Publish Date:May 2, 2014
Publish Date:Apr 28, 2014
Publish Date:Apr 26, 2014
Publish Date:Apr 24, 2014
Publish Date:Apr 15, 2014
Publish Date:Apr 14, 2014
Publish Date:Apr 7, 2014
Publish Date:Apr 3, 2014
Publish Date:Mar 28, 2014
Publish Date:Mar 26, 2014
Publish Date:Mar 25, 2014
Publish Date:Mar 21, 2014
Publish Date:Mar 20, 2014
Publish Date:Mar 19, 2014
Publish Date:Mar 13, 2014

EDITORIAL SPECIAL
  ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు వరుస వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో కోడెల కుటుంబం.. కే టాక్స్ పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. కోడెల కొడుకు, కూతురు మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి. అసెంబ్లీ ఫర్నీచర్ ని సొంత ఫర్నీచర్ లా ఇంటికి తీసుకెళ్లడంపై కూడా కోడెల మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే కోడెల ఇంకా అనేక అక్రమాలు చేసారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన భవనాలను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకివ్వడంలోనూ కోడెల తన మార్కు చూపించారని తెలుస్తోంది. వైద్య ఆరోగ్యశాఖలోని కీలక కార్యాలయాలన్నీ గుంటూరులోని కోడెల భవనానికి తరలించారు. ప్రభుత్వం తన భవనానికి ఎంత అద్దె చెల్లించాలో స్పీకర్‌గా ఉన్న సమయంలో ఆయనే నిర్ణయించారట. ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ చదరపు అడుగుకు 16 రూపాయలు చెల్లిస్తుండగా, కోడెల భవనానికి మాత్రం 25 రూపాయల కంటే ఎక్కువగా చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరుకు గదులు, ఫైర్‌ సేఫ్టీ కూడా లేకపోయినా కోడెల భవనానికి ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన కార్యాలయాలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ఔషధ నియంత్రణ శాఖ, ఫార్మసీ కౌన్సిల్, ఉద్యోగుల వైద్యపథకం వంటివన్నీ.. తొలుత వీటిని విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఇంతలోనే అప్పటి స్పీకర్‌ కోడెల తన భవనం గుంటూరులో ఉందని, దాన్ని అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు అంగీకరించారు. ఉద్యోగులు, పెన్షనర్లు తమ మెడికల్‌ రీయింబర్స్‌మెంటు రాకపోయినా, ఆరోగ్యశ్రీ బాధితులు తమకు అనుమతులు రాలేదని అధికారులను కలవాలన్నా గుంటూరుకు వెళ్లాల్సిందే. ప్రతి చిన్న అవసరానికీ అక్కడకు వెళ్లాలంటే బాధితులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చినా స్పీకర్‌ భవనం కదా అని అధికారులు కూడా పట్టించుకోలేదట.   ఎక్కడైనా భవనానికి మాత్రమే అద్దె వసూలు చేస్తారు, కానీ కోడెల మాత్రం ఖాళీ స్థలానికి కూడా అద్దె తీసుకుని ప్రభుత్వానికి టోకరా వేశారట. ఐదు అంతస్తుల భవనం టెర్రస్‌పై పల్చటి రేకులు వేసి, ఎలాంటి కార్యాలయం లేకపోయినా దానికి కూడా ప్రభుత్వం నుంచి అద్దె వసూలు చేస్తున్నారట. సుమారు 6 వేల చదరపు అడుగుల ఖాళీ స్థలానికి ఒక్కో చదరపు అడుగుకు 25 రూపాయలు చొప్పున రూ. 1.5 లక్షలు వసూలు చేస్తున్నారు. భవనానికి సరైన పార్కింగ్‌ కూడా లేదట. ఇలాంటి భవనానికి నెలకు రూ. 15 లక్షలకుపైనే గత ప్రభుత్వం ‘కోడెల’ ఖాతాలో వేసింది. కనీసం 200 మంది ఉద్యోగులు ఈ కార్యాలయాల్లో పనిచేస్తుంటారు. ఇలాంటి కార్యాలయంలో సరిపోయే కారు పార్కింగు, సరైన మరుగుదొడ్ల వసతులు లేవట. అధికారుల చాంబర్లు కూడా ఇరుకుగా ఉంటాయట. అన్నింటికీ మించి అక్కడకు పనుల మీద వెళ్లే సామాన్యులు గుంటూరు బస్టాండు నుంచి ఆటోకు వెళ్లిరావాలంటే రూ. 200 వరకు ఖర్చవుతుంది. వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆరోగ్యశ్రీ బాధితులు ఇలా ఒకరనేమిటి నిత్యం వెళ్లే ఈ కార్యాలయం అంత దూరంలో ఏర్పాటు చేయడమేంటని వాపోతున్నారు. మరి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై కోడెల ఎలా స్పందిస్తారో చూడాలి.
  ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వస్తేనే, ఉద్యోగ ఉపాధి అవకాశాలతోపాటు అభివృద్ధి జరుగుతుంది. అయితే, పెట్టుబడులు రావడం అంత ఈజీ కానేకాదు. ఎందుకంటే, ఆయా ప్రభుత్వాలపై ఇన్వెస్టర్లకు విశ్వాసం కలిగితేనే, పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. కానీ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పెట్టుబడిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రివర్స్ టెండరింగ్, కాంట్రాక్టుల రద్దు, పీపీఏల సమీక్షలాంటి నిర్ణయాలతో ఏపీ ప్రభుత్వంపై ఇన్వెస్టర్లలో విశ్వాసం సన్నగిల్లుతోంది. పైగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కారణాలేవైనా, వరల్డ్ బ్యాంకు, ఆసియా బ్యాంకులాంటి మేజర్ ఇన్వెస్టర్స్ తప్పుకోవడంతో...ఇప్పటికే వందల వేల కోట్లు పెట్టుబడిగా పెట్టిన పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లలో భయాందోళనలు మొదలయ్యాయి. కర్నాటకకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త టీవీ మోహన్‌దాస్‌ పాయి.... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందని, ఇలాగైతే రాష్ట్రం నాశనం కావడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. జగన్ తీరుతో ఏపీకి కొత్త పరిశ్రమలు రావని, ఆయన వల్ల రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు దేవాలయాల భూములను జగన్ అనుచరులు కొట్టేస్తున్నారని, దీనిపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనే పేరెన్నికగల పారిశ్రామికవేత్త టీవీ మోహన్‌దాస్‌ పాయి... జగన్ ప్రభుత్వంపై ఇలా ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే, టీడీపీ హయాంలో నిర్వహించిన అన్న క్యాంటీన్లకు ఫుడ్ సప్లై చేసిన అక్షయపాత్ర సంస్థకు దాదాపు 45కోట్ల రూపాయల మేర బిల్లులు చెల్లించాల్సి ఉందట. ఈ బిల్లులు చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం నో చెప్పినట్లు తెలుస్తోంది. అన్న క్యాంటీన్లలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, విచారణ తర్వాతే చెల్లింపులు ఉంటాయని తేల్చిచెప్పిందట. ఇదే, టీవీ మోహన్‌దాస్‌ పాయికి ఆగ్రహం తెప్పించిందంటున్నారు. అక్షయపాత్ర బోర్డులో సభ్యుడిగా ఉన్న మోహన్‌దాస్‌ పాయి... జగన్ ప్రభుత్వ నిర్ణయంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడటం, విచారణలు చేయడం వరకు ఓకే కానీ...చేసిన పనికి బిల్లులు చెల్లించమని, చెప్పడం ప్రభుత్వ ఉగ్రవాదం కిందకే వస్తుందని పాయ్ అంటున్నారు. ఏదేమైనా జగన్ ప్రభుత్వంపై ఏ పారిశ్రామికవేత్త కూడా ఈ స్థాయిలో ఆరోపణలు చేయలేదు. మొట్టమొదటిసారి జగన్ టార్గెట్ గా పాయి ఘాటు విమర్శలు చేయడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
