LATEST NEWS
Income Tax officials conducted raids on the premises of Tamil actor Vishal’s production house- Vishal Film Factory (VFF) yesterday. As per reports, the production house has failed to pay Rs. 51 lakh collected as TDS (Tax Deducted at Source). The team is said to have left the office after the VFF staff assured to pay the due amount in two installments.  Earlier, it was wrongly reported in the media that the raid was conducted by the GST Intelligence Agency. A top GST official clarified on it later stating the agency had not conducted any search at VFF. Interestingly, IT raids were conducted on Vishal’s office just a day after the actor criticized a BJP (Bhartiya Janata Party) local leader H Raja who has been leading the charge against actor Vijay's film Mersal for allegedly defaming GST. When a media house asked Vishal regarding IT raids, he clarified saying, “It was TDS assessment by IT wing. Issue needs to be sorted officially and I will do so. The timing of IT department's visit to my office is suspect. The BJP's demand to chop Mersal dialogues is a curb on freedom of expression.” Curiously, no action has been taken against H Raja who directly announced to have watched Mersal online piracy version. If BJP continues to struggle those who question their government or leaders, they will lose faith in public who are already vexed with demonetization and GST schemes.
Indian ace Tennis Player Leander Paes appeared at the Bandra Magistrate Court in Mumbai couple of days ago over the hearing of a domestic violence case slapped on him in 2014 by his former girlfriend and live-in partner Rhea Pillai who demands Rs 1 crore in compensation from him. Pillai claimed that Leander Paes had no interest in taking care of their daughter Aiyana. Rhea has said in her petition: "Paes has always given priority to his own life and neglected the child and her feelings. He has been an absentee father. Besides being out of country for nearly 10 months of the year, he is also not reachable for days at length." Interim, Rhea Pillai's lawyers made a gaffe by mentioning the compensation amount demanded by her in the domestic violence case as Rs 10 lakh and not Rs 1 crore. The lawyers later told Magistrate that the correct amount Rhea had demanded was Rs 1 crore. The missing zero here made all the difference. Rhea Pillai demands one time settlement of Rs 1.43 Cr from Leander Paes. She also demands monthly-maintenance of Rs. 2.6 lakh. Her list of demands includes monetary assistance for buying a mid-budget car in the range of Rs 15-20 lakh. The cars given as examples are Toyota Innova, Toyota Corolla Altis and Honda City. Actual compensation demanded by Rhea was Rs 1 Cr, but the lawyers mistakenly wrote Rs 10 lakhs in the petition.
National Media reports that, Lashkar-e-Taiba (LeT) commander Abu Dujana who was shot dead in Pulwama encounter was actually offered to surrender to Indian military. However, Abu rejected an army officer's proposal.  What's more, Abu Dujana revealed a shocking reason to the officer for him rejecting the offer. His reply to the officer over phone conversation was, if he surrenders to Indian army, his family in Pakistan would be slayed. Furthermore, Abu Dujana also affirmed that there is no such thing like Jihad in Kashmir and Pakistan is playing a game to cheat people in Kashmir.
ALSO ON TELUGUONE N E W S
People in the industry strictly believe in sentiments. If a heroine or director scores a hit, then everyone will run after them. Likewise, if one goes through tough times, it becomes really tough for them to bag offers. Curiously, actress Pooja Hegde who hasn’t had a single hit in her career so far is signing films one after the other. What’s more, she is getting offers in star hero films under prestigious production ventures. Pooja Hegde will next be seen sizzling in a special song in Ram Charan’s Rangasthalam. She is the leading lady in Bellamkonda Sai Srinivas’s film Saakshyam which is slated for release in summer. Pooja has signed Mahesh Babu’s 25th film with Vamsi Paidipally and NTR’s next with Trivikram Srinivas. Besides these films, Pooja has Bollywood project Race 3 and few other movies in her kitty. Oka Laila Kosam, Mukunda and DJ were the Telugu films that Pooja Hegde acted so far and all of them were debacles at box office. She has bad track record in Hindi with her maiden Bollywood venture Mohenjo Daro turned out to be a disaster. That’s why Pooja Hegde is lucky to get star hero films. Seems like, Charan, Mahesh and NTR aren’t considering the negative omen!
Superstar Rajinikanth is in a mood to give chance to debut and small time filmmakers. He introduced director Pa. Ranjith with Kabali and he is presently doing Kaala with the same director.  Latest news is Rajinikanth has given nod to a new film with director Karthik Subbaraj who is known for making critically acclaimed and commercially successful films like Pizza, Jigarthanda and Iraivi. Kalanithi Maran will produce this movie lavishly under Sun Pictures. Interestingly, Rajinikanth announced to enter politics by floating his own political party. Many predicted that, the superstar will bid adieu to films. But, announcement of this new film indicates that he will continue doing films. More details about the project are awaited. On the other hand, Karthik Subbaraj is currently busy wrapping up his upcoming film titled Mercury which has Prabhudeva playing lead role.
