Publish Date:Aug 16, 2017
Publish Date:Aug 14, 2017
Publish Date:Aug 4, 2017
Publish Date:Aug 2, 2017
Publish Date:Aug 1, 2017
Publish Date:Jul 31, 2017
Publish Date:Jul 29, 2017
Publish Date:Jul 27, 2017
Publish Date:Jul 24, 2017
Publish Date:Jul 22, 2017
Publish Date:Jul 21, 2017
Publish Date:Jul 20, 2017
Publish Date:Jul 18, 2017
Publish Date:Jul 17, 2017

LATEST NEWS
Income Tax officials conducted raids on the premises of Tamil actor Vishal’s production house- Vishal Film Factory (VFF) yesterday. As per reports, the production house has failed to pay Rs. 51 lakh collected as TDS (Tax Deducted at Source). The team is said to have left the office after the VFF staff assured to pay the due amount in two installments.  Earlier, it was wrongly reported in the media that the raid was conducted by the GST Intelligence Agency. A top GST official clarified on it later stating the agency had not conducted any search at VFF. Interestingly, IT raids were conducted on Vishal’s office just a day after the actor criticized a BJP (Bhartiya Janata Party) local leader H Raja who has been leading the charge against actor Vijay's film Mersal for allegedly defaming GST. When a media house asked Vishal regarding IT raids, he clarified saying, “It was TDS assessment by IT wing. Issue needs to be sorted officially and I will do so. The timing of IT department's visit to my office is suspect. The BJP's demand to chop Mersal dialogues is a curb on freedom of expression.” Curiously, no action has been taken against H Raja who directly announced to have watched Mersal online piracy version. If BJP continues to struggle those who question their government or leaders, they will lose faith in public who are already vexed with demonetization and GST schemes.
Indian ace Tennis Player Leander Paes appeared at the Bandra Magistrate Court in Mumbai couple of days ago over the hearing of a domestic violence case slapped on him in 2014 by his former girlfriend and live-in partner Rhea Pillai who demands Rs 1 crore in compensation from him. Pillai claimed that Leander Paes had no interest in taking care of their daughter Aiyana. Rhea has said in her petition: "Paes has always given priority to his own life and neglected the child and her feelings. He has been an absentee father. Besides being out of country for nearly 10 months of the year, he is also not reachable for days at length." Interim, Rhea Pillai's lawyers made a gaffe by mentioning the compensation amount demanded by her in the domestic violence case as Rs 10 lakh and not Rs 1 crore. The lawyers later told Magistrate that the correct amount Rhea had demanded was Rs 1 crore. The missing zero here made all the difference. Rhea Pillai demands one time settlement of Rs 1.43 Cr from Leander Paes. She also demands monthly-maintenance of Rs. 2.6 lakh. Her list of demands includes monetary assistance for buying a mid-budget car in the range of Rs 15-20 lakh. The cars given as examples are Toyota Innova, Toyota Corolla Altis and Honda City. Actual compensation demanded by Rhea was Rs 1 Cr, but the lawyers mistakenly wrote Rs 10 lakhs in the petition.
National Media reports that, Lashkar-e-Taiba (LeT) commander Abu Dujana who was shot dead in Pulwama encounter was actually offered to surrender to Indian military. However, Abu rejected an army officer's proposal.  What's more, Abu Dujana revealed a shocking reason to the officer for him rejecting the offer. His reply to the officer over phone conversation was, if he surrenders to Indian army, his family in Pakistan would be slayed. Furthermore, Abu Dujana also affirmed that there is no such thing like Jihad in Kashmir and Pakistan is playing a game to cheat people in Kashmir.
ALSO ON TELUGUONE N E W S
It’s not that easy to make a historical fantasy film by balancing visual show and thrilling subject. In fact, historical films which succeeded in balancing these two proportions have tasted victory. Coming to the actual point, Suvarna Sundari teaser hints that the movie is strong in terms of visuals and content. Director MSN Surya made the movie as a historical adventure entertainer with Jayaprada, Poorna and Sakshi Choudhary playing lead roles. The film Suvarna Sundari that has tagline of Charithra Bhavishyathuni Ventaduthundi has become talk of the industry with the pleasing teaser. The teaser was trended in social media ever since it was released and the video got over 1 million digital views so far. Interestingly, Suvarna Sundari makers have been getting juicy offers for theatrical and other rights. While Hindi satellite rights of the movie were sold for more than Rs 1 crore, distributors are keen on acquiring theatrical rights and are already in talks with the makers. Producer ML Lakshmi has made Suvarna Sundari with good budget and visuals in the movie will be on par with high budget entertainers. Interim, Suvarna Sundari is slated for release soon.
బాహుబలి సిరీస్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి ఖ్యాతి దేశవిదేశాల్లో మారుమోగిపోయింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాకా.. చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా అందరూ ఆయన డైరెక్షన్‌లో ఒక్క సీన్‌లో అయినా నటించాలని కోరుకుంటున్న వారే. బాహుబలి తర్వాత ఆయన ఏం చేస్తాడు..? ఏ సినిమా చేస్తాడు..? ఎవరితో చేస్తాడు..? అంటూ హాట్ డిబేట్‌లు నడుస్తున్న సమయంలో చెర్రీ-ఎన్టీఆర్ మల్టీస్టారర్ ప్రకటించి షాక్ ఇచ్చాడు జక్కన్న. మంచివార్తే కదా..? షాక్ అంటారేంటి అని మీరు అనుకోవచ్చు. బాహుబలి తర్వాత రాజమౌళి ఇండియన్ సినిమాను ఒక మెట్టుపైకి ఎక్కించాడు రాజమౌళి..   ఆ తర్వాత తీయబోయే సబ్జెక్ట్ ఇంకా గొప్పదై ఉంటుందని ఫిల్మ్ క్రిటిక్స్‌తో పాటు అభిమానులు భావించారు. దానికి తగ్గట్టే తన తండ్రి విజయేంద్రప్రసాద్ సాయంతో రాజమౌళి మహాభారతాన్ని ఐదు భాగాలుగా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందులో నిజం ఉందో లేదో అన్న విషయాన్ని పక్కనబెట్టి ఈ వార్త వినగానే సినీ అభిమానులు చాలా సంతోషించారు. ఈ మూవీ ఎప్పుడు ప‌ట్టాల‌కెక్కుతుంది, ఎవ‌రెవ‌రు న‌టిస్తారు, ప్రొడ్యూస‌ర్ ఎవ‌రు.. ఎవరెవరు ఏ పాత్రలు ధరించబోతున్నారు అంటూ చర్చ నడుస్తుండగానే చెర్రీ-ఎన్టీఆర్ మూవీని అనౌన్స్ చేశాడు రాజమౌళి. హిస్టారికలో, మైథలాజికలో, ఫాంటసీ ఇలాంటి జోనర్ ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇలా చేశాడేంటి అంటూ అభిమానులు కాస్త ఫీలవుతున్నారు.  
