Publish Date:Aug 17, 2018

LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
ALSO ON TELUGUONE N E W S
  నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వార‌సుడిగా త‌న‌యుడు మోక్ష‌జ్క్ష ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడంటూ రెండేళ్ల  నుంచి న్యూస్ వ‌స్తున్నాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు కార్య‌రూపం దాల్చ‌లేదు. ఈ చిత్రానికి బోయ‌పాటి శ్రీను కానీ క్రిష్  కానీ డైర‌క్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌వ‌చ్చు అన్న వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఎందుకంటే బోయ‌పాటి, క్రిస్ బాల‌కృష్ణ కు అద్భుత‌మైన చిత్రాలు ఇచ్చారు. అందుకే వారి పేర్లు తెర‌పైకొచ్చాయి. కానీ లేటెస్ట్ మోక్ష‌జ్క్ష  సినిమా గురించి సోష‌ల్ మీడియాలో ఒక న్యూస్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదేంటంటే...మోక్ష‌జ్క్ష ని హీరోగా ప‌రిచ‌యం బాధ్య‌త పూరిజ‌గ‌న్నాథ్ పై పెట్టాడ‌ట బాల‌కృష్ణ‌. రామ్  చ‌ర‌ణ్ తో పాటు, క‌న్న‌డ హీరోలు పునీత్ రాజ్  కుమార్‌, ఇషాన్ ల‌ను హీరోలుగా ప‌రిచ‌యం చేసింది ద‌ర్శ‌కుడు పూరిజ‌గ‌న్నాథే. మాస్‌, క్లాస్ ,యూత్ ఆడియ‌న్స్ ప‌ల్స్ తెలిసిన ద‌ర్శ‌కుడు పూరి.   అందుకే పూరి అయితే  బాగుంటుంద‌ని భావిస్తున్నాడ‌ట బాల‌య్య.  ఈ వార్త  `పైసా వ‌సూల్` సినిమా చేసే స‌మ‌యంలో   వ‌చ్చిన‌ప్ప‌టికీ ...ట్రాక్ ఎక్క‌లేదు. మ‌రోసారి మోక్షజ్క్ష సినిమా పై వార్తలు వ‌స్తున్నాయి. మ‌రి ఈ సారైనా ట్రాక్ ఎక్కుతుందో లేదో చూద్దాం.
హైద‌రాబాద్‌లోని ద‌స్‌ప‌ల్లా హోట‌ల్ లో `క‌వ‌చం` ట్రైల‌ర్ రిలీజ్ ఫంక్ష‌న్ ఏర్పాటు చేశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్ గా వ‌ర్క్ చేశాడు చోటా కే నాయుడు. అయితే ఈ చిత్రం ప్రెస్ మీట్ గానూ హీరోయిన్ గా న‌టించిన కాజ‌ల్ కూడా హాజ‌రైంది. అయితే ఈ కార్య‌క్ర‌మ‌లో స్టేజ్ మీద  కాజ‌ల్ మాట్లాడుతూ...``అంద‌రి గురించి చెబుతూ చోటా గురించి చెప్పుకొచ్చింది. ఇంత‌లో చోటా కే నాయుడు ఆమెకు హ‌గ్గిస్తూ ప‌నిలో ప‌నిగా ముద్దు కూడా పెట్టేసాడు. వెంట‌నే కాజ‌ల్ మా ఫ్యామిలీ ప‌ర్స‌న్ లో ఒక‌రు చోటా అంటూ క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. అప్ప‌టి వ‌ర‌కు అంద‌రూ లైట్ గా తీసుకున్నా కానీ, మీటూ ఉద్యమం ఉధృతంగా జ‌రుగుతున్న త‌రుణంలో ఇలా చోటా కే నాయుడు చేయ‌డం స‌రి కాదంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ వ‌స్తున్నాయి. ఇక కాజ‌ల్ ఫ్యాన్స్ అయితే చోటా కే నాయుడు లాంటి వారికి బాటా తో బ‌దులియ్యాలంటూ. ఊరికే వ‌ద‌ల‌కూడ‌దూ టాలీవుడ్ నుంచి బ‌హిష్క‌రించాలంటూ ఫైర‌వుతున్నారు. గ‌తంలో కూడా ఇలా ప‌లు హీరోయిన్స్ పై చోటా కే నాయుడు కామెంట్స్ చేసాడంటూ అవ‌న్నీ మెల్ల మెల్ల‌గా ఒక్కొక్క‌టీ బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఏదో స‌ర‌దాగా చేస్తే...చోటా కు చిరిగి చాట‌వుతోంది అంటున్నారు కొంత‌మంది. చూద్దాం చోటా కే నాయుడు దీనికి ఏ విధంగా బ‌దులిస్తాడో...స్పందిస్తాడో మరి.
