EDITORIAL SPECIAL
ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.
* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.
* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.
ALSO ON TELUGUONE N E W S
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మేనకోడలు, యువ సంగీత దర్శకుడు & తమిళ హీరో జీవీ ప్రకాష్ కుమార్ సిస్టర్ భవానీ శ్రీ హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, ఆమె సినిమా చేయలేదు. వెబ్ యాంథాలజీ‌లో ఒక కథలో నటించారు. అసలు వివరాలలోకి వెళితే...      పరువు హత్యల నేపథ్యంలో తమిళ దర్శకుడు వెట్రి మారన్, గౌతమ్ వాసుదేవ మీనన్, సుధా కొంగర, విఘ్నేష్ శివన్ ఒక వెబ్ యాంథాలజీ తీస్తున్నారు. నాలుగు కథల సంకలనంగా ఇది ఉంటుంది అన్నమాట. ఒక్కో కథ ఓ ఎపిసోడ్‌గా తీస్తారు. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న కథలో రెహమాన్ మేనకొడలు భవానీ శ్రీ హీరోయిన్. ఆమెకు జోడీగా కాళిదాస్ జయరామ్ కనిపిస్తాడు. కొడైకెనాల్ నేపథ్యంలో ఈ కథ ఉంటుందట.  వెట్రి మారన్ కథలో ప్రకాష్ రాజ్, సాయి పల్లవి నటించారు. వాళ్లిద్దరూ తండ్రీకూతుళ్లుగా నటించారని టాక్. విఘ్నేష్ శివన్ కథలో అంజలి, కల్కి కొచ్చిన్ నటించారు. ఇటీవల తన పాత్రకు ఇంటి నుండి అంజలి డబ్బింగ్ చెప్పారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య తొలిసారి హీరోగా నటిస్తున్న సినిమా 'లవ్ స్టోరీ'. సాయి పల్లవి హీరోయిన్. జస్ట్ 15 డేస్ షూటింగ్ బ్యాలన్స్ ఉంది. యాక్చువల్లీ... 2020 సమ్మర్‌లో సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ, కరోనా రిలీజ్‌కి రెడ్ సిగ్నల్ వేసింది. షూటింగ్స్ స్టార్ట్ అయిన తరవాత 15 డేస్ వర్క్ కంప్లీట్ చేస్తే రిలీజ్ గురించి ఆలోచించవచ్చు.  ఇప్పుడు షూటింగ్స్ స్టార్ట్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కానీ, అక్కినేని నాగచైతన్య మాత్రం రెడీ అని శేఖర్ కమ్ములకు చెప్పాడట. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలతో షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ, జూలైలో షూటింగ్ స్టార్ట్ చేయాలని 'లవ్ స్టోరీ' యూనిట్ అనుకుంది. అయితే, జూలైలో కాకుండా ఆగస్టు నుండి స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఆగస్టులో గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వం వహించనున్న 'అలిమేలు మంగ వెంకటరమణ' షూటింగ్ కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య 'లవ్ స్టోరీ' చేయాలని అనుకుంటున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆగస్టులో మరికొన్ని సినిమాలు స్టార్ట్ అయ్యేలా ఉన్నాయి.
  హిట్ సినిమాకు ఫార్ములా అంటూ ఏమీ ఉండ‌దు. కొన్ని సినిమాలు ఎందుకు హిట్ట‌య్యాయో, కొన్ని సినిమాలు ఎందుకు ఫ‌ట్ట‌య్యాయో అర్థంకాక సినీ వ‌ర్గాల‌తో పాటు విశ్లేష‌కులూ త‌ల ప‌ట్టుకుంటుంటారు. మంచి సినిమాగా విమ‌ర్శ‌కులు పేర్కొన్న కొన్ని సినిమాల వేపు ప్రేక్ష‌కులు త‌లే తిప్ప‌క‌పోతే, చెత్త సినిమాలుగా వారు విమ‌ర్శించిన సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన సంద‌ర్భాలెన్నో. అయితే ప్రేక్ష‌కుల నాడిని ప‌ట్టేశారా.. అన్న‌ట్లు కొంత‌మంది ద‌ర్శ‌కులు తీసిన సినిమాలు ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి విజ‌యాన్ని సాధించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తుంది. తెలుగులోనూ య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి, శేఖ‌ర్ కమ్ముల‌, కొర‌టాల శివ‌, మారుతి వంటి ద‌ర్శ‌కులు మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్స్‌గా పేరు పొంద‌గా, బాలీవుడ్‌లో అలాంటివాళ్లు క‌నీసం ఐదుగురు ఉన్నారు. గ‌మ‌నించ‌ద‌గ్గ అంశ‌మేమంటే  ఆ ద‌ర్శ‌కులు ఒకే త‌ర‌హా సినిమాలు తీసేవాళ్లు కాదు. ఎవ‌రి శైలి వారిదే. అయినా వాళ్ల చిత్రాల‌ను ప్రేక్ష‌కులు మ‌రో ఆలోచ‌న లేకుండా ఆద‌రిస్తూ వ‌స్తున్నారు. ఆ బాలీవుడ్ మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్స్ వైపు ఓ లుక్కేద్దాం... 1. రోహిత్‌శెట్టి బాలీవుడ్‌లో గోల్డెన్ హ్యాండ్‌గా పేరుపొందిన డైరెక్ట‌ర్ రోహిత్‌శెట్టి. త‌న అప్ర‌తిహ‌త విజ‌య ప‌రంప‌ర‌ను మునుప‌టి సినిమా 'సింబా'తోనూ అత‌ను కొన‌సాగించాడు. 'గోల్‌మాల్' సిరీస్ కానీ, 'సింఘ‌మ్' సిరీస్ కానీ, 'బోల్ బ‌చ్చ‌న్' కానీ, 'దిల్‌వాలే' కానీ రూ. 100 కోట్ల క్ల‌బ్బు అత‌ని పాదాల వ‌ద్ద‌కు చేరాల్సిందే. యాక్ష‌న్‌-కామెడీ సినిమాల‌కు కేరాఫ్‌గా మారిన అత‌ను షారుక్‌ఖాన్‌తో తీసిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌'తో రూ. 200 కోట్ల క్ల‌బ్బులోనూ చేరిపోయాడు. ఫైట్‌మాస్ట‌ర్ ఎం.బి. శెట్టి కుమారుడైన రోహిత్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ ఆరంభించి అజ‌య్ దేవ్‌గ‌ణ్ సినిమా జ‌మీన్‌తో డైరెక్ట‌ర్‌గా మారాడు. ఇప్ప‌టివ‌ర‌కూ రోహిత్ 13 సినిమాలు డైరెక్ట్ చేస్తే వాటిలో 12 హిట్‌. ప్ర‌స్తుతం అత‌ను అక్ష‌య్‌కుమార్‌తో 'సూర్య‌వంశీ' సినిమా తీస్తున్నాడు. 2. రాజ్‌కుమార్ హిరాణీ బాలీవుడ్‌లో వ‌ర్థ‌మాన‌, ఔత్సాహిక ద‌ర్శ‌కుడ్ని ఎవ‌రినైనా అడ‌గండి.. "మీకు స్ఫూర్తి ఎవ‌రు?" అని. వాళ్లంద‌రి నుంచీ వ‌చ్చే ఒకే స‌మాధానం "రాజ్‌కుమార్ హిరాణీ" అనే. దానికి కార‌ణం, ఆయ‌న‌వ‌న్నీ ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ట‌ని మాత్ర‌మే కాదు, వినోదానికి హృద‌యాన్ని స్పృశించేలా ఆయ‌న జోడించే విలువ‌లు. ఫిల్మ్ ఎడిట‌ర్ నుంచి ట్రెండ్‌సెట్టింగ్ డైరెక్ట‌ర్‌గా హిరాణీ ప్ర‌స్థానం నిజంగా స్ఫూర్తిదాయ‌క‌మే. మెడిక‌ల్ కాలేజీ నేప‌థ్యంలో, మాన‌వ‌తావాదిగా మారిన ఓ గూండా క‌థ‌తో ఆయ‌న తీసిన తొలి చిత్రం 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' భార‌తీయ సినీ ప్రియుల‌కు ఓ కొత్త అనుభ‌వాన్నిచ్చి, ఆయ‌న‌వేపు అంద‌రి దృష్టీ ప‌డేలా చేసింది. అదే సినిమా సంజ‌య్‌ద‌త్ కెరీర్‌కు కొత్త ఊపిరినీ ఇచ్చింది. ఇక ఆయ‌న రెండో సినిమా 'ల‌గే ర‌హో మున్నాభాయ్' అయితే "గాంధీగిరి" అనే నూత‌న ప‌దాన్ని సృష్టించి, గాంధీ ప్ర‌తిపాదించిన విలువ‌ల‌ను మ‌రోసారి బ‌లంగా జ‌నం ముందుకు తెచ్చింది. అమీర్‌ఖాన్‌తో ఆయ‌న రూపొందించిన '3 ఇడియ‌ట్స్‌', 'పీకే' సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల్ని సృష్టించ‌డ‌మే కాకుండా, సామాజిక అంశాల్నీ స్పృశించాయి. రెండేళ్ల క్రితం సంజ‌య్‌ద‌త్ బ‌యోపిక్‌గా ఆయ‌న తీసిన 'సంజు' సైతం రూ. 300 కోట్ల క్ల‌బ్బులో స్థానం పొందింది. 3. రాకేశ్ రోష‌న్‌ న‌టుడి నుంచి ద‌ర్శ‌కుడిగా రూపాంత‌రం చెందిన రాకేశ్ రోష‌న్ ప్ర‌తి సినిమాతో త‌న‌ను తాను అన్వేషించుకుంటూనే ఉన్నారు. 'క‌రణ్ అర్జున్' లాంటి రెగ్యుల‌ర్ ఫార్ములా సినిమా నుంచి క్రిష్ లాంటి సూప‌ర్ హీరో సినిమా సిరీస్ వ‌ర‌కూ ఆయ‌న డైరెక్ట్ చేసిన సినిమాల‌ను గ‌మ‌నిస్తే, భిన్న రీతుల చిత్రాల‌తో ఆయ‌న ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతుంది. 'కోయ్‌లా' లాంటి ఒక‌ట్రెండ్ బాక్సాఫీస్ ఫ్లాపుల‌ను మిన‌హాయిస్తే మిగ‌తా సినిమాల‌న్నీ లాభాల పంట‌ల‌ను పండించిన‌వే. ఇక త‌న కుమారుడు హృతిక్ రోష‌న్‌కు 'క‌హో నా ప్యార్ హై' వంటి డ్రీమ్ లాంచ్ ఫిల్మ్‌ను అందించారు. ఆ ఒక్క సినిమాతోటే అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా మారిపోయాడు హృతిక్‌. కొడుకు ఫ్లాపుల్లో స‌త‌మ‌త‌మ‌వుతున్న ప్ర‌తిసారీ హిట్టిచ్చి అత‌డిని అగ్ర‌న‌టుడిగా నిల‌బెట్టారు రాకేశ్‌. మాకూ ఓ సూప‌ర్ హీరో ఉన్నాడ‌ని భార‌తీయులు గ‌ర్వంగా చెప్పుకొనేలా 'క్రిష్‌'ను సృష్టించారు. 'క్రిష్ 3' త‌ర్వాత ఏడేళ్ల నుంచీ ఆయ‌న మెగాఫోన్ ప‌ట్టుకోలేదు. ఆ సిరీస్‌లోనే ఇంకో సినిమా తీసేందుకు ఇప్పుడాయ‌న సిద్ధ‌మ‌వుతున్నారు. 4. క‌బీర్ ఖాన్‌ డిస్క‌వ‌రీ చాన‌ల్‌లో సినిమాటోగ్రాఫ‌ర్‌గా కెరీర్ మొద‌లుపెట్టి 2006లో 'కాబూల్ ఎక్స్‌ప్రెస్' లాంటి నేష‌న‌ల్ అవార్డ్ ఫిల్మ్‌తో డైరెక్ట‌ర్‌గా మారాడు క‌బీర్ ఖాన్‌. అత‌ని తండ్రి ముస్లిం అయితే, త‌ల్లి ఒక తెలుగు వ‌నిత‌. 'న్యూయార్క్' మూవీతో అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న క‌బీర్‌కు స‌ల్మాన్ ఖాన్ నుంచి పిలుపు వ‌చ్చింది. అలా 'ఏక్ థా టైగ‌ర్' లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీని తీశాడు. ఆ త‌ర్వాత స‌ల్మాన్‌తోటే అత‌ను రూపొందించిన సినిమా రూ. 