీడీపీకి అండగా నిలుస్తాయని లోకేష్ స్పష్టం చేసారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని తేల్చి చెప్పారు. ఎన్నికలకు 30 రోజుల ముందు పొత్తులపై చంద్రబాబు ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని లోకేష్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని లోకేష్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ ఎన్నికల బరిలో ప్రధానంగా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ మరియు కాంగ్రెస్ దిగనున్నాయి. టీడీపీ, వైసీపీల పొత్తు అసలు ఆప్షనే లేదు. ఇక టీడీపీ, బీజేపీలు గత ఎన్నికల్లో కలిసి పనిచేసినా.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కాబట్టి బీజేపీతో పొత్తు ఉండే అవకాశం లేదు. జనసేన విషయానికొస్తే.. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీకి దూరంగా ఉండి టీడీపీకి మద్దతిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, కేవలం వామపక్షాలతో కలిసి నడుస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికైతే జనసేనతో పొత్తు కూడా కష్టమే. మరి ఎన్నికల ముందు ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. ఇక మిగిలింది కాంగ్రెస్. మిగతా పార్టీలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి.. అదేవిధంగా కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే తెలంగాణలో వచ్చిన చేదు ఫలితాల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ లు ఏపీలో ఎంతవరకు కలిసి పనిచేస్తాయో కూడా ఆలోచించాలి. కొందరు టీడీపీ నేతలు కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాం కానీ రాష్ట్రంలో మాత్రం విడిగా పోటీ చేస్తేనే టీడీపీకి లాభమని అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పుడు లోకేష్ ఏమో టీడీపీ, ఇతర పార్టీలతో పొత్తు అంటున్నారు. దీంతో అసలు టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అంటూ చర్చలు మొదలయ్యాయి. చూద్దాం మరి ఎన్నికల ముందు టీడీపీ పొత్తుల విషయంలో ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తుందో.
  2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,26,177.53 కోట్లతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతిలో వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం గర్వకారణమని అన్నారు. అపార అనుభవం గల నాయకత్వాన్ని ప్రజలు ఆశించారని.. ఆ నమ్మకంతోనే చంద్రబాబుకు అధికారం అప్పగించారన్నారు. ఈజ్‌ఆఫ్ డూయింగ్‌లో ఏపీ అగ్రగామిగా నిలిచిందని, ఇది చంద్రబాబు సమర్థ నాయకత్వం వల్లే సాధ్యమైందని యనమల అన్నారు. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని తెలిపారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని, దీంతో రాజధాని నగరాన్ని కోల్పోయామన్నారు. విభజన సమయంలో ఆదాయ-వ్యయాలు, ఆస్తులు-అప్పులు సరిగా పంపిణీ చేయలేదని.. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరాశా నిస్పృహలు నెలకొన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అరకొర సాయం వల్ల సమస్యలు మరింత జఠిలమయ్యాయని యనమల పేర్కొన్నారు. మహిళా సాధికారత సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని.. 20 ఏళ్ల క్రితమే మహిళా పొదుపు సంఘాలను ఆయన ఏర్పాటు చేశారని యనమల గుర్తు చేశారు. వెలుగు పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పేదరిక నిర్మూలన కార్యక్రమమని, ఆ పథకంలో ప్రస్తుతం 94 లక్షల మంది మహిళలు ఉన్నారని చెప్పారు. ఈ బడ్జెట్ లో పలు కొత్త పథకాలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఇందులో రైతుల పెట్టుబడి సాయం కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవకు రూ. 5 వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌ ముఖ్యాంశాలు: వ్యవసాయానికి రూ. 12, 732 కోట్లు బీసీ వెల్ఫేర్‌ రూ.8,242 అటవీపర్యావరణానికి రూ. 491 కోట్లు ఉన్నత విద్య- 3,171 కోట్లు ఇంధన మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ రూ.5,473 సెకండరీ ఎడ్యుకేషన్‌ రూ. 22,783 పౌరసరఫరాలు- రూ. 3,763 కోట్లు ఆర్థికశాఖకు రూ. 51, 841 కోట్లు సాధారణపరిపాలన శాఖకు- రూ.1,117 వైద్యారోగ్యశాఖకు రూ. 10,032 హోంశాఖకు రూ.6,397 కోట్లు గృహనిర్మాణశాఖకు రూ.4079 జలవనరులశాఖకు- రూ. 16,852 కోట్లు పరిశ్రమలశాఖకు 4,114 కోట్లు ఐటీకి 1006 కోట్లు కార్మిక ఉపాధి కల్పనకు 1225 కోట్లు న్యాయశాఖకు 918 కోట్లు అసెంబ్లీకి 149 కోట్లు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌కు 7979 కోట్లు మైనార్టీ వెల్ఫేర్‌కు రూ. 1308 కోట్లు ప్లానింగ్‌కు 1403 కోట్లు పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 35,182 కోట్లు రెవెన్యూశాఖకు రూ. 5546 కోట్లు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ 172 కోట్లు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ 458 కోట్లు సోషల్‌ వెల్ఫేర్‌కు రూ. 6861 కోట్లు రోడ్లు భవనాలశాఖకు రూ. 5382 కోట్లు మహిళాశిశు సంక్షేమశాఖకు రూ. 3408 కోట్లు యువజన క్రీడలు రూ. 1982 కోట్లు చిన్నమధ్యతరహా పరిశ్రమలకు రూ. 400 కోట్లు డ్రైవర్‌ సాధికార సంస్థకు రూ. 150 కోట్లు క్షత్రియ కార్పొరేషన్‌కు రూ. 