Publish Date:Jun 25, 2019

EDITORIAL SPECIAL
  యుద్ధ సమయంలో ఎటువంటి పరిస్థితులలోను అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనేది భారత్ సిద్ధాంతం కాగా ఇపుడు జమ్మూ కాశ్మీర్ విషయమై పాకిస్తాన్ రెచ్చగొడుతున్న నేపథ్యంలో అవసరమైతే ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని రక్షణ శాఖా మంత్రి రాజనాధ్ సింగ్ సంచలన వ్యాఖ్య చేశారు. భారత్ తో తలపడటానికి జిహాద్ తప్ప వేరే మార్గం లేదని అలాగే అణు యుద్ధం కూడా తప్పదని మొన్న పాక్ అధ్యక్షుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా రాజనాధ్ పాక్ కు ఇలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాల వాడకంపై మన విధానాన్ని భవిష్యత్తులో మార్చుకునే అవకాశాలున్నాయని రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. ఇండియా ముందుగా అణ్వాయుధ దాడి చెయ్యకూడదన్నది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచన అని, ఇప్పటివరకూ భారత్ ఈ విధానానికి కట్టుబడి ఉందని ఐతే భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని అయన అన్నారు. వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు పోఖ్రాన్‌లో నివాళులు అర్పించారు.
  రాజకీయాల్లో అతని రూటే సెపరేటు... పార్టీ ఏదైనా, స్థానం ఎక్కడైనా గెలుపు గంట మోగాల్సిందేనన్నది అతని ఫిలాసఫీ... ఇప్పుడు కూడా విన్నింగ్ బెల్ మోగింది... కానీ సైకిల్‌ పంక్చరై కూర్చుంది.... అసలే చేతిలో పవర్‌ లేకపోతే అల్లాడిపోయే ఆయన... ఇప్పుడు ఏ పార్టీలో అధికార గంట మోగించాలా..అంటూ తెగ మధనపడిపోతున్నారట. ఫ్యాన్ చెంతకు వెళ్లి సేదతీరాలా... లేక రారా రమ్మంటున్న పువ్వు పరిమళానికి ఆకర్షితుడు కావాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారట. తన పొలిటికల్ ఫ్రెండ్స్ సుజనా... తిన్నావా అంటూ పలకరిస్తున్నా, మరోవైపు సీఎం రమేష్‌ రారమ్మంటూ పిలుస్తున్నా, వెళ్లాలా వద్దా అని తెగ థింక్ చేస్తున్నారట. అయితే గలగల గంట మోగించే ఆయన, నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టారనే మాట వినిపిస్తోంది. ఇంతకీ ఇతనెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది... ఇంకెవరు గంటా శ్రీనివాసరావే.... ఇంతకీ ఇతని గురించి ఇప్పుడెందుకనుకుంటున్నారా? ఎందుకంటే, టీడీపీ ఓటమి తర్వాత మొట్టమొదటిసారి జరిగిన కీలక సమావేశానికి ఈ గంటా సారు డుమ్మాకొట్టారు. గంటా సారుకి ప్రతిపక్షంలో కూర్చోవడమంటే అస్సలు ఇష్టముండదట. అందుకే పార్టీ మారైనా సరే పదవి సంపాదిస్తారని అంటారు. అందుకే వైసీపీలోకి వెళ్లి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారట. కానీ పార్టీలోకి రావాలంటే, రాజీనామా చేయాల్సిందేనన్న జగన్‌ నిబంధనతో చేసేదేమీలేక ఆగిపోయారట. ఇక మిగిలింది బీజేపీ. అయితే, తనతోపాటు పది పదిహేను మంది ఎమ్మెల్యేలతో కమలం గూటికి వెళ్తారంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదంటూ ఓ చిన్న స్టేట్ మెంట్ ఇచ్చినా, రూమర్లు మాత్రం ఆగలేదు. రాను రాను సైలెంట్ అయిపోవడం, పార్టీ కార్యక్రమాలకు, నియోజవర్గానికి దూరంగా ఉండటంతో, పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. దీనికితోడు అసెంబ్లీ అంత హాట్‌హాట్‌గా జరిగినా, గంటా మాత్రం సైలెంట్‌గా ఉండటం ఈ ప్రచారానికి మరింత బలమిచ్చింది. ఇప్పుడు టీడీపీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టడంతో పార్టీ మారడం ఖాయమనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. అసలే పదవి లేకపోతే ఉండలేరు... పైగా పీఏసీ ఛైర్మన్‌ పదవి దక్కకపోవడంతో, మరింత అసంతృప్తితో ఉన్నారట.  మొత్తానికి గంటా డుమ్మాపై టీడీపీ విస్తృతస్థాయి మీటింగ్లో వాడివేడి చర్చ జరిగిందట. గంటాపై వేటు వేయాల్సిందేనని పలువురు నేతలు చంద్రబాబును గట్టిగా కోరారట. మరి గంటా మౌనం వీడతారా? లేక అంతకంటే ముందే బాబు నిర్ణయం తీసుకుంటారా? ఎవరో ఒకరు మౌనం వీడితే తప్ప ఈ గంట మోగుతుందో లేక సైలెంట్ గా అలాగే కంటిన్యూ అవుతుందో తేలుతుంది.