300 కోట్ల క్ల‌బ్బులో చోటు సంపాదించింది. జాతీయ అవార్డులు స‌హా అనేక ఇత‌ర అవార్డుల‌ను కొల్ల‌గొట్టిన ఆ సినిమా 'బ‌జ్‌రంగీ భాయీజాన్‌'. 1962 చైనా-ఇండియా వార్ నేప‌థ్యంలో స‌ల్మాన్‌తోటే అత‌ను తీసిన 'ట్యూబ్‌లైట్' అంద‌రి ప్ర‌శంస‌లూ పొందింది. ఇప్పుడు క‌పిల్‌దేవ్ సార‌థ్యంలో 1982 ప్రుడెన్షియ‌ల్ వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకున్న భార‌త క్రికెట్ జ‌ట్టు క‌థ‌తో క‌బీర్ రూపొందించిన '83' ఫిల్మ్ విడుద‌ల కోసం ఎదురుచూస్తోంది. 5. అలీ అబ్బాస్ జాఫ‌ర్‌ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్ ఆరంభించిన అలీ అబ్బాస్ జాఫ‌ర్ 2011లో 'మేరే బ్ర‌ద‌ర్ కీ దుల్హ‌న్' సినిమా నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ తీసిన ఐదు సినిమాల‌తో వ‌రుస విజ‌యాలు సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడిగా పేరుపొందాడు. తొలి సినిమాను ఆమిర్ ఖాన్ సోద‌రుని కుమారుడు ఇమ్రాన్‌ఖాన్‌తో చేసిన అత‌ను, రెండో సినిమాను ర‌ణ‌వీర్‌సింగ్‌, అర్జున్ క‌పూర్‌ల‌తో చేశాడు. అది.. 'గూండే'. ఆ సినిమాని అత‌ను తీసిన విధానం న‌చ్చిన స‌ల్మాన్ అత‌నికి ఛాన్స్ ఇచ్చాడు. రెండు చేతులా ఆ అవ‌కాశాన్ని అందిపుచ్చుకున్న అలీ 'సుల్తాన్' సినిమా తీసి రూ. 300 క్ల‌బ్బులో చేరిపోయాడు. స‌ల్మాన్‌తో అత‌డి బంధం కంటిన్యూ అయింది. ఆ త‌ర్వాత తీసిన 'టైగ‌ర్ జిందా హై' సైతం రూ. 300 కోట్ల‌ను క్రాస్ చేయ‌గా, 'భార‌త్' మూవీ రూ. 200 కోట్ల‌ను దాటింది. - బుద్ధి య‌జ్ఞ‌మూర్తి
  'క‌బీర్ సింగ్‌'గా షాహిద్ క‌పూర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రికార్డులు సృష్టించాడు. అత‌ని కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ గ్రాస‌ర్‌గా ఆ సినిమా నిలిచింది. అది మ‌న విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను రాత్రికి రాత్రే స్టార్‌గా మార్చిన 'అర్జున్‌రెడ్డి' మూవీకి రీమేక్ కావ‌డం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మే. క‌బీర్ సింగ్ క్యారెక్ట‌ర్‌లో షాహిద్ బాగా రాణించాడు. కానీ అత‌డి న‌ట‌న గురించి చెప్పుకోవాల్సి వ‌స్తే.. మొద‌ట‌గా ప్ర‌స్తావించాల్సింది 'హైద‌ర్' (2014) మూవీని. అది రెగ్యుల‌ర్ ఫార్ములా సినిమా కాదు. షేక్‌స్పియ‌ర్ సుప్ర‌సిద్ధ నాట‌కం హామ్లెట్ ఆధారంగా విశాల్ భ‌ర‌ద్వాజ్ డైరెక్ట్ చేసిన చిత్రం. షేక్‌స్పియ‌ర్ నాట‌కాలంటే విశాల్‌కు పిచ్చి. ఆ నాట‌కాలు, వాటిలోని పాత్ర‌లు, స‌న్నివేశాలు అత‌డి మ‌న‌సులో నిరంత‌రం సంద‌డి చేస్తూనే ఉంటాయి. 'హైద‌ర్' కంటే ముందే 'మాక్‌బెత్' నాట‌కం ఆధారంగా 'మ‌ఖ్బూల్‌', 'ఒథెల్లో' ఆధారంగా 'ఓంకార' సినిమాలు రూపొందించి విజ‌యాలు సాధించాడు. 1. హైద‌ర్ (హామ్లెట్‌)   'హైద‌ర్‌'ను క‌శ్మీర్ నేప‌థ్యంలో డార్క్ డ్రామాగా తీశాడు విశాల్‌. ఇందులోని పాత్ర కోసం కెరీర్‌లో మొద‌టిసారిగా గుండు గీయించుకున్నాడు షాహిద్‌. రొమాంటిక్ కామెడీల‌తో గుర్తింపు తెచ్చుకున్న అత‌ను వాటికి పూర్తి భిన్న‌మైన సీరియ‌స్ రోల్‌లో ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభ‌వాన్ని ఇచ్చాడు. విశాల్ సినిమా 'మ‌ఖ్బూల్‌'లో ఉన్న‌త స్థాయి న‌ట‌న‌ను ప్రద‌ర్శించి అంద‌రి ప్ర‌శంస‌లూ అందుకున్న ట‌బు ఈ మూవీలో షాహిద్ స‌వ‌తి త‌ల్లిగా నెగ‌టివ్ ఛాయ‌లున్న ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేసింది. అప్ప‌టికే 'ఆషికి 2', 'ఏక్ విల‌న్' సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టించి యువ‌త‌రం క‌ల‌ల‌రాణిగా మారిన శ్ర‌ద్ధా క‌పూర్ అర్షియా అనే రిపోర్ట‌ర్ క్యారెక్ట‌ర్ చేసింది. 2. మ‌ఖ్బూల్ (మాక్‌బెత్‌)   తొలిసారిగా షేక్‌స్పియ‌ర్ ర‌చ‌న‌తో విశాల్ భ‌ర‌ద్వాజ్ రూపొందించిన సినిమా 'మ‌ఖ్బూల్' (2004). ఆశ‌కీ, దురాశ‌కీ మ‌ధ్య ఉండే తేడాను చూపిస్తూ షేక్‌స్పియ‌ర్ ర‌చించిన 'మాక్‌బెత్' నాట‌కం దీనికి ఆధారం. ముంబై అండ‌ర్‌వ‌ర‌ల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందించాడు విశాల్‌. ఇర్ఫాన్ ఖాన్‌, పంక‌జ్ క‌పూర్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ధారులైన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఆశించినంత విజ‌యం సాధించ‌క‌పోయినా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. విశాల్‌కు అంత‌ర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని న‌ట‌న‌కు జాతీయ ఉత్త‌మ స‌హాయ‌న‌టుడి అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్ ఉత్త‌మ‌న‌టుడు (క్రిటిక్స్‌) అవార్డునూ అందుకున్నాడు పంక‌జ్ క‌పూర్‌. 3.  ఓంకార (ఒథెల్లో)   'మ‌ఖ్బూల్‌'తో సాధించ‌ని బాక్సాఫీస్ విజ‌యాన్ని 'ఓంకార' (2006)తో సాధించాడు విశాల్‌. 'ద ట్రాజెడీ ఆఫ్ ఒథెల్లో' క‌థ‌ను ఆనాటి బిహార్ నేప‌థ్యానికి అత‌ను జోడించిన తీరు ఎంతైనా ప్ర‌శంస‌నీయం. హీరోగా త‌న‌కంటూ మంచి గుర్తింపు ఉన్న సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో చేసిన ఈశ్వ‌ర్ త్యాగి అలియాస్ లంగ్డా త్యాగి క్యారెక్ట‌ర్ ఈ కాల‌పు క్రూర‌మైన విల‌న్ క్యారెక్ట‌ర్ల‌లో ఒక‌టిగా పేరు పొందింది. టైటిల్ రోల్‌లో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, అత‌ని జోడీగా చేసిన క‌రీనా క‌పూర్‌తో పాటు వివేక్ ఓబ‌రాయ్‌, బిపాషా బ‌సు కూడా త‌మ న‌ట‌న‌తో అంద‌రినీ మెప్పించారు. ఇక ఇందు అనే క్యారెక్ట‌ర్‌ను పోషించిన కొంక‌ణాసేన్ శ‌ర్మ ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా ఇటు జాతీయ అవార్డునూ, అటు ఫిల్మ్‌ఫేర్ అవార్డునూ సొంతం చేసుకుంది. మ‌న‌దేశంలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలోనూ ఈ మూవీ జ‌నాద‌ర‌ణ పొంద‌డం విశేషం. 4. రామ్‌-లీలా (రోమియో జూలియ‌ట్‌)   విశాల్‌నే కాకుండా మ‌రికొంత‌మంది బాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌నూ ప్ర‌భావితం చేశాడు 16వ శ‌తాబ్దానికి చెందిన మ‌హార‌చ‌యిత షేక్‌స్పియ‌ర్‌. ఆయ‌న ర‌చించిన రోమియో జూలియ‌ట్ ప్రేమ‌క‌థ‌ను 2013లో సంజ‌య్ లీలా భ‌న్సాలీ 'గోలియోం కా రాస్‌లీలా.. రామ్ లీలా'గా తెర‌పై అనువ‌దించాడు. ప్ర‌ధాన పాత్ర‌ల్లో ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌డుకోనే, అద‌ర‌గొట్టేశారు. ఆ త‌ర్వాత కాలంలో నిజ జీవితంలోనూ జంట‌గా మారిన ఆ ఇద్ద‌రూ ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల‌పంట‌గా నిలిచారు. భారీ సెట్టింగుల‌తో, భారీ తారాగ‌ణంతో త‌యారైన ఈ సినిమా సునాయాసంగా రూ. 100 కోట్ల క్ల‌బ్బులో చేరింది. తెర‌మీద రోమియో, జూలియ‌ట్ పాత్ర‌ల‌ను పోషిస్తున్న‌ప్పుడే ర‌ణ‌వీర్‌, దీపిక ప్రేమ‌లో ప‌డ‌టం కాక‌తాళీయ‌మేనా? 5. ఇష‌క్‌జాదే (రోమియో జూలియ‌ట్‌)   2012లో వ‌చ్చిన 'ఇష‌క్‌జాదే' సినిమాకు ఆధారం కూడా రోమియో జూలియ‌ట్ క‌థే. హ‌బీబ్ ఫైజ‌ల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రేమికులుగా అర్జున్ క‌పూర్‌, ప‌రిణీతి చోప్రా న‌టించారు. తొలి చిత్రంతోనే పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు అర్జున్‌. 6. 10ఎంఎల్ ల‌వ్ (ఎ మిడ్‌స‌మ్మ‌ర్ నైట్స్ డ్రీమ్‌)   2010లో వ‌చ్చిన '10ఎంఎల్ ల‌వ్‌'కు ఆధారం.. షేక్‌స్పియ‌ర్ మ‌రో నాట‌కం 'ఎ మిడ్‌స‌మ్మ‌ర్ నైట్స్ డ్రీమ్‌'. శ‌ర‌త్ క‌టారియా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పూర‌బ్ కోహ్లీ, టిస్కా చోప్రా, నీల్ భూపాలం, ర‌జ‌త్ క‌పూర్‌, తారాశ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ధారులు. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందినా, ప్రేక్ష‌కాద‌ర‌ణ‌కు నోచుకోలేక‌పోయింది. 7. జాలిమ్ సౌదాగ‌ర్ (ద మ‌ర్చంట్ ఆఫ్ వెనిస్‌) వాస్త‌వానికి షేక్‌స్పియ‌ర్ ర‌చ‌న‌ల‌పై బాలీవుడ్ డైరెక్ట‌ర్ల వ్యామోహం ఈనాటి కాదు. భార‌త్‌లో టాకీలు మొద‌లైన ద‌శాబ్దానికే ఆయ‌న నాట‌కం 'ద మ‌ర్చంట్ ఆఫ్ వెనిస్‌'ను 'జాలిమ్ సౌదాగ‌ర్' పేరుతో రూపొందించారు జె.జె. మ‌ద‌న్‌. క‌ల‌క‌త్తాకు చెందిన రాధా ఫిల్మ్ కంపెనీ నిర్మించిన ఈ సినిమాలో ఖ‌లీల్‌, క‌జ్జ‌న్‌, రాణీ ప్రేమ‌ల‌త ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. అప్ప‌ట్నుంచీ నాలుగు ద‌శాబ్దాల పాటు షేక్‌స్పియ‌ర్ జోలికి వెళ్ల‌లేదు హిందీ ద‌ర్శ‌కులు. 8. అంగూర్ (కామెడీ ఆఫ్ ఎర్ర‌ర్స్‌)   సుప్ర‌పిద్ధ ద‌ర్శ‌కుడు గుల్జార్ 1982లో 'అంగూర్' అనే సినిమా తీశారు. ఇది 1963లో వ‌చ్చిన భ్రాంతి విలాస్ అనే బెంగాలీ కామెడీ సినిమాకు రీమేక్‌. ఆ సినిమాకు ఆధారం అదే పేరుతో ఈశ్వ‌ర‌చంద్ర విద్యాసాగ‌ర్ ర‌చించిన నాట‌కం ఆధారం అయితే, ఆ నాట‌కానికి ఆధారం షేక్‌స్పియ‌ర్ నాట‌కం 'కామెడీ ఆఫ్ ఎర్ర‌ర్స్‌'. తెర‌కెక్కించ‌డానికి ప‌దేళ్ల ముందే 'అంగూర్‌' స్క్రిప్టు రాసుకున్నారు గుల్జార్‌. ఈ మూవీలో ద్విపాత్ర‌లు పోషించిన సంజీవ్‌కుమార్ ప్రేక్ష‌కుల‌ను తెగ న‌వ్వించారు. మౌస‌మీ చ‌ట‌ర్జీ నాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో దేవేన్ వ‌ర్మ‌, అరుణా ఇరానీ, దీప్తి నావ‌ల్ కీల‌క పాత్ర‌లు చేశారు. గుల్జార్‌లో ఎంత‌టి విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు దాగున్నాడ‌నేందుకు 'అంగూర్' నిఖార్స‌యిన నిద‌ర్శ‌నం. - బుద్ధి య‌జ్ఞ‌మూర్తి