50 కోట్లు ధరల స్థిరీకరణ నిధికి రూ. 1000 కోట్లు యాంత్రీకరణకు రూ. 300 కోట్లు మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 14,367 కోట్లు ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 5,385 కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 16,226 కోట్లు మైనార్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ. 1,304 కోట్లు పసుపు- కుంకుమ కింద రూ. 4 వేల కోట్లు బీసీల కార్పొరేషన్‌కు రూ. 3 వేల కోట్లు ముఖ్యమంత్రి యువనేస్తానికి రూ. 1200 కోట్లు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ. 1100 కోట్లు చంద్రన్న బీమాకు రూ. 354 కోట్లు అన్నా క్యాంటీన్లకు రూ. 300 కోట్లు చేనేతలకు రూ. 225 కోట్లు 9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ. 156 కోట్లు చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ. 175 కోట్లు చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ. 128 కోట్లు మైనార్టీలకు దుల్హన్‌ పథకం కింద రూ.100 కోట్లు ఎన్టీఆర్‌ విదేశీ విద్యకు రూ. 100 కోట్లు పెన్షన్‌ కింద వృద్ధాప్య, వింతంతువులకు రూ. 10,401 కోట్లు
  ఎన్నికల హడావుడి మొదలవుతుంటే సర్వేల సందడి మొదలవ్వడం సహజం. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు.. అభ్యర్థుల ఎంపిక, బలాబలాల అంచనాతో బిజీ బిజీగా ఉన్నాయి. మరోవైపు కొన్ని సంస్థలు సర్వేలతో బిజీగా ఉన్నాయి. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగనున్న విషయం తెలిసిందే. దీంతో కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఏపీలో కూడా సర్వే నిర్వహిస్తున్నాయి. తాజాగా ‘రిపబ్లిక్‌ టీవీ - సీ ఓటర్‌' సంస్థలు ఏపీ పార్లమెంట్ ఎన్నికలపై సర్వే నిర్వహించాయి. ఈ సర్వే ఫలితాలు అధికార పార్టీ టీడీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ సీట్లు సాధించనుందని ‘రిపబ్లిక్‌ టీవీ - సీ ఓటర్‌’ సంస్థలు నిర్వహించిన సర్వే వెల్లడించింది. టీడీపీ 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్‌ టీవీ తాజాగా విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ.. వైసీపీ 41.3 శాతం ఓట్లతో 19 ఎంపీ సీట్లు, టీడీపీ 33.1 శాతం ఓట్లతో 6 ఎంపీ సీట్లు గెలుచుకుంటాయని సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఏపీలో ఒక్క స్థానంలో కూడా గెలవలేవని పేర్కొంది. గత ఎన్నికల్లో  ఏపీలో టీడీపీకి 15 ఎంపీ సీట్లు రాగా, వైసీపీ 8 ఎంపీ సీట్లను సాధించింది. ఇప్పుడు సర్వే మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది. అయితే ఈ సర్వేపై విమర్శలు కూడా వెల్లువెతున్నాయి. బీజేపీ, వైసీపీలు సర్వేల పేరుతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. '2014 ఎన్నికల ముందు వైసీపీ గెలుస్తుంది అంటూ కొన్ని సర్వేలు విడుదల చేసారు. కానీ ఫలితాలు తారుమారు అయ్యాయి. ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది' అంటూ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సర్వేలో చెప్పినట్లు వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందో లేక 2014 ఫలితాలే రిపీట్ అవుతాయో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే.
  వంగవీటి రంగా ఆశయ సాధన కోసమే వైసీపీలో చేరానని, కానీ అది అక్కడ సాధ్యం కాకపోవడంతో బయటకు వచ్చేశానని వంగవీటి రాధా తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... రంగా ఆశయం నెరవేరుస్తానని పార్టీలో చేరేటప్పుడు వైసీపీ అధినేత జగన్ మాటిచ్చారని.. సొంత తమ్ముడికన్నా ఎక్కువ అన్నారని రాధా చెప్పారు. 'తమ్ముడినే ఇలా చూస్తే.. సామాన్య ప్రజలను జగన్‌ ఎలా చూస్తారు' అని ప్రశ్నించారు.  'ఒక్క సీటు కోసం నాకు ఈ గొడవ అవసరం లేదు. నేను అభిమానం కోరుకున్నా.. మీరు జాలి చూపిస్తున్నారు. సీటు ఇవ్వనందుకు నాకు బాధ లేదు, సూటిపోటి మాటలు నన్ను బాధించాయి' అని రాధా అన్నారు. వైసీపీలో తనకు జరిగిన అవమానాలు మరొకరికి ఎదురుకాకూడదన్నారు రాధా. తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళితే.. ఎందుకు వెళ్లావంటూ వైసీపీ నేతలు తనను మందలించారన్నారు. ఇదెక్కడి న్యాయమన్నారు. రంగా విగ్రహావిష్కరణకు అన్ని రకాల పార్టీల వాళ్లు వస్తారని... ఆయన అభిమానానికి హద్దులు లేవన్నారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు ఎవరి అనుమతి అవసరం లేదని చెప్పారు. అభిమానంతో కొంతమంది భోజనాలు పెడితే.. అది కూడా పొరపాటైపోయిందన్నారు. లోకల్ ఇంఛార్జీకి చెప్పలేదని.. తనను ప్రశ్నించారన్నారు. తండ్రి లేనివాడినని చేరదీశానని.. చెప్పినట్లు వినాల్సిందేనంటూ జగన్‌ ఒత్తిడి చేసేవారని రాధా ఆరోపించారు. ఇప్పటికైనా జగన్‌ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. వైసీపీని వీడిన తర్వాత సోషల్ మీడియాలో తనపై బెదిరింపులు పెరిగాయని వంగవీటి రాధా అన్నారు. ఒకవేళ తన చావు వారికి ఆనందం కలిగిస్తుందంటే చంపేయండని అన్నారు. తనకు ప్రాణం మీద ఆశ లేదని.. పేదల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి తన తండ్రి అని.. తాను కూడా అందుకు సిద్ధమేనని చెప్పారు. 'నన్ను బెదిరిస్తున్నవారి ఐపీ అడ్రస్‌ ద్వారా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగలను. కానీ.. వైసీపీ నేతలు కింద వారిని బలి చేస్తారనే ఆగిపోయాను. ఏపీ పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది' అని రాధా అన్నారు. అలాగే పార్టీ మారేందుకు వంద కోట్ల డీల్ కుదుర్చుకున్నారన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