కొత్త కథలు పుట్టాలంటే...  మార్పు రావాల్సింది హీరోల్లో. మంచి కథలంటే మల్టీస్టారర్లతోనే సాథ్యం. బాలీవుడ్ హీరోలంతా మల్టీస్టారర్ల వైపు మొగ్గడానికి కారణం అదే. అయితే.. మల్టీస్టారర్లు చేయడం సాధారణమైన విషయమేం కాదు. ముందు హీరోల్లో విశాల హృదయం ఉండాలి. మార్కెట్ ని బట్టి, నిర్మాత శ్రేయస్సు బట్టి పారితోషికాలుండాలి. ఇగో ప్రాబ్లమ్స్ పక్కనపెట్టాలి. కథనే హీరోగా నమ్మాలి. నీకెన్ని సీన్లు, నాకెన్ని సీన్లు.. అనే విధానాలకు స్వస్థి పలకాలి. అప్పుడే గొప్ప కథలు సెల్యులాయిడ్ పై ఆవిష్కృతం అవుతాయ్. బాలీవుడ్ లో అది వర్కవుట్ అయ్యింది కానీ... దక్షిణాదిన మల్టీస్టారర్లంటే తేలికైన వ్యవహారం కాదు. ఇక్కడ వ్యక్తి పూజ ఎక్కువ. అందుకే.. మల్టీస్టారర్లు ఇక్కడ కరువయ్యాయ్. అయితే... నేటి కథానాయకులందరూ యువకులు. అందరికీ స్నేహభావం ఎక్కువ. అందుకే... వీళ్లందరూ ఇగోలను పక్కనపెట్టి మల్టీస్టార్లు చేయడానికి ముందుకొస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లు కూడా... వారి తరంలో మల్టీస్టారర్లు చేయలేకపోయినా.. జూనియర్లతో కలిసి చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇది నిజంగా మంచి పరిణామం. రానున్న రోజుల్లో తెలుగు తెరపై మల్టీస్టారర్ల రూపంలో అద్భుతాలు జరగనున్నాయ్. ఇప్పటికే మూడు మల్టీస్టారర్లు ఖరారయ్యాయ్. వాటిల్లో మొదటిది చిరంజీవి-పవన్ కల్యాణ్ మల్టీస్టారర్. టి.సుబ్బిరామిరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాను నిర్మించనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ప్రస్తుతం త్రివిక్రమ్ కథ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఎప్పుడైనా అధికార ప్రకటన రావొచ్చు. బహుశా.. ఎన్టీయార్ సినిమా తర్వాత త్రివిక్రమ్ చేసే సినిమా ఇదే అవుతుందేమో. తర్వాత మల్టీస్టారర్ బాలయ్య, మహేశ్ బాబు దీనికి దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రస్తుతం బోయపాటి కథను తయారు చేసేపనిలో ఉన్నాడు. ఒక హీరోతో సినిమా చేస్తేనే బోయపాటి ఎమోషన్లను తట్టుకోవడం కష్టం. ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్లతో సినిమా అంటే.. ఇక ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఎన్టీయార్-కృష్ణ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇప్పుడు వారిద్దరి వారసులు కలిసి నటించనుండటం విశేషం. కృష్ణ-బాలకృష్ణ కూడా ‘సుల్తాన్’ లో కలిసి నటించారు.   ఇక మూడో మల్టీస్టారర్ కథ ఇప్పుడే వెలుగు చూసింది.  అదే.. తారక్-చరణ్ ల సినిమా. దానికి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అవ్వడం విశేషం. ఫిబ్రవరిలో సినిమా లాంచనంగా ప్రారంభం  అవుతుందట. అంటే మొదట మొదలయ్యే మల్టీస్టారర్ ఇదే నన్నమాట. ఇక ముందు ముందు.. ఇంకా ఎవరెవరు కలుస్తారో.. ఏ విధమైన కథలు మనకు చూపిస్తారో చూడాలి.
తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి నువ్వొస్తానంటే నేనొద్దంటానా.? బొమ్మరిల్లు లాంటి సినిమాలతో తెలుగునాట అభిమానులను సంపాదించుకున్నాడు సిద్దార్థ్. ముఖ్యంగా యూత్ ఆడియన్స్‌లో మనోడి సినిమా వస్తుందంటే చాలు ఫుల్ క్రేజ్.. సరిగ్గా అలాంటి సమయంలో తెలుగు ప్రేక్షకుల మనసు నొచ్చుకునే ఒక మాట అన్నాడు సిద్దు. విభిన్నమైన సినిమాలను తెలుగువారు ఆదరించరు.. మూస సినిమాలనే ఇష్టపడుతుంటారు అన్న ఒకే ఒక్క మాటతో టాలీవుడ్‌కి దూరమైపోయాడు. తన సినిమాలు టాలీవుడ్‌లో అట్టర్‌ ఫ్లాపవ్వడంతో సిద్దార్థ్ తన కోపాన్ని అలా ప్రదర్శించాడు. ఈ మధ్యకాలంలో సిద్దూ నటించిన సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి.. కనీసం విడుదలైన విషయం కూడా ఎవరికీ తెలియదు. అలాంటి సిద్దార్థ్ నటించిన గృహం తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో పూర్తిస్థాయి హార్రర్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమాను మనోళ్లు బాగా రీసివ్ చేసుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత హిట్ దక్కడంతో సిద్దూ పండగ చేసుకుంటున్నాడు. అయితే తెలుగువాళ్లు కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయరంటూ అన్న ఆ నోటితోనే.. తనకు హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు సిద్దూ. కానీ దీనిని కొంతమంది సినీ జనాలు తప్పపడుతున్నారట. సినిమాలు చూడకపోతేనేమో చెడ్డవారు.. చూస్తేనేమో తెలుగోళ్లు మంచివాళ్లా అని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నో ఏళ్ల తర్వాత హిట్ రావడంతో సిద్ధార్థ్ గాల్లో తేలిపోతున్నాడు.
నందమూరి... కొణిదెల... ఈ ఇళ్లపేర్ల ప్రస్తావన వస్తే... ఆటోమేటిగ్గా వాతావరణం వేడెక్కిపోతుంది. ఎన్టీవోడి ఆగమనం నుంచీ ‘నందమూరి’ అనే ఇంటిపేరు తెలుగు నేలపై ఓ బ్రాండ్ అయ్యింది. అయితే.. ఎన్టీయార్ రాజకీయంలోకెళ్లడం... ఆయన వారసుడిగా బాలయ్య రంగంలోకి దిగడం... అంతకుందే.. చిరంజీవి హీరో అవ్వడం.. తర్వాత సుప్రీమ్ హీరో అవ్వడం.. ఆ తర్వాత మెగా స్టార్ అవ్వడంతో ‘కొణిదెల’ అనే ఇంటి పేరు మరో బలమైన బ్రాండ్ గా మారింది.  చిరంజీవి, బాలకృష్ణ.. ఇద్దరూ చిరకాల ప్రత్యర్థులు. నువ్వా-నేనా.. అంటూ ముప్పైఏళ్లు వెండితెర సాక్షిగా పోటీపడ్డ పెందెం కోళ్లు. ఓ దశకు వచ్చే సరికి వీరిద్దరి పోటీ శృతి తప్పి రాగాన పడి.... వీరి అభిమానులు బద్ధ శత్రువులుగా మారే స్థాయికి చేరుకుంది. చివరకు కుల సమీకరణాలు కూడా మొదలయ్యాయ్.  ఎన్టీయార్ కాలంలో మల్టీస్టారర్లంటే సర్వసాధారణం. తన సమాకాలీన కథానాయకులందరితో కలిసి నటించారు ఎన్టీయార్. అలాగే అక్కినేని, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్, కృష్ణంరాజు కూడా. కానీ.. చిరంజీవి, బాలకృష్ణ శకం వచ్చేసరికి అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంది. దాంతో మల్టీస్టారర్లు కనుమరుగైపోయాయ్. వీరిద్దరే కాదు... ఏ ఇద్దరు కథానాయకులూ కలిసి నటించలేని పరిస్థితి. అయితే.. జనానికి మాత్రం.... చిరంజీవి, బాలయ్య స్క్రీన్ పంచుకుంటే చూడాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేది. కానీ.. ఆ భాగ్యం మాత్రం వారిద్దరూ కలిగించలేకపోయారు.  అయితే... వారి తర్వాత తరం మాత్రం ఆ ఆకాంక్షను నిజం చేయడానికి నడుం బిగించింది. అవును... తారక్, రామ్ చరణ్ కలిసి ఒకసారి సినిమాలో నటించే శుభఘడియ త్వరలోనే రానుంది. వీరిద్దరినీ  కలుపుతున్న క్రెడిట్ ఎస్.ఎస్. రాజమౌళిదే. ‘బాహుబలి’ సంచలనం తర్వాత రాజమౌళి సృష్టించనున్న మరో సంచలనం ఈ  సినిమా కథ కూడా దాదాపు ఖరైన ఈ సినిమా ఫిబ్రవరిలో పట్టాలెక్కనుంది. డీవీవీ దానయ్య ఈ మల్టీస్టారర్ కి నిర్మాత. బలమైన అభిమాన గణం ఉన్న రెండు కుంటుంబాల హీరోలను కెమెరా ముందు హ్యాండిల్ చేయడం దర్శకులకు కత్తిమీద సామే. అలాంటి సాహసాలు రాజమౌళికి కెమెరాతో పెట్టిన విద్య. ఈ సిినిమా కథ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయ్. అది ‘తెలుగువన్’ మీకు ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది. అదేంటంటే...  కథ రిత్యా ఇందులో చరణ్ హీరో. విలన్ గా తారక్ నటిస్తున్నాడు. అదేంటి? చరణ్ కంటే సీనియర్ అయిన తారక్ విలన్ గా చేయడమేంటి? అనే అనుమానం అందరికీ కలగొచ్చు. ఈ సినిమా ‘ధూమ్’ తరహాలో ఉంటుందట. హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత విలన్ కి ఉంటుందట. అందుకే.. తారక్ ఏరి కోరి ఈ కేరక్టర్ ని ఎంచుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘జై లవకుశ’లో యాంటీషేడ్స్ ఉన్న పాత్రను అలవోకగా అదరగొట్టేసిన తారక్ కి రాజమౌళి సినిమాలో విలన్ గా చేయడం పెద్ద విషయం కాదు. చరణ్ పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుందట. పైగా దర్శకుడు రాజమౌళి అవ్వడంతో.. హీరోల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ కి చోటు ఉండదు. దర్శకధీరుడు ఏం చెబితే అది చేయడమే వీరిద్దరి పని.  ఏది ఏమైనా... ఇదొక మంచి పరిణామం. రానున్న రోజుల్లో తెలుగు ప్రేక్షకులు ఓ అద్బుతాన్ని చూడబోతున్నారన్నది మాత్రం నిజం. తెరపై ఈ రెండు కుటుంబాల ప్రతినిథులు కలిసి ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి. 
రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తమ హోదాకు తగ్గట్టు ఎంతో హుందాగా ప్రవర్తించాలి.. సరే హోదా పక్కనబెడితే తమ వయసును గమనించైనా సరే అందుకు తగ్గట్టుగా వ్యవహరించాలి. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఈ సంగతి మరచిపోయినట్లున్నారు. హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ 2017వ సంవత్సరానికి గానూ మిస్ వరల్డ్ టైటిల్‌ని గెలుచుకొని భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. చైనాలోని సాన్యాలో జరిగిన 67వ మిస్ వరల్డ్ పోటీలో 108 దేశాలకు చెందిన అందగత్తెలను పక్కకునెట్టి కిరీటాన్ని దక్కించుకుంది. అంతేకాదు 17 సంవత్సరాల తర్వాత ఈ ఘనతను మనదేశానికి అందించింది.   ఈ పోటీల్లో మానుషి గెలుపొందడంతో సొంత రాష్ట్రం హరియాణాతో పాటు దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగిపోతోంది. దీంతో ఛిల్లర్‌ను ఆకాశానికెత్తేసింది నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా.. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు సోషల్ మీడియా ద్వారా మానుషికి అభినందనలు తెలిపారు. ఒడిషాకు చెందిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో చిల్లర్ రూపాన్ని చిత్రించి ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. అలా అంతా తమ ఆనందాన్ని వివిధ రూపాల్లో తెలియజేస్తున్న వేళ.. శశిధరూర్ మాత్రం ఈ ఆనందానికి రాజకీయ రంగు పులిమారు. ఆమెపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.   "మన కరెన్సీని రద్దు చేయడం ఎంత పెద్ద తప్పో బీజేపీ ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. మన "చిల్లర"కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని చిల్లర్ ప్రపంచ సుందరిగా ఎన్నిక కావడంతో రుజువైంది" అంటూ ట్వీట్ చేశారు. నోట్ల రద్దు విషయంలో తొలి నుంచి బీజేపీ వైఖరిని తప్పుబడుతోంది కాంగ్రెస్ . తాజా విజయాన్ని కూడా నోట్లరద్దుకి ముడిపెట్టి అవసరం లేకపోయినా మానుషి చిల్లర్ పేరును ప్రస్తావించారు థరూర్. అంతే ఆ ట్వీట్ చేసిన కాసేపటికే నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో మాటల దాడి ప్రారంభమైంది. 17 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటం తీసుకొచ్చిన మానుషి చిల్లార్‌ను చిల్లరగా పోల్చడంపై వారు ఫైరవుతున్నారు.   మానుషి జాట్ వర్గానికి చెందిన యువతి కావడంతో ఆ సామాజిక వర్గం నుంచి నిరసన సెగ మొదలైంది. ఆమెను అవమానించడం అంటే జాట్లను అవమానించడమేనని ఆ వర్గానికి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు థరూర్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర అభ్యంతరం తెలిపింది. దేశప్రతిష్టను పెంచిన ఆమె ఘనతను తక్కువ చేసి మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలంటూ సమన్లు జారీ చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని భావించిన థరూర్‌ వ్యూహం మిస్ ఫైర్ అయి తిరిగి ఆయన్నే ఇబ్బందుల్లోకి నెట్టింది.. ఆయన్ని అనే కంటే కాంగ్రెస్ పార్టీని అనడం మంచిదేమో. ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన మంచి కానీ, చెడు కానీ అతను ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యవస్థ మొత్తానికి వర్తిస్తుంది. మరి ఈ వివాదం నుంచి ఆయన (సారీ) కాంగ్రెస్ పార్టీ ఎలా బయటపడుతుందో వేచి చూడాలి. 
  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ముహూర్తాన నంది అవార్డులను ప్రకటించిందో కానీ ఆ నెక్ట్స్ మినిట్ నుంచి రాష్ట్రప్రభుత్వం మీద విమర్శల వాన కురుస్తోంది. అవార్డులు ప్రకటించిన తర్వాతి క్షణం నుంచి ఈ ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, హేతుబద్ధంగా జరగలేదన్న విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఏపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తమకు కావల్సిన వారికి.. అయిన వారికి పురస్కారాల్లో పెద్దపీట వేశారని ఒకవైపు.. ఒకే సామాజిక వర్గానికి గుంపగుత్తగా అవార్డులను కట్టబెట్టారని  ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక అభిమానులైతే ప్రభుత్వం మీద పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. అవార్డుల ఎంపికలో మెగా కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగిందని.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారిని.. వారు నటించిన సినిమాలను ఏ మాత్రం పట్టించుకోలేదని.. ఏదో కంటితుడుపుగా మెగాస్టార్‌కి రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారని మెగా అభిమానులు. మహానటుడు ఏఎన్నార్ చివరి సినిమా "మనం"ను ఘోరంగా అవమానించారని అక్కినేని అభిమానులు.. కులం కారణంగా ప్రభాస్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వలేదని రెబల్‌స్టార్ ఫ్యాన్స్.. నా రుద్రమదేవి కనీసం జ్యూరీ గుర్తింపుకు కూడా నోచుకోలేదా అంటూ గుణశేఖర్ ఇలా ఒకళ్లా..? ఇద్దరా ..? విమర్శించే వాళ్ల లిస్ట్ పెరుగుతూనే ఉంది తప్ప వీటికి ఎండ్ మాత్రం పడటం లేదు. లెజెండ్ సినిమాకు ఏకంగా తొమ్మిది అవార్డులు రావడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బాలయ్య ఈ అవార్డుల కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు.. అందువల్లే తన సినిమాకే అవార్డులన్ని ఇప్పించుకున్నారని ఫిలింనగర్‌లో హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇక అన్నింటికన్నా మరో ఆసక్తికరమైన కోణం ఎలివేట్ అవుతోంది అదే "కమ్మ" యాంగిల్. ఈసారి అవార్డుల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన వారికే అవార్డ్ దక్కడం వివాదానికి దారి తీసింది. బాలయ్య, ఎన్టీఆర్, మహేశ్, బోయపాటి శ్రీను అంతా కమ్మవారే. దీంతో ఇవి కమ్మ అవార్డులు అంటూ పెదవి విరుపులు వినిపిస్తున్నాయి. ఇక ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా జ్యూరీ మెంబర్, డైరెక్టర్ మద్దినేని రమేశ్ ‌బాబు ఉపయోగించిన భాష అభ్యంతరకరంగా ఉంది. వర్మను రాయలేని రీతిలో బండ బూతులు తిడుతూ మద్దినేని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇలాంటి వారినా చంద్రబాబు జ్యూరీ మెంబర్‌గా నియమించేది అంటూ ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు. మెగా ఫ్యామిలీని పట్టించుకోకపోవడంపై మెగా అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు.. రాష్ట్రంలోని ఓట్ల శాతంలో వారిదే పైచేయి.. వచ్చే ఏడాది చివర్లో ఎన్నికలు వస్తాయనుకుంటున్న వేళ వారి ఆగ్రహానికి గురికావడం తెలుగుదేశానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నంది అవార్డుల్లో చంద్రబాబు జోక్యం చేసుకున్నారో లేదో తెలియదు కానీ ఇప్పుడు అందరికీ ఆయనే టార్గెట్ అయ్యారు. మరి వీటిని ముఖ్యమంత్రి ఎలా సరిదిద్దుతారో వేచి చూడాలి.
తెలంగాణ సెక్రటేరియట్‌ను కూల్చేదాకా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిద్రపట్టేలా కనిపించడం లేదు. తెలంగాణ తొలి ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రానికి చెందిన గుర్తులను ఒక్కొక్కటిగా చేరిపేస్తూ వస్తోన్న ఆయన కన్ను సచివాలయ భవనాలపై పడింది. సెక్రటేరియట్ శిథిలావస్థకు చేరుకుందని.. సిబ్బందికి అనువుగా లేదని దానిని కూల్చేసి అందరికి అందుబాటులో ఉండే మరో ప్రాంతంలో సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే కేసీఆర్‌ను ముందు నుంచి గమనిస్తున్నవారు మాత్రం ఆయనకు జాతకాలు, ముహుర్తాలు, వాస్తు శాస్త్రాలపై నమ్మకం ఎక్కువని.. వాస్తు సరిగా లేకపోవడం వల్లనే సచివాలయాన్ని కూలగొడుతున్నారని చర్చించుకున్నారు.   తన వాస్తు పిచ్చిని కవర్ చేసుకోవడానికి "భద్రత లేనందున" అనే ట్యాగ్ లైన్ తగిలించారు. సచివాలయ భవనాలకు అగ్నిప్రమాదాల నుంచి రక్షణ లేదని.. ఒకవేళ జరగరానిది జరిగితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తూ ఈ వాదనకు సపోర్ట్‌గా ఫైర్ డిపార్ట్‌మెంట్ చేత సర్టిఫికేషన్ ఇప్పించారు. అయితే భవనాలను కూల్చాలనే కేసీఆర్ పంతం వెనుక మరో బలమైన కారణాన్ని తెరపైకి తెస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే సీఎం భవనాలను కూల్చాలని నిర్ణయించారట. అందుకు వారు ఒక వాదన కూడా వినిపిస్తున్నారు. ఈ సచివాలయం నుంచి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి కొడుకులు ముఖ్యమంత్రలైన చరిత్ర లేదు..   నీలం సంజీవరెడ్డి మొదలుకొని రాజశేఖర్ రెడ్డి దాకా ఈ భవనాల వాస్తు తండ్రులకే అనుకూలించింది తప్ప కొడుకులెవరూ సీఎంలు కాలేదని కేసీఆర్ గమనించారట. పాత తరాన్ని పక్కనబెడితే పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్ అధినేతగా, ప్రధానిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించారు కానీ ఆయన వారసులు ఎంపీ పదవితోనే సరిపెట్టుకున్నారు. చెన్నారెడ్డి సీఎంగా పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశారు. ఆయన వారసుడు మర్రి శశిథర్ రెడ్డి చెప్పుకొదగ్గ నేత కాలేకపోయారు. జలగం వెంగళరావు సీఎంగా, కేంద్రమంత్రిగా పనిచేయగా.. ఆయన కుమారుడు జలగం వెంకట్రావ్ ఎమ్మెల్యేగానే ఉన్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి తనయుడు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ఎంపీగా, రైల్వే సహాయమంత్రిగా పనిచేసి ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలా..? వద్దా అన్న దశకు చేరుకున్నారు.   ఇక తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించి... జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన స్వర్గీయ ఎన్టీఆర్ వారసులు ఎవరూ ఆ స్థాయిని అందుకోలేకపోయారు.. తిరుగులేని నాయకుడిగా ప్రజల్లో స్థానం సంపాదించుకున్న వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్‌కి 150 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నప్పటికీ సీఎం కాలేకపోయారు. వీటన్నింటిని బేరీజు వేసుకున్న గులాబీ బాస్.. సెక్రటేరియట్ భవనాల వాస్తు కొడుకులకు అనుకూలంగా లేదని భావించారు. అందుకే కేటీఆర్‌‌కు బాగా అనుకూలంగా ఉండే వాస్తు ప్రకారం కొత్త భవనాలను నిర్మించాలనుకుంటున్నారట. తన తర్వాత కొడుకు సీఎం కావాలనుకోవడం తప్పుకాదు కానీ.. అందుకోసం వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి వాస్తునే సరిచేసి మరీ తనయుణ్ని అందలం ఎక్కించాలనుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. చారిత్రక వారసత్వానికి ప్రతీక అయిన సచివాలయ భవనాలను కూలుస్తే చూస్తూ ఊరుకోం అంటున్నాయి ప్రతిపక్షాలు. మరి ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గని వ్యక్తిత్వం కల కేసీఆర్‌ తన పంతాన్ని ఎలా నెగ్గించుకుంటారో వేచి చూద్దాం.
