LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
ALSO ON TELUGUONE N E W S
కొన్ని వివాదాలు కొన్ని సినిమాల‌కు విప‌రీత‌మైన ప‌బ్లిసిటీని తీకొస్తాయి. మ‌రికొన్ని సినిమాల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. అలాంటి వివాదంలో చిక్కుకుంది హ‌న్సిక న‌టిస్తోన్న 50వ సినిమా. ఇటీవ‌ల `మ‌హా` చిత్రంలోంచి   స‌న్యాసులు ధ‌రించే కాషాయ వ‌స్త్రాలను ధ‌రించి , సింహాస‌నం లాంటి కుర్చిలో కూర్చోని హుక్కా తాగుతున్న‌ట్లుగా  హ‌న్సిక స్టిల్  ను ఫ‌స్ట్ లుక్ గా రిలీజ్ చేసారు  ద‌ర్శ‌క నిర్మాత‌లు.  అయితే ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ హిందువుల మ‌నోభావాల‌నుకించ‌ప‌రిచే విధంగా ఉందంటూ వివాదానికి గురైంది. ఇప్ప‌టికే దీనిపై  పీయంకే పార్టీ కోర్టులో కేసు  కూడా  వేసింద‌ట‌.  కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌డంతో సినిమా భ‌విష్య‌త్ ఎలాం ఉండ‌బోతుందోనన్న ఆస‌క్తి మొద‌లైంది. ఇది హ‌న్సిక న‌టిస్తోన్న   50 వ సినిమా కావ‌డంతో  ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇలా వివాదాస్ప‌దం కావ‌డంతో చిత్ర యూనిట్ షాక్ కి గురైంది.   ఈ సినిమా ద్వారా ఆర్‌.జెమ‌ల్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచయం కాబోతున్నాడు. మ‌రి ఈ వివాదం హ‌న్సిక‌కు క‌లిసొస్తుందో లేక ఇబ్బందుల పాలు చేస్తుందో చూడాలి మ‌రి.
`ఎఫ్ 2` టైటిల్ విన‌డానికే చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. ఇక వెంకీ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన టీజ‌ర్ కూడా టైటిల్ కి త‌గ్గ‌ట్టుగా ఫ‌న్ అండ్ పెళ్లాల పై ఫ్ర‌స్టేష‌న్ తో ఇంట్ర‌స్టింగ్ గా అనిపించింది. సంక్రాంతికి రాబోయే ఈ కొత్త అల్లు ళ్లు ఎంత‌గా న‌వ్వించ‌బోతున్నారో ఈ టీజ‌ర్లో చూపించాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. వెంక‌టేష్ , వ‌రుణ్ తేజ్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు.  ఈ టీజ‌ర్ చూశాక పెళ్లి, పెళ్లాల చుట్టూ తిరిగేలా సినిమా ఉండ‌బోతుంద‌ని అర్థ‌మ‌వుతోంది.     `ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాం. .. అదే ఒక మ‌గాడి గురించి చెప్పాలంటే పెళ్ళికి ముందు పెళ్ళికి త‌ర్వాత అంటూ `` వెంక‌టేష్ త‌న స్టైల్ లో చెప్పి ఆక‌ట్టుకున్నాడు. అలాగే వ‌రుణ్ తేజ్ కూడా `` ఒక చరిత్ర గురించి చెప్పాలంటే తెలంగాణా రాక‌ముందు...తెలంగాణా వ‌చ్చాక అంటూ``తెలంగాణా యాస‌లో చెప్పి ఆక‌ట్టుకున్నాడు.  టీజ‌ర్ చూశాక వెంకీ, వ‌రుణ్ ల కెమిస్ట్రీ బాగానే కుదిరిన‌ట్టుగా అనిపించింది.  ఈ ఇద్ద‌రి హీరోల టైమింగ్ బాగా కుద‌ర‌డంతో టీజ‌ర్ మొత్తం న‌వ్వుల‌తో నిండిపోయింది.  ఇటీవ‌ల కాలంలో వెంకీ త‌ర‌హా కామెడీ టైమింగ్ తో సినిమాలు రాలేదు. ఈసినిమాలో వెంకీని ఫుల్ గా అనిల్ రావిపూడి వాడినట్టు తెలుస్తోంది.  ఇక ప్ర‌తి సినిమాలో ఏదో ఒక మ్యాన‌రిజ‌మ్ ఉండే డైలాగ్ పెట్టే ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో కూడా అంతేగా ...అంతేగా అంటూ టీజ‌ర్ ని ఎండ్ చేశాడు. ఇది సినిమాలో బాగానే వ‌ర్క‌వుట్ అయ్యేలా అనిపిస్తోంది.  వ‌రుస హిట్స్ తో దూసుకెళ్తోన్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి రాజాది గ్రేట్ త‌ర్వాత దిల్ రాజు బేనర్ లో చేసిన చిత్ర‌మిది.  సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఎఫ్ 2 వ‌స్తోంది.  దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రం ఆడియో త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.
రాజకీయాల్లో మాత్రమే కాదు... సినిమా ఇండస్ట్రీలోనూ కోటరీలు, గ్రూపులు వుంటాయనేది జగమెరిగిన సత్యం! ఇదెంత నిజమో... ప్రేక్షకుల్లోనూ కొందరు కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా హీరోలను అభిమానిస్తారు అనేదీ అంతే నిజం!! ప్రజెంట్ సోషల్ మీడియా జమానాలో ట్విట్టర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికలుగా మాటలతో కొట్టుకుంటున్నారు. తమ హీరో గొప్పంటే తమ హీరో గొప్పంటూ ఎదుటి హీరోని కించపరిచేలా పోస్టులు పెడుతున్నారు. ఓ హీరోను అభిమానించడానికి ప్రేక్షకులకు రకరకాల కారణాలు వుండొచ్చు. కానీ, విక్టరీ వెంకటేష్‌ని అభిమానించడానికి మాత్రం వున్న కారణం ఒక్కటే... ఆయన అజాత శత్రువు. ఇండస్ట్రీలో అందరివాడు. ప్రతి హీరో అభిమానీ వెంకీ అభిమాని అని చెప్పుకోవాలి. వెంకీని ద్వేషించే ప్రేక్షకులు టార్చ్ లైట్ వేసి వెతికినా ఎక్కడా కనిపించారు. సోషల్ మీడియాలో కొందరు హీరోలపై అదే పనిగా బురదజల్లే ప్రేక్షకులు సైతం వెంకీని అభిమానిస్తారు. కులాలకు, మతాలకు, వర్గాలకు, ప్రాంతాలకు అతీతంగా వెంకీని ప్రేక్షకులంతా అభిమానిస్తారు. అదీ వెంకీ గొప్పతనం. ఓ రకంగా వెంకీలో మంచితనమే ఆయన్ను అందరికీ దగ్గర చేసింది. 'వెంక‌టేష్‌కి మహిళా అభిమానులు, కుటుంబ ప్రేక్షకుల్లో అభిమానులు ఎక్కువ' అని చెబుతుంటారు. ఫ్యామిలీ సినిమాలు ఎక్కువ చేశారు కనుక... మహిళా అభిమానులు ఎక్కువ అనేది అలా చెప్పేవారి మాట! కుటుంబ ప్రేక్షకులు అంటే ఎవరు? ఫ్యామిలీలో చిన్న పిల్లలు, పెద్దలు అందరూ వస్తారు కదా! ఆ లెక్కన వెంకీకి ప్రతి ఒక్కరూ అభిమానులే.     వెంకటేష్ నటించిన సినిమాల గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. ఫ్యామిలీ సినిమాలతో పాటు యాక్షన్ సినిమాలూ చేశారు. 