  సుకుమార్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎర్ర‌చంద‌నం దుంగ‌ల్ని స్మగుల్డ్ చేసే ట్ర‌క్ డ్రైవ‌ర్ పుష్ప‌రాజ్ క్యారెక్ట‌ర్‌లో బ‌న్నీ క‌నిపించ‌నున్నాడు. వాస్త‌వానికి ఈ క్యారెక్ట‌ర్‌లో మొద‌ట‌ మ‌హేశ్‌ను ఊహించుకున్నాడు సుకుమార్‌. కానీ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో సుకుమార్‌తో సినిమా చెయ్య‌ట్లేద‌ని మ‌హేశ్ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో అదివ‌ర‌కు వ‌చ్చిన '1.. నేనొక్క‌డినే' మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద స‌రిగా ఆడ‌లేదు. కానీ సుకుమార్ టేకింగ్‌, మ‌హేశ్ ప‌ర్ఫార్మెన్స్ టాప్ క్లాస్‌లో ఉన్నాయ‌నే పేరు మాత్రం వ‌చ్చింది. తానే గ‌నుక జ‌డ్జినైతే అన్ని అవార్డులూ మ‌హేశ్‌కే ఇచ్చేస్తాన‌ని అప్ప‌ట్లో సుకుమార్ భావోద్వేగంతో చెప్పాడు. ఈ సినిమాని బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్ చేస్తున్నాడంటూ ఫీల‌ర్స్ ఇచ్చాడు. "ఆమిర్ ఖాన్ ఈ సినిమా చేస్తున్నాడ‌నే విష‌యంపై నేనేం చెప్పినా ఎక్కువ చెప్పిన‌ట్ల‌వుతుంది. ఆమిర్ అంత‌టివాడు చేస్తానంటే ఎవ‌రికైనా ఆనంద‌మే. అది ప్రాసెస్‌లో ఉంది. దాని గురించి ఏం చెప్పినా 'వీళ్లు ఎక్కువ చేస్తున్నారు. ఇదేదో ప‌బ్లిసిటీ స్టంట్ లాగుంది' అంటారు. అందుకే దాని సంగ‌తి అలా వ‌దిలేద్దాం" అని అప్పుడు చెప్పాడు సుకుమార్‌. కానీ అది వాస్త‌వ రూపం ధ‌రించ‌లేదు. '1' మూవీని హిందీలో ఆమిర్ ఖాన్ కాదు క‌దా.. ఏ హీరో చెయ్య‌లేదు.   మ‌హేశ్‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇవ్వ‌డ‌మ‌నే బాకీ ఉండిపోయింద‌ని నిన్న‌టి దాకా చెబుతూ వ‌చ్చిన సుకుమార్‌కు.. ఆ అవ‌కాశం మ‌ళ్లీ చేజారిపోయింది. 'రంగ‌స్థ‌లం' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌తో మ‌హేశ్‌కు క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ ఎందుకొచ్చాయో సుకుమార్ ఇంత‌దాకా చెప్ప‌నే లేదు. 'పుష్ప' మూవీ రిలీజ‌య్యాక అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి సుకుమార్ ఎలాంటి వ్యాఖ్య‌లు చేస్తాడో చూడాలి. ఆ సినిమా త‌ర్వాతైనా మ‌హేశ్ అత‌డికి చాన్స్ ఇస్తాడా? డౌటే.
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు. తండ్రి చేతిలో ఎత్తులు చుసిన వారు తనయుడి చేతిలో లోతులు చూస్తున్నారు. వారిద్దరూ సీనియర్ ఐఏఎస్ అధికారులు. ఒకరినైతే మెడపట్టుకుని బయటకు గెంటేశారు. మరొకరిని కులం పేరుతో కుళ్లపొడుస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఈ ఇద్దరు అధికారులూ కూడా చంద్రబాబు అంటే గిట్టనివారే. ఇద్దరు అధికారులు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న చూపుకు గురి అయిన వారే. ఒకరు బలయ్యారు.. మరొకరు అవుతున్నారు. ఆ ఇద్దరూ ఎవరంటే ఒకరు ఎల్‌వి సుబ్రహ్మణ్యం. రెండో వారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యంకు జగన్ కేసుల్లో సహా ముద్దాయిగా ఉన్నారని ప్రాధాన్య పోస్టులు ఇవ్వలేదు. ఒక సందర్భంలో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పోస్టు ఇచ్చినా మళ్ళీ ఆయనను అక్కడ నుంచి తీసి అత్యంత చిన్నదైన యువజన శాఖకు మార్చారు. ఇక రమేష్ కుమార్ పరిష్తితి కూడా దాదాపుగా అంతే. చంద్రబాబు హయాంలో ఆయనకు ఏ కీలక శాఖ లభించలేదు. ఈ ఇద్దరూ వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రతిభకు తగిన గుర్తింపు పొందారు. ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఇద్దరూ ఆర్ధిక శాఖను నిర్వహించిన వారే. ఆర్ధిక శాఖలో ఈ ఇద్దరిదీ ప్రత్యేకమైన శైలి అని వారితో సాన్నిహిత్యం ఉన్న అధికారులు అంటారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడంలో బిల్లుల చెల్లింపు తదితర విషయాలలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసిన వారన్న విషయాన్ని మర్చిపోలేం అని చెప్తున్నారు. ఆర్ధిక క్రమశిక్షణ తీసుకురావడం, జవాబుదారీతనం, దుబారా తగ్గించడం వంటి విషయాల్లో ఈ ఇద్దరూ అనేక చర్యలు తీసుకున్నారు.వీరికి ఇంకో పోలిక కూడా ఉంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఇద్దరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారులుగా పని చేశారు. ఈ ఇద్దరి హయాంలో తిరుమల పవిత్రత రెండింతలు పెరగడమే కాకుండా క్రమ శిక్షణ ఉండేదన్న విషయం మర్చిపోరాదు. భక్తుల సౌకర్యార్ధం ఈ ఇద్దరి హయాంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతో సీనియర్ రాజకీయ నాయకులు ట్రస్టు బోర్డు చైర్మన్లుగా ఉన్నా కూడా ఎల్‌వి సుబ్రహ్మణ్యం, రమేష్ కుమార్ ఈవోలుగా ఉన్నప్పుడు వీరు చెప్పినట్లే నడచుకునేవారన్న పేరుండేది. వృత్తి పట్ల అంతటి నిబద్ధతతో ఈ ఇద్దరు అధికారులు పని చేశారు. అత్యంత సీనియర్ అయిన ఎల్‌వి సుబ్రహ్మణ్యం ను పక్కన పెట్టి ఆయన కన్నా జూనియర్లకు చంద్రబాబునాయుడు చీఫ్ సెక్రటరీ పదవిని అప్పగించారు. అయినా ఎల్‌వి సుబ్రహ్మణ్యం ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యని విషయం మనం చూసాం. సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునేటాను పక్కన పెట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఎల్‌వి సుబ్రహ్మణ్యంను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఎన్నికల కమీషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించాక సహ ముద్దాయిని సిఎస్ గా ఎలా నియమిస్తారని విమర్శించారు కూడా.   ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్ ఎల్‌వీ ని కొనసాగించగా జగన్ ను అందరూ మెచ్చుకున్నారు కూడా. అయితే ఏమైందో ఏమూ కానీ కొద్ది కాలంలోనే ఎల్‌వి ని అత్యంత అవమానకరంగా పదవి నుంచి జగన్ తొలగించిన విధానం కూడా తెలిసిందే. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కూడా దాదాపుగా అలానే జరిగింది. ఆయనను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. చంద్రబాబు దగ్గర పని చేయడం రమేష్ కుమార్ కూ ఇష్టం లేదని అంటారు. అయితే తన కార్యదర్శిగా పని చేసిన రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నియమించాలని అప్పటి గవర్నర్ ఇ ఎస్ ఎల్ నర్సింహన్ చంద్రబాబుపై వత్తిడి తెచ్చారనీ. గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు రమేష్ కుమార్ కు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అప్పగించారనీ అంటున్నారు. రమేష్ కుమార్ పేరు బదులు వేరే అధికారి పేరు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశామని చంద్రబాబు కూడా చెప్పారు. అటువంటి రమేష్ కుమార్ ఇప్పుడు చంద్రబాబు ఏజెంటుగా జగన్ చేతిలో ముద్ర వేయించుకోవడం దురదృష్టం. ఈ ఇద్దరూ ముక్కుసూటిగా మాట్లాడే అధికారులు. ఎలాంటి మొహమాటం లేకుండా విధులు నిర్వర్తించే వారన్న పేరుంది. అలాంటి ఈ ఇద్దరూ కూడా అత్యంత ఘోరమైన అవమానాన్ని పొందారు. ఈ అవమానాలకు వీరు అర్హులు కాదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చని అధికార వర్గాలు అనుకుంటున్నారు. నాయకులు తమ స్వంత ప్రయోజనాల కోసం అఖిల భారత సర్వీసు అధికారులకు కులాలు, ప్రాంతాలు అంటగట్టడం ఏంటని కొందరు ఆవేదన చెందుతున్నారు.