మరికొద్ది నెలల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సందడి మొదలుకాబోతోంది. దీనికి అదనంగా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకి ఎలక్షన్స్ జరగనున్నాయి. ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల పండగ కోసం ఎంతోమంది ఎదురుచూస్తారు.. వీరిలో ఓట్లు వేయడం కోసం వెయిట్ చేసే వారు కొందరైతే.. ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆశపడే వారు మరికొందరు. ఇలాంటి వారిలో సినీ సెలబ్రిటీలు కూడా ఉంటారు. దీనిలో భాగంగా దక్షిణాదిలోని నలుగురు సూపర్‌స్టార్లు రాజకీయ రణరంగంలోకి దూకారు. వీరిలో టాలీవుడ్ నుంచి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, కోలీవుడ్ నుంచి రజనీ, కమల్ హాసన్, శాండిల్‌వుడ్ నుంచి ఉపేంద్ర తమ అదృష్టాన్నీ పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే ఫేంలో ఉన్న పార్టీల నుంచి కాకుండా.. కొత్త సిద్దాంతాలు, ఆశయాలతో వీరు నలుగురు రంగంలోకి దిగారు. చేతిలో ఉన్న సినిమాలను ఫినిష్ చేసి.. ఇక తమ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తామని నలుగురు సూపర్‌స్టార్లు ప్రకటించారు. ఈ నలుగురిలో పవన్‌కళ్యాణ్‌‌కు రాజకీయాలతో ముందు నుంచి అనుబంధం ఉంది. అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం విభాగానికి పవన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2009 ఎన్నికల్లో పీఆర్‌పీ తరపున ప్రచారం కూడా చేశాడు. ఇప్పుడు సొంతంగా "జనసేన"ను స్థాపించి.. దానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక "మక్కల్ నీతి మయ్యం"ని కమల్.. "ప్రజ్ఞావంత జనతా పక్ష"ని ఉపేంద్ర ప్రకటించారు.. అయితే తన పార్టీ పేరును.. సిద్ధాంతాలను సూపర్‌స్టార్ రజనీ ప్రకటించాల్సి ఉంది. రాజకీయాల్లో సక్సెస్ అవుతారో లేదో కానీ.. వీరి పోలిటికల్ ఎంట్రీని మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దశాబ్దాల పాటు తమ మార్క్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను వీరు నలుగురు ఎంటర్‌టైన్ చేశారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు.. సినిమాల్లో నటించడం కుదరదు కాబట్టి.. వీరి నుంచి వినోదంతో పాటు సినీ పరిశ్రమకు కూడా ఇది పెద్దదెబ్బే అంటున్నారు క్రిటిక్స్. 
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఇంకేముంది కాజల్ పెద్దమ్మ అయిపోయింది. ఆనందంతో భూమి మీద నిలబడలేకపోతున్న కాజల్‌ తన చెల్లెలి కొడుకు పేరును "ఇషాన్‌" అని ప్రకటించింది. అంతా బాగానే ఉంది కానీ.. తన వెనుక పుట్టిన చెల్లిలికి పెళ్లవ్వడం.. ఆమె ఒక బిడ్డకు తల్లవ్వడం చూసి.. మీ సోదరి జీవితంలో స్థిరపడినట్లే.. మరి మీ పరిస్థితేంటని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కాజల్‌ను ప్రశ్నిస్తున్నారు. లక్ష్మీకళ్యాణంతో తెలుగునాట అడుగుపెట్టిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ... వరుస బ్లాక్ బస్టర్లతో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. ఆమెతో ప్రయాణం స్టార్ట్ చేసిన హీరోయిన్లంతా పెళ్లి చేసుకుంటుండగా.. కాజల్ మాత్రం పెళ్లిపై నోరు మెదపడం లేదు. ధైర్యం చేసి ఎవరైనా పెళ్లెప్పుడు అనడిగితే.. సరైనోడు దొరకాలి కదా అని తడుముకోకుండా సమాధానం చెబుతోంది. నిద్రలో లేపి అడిగిన సేమ్ ఆన్సర్ ఇస్తూ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేస్తోంది. అప్పట్లో ముంబైకి చెందిన ఓ టాప్ బిజినెస్ మెన్‌తో ఈ అమ్మడు ప్రేమాయణాన్ని సాగిస్తోందని.. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాయని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత అవన్నీ గాలి వార్తలుగా తేలిపోయాయి. పోనీ ఏదైనా గుడ్‌న్యూస్ చెబుతుందా అని ఎదురుచూస్తే... వరుస పెట్టి సినిమాలకు కమిటవుతున్న న్యూసే కానీ.. పెళ్లి కబురు లేదు. మరి.. కాజల్, ఆ శుభవార్త అభిమానుల చెవిన ఎప్పుడు వేస్తోందో.. వేచి చూడాల్సిందే.