    ఆర్ఆర్ఆర్‌ ఓపెనింగ్‌కు ప్ర‌భాస్ వ‌చ్చాడు. రామ్‌చ‌రణ్‌, ఎన్టీఆర్‌, రానా, రాజ‌మౌళితో స‌ర‌దాగా కబుర్లు చెబుతున్న సమయంలో తీసిన ఫొటో ఒకటి బయటకు వదిలారు. ఓపెనింగ్ వీడియోలోనూ అందరూ ఒక్క చోట వున్నప్పుడు మాత్రమే కనిపించాడు. పూజా కార్యక్రమాల్లో లేడు. చివర్లో అందరూ కలిసి దిగిన గ్రూప్ ఫొటోలో లేడు. ఇంకెక్కడా కనిపించలేదు. చిత్ర పరిశ్రమలో, ప్రేక్షకుల్లో ఈ విషయం చర్చకు వచ్చింది. ఫైనల్ ఫొటోలో ప్రభాస్ ఎందుకు లేడు అనేది. విషయం ఏంటంటే... ఆర్ఆర్ఆర్‌ ఓపెనింగ్‌లో ప్ర‌భాస్‌ పట్టుమని పాతిక నిమిషాలు కూడా లేదట! అవును... కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయాడట! అందరికీ ఓసారి హాయ్ చెప్పేసి అక్కడి నుంచి సెలవు తీసుకున్నాడు. ఎందుకు? ఏమిటి? అనే వివరాలు తెలియలేదు. బహుశా... మీడియాను ఆహ్వానిస్తే ఇటువంటి విషయాలు ఎక్కువ హైలైట్ అవుతాయని రాజమౌళి బృందం  అలోచించి మీడియాను దూరంగా పెట్టినట్టు వున్నారు.
  డైలాగ్ రైట‌ర్ గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ డైర‌క్ట‌ర్ గా ఎదిగాడు కొర‌టాల శివ‌.  స్టార్ హీరోలు సైతం అతనితో సినిమాలు చేయ‌డాఇకి ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారంటే డైర‌క్ట‌ర్ గా అత‌డి స్టామినా ఏంటో  అర్థం చేసుకోవ‌చ్చు.  మ‌హేష్ తో `భ‌ర‌త్ అనే నేను` చిత్రం చేసి స‌క్సెస్ కొట్టాడు. త‌న త‌దుప‌రి చిత్రంగా మెగాస్టార్ తో ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిన విష‌య‌మే. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా పై ఎటువంటి క్లారిటీ రాలేదు కానీ, సోష‌ల్ మీడియాలో మాత్రం నిత్యం ఈ సినిమా గురించి వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా ఒక న్యూస్ హ‌ల్  చ‌ల్ చేస్తోంది. అదేమిటంటే....ఏ సినిమా చేసినా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో పాటు అందులో అండ‌ర్ క‌రెంట్ గా ఏదో ఒక సందేశం ఉండేలా స్క్రిప్టు చేయ‌డం కొర‌ట‌లా అల‌వాటు. అందులో భాగంగానే ఈ సారి చిరంజీవితో చేయ‌బోయే సినిమాలో మంచి సోష‌ల్ మెసేజ్ ని పొందుప‌రిచాడ‌ట‌.  చిరంజీవి రైతు పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఇప్ప‌టి రైతు స్థితిగ‌తుల‌ను మ‌రియు వారి స‌మ‌స్య‌ల‌ను చూపిస్తూ ..ప‌రిష్కార మార్గం కూడా చూపించే విధంగా ఉంటుంద‌ట సినిమా. ఈ ఏడాది ఆఖ‌రులోగా ప్రారంభ‌మ‌య్యే ఈ సినిమాలో త‌మ‌న్నాకానీ, హ్యూమా ఖురేషి కానీ హీరోయిన్ గా న‌టించే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘2.ఓ’. ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా నటించడం విశేషం. ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్.వి.ఆర్. సినిమాస్ ద్వారా ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలోని ‘బుల్లిగువ్వా..’ అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఆలపించారు. ఈ పాట తనకెంతో బాగా నచ్చిందని కింగ్ నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ చాలా క్లాస్‌గా ఉందంటూ ప్రశంసించారు.
  టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినప్పుడు అసలు ఈ కూటమి ఎన్నికల వరకు ఉంటుందా? ముందే ముక్కలవుతుందా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ కూటమి దూసుకుపోతుంది. కూటమిలోని పార్టీలు, నేతలు త్యాగానికి సిద్దమవుతూ తమ ప్రధాన లక్ష్యం ఏంటో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తున్నారు. టీడీపీ తక్కువ సీట్లకు సర్దుకుపోయింది. అంతేకాకుండా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కోసం సీటు త్యాగం చేసి పొత్తు ధర్మాన్ని పాటించారు. ఇక సీపీఐ కూడా తక్కువ సీట్లు కేటాయించినా.. టీఆర్ఎస్ ను గద్దె దించడం కోసం కూటమిలోనే కొనసాగుతామని తేల్చి చెప్పింది. ఇక తాజాగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కూడా తనకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూటమి ప్రయోజనాలే ముఖ్యమని చాటిచెప్పారు. కాంగ్రెస్ 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేరు లేకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. పొన్నాల జనగామ నుంచి అనేకసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయనికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటి పొన్నాలకు తొలి జాబితాలో టిక్కెట్ దక్కకపోవడంతో ఆయనతో పాటు.. కాంగ్రెస్ శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఈ సీటుని టీజేఎస్ కి కేటాయించింది. ఇక్కడి నుంచి కోదండరాం బరిలోకి దిగలనుకున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పొన్నాలకు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పినా.. పొన్నాల మాత్రం జనగామ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే సుముఖుత వ్యక్తం చేశారు. మరోవైపు బీసీ సీనియర్ నేత అయిన పొన్నాలకు మొండిచేయి చూపడం కరెక్ట్ కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ వరుస పరిణామాల నేపథ్యంలో కోదండరాం పొన్నాల కోసం సీటు త్యాగం చేయడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా టీజేఎస్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో టీజేఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. జనగాం నుంచి కోదండరాం పోటీ చేయకూడదని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. బీసీలకు అన్యాయం చేయడం తమకు ఇష్టం లేదు కాబట్టి.. కోదండరాం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి కోదండరాం వేరే ఏదైనా స్థానం పోటీ చేస్తారో లేక కూటమిలోని అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారో చూడాలి. మొత్తానికి కూటమిలోని పార్టీలు, నేతల త్యాగాలు చూస్తుంటే టీఆర్ఎస్ ని ఓడించాలని కూటమి ఎంత బలంగా ఫిక్స్ అయిందో అర్ధమవుతోంది. చూద్దాం కూటమి లక్ష్యం నెరవేరుతుందో లేదో.
  తెలంగాణలో డిసెంబర్ 7 న ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ రద్దుకి ముందు వరకు 'వార్ వన్ సైడ్' మళ్ళీ టీఆర్‌ఎస్సే అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కానీ కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడటంతో ఆ అంచనాలు తారుమారయ్యాయి. అధికారం కోసం టీఆర్‌ఎస్‌ వర్సెస్ మహాకూటమి పోరు నువ్వానేనా అన్నట్టుగా మారింది. కొందరైతే మహాకూటమిదే పైచేయి అని భావించారు. తాజాగా ఓ సర్వే కూడా అదే తేల్చింది. ఏబీపీ న్యూస్‌ కోసం సీ-వోటర్‌ చేసిన సర్వేలో తెలంగాణలో మహాకూటమిదే విజయమని తేలింది.  కాంగ్రెస్‌- టీడీపీ కూటమికి 33.9 ఓట్ల శాతంతో 64 సీట్లు, టీఆర్‌ఎస్‌ కు 29.4 శాతం ఓట్లతో 42 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 4, ఇతరులకు 9 సీట్లు దక్కనున్నట్లు సర్వే తెలిపింది. ఇక సీఎం అభ్యర్థి విషయానికి వస్తే సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు కేసీఆర్‌ వైపే మొగ్గు చూపారు. మొత్తం 42.9 శాతం మంది కేసీఆరే సీఎం కావాలని కోరుకోగా.. 22.6 శాతం మంది జానారెడ్డి వైపు మొగ్గు చూపారు.. 7.2% మంది రేవంత్‌ రెడ్డి సీఎం అయితే బాగుంటుందన్నారు. దీనిబట్టి చూస్తుంటే తెలంగాణలో కేసీఆర్‌కు వ్యక్తిగతంగా ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల లెక్కలు మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సర్వే పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాకూటమి ఇంకా సీట్ల సర్దుబాటు దగ్గరే ఉంది. అభ్యర్థులను ప్రకటించలేదు. అభ్యర్థులను ప్రకటించిన తరువాత కూటమి నుంచి రెబెల్స్ వచ్చే అవకాశముంది. దీనివల్ల ఓట్లు చీలుతాయి. అది టీఆర్‌ఎస్‌ కు కలిసిరావొచ్చు. ఫలితాలు మారొచ్చు. మరి కూటమి వీటిని అధిగమించి టీఆర్‌ఎస్‌ ని ఓడించి సర్వే ఫలితాలను నిజం చేస్తుందేమో చూడాలి. సీ-ఓటర్‌ సర్వే తెలంగాణతోపాటు ఎన్నికలు జరుగనున్న మిగతా రాష్ట్రాల్లో కూడా సర్వే నిర్వహించింది. ఆ రాష్ట్రాల్లో కూడా సర్వే ఫలితాలు కాంగ్రెస్ కి సానుకూలంగా ఉన్నాయి. రాజస్థాన్‌ లో బీజేపీ 39.7 శాతం ఓట్లతో 45 సీట్లకే పరిమితం కాగా.. కాంగ్రెస్‌ 47.9 ఓట్ల శాతంతో 145 సీట్లు కైవసం చేసుకోనుందని సర్వే తేల్చింది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు తప్పదని సీ-ఓటర్‌ సర్వే చెప్పింది. అయితే, చివరికి గెలుపు మాత్రం కాంగ్రెస్‌దేనని తేల్చింది. ఈ సర్వే ప్రకారం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ 42.3% ఓట్లతో 116 సీట్లు, బీజేపీ 41.5% ఓట్లతో 107 సీట్లు గెలుచుకుంటుందని తేల్చింది. ఛత్తీస్‌గఢ్‌ విషయానికొస్తే బీజేపీకి 43 సీట్లు.. కాంగ్రెస్ కి 41 సీట్లు రావచ్చని అంచనా వేసింది. అయితే ఛత్తీస్‌గఢ్‌ లో ఓటు శాతం మాత్రం కాంగ్రెస్ కే ఎక్కువ వస్తుందని తేల్చింది. కాంగ్రెస్‌కు 42.2 శాతం, బీజేపీకి 41.6 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఇక మిజోరంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని తేలింది. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ 17 సీట్లతో ముందంజలో ఉండగా, కాంగ్రెస్‌కు 12, జోరం పీపుల్స్‌ మూమెంట్‌కు 9 సీట్లు దక్కనున్నాయని తెలిపింది.