  ఇప్పుడంటే పొలిటీషన్లు అందరూ టెక్నాలజీని మంచినీళ్లలా వాడేస్తున్నారు గానీ, ఒకప్పుడు టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా!. ఎందుకంటే, అభ్యర్ధుల ఎంపిక కోసం నైన్టీస్ లోనే ఐవీఆర్ఎస్ సిస్టమ్ వాడిన తెలివైన పొలిటీషియన్ చంద్రబాబు. అయితే, పదేళ్ల నిరీక్షణ తర్వాత 2014లో అధికారాన్ని అందిపుచుకున్న చంద్రబాబు... ప్రజల నాడిని తెలుసుకునేందుకు కూడా అదే టెక్నాలజీని వినియోగించారు. ఏకంగా తన గొంతుతోనే ప్రజలకు ఫోన్లు చేసి ఆశ్చర్యపరిచేవారు. నమస్కారం, నేను మీ చంద్రబాబును మాట్లాడుతున్నా... అంటూ మొదలయ్యే ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్ తో ప్రభుత్వ పనితీరు ఉలా ఉంది?, మీ ఎమ్మెల్యే మీరు అందుబాటులో ఉంటున్నారా? అంటూ ఇలా పలు ప్రశ్నలు అడిగి అడిగేవారు. అయితే, స్వయంగా ముఖ్యమంత్రి స్వరంతో ఫోన్ కాల్ వచ్చేసరికి... ప్రజలు ముందు ఆశ్చర్యానికి, ఆ తర్వాత భయానికి లోనయ్యేవారు. పరిపాలన బాగాలేదంటే ఏమవుతుందో ఏమోనని అన్నీ బ్రహ్మాండగా ఉన్నాయంటూ ఆప్షన్స్ ను నొక్కేవారు. ఇక అధికారుల గానాభజానా సరేసరి. 90శాతం మంది ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారంటూ బాబును మెప్పించేవారు. ఇదే మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు కొంప ముంచింది. అటు ఐవీఆర్ఎస్ సర్వే... ఇటు అధికారుల మాట నమ్మిన చంద్రబాబు... ప్రజల అసంతృప్తిని పసిగట్టలేకపోయారు. ఆఖరి సమయంలో పసిగట్టినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరికి టీడీపీ చరిత్రలో ఎన్నడూలేనంతా దారుణమైన పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడిదంతా ఎందుకంటే, జగన్మోహన్ రెడ్డి పాలనకు వంద రోజులు కూడా పూర్తికాలేదు... కానీ, అప్పుడే 90శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటూ అధికారులు చెప్పుకొస్తున్నారట. ముఖ్యంగా స్పందన కార్యక్రమం టెలీకాన్ఫరెన్సుల్లో అధికారుల నుంచి ఇలాంటి రిపోర్ట్స్ వస్తున్నాయట. దాంతో ప్రజల అసంతృప్తిస్థాయి ఒక్క శాతానికి తగ్గించాలంటూ సీఎం జగన్ సైతం సూచించినట్లు తెలుస్తోంది. అయితే, సేమ్ టు సేమ్ ఇలాంటి మాటలే చంద్రబాబుకి కూడా చెప్పారట, అధికారుల లెక్కల్లో టీడీపీ పాలనపై 85శాతం హ్యాపీగా ఉన్నారని తేలిందట. అధికారుల మాటలను నమ్మిన చంద్రబాబు సైతం 85శాతంపైగా ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారంటూ అనేకసార్లు చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే, 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం. అధికారుల చెప్పిన 85శాతం హ్యాపీకి 23 సీట్లే వచ్చాయి. మరి అప్పుడే జగన్ పాలనకు 90శాతం ప్రజలు సంతృప్తికరంగా ఉంటే, అది రానురానూ 99శాతానికి చేరితే ఎన్ని సీట్లు వస్తాయో?. ఎందుకంటే 85శాతానికి 23 సీట్లు వస్తే... ఈ లెక్కన  99శాతానికి ఎన్ని సీట్లు వస్తాయో! ఏదేమైనా అధికారుల లెక్కలు నమ్మితే అధోగతే...అంతేమరి!
ALSO ON TELUGUONE N E W S
  ఏస్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలయికలో వస్తోన్న మహా ముల్టీస్టారర్ చిత్రం `ఆర్ ఆర్ ఆర్ `. ప్రెసెంట్ ఈ చిత్రానికి సంబంధిచిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రకరించడానికి చిత్ర యూనిట్ త్వరలో బల్గెరియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కేవలం ఎన్టీఆర్ కి సంభందించిన సీన్స్ మాత్రమే షూట్ చేయనున్నారట. ఇక ఈ షెడ్యూల్ పూర్తి అయ్యేవరకు రామ్ చరణ్ కి బ్రేక ఇచ్చాడట రాజమౌళి. ఇదిలా ఉంటె ...ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్స్ కోసం ఇంకా సెర్చింగ్ జరుగుతోనే ఉంది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం ..మరో బ్రిటిష్ అమ్మాయిని ఫైనలా చేసినట్లు సోషల్ మీడియా లో న్యూస్ వస్తున్నాయి .  త్వరలో అధికారికం గా ప్రకటన చిత్ర యూనిట్ ఇచ్చే అవకాశాలున్నాయి.  చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తోంది.  డి వి వి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం నెక్స్ట్ ఇయర్ జులై 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
  'వింక్ క్వీన్' ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న 'శ్రీదేవి బంగ్లా' ఫస్ట్ లుక్ టీజర్ రిలీజైన దగ్గర్నుంచి వివాదాలు మొదలయ్యాయి. ఆ సినిమాలోని కంటెంట్, టైటిల్‌లో దివంగత శ్రీదేవి పేరు ఉపయోగించడం వివాదాలకు మూలం. ఆ టీజర్‌లోని ఒక సీన్‌లో ప్రియా వారియర్ బాత్‌టబ్‌లో పడుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. అది శ్రీదేవి విషాదాంత ఘటనను గుర్తు చేస్తోందనడంలో సందేహానికి తావులేదు. ఆ టీజర్ వచ్చాక శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్ ఆవేదనకు గురయ్యారు. సినిమా టైటిల్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ వెంటనే ఆయన 'శ్రీదేవి బంగ్లా' నిర్మాతకు లీగల్ నోటీసును పంపారు. కానీ ఆ నిర్మాత స్పందించలేదు. దాంతో మరింత కఠినమైన లీగల్ యాక్షన్‌కు బోనీ సిద్ధమవుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. "ఇది స్వేచ్ఛా ప్రపంచం కాబట్టి సినిమాని వాళ్లిష్టం వచ్చినట్లు తీసుకోనివ్వండి.. కానీ శ్రీదేవి పేరును వాళ్లు ఉపయోగించడానికి వీల్లేదు" అని బోనీ చెప్పినట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ వివాదంపై హీరోయిన్ ప్రియా వారియర్ మాట్లాడుతూ "అది డైరెక్టర్, ప్రొడ్యూసర్‌లకు సంబంధించిన విషయం. నేను వాళ్లిచ్చిన కేరెక్టర్‌ను పోషిస్తున్నానంతే. నిజానికి ఎవరి వ్యక్తిగత ఫీలింగ్స్‌ను బాధపెట్టడం మా ఉద్దేశం కాదు" అని తెలిపింది. 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఒక ఫంక్షన్‌లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీదేవి, అక్కడి బాత్‌టబ్‌లో మునిగి మృతి చెందిన విషయం విదితమే.
  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో బన్నీ 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్   వచ్చింది. అయితే ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో ఒకటి సాఫ్ట్ వేర్ కుర్రాడు గా, మరొకటి గ్రామీణ కుర్రాడి పాత్రని తెలుస్తోంది. మరి దీని పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఇటీవల గ్రామీణ కుర్రాడి పాత్రను రివీల్  చేసారు. దానికి మంచి రెస్పాన్స్  వచ్చింది కూడా. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా లో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. టబు కీలక పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. 2020 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.