  * దిగుమతి నాయకులు, బిజినెస్ లీడర్లు, లాబీయిస్టులు కలిసి బీ జె పి ని ఎటు నడిపిస్తారో....  * ఇంతకీ స్థానిక సమరం లో సత్తా చూపించే ట్యాలెంట్ ఆ పార్టీకి ఉన్నట్టా, లేనట్టా....  * జి వి ఎల్ ఋతుపవనాల్లాంటి వారు... ఇలావచ్చి అలా పలకరించి, అటు నుంచి ఆటే మాయమైపోతారు  * సి ఎం రమేష్ లాబీ మాస్టర్ గా ఢిల్లీ లో ప్రసిద్ధులు.. నోకియా మాదిరి ఈయన కూడా కనెక్టింగ్ పీపుల్ నినాదాన్ని బలంగా నమ్మిన వారు  * సుజనా చౌదరి... గత్యంతరం లేని పరిస్థితుల్లో అమరావతి నినాదాన్ని భుజాన వేసుకుని చందమామ కథలో విక్రమార్కుడి మాదిరి ... వై ఎస్ ఆర్ సి పి లోని బేతాళుడి తో జగడమాడుతుంటారు  * టీ జీ వెంకటేష్.. అవసరార్ధ రాజకీయాల కు కేరాఫ్ అడ్రెస్ .... రాయలసీమ అనేది ఈయనకు ట్యాగ్ లైన్ ...దురదపుట్టినప్పుడు గోక్కోవటానికి ఉపయోగపడే ఆరో వేలుగా ఆయన ఆ నినాదాన్ని బాగా వాడేస్తారు..  * అంగ వంగ కళింగ రాజ్యాలను అవలీలగా గెలిచిన చక్రవర్తి, చివరకు ఆముదాలవలస లో ఓడిపోయినట్టు, రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ , చివరకు పవన్ కళ్యాణ్ తో కలిసి స్థానిక సమరం లో బీజేపీకి కాస్తో కూస్తో ఉన్న ఇమేజ్ ని పణం గాపెట్టే సాహసానికి ఒడిగట్టారు  ఆ ఐదుగురూ ఇంతకీ ఏమి చేస్తున్నట్టు..భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్ , కాంగ్రెస్ లో నుంచి బీ జె పి లోకి షిఫ్ట్ అయిన  బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ  నారాయణ కలిసి ఈ స్థానిక సమరం లో రాష్ట్రం మొత్తం మీద కనీసం ఒక్కొక్కరికి 50 చొప్పున 250 మంది ఎం పి టి సి లు, జెడ్ పీ టి సి లను  గెలిపించుకురాగలరా అనేది చాలా పెద్ద సందేహం గా కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్ననే విజన్ డాక్యుమెంట్ ని కలిసి ఆవిష్కరించిన బీ జె పి , జన సేన కంబైన్ నేతలు , చాలా పెద్ద  దృశ్యాన్నే జనం ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. వై ఎస్ ఆర్ సి పి, తెలుగుదేశం పార్టీ లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు గా ప్రకటించుకున్న ఈ ఐదుగురిదీ  వాస్తవానికి తలో దారీ.. ఎవరు , ఎప్పుడు, ఎందుకు, ఎలా మాట్లాడతారో తెలీని గందర గోళం ....  జి వి ఎల్ నరసింహ రావు ది అయితే సొంత రాజ్యాంగం, పూర్తిగా పార్టీ రాష్ట్ర శాఖ తో  గానీ, లేదా బీ జె పి లో ఉన్నతెలుగుదేశం మాజీ లతో  కానీ ఈయనకు ఎలాంటి సంబంధాలు ఉండవు.  రాష్ట్రాన్ని ఎప్పుడైనా పలకరించడానికి రుతు పవనాల మాదిరి అలా చుట్టపు చూపు గా వచ్చేసి ,  ఇలా మాయమైపోయే  జి వి ఎల్ వ్యవస్థ ల గురించి రాష్ట్ర బీ జె పి లో ఎవరికీ ఎలాంటి క్లూలు ఉండవు. ఈయన దారి రహదారి. ఈయన వ్యవస్థ ఇలాఉంటే, బీ జె పి లో ఉంటూ కూడా ఇంకాతెలుగు దేశం ఎజెండా , జెండా రెండూ మోస్తున్నట్టు కనిపించే సుజనా చౌదరి ఒక్క అమరావతి అంశం మీద తప్పించి, ఇతరత్రా ఏదీ మాట్లాడటానికి ఎక్కువగాఇష్టపడరు. జీ వీ ఎల్ కు, సుజనా కూ క్షణం పడదు. ఆయన ఎడ్డెం అంటే ఈయన తెడ్డెం అనే రకం.. ఏ మాత్రం పొసగని,పొంతన లేని పరస్పర భిన్నమైన అభిప్రాయాలు గల వీరిద్దరూ ఉత్తర ధృవం, దక్షిణ ధృవం మాదిరి ఒకే పార్టీ లో ఉంటూ కూడా కామన్  ఎజెండా తో పని చేసిన దాఖలాలు ఇప్పటివరకూ అయితే లేవు.   ఇహ, సి ఎం రమేష్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఆయన తన బిజినెస్ వ్యవహారాలను బీ జె పి తో ముడి కట్టేసి, ఏ పార్టీ లో ప్రయాణిస్తున్నాడో కూడా మర్చే పోయి, మొన్నటికి మొన్న పరిమళ్ నత్వాని ని జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రవేశ పెట్టడం లో కీలక పాత్ర పోషించిన  ఘనుడు. గుర్తు చేస్తే కానీ తానూ బీ జె పి లో ఉన్నాననే విషయం గుర్తుండని ఈయన కు  బీ జె పి, జన సేన కలిసి పోటీ  చేస్తున్న విషయం తెలుసో లేదో అని కూడాపార్టీ శ్రేణులు గుసగుస లాడుకుంటున్నాయి.  ఇహ వీరందరినీ సమన్వయము చేసుకుని  ముందుకెళ్తున్నట్టు భావిస్తూ , బాహ్య ప్రపంచం ముందు ఆవిష్కృతమయ్యే  వ్యక్తి మరెవరో కాదు... సాక్షాత్తూ  రాష్ట్ర బీ జె పి అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ. ఈయన, పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రయాణించటానికి అంతగాసుముఖం గా లేదు...కారణమేమిటంటే, చంద్రబాబు నాయుడు లాంటి యోధులతో పోరాడిన తన రాజకీయం , చివరకు ఇలా ఏ పూట ఎక్కడ ఉంటారో కూడా తెలీని పవన్ కళ్యాణ్ పార్టీతో కలిసి పని చేయాల్సిన దుస్థితికి దిగజారటమేమిటని  తరచూ తనలో తానె కుమిలి పోతున్నట్టు సమాచారం.  ఇహ, టీ జీ వెంకటేష్ అయితే మరీను..... రాయలసీమ నినాదాన్ని తన ట్యాగ్ లైన్ గాచేసుకుని కాలక్షేపం చేసేస్తూ... ప్రస్తుతానికి బీ జె పి లో నివసిస్తూ ....ఈ స్థానిక ఎన్నికల సమరం లో తన పాత్ర ఏమిటో కూడాతెలీకుండా జీవనం వెళ్లదీస్తున్నారు. మొత్తానికి ఈ పంచ పాండవులు స్థానిక సమరం లో తమ 'పంచ్ ' పవర్ ఏమిటో ఈ నెలాఖరు లోగా చుపిస్తారేమోననే బోలెడు , ఇంకా గంపెడాశతో బీ జె పి అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన.. ఆ రియల్ స్టోరీ టైటిల్ వచ్చేసి.. "ఓ కిడ్నాప్, వంద కోట్ల స్కాం". 'నేనే రాజు నేనే మంత్రి' మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. మీరు ఏ పార్టీకి ఓటేసినా మేమే అధికారంలో ఉంటామని. అవును.. కొందరు రాజకీయ నాయకులు.. ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీని గెలిపిస్తే.. ఆ పార్టీలోకి జంప్ చేస్తారు. అలాగే అధికారులు కూడా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలని కాకాపడుతూ వారి ఆటలు సాగిస్తుంటారు. ఈ రియల్ స్టోరీ వింటే అది నిజమని మీకే అర్ధమవుతుంది. కాకినాడలోని సర్పవరంకి చెందిన ఆకుల గోవిందరాజు అనే వ్యక్తికి భోగాపురంలో వంద కోట్ల విలువైన 18 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ ఒక్క విషయం చాలదా.. మాఫియా కన్ను ఆయన మీద పడటానికి. ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న గద్దకి కింద ఉన్న కోడిపిల్ల కనిపించినట్టు.. మాఫియా వాళ్ళకి ఎక్కడున్నా విలువైన ల్యాండ్స్ కనిపిస్తాయి కదా. అలాగే, బలగ ప్రకాష్ అనే మాఫియా లీడర్ కి.. ఆకుల గోవిందరాజుకి చెందిన ల్యాండ్ పై కన్నుపడింది. ఇంకేముంది ఏకంగా పోలీసులనే రంగంలోకి దింపాడు. ఇక పోలీసులైతే ఓ అడుగు ముందుకేసి ఏకంగా కిడ్నాప్ కే తెరలేపారు. 2017.. సెప్టెంబర్ 19 .... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. మధ్యాహ్నానికి- సాయంత్రానికి నడుమ సూర్యుడు మండిపోతున్న సమయం... అబ్బా ఏమన్నా ముహూర్తమా... శూన్యమాసం.. అమావాస్య.. మంగళవారం.. ఇదే కిడ్నాప్ కి సరైన ముహూర్తం అనుకున్నారేమో పోలీసులు... AP 30 AB 6655 నెంబర్ గల ఇన్నోవా కార్ లో.. పోలీసులు ఆకుల గోవిందరాజు ఇంటికి వచ్చారు. కారు నెంబర్ ఫ్యాన్సీగా ఉన్నా, ఆ ఖాకీలు చేసే పని మాత్రం ఏ మాత్రం పద్దతిగా లేదు. వాళ్ళు చేసే పనేంటో ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియదు. కొత్త మొహాలు కావడంతో.. చుట్టుపక్కల వారు కొందరు ఆశ్చర్యంతో, కొందరు అనుమానంతో చూస్తున్నారు. వాళ్ళు అలా చూస్తుండగానే.. దొంగల రూపంలో వచ్చిన పోలీసులు.. గోవిందరాజుని ఇన్నోవాలో పడేసి.. జెట్ స్పీడ్ లో హైవే ఎక్కారు. పోలీసుల భాషలో చెప్పాలంటే దీనినే కిడ్నాప్ అంటారు. కారు హైవే మీద దూసుకెళ్తుంది. ఆ స్పీడ్ చూస్తే.. అంబులెన్స్ డ్రైవర్ కావాల్సిన వ్యక్తి ఇన్నోవా డ్రైవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుంటే.. మనం ఖాళీగా ఉండి ఏం చేస్తాం అనుకున్నారేమో.. మిగతా పోలీసులు గోవిందరాజు పనిపెట్టారు. కారు.. కాకినాడ నుంచి భోగాపురం చేరేవరకు.. అంటే దాదాపు నాలుగు గంటల పాటు... గోవిందరాజుని భయపెట్టారు.. బెదిరించారు.. చిత్రహింసలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపించారు. కారు సాయంత్రం 6 గంటలకు భోగాపురం సబ్ రిజిస్టార్ ఆఫీస్ కి చేరుకుంది. ఖాకీలకు భయపడ్డాడో, కాసులకు కక్కుర్తి పడ్డాడో తెలియదు కానీ.. సబ్ రిజిస్టార్ పందిళ్లపల్లి రామకృష్ణ.. సాయంత్రం 4:30 కే రిజిస్ట్రేషన్ కాగితాలు సిద్ధం చేసి.. పదేళ్ల తర్వాత ఫారెన్ నుంచి రిటర్న్ వస్తున్న ఫ్రెండ్ కోసం ఎదురుచూస్తున్నట్టు.. గుమ్మం వైపు చూస్తూ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో పోలీసులు గోవిందరాజుని తీసుకొని గుమ్మంలోకి అడుగు పెట్టనే పెట్టారు. గుమ్మంలో వాళ్ళ అడుగు పడిందో లేదో.. సబ్ రిజిస్టార్ మోహంలో