  తెలుగు చలన చిత్ర రంగంలో నందమూరి తారక రామారావు పేరు తెలియని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అలానే తమిళనాట అంతే గొప్ప పేరు ఉన్న నటుడు ఎం.జీ.రామచంద్రన్ (ఎంజీఆర్).ఇద్దరు సినీరంగంలోనే కాదు రాజకీయాల్లో కూడా ఓ వెలుగు వెలిగారు.ఎంజీఆర్ తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ స్థాపిస్తే,ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ స్థాపించారు.రాష్ట్రాలు వేరైనా సమన్వయంతో,స్నేహబంధంతో మెలిగేవారు.అలానే డీఎంకే పార్టీ కూడా తెదేపాకు తమ మద్దతునిచ్చేది.తమిళనాడులో  అన్నాడీఎంకే, డీఎంకేలలో ఏది అధికారంలో ఉన్నా తెదేపాకు ప్రాధాన్యం ఇచ్చేవి.ఎన్టీఆర్‌ తర్వాత చంద్రబాబు నాయుడుకు జయలలిత, కరుణానిధితో మంచి సంబంధాలు ఉండేవి. ఎవరు ఎన్నికల్లో గెలుపొందినా తప్పకుండా ప్రమాణస్వీకారానికి ఆహ్వానించేవారు.కానీ జయ మరణాంతరం తెదేపాకు అన్నాడీఎంకే నుంచి ప్రాధాన్యత తగ్గిపోయింది.ఆ పార్టీ నేతలతో సమావేశమవ్వటానికి వచ్చిన తెదేపా ఎంపీలకు సమయం ఇవ్వకపోవటమే పార్టీల మధ్య దూరం పెరిగిందంటానికి ఉదాహరణ.అయితే డీఎంకే మాత్రం కరుణానిధి మరణం తర్వాత కూడా తెదేపాకి తగిన ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది.     ప్రస్తుతం చంద్రబాబు బీజేపీ కి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయటానికి సన్నద్ధమైన సంగతి తెలిసిందే.అందులో భాగంగా ఇప్పటికే పలువురు జాతీయ స్థాయి నేతలో భేటీ అయ్యారు.అంతేకాకుండా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సైతం భేటీ అయ్యారు.ఈ పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు తన ప్రయత్నాలు మరింత వేగవంతం చేస్తున్నారనే చెప్పుకోవాలి.వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు.అందులో భాగంగా నిన్న బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, ఇతర నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.నేడు తెదేపాకు మొదటి నుంచి సన్నిహిత పార్టీ అయిన డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తో సమావేశమవనున్నారు.బీజేపీ వ్యతిరేక కూటమికి మద్దతు తెలుపమని చంద్రబాబు స్టాలిన్‌ ను కోరే అవకాశం ఉంది.ఎలాగో స్నేహబంధం ఉంది కాబట్టి  స్టాలిన్‌ కూడా అందుకు సానుకూలంగా ఉంటారనే అనుకోవాలి.అంతబాగానే ఉంది కానీ ఇంతకీ చంద్రబాబు అన్నాడీఎంకే పార్టీ నేతలతో సమావేశమవుతారా? లేదా? అనేదే ప్రస్నార్ధకం.అన్నాడీఎంకే కూడా గత కొంత కాలంగా బీజేపీ కి కాస్త అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
  తెలంగాణకు ద్రోహం చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబుకు తెరాస నేత హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. 18 ప్రశ్నలతో కూడిన ఈ లేఖను తాజాగా హరీష్ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం పట్ల ప్రజలకు అభ్యంతరాలున్నాయని అన్నారు. చంద్రబాబు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం ప్రకటించలేదని, ప్రజలకు క్షమాపణ చెప్పలేదని అన్నారు. ఏ మొహం పెట్టుకొని తెలంగాణలో పోటీ చేస్తారని ప్రశ్నించారు. వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం ధర్నా చేసిన చంద్రబాబు.. తాను ఏపీకి సీఎం అయ్యాక అదే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మహాకూటమి నేతలకు పాలమూరు ప్రజలను ఓట్లు అడిగే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు వస్తే.. అనుమతులు లేవని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని నిలదీశారు. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సిన విద్యుత్‌ ఇవ్వలేదని.. ఆ కుట్రలను చేధించిన కేసీఆర్ రాష్ట్రానికి విద్యుత్‌ వెలుగులు తెచ్చారని అన్నారు. తెలంగాణ ఉద్యమం అంటే చంద్రబాబు అసలు గిట్టదని, తెలంగాణ ఏర్పాటును చివరి వరకు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు. తెలంగాణను విఫల రాష్ట్రంగా చేయాలని బాబు ప్రయత్నించారని ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ అస్థిరతకు ప్రయత్నించారన్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబుకు నరనరాన వ్యతిరేకత ఉందని హరీష్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పోటీ చేసి నాలుగు సీట్లు సాధించుకుంటే అభివృద్ధికి అడ్డుపడవచ్చనే కుట్రతోనే టీడీపీ ఇక్కడ పోటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రైతులు దశాబ్దాలుగా నీళ్ల కోసం పోరాడారని.. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస ప్రభుత్వం రైతులకు సమృద్ధిగా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుందన్నారు. అయితే తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగుకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి, వాటర్‌ బోర్డులకు చంద్రబాబు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. గోదావరి, కృష్ణా నదుల నీరు సముద్రంలో వృథాగా కలిసిపోయినా చంద్రబాబు బాధపడరు కానీ.. వాటిని తెలంగాణ రాష్ట్రం వినియోగించుకుంటే మాత్రం సహించలేకపోతున్నారని విమర్శించారు. తెలంగాణ నాశనం కావాలని కోరుకుంటున్న ఆయన.. తిరిగి ఇక్కడ పోటీ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబుకు హరీష్ రావు రాసిన బహిరంగ లేఖలోని 18 ప్రశ్నలు: నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్రలు చేయడం లేదా? పాలమూరు కడతామని 2014 ఎన్నికల్లో మీరు హామీ ఇవ్వలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం మీ దుష్ట ఆలోచన కాదా? పాలేరుకు నీళ్లివ్వడం కూడా పాపమేనా? కెసి కెనాల్ కోసం తుమ్మిళ్ల వద్దంటారా? కల్వకుర్తిపై కుట్రలు చేస్తున్నది నిజం కాదా? పోలవరానికి బదులుగా కృష్ణా నీళ్లు ఇవ్వకుండా నాటకాలు ఆడడం లేదా? శ్రీశైలం నుంచి తెలంగాణకు నీరివ్వొద్దనడం మీ కుతంత్రం కాదా? ఎవరి అనుమతితో కొత్త ప్రాజెక్టులు కడుతున్నారు? పోలవరం మండలాలు గుంజుకోవడం మొదటి అన్యాయం కాదా? సీలేరు ప్లాంటు పోవడం వల్ల ఏడాదికి రూ.500 కోట్ల నష్టం చేయడం లేదా? విద్యుత్ పంపిణీ విషయంలో దుర్మార్గమైన వైఖరి అవలంభించలేదా? పిపిఏలను ఏకపక్షంగా రద్దు చేసి, 2,465 మెగావాట్లు ఎగ్గొట్టలేదా? రూ.4,557 కోట్ల నష్టం చేసిన కుటిలత్వం మీది కాదా? ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుండా.. టెండర్లలో పాల్గొన్న కుంచితత్వం మీది కాదా? ఖాళీ భవనాలు ఇవ్వక పోవడం మీ సంకుచితత్వం కాదా? హైదరాబాద్ ఆస్తుల్లో వాటా అడగడం మీ దురాశ కాదా? విభజన మాయని గాయం అని బాధ పడలేదా?