  యస్.యస్. రాజమౌళి రూపొందించిన 'బాహుబలి', 'బాహుబలి 2' సినిమాల్లో భల్లాలదేవ అనే పవర్‌ఫుల్ విలన్‌గా నటించి, ఆకట్టుకున్న రానా దగ్గుబాటి.. ఇప్పుడు మరో సినిమాలో విలన్‌గా దర్శనమివ్వనున్నాడు. అయితే అది తెలుగు సినిమాలో కాదు, హిందీ సినిమాలో. ఈ ఏడాది బాలీవుడ్‌లో నిర్మాణమవుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటైన 'హౌస్‌ఫుల్ 4'లో రానా ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఇందులో అక్షయ్ కుమార్ మెయిన్ హీరోగా నటిస్తుండగా, రితీశ్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్ మరో ఇద్దరు హీరోలుగా నటిస్తున్నారు. అక్షయ్ జోడీగా కృతి సనన్ కనిపించే ఈ మూవీలో పూజా హెగ్డే, కృతి ఖర్బందా మిగతా ఇద్దరు హీరోల సరసన నటిస్తున్నారు. 'హౌస్‌ఫుల్ 4'కు సంబంధించిన మరో విశేషం.. ఇది రెండు కాలాల్లో జరిగే కథ కావడం. అంటే పునర్జన్మల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ప్రస్తుత కథ లండన్‌లో జరిగితే, పూర్వజన్మ కథ రాజస్థాన్ నేపథ్యంలో జరుగుతుంది. ఇటీవల అక్షయ్, రానా, మిగతా ప్రధాన నటీనట బృందంపై ఒక ఖవ్వాలీ సాంగ్ చిత్రీకరించారు. సంభాషణల ధోరణిలో సాగే ఈ పాటలో అక్షయ్, రానా ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ఒక స్పెషల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు ఫరాద్ సమ్జీ దర్శకుడు. వచ్చే దీపావళికి ఈ సినిమా విడుదలవుతుంది. 'హౌస్‌ఫుల్ 4'లో ప్రతినాయకుడిగా రానా ఎలా రాణిస్తాడో చూడాలి మరి.
  ఇటీవల రాజ్ తరుణ్ ప్రయాణిస్తున్న వోల్వో కార్ అదుపు తప్పి నార్సింగ్ వద్ద ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇక ఒక రోజంతా ఆ కార్ కోసం ఎవరూ రాక పోవడం, రాజ్ తరుణ్ ఆ యాక్సిడెంట్ పై స్పందించక పోవడంతో టీవీ ఛానెల్స్ లో రకరకాల కథనాలు వచ్చాయి. దీంతో ఈ రోజు సోషల్ మీడియా ద్వారా స్పందించాడు రాజ్ తరుణ్. "నిన్నటి నుంచి చాలా మంది కాల్స్ చేస్తూ.. ఎంతో అభిమానాన్ని చూపిస్తున్నారు. అందరికి ధన్యవాదాలు. ఇక నేను రెండు మూడు నెలలుగా నార్సింగ్ సర్కిల్ మీదుగా కార్ లో ప్రయాణిస్తున్నా...అక్కడ తరచుగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ చోటే సడెన్ గా టర్న్ తీసుకోవడం తో  కారు కంట్రోల్ తప్పి ఒక  గోడను ఢీ  కొట్టడం జరిగింది. ఆ శబ్దానికి నా చెవులు దిమ్మెక్కిపోయాయి. కళ్లు కూడా సరిగా కనిపించలేదు. ఒక్కసారిగా హార్ట్‌బీట్ పెరిగిపోయింది. ఒక్కసారి నన్ను నేను చూసుకొని, సాయం కోసం ఇంటికి వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆ ఘటన దగ్గర జరిగిందిదే. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నా. అతి త్వరలో షూటింగ్ లో పాల్గొంటా" అంటూ తన స్పందన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు రాజ్ తరుణ్.
  ఎన్నికలకు ముందు టీడీపీ బలంగా చెప్పిన మాట.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ రాజధాని అమరావతి నుండి దొనకొండకు మారిపోతుంది. కానీ వైసీపీ మాత్రం అబ్బే అలాంటిదేం లేదు.. రాజధాని అమరావతే ఉంటుంది. అంతెందుకు మా పార్టీ అధినేత జగన్ అమరావతిలో సొంతిల్లు కట్టుకున్నారు చూసారా అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగిసాయి. వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయినా రాజధాని విషయంలో టీడీపీ అనుమానాలు వ్యక్తం చేస్తూనే వచ్చింది. అవకాశం రావాలి కానీ రాజధానిని మార్చడానికి వైసీపీ సిద్ధంగా ఉందంటూ టీడీపీ పదేపదే చెప్తూ వచ్చింది. ఇంతలో వరదలు వచ్చాయి. టీడీపీ అనుమానాలు రెట్టింపయ్యాయి. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా కావాలనే కృత్రిమ వరదను సృష్టించారని టీడీపీ ఆరోపించింది. చంద్రబాబు నివాసాన్ని, అమరావతి సమీప గ్రామాలను కృత్రిమ వరదతో ముంచెత్తి, ఈ సాకుని చూపి రాజధానిని మార్చడానికి కుట్ర చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. అయితే వైసీపీ నేతలు అలాంటిదేం లేదని ఖండిస్తున్నారు. కానీ తాజాగా వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు మాత్రం.. జగన్ సర్కార్ కి రాజధానిని మార్చే ఆలోచన ఉందా అని సామాన్య ప్రజలకు సైతం అనుమానాలు రేకిత్తిస్తున్నాయి. తాజాగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. రాజధానిగా అమరావతి సరికాదన్నట్టు అర్థం వచ్చే వ్యాఖ్యలు చేశారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. రాజధాని మారబోతోందంటూ వార్తలు జోరందుకున్నాయి. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఏపీ కొత్త రాజధాని అంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఇప్పుడు దొనకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనడానికి బడా నేతల నుంచి చోటా నేతల వరకు పోటీ పడుతున్నారట. ప్రస్తుతం దొనకొండలో ఎకరం భూమి రూ.20 లక్షల వరకు పలుకుతోంది. కొద్ది రోజుల్లో ఇది కోట్లలోకి చేరుకునే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనంతటికీ కారణం.. రాజధానిగా అమరావతి అనుకూలం కాదని బొత్స చేసిన వ్యాఖ్యలే అంటున్నారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అంత ఈజీగా వ్యాఖ్యలు చేయరని, పరిస్థితి చూస్తుంటే సీఎం జగన్‌ త్వరలోనే దొనకొండను రాజధానిగా ప్రకటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దొనకొండ పేరు హోరెత్తుతుండడంతో చుట్టుపక్కల బడా బాబులు అక్కడి భూములపై కన్నేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు అధికార పార్టీ నేతలు ఇప్పటికే అక్కడ పెద్ద మొత్తంలో భూములు కొని ఉంచారని కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఏపీ రాజధాని నిజంగానే మారనుందా? లేక ఇదంతా ప్రచారానికే పరిమితం కానుందా? అని జగనే తేల్చాలి.