'లక్ష్మీ', 'ఆడువారి మాటలకు అర్థాలు వేరులే' వంటి ఫ్యామిలీ సినిమాల తరవాత 'తులసి' అంటూ కత్తిపట్టి యాక్షన్ సినిమా చేశారు. తరవాత 'చింతకాయల రవి' అంటూ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ చేసి.. ఆ తర్వాత 'ఈనాడు' లాంటి థ్రిల్లర్ చేశారు. ఒక్క హారర్ తప్ప.. వెంకీ టచ్ చేయని జానర్ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదేమో! వెంకటేష్ సినిమాల కంటే ట్రెండ్‌ని బ‌ట్టి ఆయన సినిమాలు ఎంపిక చేసుకున్న తీరు గురించి మాట్లాడుకోవాలి. యువ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందడుగు వేసిన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. వయసు రీత్యా కొన్ని కథలను తాను చేయలేనని ఇతర హీరోల కంటే వెంకటేష్ ముందే గ్రహించారు. నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, అందమైన హీరోయిన్లతో రొమాంటిక్ సన్నివేశాలు కల సినిమాలను పక్కన పెట్టి కథాబలం వున్న సినిమాలకు ఓటు వేయడం మొదలుపెట్టిన సీనియర్ హీరోల్లో వెంకటేషే ఫస్ట్. 'దృశ్యం'లో ఇద్దరు అమ్మాయిలకు తండ్రిగా నటించడానికి వెంకటేష్ వెనుకంజ వేయలేదు. 'గురు'లో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించడానికి ఆలోచించలేదు. వీటన్నిటికంటే ముందు 'మల్లీశ్వరి'లో పెళ్లికాని ప్రసాద్ పాత్రలో నవ్వించారు. ఏజ్ బార్ క్యారెక్టర్ చేయడానికి, మరో హీరోతో కలిసి తెరను పంచుకోవడానికి వెంకటేష్ ఎప్పుడూ అడ్డుచెప్పలేదు.దాంతో దర్శక రచయితలకు వెంకీని దృష్టిలో పెట్టుకుని కథలు రాయడం సులువైంది. 'సంక్రాంతి', 'మసాలా', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'గోపాల గోపాల' వంటి సినిమాలు వచ్చాయి. త్వరలో 'ఎఫ్ 2' రానుంది. కథ నచ్చితే ఏ హీరోతో అయినా కలిసి నటించడానికి వెంకటేష్ సిద్ధమే. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, వరుణ్ తేజ్, రామ్... తెలుగు హీరోలు మాత్రమే కాదు. కమల్ హాసన్ వంటి తమిళ హీరోతోనూ వెంకటేష్ నటించారు. ఎప్పుడూ ఏ హీరో గురించి ఆయన చెడుగా మాట్లాడింది లేదు. ఆయనలో ఈ లక్షణాలే ఆయన్ను అందరూ అభిమానించేలా చేశాయి. విజయాలు అందించాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎందరికో ఆదర్శంగా నిలిచిన విక్టరీ వెంకటేష్‌కి 'తెలుగువన్ డాట్ కామ్' తరపున జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్ డే సార్!!
రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'వినయ విధేయ రామ్'. టైటిల్ చాలా సాఫ్ట్‌గా, ట్రెడిష‌న‌ల్‌గా వుంది కదూ! టైటిల్ ఎంత సాఫ్ట్‌గా వుందో... ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోయే హీరోయిన్ అంత హాట్! హిందీ హీరోయిన్ ఈషా గుప్తాను 'వినయ విధేయ రామ'లో ఐటమ్‌గాళ్‌గా ఎంపిక చేశారు. నిజానికి... 'ఇద్దరమ్మాయిలతో', 'సరైనోడు' సినిమాల్లో అల్లు అర్జున్ సరసన నటించిన కేథరిన్ ట్రెసాను బోయపాటి ఎంపిక చేశారని వార్తలొచ్చాయి. ఏమైందో ఏమో... ఆమెను తప్పించి, ఈషా గుప్తాను లైనులోకి తీసుకొచ్చారు. ఈషా గుప్తా పేరు వింటే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది హాట్ ఫొటోలే. ఆమె లింగరీ ఫోటోషూట్ ఒకటి విమర్శలకు కారణమైంది. విమర్శించిన వాళ్లపై ఈషా గుప్తా విరుచుకుపడ్డారు కూడా.     ఐటమ్ సాంగులో ఏ స్థాయిలో అందాల ప్రదర్శన చేస్తారో మరి!! ఈ  నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ హైదరాబాద్ అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ స్టూడియోలో వేసిన స్పెషల్ సెట్‌లో ఐటమ్ సాంగు తీస్తారట. ఇది కాకుండా సినిమాలో మరో సాంగ్ షూటింగ్ పెండింగులో వుందట. క్రిస్మస్ పండక్కి ముందు షూటింగ్ కంప్లీట్ చేయాలని బోయపాటి ప్లాన్ చేశారట. 'భరత్ అనే నేను' ఫేమ్ కీయరా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న 'మిస్టర్ మజ్ను'ను 2019 జనవరి 25న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అందువల్ల, అదే రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్న నందమూరి కల్యాణ్ రామ్ సినిమా '118' వెనక్కి వెళ్లే అవకాశాలు వున్నాయని ఫిలింనగర్ టాక్. అసలు మ్యాటర్ ఏంటంటే.. అఖిల్ సినిమా విడుదల తేదీ కంటే ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ 'యన్.టి.ఆర్ మహానాయకుడు' విడుదల తేదీ గురించి కల్యాణ్ రామ్ '118' యూనిట్ ఎక్కువ ఆలోచిస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను  జనవరి 24న విడుదల చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే.. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ మనసు మారినట్టు తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడితో పాటు ఫస్ట్ పార్ట్ విడుదలైన రెండు వారాలకు సెకండ్ పార్ట్ వస్తే వసూళ్లుపై ప్రభావం పడుతుందేమోనని అలోచించి... 'యన్.టి.ఆర్ మహానాయకుడు'ను ఫిబ్రవరిలో విడుదల చేయాలని అనుకుంటున్నారట. బాబాయ్ బాలకృష్ణ సినిమా ఫిబ్రవరిలో వస్తే... అబ్బాయ్ కల్యాణ్ రామ్ సినిమా జనవరి 25న వస్తుంది. బాబాయ్‌తో పోటీకి అబ్బాయ్ ఏమాత్రం సుముఖంగా లేడని ఫిలింనగర్ టాక్. బాబాయ్ సినిమా విడుదల తేదీని బట్టి తన సినిమాను విడుదల చేయాలని కల్యాణ్ రామ్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ సెకండ్ పార్ట్ ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకోవడం దాదాపు ఖాయమే. సో... '118' జనవరి నెలాఖరున ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ. కల్యాణ్ రామ్ హిట్ సినిమాల్లో ఒకటైన 'పటాస్' జనవరి నెలాఖరున విడుదలైంది. ఆ సెంటిమెంట్ దృష్ట్యా సినిమాను అసలు వాయిదా వేయాలని అనుకోవడం లేదు. నందమూరి హీరోలు వెనక్కి వెళ్లి... అఖిల్ అక్కినేని ముందుకు వస్తున్నట్టు వార్తల్లో నిజం లేదు. జనవరి నెలాఖరున '118', 'మిస్టర్ మజ్ను' వసూళ్ల వేటలో పోటీ పడటం ఖాయంగా కనిపిస్తుంది.