వెలుగు వచ్చింది. గోవిందరాజు మోహంలో భయం పెరిగింది. భయంతో చూస్తుండగా ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనిపించాడు. జర్నీలో పోలీసుల చిత్రహింసలతో భయపడిపోయిన గోవిందరాజు.. బలగ ప్రకాష్ ని చూసి మరింత భయపడ్డాడు. బలగ ప్రకాష్.. పోలీసుల మాదిరి సాగదియ్యలేదు.. కమర్షియల్ సినిమాల్లో విలన్ లాగా ఒక్కటే డైలాగ్ కొట్టాడు.. "సంతకం పెడతావా? సమాధిలో పడుకుంటావా?".... ఆ ఒక్క డైలాగ్ తో గోవిందరాజు భయం చావుభయంగా మారిపోయింది. ఎదురుగా మాఫియా లీడర్.. చుట్టూ భోగాపురం సీఐ నర్సింహారావు, ఎస్సైలు తారక్, మహేష్.. హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు.. ఉన్నారు. ఎస్సైల పేర్లు తారక్, మహేష్ అని హీరోల పేర్లు ఉన్నాయి కానీ.. వాళ్ళ బిహేవియర్ మాత్రం పెద్ద విలన్ల పక్కన ఉండే చెంచా విలన్లు లాగా ఉంది. అన్యాయాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులే.. మాఫియా లీడర్ తో కలిసిపోయి.. చిత్రహింసలు చేసి బెదిరిస్తుంటే.. తప్పనిసరి పరిస్థితుల్లో, వంద కోట్లు కంటే విలువైన ప్రాణం కోసం, అన్యాయం ముందు తలవంచి గోవిందరాజు సంతకం పెట్టాడు. ఆ ఒక్క సంతకంతో.. గోవిందరాజు మొహంలో తప్ప.. అక్కడున్న అందరి మొహాల్లో లక్ష్మీకళ ఉట్టిపడింది. అన్నట్టు ఇంత జరుగుతున్నా అక్కడ ఇతరులు ఎవరూ లేరా? అని మీకు అనుమానం రావొచ్చు. అక్కడ నిజంగానే ఎవరూ లేరు.. ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముహూర్తం అలాంటిది మరి. శూన్యమాసం-అమావాస్య.. బుద్ధి ఉన్నోడు ఎవడైనా రిజిస్ట్రేషన్ పెట్టుకుంటాడా? వీళ్లంటే.. వంద కోట్ల కబ్జా ల్యాండ్ కాబట్టి.. బుద్ధిని పక్కనపెట్టి.. బెదిరించి.. రిజిస్ట్రేషన్ చేపించుకున్నారు. ఇప్పుడు అర్థమైందా వాళ్ళ శూన్యమాసం-అమావాస్య కాన్సెప్ట్ ఏంటో?!!.. ఈ కిడ్నాప్- కబ్జా వ్యవహారంపై.. సర్పవరం పోలీస్ స్టేషన్ లో 330/217 నెంబర్ తో కేస్ రిజిస్టర్ అయింది. అదేంటో.. FIR కూడా అయిన తరువాత.. చార్జిషీట్ దాఖలు చేయడానికి.. రాజమౌళి RRR చేయడానికి తీసుకునే టైం కన్నా ఎక్కువ తీసుకుంటున్నారు సర్పవరం పోలీసులు. రెండున్నరేళ్లుగా నాన్చుతూనే ఉన్నారు. ఈ విషయం గురించి.. ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కాకినాడ పోలీసులు రిపోర్ట్ కూడా పంపారు. కానీ చార్జిషీట్ దాఖలు చేసే విషయంలో సర్పవరం సీఐ డిలే చేస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ సీఐ ధైర్యం?.. భయపడితే భయపడటానికి ఆయన పోస్ట్ మ్యాన్ కాదు.. పోలీసోడు.. దానికితోడు పొలిటిషీయన్స్ సపోర్ట్ ఉన్నోడు. అవును.. ఈ వ్యవహారంలో.. బడా పొలిటిషీయన్స్ సపోర్ట్ కూడా ఉంది. అదే పోలీసుల ధైర్యం... శ్రీకాకుళం జిల్లాకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత టీడీపీ నేత.. అలాగే గత ప్రభుత్వ హయాంలో విప్ గా పనిచేసిన నేత.. వీరిద్దరి సాయంతో సర్పవరం పోలీస్ స్టేషన్ ని ఫుల్ గా influence చేసే ప్రయత్నం బలంగా నడుస్తుంది. అందుకే చార్జిషీట్ కి మోక్షం కలగట్లేదు. ఇంత పెద్ద కిడ్నాప్- కబ్జా జరిగితే అస్సలు చర్యలే తీసుకోకుండా ఎలా ఉన్నారని అనుకుంటున్నారేమో... అబ్బో చాలా పెద్ద చర్య తీసుకున్నారు. భోగాపురం ఇన్స్పెక్టర్ ని బదిలీ చేసారు. అదేంటి!!.. అంత జరిగితే కేవలం బదిలీనా అనుకోవద్దు.. రాజకీయ ఒత్తిళ్లు అలాంటివి మరి.. అర్థంచేసుకోవాలి... ఇంకో విషయం ఏంటంటే.. ఈ వ్యవహారం డీజీపీ ఆఫీస్ కి కూడా చేరింది. మరి ఇంకేంటి.. వెంటనే అందరి మీద చర్యలు తీసుకొని ఉంటారుగా అంటారా? అబ్బో.. మీరు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసి బాగా మోసపోయారు... అలాంటి పప్పులు ఇక్కడ ఉడకవు. వాస్తవానికైతే... CRPC 41A కింద డీజీపీ నియమించే ఓ సీనియర్ అధికారి.. విచారణ జరిపి.. తదుపరి చర్యల వరకు.. ఆ సీఐని సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ అలాంటిదేం జరగలేదు. ఏదో ఫార్మాలిటీకి బదిలీతో సరిపెట్టారు. గోవిందరాజు ని బెదిరించి వంద కోట్ల విలువైన ల్యాండ్ అన్యాయంగా లాక్కున్నారు. అయినా తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. పైగా గోవిందరాజునే ఇంకా టార్చర్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లలో భాగంగా.. ప్రస్తుత సర్పవరం సీఐ మరియు అర్బన్ డీఎస్పీ.. గోవిందరాజుని పదేపదే తిప్పించుకుంటున్నారు. ఇక కాకినాడలో ఉద్యోగం వెలగపెడుతున్న.. ఇప్పటి ఓ మంత్రిగారి బావమరిది.. రంగంలోకి దిగడంతో ఈ కేసు మరింత డైల్యూట్ అయింది. అసలే భోగాపురంలో ఎయిర్ పోర్ట్ అంటున్నారు. రెక్కలున్న విమానాలు వస్తున్నాయి అంటే.. ఆటోమేటిక్ గా భూముల ధరలకు రెక్కలొస్తాయి కదా.. అందుకే పోలీసులు- పొలిటీషియన్స్ అండతో మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది. అంతేకాదు.. ఈ వ్యవహారం వెనుక.. 2017 ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పనిచేసిన ఓ కలెక్టర్ మరియు ఎస్పీ పాత్ర ఉన్నట్టు.. సెక్రటేరియట్ వర్గాల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. టీడీపీ పెద్దతలకాయలకు సన్నిహితులైన ఈ ఐఏఎస్, ఐపీఎస్ లు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తమ హవా కొనసాగించడం... అందరినీ ముక్కు, మూతి ఇలా అన్నింటి మీదా వేలేసుకునేలా చేస్తుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ & ఐపీఎస్ ఎవరు? * ఒకరు.. పరుల అవినీతి మీద కాంతివంతంగా దండెత్తే ఐఏఎస్... * ఇంకొకరు.. పొద్దునలేస్తే సుభాషితాలు చెప్పే పాలమీగడ లాంటి ఐపీఎస్.. ఈయనకి టెక్నాలజీ మీద గ్రిప్ బాగా ఎక్కువ. ఈ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర కూడా ప్రముఖంగా ఉంది. 'వంద గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు కూలిపోతుంది' అన్నట్టు.. ఈ అవినీతి రాబందులను భయపెట్టే గాలివాన ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. మాఫియా లీడర్ బలగ ప్రకాష్ కనుసన్నల్లో.. ఐఏఎస్, ఐపీఎస్లు, పోలీసులు, పొలిటీషియన్స్ అండతో జరిగిన ఈ అన్యాయంపై.. గోవిందరాజు కొద్ది నెలలుగా పోరాడుతూనే ఉన్నాడు. న్యాయం కోసం ఆయన ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదు. సన్నిహితుల సాయంతో న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడంతో కొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వాస్తవానికి అప్పుడు జరిగింది తప్పుడు రిజిస్ట్రేషన్ అని పేర్కొంటూ... భోగాపురం రిజిస్టార్ డాక్యుమెంట్ రైటర్.. 2019 అక్టోబర్ 19 తేదీన.. 164 CRPC స్టేట్మెంట్ ని.. కాకినాడ ఫస్ట్ అడిషనల్ జ్యూడిషల్ సివిల్ జడ్జ్.. ముందట ఇచ్చాడు. అంతేకాదు.. సీసీ కెమెరాలతో దొంగలని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల పుణ్యమా అని అడ్డంగా బుక్ అయ్యారు. సర్పవరం లో కిడ్నాప్ చేసి.. భోగాపురం తీసుకెళ్లిన.. నాలుగు గంటల తతంగమంతా.. పలు చోట్ల సీసీ కెమెరాలలో రికార్డు అయింది. క్షవరం అయితే కానీ ఇవరం రాదని.. సీసీ కెమెరాలు చూసి దోషులని పట్టుకునే పోలీసులు.. ఆ సీసీ కెమెరాల సంగతి మర్చిపోయి ఇలా దొరికిపోవడం కామెడీగా ఉంది. మొత్తానికి కొద్దికొద్దిగా కదులుతున్న తీగతో.. దందా చేసి ఇన్నాళ్లు డొంకలో దాక్కున్నవారు.. ఇప్పుడిప్పుడే భయంతో వణుకుతున్నారు. ముఖ్యంగా డీజీపీకి కంప్లైంట్ వెళ్లడంతో ఐఏఎస్, ఐపీఎస్ ఒణికిపోతున్నారట. మరి ముఖ్యంగా ఆ ఐపీఎస్ అయితే.. డైపర్ వేసుకొని తిరుగుతున్నాడని టాక్... ఇప్పటికే ఆ ఐపీఎస్ గడిచిన రెండు నెలల్లో.. బలగ ప్రకాష్ టీం తో.. ఒకే హోటల్ లో 17 సార్లు సిట్టింగ్ వేశాడు. దీన్నిబట్టే అర్థంచేసుకోవచ్చు ఆ ఐపీఎస్ ఎంతలా వణికిపోతున్నాడో!! తప్పుని సరిదిద్దాల్సిన పోలీసులే.. ఇంత పెద్ద తప్పు చేశారు. ఈ విషయం డీజీపీ దృష్టికి కూడా వెళ్ళింది. మరి ఆయన ఈ కిడ్నాప్-కబ్జా వ్యవహారంలో ఇన్వాల్వ్ అయినవారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు?.. బాధితుడికి ఎప్పుడు న్యాయం చేస్తారు? ఆయన ఇలాగే మౌనంగా ఉంటే ప్రజలకు పోలీసు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. ఇక ఈ విషయంలో సర్కార్ కూడా అడుగు ముందుకేసి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరముంది. అవినీతి రహిత పాలనే అందించడమే తమ లక్ష్యమని చెప్పుకునే అధికారపార్టీ.. అవినీతి-అన్యాయం చేసిన వారికి.. పరోక్షంగా అండగా ఉండటం ఎంత వరకు కరెక్ట్? గత ప్రభుత్వం మీద, అప్పుడు వారికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులపైనా.. ఇప్పటి అధికారపార్టీ నేతలు పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం మీద ఎందుకు నోరు మెదపడం లేదు? ఇందులో తమ పార్టీ నేతలు కూడా ఉన్నారా? లేక పార్టీ సీనియర్ నేతైన మంత్రి గారి బావమరిది ఇన్వాల్వ్ అయ్యాడని వెనకడుగు వేస్తున్నారా? ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ఈ భోగాపురం భాగోతం వెనుకున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి.. బాధితుడికి న్యాయం చేయాలి. లేదంటే ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.  