దారుణ మారణకాండతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ఒక్కో దేశంపై దాడులు చేస్తూ.. తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ పోతోంది. విస్తరణలో భాగంగా ఎప్పటి నుంచో భారత్‌పై దాడులు చేయాలని ఎప్పటి నుంచో కుట్రలు పన్నుతోంది. అయితే మన నిఘా వర్గాలు, భద్రతా దళాలు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎన్నో ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా మరోసారి ఇండియాను టార్గెట్ చేసింది ఐఎస్.  త్వరలో గంగానది వద్ద జరిగే కుంభమేళా, కేరళలోని త్రిసూర్‌పురంలో జరిగే ఉత్సవాల్లో దాడులకు దిగుతామని హెచ్చరించింది. ఈ మేరకు మలయాళంలో పది నిమిషాల ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు.   ఆ ఆడియోలో దాడులు ఎలా జరపాలో తమ శ్రేణులకు సూచించారు.. విషం కలిపిన ఆహారాన్ని ప్రజలు తినేట్లు చూడాలని.. పెద్ద పెద్ద ట్రక్కులను ప్రజలపైకి నడిపించాలని.. రైళ్లు పట్టాలు తప్పేలా చేయాలని.. కత్తులతో స్వైర విహారం చేయాలని చెబుతూ ఆడియోను ముగించారు. కుంభమేళాతో పాటు త్రిసూర్‌లో జరిగే వేడుకలకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతూ ఉంటారు. అందువల్ల వీటిపై దాడి చేస్తే భారీ జననష్టం కలుగుతుందని ఉగ్రవాదుల అంచనా. రంగంలోకి దిగిన కేంద్ర నిఘా బృందాలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే పనిలో పడ్డారు. వారి దర్యాప్తులో ఇది టెలిగ్రాం యాప్‌లో ఆప్గనిస్తాన్ నుంచి వచ్చినట్లుగా తేలింది. ఇందులోని గొంతు ఐఎస్ నేత రషీద్ అబ్దుల్లాగా తేలింది.   ఐఎస్ఐఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. తమ మనుగడ ప్రశ్నార్థకమవుతోందన్న భావనతో సురక్షిత ప్రాంతాలకు తమ సేనలను తరలించేందుకు ఐఎస్ అదినాయకత్వం కసరత్తులు ప్రారంభించింది. అలాగే తాము ఇంకా అంతం కాలేదనే భావనను ప్రపంచదేశాలకు తెలియజేసే ప్రణాళికలో భాగంగా అమెరికా సహా పలు యూరోపియన్ దేశాల్లో దాడులు చేస్తోంది. అలాంటి చర్యే కొద్ది రోజుల క్రితం జరిగిన లాస్‌వేగాస్ దాడి.   నెవెడా రాష్ట్రంలోని లాస్‌వేగాస్ సిటీని టార్గెట్ చేసిన దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 75 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. 500 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. తొలుత ఇది ఒక ఉన్మాది చర్యగా భావించినప్పటికీ దాడి చేసిన వ్యక్తి తమ వాడేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. ఇప్పుడు ఇండియాలో జరిపే దాడుల్లోనూ ఇదే తరహా ఫార్ములాను ఉపయోగిస్తామని ఉగ్రవాదులు పంపిన ఆడియో టేపులో స్పష్టంగా పేర్కొన్నారు. లక్షలాది మంది పాల్గొనే కుంభమేళా వంటి వేడుకల్లో ఇలాంటి దాడులు జరిగితే.. ప్రాణనష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహాకు కూడా అందదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై, కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి.