  శాసనసభ పక్ష నాయకునిగా టీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్‌ను ఏకపక్షంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాను చేయాల్సిన పనిచేయకుండా అధికారాలు పెట్టుకొని రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని, ఇదే అభిప్రాయం చాలా రాష్ట్రాలు, పార్టీల్లో ఉందని విమర్శించారు. రూరల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, వైద్యం, విద్య కేంద్రం తన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయం విధానం అవసరమని, మూస వ్యవసాయ విధానం పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది.. కానీ రాష్ట్రానికో పాలసీ ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీది పచ్చి రాజకీయ అవకాశం వాదమని ఆరో్పించారు. బీజేపీ, కాంగ్రెస్‌ లకు తేడా లేదని.. దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. కొత్త మోడల్ దేశానికి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రయత్నం దేశ రైతాంగం తరపున తాను చేస్తానని అన్నారు. వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారని కేసీఆర్ అన్నారు. నాలుగేళ్ల పాలన మమ్మల్ని తిరిగి గెలిపించిందని అన్నారు. చేసిన పని సిన్సియర్‌గా చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో కోటి మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుదన్న భావన ప్రజల్లో వచ్చిందని, పేదలకు కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో బాల్య వివాహాలు జరగడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో సమానమైన ఆదరణ కనిపించిందని కేసీఆర్ అన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను వందకు వంద శాతం అమలుపరిచిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ఎవరితోనైనా, ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏం చేస్తామని చెప్పామో వంద శాతం అది చేశామని, మేనిఫెస్టోలో లేని ప్రజలకు ఉపయోగపడే 76 అంశాలను కూడా అమలుపరిచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. బీడీ కార్మికుల పెన్షన్ తమ మేనిఫెస్టోలో లేదని, కానీ మంజూరు చేశామని తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు చెప్పలేదని.. ఆయినా చేశామన్నారు. కొంతమంది కావాలనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పినట్లు ప్రచారం చేశారని.. తాను కానీ, తమ పార్టీ కానీ ఆ మాట అనలేదని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగాలు కల్పిస్తామని మాత్రమే చెప్పామని, ఆంధ్రా వాళ్లు వెళ్లిపోతే వచ్చే ఖాళీలు మనకొస్తాయని చెప్పామని కేసీఆర్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. రానున్న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు సూచించాం అని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్ వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తాం అన్నారు. దీనికోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చవుతుంది. తాము వచ్చాక కచ్చితంగా చేస్తాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 29.9శాతం ఆర్థికవృద్ధి ఉంది. దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో లేదు. రూ.70వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తవుతాయి. అప్పులు చేశామని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పూర్తి అవగాహనతోనే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. తమకంటే ముందు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని ఉద్యోగాలిచ్చాయి? నిరుద్యోగులను మోసం చేసి కనీసం ఐదులక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు అని విమర్శించారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో.. వాటిని త్వరలోనే భర్తీ చేస్తాం అని స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదని కేసీఆర్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అడిగేవాళ్లు మూర్ఖులని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయనే హోదా అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాకు రమ్మని తనను పిలుస్తున్నారని.. వందలు, వేల సంఖ్యలో ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వందకు వంద శాతం వెళ్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.
  తెలంగాణలో ప్రజకూటమి అంచనాలను తారుమారు చేస్తూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి లభించిన విజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు. ప్రచారంలో కాళేశ్వర కావాలా? శనేశ్వరం కావాలా అని అడిగామని, ప్రజలు కాళేశ్వరమే కావాలని తీర్పునిచ్చారని అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయమని అన్నారు. కార్యకర్తలెవరూ విజయంతో గర్వించాల్సిన అవసరం లేదని, అంతిమ తీర్పు ప్రజలే కాబట్టి కర్తవ్య నిష్ఠతో బాధ్యతను నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అభివృద్ధిలో ఒక బాట వేసిందని, ఇక ఆ బాటను చేరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి ఎకరాలు పచ్చబడాలి అన్న తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరతామని అన్నారు. లక్ష ఎకరాలకు నీరందించడమే కర్తవ్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రైతుల కోసం కచ్చితంగా పనిచేస్తామని, వారికి ఏ బాధలు లేకుండా చేస్తామని ప్రకటించారు. గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూముల కోసం పడుతున్న బాధలను తొందరలోనే పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు తానే వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని ప్రకటించారు. కుల వృత్తులు మరింత అభివృద్ధి పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగతను అధిగమిస్తామని తెలిపారు. ఉద్యోగ ఖాళీలను అత్యంత వేగంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వేతర రంగాల్లో కూడా విరివిగా దొరికేలా చూస్తామని అన్నారు. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉందని అన్నారు. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్షేత్రంలో ఉందని, అలాగే ఇప్పుడు ఈఎన్‌టి, డెంటల్ పరీక్షలను చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న అన్ని రకాల మైనారిటీలకు మరింత సంక్షేమాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. వీరితో పాటు దళితులు, గిరిజనుల బాధలకు భరతవాక్యం పాడతామని, ఇందుకోసం ఏం చేయాలనే అంశంపై ఆలోచించి కచ్చితమైన లక్ష్యాలతో ముందుకు సాగుతామని అన్నారు. బీసీలతో పాటు రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా, పరిష్కారం ఇతివృత్తంగా, పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు. ప్రేక్షక పాత్ర పోషించం. చైతన్యం కల్గినది తెలంగాణ గడ్డ. తానేంటో నిరూపించుకున్న భూమి తెలంగాణ. 116 సభల్లో నేను పాల్గొన్నా. ప్రతి సమావేశంలో నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. పార్టీలు, నాయకులు కాదు. ప్రజలే గెలవాలని అన్నాను అని గుర్తు చేశారు. ఈ రోజు ప్రజలే గెలిచారు. ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా మేం పట్టించుకోలేదు అన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఓ దిక్సూచి తెలంగాణ. జాతీయ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం ఇస్తాం అన్నారు. 'దేశంలో పెద్ద గందరగోళం ఉంది. నూరు శాతం బీజేపీయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్‌లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాం. ప్రజలకే ఏజెంట్లం. ప్రజలే మమ్మల్ని ఏజెంట్లుగా నియమించారు. వారి కోసమే మేం పనిచేస్తాం. మేమెవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అదే విధంగా ఈ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబు మీద తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పడు తాము అక్కడకు వెళ్లమా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని.. మరి తాము కూడా ఆంధ్రాకు వెళ్లి పనిచేయాలా వద్దా అని అన్నారు. బర్త్‌‌డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమా? అని అన్నారు. దేశ రాజకీయాల్లో పనిచేసే క్రమంలో ఏపీకి కూడా వెళ్లబోతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనకు లక్ష ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఏపీ రాజకీయాల్లో తాను కూడా కలగజేసుకోవాల్సిందిగా అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు. చంద్రబాబు గురించి విజయవాడ వెళ్లి మొత్తం చెబుతానన్నారు. తమ గిఫ్ట్ ప్రభావం ఎంతుంటుందో త్వరలో అందరూ చూస్తారన్నారు.
  తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ప్రజకూటమికే అనుకూలంగా ఉన్నాయని నిన్న లగడపాటి రాజగోపాల్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే లగడపాటి ఒకప్పుడు టీఆర్ఎస్ కి అనుకూలంగా సర్వే ఉందని చెప్పి.. ఇప్పుడు ఒత్తిడి వల్ల మాట మారుస్తున్నారు. ఆయన మాటలు ప్రజలు పట్టించుకోవద్దు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై తాజాగా లగడపాటి స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని.. అప్పుడే సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగినట్లు చెప్పారు. సర్వే రిపోర్టులు పంపిస్తానంటే కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామని లగడపాటి చెప్పుకొచ్చారు. వారందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు. టీడీపీ బలం టీఆర్ఎస్‌కు కలిస్తే.. విజయం ఏకపక్షమవుతుందని అన్నానన్నారు. పొత్తులతో వెళ్లాలని తాను సూచించినప్పటికీ.. కేటీఆర్ మాత్రం ఒంటరిపోరుతోనే విజయం సాధిస్తానని తెలిపారన్నారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు.   కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని, నవంబర్‌ 11న కేటీఆర్‌ మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. 37 నియోజకవర్గాల విషయంలో సర్వే చేయగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం ఉందని కేటీఆర్‌కు మెసేజ్‌ పెట్టా. పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే ప్రధానం అవుతారని చెప్పా. మళ్లీ నవంబర్‌ 20న మరోసారి మెసేజ్‌ పెట్టా. అప్పటికీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టీఆర్ఎస్ 65-70 వస్తాయని చెప్పా. వాళ్లకు 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశా. దీనిపై కేటీఆర్‌ స్పందించి దానికంటే ఎక్కువే వస్తాయని నాకు బదులిచ్చారు. ఆ తర్వాత ప్రజల ఆలోచన వేగంగా మారింది అన్నారు. నవంబర్‌ 28 తర్వాత తనకు అనేక రిపోర్టులు వచ్చాయని, ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదన్నారు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పానని.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదని లగడపాటి పేర్కొన్నారు. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యత ఉందని.. ఈ ఉదయమే సమాచారం వచ్చిందన్నారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మూడెకరాల భూమి విషయంలో ఎస్సీ, ఎస్టీలు టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ హామీ బాగా పనిచేసిందని లగడపాటి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని లగడపాటి అన్నారు. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని తెలిపారు. కేటీఆర్, తన మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్నారు. అలాగే తాను ఎప్పుడూ బోగస్ సర్వేలు చేయలేదని లగడపాటి స్పష్టం చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పరిస్థితి గురించి లగడపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 28న తాను గజ్వేల్ కు వెళ్లానని వెల్లడించారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా తన కారును ఆపారన్నారు. తనను వారు గుర్తుపడతారని అనుకోలేదనీ, కానీ ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. తనతో వారు సెల్ఫీలు దిగారన్నారు. గజ్వేల్ లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను అడిగానన్నారు. దానికి ‘పోతారు సార్’ అని ఏడుగురు కానిస్టేబుళ్లు బదులిచ్చారన్నారు. గజ్వేల్ లో ఎవరు పోతారో? ఎవరు గెలుస్తారో? ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని లగడపాటి వ్యాఖ్యానించారు.
  ఖమ్మంలో ప్రజా కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. టీఆర్ఎస్ మీద, బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో దేశ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మోదీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, సీబీఐ, ఆర్బీఐ, గవర్నర్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. జీఎస్టీ వల్ల ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైందని, ధరలు పెరిగి పేదలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని.. దళితులు, ముస్లింలను అభద్రతాభావంతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి అవసరం చాలా ఉందని, ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌తో కలిశామని, తెలుగుజాతి ఐక్యత కోసం టీడీపీ పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరామని ఆయన గుర్తుచేశారు. తెలుగు జాతి ఎప్పటికీ ఒకటిగానే ఉండాలని ఆకాంక్షించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయాల గురించి మోదీని టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. తాను పెత్తనం చేయడానికి రాలేదని, తెలంగాణ ప్రజల హితం కోసం పనిచేస్తానని తెలిపారు. తాను ఇక్కడకు వచ్చి పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు పెత్తనం ఎలా చేస్తానని ప్రశ్నించారు. కృష్ణానదిలో నీళ్లు రాలేదనీ, గోదావరిలో 2వేల టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని వాపోయారు. ఆ నీళ్లను ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయన్నారు. దిగువ రాష్ట్రం.. ఎగువన ఉన్నరాష్ట్రానికి నీళ్లు రాకుండా ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని విధాలా సహకరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తానెప్పుడూ అడ్డుపడలేదని.. తానెక్కడ ఉన్నా తెలంగాణ తనకు ఇష్టమైన ప్రాంతమని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌ను నిర్మించానని తాను చెప్పినట్లు అంటున్నారని.. తాను నిర్మించలేదని, సైబరాబాద్‌కు తన హయాంలో రూపకల్పన చేశామని చంద్రబాబు చెప్పారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేశా.. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశామని గుర్తుచేశారు. విభజన జరిగాక తెలంగాణ మిగులుబజ్జెట్‌లో ఉంది. ఏపీ అప్పులో ఉంది. ప్రత్యేక హోదా సాధించుకుని ముందుకు పోతా అని చెప్పా. ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదు. ఈ రోజు వరకు నేను ఒకే మాట మీద ఉన్నా. కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో నాకేం అర్థం కాలేదు. నన్ను దూషించడం న్యాయమా అని అడుగుతున్నా. నేనేం తప్పు చేశాను? తెలంగాణ అభివృద్ధికి టీడీపీ అడ్డుపడిందా? టీడీపీ లేకుంటే కేసీఆర్ ఎక్కడినుంచి వచ్చేవారు. నాకు సభ్యత ఉంది. నేను కేసీఆర్‌ను విమర్శించను. మీ ఉత్సాహం చూస్తోంటే నూటికి నూరు శాతం కాదు..  వెయ్యి శాతం మనమే గెలుస్తున్నామనిపిస్తోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
  తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడటంతో ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాజాగా  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద విమర్శల వర్షం కురిపించారు. దేశంలో సిగ్గు, శరంలేని వ్యక్తి సీఎం కేసీఆర్‌ ఒక్కరేనని అన్నారు. రాజకీయాలను నీచాతినీచంగా దిగజార్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజాప్రతినిధులనే కాదు.. మీడియాను కూడా కేసీఆర్‌ వదల్లేదని, తెలంగాణలో జర్నలిజం విలువలకు కేసీఆర్‌ పాతరేశారని విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఎక్కువగా మోసపోయింది జర్నలిస్టులే. జర్నలిస్టులకు వందకు వంద శాతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ఎందుకు నిలబెట్టుకోలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలి. ఏ రాజకీయ నేత వ్యవహరించని విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. గర్వంతో ఆయన‌ ఎవరినీ లెక్కచేయడం లేదు అని విమర్శించారు.  ఎంతో మంది కష్ట ఫలితమే తెలంగాణ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర విభజనను ఎంతో మంది అడ్డుకున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌ విషయంలో చాలామంది విభజనను అడ్డుకున్నారు. తెలంగాణ ఇవ్వడం ఎంత కష్టమో ఆలోచించాలి. కష్టతరమైనా సోనియా తెలంగాణ ఇచ్చారని, సోనియా లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదని కొనియాడారు. సోనియాగాంధీ వల్లే రాష్ట్రం సాధ్యమైందని కేసీఆరే స్వయంగా ఒక సందర్భంలో అన్నారని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటును ఎంఐఎం వ్యతిరేకించింది. అలాంటిది ఇప్పుడు అదే ఎంఐఎంతో కేసీఆర్‌ దోస్తీ అంటున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన ఘనత కేసీఆర్‌దే. అధికారంలోకి రాగానే దళిత ముఖ్యమంత్రి హామీని అటకెక్కించి తానే ఆ స్థానంలో కూర్చొన్నారు. రాజకీయ విలువలు కుప్పకూలిపోయే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పాలనలో దేశంలోనే అత్యంత అవినీతి తెలంగాణలో జరిగింది అని విమర్శించారు. 24 గంటల కరెంటు ఇస్తున్నానని చెబుతున్న కేసీఆర్‌.. ఎక్కడ విద్యుత్‌ ప్రాజెక్టులు కట్టారు.. ఎక్కడ విద్యుదుత్పత్తి చేశారని ప్రశ్నించారు. దేశమంతా ఇప్పుడు మిగులు విద్యుత్‌ ఉందన్నారు. ఇలాంటి సమయంలో 24 గంటల విద్యుత్‌ ఇవ్వడం పెద్ద విషయం కాదని అన్నారు. కొత్తగా ఒక్క యూనిట్‌ ఉత్పత్తి చేసిన పవర్‌ ప్రాజెక్ట్‌ గురించి చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క యూనిట్‌ కూడా ఉత్పత్తి చేయలేని దద్దమ్మలు తండ్రీకొడుకులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఒక్కటే కాదు చుట్టు పక్కల రాష్ట్రాలన్నీ మిగులు విద్యుత్‌ రాష్ట్రాలేనని, 24 గంటల కరెంట్‌ కేసీఆర్‌ ఘనత కాదని ఉత్తమ్ పేర్కొన్నారు. రైతుబంధు మొదటి నాలుగేళ్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నాయనే రైతుబంధు పథకం పెట్టారని విమర్శించారు. 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కౌలు రైతులకు రైతుబంధు సాయం చేస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. దుర్మార్గులు మళ్లీ గద్దెనెక్కితే సామాన్యులకు బతుకుండదని అన్నారు. కేసీఆర్‌కు అధికార దాహం తలకెక్కిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా కేసీఆర్‌ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాలుగున్నరేళ్ల క్రితం చెప్పింది ప్రజలు మరిచిపోతారని ఇప్పుడు కేసీఆర్‌ కొత్త హామీలు ఇస్తున్నారు. మేం ఏడాది నుంచి నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెబుతూ వస్తున్నాం. దానిపై కేసీఆర్‌, కేటీఆర్‌ విమర్శలు చేశారు. దక్షిణాది బడ్జెట్‌ మొత్తమైనా సరిపోదని ఎద్దేవా చేశారు అని గుర్తుచేశారు. అసెంబ్లీ రద్దు రోజు ఎవరు ఎవరితో జట్టు కడితే మాకేంటి అన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు వణుకుతున్నారు? అని నిలదీశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తాము పొత్తుపెట్టుకుంటే మీకెందుకు భయమని కేసీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు ఇస్తానంటే చంద్రబాబు అడ్డుపడ్డారా?, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానంటే అడ్డుపడ్డారా?, దళితులకు సీఎం పదవి ఇస్తానంటే చంద్రబాబు పడ్డారా? అని ప్రశ్నించారు. ఎల్‌.రమణ, కోదండరామ్‌, చాడ వెంకటరెడ్డి ఆంధ్రావాళ్లా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఓ బ్రోకర్‌ అని విమర్శించారు. మోదీని చూస్తే కేసీఆర్‌కు భయం. విభజన చట్టంలో ఉన్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ గురించి అడిగే సత్తా లేదు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి కమీషన్లు తీసుకుని ఎన్నికలకు వెళుతున్నారు. మిషన్‌ భగీరథ కింద లక్ష ఇళ్లకైనా నీళ్లిచ్చారా? కేవలం కమీషన్ల కోసమే పనిచేశారు అని విమర్శించారు. డిసెంబర్‌ 11న మహాకూటమి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్‌ 12న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని, కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు, కేటీఆర్‌ అమెరికా పోవడం ఖాయమని ఉత్తమ్‌ అన్నారు. 
  తెలంగాణ రాష్ట్రం ఎన్నికల ప్రచారాలతో హోరెత్తుతోంది. ఇటీవల టీఆర్ఎస్ నేత కేటీఆర్ కొడంగల్ లో ఆ పార్టీ అభ్యర్థి తరుపున ప్రచారంలో పాల్గొని ' టీఆర్ఎస్ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా.. కూటమి ఓడిపోతే నువ్వు రాజకీయాలను వదిలేస్తావా' అని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. అసలే టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడే రేవంత్ ..ఆయనపై సవాల్ చేస్తే ఊరుకుంటారా..ఏకంగా సిరిసిల్లలో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. టీఆర్ఎస్ పార్టీ కొడంగల్ కైవసం చేసుకోవాలి అనుకుంటుంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ సీటుకే ఎసరుపెట్టేలా ఉన్నారు. ఈ నెల 24న రేవంత్‌ రెడ్డి చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలోని గంగాధర, వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు.  కాంగ్రెస్‌ పార్టీ కూడా రేవంత్‌రెడ్డి ప్రసంగాలకు ప్రజల్లో క్రేజ్ ఉండడంతో ఆయనను కీలక నియోజకవర్గాల్లో పర్యటించేలా చూడాలని భావిస్తున్నది. ఇందుకోసం పార్టీ ప్రత్యేక హెలీక్యాప్టర్‌ను సమకూర్చి రేవంత్‌ రెడ్డిని ప్రచారంలోకి దింపుతుందట. కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా న్యాయవాది కేకే మహేందర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. కేకే మహేందర్‌ రెడ్డి తరుపున రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేటలో జరిగే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించనున్నరు. వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ, చందుర్తి మండల కేంద్రాల్లో జరిగే బహిరంగ సభల్లో కూడా రేవంత్‌ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆది శ్రీనివాస్‌ పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రమేశ్‌బాబు ఎంపీ వినోద్‌ కుమార్‌కు సన్నిహిత బంధువు కావడం, వినోద్‌కుమార్‌ కేసీఆర్‌కు అన్ని విషయాల్లో అండదండగా ఉంటుండడంతో రేవంత్‌రెడ్డి ఈ నియోజకవర్గంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ తనతోపాటే కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మేడిపల్లి సత్యంను ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనే లక్ష్యంతో రేవంత్‌ రెడ్డి చొప్పదండి నియోజకవర్గంలో తన మొదటి సభను ఖరారు చేసుకున్నారు. మేడిపల్లి సత్యంను చొప్పదండి అభ్యర్థిగా ఖరారు చేయించడంలో పలు ఆటంకాలు ఎదురైనా రేవంత్‌ రెడ్డి పట్టినపట్టు విడవకుండా రాహుల్‌గాంధీ అండదండలతో విజయం సాధించారు. మేడిపల్లి సత్యంకు చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థిత్వం దక్కడంతో ఇక ఆయనను గెలిపించడం లక్ష్యంగా పెట్టుకొని ప్రచార బాధ్యతను తీసుకున్నారు. 