మహేశ్ భరత్ అనే నేను, బన్నీ నా పేరు సూర్య సినిమాల మధ్య రిలీజ్ డేట్ కోసం వచ్చిన క్లాష్‌కి ఎండ్ కార్డ్ పడింది. మహేశ్ సినిమా వారం ముందుకీ... బన్నీ సినిమా వారం వెనక్కీ వెళ్లిపోయాయి. దిల్‌రాజు, కేఎల్ నారాయణ, అల్లు అరవింద్, జెమిని కిరణ్, సురేశ్ బాబు తదితర పెద్దలంతా కూర్చొని మాట్లడటం వల్ల ఇరు పక్షాల వల్ల రాజీ కుదిరింది.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు నష్టపోకూడదని.. పరిశ్రమకి ఇది మంచిది కాదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని భుజాల మీద చేతులు వేసుకుని... ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే రెండు నెలల క్రితం ఈ ఆలోచన రాలేదా..? ఎవరి కోసం వెనక్కి తగ్గాల్సి వచ్చింది.. అప్పుడు గుర్తుకు రాని ఆరోగ్యకరమైన వాతావరణం.. ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని సోషల్ మీడియాలో నిర్మాతలపై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. నా పేరు సూర్య, భరత్ అనే నేను సినిమాలను మొదట ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని భావించారు. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రావడం మంచిది కాదని.. ఎవరో ఒకరు మనసు మార్చుకోవాలని బయ్యర్లు కోరారు. మాట వరసకు ఇరు పక్షాలు అడపాదడపా కూర్చుంటున్నాయి. తప్పించి.. ఆ చర్చలు ఒక దారికి రాలేదు. ఎవ్వరూ వెనక్కి తగ్గలేదు.. ఎందుకంటే ఎవరో ఒకరు తగ్గుతారులే అన్న ధీమా.. అయితే సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సినిమా "కాలా"ను ఏప్రిల్ 27నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో.. ఇద్దరు నిర్మాతలు నిద్రలోంచి లేచారు.. మీటింగ్‌ల మీద మీటింగ్‌లు పెట్టి.. ఎలా ముందుకు వెళ్లాలి అంటూ చర్చలు జరిపారు. రజనీ వస్తే రెండు సినిమాలకు మంచిది కాదని.. ఇద్దరం కాంప్రమైజ్ అవుదామని డిసైడ్ అవ్వడంతో మహేశ్ ఏప్రిల్ 20కి.. బన్నీ మే 4కి షిఫ్ట్ అయ్యారు. మొత్తానికి ఇరు పక్షాలు కలిసి రజనీకి దారిచ్చారు.
వచ్చే ఎన్నికల నాటికి తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా పాగా వేయాలని భారతీయ జనతా పార్టీ వేసిన ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి జనంలో ఆదరణ తగ్గి.. వైసీపీ పుంజుకుంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించి.. అందుకు తగినట్లుగా వ్యూహారచన చేశారు కమలనాథులు. జగన్‌ను బలపరిచేందుకు అస్త్రశస్త్రాలను కూడా రెడీ చేసి పెట్టింది. వీరి బంధంపై ముందు నుంచి వార్తలు వచ్చినప్పటికీ.. రాష్టపతి ఎన్నికలకు మద్దతు.. సంఘ్ పరివార్ నేతలతో వైసీపీ నేతల మంతనాలతో.. వైసీపీ-బీజేపీ ఫ్రెండ్‌షిప్ రాజకీయ సమాజానికి తెలిసింది.   సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీజేపీ కనుక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటానని జగన్ ఓపెన్‌గా చెప్పడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. ఇలోగా బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపుల్లో అన్యాయం జరగడం.. టీడీపీ-బీజేపీ మధ్య అగ్గిని రాజేసింది. మాటల యుద్దం శృతిమించిపోయి.. తెగదెంపులు చేసుకుంటేనే మంచిదనే స్థాయికి వ్యవహారం వెళ్లింది. ఇక ఏ క్షణమైనా కమల దళం నుంచి సైకిల్ పక్కకు తప్పుకోకతప్పదని.. జగన్‌తో చనువు పెంచుకోవచ్చు అనుకుంటున్న టైంలో.. మారిషస్ ప్రభుత్వం ప్రధాని మోడీకి షాకిచ్చింది. ఇందూ టెక్ జోన్ వ్యవహారంలో తాము పెట్టిన పెట్టుబడులు నష్టపోయామని.. తమకు న్యాయం చేయాలంటూ మారిషస్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. కోర్టు భారతప్రభుత్వానికి నోటీసులు పంపింది.   