  తాడిని తన్నేవాడు ఒకడుంటే... వాడి తలను తన్నేవాడు మరొకడు ఉంటాడంటారు. తెలంగాణలో ఇప్పుడిలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే, నిన్నమొన్నటివరకు నేతలంతా గులాబీ గూటికి క్యూ కడితే, ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు సైతం కమలం వైపు చూస్తున్నారు. దాంతో ఇప్పటివరకు ఏకఛత్రాధిపత్యంగా నడుస్తోన్న గులాబీ హవాకు మెల్లమెల్లగా గండిపడుతోంది. ఎందుకంటే, రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేము. ఇప్పటివరకు తమకు తిరుగులేదని దీమాతో ఉన్న టీఆర్‌ఎస్‌‌కు ఇప్పుడు బీజేపీ ఫీవర్ పట్టుకుంది. పదవులు దక్కని లీడర్లంతా కమలం గూటికి వెళ్లే ప్రమాదముందనే భయం కారు పార్టీని వెంటాడుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయ వాతావరణం స్లోగా మారుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో నాలుగు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే కాకుండా, కేసీఆర్ కూతురు కవితను ఓడించి, తమ సత్తా ఏంటో చూపించిన బీజేపీ ఈసారి తెలంగాణపై సీరియస్ గా గురిపెట్టింది. దక్షిణాదిన కర్నాటక తర్వాత ఒక్క తెలంగాణలో మాత్రమే పరిస్థితులు పూర్తి అనుకూలంగా ఉన్నాయని గుర్తించిన కాషాయ అధినాయకత్వం....సీరియస్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఏదో తూతూమంత్రంగా కాకుండా, 2023లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకే కేవలం కాంగ్రెస్, టీటీడీపీ లీడర్లనే కాకుండా, అధికార టీఆర్ఎస్ లో అసంతృప్త లీడర్లను గుర్తించి, కమలం గూటికి చేర్చేందుకు స్కెచ్ వేసింది. ముఖ్యంగా టీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వంపై బీజేపీ గురిపెట్టింది. తెలంగాణ ఉద్యమం నుంచి టీఆర్ఎస్ వెన్నంటి ఉన్నా, పదవులు రాని లీడర్లకు గాలమేస్తోంది. 2014లో టీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినా, నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో మాత్రం నాన్చుడి ధోరణినే కొనసాగించింది. రెండోసారి అధికారంలోకి వచ్చాకైనా, పదవుల పంపిణీ జరుగుతుందని ఆశించిన లీడర్లకు నిరాశే ఎదురైంది. దాంతో టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వం తీవ్ర అసంతృప్తికి గురవుతోంది. అ అసంతృప్త నేతలంతా... ఇఫ్పుడు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ వ్యూహాన్ని, ఎత్తుల్ని పసిగట్టిన టీఆర్ఎస్... అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో ఉందట. నామినేటెడ్ పోస్టుల ఆశ కల్పిస్తూ ఆచితూచి వ్యవహరిస్తోందని అంటున్నారు. అయితే, ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్ ద్వితీయశ్రేణి లీడర్లు... కమలం గూటికి చేరేందుకు రంగంసిద్ధంచేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లంతా త్వరలో తెలంగాణకు రానున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌‌షా ఆధ్వరంలో... కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని కంకణం కట్టుకున్న కమలదళం... ఆపరేషన్ ఆకర్ష్‌ను బలంగా చేపడుతోంది.
  అమరావతి... నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని... హైదరాబాద్ ను తలదన్నేలా, వరల్డ్ టాప్-5 సిటీస్ లో ఒక్కటిగా, ప్రపంచస్థాయి మహాపట్టణం నిర్మాణమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేశారు. రైతులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అమరావతి నిర్మాణం కోసం వేలాది ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. రాష్ట్ర విభజనతో కోల్పోయిన హైదరాబాద్ ను మించిన ప్రపంచశ్రేణి పట్టణం నిర్మాణం కావాలని ఆంధ్రులు ఆకాంక్షించారు. అయితే, అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరించకపోయినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు... తన తెలివి తేటలతో వరల్డ్ క్లాస్ డిజైన్స్ తో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం మొదలుపెట్టారు. పునాదులు సైతం పడ్డాయి. అంతలోనే ఎన్నికలు రావడం, టీడీపీ పరాజయం పాలవడంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో, అమరావతి నిర్మాణానికి గండిపడింది. పనులు ఆగిపోయాయి, కార్మికులు వెళ్లిపోయారు. యంత్ర సామగ్రి తరలిపోయింది. దాంతో అమరావతి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. అమరావతిపై సీత కన్నేసిన జగన్ ప్రభుత్వం... తొలి బడ్జెట్ లో కేవలం ఐదొందల కోట్లిచ్చి చేతులు దులుపుకుంది. అదేసమయంలో అమరావతికి భారీ రుణం ఇస్తామన్న వరల్డ్ బ్యాంకు వెనక్కివెళ్లిపోయింది. అలాగే మరో ఇంటర్నేషనల్ బ్యాంకైన ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్‌ సైతం అమరావతి నుంచి పక్కకు తప్పుకుంది... దాంతో అమరావతికి కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ రెండు బ్యాంకులు వైదొలగడానికి టీడీపీ ప్రభుత్వ అవినీతే కారణమని జగన్ సర్కారు ఆరోపిస్తున్నా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతికి రాజకీయ, ఆర్ధిక మద్దతు దొరకడం లేదనేది వాస్తవం. పైగా రాజధాని భూములపై జగన్ విచారణకు ఆదేశించడం కూడా అమరావతికి అవరోధంగా మారిందనే మాట వినిపిస్తోంది. ఏదేమైనా, అమరావతిపై జగన్ ప్రభుత్వానికి అనురాగం లేదని, అందుకే పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నా చూసీచూడనట్లు వ్యవరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే, అమరావతి ప్రాజెక్టు నుంచి రెండు మేజర్ బ్యాంకులు తప్పుకోవడం, రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకోవడంతో... భూములిచ్చిన రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతి భవిష్యత్ అంధకారంలో పడిందని, తమ త్యాగం వృథా అవుతోందని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే, వరల్డ్ క్లాస్ సిటీ లెవల్ నుంచి... దెయ్యాలు తిరిగే పట్టణంగా అమరావతి రూపాంతరం చెందుతుందంటూ ఇంటర్నేషనల్ మీడియా అంచనా వేస్తోంది.
  దాదాపు 50శాతం ఓట్లు... 151మంది ఎమ్మెల్యేలు... 22మంది ఎంపీలు... ఇది మామూలు విజయం కానేకాదు... ఒకవిధంగా చెప్పాలంటే అసాధారణ గెలుపు... ఒకవైపు యువకుడు... మరోవైపు కొత్త పార్టీ... పైగా పెద్దగా రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఈ స్థాయిలో విజయాన్ని కట్టబెట్టారంటే... ప్రజలు అతని మీద పెట్టుకున్న నమ్మకం అలాంటిది. అది అలాంటిఇలాంటి నమ్మకం కాదు... జగన్ వస్తే అద్భుతాలు జరుగుతాయని భావించారు. తమ జీవితాలను ఉద్దరిస్తాడని నమ్మారు. తమ బతుకులు బాగుపడాయని విశ్వసించారు. ఇంకా ఏవోవో అద్భుతాలు జరుగుతాయని ఊహించుకున్నారు. కానీ ప్రజల నమ్మకం వమ్ముకావడానికి ఎంతో సమయం పట్టలేదు. కొత్త ప్రభుత్వం రాకతో ఇసుక ఆగిపోయింది. దాంతో నిర్మాణరంగం మొత్తం కుదేలైంది. ఇసుకతో సంబంధమున్న అనేక విభాగాలకు అసలు పనే లేకుండా పోయింది. దాంతో ఇసుక కార్మికుడి నుంచి ఇంజనీర్ వరకు లక్షలాది మంది రోడ్డునపడ్డారు. ఏ రోజుకారోజు పనిచేస్తేనే కానీ పూట గడవని కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇప్పుడు వీళ్లంతా జగన్ ని తిట్టిపోస్తున్నారు. తామేదో ఊహించుకుని ఓట్లేసి గెలిపించుకున్నామని, కానీ తమ బతుకులు ఇలా రోడ్డునపడతాయనుకోలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు. జగన్ కు ఓటేసినందుకు తమకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనంటూ వాళ్లను వాళ్లే తిట్టుకుంటున్నారు. ఇది వైసీపీ అభిమానులకు ఆగ్రహం తెప్పించువచ్చు, కానీ గ్రౌండ్ రియాల్టీ ఇలాగే ఉంది. విప్లవాత్మక నిర్ణయాలంటూ మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే 20 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆగమేఘాల మీద ఆమోదింపజేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఇసుక పాలసీని మాత్రం డిలే చేయడంలో ఆంతర్యమేంటో అర్ధంకావడం లేదు. పోనీ కొత్త పాలసీ తెచ్చేవరకు పాత విధానం కొనసాగిస్తే పెద్దగా జరిగే నష్టమేంటో తెలియడం లేదు. కేవలం ఈ ఒకే ఒక్క నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ అంతటా ఇసుక తుపాను చెలరేగి విజృంభిస్తోంది. జనాగ్రహం రీడింగ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇది వైసీపీ ప్రభుత్వం ఊహించనిస్థాయికి చేరుకుంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మేల్కోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరూ ఊహించని రేంజ్ లో ఫలితాలు రావడం ఖాయం.
  ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కి వరద ముప్పు ఉందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇంటిని ఖాళీ చేశారు. అయితే ఇదంతా అధికార పార్టీ వైసీపీ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంది. కృష్ణానది ప్రవాహంపై ముందస్తు చర్యలు తీసుకోలేదని, రాజధాని భూముల్లోకి వరద రావాలని కుట్రలు చేస్తున్నారన్నారని.. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపణలు చేస్తున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం ఏపీ సీఎం జగన్ కి ఇష్టం లేదని.. అందుకే అమరావతికి వరద నీరు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారని ఉమా విమర్శించారు. ఈ వరద నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద 4 రోజుల క్రితమే మానిటర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం కావాలనే ఈ వరదను సృష్టించిందని ఉమా ఆరోపించారు. చంద్రబాబు ఇంటిలోకి నీళ్లు తీసుకురావాలన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదని ఉమా విమర్శించారు. వరద పరిస్థితిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రివ్యూ చేస్తాడా? మరి సీఎం ఏం చేస్తున్నాడు? ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నాడు? అని ఉమా ప్రశ్నించారు. అయ్యా జగన్ మోహన్ రెడ్డి.. నీకు మళ్లీ చెబుతున్నా. నువ్వు అమెరికాలో ఉన్నట్లు ఉన్నావ్. ఇక్కడ వర్షం పడలేదు. మున్నేరు, వైరా, కట్లేరు, బుడమేరు వాగుల్లో నీళ్లు రాలేదు. అయినా 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చినా ఇవాళ నువ్వు జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, గద్దె రామ్మోహన్ ఏరియా అంతా ముంచేశావ్ అని విమర్శించారు. రాజధానిని కడప జిల్లాలోని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని జగన్ కుట్ర పన్నారు. అందుకే అమరావతిలో రైతుల భూములు ముంచాలని నిర్ణయించారు. అందుకే శ్రీశైలం దగ్గర నీటిని నిలబెట్టారు అని ఉమా విమర్శలు గుప్పించారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఇటువంటి ప్రచారమే జరుగుతోంది. కావాలనే ప్రకాశం బ్యారేజి గేట్లు ముందే ఎత్తలేదని కొందరు విమర్శిస్తున్నారు. "బ్యారేజి నిల్వ 3 టీఎంసీ లు అయితే అందులో 1.5 టీఎంసీ పూడిక పోతే మిగిలేది 1.5 టీఎంసీ సామర్ధ్యం. భారీ వరద వస్తుంది అని ముందే తెలుసు. నాగార్జున సాగర్  నిండ బోతున్నది  అని తెలుసు అందుకే గేట్లు అన్ని ఎత్తి నీరు కిందకి వదులుతున్నారు, దిగువన ఉన్న పులిచింతల  కూడా నిండుకుండా లా ఉంది అక్కడ నుంచి కూడా నీరు వదులుతున్నారు. ఈ విషయం గత వారం రోజులు గా అందరికి తెలుసు. అధికారులకు ముందే తెలుసు. కానీ ఇప్పటికే పట్టిసీమ జలాలతో నిండుగా ఉన్న ప్రకాశం బ్యారేజి గేట్లు నిన్నటి వరకు ఎందుకు ఎత్తలేదు? నీరు కిందకి  ఎందుకు వదలలేదు.? రోజు కి 4 నుంచి6 లక్షల క్యూసెక్ ల నీటి ని సాగర్ నుంచి వదులుతున్నారు. ముందు గానే ప్రకాశం బ్యారేజి ని కొద్దిగా ఖాళీ చేసి పై నుంచి వచ్చే నీటి ని వచ్చినది వచ్చినట్టు గా కిందకి వదిలితే బ్యారేజి మీద వత్తిడి తగ్గేది.ముంపు ఉండేది కాదు . కానీ లోతట్టు ప్రాంతాలు మునిగినాపర్లేదు అని రెండు రోజులు ఆలస్యం గా గేట్లు ఎత్తిన కారణం కేవలం రాజకీయం. పై నుంచి వస్తున్న భారీ వరద కారణం గా ముంపు కలగాలి. ఆ ముంపుకి లోతట్టు ప్రాంతాలు మునగాలి. ప్రజావేదిక స్థలం , చంద్రబాబు ఉంటున్న ఇల్లు ముంపుకి గురి కావాలి. చూసారా మునిగిపోయే ప్రాంతం లో రాజధాని కట్టారు అని , చంద్రబాబు ఉంటున్న ఇల్లు కట్టిన ప్రజావేదిక మునిగి పోయింది అందుకే రాజధాని ఇక్కడ వద్దు అన్నది.. అనే విష ప్రచారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు  తెలుస్తోంది." "ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎదురు చూశారు. కానీ, ఇంకా కనీసం 2 మీటర్లు అంటే కనీసం మరో 6.5 అడుగులు మట్టం పెరిగితే కానీ, ఆ ఇంటి గార్డెన్ ఏరియా ని టచ్ చేయలేవు. ఈ లోపు కేంద్ర జల శక్తి శాఖనుండి.. బారేజ్ గేట్లు ఎత్తనందుకు  అక్షింతలు పడ్డాయి. ఇంత కౄరమైన ఆలోచన ఎందుకు? అమరావతి కి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేయాలి. అమరావతి మునగాలంటే ఇంకా 23 అడుగులు మట్టం పెరగాలి.. అది జరిగే పని కాదు." అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
  చంద్రబాబుతో మీటింగ్ అంటే, సాధారణంగా ఆయనే మాట్లాడారు. ఆయనే చెబుతారు. ఎంత పెద్ద లీడరైనా, బాబు కంటే సీనియర్ అయినాసరే సెలైంట్ గా వినాల్సిందే. అలాంటింది పార్టీ ఘోర ఓటమి తర్వాత జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. తమ ముందున్నది పార్టీ అధినేత అనే సంగతి మర్చిపోయి లావా లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. రొటీన్‌కు భిన్నంగా హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ లో హాట్‌హాట్‌గా సాగిన మీటింగ్ లో ఒకరిద్దరు నేతలు నిప్పులు చెరిగారు. తమ గుండెల్లో దాగున్న బాధనంతా వెళ్లగక్కారు. ఎన్నడూ అధినేత మాటకు ఎదురుచెప్పని లీడర్లు కళ్లెర్ర చేశారు. ఇదేనా పార్టీలో క్రమశిక్షణ, ఇంతేనా పార్టీలో కొందరి నేతల బాధ్యతా అంటూ శివాలెత్తారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా కాలేదు, అప్పుడే విమర్శలేంటంటూ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తంచేశారు. కొత్త