    `There are too many ways for a hacker to get into your mail` - This statement might sound pathetic. But it’s true! Though the data in our mail might not be so valuable, it’s still a part of our life. Further, information such as banking passwords or confidential reports… if accessed might cause enough damage. These are some of the precautions that were needed without going into the technicalities of hacking.  As much of the users rely on the Gmail, this article was written in the view point of a Gmail user, though it might be helpful for other users as well… While your mail is ON: While we work on the net, we normally keep our Gmail account signed in. But experts warn against this practice, especially when you go through a lot of sites while browsing. A hacker can access your mail by adding filters to your Gmail account which was open by that time. If you are suspicious that such filters might have already been added to your Gmail, go to your Gmail settings and check for the filters section. Consult an expert if your find a filter added to it. Check for the ACTIVITY:   Gmail keeps a track on our moments in and out of the mail. You can find the report of your Gmail activities by clicking the ‘details’ at the bottom of your page (right side). You can view the kind of browser you’ve logged in, the IP address and the time. Cross check the details if you are suspicious about an unauthorized access. Logging out from all sessions   We often tend to open our mail at any place. It might be our office or might be a net cafe.  But are not sure whether we have logged out, while we get back from the place. Keeping your account open at a public place might be a source of entertainment for someone else. Don’t worry! There is a way to get out of this embarrassing situation. Click the `details` at the bottom of the page, and click `sign out of all other web sessions` of the menu. Heed the warnings: Gmail takes enough liberty to warn us. Those warnings might bore us sometimes. But they are indeed of much help to us. Messages such as `This account is open in one other location`, `New sign-in from chrome on windows`, ` The password for your Google Account - *****@gmail.com - was recently changed`… certainly are intended to warn us. It even warns us when someone has tried to access our mail. So let’s think about those warnings and never mark them as spam. Password: It’s the most talked about subject regarding our mail. So let’s wrap it up in a few points. - Never share your password with anyone else, even if you had to share at an emergency… change it immediately. - Use Alphanumerical  and symbols to create a password. - Don’t use the nouns that are associated with you, such as the names of your family members. - Change the password immediately if you are suspicious of an access or if you have received or sent any confidential information. - Be sure of setting a recovery mail through which you can access your mail even if you loose your password.  Don’t allow the ACCESS:   Some sites would often insist on entering into our mail and access our contacts. Never allow such sites to access your mail, until and unless you are completely satisfied about their safety. You might even receive a mail that looks absolutely reliable. Such a mail might ask you in a very pleasing manner to reveal your personal details. Please beware of such mails! Such a practice of abstracting information is called `phishing`- which can be disastrous to your finance.   -Nirjara
  అనగనగా ఓ పేదవాడు ఉండేవాడు. అతనికి తన జీవితం అంటే ఏమాత్రం ఆశ ఉండేది కాదు. తనో నష్టజాతకుడిననీ, ఎందుకూ పనికిరానివాడిననీ అతని నమ్మకం. ఏ పని చేసినా ఫలితం ఉండదని నమ్మడంతో ఎలాంటి పనీ చేసేవాడు కాదు. అతని ఇల్లు కూడా అతని మనసులాగానే ఉండేది. ఇంటినిండా బూజు, మూలమూలలా సాలీడు గూళ్లూ, మురికీ మురుగూ… నష్టజాతకునికి తగినట్లుగా ఉండేది ఆ ఇల్లు. ఓ రోజు తన స్నేహితుడి ఇంటికి ఎవరో స్వామీజీ వచ్చారని తెలిసింది నష్టజాతకునికి. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి `స్వామీ తమరు మా ఇంటికి కూడా వేంచేయండి. మీ కాలి ధూళి సోకితేనన్నా నా ఇంటికి సిరిసంపదలు వస్తాయేమో` అని వేడుకున్నాడు. స్వామీజీ నష్టజాతకుని ఇంటికి రానేవచ్చారు. అతని ఇంటిని చూడగానే ఆయన మొహంలో ఓ చిరునవ్వు విరిసింది `స్వామీ చూస్తున్నారుగా నా దరిద్రం. ఈ దరిద్రం దూరమయ్యేలా ఏదన్నా వరాన్ని అనుగ్రహించండి` అని వేడుకున్నాడు పేదవాడు. స్వామీజీ చిరునవ్వుతో ఓ అందమైన గాజుపాత్రని ఇచ్చి `ఇది నీ ఇంట్లో ఉంచుకుని పనికి వెళ్లు. సకల శుభాలూ చేకూరతాయి`అని చెప్పాడు. ఆ గాజుపాత్రని చూసిన పేదవాడి కళ్లు గాజులా మెరిశాయి. మర్నాడు ఉదయాన్నే నిద్రలేచి పని వెతుక్కుంటూ ఊళ్లోకి వెళ్లాడు. ఉదయాన్నే ఉత్సాహంతో ఎదురుపడిన అతణ్ని చూసి ఎవరో ఓ కూలి పనిని అప్పగించారు. ఎన్నో రోజుల తరువాత తనకు పని దొరకడంతో ఒళ్లు వంచి ఆ పనిని సమర్థంగా పూర్తిచేశాడు పేదవాడు. తను అంత బాగా పనిచేయగలనని అప్పటిదాకా అతనికి కూడా తెలియదయ్యే! తన ఇంట్లో ఉంచిన గాజుపాత్రకి నిజంగానే మహిమ ఉందన్న నమ్మకం ఏర్పడింది అతనికి. ఇచ్చిన పనిని సక్రమంగా పూర్తిచేయడంతో రూపాయికి మరో రూపాయి అదనంగా ఇవ్వడమే కాకుండా, మర్నాడు కూడా రమ్మని చెప్పాడు యజమాని. విజయహాసంతో ఇంటికి వచ్చిన పేదవాడు ఆ గాజుపాత్ర వంక ప్రేమగా చూశాడు. అది ఓ మురికి పట్టిన టీపాయి మీద ఉందన్న విషయం అప్పటికి కానీ అతని స్ఫురణలోకి రాలేదు. వెంటనే ఆ గదిని శుభ్రం చేసి, బూజు దులిపి, గాజు పాత్రలో ఓ నాలుగు పూలని అందంగా అమర్చి చూసుకున్నాక కానీ అతనికి తృప్తిగా అనిపించలేదు. ఆ తరువాత అలసిసొలసి నిద్రపోయాడు. మర్నాటి నుంచి అతని జీవితమే మారిపోయింది. అతని ఉత్సాహం, శ్రద్ధ రెండోరోజు కూడా గమనించిన యజమాని తన దగ్గరే శాశ్వతంగా పనిలోకి పెట్టుకున్నాడు. రోజూ ఉదయాన్నే ఒళ్లు వంచి పనిచేయడం, సాయంత్రం వేళకు ఇంటికి వచ్చి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చేసేవాడు పేదవాడు. తన ఇల్లు చాలా అందమైనదన్న విషయం అతనికి, దాన్ని శుభ్రపర్చుకున్నాక కానీ తెలిసిరాలేదు. ఆదివారం ఆదివారం ఆ ఇంటికి నలుగురు స్నేహితులనూ ఆహ్వానించేవాడు. ఆ రోజంతా విందు, వినోదాలతో మునిగిపోయేవాడు. ఇప్పటికీ అతను చాలామందితో పోలిస్తే పేదవాడే, కానీ తనకి ఏదో లోటు ఉందన్న విషయం అతనికి తోచేది కాదు. ఓ రోజు అనుకోకుండా ఆ గాజు పాత్ర పగిలిపోయింది. అంతే! ఈ దెబ్బతో తన అదృష్టం మాయమైపోతుందని భయపడిపోయాడు పేదవాడు. వెంటనే ఆ స్వామీజీని వెతుక్కుంటూ బయల్దేరాడు. వారం రోజుల పాటు నిద్రాహారాలు మానివేసి, వాకబు చేసుకుంటూ తిరిగితే కానీ అతనికి స్వామీజీ జాడ తెలియలేదు. `స్వామీ మీరు నాకు బహుమతిగా ఇచ్చిన గాజు పాత్ర పగిలిపోయింది. నన్ను క్షమించి, నాపై కరుణ ఉంచి, నాకు మళ్లీ అదృష్టాన్ని కలిగించే మరో పాత్రను ఇయ్యండి` అని వేడుకున్నాడు. పేదవాడి వంక చిరునవ్వులు చిందిస్తూ స్వామీజీ అన్నాడు కదా `నేను నీకు ఇచ్చిన గాజుపాత్రలో ఎలాంటి అదృష్టమూ లేదు నాయనా! నువ్వు విజయం సాధిస్తావన్న నమ్మకాన్ని కలిగించడం కోసం అది ఒక సాకు మాత్రమే! ఒక్కసారి అప్పటి నుంచి జరిగిన సంఘటనలను ఊహించుకుని చూడు. నీ జీవితం బాగుపడింది ఆ గాజుపాత్ర వల్లో, లేకపోతే మారిన నీ దృక్పథం వల్లో నీకే అర్థమవుతుంది!`ఆ మాటలు విన్న పేదవాడు తిరిగి తన ఇంటికి బయల్దేరాడు. అతనికి ఇప్పడు అదృష్టాన్ని కలిగించే గాజుపాత్ర అవసరం లేదు. ఎందుకంటే ఆ గాజుపాత్ర ఇప్పుడు అతని హృదయంలో ఉంది. పైగా అది పగిలే అవకాశం కూడా లేదు!
ఇంగ్లండులో ఒకప్పుడు రోసెట్టి అనే గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. ఆయన దగ్గరకి ఓసారి ఓ నడివయసు మనిషి వచ్చాడు. ఆయన చేతిలో చాలా కాగితాలు ఉన్నాయి. వాటిలో ఒక బొత్తిని రోసెట్టి చేతిలో పెట్టి- ‘ఇవన్నీ నేను వేసిన బొమ్మలు. వాటిని మీరొక్కసారి పరిశీలించి నేను బొమ్మలు గీసేందుకు పనికొస్తానో లేదో తెలియచేయగలరా!’ అని ప్రాథేయపడ్డాడు. నిజానికి రోసెట్టి ఆ రోజు చాలా పనిఒత్తిడిలో ఉన్నాడు. అయినా కూడా పెద్దాయన మాటని కాదనలేకపోయాడు. నిదానంగా ఆ బొత్తిని చేతిలోకి తీసుకుని వాటిలో ఒకో చిత్రాన్నే పరిశీలించసాగాడు. ప్చ్‌! ఆ బొమ్మలు చాలా సాదాసీదాగా ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క చిత్రంలోనూ చిత్రకారుడి ప్రతిభ కనిపించనేలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అవన్నీ నాసిరకంగానూ, ప్రాథమిక స్థాయిలోనూ ఉన్నాయి. ఆ విషయం చెబితే వచ్చిన మనిషి బాధపడతాడని తెలుసు. కానీ ఓ విమర్శకుడిగా ఉన్నమాటని సున్నితంగా అయినా చెప్పక తప్పలేదు. ‘మీ బొమ్మలు ఏమంత గొప్పగా లేవండీ! మరిన్ని మంచి చిత్రాలు గీయాలంటే మీరు చాలా కృషి చేయాల్సి ఉంటుంది,’ అంటూ సుతిమెత్తగా చెప్పాడు రోసెట్టి. రోసెట్టి నోటి వెంట అలాంటి మాటలే వస్తాయని ఆ పెద్దాయనకు తెలుసు. అయినా ఆయన మనసు బాధగా మూలిగింది. ‘మీ విలువైన సమయాన్ని వృధా చేసినందుకు క్షమించండి. మరేమనుకోకపోతే నా దగ్గర మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఓసారి చూడగలరా,’ అంటూ ఇంకో బొత్తిని చేతిలో పెట్టాడు. నిరాసక్తిగా రెండో బొత్తిని చేతిలోకి తీసుకున్న రోసెట్టి  కళ్లు చెదిరిపోయాయి. ఆ చిత్రాలలోని నైపుణ్యం చాలా అసాధారణంగా ఉంది. చిత్రాలలో చిన్న చిన్న వివరాలను కూడా చాలా అద్భుతంగా మలిచాడు చిత్రాకారుడు. ఒక్కమాటలో చెప్పాలంటే తను ఈ మధ్య కాలంలో ఇంత ప్రతిభ చూపిన చిత్రాలను చూడనే లేదు. ‘ఈ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిని గీసిన చిత్రకారుడి భవిష్యత్తుకి తిరుగులేదు. కాస్త ప్రోత్సాహం కనుక ఉంటే... అతను దేశంలోనే గొప్ప చిత్రకారుడిగా నిలుస్తాడు. ఇంతకీ ఇవన్నీ మీ కొడుకు గీశాడా లేకపోతే మీ ఊరిలో ఎవరన్నా కుర్రవాడు గీశాడా. ఎవరతను ఓసారి అతణ్ని నా దగ్గరకి తీసుకురండి. అతణ్ని చూడాలని ఉంది,’ అంటూ ఉద్రేకపడిపోయాడు. ఆ మాటలు వింటూనే పెద్దాయన కంటి వెంట నీరు ఆగలేదు. ‘అయ్యా! ఇవన్నీ నేను వయసులో ఉన్నప్పుడు గీసిన చిత్రాలు. అప్పట్లో నాకు చిత్రాలు గీసేందుకు తగిన ప్రతిభ ఉందనుకునేవాడిని. ఎవరి దగ్గరా శిక్షణ లేకుండానే ఈ చిత్రాలన్నీ గీయగలిగాను. కానీ నాలో ప్రతిభ ఉందన్న విషయం ఏ ఒక్కరూ కూడా ఒప్పుకోలేదు. నా భుజం తట్టి ప్రోత్సహించలేదు. నేను గీసిన చిత్రాలను చూసి మనస్ఫూర్తిగా మెచ్చుకోలేదు. ఎన్నాళ్లని నాలో ప్రతిభ ఉందన్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలను? నిదానంగా నా మీద నాకే అపనమ్మకం మొదలైంది. ఆ న్యూనత నా చిత్రాలలోనూ కనిపించసాగింది. అయినా చేతులాగక అడపాదడపా అనురక్తితో బొమ్మలు గీస్తూనే ఉన్నాను. కానీ అవి ఎలా ఉంటున్నాయో మీరు ఇందాక చూశారుగా!’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.