ఈ వ్యవహారంలో మోడీకి నోటీసులు పంపడంతో పాటు.. ఆర్థిక, వాణిజ్య పన్నులు, న్యాయ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రులను ప్రతివాదులుగా చేర్చింది. ప్రధానమంత్రికే నోటీసులు వచ్చేలా.. ప్రధాని కార్యాలయానికే మచ్చ తెచ్చేలా పరిణమించిన.. జగన్ అక్రమాస్తుల కేసుపై ప్రధాని మోడీ ఆగ్రహాంతో ఉన్నట్లు పోలిటికల్ టాక్. ఉన్నపళంగా పార్టీ నేతలతోనూ.. కేంద్రమంత్రులతోనూ సమావేశమై నోటీసుల గురించి చర్చించారట. ఇప్పటి వరకు మచ్చలేని పార్టీగా బీజేపీకి గుర్తింపు ఉంది. రాజకీయలబ్ధి కోసం అవినీతిపరులతో చేతులు కలిపితే... పార్టీపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని.. ఇప్పటికే విజయ్ మాల్యా, నీరవ్ మోడీ ఘటనలతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో.. జగన్‌తో ప్రయాణంపై మోడీ- అమిత్‌షాలు ఆలోచనలో పడ్డట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అభిమానులు పెరుగుతున్నారు. వీరిలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఉన్నారు. సీఎంగా ప్రజారంజక పాలన, సమస్యలను సైతం సవాళ్లుగా తీసుకుని.. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఆయన పనితీరే అందుకు కారణం. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన సంస్కరణలు, అడ్మినిస్ట్రేషన్, ఐటీ హంగులతో హైటెక్ సీఎంగా.. సీఈవో ఆఫ్ ది స్టేట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రబాబు. ఈ విధానాలతో ఆనాడు దేశంలోని ఎంతో మంది ముఖ్యమంత్రులకు మార్గదర్శిగా నిలిచారు. ఇక వ్యూహ, ప్రతివ్యూహాలు, రాజకీయ చతురతలో చంద్రబాబును అపర చాణుక్యుడిగా పేర్కొంటారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి బాబు జీవితం ఒక పాఠం.   తాజాగా తమిళనాట కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సినీనటుడు కమల్‌హాసన్ తనకు చంద్రబాబు హీరో అని వ్యాఖ్యానించారు. ఇప్పుడే కాదు గతంలో ఒక జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కమల్.. టీడీపీ అధినేతను ఆకాశానికెత్తేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలే బలమైనవని.. కానీ దేశసమైక్యత కోసం రీజనల్ పార్టీలు.. నేషనల్ పార్టీలతో కలిసి పనిచేయాలని.. అవసరమైతే హక్కుల కోసం తిరగబడాలని చంద్రబాబును ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. జాతీయ- ప్రాంతీయ పార్టీల మధ్య వుండాల్సిన సంబంధం ఇదీ అని చంద్రబాబు దేశానికి తెలియ చేసారని.. మిత్ర పక్షంగా ఉంటూనే హక్కుల కోసం పోరాడటం, బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని చాలా ఖచ్చితం గా ప్రశ్నించడాన్ని దేశంలోని ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాల్సిందే అని చెప్పుకొచ్చారు.   2014కు ముందు ఏదో చేస్తాడని.. దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలుపుతాడని.. కయ్యానికి కాలు దువ్వుతోన్న చైనా, పాక్‌లకు ధీటైన జవాబిస్తాడని సోషల్ మీడియాలో "నమో.. నమో.. నమో" అంటూ ఆయన్ను ఆకాశానికెత్తేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది అంతా సవ్యంగానే జరుగుతోందన్న భ్రమలు కల్పించినా.. ఆ తర్వాతి ఏడాదికి సగటు భారతీయుడికి వాస్తవం తెలిసొచ్చింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, బ్యాంకింగ్ రంగంపై ఆంక్షలు ఇలా ప్రతి అంశమూ.. సామాన్యుడిని ఇబ్బంది పెట్టడంతో మోడీ ప్రభ నానాటికీ తగ్గిపోతోంది. దానికి తోడు తన మాట వినని వారిని నరేంద్రుడు ఏం చేస్తున్నాడో రోజూ చూస్తూనే ఉన్నాం.   విభ‌జ‌న హామీల విష‌యంలో బీజేపీతో చంద్ర‌బాబు క‌య్యానికి కాలుదువ్వుతున్న స‌మ‌యంలో.. మోడీని ఢీకొనే స‌రైన నేత‌గా బాబుకు జాతీయ స్థాయిలో ఆద‌ర‌ణ పెరుగుతోంది. ఇప్పుడు బాబు నా రోల్ మోడల్ అని చెప్పడం ద్వారా.. కమల్ హాసన్ జాతీయ స్థాయిలో కొత్త సమీకరణలకు తెరలేపాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ చంద్రబాబు తృతీయ ఫ్రంట్‌కు పూనుకుంటే.. దానిలో తనకూ స్థానం కల్పించాలని యూనివర్శిల్ హీరో ముందుగానే.. ఏపీ ముఖ్యమంత్రిని దువ్వుతున్నాడా అంటూ రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. 