సర్కారుకు కొంత సమయం ఇద్దాం, తప్పులు చేయనిద్దాం, ఆ తప్పులు ప్రజల్లోకి వెళ్లేవరకు ఆగుదాం, ఆ తర్వాతే ప్రజల తరపున రోడ్డెక్కుదామంటూ తన వాదనను కుండబద్దలు కొట్టారు. ఇప్పుడే విమర్శలుచేస్తే టీడీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయంటూ చంద్రబాబు ముందు గట్టిగానే వాదించారట. అయినా ఆకలేసినప్పుడే అన్నం పెట్టాలి... అప్పుడే అన్నం విలువ తెలుస్తుందని, ముందే పెడితే ప్రజలకు అర్ధంకాదంటూ అయ్యన్న చెలరేగి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రజలకు తాను చెప్పే నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చంటూనే, పరోక్షంగా లోకేష్, దేవినేని ఉమాపై విరుచుకుపడినట్లు తెలిసింది. ప్రతి విషయానికీ ట్విట్టర్లోనో, లేదంటే తిట్ల దండకాలో ఎందుకంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ ప్రక్షాళన విషయంలో చంద్రబాబు మొహమాటపడకుండా, కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అయ్యన్న సూచించారు. ఇక టీడీపీలో అత్యంత సీనియర్‌ లీడరైన గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా, గట్టిగానే మాట్లాడారు. ఓడిపోయిన నేతలను ఇంకా నెత్తిన పెట్టుకుని ఊరేగడం కరెక్టు కాదన్నారు. పార్టీలో స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారని, లాయలిస్టులకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ముందే గుండెల్లో బాధను గోరంట్ల బయటపెట్టారు. కొంతమంది డబ్బు సంపాదించి, పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారని, ఇకనైనా అలాంటి తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని కోరారు. పార్టీలో యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే తన టీడీఎల్పీ ఉపనేత పదవిని బీసీకి ఇవ్వాలని సూచించారు. అయితే, బోండా ఉమతో పాటు కొందరు కాపు నేతలను ఉద్దేశించే గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.  అయితే, ఎప్పుడూ గొంతెత్తని నేతలు గుండెల్లో బాధనంతా వెళ్లగక్కుతుంటే, వామ్మో, సీనియర్ నేతల్లో ఇంత ఆక్రోశం దాగుందా అంటూ చంద్రబాబు షాకైనట్లు తెలుస్తోంది. ఒకానొక టైమ్ లో అయ్యన్న సీరియస్‌గా మాట్లాడుతుంటే, కొంతమంది నేతలు వారించినట్టు తెలిసింది. అయితే వెనక్కి తగ్గని అయ్యన్న... నిజాలు మాట్లాడుకుని, లోపాలు సరిదిద్దుకుని, పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవాలనేదే తన ఉద్దేశమని, ఆత్మస్తుతి, పరనిందలా సమావేశం జరిగితే ఉపయోగం ఉండదని రివర్స్ అయ్యారట. అతి విశ్వాసం, ప్రత్యర్థుల బలాన్ని తక్కువగా అంచనా వేయడం, కొందరు నేతల అవినీతిని చూసీచూడనట్టు వ్యవహరించడమే పార్టీ కొంపముంచిందని అన్నట్టు తెలిసింది. అయితే, నేతల మాటలను సావధానంగా విన్న అధినేత, ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని, పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్దామని నేతలకు హామీ ఇచ్చారట.
  జీవితం అంటేనే ఆటుపోట్ల సమాహారం. అందులో ఎప్పుడూ విజయాలే ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఒకోసారి పరాజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఆ పరాజయాలనే పరమపదసోపానాలుగా మల్చుకుంటే బతుకు కావడికుండలాగా సమంగా సాగిపోతుంది. ఇంతకీ ఆ పరాజయాలు నేర్పే పాఠాలు ఏమిటో!   డబ్బు విలువ నేర్పుతుంది చాలా పరాజయాలు ధననష్టంతోనే ముడిపడి ఉంటాయి. అప్పటి వరకూ ఈ చేతికి తెలియకుండా ఆ చేతితో ఖర్చుపెట్టేసిన బంగారుబాబులకి దరిద్రం ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చని తెలిసొస్తుంది. నిజంగా అవసరమైనప్పుడు మన దగ్గర డబ్బు లేకుండా పోవచ్చునని అర్థమవుతుంది. వెరసి... డబ్బు విలువ తెలిసొస్తుంది.   మనుషుల విలువ నేర్పుతుంది ‘విజయానికి బంధువులు ఎక్కువ’ అని పెద్దలు అంటూ ఉంటారు. కాస్తంత కష్టం రాగానే తుపాకీ దెబ్బకి కూడా దొరక్కుండా మన చుట్టుపక్కల జనాలంతా కనిపించకుండా పోవచ్చు. అలాంటి కష్ట సమయాల్లోనే ఎవరు మనవారో, ఎవరు కాదో అర్థమవుతుంది. ఇతరుల దృష్టిలో మన విలువ ఏమిటో తెలిసొస్తుంది. ఎవరి తత్వం ఏమిటో బోధపడుతుంది.   వినయం విలువ నేర్పుతుంది అంతాబాగున్నప్పుడు ఎగిరెగిరి పడుతూ ఉంటాము. మనంతటి వాడు లేడని మిడిసి పడుతూ ఉంటాము. ఒక్కసారి ఎదురుదెబ్బ తగిలితే కానీ మనం కూడా సాధారణ మనుషులమే అని తెలిసిరాదు. కష్టాలకీ, కన్నీళ్లకీ, పరాజయాలకీ, పరాభవాలకీ ఎవ్వరూ అతీతం కాదని తెలిసొస్తుంది. అంతేకాదు! ఇతరులని కూడా ఇక నుంచి గౌరవంగా చూడాలనీ, వినయంతో మెలగాలనీ అనిపిస్తుంది.   లక్ష్యం విలువ నేర్పుతుంది కష్టపడితే ఏదీ కాళ్లదగ్గరకి రాదు. అలా వచ్చేదానికి విలువ ఉండదు. లక్ష్యం ఎంత అసాధ్యంగా ఉంటే దాని ఛేదనలో అంత తృప్తి ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఆ లక్ష్యాన్ని తప్పిపోయినప్పుడు దాని విలువ ఏమిటో తెలిసొస్తుంది. దాన్ని ఏలాగైనా ఛేదించి సాధించాలన్న పట్టుదలా పెరుగుతుంది.   జీవితం విలువ నేర్పుతుంది అప్పటివరకూ ఎడాపెడా సాగిపోయిన జీవితం పరాజయంతో ఒక్కసారిగా నిలిచిపోయినట్లు అవుతుంది. ఆ క్షణంలో మనకి కాలం, కష్టం, కరుణ, దురలవాట్లు, సంతోషం, అడ్డంకులు, ప్రణాళికలు... వంటి అనేక విషయాల గురించి అవగాహన ఏర్పడుతుంది. మన వ్యక్తిత్వం గురించీ, ఆలోచనా విధానం గురించి ఒక స్పష్టత కలుగుతుంది.   - నిర్జర.