కర్ణాటకలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చవిచూసింది. 3 లోక్‌సభ స్థానాలు, 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. వీటిలో కేవలం ఒకే ఒక్క స్థానంతో బీజేపీ సరిపెట్టుకుంది. మిగతా నాలుగు చోట్ల అధికార కాంగ్రెస్‌-జేడీయూ కూటమి విజయం సాధించింది. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలు రాజీనామా చేయడం, రామనగర శాసనసభ స్థానాన్ని సీఎం కుమారస్వామి వదులుకోవడం, జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మృతిచెందడటంతో ఈ స్థానాల్లో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. దీంతో గత శనివారం ఉపఎన్నికలు నిర్వహించి.. నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కాంగ్రెస్‌-జేడీయూ కూటమి భారీ విజయం సాధించింది.     ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కుమారస్వామి రామనగర, చెన్నపట్న స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఫలితాల అనంతరం రామనగర స్థానానికి కుమారస్వామి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ తరపున బరిలోకి దిగిన సీఎం కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి ఘన విజయం సాధించారు. ఆమె 1,09137 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ఎల్.చంద్రశేఖర్ అంతర్గత విభేదాల కారణంగా ఎన్నికలకు రెండు రోజుల ముందు పోటీ నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీకి షాక్ తగిలింది. ఈ పరిణామం జేడీఎస్‌కు ఎంతగానో కలిసొచ్చింది. రామనగరంలో బీజేపీకి 15,906 మాత్రమే పోలయ్యాయి. లక్షా 9వేలకు పైగా భారీ మెజారిటీని అనితా కుమారస్వామి దక్కించుకోవడంతో జేడీఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.  జమఖండీ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. దీంతో ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో సిద్ధు కుమారుడు ఆనంద్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది.  ఆనంద్‌ బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌ కులకర్ణిపై భారీ మెజార్టీతో గెలుపొందారు. మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో జేడీఎస్‌ అభ్యర్థి శివరామ గౌడ గెలుపొందారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన జేడీఎస్‌ ఎంపీ సీఎస్‌ పుట్టరాజు తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీఎస్‌ నుంచి శివరామ గౌడ బరిలోకి దిగగా కాంగ్రెస్‌ ఆయనకు మద్దతిచ్చింది. అయితే శివరామకు పోటీగా బీజేపీ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడంతో పొటీ ఏకపక్షమే అయ్యింది. బీజేపీ కంచుకోట 'బళ్లారి'లోనూ బీజేపీకి ఓటమి తప్పలేదు. బళ్లారిలో బీజేపీ అభ్యర్థి శాంతపై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉగ్రప్ప భారీ మెజార్టీతో గెలుపొందారు. బళ్లారిలో 2004 నుంచి బీజేపీనే గెలుస్తూ వస్తోంది. అంతేగాక గాలి జనార్దన్‌ రెడ్డి సోదరులకు మంచి పట్టున్న నియోజకవర్గం. గత 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ నేత బి. శ్రీరాములు బళ్లారిలో విజయం సాధించారు. అయితే ఈ ఏడాది కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన శ్రీరాములు తన లోక్‌సభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఎన్నిక జరిగింది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ తరఫున శ్రీరాములు సోదరి శాంత బరిలోకి దిగారు. శాంతకు పోటిగా కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి బలమైన అభ్యర్థిని పోటీలో నిలబెట్టింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఉగ్రప్పను కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఉగ్రప్ప దాదాపు 2లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కనీసం ఈ సీటు నిలుపుకుంటే బీజేపీ పరువు దక్కేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఏకైక స్థానం శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం. శివమొగ్గ ఎంపీగా ఉన్న మాజీ సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో ఉపఎన్నిక తప్పనిసరి అయ్యింది. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర బరిలోకి దిగారు. జేడీఎస్‌ నుంచి మరో మాజీ ముఖ్యమంత్రి ఎస్‌. బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప పోటీ చేశారు. మధుకు కాంగ్రెస్‌ మద్దతిచ్చింది. ఫలితాల్లో రాఘవేంద్ర, మధు మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక దశలో మధు ఆధిక్యం కూడా కనబర్చారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన శివమొగ్గ ఉపఎన్నికలో చివరకు రాఘవేంద్ర 50 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరి కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక ఉప ఎన్నికలు ఫలితాలు బీజేపీకి బిగ్ షాక్ అనే చెప్పాలి.
  రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో చంద్రబాబుపై ప్రారంభమైన విమర్శల పర్వం కొనసాగుతోంది. దీనిపై కాంగ్రెస్ కు టీడీపీని తాకట్టు పెట్టారంటే వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ ఘాట్ లోని ఎన్టీఆర్ సమాధి వద్ద నిరసన తెలిపారు. అంతేకాదు వైసీపీ, జనసేన, టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలన్నీ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సమాధానమిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.ఇటీవల విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంటే అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. "అలా ఎప్పటికీ జరగదని,ఒకవేళ అలా జరిగితే తాను ఉరి వేసుకుంటానని" సంచలన వ్యాఖ్యలు చేసిన కేఈ తాజగా రాహుల్ చంద్రబాబు భేటీని సమర్థించారు..దీనిపై విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు.     రాజ్యాంగ పరిరక్షణ కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు. అంతేకాకుండా లేఖలో ప్రతిపక్షాలపై పలు ప్రశ్నలను సంధించారు.''రాహుల్‌ని చంద్రబాబు కలిస్తే తప్పేంటి? విభజన చట్టంలోని హామీలను విస్మరించి మనల్ని మోసం చేసిన వారిపై తిరగబడి మన హక్కులను కాపాడుకోవాలని అనుకోవడం తప్పా?...ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నప్పుడు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించలేదా? పార్టీ మారి బీజేపీలో చేరినపుడు బాధపడలేదా?..  లక్ష్మీ పార్వతి జగన్ కాళ్ల దగ్గర కూర్చుంటే ఎన్టీఆర్ ఆత్మ బాధపడలేదా? ఒక్క టీడీపీ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా?’’ అని లేఖలో కేఈ ప్రశ్నల వర్షం కురిపించారు.బీజేపీ చేతిలో వైసీపీ కీలుబొమ్మగా మారిందని కేఈ దుయ్యబట్టారు.