దేశంలోని ఇతర రాజకీయ పార్టీలతో పోలిస్తే.. క్రమశిక్షణకు, కఠిన నియమాలకు పెట్టింది పేరు భారతీయ జనతా పార్టీ. కానీ ఇటీవలికాలంలో ఆ పార్టీ నేతలు కట్టుతప్పుతూ జనంలో బీజేపీని చులకన చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకహోదా, విభజన సమస్యలు తదితర అంశాల్లో న్యాయం చేయాలని కోరుతున్న ఆంధ్రప్రదేశ్ వాదనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోక పోగా.. ఏపీ కోసం మాట్లాడుతూ.. తమను ప్రశ్నిస్తున్న వారిని బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు.   తాజాగా ప్రత్యేకహోదా అంశంపై ఓ టీవీ ఛానెల్ డిస్కషన్‌లో పాల్గొన్న.. సినీనటుడు శివాజీపై బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు.. ప్రజలు ఇంకా సహనంతో బీజేపీ నేతలను మాట్లాడనిస్తున్నారని.. ఇంకా ఎక్కువ మాట్లడితే తరిమి, తరిమి కొడతారని శివాజీ అనడం .. అక్కడే ఉన్న కాషాయ దళానికి చిర్రెత్తుకొచ్చి ఆయనపై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పద్మపై కూడా దాడికి దిగబోతే పక్కనున్న ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. అసలు బీజేపీకి ఏమైంది.. ఎందుకు ఇంతలా అసహనాన్ని ప్రదర్శిస్తున్నారంటే.. ఒకప్పటి బీజేపీలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్తలే.. నేతలుగా ఎదిగారు.   కఠినమైన నియమాలతో.. గట్టుదాటితే తీవ్రమైన చర్యలు తీసుకునే ఆర్ఎస్ఎస్‌ శిక్షణతో.. బీజేపీలోకి అడుగుపెట్టిన వారు ఇప్పటికీ అదే దారిలో వెళ్తున్నారు. వేరే పార్టీల నుంచి వచ్చిన వలసనేతలకు బీజేపీ నియమాలు తెలియవు కాబట్టి.. ఎవరైనా ప్రశ్నిస్తే.. ఏం సమాధానం చెప్పాలో తెలియక.. అక్రోశంతో భౌతిక దాడులకు దిగుతున్నారు. దాని వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందే తప్ప.. పరిష్కారం కాదన్నది వారు గుర్తించాలి. శివాజీపై జరిగిన దాడి ఏ పవన్ కళ్యాణ్ మీదనో.. మరే ఛరిష్మా ఉన్న నేత మీదో జరిగి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పటికైనా అగ్రనాయకత్వం చర్యలకు దిగి.. కట్టుదాటుతున్న నేతలను క్రమశిక్షణలో పెట్టాలని సోషల్ మీడియాలో వాదనలు వినిపిస్తున్నాయి.