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.  సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా, ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.  నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు పంపిస్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం. కేసీఆర్ ఆలోచ‌నే ఎలా వుందో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. కెటిఆర్ సి.ఎం. అవుతారా? క‌వితా రాజ్య‌స‌భ‌కు వెళ్తారా?  అయితే హ‌రిష్‌రావు ఈ ప‌రిణామాల‌పై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల్లో విస్తృతంగా చ‌ర్చ జ‌రుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్‌ తన తరఫున ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు.  రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు భావిస్తున్నారు. ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. రెడ్లకు అవకాశం లభిస్తే, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, మాజీీ స్పీకర్‌ కె.ఆర్‌.సురే్‌షరెడ్డి, ఎమ్మెల్సీ నాయిని నర్సింహారెడ్డి మధ్య పోటీ ఉంటుందని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని అంటున్నారు. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎ్‌సఐఐసీ చైర్మన్‌ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్‌ పేరు ఉండొచ్చని అంటున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్‌ఎస్‌ తరఫున రాజ్యసభకు పంపాలని అనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.  ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజ్యసభ స్థానాలు ఎవరికీ కేటాయించాలని ఇన్నాళ్లు చర్చించిన అధికార పార్టీ ఓ నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే వారి జాబితా సిద్ధమైనట్టు సమాచారం.  కీలకమైన పదవులు కావడంతో పార్టీ నమ్ముకున్నోళ్లు.. తమకు అండగా నిలబడిన వ్యక్తులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో వార్త వినిపిస్తోంది.  మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి - సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు మాజీమంత్రి - ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితా ఫైనలైనట్టు తెలుస్తోంది.  షర్మిల ఆపద సమయంలో జ‌గ‌న్‌కు తోడుగా నిలిచారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ పాదయాత్ర చేశారు. కష్టకాలంలో పార్టీకి షర్మిల పెద్ద దిక్కుగా నిలిచారు. తన సొంత మీడియా సాక్షి ప్రారంభించినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ తో ఉన్నారు. సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ గా కొనసాగుతూనే జగన్ కు రాజకీయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత సజ్జలను పార్టీలోకి ఆహ్వానించి పెద్ద పదవే ఇచ్చారు. విజయ సాయిరెడ్డి తర్వాత జగన్ కు అత్యంత నమ్మకస్తుడు సజ్జలనే. ఆయన పార్టీలో జగన్ రాజకీయ సలహాదారుడిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పని చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్నారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తి. ఎప్పుడూ తన తోడు ఉండడంతో ఆయనను రాజ్యసభకు జగన్ పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన వైవీ సుబ్బారెడ్డి జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. గతంలో ప్రకాశం ఎంపీగా సుబ్బారెడ్డి పని చేశారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. అప్పుడు ఆయన పదవులు ఆశించకపోవడంతో ఇప్పుడు రాజ్యసభకు పంపించాలని నిర్ణయానికి వచ్చారు. పార్టీలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందిన సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపితే న్యాయం జరుగుతుందనే భావనలో జగన్ ఉన్నారంట. అనూహ్యంగా రాజ్యసభకు పంపే జాబితాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి ఉండడం గమనార్హం. అనంతపురము జిల్లాకు చెందిన రఘువీరారెడ్డికి పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. యాదవ సామాజికి వర్గానికి చెందిన రఘువీరారెడ్డి జగన్ తండ్రి వైఎస్సార్ తో మంచి అనుబంధం ఉంది. అయితే రఘువీరారెడ్డి కాకుంటే మరొకరిని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిగా పని చేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ను రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారంట.  కృష్ణాజిల్లా యాదవ సామాజిక వర్గానికి చెందిన చలమేశ్వర్ సేవలను వినియోగించుకునేలా పార్టీ ఒక నిర్ణయానికి వచ్చిందంట. ఎందుకంటే తరచూ జగన్ న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. చలమేశ్వర్ సేవలు వినియోగించుకుంటే జగన్ సేఫ్ గా ఉండడంతో పాటు న్యాయ కోవిదుడికి గౌరవంగా రాజ్యసభను ఇద్దామనే ఆలోచనలో ఉన్నారంట.
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా, అనామకులుగా మారిపోయారు. దశాబ్దాల తరబడి రాజ్యాన్ని ఏలినవారు, ఇప్పుడు సైడైపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉద్దండుల పరిస్థితి ఇప్పుడలాగే కనిపిస్తోంది. ఎంతోమంది ముఖ్యనేతలు తీవ్ర గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మళ్లీ వాళ్లకు మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండింటిలోనూ ఊహించని రాజకీయ మార్పులు జరగడంతో ఓడలు బళ్లు... బళ్లు ఓడలయ్యాయి.  అయితే, అధికారంలో ఉండగా ఒకలా, ప్రతిపక్షంలా ఉంటే మరోలా వ్యవహరించడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. విపక్ష నేతగా ఉన్న సందర్భాల్లో నేతలు వ్యవహరించే తీరు ఒక్కోసారి సాధారణ ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధంగా ఉంటుంది. నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ క్రితం విపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో ఆయన ప్రత్యేక హోదా కోసం పట్టుదలతో ఉన్నారు. క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు వైజాగ్ పర్యటనకు వెళ్లారు. అప్పటికే అక్కడ సీఐఐ పార్ట్ నర్ షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఆ నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీకి అనుమతిని ప్రభుత్వం నిరాకరించింది. అయినా కూడా జగన్ వైజాగ్ చేరుకున్నారు. అక్కడి నుంచి నగరంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పట్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తనను అడ్డుకోవడంపై అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక, ఇప్పడు ఏపీలో రాజధాని రగడ కొనసాగుతోంది. అందులో భాగంగా చంద్రబాబు చేపట్టిన వైజాగ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందులో పోలీసులను తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. అయితే, ఇలాంటి సమయంలో విపక్ష నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా పోలీసు వలయాన్ని ఛేదించుకోవాలని తాము అనుకున్నది చేయాలని చూస్తుంటారు. పొలిటికల్ మైలేజ్ పొందాలని ప్రయత్నిస్తుంటారు. చంద్రబాబు వైజాగ్ టూర్లోనూ అదే జరిగిందనే మాట వినిపిస్తోంది. నాయకులు విపక్షంలో ఉన్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు. కాకపోతే...ఆ ప్రయత్నాలు సమాజంలో ఉద్రిక్తతలు పెంచేవిగా మాత్రం ఉండకూడదంటున్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్న నాయకులు ప్రజాస్వామ్యంలో విపక్షాలకు ఉండే ప్రాధాన్యాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు. అధికారపక్షం, విపక్షం....రెండూ ప్రజాస్వామ్యానికి రెండు చక్రాల్లాంటివని, ఏ ఒక్కటి సరిగా లేకున్నా ప్రజాస్వామ్యం కుంటుపడుతుందని గుర్తుచేస్తున్నారు.