  పిల్లల వ్యక్తిత్వం మీద ఏది ఎలాంటి ప్రభావం చూపుతుందో చెప్పడం అసాధ్యం. వారి జన్యువులు, తల్లిదండ్రుల తీరు, చుట్టూ కనిపించే వాతావరణం, బడిలోని పరిస్థితులు... ఇలా సవాలక్ష అంశాలు వారిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మనసు మీద గాఢ ముద్ర వేస్తుందన్న విషయాన్ని పరిశోధకులు రుజువు చేశారు. అదేమిటో మీరే చూడండి! ఇంగ్లండుకి చెందిన పరిశోధకులు తల్లిదండ్రుల కష్టం పిల్లల మీద ఎంత మేరకు ప్రభావం చూపుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు కేవలం 15 నెలల వయసున్న కొందరు పిల్లలను ఎన్నుకొన్నారు. పరిశోధకులు వీరి ముందు ఏదో ఒక పని చేస్తూ కనిపించాడు. అయితే కొంతమంది పిల్లల ముందు ఈ పని చాలా సులువుగా సాగిపోతే, మరికొందరు పిల్లల ముందు కాస్త కష్టతరమైన పనులు చేస్తూ కనిపించారు. సహజంగానే తమ కళ్ల ముందు జరుగుతున్న తంతుని, పిల్లలు చాలా నిశితంగా గమనించారు. ఈసారి పిల్లలకు ఓ కష్టతరమైన పనిని అప్పగించారు పరిశోధకులు. ఎవరైతే తమ ముందు పెద్దలు కష్టపడుతూ ఉండటాన్ని గమనించారో, వారు తమకి అప్పగించిన పనిని ఎలాగొలా పూర్తిచేసేందుకు శ్రమించారు. అందులో విజయం సాధించారు కూడా! కానీ ఎవరైతే తేలికపాటి పనులను గమనిస్తూ వచ్చారో, వారు అంతగా శ్రమించేందుకు సిద్ధపడలేదు. ఓ పదిహేను నెలల పిల్లల మీదే ఎదుటివారి కష్టం ప్రభావం చూపితే, ఇక కుర్రకారు సంగతి చెప్పనే అక్కర్లేదు అంటున్నారు పరిశోధకులు. పైగా అపరిచితుల కష్టంకంటే, ఇంట్లో ఉండేవారి కష్టం మరింతగా ప్రభావం చూపడాన్ని కూడా గమనించారు. మన పిల్లలు ఎలా ప్రవర్తించాలనుకుంటామో, అందుకు మనమే ఓ ఉదాహరణగా ఉండాలన్న విషయాన్ని ఈ పరిశోధన తేల్చి చెబుతోంది. - నిర్జర.
  అదేపనిగా టీవి చూడటంలో మునిగిపోతున్నారా? అయితే మీరు తాజాగా వెలుగుచూసిన ఓ సర్వే వివరాలు తెలుసుకోవాల్సిందే. మేరీ ల్యాండ్ విశ్వవిద్యాలయం నలబై వేలమందితో చేసిన అధ్యయనం ఆసక్తిగొలిపే విషయాలను బయటపెట్టింది. వివిధ రకాల సమస్యలు, కోరికలుండి అవి తీరక అసంతృప్తితో ఉన్నవారు అధికంగా టీవి చుస్తుంటారని ఆ సర్వే వెల్లడించింది. ఆనందంగా ఉదేవారు టీవి చూసే గంటలతో పోల్చినపుడు అసంతృప్తిపరులు 30 శాతం అధికంగా కార్యక్రమాల విక్షణకు కేటాయిస్త్రున్నారు. తాత్కాలికంగా ఇది మనసుకు ఊరటనిచినప్పటికి దీర్ఘకాలంలో తీవ్ర నిరాశకు గురి చేస్తుందనేది సారాంశం. ఈ అసంతృప్తికి దూరం కావడం ఎలా అనేది దాన్లోనే బయటపడింది. పుస్తకాలు చదవడం ,స్నేహితులతో కాలక్షేపం చేయడం చక్కటి లైంగిక సంబంధాలు కలిగి ఉండటంవంటివి ఆనందానికి అసలైన మార్గాలని సర్వేలో పాల్గొన్న వారు తేల్చి చెప్పారు.