జాతీయ పార్టీల హవా ఉత్తరాదిలో నడిచినట్లు దక్షిణాదిలో నడవదు. ఇక్కడ బలమైన ప్రాంతీయ పార్టీల ముందు వాటి ఆటలు సాగవు. ఎంతపెద్ద కొమ్ములు తిరిగిన నేషనల్ పార్టీలైనా సరే... రీజనల్ లీడర్ల సాయం లేకుండా అడుగు కూడా ముందుకు వేయలేరన్నది ఓపెన్ సీక్రెట్. ఒకప్పుడు కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీ హైకమాండ్ చేసిన పొరపాట్లతో చేతులారా తన ఘోరీని అదే కట్టుకుంది. ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకుంటే తప్ప జనం గుర్తించలేని పరిస్థితికి కాంగ్రెస్ చేరుకుంది. సరే.. అదిప్పుడు గడిచిన కథ.. వర్తమానంలోకి వస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిలో స్ట్రాంగ్‌గా ఎదగాలని కంకణం కట్టుకుంది.   కర్ణాటకలో అల్రెడీ ఒకసారి పవర్ రుచి చూసింది కాబట్టి.. అక్కడ అంతో ఇంతో బెటర్‌గానే ఉంది.. ఇక జయ మరణంతో తమిళ రాజకీయాల్లో వేలుపెట్టిన కమలం.. రజనీ సపోర్ట్‌తో కానీ.. అన్నాడీఎంకే అండతో కానీ నాలుగు సీట్లు వెనకెసుకునే ప్రయత్నాల్లో ఉంది.. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో కేసీఆర్‌ ఎత్తుల ముందు కాషాయం నిలబడలేదు. ఎటోచ్చి ఆంధ్రప్రదేశ్‌లోనే పరువు కాపాడుకోవాలి.. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జతకట్టి రెండు ఎంపీ స్థానాలతో పాటు నాలుగు అసెంబ్లీ స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.   అయితే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీని వదిలించుకునేందుకే బీజేపీ పెద్దలు రాజకీయాన్ని.. నడిపారని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. మిత్రధర్మాన్ని పాటించకుండా... ఎక్కడ దొరికితే అక్కడ తెలుగుదేశాన్ని కార్నర్ చేసింది బీజేపీ. ముఖ్యంగా సోము వీర్రాజు వంటి నేతలైతే ఢిల్లీ అండదండలతో ఏకంగా ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు చేశారు. ఇంతకాలం ఓపికగా భరించిన టీడీపీకి తాజా బడ్జెట్‌తో తాడోపేడో తేల్చుకోవాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చింది. దీనిలో భాగంగా తమ డిమాండ్లకు ఒప్పుకుంటే సరే.. లేదంటే ఎవరి దారులు వారు వెతుక్కోవడమే అన్న సంకేతాలు ఇచ్చారు టీడీపీ అధినేత.   తెలుగుదేశం పక్కకు తప్పుకున్నా.. జగన్ అండతో గట్టెక్కాలని కమలనాథులు భావిస్తున్నప్పటికీ.. అదంత తేలిక కాదు.. వైసీపీ అధినేత జగన్ పట్ల ప్రజల్లో విశ్వాసం లేదు.. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో.. ఏ మాట మీద నిలబడతాడో ఆయనకే కాదు.. పార్టీ శ్రేణులకే అర్ధం కాని అయోమయ పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే బీజేపీకి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయే అన్న చందాన తయారవుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని వదులుకుంటే.. కాంగ్రెస్, వామపక్షాల లాగా ఎవరో ఒకరు రాకపోతారా..? అన్నట్లు ఎదురుచూసే తోక పార్టీల లాగా బీజేపీ మారిపోతుందని విశ్లేషకుల అంచనా.
వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి.. జనాన్ని ఆకర్షించడానికి వైసీపీ అధినేత జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విభజన హామీలు, ప్రత్యేకహోదా సాధన కోసం తన ఎంపీల చేత పార్లమెంట్‌లో ఆందోళన చేయించిన జగన్.. ప్రత్యేకహోదా నినాదంతో సెంటిమెంట్‌ను రగిల్చే ఆలోచన చేస్తున్నారు వైసీపీ అధినేత. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశంగా ప్రత్యేకహోదాని చేర్చేశారు కూడా. ఈలోపు జనాన్ని అటెన్షన్ చేయడానికి తన కార్యచరణను ప్రకటించారు. మార్చి 1 నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టరేట్‌‌ల ముట్టడి.. 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని.. అప్పటికి కేంద్రం దిగి రాకపోతే.. ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు.   ఈ వేడి ఇంకా చల్లారకముందే నిన్న మరో బాంబు పేల్చారు ప్రతిపక్షనేత.. ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని.. అందుకు టీడీపీ సహకరిస్తుందా..? టీడీపీ ఆ పనిచేస్తే.. తాము మద్దతు ఇస్తామంటూ సవాల్ విసిరారు. ఒకవైపు బీజేపీతో పొత్తు ఉంచుకోవాలా..? తెంచుకోవాలా..? అన్న దానిపై క్లారిటీ కోసం ఎదురుచూస్తోన్న చంద్రబాబుకు.. ఇప్పుడు బీజేపీతో పాటు జగన్‌ని కూడా ఏకకాలంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన సుధీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఇలాంటి సంక్షోభాలను ఎన్నింటినో చూసి.. తలపండిపోయిన టీడీపీ అధినేతకు ఇదేమంత కష్టమైన పని కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.   ఇందుకోసం మొదటగా మార్చి 5వ తేదీనే తన గేమ్ ప్లాన్‌ను అమలు చేయబోతున్నారట ఏపీ ముఖ్యమంత్రి. మార్చి 5వ తేదీ నుంచి చివరి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రానిపక్షంలో.. ఆ రోజే బీజేపీకి తొలి షాక్ ఇవ్వాలనుకుంటున్నారట.. మార్చి 5న టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే.. అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ వార్తలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొత్తానికి వైసీపీ కంటే ముందుగానే కేంద్రాన్ని ఒత్తిడిలో పడేసేందుకు చంద్రబాబు తెరవెనుక పావులు కదుపుతున్నారట.
ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని.. అవినీతిని ఎండగడతానని పార్టీ పెట్టిన సినీనటుడు పవన్ కళ్యాణ్. అప్పట్లో ఎన్నికలకు రెడీ అవ్వకపోవడం.. అభిమానులు తప్ప కార్యకర్తలు లేకపోవడంతో.. టీడీపీ-బీజేపీ తరపున ప్రచారం చేసి పెట్టాడు. ఆ తర్వాత రాజకీయాలను పక్కనబెట్టి.. మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు. తీరా మళ్లీ ఎన్నికలు దగ్గరకొచ్చేయడంతో.. షూటింగ్‌లకు పెకప్ చెప్పేసి.. రాజకీయ రణరంగంలోకి దిగాడు. బస్సు యాత్రలు.. ఆ యాత్రలు చేస్తూ.. పొలిటికల్ లీడర్‌గా మారే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. మేధావి వర్గం గానీ.. ప్రజలు కానీ కల్యాణ్ బాబుని.. పొలిటికల్ బాబుగా గుర్తించడానికి ఒప్పుకోవడం లేదు.   పార్టీని నిర్మించుకోవాల్సిన టైంలో సినిమాలు తీస్తూ.. జనసేనని గాలికొదిలేయడంతో పార్టీకి ఒక స్ట్రక్చర్ లేకుండా పోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే అటకెక్కింది అనుకున్న ప్రత్యేకహోదా మళ్లీ తెరపైకి రావడంతో పవన్‌కి బాగా కలిసొచ్చింది. విభజన హామీల అమలులో ఎవరి తప్పు ఎంతుందో అందరి లెక్కలు తేలుస్తానంటూ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడు. ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అంటూ రాజకీయాలను వదిలేసిన వారిని, ఎవరికీ పట్టకుండా పోయిన మేథావుల్ని వెతికి పట్టుకొచ్చి మరీ ఒక చోటు కూర్చొబెట్టాడు జనసేనాని.. నిజంగా ఇది మంచి ప్రయత్నమేనని.. పవన్ ఇప్పుడిప్పుడే రాజకీయవాదిగా మారుతున్నాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు కూడా. ఆ పొగడ్తలతో పాటు మరో రకం పెదవి విరుపులు కూడా వినిపిస్తున్నాయి.   రాజకీయంగా ఎలాంటి నాలెడ్జ్ లేని పవన్ కళ్యాణ్.. జనసేనకు ఒక రూపం ఇవ్వలేక విమర్శలపాలవుతున్న పవన్ కళ్యాణ్‌.. జేఎఫ్‌సీలోని మేధావుల సాన్నిహిత్యంలో రాజకీయ ఓనమాలు దిద్దుకుంటాడా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే జేపీ, ఉండవల్లి, ఎంవీఆర్ శాస్త్రి, ప్రొఫెసర్ నాగేశ్వర్‌ ఇలా ఎవరిని కదిలించినా ఉద్ధండపిండాలే. ఇలాంటి వారి సలహాలు, సూచనలతో కల్యాణ్ రాజకీయంగా రాటుదేలే అవకాశం ఉందని.. దానిని ఆయన ఉపయోగించుకుంటే మంచిదేనంటున్నారు విశ్లేషకులు.