ఆరునూరైనా 2019లో అధికారాన్ని అందుకోవాలి.. ఇప్పటికే వీధి పోరాటాలు, రోడ్ల మీద బైఠాయింపులు అన్నీ అయిపోయాయి. ప్రజలు తన గురించే మాట్లాడుకోవాలి.. తన పేరు జనం నోట్లో నానాలంటే ఏం చేయాలి. వీటన్నింటికి సమాధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత ఎంచుకున్న మార్గం పాదయాత్ర. సీఎం అవ్వడమే లక్ష్యంగా.. రాష్ట్రం మొత్తం చుట్టివచ్చేలా సుమారు ఆరు నెలల పాటు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించారు. ఆయన నిర్ణయం వెనుక బలమైన కారణాలున్నాయి. రాష్ట్ర చరిత్రలో పాదయాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాగించిన "ప్రజా ప్రస్థానం" పాదయాత్రతో ప్రజల మన్ననలు పొంది సీఎం అయ్యారు. ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తన వయసును సైతం లెక్క చేయకుండా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ఆయనా సీఎం అయ్యారు.   ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అయి తాను కూడా ముఖ్యమంత్రిని కావాలని భావించారు జగన్. దీనిలో భాగంగా ఈ నెల 6న ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అయితే ఆయన ఆరు నెలల కాలంలో అన్ని అవాంతరాలను దాటుకొని.. అనుకొన్న లక్ష్యాన్ని అందుకోగలరా అన్న సందేహన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. అందుకు కారణాలు లేకపోలేదు.. యాత్ర ప్రారంభించి నేటికి తొమ్మిదో రోజు.. ఇవాళ్టీకి ఆయన 100 కిలోమీటర్ల మైలు రాయిను అందుకున్నారు. ఇంత నత్తనడకన ఆయన పాదయాత్ర సాగుతోంది.. తొలుత యాత్రను చాలా తేలిగ్గా తీసుకున్నారట జగన్ .. అయితే రంగంలోకి దిగితే కానీ మ్యాటర్ అర్థం కాలేదు..   జీవితంలో ఎప్పుడు ఈ స్థాయిలో శారీరకంగా కష్టపడకపోవడంతో త్వరగా అలసిపోతున్నారు.. మొదటి రోజే నడుం పట్టేయడం.. రెండో రోజు నుంచి ఇన్‌ఫెక్షన్‌లు రావడంతో జగన్‌కు ఇబ్బందులు మొదలయ్యాయట. దీనికి తోడు యాత్ర నిర్వహిస్తోన్న విధానం.. దానికి ప్రజల నుంచి వస్తోన్న స్పందన పార్టీ శ్రేణులను నిరాశకు గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా సొంత జిల్లాలోనే ఇలా జరగడం వారిలో సందేహాలను రేకేత్తిస్తోంది. మొదటిరోజు లక్షమంది జనం వస్తారని అంచనా వేయగా.. గట్టిగా 20వేల మందికి మించి రాలేదట. ఆ రోజును పక్కనబెట్టినా ఆ తర్వాతి రోజుల్లో కూడా ప్రజల నుంచి ఆశించిన స్పందన లభించడం లేదు.   మరోవైపు రోజుకు 15 కిలోమీటర్లు నడిస్తేనే.. ఆరు నెలల కాలంలో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేయగలుగుతారు కానీ.. ఆయన 10 కిలోమీటర్లకు మించి నడవలేకపోతున్నారు. ఇలా నడిస్తే మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఎంత లేదన్నా 300 రోజులు కావాలి.. మధ్యలో అనారోగ్య సమస్యలు, వాతావరణం దానికి తోడు కోర్టు వాయిదాలు ఇలా పోతే దాదాపు సంవత్సరానికి పైగానే యాత్రకు సమయం పడుతుంది. వచ్చే ఏడాది చివర్లో ముందుస్తు ఎన్నికలు వస్తాయని భావిస్తున్న సమయంలో జగన్ యాత్రలు చేసుకుంటూ వెళితే పార్టీ బలపడటం సంగతి పక్కనబెడితే బలహీనపడే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో పాదయాత్ర దూరాన్ని కుదించడమో లేదా మధ్యలో ఆపివేయక తప్పకపోవచ్చని వారు అంటున్నారు. మరి జగన్ వెనుకడుగు వేస్తాడా లేక ఎన్ని సమస్యలు ఎదురైనా మడమతిప్పక ముందుకే వెళ్తాడా అన్నది కాలమే నిర్ణయించాలి. 
గోదావరి తీరాన పాపికొండలు, కృష్ణా-గోదావరి సంగమ స్ధానం, నిత్యమూ పచ్చదనంతో అలరారే కోనసీమ.. అరకు అందచందాలు... ఇలా ఒకటేమిటీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటకానికి అనువుకానీ ప్రదేశమే లేదంటే అతిశయోక్తి లేదు.. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో ఆదాయ మార్గాలను కోల్పోయిన నవ్యాంధ్రకు లోటును పూడ్చే ఆదాయవనరుల్లో పర్యాటకం కూడా ఒకటిగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా టూరిజాన్ని ప్రొత్సహించే ఎన్నో ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. వీటిలో ప్రధానమైనది రివర్ టూరిజం.   గోదావరిలో ఉన్న పాపికొండలకు తోడు కృష్ణానదిలోనూ ఈ రివర్‌ టూరిజాన్ని అభివృద్ది చేయాలని సంకల్పించింది ప్రభుత్వం. అందుకు తగ్గట్టే ఆయా ప్రాంతాల్లో ఘాట్లు, రిసార్టుల వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి వీటిపై విస్తృత ప్రచారం కల్పించింది. ప్రభుత్వ కృషి ఫలించి ఇప్పుడిప్పుడే పర్యాటకుల తాకిడి పెరుగుతున్న వేళ నిన్న విజయవాడ సమీపాన కృష్ణానదిలో జరిగిన పడవ ప్రయాణం పర్యాటకుల భద్రతను ప్రశ్నిస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది మరణించారు.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర జలరవాణా వ్యవస్థలోని లోపాలు వెలుగులోకి వస్తున్నాయి.   ప్రస్తుతం మనరాష్ట్రంలో జలరవాణా, జలవిహారానికి ఉపయోగిస్తున్న లాంచీలు, మరపడవలు, నాటు పడవలు, బల్లకట్లు, పుట్టీలు పాతకాలం నాటివి.. దానికి తోడు కాసుల కోసం పరిమితికి మించి రెట్టింపు సంఖ్యలో ప్రయాణికుల్ని వాటిలోకి ఎక్కిస్తున్నారు. ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి ఉపయోగించే లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ వంటి పరికరాలు ఉండటం లేదు. బల్లకట్లు, బోట్లు పాతకాలపు ఇంజిన్లతోనే నడుస్తాయి. బల్లకట్టపైన పరిచే ఇనుపరేకులు కిందకు ఒంగిపోయి ఉంటాయి. ఒడ్డుకు చేరుకునే సమయంలో వాటి ఒరవడిని నియంత్రించేందుకు తగ్గ ఏర్పాట్లు ఉండవు.. దానికి తోడు ఇంజిన్లు పాడై బల్లకట్లు నది మధ్యలోనే నిలిచిపోవడం, నదుల్లో నీటిమట్టం తగ్గినప్పుడు రాళ్లు తగిలి బల్లకట్లు కొన్ని గంటలపాటు నది మధ్యలోనే ఆగిపోయిన ఘటనలు ఎన్నో ఎన్నెన్నో.   ఇందుకు ఒక్కటే పరిష్కారం పాతకాలం నాటి బోట్లు, లాంచీల స్థానంలో విదేశాల్లో వాడుతున్న అధునాతన లాంచీలు తీసుకురావాలి.. జలరవాణాపై ప్రభుత్వ నియంత్రణ పెరగాలి. అనుభవం లేని వారిని పడవ నడిపేందుకు అనుమతించరాదు.. అలా చేస్తే అయినా ఇటువంటి ప్రమాదాలను నివారించినట్లు అవుతుంది.