  ఎన్నికల్లో గెలిస్తే ప్రజల అండ మా పార్టీకి ఉంది కాబట్టే గెలిచామని, ఓడిపోతే ఈవీఎం ట్యాంపరింగ్ జరగడం వల్లే ఓడిపోయామని చెప్పుకోవడం కొన్ని పార్టీలకు అలవాటు. ఇప్పటికే విపక్షాలు బీజేపీ మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ఓ సైబర్ నిపుణుడు కూడా చేరిపోయాడు. 2014 నుంచి ఇప్పటివరకు బీజేపీ సాధించిన విజయాలన్నీ ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే సాధ్యమైందని పెద్ద బాంబు పేల్చాడు. అమెరికాలో తలదాచుకుంటున్న సయ్యద్‌ షుజా అనే భారతీయ హ్యాకర్‌ సంచలన ఆరోపణలు చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలు హ్యాక్‌ చేయడం ద్వారానే బీజేపీ విజయం సాధించిందని అన్నారు. ఇందుకు టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో సహకరించిందని తెలిపారు. అయితే ఇక్కడో అర్థంకాని విషయం ఏంటంటే.. 2014లో జియో సేవలు ప్రారంభం కాలేదు. 2016 సెప్టెంబర్‌ నుంచే అవి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికి ఆ లాజిక్ పక్కన పెట్టి మిగతా మేటర్ లోకి వెళ్దాం. సయ్యద్‌ షుజా సోమవారం లండన్‌లో భారత పాత్రికేయ సంఘం నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్కైప్‌ ద్వారా మాట్లాడారు. అయితే ముఖం కనిపించకుండా మాస్క్‌ ధరించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను డిజైన్‌ చేసిన ఈసీఐఎల్‌ బృందంలో తాను కూడా సభ్యుడినని చెప్పారు. 2009 నుంచి 2014 వరకు తాను ఆ సంస్థలో పనిచేశానని పేర్కొన్నారు. ఈవీఎంలను హ్యాక్‌ చేయగలమా? ఎలా చేయగలం? అన్న విషయాన్ని పరిశీలించాలని ఈసీఐఎల్‌ మమ్మల్ని కోరిందన్నారు. వాటిని హ్యాక్‌ చేయవచ్చని తాము నిరూపించామని తెలిపారు. రిలయన్స్‌ జియో అందించిన ఓ మాడ్యులేటర్‌ ద్వారా మిలటరీ గ్రేడ్‌ లోఫ్రీక్వెన్సీ తరంగాలతో బీజేపీ ఈవీఎంలను హ్యాక్‌ చేసింది. తద్వారా 2014 లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టే బీజేపీ సీనియర్‌ నేత గోపీనాథ్‌ ముండేను లోక్‌సభ ఎన్నికలు జరిగిన కొద్దిరోజులకే చంపేశారు. ముండే మరణంపై దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఐఏ అధికారి తాంజిల్‌ అహ్మద్‌ ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయాలనుకున్నారు. ఆలోగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2015లో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఈ సంకేత ప్రసారాలను మేం అడ్డుకున్నాం. ఫలితంగా మొత్తం 70 స్థానాల్లో 67 స్థానాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ గెల్చుకుంది. లేకుంటే బీజేపీ స్వీప్‌ చేసి ఉండేది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ సంకేత ప్రసారాలను మాబృందం అడ్డుకుంది. లేకుంటే ఆ రాష్ట్రాల్లోనూ బీజేపీ విజయం సాధించి ఉండేది.  గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, ఢిల్లీకి సంబంధించి ఈవీఎంలలో రిగ్గింగ్‌ జరిగింది. 2014 ఏప్రిల్‌లో ఈవీఎంల నుంచి సంకేతాలు వెలువడుతున్నట్లు గుర్తించాం. మాకు తెలిసిన ఈ సమాచారంతో బీజేపీని బ్లాక్‌ మెయిల్‌ చేయాలనుకున్నాం. హైదరాబాద్‌ శివార్లలో బీజేపీ నేత ఒకరిని కలుసుకునేందుకు మా బృందం వెళ్లింది. అక్కడ మా బృందంపై కాల్పులు జరిగాయి. ఇందులో కొందరు చనిపోయారు. నేను తప్పించుకున్నా. ఈ ఘటనను వెలుగులోకి రాకుండా చూడటానికి హైదరాబాద్‌లోని కిషన్‌గఢ్‌లో మతకలహాలు జరిగినట్లు చిత్రీకరించారు. తన బృందంలోని కొందరు సభ్యులు హత్యకు గురికావడంతో 2014లో తాను భారత్‌ నుంచి పరారయ్యాయని చెప్పారు. అమెరికాలో రాజకీయ ఆశ్రయం కోరారన్నారు. ఈవీఎంల హ్యాకింగ్‌పై కథనం రాయడానికి పాత్రికేయురాలు గౌరీలంకేశ్‌ అంగీకరించారు.  ఆలోగానే ఆమె హత్యకు గురయ్యారు. ఈవీఎంలలో వాడిన వైర్లను ఎవరు తయారుచేశారన్నది తెలుసుకునేందుకు సమాచారం చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. ఆ తర్వాతే ఆమె హత్య జరిగింది అన్నారు. నా ఆరోపణలకు ఆధారాలిస్తా. ఇటీవలి ఎన్నికల్లో వాడిన ఈవీఎంల ద్వారానే మీకు హ్యాకింగ్‌ తీరును వివరిస్తా. ఏయే ఎన్నికల్లో ట్యాంపరింగ్‌ జరిగిందో చెబుతా అని తెలిపారు. ఈ విలేకరుల సమావేశానికి ఎన్నికల సంఘాన్ని కూడా ఆహ్వానించాం. కానీ రాలేదు. రాజకీయ పార్టీలను ఆహ్వానించాం. అయితే కాంగ్రెస్‌ తరఫున కపిల్‌ సిబల్‌ ఒక్కరే వచ్చారు అన్నారు. హ్యాకర్‌ షుజా ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది. బీఈఎల్, ఈసీఐఎల్‌ రూపొందించే ఈవీఎంలను ఎవ్వరూ హ్యాక్‌ చేయలేరని స్పష్టం చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను రూపొందిస్తామనీ, సాంకేతిక కమిటీ సమక్షంలో నిబంధనల మేరకు ఈ యంత్రాలను కఠినమైన పరీక్షలకు లోనుచేస్తామని వెల్లడించింది. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఈసీ పేర్కొంది. మరోవైపు ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న గేమ్ అంటుంది. హ్యాకర్‌ షుజా ముఖానికి ఉన్న ముసుగు తీసి ఆధారాలు బయటపెడితేనే కానీ అసలు నిజాలు ఏంటో మనకి తెలియవు.
  గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా చేపట్టిన చర్చలో వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వీటికి సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు. పేదరికంతో పాటు నిర్లక్ష్యం వల్ల చాలామంది కంటి పరీక్షలు చేయించుకోవడం లేదని కేసీఆర్‌ చెప్పారు. ఎవరూ కోరకుండానే మంచి ఉద్దేశంతో కంటివెలుగు ప్రవేశపెట్టామన్నారు. కంటివెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.32 కోట్ల మందికి పరీక్షలు జరిగాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటివెలుగు పథకాన్ని ఇతర రాష్ట్రాలు అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. త్వరలో చెవి, ముక్కు, గొంతు పరీక్షల శిబిరాలు కూడా నిర్వహిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యంగా వదిలేశాయని కేసీఆర్‌ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిజంగా రుణమాఫీ చేయకపోతే ప్రజలు మళ్లీ తమకు ఎందుకు ఓటు వేశారని విపక్ష సభ్యులను ప్రశ్నించారు. రైతే రాజు అయ్యే పరిస్థితులు వచ్చాయని ఇప్పటికే కొందరు ప్రశంసిచారని, రైతుబీమా పరిహారం బాధిత కుటుంబాలకు కేవలం 10 రోజుల్లో అందుతోందని చెప్పారు. కార్యాలయాలు తిరగకుండా, పైరవీలు చేయకుండానే బాధిత కుటుంబం ఖాతాలో పరిహారం సొమ్ము జమ అవుతోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయ అధికారులను కూడా నియమించలేదని సీఎం మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాల వల్లే పోడు భూముల సమస్య పరిష్కారం కాకుండా పోయిందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కోయలు వలస రావడం కూడా పోడు భూముల విషయంలో సమస్యగా మారిందని.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆ సమస్యను తప్పకుండా పరిష్కారిస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాల విషయంలో ప్రభుత్వం సాహసం చేయబోతోందని కేసీఆర్‌ చెప్పారు. గతంలో సర్వే ప్రకారం 8 లక్షల ఇళ్లు నిర్మిస్తే సరిపోతుందని తేలిందన్నారు. ఇల్లు అవసరమైనవాళ్లు ఎంతమంది ఉన్నారో కచ్చితమైన లెక్కలను త్వరలో తీస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఇళ్ల పేరుతో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. కొంచెం ఆలస్యమైనా తాము డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లు నాణ్యంగా నిర్మిస్తామని స్పష్టం చేశారు. డబుల్‌ బెడ్ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. పేదవాళ్ల పేర్లను లాటరీలో వేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనూ లాటరీ విధానానికి మినహాయింపు లేదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 30వేల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మంచి పథకాలు ఎవరు తెచ్చినా మెచ్చుకోవాల్సిందేనని కేసీఆర్‌ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ చాలా మంచి పథకమని చెప్పారు. అందుకే ఎలాంటి మార్పులు లేకుండా టీఆర్ఎస్ కూడా ఆరోగ్యశ్రీని అమలు చేసిందన్నారు. ఆరోగ్యశ్రీ బాగున్నందునే కేంద్రం అమలు చేస్తున్నఆరోగ్య పథకంలో తెలంగాణ చేరలేదని తెలిపారు. ఆయుష్మాన్‌భవ కంటే ఆరోగ్యశ్రీ పథకంతోనే ప్రజలకు మేలు జరుగుతుందని కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కిట్‌ పథకంలో కేంద్రం వాటా పైసా కూడా లేదని స్పష్టం చేశారు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం లేదని, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని కేసీఆర్‌ విమర్శించారు. మిషన్‌ కాకతీయ, భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా.. కేంద్రం 24 రూపాయిలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాజ్యాంగబద్దంగా రావాల్సిన పన్నువాటా తప్ప నిధులు రాలేదని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ఆదాయ, వ్యయాల అంచానా రూ.10 లక్షల కోట్లని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఐదేళ్లలో ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు రూ.2 లక్షల 40 వేల కోట్లని, అప్పు చెల్లిస్తే మళ్లీ రూ.లక్షా 30వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై దాదాపు రూ.లక్షా 20 వేల కోట్ల ఖర్చు చేసినట్లు కేసీఆర్‌ తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, ప్రాజెక్టుల తర్వాత రహదారులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని కేసీఆర్ అన్నారు. 12,751 గ్రామ పంచాయతీల్లో బీటీ రోడ్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంచిన పెన్షన్లు, రైతు బంధు, నిరుద్యోగ భృతి అమలు చేస్తామని అన్నారు. మార్చి నాటికి మిషన్‌ భగీరథ ద్వారా అన్ని గ్రామాలకు తాగునీరు అందజేస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.
  పుట్టినరోజనో, ప్రమోషన్ వచ్చిందనో... కారణం ఏదైతేనేం! కుటుంబంతో కాస్త సరదాగా గడపాలి అనుకుంటే అలా రెస్టారెంటుకి వెళ్తాం. కానీ బిల్లు కట్టాల్సి వచ్చేసరికి ఆ సరదా కాస్తా తీరిపోతుంది. వందల్లో కనిపించే బిల్లు, ఆ బిల్లు మీద రకరకాల పేర్లతో ఉండే చార్జీలు- వెరసి బిల్లు మీద దాదాపు 30 శాతం ఎక్కువగా చెల్లించేసి బిక్కమొగంతో బయటకి వస్తాం. ఇంతకీ అందులో కొంతమొత్తం మనం అసలు కట్టాల్సిన అవసరమే లేదు తెలుసా!   దాదాపు అన్ని రెస్టారెంట్లూ సర్వీస్ చార్జ్ పేరుతో 10 శాతం వరకు అదనంగా వసూలు చేస్తుంటాయి. నిజానికి సర్వీస్ చార్జి వసూలు చేయమని ఏ చట్టంలోనూ లేదు. అలా వసూలు చేసే డబ్బు ఏ ప్రభుత్వానికీ వెళ్లదు. సర్వీస్ చార్జ్ అంటే హోటలు సేవలు నచ్చి మనం ఇచ్చే డబ్బు. అంటే సర్వర్కి టిప్పు ఎలాగో, హోటల్కి సర్వీస్ చార్జ్ అలా అన్నమాట! కాబట్టి ఇంత సర్వీస్ చార్జ్ చెల్లించి తీరాలని ఏ చట్టమూ పేర్కొనలేదు. పైగా అలా సర్వీస్ చార్జ్ని బలవంతంగా వసూలు చేయాలనుకోవడం చట్టవిరుద్ధం కూడా! సర్వీస్ చార్జ్ అని పేర్కొన్న కాలం (column) పక్కన వినియోగదారుడే తనకు తోచిన రుసుము చేర్చాలని ప్రభుత్వం పేర్కొంటోంది.   ఇక GST వచ్చిన తర్వాత రెస్టారెంట్లలో బాదుడు పెరిగిపోయిందన్న విషయం తెలిసొందే! చిన్నపాటి ఏసీ రెస్టారెంటులో తిన్నా కనీసం 18 శాతం GST కట్టాల్సి వస్తోంది. దీనికి సర్వీస్ చార్జి మరో పది శాతం తోడైతే చెప్పేదేముంది! పైగా చాలా హోటళ్లు GST లెక్కపెట్టేటప్పుడు సర్వీస్ చార్జిని కూడా కలుపుతున్నాయి. అసలు బిల్లు 100 రూపాయలు, సర్వీస్ చార్జి 10 రూపాయలు అయితే... మొత్తం 110 రూపాయల మీద GST లెక్క కడుతున్నాయన్నమాట!   ఈ విషయాలు చాలామందికి తెలియకో... తెలిసినా లేనిపోని గొడవ ఎందుకనో నిశ్శబ్దంగా బిల్లు చెల్లించేస్తుంటారు. హోటళ్లు కూడా అంతే నిశబ్దంగా ఆ డబ్బుని తమ ఖాతాలో జమచేసుకుంటాయి. కడుపు మీద కొట్టడం అంటే ఇదే కదా! - నిర్జర.  