  Anger is a natural and normal emotion where we get furious over a person or situation and we express our fury and then it is over. Many of us have learnt that it is not nice, polite, or acceptable for us to be angry. We learn to swallow our angry feelings. Anger withheld for a long time leads to resentment which in turn settles in our bodies, in the joints and muscles and can even lead to diseases such as arthritis or varied aches and pains.   It is important that we need to acknowledge all our emotions including anger, and find positive ways to express these feelings. It’s Okay to be angry and we don’t have to hit people or yell at them. A simple and clear statement saying that,” This makes me angry” or “I am angry about what you did” is enough. If it is not appropriate to say this, we still have many options. We can scream into a pillow, beat the bed, run or yell in the car with the windows rolled up or any other way that best suits you. These are all healthy outlets. The key is to find a way to achieve anger release that works for you while keeping you from hurting those around you. Another easier method is where you could just pen your thoughts on to a piece of paper or in a journal, without having to exhibit your feelings in a more private place. It becomes a more secure place to find an expression for your anger and rage without it being detrimental to your personal or work relationships. Sometimes, you'll discover that you've directed your anger at someone or something in error. In addition it is a great way to see yourself - outside of you. Zoom out of the situation and view yourself from higher plane. After you have calmed down you have the ability to logically examine your thoughts, emotions and actions. Visualize your anger and stress being transferred from your mind and body, through your fingers onto a written page. A wonderful way to assess yourself would be to ask: ü  Why did I get angry? ü  What did I do when I got angry? ü  What could I have done differently? Please remember that this journal is not a collection of your mistakes and failures for you to look back upon but it is to be used as an outline for future triumphs. Another healthy way to release anger is through meditative breathing to calm the body-mind. Take a walk for 5 minutes or more, swinging your arms back and forth - when your right foot steps forward, your left arm swings forward, and when your left foot steps forward your right arm swings forward. Keep your breathing even, such as 2 steps to breathe in and 2 steps to breathe out. The minute you get angry with a person or situation - feel the anger, acknowledge it and release it. Then forgive.It Changes your life.  
  వైసీపీ అధ్యక్షుడు జగన్ చేస్తున్న పాదయాత్రపై కాంగ్రెస్ నేత తులసి రెడ్డి  సెటైర్లు వేశారు.పాదయాత్ర అంటే రోజూ రూ. 2 కోట్ల ఖర్చు, నెత్తిమీద ముద్దులు, సెల్ఫీలు అని తులసి రెడ్డి ఎద్దేవాచేశారు.పాదయాత్ర వల్ల రాష్ట్రానికి ఇప్పటి వరకు, రాబోయే రోజుల్లో ఒరిగే ప్రమోజనం ఏంటి? అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జగన్‌ను, వైసీపీ నేతలను ప్రశ్నిస్తోందని తులసి రెడ్డి అన్నారు.జగన్ పాదయాత్ర వలన ప్రత్యేక హోదా వస్తుందా?, కేంద్రం నుంచి రాష్ట్రానికి రెవెన్యూ లోటు భర్తీ కింద రావాల్సిన రూ. 12వేల కోట్లు వచ్చాయా? విభజన చట్టంలో సెక్షన్ 46, సబ్ సెక్షన్ 3 కింద రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ. 23,300 కోట్లు వస్తాయా? పోలవరం ప్రాజెక్టుకు నిధులు వస్తాయా? రాజధానికి నిధులు అదనంగా వస్తాయా? ఏపీకి రావాల్సినవి ఏమైనా సరే జగన్ పాద్రయాత్ర వల్ల వస్తాయా? అని తులసి రెడ్డి జగన్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ఇవన్నీ కేంద్రమే ఇవ్వాలని, ఈ సమస్యలపై పార్లమెంట్ బయట, లోపల పోరాడాలని తులసి రెడ్డి అన్నారు. ఎంపీలు రాజీనామా చేసి, పార్లమెంట్‌లో పోరాడే అర్హత కోల్పోయారని, అసెంబ్లీని బహిష్కరించి... అక్కడ మాట్లాడే అర్హత కూడా కోల్పయారని తులసి రెడ్డి విమర్శించారు.రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము జగన్‌కు లేదన్నారు.
  హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్దనున్న ధర్నాచౌక్‌పై తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల అనుమతితో నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు, ఇతర ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. ధర్నాచౌక్ తరలింపు సరికాదంటూ .. ప్రభుత్వ నిర్ణయంపై పునరాలోచించాలంటూ డిమాండ్ చేశాయి. హైకోర్టును ఆశ్రయించడంతో తాజాగా మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ధర్నాచౌక్‌ ఎత్తివేతపై ఏడాదిగా ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని తెలిపింది. ధర్నా చౌక్‌ ఎత్తివేయడాన్ని సవాల్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
  కేరళలోని శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పు వెలువడిన నాటి నుంచి శబరిమలలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. తీర్పుకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు సుప్రీం తీర్పును సవాల్‌ చేస్తూ ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు సహా పలువురు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశారు. వీటిని అంగీకరించిన న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ రివ్యూ పిటిషన్లను బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ కేసును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టు ఎదుట మొత్తం 49 పిటిషన్లు దాఖలయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఈ పిటిషన్లపై బహిరంగ కోర్టులో విచారణ జరుపుతామని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే పాత తీర్పుపై స్టే ఇవ్వలేమని పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.