  మన దేశంలో ఒకరోజుకి ఎన్ని ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయో తెలుసా? ప్రతి రోజు సగటున 250 మంది మగవారు, 130 మంది ఆడవారు కలిపి సంవత్సరానికి 1 ,35 ,445 మంది తమ జీవితాన్ని అర్ధాంతరంగా ఏవేవో చిన్న చిన్న కారణాలకి కూడా ముగిస్తున్నారు. అందులో 15 నుండి 29 సంవత్సరాల వారి సంఖ్యే ఎక్కువ. మరి, ఆత్మహత్యల్ని నివారించడం ఎలా? జనాల్లో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన తుంచేయాలంటే ఎం చేయాలి? ఈ విషయాల అవగాహన కోసం ఈ వీడియో చూడండి...
  నిజమయిన సంతోషం ఎక్కడుంది? అందమయిన బంగళాల్లోనా లేక బాహ్య ప్రపంచంలోనా? సంతోషం పొందడం కోసం మనం ఎన్నో దారులు వెతుక్కుంటూ ఉంటాం. ఎంత చూసినా ఇంకేదో మిగిలిపోయిందని భావన ఉండిపోతుంది. మరి నిజమయిన సంతోషం ఎక్కడుందో తెలియాలంటే, జీవిత సత్యం ఏంటో తెలియాలంటే ఈ వీడియో చూడండి...      
  మన ప్రతి భయానికి పునాది చిన్నప్పటి నుండి కలుగుతుంది. అయితే, భయం చాలా రకాలు. ఉదాహరణకి, మనకి జీతంలో అనుకున్నంత పెంపు రాకపోతే మన పైన మనం ద్వేషం పెంచుకుంటాం, అలాగే మన బాస్ మీద కూడా ఒక కోపం పెంచుకుంటాం. అంతే కానీ, వెళ్లి జీతం ఎందుకు పెంచలేదు అని అడగం. ఎందుకంటే జాబ్ పోతుందేమో అని భయం. అయితే, భయాన్ని పోగొట్టుకోవాలంటే ఎం చేయాలి? ఈ వీడియో చూడండి మీరే తెలుసుకుంటారు...  
  భారత్‌లో భారీ ఉగ్రదాడికి ఐఎస్‌ఐ కుట్ర చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి..  నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఢిల్లీలో జరిగే పలు కార్యక్రమాలపై ఉగ్రవాదులు దృష్టి పెట్టినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అసోం రాజధాని గుహవాటి నుంచి వచ్చిన సమాచారంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. అంతేకాదు ప్రధాని, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గోవా సీఎం మనోహర్ పారికర్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.  చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈశాన్య భారతంలో ప్రభుత్వం నిఘా పెంచింది. ఇక గుజరాత్ ఎన్నికల సందర్భంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ లు ఇవ్వడం కొత్తేం కాదు. గతంలో ఒకసారి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. కర్నూలు జిల్లా హుసేనాపురంలో నిర్వహించిన మహిళా సదస్సులో పాల్గొన్న జగన్... ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటికీ చంద్రబాబు పాలన మాత్రమే ఉండదనే విషయాన్ని పోలీసులు గుర్తుంచుకోవాలని.. సదస్సుకు వస్తున్న మహిళలను అడ్డుకోవడం ఏంటని  పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. పోలీసులు వారి డ్యూటీ మాత్రమే వారు చేసుకోవాలని... ప్రభుత్వం కోసం, టోపీ మీదున్న మూడు సింహాల కోసం మాత్రమే పని చేయాలని... ఆ సింహాల వెనకున్న గుంట నక్కలకు సెల్యూట్ కొట్టేందుకు మీరు పని చేయడం లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.
  నంది అవార్డులపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. 2014, 15, 16 గాను ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలకు అవార్డులు రాలేదని.. అవార్డుల ప్రకటనలో కుల రాజకీయాలు జరిగాయని పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఈ అవార్డులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి.. నంది అవార్డులపై అసలు ఇంత రచ్చ అవుతుందనుకోలేదు.. ఇలా జరుగుతుందనుకుంటే ఐవీఆర్ఎస్ సర్వే చేయించి అవార్డులు ఇచ్చేవాళ్లం అని అన్నారు. అంతేకాదు.. ప్రతి విషయానికి ఇలా కులం రంగు పూయడం సరికాదు.. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే అవార్డులు ఇచ్చామని తెలిపారు.   ఇక ఇదే విషయంపై మంత్రి నారా లోకేశ్ స్పందించి... కొంద‌రు హైద‌రాబాద్‌లో కూర్చొని ఏపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తున్నారని అన్నారు. ఏపీలో ఆధార్, ఓట‌ర్ కార్డు లేని వారు కూడా ప్ర‌త్యేక హోదా, నంది అవార్డుల‌పై విమ‌ర్శ‌లు చేస్తే ఎలా? అని ప్ర‌శ్నించారు. నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డంతో సీఎం చంద్ర‌బాబు నాయుడు చాలా బాధ‌ప‌డ్డార‌ని లోకేశ్ తెలిపారు