  పిల్లలు చీకటిపడితే చాలు, బుద్ధిగా పడుకుంటారు. కానీ ఇలా టీనేజిలోకి అడుగుపెడతారే లేదో... రాత్రిళ్లు వీలైనంత మేలుకునే అలవాటు మొదలవుతుంది. ఇంతకీ కుర్రకారుకి రాత్రివేళలు ఎందుకు నిద్రపట్టదు. పగలు పుస్తకమే ముట్టుకోనివారు రాత్రిళ్లు నైట్‌ అవుట్ చేయాలనీ, బండి మీద చక్కర్లు కొట్టాలనీ ఎందుకు ఉవ్విళ్లూరుతారు... అంటే ఈ మధ్య జరిగిన ఓ పరిశోధనలో జవాబు దొరికినట్లే కనిపిస్తుంది.   వేల సంవత్సరాల నుంచి వస్తున్న అలవాట్లే, మనం వేర్వేరు సమయాలలో నిద్రపోవడానికి కారణం అవుతున్నాయా! అనే అనుమానంతో శాస్త్రవేత్తలు ఈ పరిశోధన మొదలుపెట్టారు. ఇందుకోసం టాంజానియాలో ఆటవిక జీవితాన్ని గడుపుతున్న హజ్డా అనే తెగలోని వారిని పరిశీలించారు. వీరు 20 లేదా 30 మంది కలిసి ఓ గుంపుగా ఉంటారు. ఉదయాన్నే లేచి ఆడామగా ఆహారం కోసం బయల్దేరతారు. కొందరు దుంపలు, కాయలు తీసుకువస్తే.... మరికొందరు జంతువులని వేటాడి తీసుకువస్తారు. సాయంత్రం వేళకి అందరూ ఒక చోటకి చేరి, తాము తెచ్చుకున్నది శుభ్రంగా తిని హాయిగా పడుకుంటారు. గడ్డి, కొమ్మలతో నేసిన గుడిసెలలో ఎలాంటి ఫ్యాన్లూ, లైట్లూ లేకుండా హాయిగా నిద్రపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే- వేల సంవత్సరాల క్రితం మప పూర్వీకులు ఎలా జీవించేవారో, హెజ్డా ప్రజలు అదే తీరున జీవిస్తున్నారు.   ఈ హెజ్డాతెగలో 20 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న ఓ 33 మందిని పరిశోధన కోసం ఎన్నుకొన్నారు. వారి నిద్రను గమనించేందుకు, అభ్యర్థులందరికీ ఓ వాచిలాంటి పరికరాన్ని అమర్చారు. ఇలా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తల దిమ్మ తిరిగిపోయింది. వీళ్లలో రాత్రి ఒకో సమయంలో ఒకొక్కరు మెలకువగా ఉన్నారట! మొత్తమ్మీద 33 మందీ ఒకేసారి గాఢంగా నిద్రపోయిన సమయం పట్టుమని 20 నిమిషాలు కూడా లేదు. మెలకువగా ఉండటమో, పొగ తాగేందుకు లేవడమో, లేచి పిల్లలని చూసుకోవడమో, మరోవైపుకి ఒత్తిగిలి పడుకోవడమో... ఇలా ఏదో ఒక చర్యతో గుంపులో ఎవరో ఒకరు జాగరూకతతో కనిపించారు.   అడవులలో జీవించేవారు రకరకాల ప్రమాదాలకి సిద్ధంగా ఉండాల్సిందే! ఏ వైపు నుంచి పులి వస్తుందో, ఏ దిక్కు నుంచి మబ్బులు కమ్ముకువస్తాయో, ఏ పొదలోంచి పాములు చొరబడతాయో తెలియదు. కాబట్టి.... ఎవరో ఒకరు అప్రమత్తంగా ఉండేందుకు ప్రకృతి ఈ ఏర్పాటు చేసిందన్నమాట. ఏ ఇద్దరి నిద్రతీరు ఒకేలా లేకపోవడంతో, గుంపు సురక్షితంగా ఉంటుంది. అది సరే! ఇంతకీ నిద్రకీ వయసుకీ సంబంధం ఏమిటి? అన్న ప్రశ్న అలాగే మిగిలిపోయింది కదా! ఒక గుంపులో కుర్రవాళ్లు, వృద్ధులు సరిసమానంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కుర్రవాళ్లు ఒక సమయంలో, వృద్ధులు మరో సమయంలో పడుకుంటే సరి! అందుకనే మీరు గమనించారో లేదో.... కుర్రవాళ్లకి ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేచే అలవాటు ఉంటే, ముసలివారు త్వరగా పడుకుని తెల్లవారేసరికల్లా లేస్తారు. కుర్రవాళ్లు ఆలస్యంగా పడుకున్నా వారి ఆరోగ్యం మీద అంతగా ప్రభావం చూపదు కదా! అలా మొదలైన అలవాటు ఇప్పటికీ కుర్రకారుని వదిలిపెట్టడం లేదన్నమాట! - నిర్జర.