పిల్లలు అందరు ఒకే రకంగా ఉండరు. కొందరు చురుకుగా ఉంటె, మరికొందరు మంద బుద్దితో ఉంటారు. మరి తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల విషయంలో ఎలాంటి జాగర్తలు తీసుకోవాలి. ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడాలి అంటే మాత్రం పిల్లల్లో చురుకుదనం ఖచ్చితం. ఈ విషయంలో డాక్టర్ చిట్టి విష్ణు ప్రియ గారు చెప్పే సలహాలు, సూచనల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=SzDlRHp-uyg    
పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి అంటేనే, పిల్లల్లో ఒక రకమయిన భయం మొదలవుతుంది. డేట్స్ దగ్గరికి వస్తున్న కొలది టెన్సన్స్ మరింత పెరుగుతుంది. అది బాగా చదివే స్టూడెంట్స్ అయినా, ఒక మోస్తరు చదివే వాళ్ళు అయినా. మరి, ఎగ్జామ్స్ వల్ల కలిగే భయాన్ని ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=APST1NyiefM  
           
సాధారణంగా సర్పజాతికి చెందిన ప్రాణులు.. పక్షులు గుడ్లు పెడుతూ ఉంటాయని మనం చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో చదివాం. జీవ పరిణామక్రమంలో అది సహజంగా జరిగే ప్రాసెస్. సృష్టి ఆరంభం నుంచి ఈ సైకిల్‌ నిరాంతరాయంగా కొనసాగుతూనే ఉంది. అలాంటిది ప్రకృతికి భిన్నంగా మనిషి గుడ్లు పెడితే.. ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాల్లో.. కొన్ని కథల్లో మాత్రమే చూసిన.. వినిపించిన మాట ఇది. ఇలాంటి వింత నిజంగా జరిగితే.. అవును.. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఆధారాలు చూస్తే నమ్మక తప్పదు.   ఇండోనేషియాకు చెందిన అక్మల్ అనే 14 ఏళ్ల కుర్రాడు గుడ్లు పెడుతున్నాడు. 2015 నుంచి ఇప్పటి వరకు 20కి పైగా గుడ్లు పెడుతున్నట్లు ఈ కుర్రాడి తండ్రి తెలిపాడు. మలద్వారం గుండా గుడ్లు వస్తున్నాయని.. వాటిని తెరచి చూడగా.. తెల్లసోన లేదా మొత్తం పచ్చసోనతో అచ్చం కోడిగుడ్లను పోలి ఉన్నాయట. అయితే అనారోగ్యం వల్ల ఇలా జరుగుతుందా..? లేకపోతే.. ఈ కుర్రాడు గుడ్లు ఏమైనా మింగాడా అన్న అనుమానంతో వైద్యుల దగ్గరకి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు గుడ్లు తేలేశారట. ఎన్ని పరీక్షలు చేసినా.. అక్మల్‌కు ఎందుకిలా జరుగుతుందో కనిపెట్టలేకపోయారట. మానవ శరీరం నుంచి గుడ్లు రావడమనేది అసాధ్యమని తెలిసినప్పటికీ.. జరుగుతున్నది చూస్తుంటే నమ్మక తప్పడం లేదని వారు వాదిస్తున్నారు. అయితే వైద్యుల సమక్షంలో అక్మల్ గుడ్డు పెట్టిన వీడియో ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కుర్రాడిని పరీక్షించడానికి పరిశోధకులు ఇండోనేషియా బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.. విభజన హామీలపై అమలు తదితర అంశాల గురించి కేంద్రప్రభుత్వాన్ని నిలదీయకుండా.. కొందరు తనను తిడుతున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కొన్ని పార్టీల నేతలు పొద్దున లేచిన దగ్గరి నుంచి తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఒక న్యూస్ పేపర్ ఉందనీ.. ఆ పేరు నేను చెప్పలేను.. కానీ మీకు తెలుసు.. అసత్యాలు రాసీరాసీ అలసిపోతున్నారు. ఆ పేపర్‌ని ఎవరైనా నమ్ముతారా..? అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్రానికి అందించాల్సిన సాయం అందించట్లేదని చెప్పారు. అరకొర నిధులిచ్చి చేయి దులుపుకుంటున్నారని కేంద్రాన్ని ఆయన నిందించారు. తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని తెలిపారు. ఆనాడు హేతుబద్ధత లేకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని.. ఏపీకి కేంద్రప్రభుత్వం న్యాయం చేయాల్సి ఉందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మరో వేటు వేసింది. ఏపీ అర్చకుల, ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఐవైఆర్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బ్రాహ్మణులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదంటూ వ్యాఖ్యానించడంతో పాటు.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొందరు సోషల్ మీడియాలో చేసిన కామెంట్లకు కృష్ణారావు లైక్ కొట్టడం అప్పట్లో.. సంచలనంగా మారింది. ఆయన చర్యలపై ఆగ్రహాం వ్యక్తం చేసిన ఏపీ ప్రభుత్వం బ్రాహ్మణ కార్పోరేషన్ పదవి నుంచి తొలగించింది. అయినప్పటికీ ప్రభుత్వంపైనా.. సీఎం చంద్రబాబుపైనా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో అర్చకుల, ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఛైర్మన్ పదవి నుంచి కూడా తొలగించింది.