  అనగనగా ఓ మధ్యతరగతి ఉద్యోగి. అతను రోజూ తన కార్యాలయానికి వెళ్తూ వస్తూ దారిలో కనిపించే విశేషాలను గమనిస్తూ ఉండేవాడు. అంతా బాగానే ఉండేది కానీ, దారి మధ్యలో కనిపించే ఆ రాజభవనాన్ని చూడగానే ఉద్యోగి మనసు కలుక్కుమనేది. ‘ఆహా! హాయిగా ఆ రాజకుటుంబంలో పుట్టినా బాగుండేది, ఎలాంటి కష్టమూ లేకుండా పట్టుపరుపుల మీద నుంచే అష్టైశ్వార్యాలూ అనుభవించవచ్చు’ అంటూ తెగ ఈర్ష్యపడిపోయేవాడు ఉద్యోగి. రాజకుటుంబం సంగతేమో కానీ ఈ ఉద్యోగిని చూసి అసూయపడేవారు కూడా లేకపోలేదు. రోజూ ఉదయాన్నే ఠంచనుగా ఉద్యోగి గొడుగుని ఊపుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక పళ్ల దుకాణం వాడు అతణ్నే గమనిస్తూ ఉండేవాడు. ‘ఛీ వెధవ బతుకు! చిన్నప్పుడు మా నాన్న మాట విని బుద్ధిగా చదువుకుని ఉంటే హాయిగా ఆ ఉద్యోగిలాగా ఉండేవాడిని కదా! ఉద్యోగం ఉంటే దర్జాగా బతకవచ్చు’ అనుకునేవాడు దుకాణదారుడు.  ఇదిలా ఉండగా ఉద్యోగికి ఓసారి అరుదైన అవకాశం దక్కింది. కార్యాలయం తరఫున యువరాజుని కలిసి కొన్ని సంతకాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ మాట వినగానే ఉద్యోగి ఎగిరి గంతేశాడు. ‘తను ఎప్పటికీ ఆ భోగాలను అనుభవించలేడు. కనీసం వాటిని ఒక రోజు పాటు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది కదా!’ అనుకున్నాడు. రాజభవనంలో తన సమయం ఎలా గడవబోతోందో తెగ ఊహించుకోసాగాడు ఉద్యోగి. అతని ఊహలతో పని లేకుండా ఆ రోజు రానే వచ్చింది. తనకున్న వాటిలో బాగున్న దుస్తులను వేసుకుని, తలని ఒకటికి పదిసార్లు దువ్వుకుని రాజభవనానికి బయల్దేరాడు ఉద్యోగి. ఉద్యోగి రాక గురించి వినగానే యువరాజుగారు నేరుగా అతణ్ని తన మందిరానికి పంపించమన్నారు. యువరాజుగారు పట్టుపరుపు మీద పడుకునో, అలంకరించుకుంటూనో ఉంటారనుకుంటూ బెరుకుగా ఆ గదిలోకి అడుగుపెట్టిన ఉద్యోగికి ఆయన కిటికీ దగ్గర నిల్చొని కనిపించారు. ‘యువరాజా! నేను మీ సంతకాల కోసం వచ్చాను’ అని ఉద్యోగి ఒకటికి రెండుసార్లు చెప్పినా యువరాజుగారు వినిపించుకోలేదు. ఇక లాభం లేదని ఉద్యోగి ఆయనకు దగ్గరగా వెళ్లి చూస్తే ఏముంది… యువరాజుగారు తీక్షణంగా ఆ పళ్లు అమ్ముకునేవాడినే చూస్తున్నారు. ‘యువరాజా! అతనేమన్నా అపచారం చేశాడా? అంత తీక్షణంగా చూస్తున్నారు?’ అంటూ కాస్త చొరవగా అడిగాడు ఉద్యోగి.  ‘అపచారమా పాడా! అతణ్ని చూసినప్పుడల్లా నాకు మహా అసూయగా ఉంటుంది. హాయిగా ఏ రోజుకారోజు కాయకష్టం చేసకుంటూ, వచ్చినదానితో తృప్తిగా బతుకుతూ, భవిష్యత్తు గురించి ఎలాంటి బాధా లేకుండా ఉండే అతని జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో కదా! కావాలంటే దుకాణాన్ని తీసి ఉంచుతాడు, లేకపోతే మధ్యలోనే కట్టేసి తన భార్యాపిల్లలతో కలిసి షికారుకి వెళ్లిపోతాడు. అంత స్వేచ్ఛగా, సాదాసీదాగా జీవించడంలో ఉన్న ఆనందం బందిఖానాలాంటి ఈ రాజభవనంలో ఎక్కడ ఉంటుంది,’ అంటూ నిట్టూర్చారు యువరాజులవారు. యువరాజులవారి మాటలు విన్న ఉద్యోగికి ఏదో కొత్త విషయం బోధపడింది. సుఖానికీ, సంతోషానికీ ఉన్న వ్యత్యాసం తెలిసి వచ్చింది. మరి అదే విషయం దుకాణదారుడుకి ఎప్పుడు తెలిసివస్తుందో!
  ఓ గురువుగారు సీతాపురం అనే పల్లెటూరి గుండా వెళ్తున్నారు. ఆ పల్లెటూరు అలాంటి ఇలాంటిది కాదు. అందులో అందరూ వీరులే! రాజుగారికి ఉన్న సైన్యంలో సగభాగం అక్కడి నుంచే వస్తుంటారు. సాక్షాత్తూ రాజుగారి సైన్యాధ్యక్షుడు కూడా అక్కడి వాడే. మల్లవిద్య, కర్రసాము, కత్తియుద్ధం… ఇలా ఎలాంటి యుద్ధవిద్యలో అయినా సరే, ఆ ఊరి జనానికి సాటి లేదు. అలాంటి సీతాపురం గుండా గురువుగారు వెళ్తున్నారు. అదే సమయంలో వారికి ఆ ఊరిలోనే విడిది చేసి ఉన్న సైన్యాధ్యక్షుడు ఎదురుపడ్డాడు. గురువుగారిని చూసిన సైన్యాధ్యక్షుడు `గురువుగారూ మీ గురించి చాలా విన్నాను. ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎన్నాళ్ల నుంచో ఒక అనుమానం పీడిస్తోంది. దయచేసి నివృత్తి చేయండి` అని అడిగాడు. `నాకు చేతనైతే తప్పక నివృత్తి చేస్తాను. ఏమిటా అనుమానం` అన్నారు గురువుగారు. `మన పెద్దవాళ్లు ఎంతసేపూ స్వర్గం, నరకం అని ఊదరగొడుతుంటారు కదా! నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే వాటికి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి?` అని అడిగాడు. `ఇంత మంచి ప్రశ్న అడిగావు. ఎవరు నువ్వు` అని అడిగారు గురువుగారు. `నేను ఈ రాజ్యానికే సైన్యాధ్యక్షుడిని. రాజుగారి విజయాలన్నింటికీ కారణం నేనే!` అని గర్వంగా బదులిచ్చాడు సైన్యాధ్యక్షుడు. `అబ్బే నిన్ను చూస్తే సైన్యాధ్యక్షునిలా లేవే. ఎవరో పగటివేషగాడిలా ఉన్నావు. నిన్ను చూస్తే నవ్వు వస్తోంది కానీ భయం వేయడం లేదు` అని ఎగతాళిగా అన్నారు గురువుగారు. `ఎంతమాట! నేను పగటివేషగాడిలా ఉన్నానా! నన్ను చూస్తుంటే నవ్వులాటగా ఉందా! నీ నవ్వుని గొంతులోనే ఆగిపోయేలా చేస్తాను. ఉండు!`అంటూ తన కత్తిని దూసి గురువుగారి కంఠానికి గురిపెట్టాడు సైన్యాధ్యక్షుడు. `ఇదే నాయనా నువ్వు చూడాలనుకున్న నరక ద్వారం. నీ కోపంతోనూ, ఉద్వేగంతోనూ, అహంకారంతోనూ… దాన్ని ఇప్పుడే నువ్వు తెరిచావు` అన్నారు గురువుగారు. గురువుగారి మాటలకు సిగ్గుపడి సైన్యాధ్యక్షుడు తన కత్తిన తీసి ఒరలో ఉంచుకుని బాధగా నిలబడ్డాడు. `ఇప్పుడు నువ్వు స్వర్గంలోకి అడుగుపెట్టావు. నీ ఆలోచనతోనూ, ప్రశాంతతతోనూ, పశ్చాత్తాపంతోనూ స్వర్గపు ద్వారాలను తెరిచావు` అన్నారు గురువుగారు చిరునవ్వుతో! అపై సైన్యాధ్యక్షుడిని చూస్తూ ఇలా అన్నారు `చూశావా! స్వర్గం, నరకం రెండూ నీలోనే ఉన్నాయి. నువ్వు అనాలోచితంగా ప్రవర్తించిన రోజు నరకానికి దారిని తెరుస్తావు. జాగ్రత్తగా, ఖచ్చితంగా ఆలోచించగలిగిన రోజు స్వర్గానికి తలుపులు తీస్తావు. స్వర్గనరకాలు ఎక్కడో కాదు, నీ మనసులోనే ఉన్నాయి.` అంటూ సాగిపోయారు గురువుగారు.
  ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. దాదాపు గంట హైడ్రామా తరువాత ఈ అరెస్ట్‌ చోటుచేసుకుంది. ఆయనను అరెస్ట్‌ చేసేందుకు ఆయన ఇంటికెళ్లిన సీబీఐ, ఈడీ అధికారులను వ్యక్తిగత సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు హైడ్రామా నడిచింది. చిదంబరం అరెస్ట్ ఊహించిందే. 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో విదేశీ పెట్టుబడులకు చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా అనుమతిచ్చారని సీబీఐ, ఈడీ చెబుతున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆయన ముడుపులు అందుకున్నారని కేసులు నమోదు చేశాయి. ఈ కేసుల్లో చిదంబరం దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో మంగళవారమే చిదంబరం ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అయితే అక్కడ ఆయన లేకపోవడంతో సీబీఐ బృందం వెనుదిరిగింది. అజ్ఞాతంలో ఉంటూనే.. మరోవైపు ఆయన సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. అయితే ఆయన సుప్రీంను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అరెస్ట్ చేయకుండా ఉండాలని ఇప్పటికిప్పుడు ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అయితే ఊహించని విధంగా బుధవారం రాత్రి 8 గంటలకు ఏఐసీసీ కార్యాలయం వద్ద ప్రత్యక్షమైన చిదంబరం విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. తాను ఏ నేరమూ చేయలేదని.. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనంత మాత్రాన నేరస్థుడిగా పరిగణించాల్సిన అవసరం లేదని చెప్పారు. మీడియా సమావేశం అనంతరం జోర్‌బాగ్‌లోని ఇంటికి చిదంబరం వెళ్లారు. ఆ తర్వాత అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. సీబీఐ, ఈడీ అధికారులు అక్కడికి చేరుకోగా.. చిదంబరం వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నారు. ఎంతసేపటికీ గేటు తెరవకపోవడంతో అధికారులు గోడ దూకి లోపలికి వెళ్లారు. అక్కడ ఆయనతో మాట్లాడి అనంతరం అరెస్ట్ చేశారు. కారులో సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆయన్ను తరలించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాలో కేసులో ఈ రాత్రికి సీబీఐ అధికారులు చిదంబరాన్ని ప్రశ్నించే అవకాశముంది.
  టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ నేత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అంబటి బుధవారం ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదలు వచ్చింది మొదలు వరద వెళ్ళే వరకు రాష్ట్రంవైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. వరదల్లో ఇల్లు మునిగి పోతుందని తెలిసే బాబు హైదరాబాద్ పారిపోయారని ఆరోపించారు. నాగార్జునసాగర్ గేట్లు మూసేసిన తర్వాతనే విజయవాడకు తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. ఇవి కృత్రిమైన వరదలు అని, ఆయన ఇల్లు ముంచాలని ప్రయత్నం చేస్తున్నారు అని చంద్రబాబు సింపతీ పొందాలనే మాటలు మాట్లాడుతున్నారు అని అంబటి మండిపడ్డారు. గొంగట్లో తింటూ వెంట్రుకలు వచ్చాయన్నట్లుగా.. వరద ముప్పు ఉన్న అక్రమకట్టడమైన ఇంట్లో ఉంటూ నన్ను ముంచాలని ప్రభుత్వం చూసిందని చంద్రబాబు ఆరోపించడం సిగ్గుచేటు అని విమర్శించారు. నదీగర్భంలో ఉంటూ  ఇల్లు ముంచేశారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. పేపర్లలో రాయించుకుంటున్నారు. కృష్ణా నదికి వరదలు సృష్టించడం మానవులకు సాధ్యమవుతుందా అని అంబటి ప్రశ్నించారు. 'అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని టీడీపీ హయాంలో దేవినేని ఉమా ప్రకటించారు కదా. మరేమైంది. ఎన్ని కూల్చేశారు. ఏ అక్రమ కట్టడానికైతే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నోటీసులు ఇస్తామన్నారో.. ఇప్పుడు అదే ఇంట్లో చంద్రబాబు ఉన్నారు' అని అంబటి విమర్శించారు.  అదేవిధంగా బీజేపీ నేత సీఎం రమేష్.. అమెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయడానికి నిరాకరించి, జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని చేసిన వ్యాఖ్యలపై కూడా అంబటి స్పందించారు. "అమెరికాలో జ్యోతి ప్రజ్వలన చేయలేదని సీఎం జగన్‌ని హిందూ వ్యతిరేకి అంటున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మతం రంగు పులిమి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అమెరికాలో అగ్గి వెలిగించడం నేరం. అక్కడ ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా జ్యోతిని వెలిగిస్తారు. ఆయనా అదే చేశారు. కమల వనంలో చేరిన పచ్చ పుష్పాలు సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న పచ్చ కోవర్ట్." అని అంబటి విమర్శించారు. ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ లు అయిన అసెంబ్లీ ఫర్నీచర్, రాజధానిపై బొత్స వ్యాఖ్యలు అంశాలపై కూడా అంబటి స్పందించారు. ‘అసెంబ్లీని దేవాలయంగా భావిస్తా. అక్కడ పూజారిగా మాత్రమే ఉన్నానంటున్న కోడెల చివరికి కొబ్బరి చిప్పలను కూడా ఎత్తుకుపోయారు. తన కుమారుడు, కుమార్తెను పూజారులుగా నియమించారు. వస్తువుల్ని దొంగిలించి దొరికిపోయిన తర్వాత.. వాటిని తిరిగి ఇచ్చేస్తున్నామంటున్నారు. కోడెల కుమారుడు, కుమార్తె ఇప్పటికే రాష్ట్రం విడిచి పారిపోయారని వార్తలొస్తున్నాయి’ అని అంబటి విమర్శించారు. రాజధాని విషయంలో మంత్రి బొత్స వ్యాఖ్యల్ని తప్పుగా చిత్రీకరించారని అంబటి మండిపడ్డారు. ‘రాజధానిని అమరావతిలో కట్టొద్దని శివరామకృష్ణన్ చెప్పిన విషయాన్ని మాత్రమే బొత్స ప్రస్తావించారు. అంతేగాని రాజధానిని మార్చుతారని ఆయన ఎక్కడా చెప్పలేదు. అమరావతి, పోలవరంపై చేస్తున్న ప్రచారాలను నమ్మొద్దు. రాజధాని, పోలవరం, అన్న క్యాంటీన్‌లలో టీడీపీ నేతలు వేల కోట్ల రూపాయలు కాజేశారు’ అని అంబటి విమర్శలు గుప్పించారు.
  జగన్ ప్రభుత్వం ఒక పక్క పీపీఏల సమీక్ష, మరో పక్క పోలవరం రివర్స్ టెండరింగ్ లపై తీసుకున్న నిర్ణయాల పై కేంద్రం లోని మోడీ సర్కార్ సీరియస్ గా ఉందని వార్తలు వస్తున్న నేపధ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవినీతిని అడ్డుకునే విషయంలో తమ ప్రభుత్వానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని, వాళ్లిద్దరినీ సంప్రదించాకే జగన్ ఏ నిర్ణయమైనా తీసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన రివర్స్ టెండర్లు, గత ప్రభుత్వంలోని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) గురించి ప్రస్తావించారు. మోదీతో మాట్లాడాకే తమ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకుందని అయన స్పష్టం చేశారు. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను దోచుకుందని, వారందరినీ చట్ట పరిధిలోకి తీసుకు రావాలనేదే తమ దృఢసంకల్పమని అయన చెప్పారు. పీపీఏల సమీక్ష, పోలవరం రివర్స్ టెండరింగ్ లపై జగన్ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రం లేఖలు రాయడంతో పాటు, పోలవరంపై పోలవరం అథారిటీ చైర్మన్ ని నివేదిక అడిగిన సంగతి తెలిసిందే. మరి కేంద్రం అలా చేస్తుంటే, మరోవైపు విజయ సాయి ఏమో అంతా మోడీకి, అమిత్ షా కి చెప్పే చేస్తున్నాం అంటున్నారు. దీని వెనుక మర్మం ఏమిటో ఆ జగన్నాథుడికే తెలియాలి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.