  అనగనగా ఓ రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా ముక్కున వేలేసుకునేవారు. అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు. కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత! రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. ‘అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి,’ అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది. అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి చేరింది.   ‘భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమైపోయింది. కానీ నాదో చిన్న కోరిక,’ అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించినట్లుగా భగవంతుడు ఓ చిరునవ్వు నవ్వి- ‘నువ్వు దేవతా గుర్రానికి. నీ కోరికని తీర్చాల్సిందే! ఏం కావాలో కోరుకో!’ అన్నాడు. ‘నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. ఆలోచించి చూస్తే నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అవన్నీ సరైపోయి నేను ఇంకా అందంగా ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’ అని వేడుకుంది.   ‘ సరే! నీలో నీకు ఏ లక్షణాలు లోపాలుగా కనిపిస్తున్నాయో చెప్పు. అవన్నీ సరిదిద్దుతాను,’ అంటూ అభయమిచ్చాడు భగవంతుడు. దాంతో ఆ గుర్రం తనలో తనకి లోపాలుగా తోచిన లక్షణాలన్నింటినీ ఏకరవు పెట్టడం మొదలుపెట్టింది. ‘ఈ తల చూసారా! మరీ మెడకి అంటుకుపోయినట్లుగా ఉంది. అది ఇంకాస్త పొడవు ఉంటే బాగుంటుంది. ముక్కు కూడా మరీ సన్నగా ఉందేమో అని నా అనుమానం. ఇక కాళ్లు ఇంకాస్త పొడవుంటే భలే ఉంటుంది. దయచేసి ఇవన్నీ సరిదిద్దురూ!’ అంది గుర్రం. ‘తథాస్తు! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునే సరికి ఈ లోపాలేవీ లేని సరికొత్త రూపం నీకు వస్తుంది,’ అన్నాడు భగవంతుడు.   మొదటి గుర్రం సంతోషంగా భగవంతుని దగ్గర సెలవు తీసుకుంది. అది అలా వెళ్లిందో లేదో రెండో గుర్రం భగవంతుడి దగ్గరకు చేరుకుంది. ‘హే భగవాన్‌! ఆ గుర్రం తన అందాన్ని పెంచుకోవాలనే కోరికతోనే నీ దగ్గరకి వచ్చిందని నాకు తెలుసు. ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప గుర్రం అనిపించుకోవాలని దాని తపన. దాని అత్యాశని మీరు అణచాల్సిందే! అది తనలోని అందం మెరుగుపడేందుకు ఏ లక్షణాలనైతే కోరుకొందో... అవి నాలో మరింత ఎక్కువగా ఉండేలా వరం ఇవ్వండి,’ అని వేడుకుంది. ‘అయ్యో అదెంత భాగ్యం! అసలే నువ్వు దేవతా గుర్రానివి. నీ కోరికను తీర్చాల్సిందే! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునేసరికి ఆ లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. తథాస్తు!’ అంటూ నవ్వాడు భగవంతుడు.   ఆ రాత్రి గుర్రాలకి సరిగా నిద్రపట్టనే లేదు. ఎప్పుడెప్పుడ తెల్లవారుతుందా... నిబిడీకృతమైన తమ అందాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అన్న ఉద్విగ్నతతో ఆ రాత్రిని గడిపాయి. ఎప్పుడో అర్ధరాత్రి వాటికి మాగన్నుగా నిద్రపట్టింది. తెల్లవారాక చూసుకుంటే ఆ రెండు గుర్రాలకీ తమ కోరిక నెరవేరిన విషయం తెలిసిపోయింది. కాకపోతే... మొదటిగుర్రం కోరుకున్న లక్షణాల కారణంగా అది అచ్చు ఒంటెలా మారిపోయింది. మొదటి గుర్రం కోరుకున్న లక్షణాల మోతాదు తనలో మరింతగా ఉండాలని కోరుకోవడంతో రెండో గుర్రం జిరాఫీలా మారిపోయింది!!!   తమ శరీరాల వంక చూసుకున్న గుర్రాలు రెండూ లబోదిబోమంటూ భగవంతుడి దగ్గరకు పరుగులెత్తాయి. ఆయనను చూస్తూనే ‘ఏమిటీ మాకీ అన్యాయం!’ అంటూ ఆక్రోశించాయి.   ‘మీరు కోరుకున్న వరాన్ని యథాతథంగా తీర్చాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది? ఆగమేఘాల మీద పరుగులు తీసే దేవతాశ్వాలు ఎలా ఉండాలో, మిమ్మల్ని అలా పుట్టించాను. కానీ మీకు మీ శరీరం పట్ల కానీ, దానిని అందించిన నా పట్ల కానీ నమ్మకం లేదు. అదే అసలైన అన్యాయం. మీరు నిజంగా నన్ను ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే... ఎలాంటి నిస్సత్తువా దరిచేరకుండా బలిష్టంగా ఉండాలనో, కోరుకున్న గమ్యాలని సమర్థంగా చేరుకోవాలనో అడగాల్సింది! కానీ మీరు పైపై మెరుగులకే ప్రాధాన్యతని ఇచ్చారు. ఇక ఫలితం అనుభవించండి. ఇక నుంచీ మీరు దేవతా అశ్వాలు కాదు. ఒకరేమో ఒంటెలాగా ఎడారుల్లో తిరుగుతూ నానా బరువులూ మోయాల్సి ఉంటుంది. మరొకరేమో చిటారుకొమ్మ మీద దొరికే ఆహారంతో తృప్తిపడుతూ అడవులలో కాలం గడపాల్సి వస్తుంది. పోండి!,’ అనేశాడు భగవంతుడు. అదీ విషయం! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.
  తెలంగాణ కేబినెట్ విస్తరణలో మహిళలకు చోటు దక్కని విషయం తెలిసిందే. గత కేబినెట్ లో మహిళలకు అవకాశం ఇవ్వని సీఎం కేసీఆర్.. ఈసారైనా అవకాశమిస్తారని భావించారంతా. కానీ ఈసారి కూడా మహిళలకు చోటు దక్కలేదు. దీంతో ప్రతిపక్షాలు కేసీఆర్ మీద విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి.. కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ కూర్పను ఆయన తప్పుబట్టారు. కేబినెట్‌లో మహిళలు, గిరిజనులకు ప్రాధాన్యం లేదని విమర్శించారు. గతంలోనూ మహిళలకు కేబినేట్ లో స్థానం కల్పించలేదని ఈసారైనా కల్పిస్తారని ఆశిస్తే ఈసారి కూడా అవకాశం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై కేసీఆర్ వివక్ష చూపుతున్నారంటూ మండిపడ్డారు. మహిళలపై వివక్ష చూపుతున్నందుకు గానూ కేసీఆర్‌పై షీ టీమ్‌ కేసు పెట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
  తెలంగాణ నూతన మంత్రులకు సీఎం కేసీఆర్ షాకిచ్చారు. మంత్రులకు వ్యక్తిగత కార్యదర్శుల (పీఎస్‌)ను నియమించుకునే వెసులుబాటు లేకుండా.. వారిని నియమించే బాధ్యతను సీఎం కేసీఆరే తీసుకున్నారు. సాధారణంగా మంత్రులు శాఖాపరమైన నిర్ణయాలు, సలహాలు తీసుకోవడానికి తమకు నచ్చిన అధికారులను వ్యక్తిగత సిబ్బందిగా నియమించుకునేవారు. అయితే తాజాగా మంత్రలకు ఆ అవకాశం ఇవ్వకుండా స్వయంగా సీఎం కేసీఆరే వారి పీఎస్‌ లను నియమించనున్నారు. మంత్రులకు విధుల్లో సహాయకారులుగా ఉంటూ వారికి దిశానిర్దేశం చేసే బాధ్యత పీఎస్‌లదే. మంత్రులు ఫైలుపై సంతకం చేయాలన్నా.. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా.. పీఎస్‌ల సలహాలు తప్పనిసరి. అయితే గత కేబినెట్ లో మంత్రుల వద్ద పీఎస్ లుగా పనిచేసిన అధికారులు అవినీతికి పాల్పడినట్లు సీఎం దృష్టికి వెళ్లింది. ఈ కారణంగానే కొంతమంది మంత్రులకు చెడ్డపేరు వచ్చినట్లు కేసీఆర్ గుర్తించారు. అందువల్ల ఇలాంటి తప్పు మరోసారి జరగకుండా చూడాలని భావించారు. ఈ క్రమంలో మంత్రుల పీఎస్ లను తానే నియమించాలని కేసీఆర్ భావించినట్లు సమాచారం. ఇక పీఏల ఎంపిక మాత్రం మంత్రుల ఇష్టానికే వదిలేశారు. ప్రతి మంత్రికీ ఒక పీఎస్‌, ఇద్దరు పీఏలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే మంత్రి పేషీ అంతా పీఎస్‌ ఆధీనంలోనే ఉంటుంది. ఈ క్రమంలో పక్కదారి పట్టిన పీఎస్‌ల వల్లే మంత్రులు బద్నాం అవుతున్నారని గుర్తించిన సీఎం.. పీఎస్‌ల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆశావహుల జాబితాను సిద్ధం చేసిన ఆయన.. దాన్ని మంత్రులకు పంపించనున్నారు.
  టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌పై చీరాల వైసీపీ సమన్వయకర్త యడం బాలాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్‌కు బాలాజీ బహిరంగలేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ఆమంచిపై పలు ఆరోపణలు చేశారు. జగన్ ఓదార్పు యాత్ర సమయంలో ఆమంచి ఆగడాలు తట్టుకోలేక తనను పార్టీలోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. ఎన్‌ఆర్‌ఐగా ఉన్న తాను అన్నీ వదులుకుని 9ఏళ్లు పార్టీ కోసం పనిచేశానని, ఆమంచి లాంటి‌ రౌడీని పార్టీలో చేర్చుకోవద్దని చెప్పినా వినలేదని లేఖలో ఆరోపించారు. దుష్టశక్తులను పార్టీలో చేర్చుకున్నారంటే.. జగన్ అవినీతి కూడా నిజమనే భావన కలుగుతోందని, తన లేఖపై స్పందించకుంటే వైసీపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తానని యడం‌ బాలాజీ స్పష్టం చేశారు. మరోవైపు యడం బాలాజీ టీడీపీలో చేరో యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన అనుచరులతో మంతనాలు కూడా ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు విజయవాడకు చెందిన ఒకరిద్దరు టీడీపీ నాయకులు బాలాజీతో చర్చలు కూడా జరిపారు. ప్రస్తుతం యడం బాలాజీ రాసిన లేఖ చూస్తుంటే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనిపిస్తోంది. చూద్దాం మరి యడం బాలాజీ ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తారో.
    అదే పనిగా టమాటాలు తింటూ ఉంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉందని చెబుతుంటారు. అలాగని టమాటాలను పూర్తిగా పక్కన పెట్టేస్తే, వాటి రుచికి దూరం కాక తప్పదు. పైగా టమాటాలో సమృద్ధిగా ఉండే విటమిన్‌ ఏ, సి వంటి పోషకాలకి కూడా శరీరం దూరమైపోతుంది. టమాటాని మనం పూర్తిగా దూరం చేసుకోకూడదని హెచ్చరించేలా ఇప్పుడు మరో పరిశోధన వెలుగులోకి వచ్చింది.   కేన్సర్‌ వల్ల కలిగే మరణాలలో, పదో శాతం మరణాలకి జీర్ణాశయ కేన్సరే కారణంగా ఉంటోంది. కడుపులో కేన్సర్‌ మొదలైనప్పటికీ... అదేదో సాధారణ కడుపునొప్పో, అజీర్ణ సమస్యో, అల్సరో అనుకోవడం చేత కేన్సర్‌ ముదిరిపోయేదాకా దాన్ని ప్రజలు నిర్లక్ష్యం చేస్తుంటారు. కాబట్టి మిగతా కన్సర్లకంటే ఇది చాలా ప్రమాదకరంగా మారుతోంది.   జీర్ణాశయ కేన్సర్లకి దారితీసే చాలా పరిస్థితులు మన స్వయంకృతాపరధాలే! ఊరగాయలు, ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు, వేపుళ్లు, మాంసం... ఎక్కువగా తినడం వల్ల కేన్సర్ రావచ్చు. పొగతాగడం, మద్యపానం అలవాట్లు కూడా ఈ కేన్సర్‌కు దారితీస్తాయి. మన కడుపులో ఉండే Helicobacter pylori అనే సూక్ష్మక్రిమి వల్ల కూడా ఈ కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది. ఇక జన్యుపరంగా వచ్చే ప్రమాదమూ లేకపోలేదు.   మెడిటేరియన్‌ (మధ్యధరా) ప్రాంతంలో ఉండేవారిలో ఈ తరహా కేన్సర్‌ చాలా తక్కువగా ఉంటోందన్న వాదన చాలా రోజుల నుంచీ ఉన్నదే! పొగతాగకపోవడం, తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వంటి అలవాట్లే ఇందుకు కారణం అనుకునేవారు. ఇప్పుడు దానికి మరో రహస్యం కూడా తోడైది. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లోని ప్రజలు టమాటాలను ఎక్కువగా తినడం వల్ల వారిలో జీర్ణాశయ కేన్సర్‌ వచ్చే ప్రమాదం తక్కువని తేల్చారు.   ఇటలీలోని National Cancer Institute of Naples సంస్థ జీర్ణాశయ కేన్సర్‌ మీద టమాటాల ప్రభావం తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందుకోసం దక్షిణ ఇటలీలో ఎక్కువగా కనిపించే San Marzano, Corbarino అనే జాతి టమాటాల నుంచి తీసిన రసాయనాలను జీర్ణాశయ కేన్సర్‌ రోగులకు అందించి చూశారు. ఈ రసాయనాలు రోగి శరీరంలోకి చేరినప్పుడు వారి శరీరంలోని కేన్సర్‌ కణాలు చనిపోతున్నాయనీ, వాటి అభివృద్ధి కూడా ఆగిపోతోందనీ గమనించారు. ఇదే తరహా ఉపయోగం మిగతా టమాటాల వల్ల ఉంటుందో లేదో తేల్చాల్సి ఉంది.   మితంగా తింటే ఏ ఆహారమైనా మనకు ఔషధంగానే ఉపయోగపడుతుందని ఈ పరిశోధన మరోసారి రుజువుచేస్తోంది. కాబట్టి భయాలన్నీ పక్కనపెట్టి టమాటాలని కూడా అప్పుడప్పుడూ ఓ పట్టుపడితే సరి!   - నిర్జర.  