  లోక్ సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు కూడా వచ్చాయి. మూడు రాష్ట్రాల్లో అధికారం చేపడుతూ కాంగ్రెస్ సంతోషంగా ఉండగా.. బీజేపీ మాత్రం ఈ ఫలితాలతో షాక్ లో ఉంది. ఇదే ఉత్సాహంతో ఫైనల్స్ లో కూడా బీజేపీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ తారసపడ్డారు. అయితే  వారిద్దరూ పక్కనే ఉన్నా 'మాటల్లేవ్.. మాట్లాడుకోటాల్లేవ్' అన్నట్లుగా ప్రవర్తించారు. 2001 డిసెంబరు 13న పార్లమెంట్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఐదుగురు ముష్కరులు ఆయుధాలతో పార్లమెంట్‌ ఆవరణలోకి చొరబడి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ మహిళా కానిస్టేబుల్, పార్లమెంట్‌లో పనిచేసే ముగ్గురు సిబ్బంది, ఓ కెమెరామెన్‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి జరిగి నేటికి 17ఏళ్లు అయిన సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎల్‌కే అద్వానీ, సోనియాగాంధీ సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరై అమరులైన పోలీసులు, జవాన్లకు అంజలి ఘటించారు. అయితే ఈ కార్యక్రమంలో మోదీ, రాహుల్‌ గాంధీ తక్కువ దూరంలో కూర్చున్నప్పటికీ కనీసం మాట్లాడుకోలేదు. కాగా.. మన్మోహన్‌ సింగ్‌ను మాత్రం మోదీ పలకరించడం గమనార్హం. మరోవైపు కేంద్రమంత్రులు విజయ్‌ గోయల్‌, రామదాస్‌ అథావాలే.. రాహుల్‌గాంధీతో కరచాలనం చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మోదీకి హగ్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచిన రాహుల్ గాంధీ.. మరి ఈసారి ఎందుకు పలకరించలేదో అంటూ చర్చలు మొదలయ్యాయి.
  కేసీఆర్ వందకు వంద శాతం ఏపీ రాజకీయాల్లో అడుగుపెట్టి, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి. కొందరు కేసీఆర్ ఏపీకి రావాలి అంటుంటే.. మరికొందరు కేసీఆర్ వస్తే మళ్ళీ చంద్రబాబే సీఎం అవుతారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రి ఆనందబాబు కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే.. ఆంధ్రా రాజకీయాల్లోకి నేరుగా అడుగుపెట్టాలని సవాల్‌ విసిరారు. ఆంధ్రాలోకి వస్తామని మాటలు చెప్పడం కాకుండా.. ధైర్యంగా రావాలని అన్నారు. వైసీపీ, జనసేనలతో తెలంగాణలో చేసిన తెరచాటు రాజకీయాలు కాకుండా బహిరంగంగా కలిసి రావాలని అన్నారు. టీఆర్ఎస్ కారుకు.. బీజేపీ, వైసీపీ, జనసేన, ఎంఐఎం అనేవి నాలుగు చక్రాలుగా మారాయన్నారు. వైఎస్ జగన్‌కు ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలు అక్కర్లేదని, అందుకే రాష్ట్ర వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే ఇక్కడ జనసేన, వైసీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. తెలంగాణలో బినామీ ఆస్తులను సంరక్షించుకోవడానికే జగన్.. కేసీఆర్‌తో సంబంధాలు నెరుపుతున్నారని ఆరోపించారు.
  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ కేసీఆర్‌‌ చేత ప్రమాణస్వీకారం చేయించారు. మధ్యాహ్నం సరిగ్గా 1.25 గంటలకు కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్ రావుతో పాటు ‌కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, మహమూద్‌ అలీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎంపీలు, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఇతర ప్రముఖులు తరలివచ్చారు.
  Your favourite cereal brand Kellogg Company has agreed to stop using terms such as "All Natural" and "100% Natural" on some of its Kashi and Bear Naked brand product labels and pay around $5 million to settle a class-action consumer fraud lawsuit. The settlement by the world's No. 1 maker of breakfast cereal marks the latest such outcome in a recent wave of litigation challenging nutrition claims in food labeling. Under the proposed settlement, Kellogg will drop the terms "All Natural" and "Nothing Artificial" from labeling and advertising for Kashi products containing certain ingredients challenged in the litigation.   Similarly, the terms "100% Natural" and "100% Pure and Natural" will be removed from certain products. Several lawsuits merged into a single case in 2011 accused Kellogg of deceiving consumers by labeling products as "All Natural" when they contained ingredients such as pyridoxine hydrochloride, calcium pantothenate or hexane-processed soy oil. Food labeling litigation is becoming more prevalent as health-conscious consumers demand greater accuracy in packaging and advertising. Kellogg's resolution of this case is part of a trend and a number of companies have altered wording on their products in the face of similar litigation.
  The most important organ of the body, the heart also needs some TLC and what a better and easy way to take care of the heart- YOGA. Watch Dr. C.V. Rao of Kapila Maharshi Yoga Kendram talk about the problems related to heart and what kind of Yoga exercises and tips can be done to cure them and keep the heart beating healthily. https://www.youtube.com/watch?time_continue=76&v=5j8vHWogknA  
  One of the main cognitive functions of brain is the memory. Our memory power depends on the health and vitality of the neurons. These neurons are the building blocks of the most complex and important organ – brain! We are fortunate enough to harness our brains irrespective of the age, studies reveal that brain is capable of forming new neural pathways i.e., learn new facts! Here are few tips to improve your memory power: Firstly, never skip exercise and sleep! Exercise increases blood supply and oxygen supply to brain, exercise enhance the effects of helpful brain chemicals and protect brain cells. Sleep is required for memory consolidation and for the working of brain to its maximum capacity. Take out time to fun, laughter is the best medicine, this holds good for brain as well. Laughter exercises certain areas of brain thus strengthening memory! Stress is the worst enemy of the brain power. Chronic stress destroys brain cells and damages the memory centre. Meditation and exercise improve focus, concentration, creativity and learning skills. Memory boosting diet which mainly consists of : Omega-3-Fats found in sea foods, eating more fruits and vegetables, Grape juice, cranberry juice, peanuts and Green Tea all harness the memory power of the brain! Keep chiseling your brain and keep updating your brain with facts!! Take Care!! - SIRI
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.