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. ఒకరిపై ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకోవడమే తప్ప.. విలువైన రాజకీయాలు చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజుల్లో. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నేతల మీద కక్ష తీచుకోవాలన్న ధోరణే తప్ప.. ప్రజల కోసం ఒకరి సూచనలను ఒకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేసేవారు ఎక్కడున్నారు?. ఈతరం రాజకీయ నాయకులు ముందుతరం వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. మాజీ ప్రధానులు రాజీవ్ గాంధీ- వాజపేయి మధ్య జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. ఈ తరం రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటారు. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయం. అప్పుడు వాజపేయి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. వారి మధ్య జరిగిన ఓ అపురూప సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.  " సార్..ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు లైన్ లో వున్నారు..మీతో మాట్లాడుతారుట ".. ఫోన్ పట్టుకుని వాజపేయి దగ్గరికి వచ్చి చెప్పాడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి.." ఫోన్ అందుకున్న వాజపేయి ప్రధానమంత్రి తో రెండు నిమిషాలు మాట్లాడారు. ఫోన్ పెట్టేసి వాజపేయి కార్యదర్శి వంక చూసి "మనం ప్రధానమంత్రి తో పాటు ఐక్యరాజ్యసమితి సమావేశంలో పాల్గొనటానికి అమెరికా వెళ్తున్నాం.. ఏర్పాట్లు చూడండి" అనడంతో తను విన్నది నిజమేనా అని ఆశర్యంతో మరోమారు అటల్జీ ని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాడు కార్యదర్శి. " సార్..పత్రికలకు ప్రెస్ నోట్ పంపమంటారా?" నసిగాడు కార్యదర్శి వాజపేయి ఒక్క క్షణం అతనివంక చూసి నవ్వుతూ "నిక్షేపంగా" అన్నారు. ఈ వార్త అప్పట్లో ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ, అటు బీజేపీ లోనూ పెద్ద దుమారం సృష్టించింది. రాజీవ్ గాంధీ నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. "సాక్షాత్తు ప్రధానమంత్రి హోదాలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి అటెండ్ అవుతూ ప్రతిపక్షపార్టీ నేతను వెంటపెట్టుకెళ్లటం ఏంటి?" అంటూ పార్టీలో సన్నాయి నొక్కులు నొక్కారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం వాజపేయి ని తీసుకెళ్లడం వెనుక అసలు కారణాన్ని ఎవరికీ చెప్పలేదు. కానీ ఆయన మరణానంతరం వాజపేయే అసలు విషయాన్ని ప్రపంచానికి చెప్పారు.. ఆన్ టోల్డ్ వాజపేయి అనే పుస్తకం ద్వారా.. అదీ ఆయన మాటల్లోనే.. "1985 లోనే నాకు ఒక కిడ్నీ దెబ్బ తిని వైద్యం తీసుకుంటున్నా.1988 నాటికి రెండో కిడ్నీ కూడా దెబ్బతింది. డాక్టర్లు తక్షణం వైద్య చికిత్స అవసరం అన్నారు. ఇక్కడ కన్నా అమెరికాలో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్నందున అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. ఈ విషయం తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఐక్యరాజ్యసమితి ప్రతినిధుల సమావేశానికి నన్ను కూడా రమ్మని ఫోన్ లో కోరారు. కానీ చివరగా ఆయన ఒక మాట చెపుతూ.. 'అటల్ జీ.. ఈ పర్యటనను పూర్తిగా మీ వైద్యానికి ఉపయోగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఇండియా కి రండి' అని చెప్పారు. ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అది రాజీవ్ గాంధీ నాకు చేసిన ఉపకారం వల్లనే. నా కన్నా ఇరవై ఏళ్ళ చిన్నవాడు అయిన రాజీవ్ నాకు తమ్ముడిలాంటి వాడే" అని వాజపేయి అన్నారు. అది విలువలతో కూడిన రాజకీయమంటే. రాజీవ్ గాంధీ, వాజపేయి రాజకీయంగా ప్రత్యర్థులు కావచ్చు కానీ ఒకరినొకరు గౌరవించుకుంటూ విలువైన రాజకీయాలు చేశారు. వారిని చూసి ఈ తరం రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి. పొద్దున్న లేస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే అధికార-ప్రతిపక్ష పార్టీల నాయకులు.. రాజకీయాలు పక్కన పెట్టి అప్పుడప్పుడన్నా నైతిక విలువలు పాటించాలన్న సూత్రం.. ఇలాంటి విషయాలు తెలుసుకుని అయినా పాటిస్తే బాగుండు..!
ఒక కుర్రవాడికి కేన్సర్‌ చివరి దశలో ఉందని తేలింది. ఆ విషయం తెలిసినప్పటి నుంచీ అతనికి ఈ ప్రపంచం ఒక దుఃఖసాగరంగా మారిపోయింది. ఎటు చూసినా, ఏది పట్టుకున్నా, ఎవరితో మాట్లాడినా తన వ్యాధే గుర్తుకు వచ్చేది. అందుకనే నిశ్శబ్దంగా తనలో తాను కుమిలిపోతూ తన గదిలో ఒంటరిగా చివరి రోజులను వెళ్లదీస్తూ ఉండేవాడు. ఒకసారి ఎందుకనో కుర్రవాడికి అలా వీధి చివరిదాకా వెళ్లి రావాలని అనిపించింది. చాలాకాలం తరువాత కుర్రవాడు వీధిలోకి అడుగుపెట్టడం చూసి అతని తల్లికి కూడా సంతోషం వేసింది. ఊరికనే అలా నాలుగడుగులు వేసి తిరిగి ఇంటికి వెళ్లిపోవాలనుకున్నాడు కుర్రవాడు. కానీ ఇంతలో వీధి చివర కొత్తగా పెట్టిన సీడీల షాప్ చూసేసరికి అందులోకి అడుగుపెట్టాలనిపించింది. కుర్రవాడు సీడీల షాప్‌లోకి అడుగుపెట్టాడో లేదో అక్కడ కౌంటర్‌ దగ్గర ఉన్న అందమైన అమ్మాయిని చూసి మనసు చెదిరిపోయింది. ఆ అమ్మాయిని చూడటం కోసం అవసరం లేకపోయినా ప్రతిరోజూ ఆ షాపులోకి వెళ్లి ఏదో ఒక సీడీని కొనుక్కునేవాడు కుర్రవాడు. ఆ సీడీని భద్రంగా ఓ కవర్లో పెట్టి, చిరునవ్వుతో అతనికి అందించేది అమ్మాయి. ఆ అమ్మాయితో ఓసారి సరదాగా అలా షికారుకి వెళ్తే ఎంత బాగుండో అనుకునేవాడు కుర్రవాడు. కానీ తీరా కాదంటే ఆ బాధని తట్టుకునే స్థితిలో అతని మనసు లేదు. అందుకనే కనీసం ఒక్క పది నిమిషాలైనా ఆమెని చూస్తూ గడపడం కోసం రోజూ షాపుకి వెళ్లేవాడు. కానీ అలా ఎన్నాళ్లని వెళ్తాడు. నెల తిరక్కుండానే ఆ కుర్రవాడిని క్యాన్సర్‌ కబళించివేసింది.    కుర్రవాడి చావుకి తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఎలాగొలా బంధువుల సాయంతో అతని అంత్యక్రియలు పూర్తిచేసింది. అంత్యక్రియలు పూర్తయ్యాక కూడా అతని జ్ఞాపకాలని వదలలేకపోయింది తల్లి. కాసేపు అతని గదిలో కూర్చునైనా సేదతీరుదామనుకుంటూ, అతని గదిలోకి అడుగుపెట్టింది. తల్లి గదిలోకి అడుగుపెట్టేసరికి ఒక మూల గుట్టగా పేర్చి ఉన్న సీడీలు కనిపించాయి. కొన్నవి కొన్నట్లు ఆ సీడీలు అలాగే ఉన్నాయి. కనీసం వాటిని కవర్లోంచి కూడా తీయలేదు కుర్రవాడు. అతని అవసరం సీడీలు కాదు కదా! అందులో ఒక కవర్‌ని తెరిచి చూసింది తల్లి. అంతే! కవర్లో ఉన్నదాన్ని చూసి ఆమె గుండె చెదిరిపోయింది. ‘మీ నవ్వు చాలా బాగుంటుంది. ఒకసారి మీతో కాఫీ తాగాలనుంది’ అన్న చీటీ సీడీతో పాటే ఆ కవర్లో ఉంచింది ఆ అమ్మాయి. రెండో కవరు, మూడో కవరు, మరో కవరు, ఇంకో కవరు.... అన్నింటిలోనూ ఇలాంటి చీటీలే ఉన్నాయి. ఆ కవర్లని కుర్రవాడు ఒక్కసారన్నా తెరిచి చూస్తే అతని చివరి రోజులు ఎంత అందంగా గడిచేవో కదా! పోనీ తన మనసులో ఉన్న మాటనన్నా అతను చెప్పగలిగితే ఎంత బాగుండేదో! మనలో చాలామంది ఆ కుర్రవాడిలాగే ప్రవర్తిస్తుంటాం. మనకి అర్హత లేదనో, సాధ్యం కాదనో... మన లక్ష్యాలని మనసులోనే దాచేసుకుంటాం. దక్కదేమో అన్న భయంతో ఉన్న కొద్ది రోజులనీ భారంగా గడిపేస్తుంటాం. వెనక్కి తిరిగి చూసుకునే సరికి కాలం కాస్తా కరిగిపోతుంది.
  ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలసి వుండటానికి ప్రేమ ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. ఏరికోరి పెళ్ళిని ప్రేమతో ముడివేసుకున్న వాళ్ళు కూడా ఒకోసారి పెళ్ళి తర్వాత ఆ ప్రేమ కోసం వెతుకులాడటం చూస్తుంటాం... ఎందుకని? ఇద్దరు వ్యక్తులు కలసి బతకడంలో ఎక్కడో ఆ ప్రేమని జారవిడుచుకుంటారు. అందుకు కారణం నువ్వంటే నువ్వని వాదించుకుంటారు. మార్పు ఎదుటి వ్యక్తిలో రావాలని ప్రగాఢంగా నమ్ముతారు. ఖాళీ మనసులతో, నిర్జీవంగా మారిన బంధంతో, సర్దుకోలేక అసంతృప్తితో నలిగిపోతారు. మరి దీనికి పరిష్కరం లేదా అంటే... సమాధానం ‘ఉందనే’ చెప్పాలి. భార్యాభర్తల మధ్య ‘ప్రేమ’ ఎప్పటికీ తాజాగా నిలవాలంటే అందుకు నిపుణులు చేస్తున్న కొన్ని సూచనలు వినండి..  https://www.youtube.com/watch?v=d9D5pVYSowk&t=2s  
బంధం నిలబడాలన్నా.. సమస్యల నుంచి బయటపడాలన్నా.. మీ సత్తా ఏంటో మీకు తెలియలన్నా చిన్న మెచ్చుకోలు చాలు అని చెప్పే ఓ టీచర్ కథ. ఎప్పుడు మీపై మీకు అపనమ్మకం కలిగినా ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=usBw5K-4DoQ    
27 ఎకరాల్లో 20శాతం స్థలంలోనే కొత్త సచివాలయం.. ఆరు అంతస్తుత్లో దీర్ఘ చతురస్రారాకంలో నిర్మాణం.. రెండు హెలిప్యాడ్స్, విశాలమైన పార్కింగ్ సదుపాయాలు.. రాష్ట్ర అధికార పుష్పం తంగేడు ఆకారంలో ఫౌంటెన్లు.. ఫ్రాన్స్ లోని  ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ నమూనాలో.. డిజైన్ చేసిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌.. ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభం.. తెలంగాణ కొత్త సచివాలయం అత్యాధునిక హంగులతో నిర్మించడానికి ప్రభుత్వం సిద్దమైంది.  పాత సచివాలయం ఉన్న 27ఎకరాల స్థలంలో కేవలం 20శాతం మాత్రమే భవననిర్మాణానికి వినియోగించనుంది. మిగతా స్థలంలో రెండు హెలిప్యాడ్స్, విశాలమైన పార్కింగ్ సదుపాయలు, పార్క్ లు, ఫౌంటెన్లు ఏర్పాటు చేసేలా డిజైన్ చేశారు.  ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారంలో ఆరు అంతస్తులతో కొత్త భవనాన్ని 500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తు దోషం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ల్యాండ్ స్కేప్‌లు, రాష్ట్ర అధికార పుష్పమైన తంగేడు పువ్వు ఆకారంలో ఫౌంటెన్లు, ఒకేసారి 800 కార్లు పార్కు చేసేలా విశాలమైన పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తారు. ఒకేసారి రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ భవనం స్ఫూర్తితో డిజైన్ నమూనాను ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్‌ రూపొందించారు. కొత్త భవనం నమూనాను ఖరారు చేశారు. అయితే దక్కన్ వాస్తురీతుల సమ్మిళితం ఈ భవనం డిజైన్ లో అగుపిస్తుంది. ప్రధానంగా భవనస్థంభాలు కాకతీయ వాస్తురీతులకు దగ్గరగా ఉండటంతో పాటు గవాక్షాల్లో దక్కన్ రీతులు గోచరిస్తున్నాయి. ఈ నెలాఖరులో పనులు ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఎనిమిది మంది పోలీసులను కిరాతకంగా హత్య చేసిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర దూబే ను ఈరోజు తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు. ఈ నెల 3న వికాస్ దూబే ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన డిఎస్పీ తో సహా ఎనిమిది మంది పోలీసులను కాల్చి చంపి తరువాత వారి శరీరాలను ముక్కలుగా చేసిన వారిలో ఈ అమర్ దూబే ముఖ్యుడిగా పోలీసులు గుర్తించారు. ఇది ఇలా ఉండగా ప్రధాన నిందితుడు వికాస్ దూబే హర్యానా లోని ఫరీదాబాద్ లో ఒక హోటల్ లో తలదాచుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో యూపీ పోలీసులు ఫరీదాబాద్ చేరుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే వికాస్ దూబే కు  దారుణమైన నేర చరిత్ర తో పాటు రాజకీయంగా పెద్ద తలకాయల తో లింకులు కూడా ఉండడంతో ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో అని ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.
25ఎకరాల స్థలం సిద్దం చేయడానికి రెండు వారాల సమయం.. సచివాలయానికి వెళ్లే అన్నిదారులు బంద్.. విపక్షాలు ఆందోళనలు చేయకుండా కట్టడి.. తెలంగాణ సచివాలయ భవనం కూల్చివేత పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. విపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగక ముందే పూర్తిగా నేలమట్టం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాల మీద పనులు చేస్తోంది. సచివాలయం చుట్టూ ఉన్న రోడ్డులన్నీ బంద్ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ఆందోళనలకు తావు లేకుండా భారీ యంత్రాలతో కూల్చివేత పనులు త్వరత్వరగా చేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య 25.5 ఎకరాల సచివాలయం ప్రాంగణాన్ని భారీ కొత్త భవన నిర్మాణం కోసం సిద్దం చేస్తున్నారు.
మనం నిత్యం తీసుకునే ఆహారంలో సుగంధద్రవ్యాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంతో మరోసారి మన సుగంధద్రవ్యాలలోని ఔషధ విలువల గురించి చర్చ జరుగుతుంది. తక్కువ మోతాదులో వాడే వీటి వల్ల మనం తీసుకునే ఆహారానికి కమ్మని రుచి వస్తుంది. వీటిని రుచికోసమే వాడతామా అంటే కాదనే చెప్పాలి. అంతకుమించిన  వీటిలో ఉన్నది ఎంటో తెలుసుకుందాం.. శరీరంలో రక్తకణాలు ఆక్సిజన్ ను గ్రహిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా.. వ్యాధులకు ఎదుర్కోవాలన్నా ఆక్సిజన్ తగినంతగా శరీరకణాలను అందాలి. అప్పుడే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం తీసుకునే సుగంధ ద్రవ్యాలకు రక్తకణాలు ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించేలా చేయగలిగే శక్తి ఉంది. దీన్నే ఓఆర్ఎసి( ఆక్సిజెన్ రాడికల్ అబ్సోర్బెన్స్ కెపాసిటీ) అని పిలుస్తారు. మనం రోజూ వాడే పసుపు, తులసి, అల్లం మొదలైన వాటిలో పదిరెట్లు ఓఆర్ఎసి ఉంటుంది. అంతేకాదు ప్రకృతి సిద్దంగా లభించే పండ్లు, కూరగాయలు, గింజలు, మూలికలు ఆక్సిజెన్ గ్రహించే శక్తిని పెంచుతాయి. కొన్ని సుగంధ ద్రవ్యాలలోని ORAC .... లవంగం: 314,446 ORAC దాల్చినచెక్క: 267,537 ORAC పసుపు: 102,700 ORAC జీలకర్ర: 76,800 ORAC తులసి: 67,553 ORAC అల్లం: 28,811 ORAC జాజికాయ : 69,640 ORAC నల్ల మిరియాలు : 34, 053 ORAC కోవిడ్ 19 వైరస్  నుంచి రక్షణ పొందాలంటే మన శరీరంలోని రోగనిరోధక శక్తినిపెంచుకోవడమే ఏకైకమార్గం. ఓఆర్ఎసి ఎక్కువగా ఉంటే ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరా రక్షణ యంత్రాంగానికి కావల్సిన సూక్ష్మపోషకాలైన ఐరన్, జింక్, మెగ్నిషియం, విటమిన్ సి, విటమిన్ డి, ఒమేగా3 వంటి వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. మన ఆయుర్వేదంలోనూ వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆధునిక యుగంలోనూ మందులు లేని ఎన్నో వ్యాధులను ఇవి నయం చేస్తున్నాయి. ప్రపంచాన్ని వణికించిన ఎన్నో వ్యాధులను అరికట్టడంతోనూ మన భారతీయ ఆయుర్వేద వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన సాంప్రదాయ ఆహారంలోనే ఔషధ విలువలు ఉన్నాయి. వాటిని మనం గ్రహించాలి. భవిష్యత్ లో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలంటే కంప్యూటర్ లో ఇంటెల్ ప్రాసెసర్  పనిచేసినట్టే మన శరీరంలోనూ రోగనిరోధక శక్తి పనిచేయాల్సిందే.
  ఆరోగ్యం..ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. మన శరీరానికి తగిన పోషకాలు, విటమిన్లు అందితేనే ఆరోగ్యం కూడా సరిగ్గా ఉంటుంది. లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాకాకుండా ఉండాలంటే కొన్నిపాతకాలపు ఆహారపు అలవాట్లు పాటించాలి. అవేంటో ఈ వీడియో ద్వారా చూసి వాటిని పాటించండి. ఆరోగ్యంగా ఉండండి.. https://www.youtube.com/watch?v=ZH5yCJttcWQ      
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం కొన్ని రకాల కషాయాలను ఇంట్లో చేసుకుని రోజూ రెండు పూటలు తాగడం ఆరోగ్యకరం. తులసి ఆకులు, దాల్చిన చెక్క, శొంఠి, నల్ల మిరియాలను నీళ్లలో వేసి బాగా మరగబెట్టి బెల్లం లేదా తేనెతో.. హెర్బల్‌ టీ మాదిరిగా తాగితే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.   ధనియాలు, మిరియాలు, దాల్చినచెక్క, శొంఠి సమపాళ్ళలో తీసుకుని పొడి చేయాలి. ఒక స్పూన్ పొడిని గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, యాలకులు, శొంఠి, ఎండుద్రాక్ష, బెల్లం, నిమ్మరసం తీసుకోవాలి. వీటిలో దాల్చిన చెక్క, నల్లమిరియాలు, యాలకులు, శొంఠి పొడి చేసుకోవాలి. ఒక లీటర్ నీటిని వేడి చేస్తూ అందులో ఎండు ద్రాక్ష, ముందుగా చేసుకున్న పొడి, తులసి ఆకులు వేయాలి. పది నిమిషాల పాటు మరిగిన తర్వాత చల్లార్చాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం, బెల్లం కలిపి తాగాలి. ఒక లీటర్ నీటితో చేసుకునే ఈ కషాయం ఇంట్లో నలుగురికి సరిపోతుంది. అల్లం, పసుపు, మిరియాలు, బెల్లం. రెండు గ్లాసుల వేడి నీటిలో స్పూన్ అల్లం రసం, అర స్పూన్ పసుపు, పావు స్పూన్ మిరియాల పొడి వేయాలి. ఐదు నిమిషాలు మరిగిన తర్వాత బెల్లం వేయాలి. వేడివేడిగా ఈ కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.