  పెద్దగా పట్టించుకోం అన్నమాటే కానీ ఉదయం లేచిన దగ్గర్నుంచీ ఏ పని చేయాలన్నా మనకి గోళ్లే సాయపడతాయి. గోళ్లు కేవలం మన వేళ్లకి రక్షణ, బలం మాత్రమే కాదు... అవి మన ఆరోగ్యానికి సూచనలు కూడా! గోరు ఊడిపోతే కానీ కంగారుపడని మనం, ఒకోసారి గోటి రంగుని చూసి కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఎందుకంటారా...   పాలిపోయి ఉంటే.. తెల్లగా తళతళలాడిపోయే గోళ్లు నిజానికి ఏమంత మంచివి కావు. శరీరంలో తగినంత రక్తం లేదన్న సూచనను ఇవి అందిస్తాయి. శరీరానికి తగినన్ని పోషకాలు అందడం లేదన్న హెచ్చరికనూ ఇవి చేస్తాయి. ఇక గుండె లేదా లివర్‌ పనితీరులో ఏదన్నా లోపం ఉన్నప్పుడు కూడా గోళ్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి. కాబట్టి గోళ్లు మరీ పాలిపోయినట్లు ఉండి, దానికి తోడు తరచూ నీరసంగా అనిపిస్తూ ఉంటే బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుని చూడండి.   పసుపు: గోళ్లు పసుపుపచ్చగా ఉంటే చూసేవాళ్లకి కూడా వెగటు పుట్టిస్తాయి. సాధారణంగా గోళ్లలో కొన్ని రకాల ఫంగస్‌ చేరడం వల్ల అలా పసుపుగా మారుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటే పరిస్థితి మెరుగుపడుతుంది. పొగతాగేవారిలో, నెయిల్‌ పాలిష్‌ను ఎడాపెడా వాడేవారిలో కూడా గోళ్లు ఇలా పసుపురంగులోకి మారిపోతుంటాయి. మీ అలవాట్లను మానుకోమంటూ హెచ్చరిస్తుంటాయి. గోరు మొత్తం చాలాకాలం పాటు పసుపురంగులోకి మారిపోయి ఉంటే అది డయాబెటిస్, ధైరాయిడ్ వంటి వ్యాధులకు సూచన కావచ్చు.   పగుళ్లతో కనిపిస్తుంటే: చాలామంది పెద్దవాళ్లలో గోళ్లు పొడిబారిపోయి... పొరలుపొరలుగా విడిపోతూ... తేలికగా విరిగిపోతూ ఉంటాయి. వయసు మీరకుండానే ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం జాగ్రత్త అవసరం. తరచూ నీటిలో నానడం, ఘాటైన రసాయనాలలో చేతులు పెట్టేయడం, నెయిల్ పాలిష్‌ రిమూవర్‌ను వాడటం దీనికి కారణం కావచ్చు. అటు నీళ్లు, ఇటు బట్టల సబ్బులతో ఎక్కువసేపు గడిపే ఆడవారిలో ఇలాంటి గోళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఒకోసారి శరీరంలో విటమిన్ల లోపం ఏర్పడినప్పుడు కూడా గోళ్లు ఇలా మనల్ని హెచ్చరిస్తుంటాయి.   గీతలు: చాలామంది పెద్దవారి గోళ్ల మీద నిలువు గీతలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవేమంత కంగారుపడాల్సిన సూచనలు కావు. మహా అయితే ‘బి’ విటమిన్‌ లోపించడం వల్ల ఇవి ఏర్పడుతూ ఉంటాయి. కానీ అడ్డగీతలు కనిపిస్తే మాత్రం వైద్యుని సంప్రదించడం మంచిది. శరీరం ఏదన్నా తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నప్పుడు, గోళ్లలో ఇలాంటి అడ్డగీతలు ఏర్పడుతూ ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే గోళ్లు పెరుగుదల కూడా ఆగిపోయేంతగా శరీరంలో ఏదో లోపం ఏర్పడినట్లు లెక్క. షుగరు వ్యాధి అదుపు తప్పడం దగ్గర్నుంచీ... తీవ్రమైన జింకు లోపం వరకూ అడ్డగీతలు చాలా సమస్యలకు సూచన కావచ్చు.   మచ్చలు: గోళ్ల అడుగు భాగంలో తెల్లటి చుక్కలు కనిపించడం సర్వసాధారణమైన విషయం. గోళ్లు పెరిగేకొద్దీ, ఈ మచ్చలు కూడా కరిగిపోతూ ఉంటాయి. గోరుకి ఏదన్నా దెబ్బ తగిలినా, లేకపోతే చిన్నపాటి ఇన్ఫెక్షన్‌ వచ్చినా కూడా ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి మచ్చలు మరీ సుదీర్ఘకాలం ఉంటే తప్ప వీటి గురించి అంత భయపడాల్సిన పని లేదు. కానీ తెల్లగా కాకుండా గాఢమైన రంగులో ఏవన్నా మచ్చలు లేక గీతలు ఉండి నొప్పిగా ఉంటే కనుక వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. అవి ఒకోసారి స్కిన్‌ క్యాన్సర్‌కు సూచన కావచ్చు. - నిర్జర.  
  Heel pain, a common foot complaint among most of us now a days. It may occur for a variety of reasons, including heel spurs. Here are few scenarios where your  heel pain  becomes unbearable : * First in the morning when you get out of bed. * After sitting at your desk or in your car for a long time. * When you exercise without warm -up activity.   In few cases if a person is diagnosed with flat feet, then  heel pain may be caused by heel spurs or an inflamed plantar fascia.  Heel spurs can only be seen on an X-ray, so consult with your foot and ankle specialist for a definitive diagnosis. If you are getting heel pain with the first few steps you take after getting out of bed in the morning or when you resume back  to another activity  after  walking   for long or  after sitting / standing for a long period, then its adivised to consult your doctor immediately. If this problem is ignored and  untreated, your heel pain will likely  to grow worse over time. It can even become disabling and might  prevent  you from enjoying your regular chores of work. However, below mentioned are few tips help you to get some relief from pain till the time you visit your mediacal expert:   * Rest your feet as much as possible for a few days. Try to refrain yourself  from activities, like running and standing or walking for long hours as this might aggravate your pain. * Use ice-pack on  your heels to reduce inflammation and pain. * Give your feet extra support with supportive shoes,  heel pads or cushions or arch supports that help relieve pressure on your plantar fascia and heel. * Stretch your calf muscles to reduce the muscle tightness that inflames your plantar fascia. Keep your calf muscles and plantar fascia stretched out overnight by using a night splint. Bhavana
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.