  సీఎం కేసీఆర్ ఈరోజు తమిళనాడులోని కంచిలో ఉన్న శ్రీఅత్తివరదరాజ స్వామి ఆలయానికి వెళ్లున్నారు. 40 ఏళ్లకు ఒకసారి జరిగే అత్తి వరదరాజస్వామి దర్శనం ఈ ఏడాది ఆగస్టు 17తో ముగుస్తుంది. ఆగస్టు 18న స్వామిని తిగిరి పుష్కరిణిలో భద్రపరుస్తారు. మళ్లీ 2059లోనే అత్తి వరదరాజ స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. దీంతో ఈ ఆలయానికి ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆలయంలో తొక్కిసలాటలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల తొక్కిసలాటలో భక్తులకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. మళ్ళీ 40 ఏళ్ళ వరకు స్వామిని చూసే అవకాశం లేకపోవడం, మనిషి జీవితం మొత్తం మీద ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ స్వామి దర్శనం అయ్యే అవకాశం లేకపోవడంతో భక్తులు ఎగబడుతున్నారు. ఆ భక్తుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేరిపోయారు. మొదట్నుంచి కేసీఆర్ కి పూజలు, దేవాలయాలపై మక్కువ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వరదరాజస్వామి దర్శనానికి పయనమయ్యారు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. వరదరాజ స్వామి దర్శనంతో పాటు ఆయన వైసీపీ ఎమ్మెల్యే రోజాతో భేటీ కూడా కానున్నారని తెలుస్తోంది. సోమవారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచికి చేరుకుంటారు. మార్గమధ్యంలో కేసీఆర్ కుటుంబసభ్యులు రోజా ఇంటికి వెళ్లనున్నారు. వారికి టిఫిన్, మధ్యాహ్న భోజనం రోజా ఇంట్లోనే అని తెలుస్తోంది. ఇందుకోసం రోజా ఇంట్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరిగాయట. గతంలో కేసీఆర్ కుటుంబసభ్యులు తిరుమల వచ్చిన సందర్భంగా వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇప్పుడు రోజా ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రోజాకి మంత్రి పదవి రాలేదని అసంతృప్తిలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు రోజా దాని గురించి కేసీఆర్ వద్ద ప్రస్తావించే అవకాశం ఏమైనా ఉందా అనే చర్చ జరుగుతోంది.
ALSO ON TELUGUONE N E W S
  మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' మూవీ హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. తొలి షెడ్యూల్ కశ్మీర్‌లో జరిగిన విషయం తెలిసిందే. రెండో షెడ్యూల్లో సెట్స్‌పైకి విజయశాంతి అడుగుపెట్టారు. కాగా ఆగస్ట్ 15న దేశానికి కాపలా కాసే సైనికులకు నీరాజనం అర్పిస్తూ నిర్మాతలు విడుదల చేసిన టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన లభించింది. ఈ మూవీలో మహేశ్ ఆర్మీ మేజర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో మహేశ్ కేరెక్టర్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇదివరకు 'భరత్ అనే నేను', 'మహర్షి' సినిమాల్లో సీరియస్ రోల్స్‌లో కనిపించిన మహేశ్.. ఇందులో వాటికి భిన్నమైన కేరెక్టర్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఒక సినీ మేగజైన్‌తో మాట్లాడుతూ అనిల్ చెప్పిన విషయాల వల్ల 'సరిలేరు నీకెవ్వరు' మూవీ పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌గా తయారవుతోంది.  "మహేశ్ కేరెక్టర్ సర్ప్రైజింగ్‌గా, అందరూ కోరుకునే విధంగా ఉంటుంది. ఆయన నుంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ను చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆయనలోని ఎనర్జీ లెవల్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయి. అలాగే యాక్షన్ కూడా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 'సరిలేరు నీకెవ్వరు' అనేది పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్. మహేశ్ సినిమా అంటే ఎలాంటి అంచనాలుంటాయో, దానికి తగ్గట్లు గానే సినిమా ఉంటుంది. వేరే కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కథకు లింకయ్యే మంచి ఎమోషన్స్ ఉంటాయి. విజయశాంతి కేరెక్టర్‌లో మంచి ఎమోషన్స్ ఉంటాయి. మహేశ్ అభిమానులకు ఈ సినిమా ఒక పండగలా ఉంటుంది. డైరెక్టర్ అయిన దగ్గర్నుంచీ మహేశ్‌తో పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పటికి ఆ అవకాశం వచ్చింది. దాన్నెంత వరకు సద్వినియోగం చేసుకుంటాననేదే నేను చేయాల్సిన పని. మహేశ్ నాకు గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. అంతే లెవల్‌కు రిజల్ట్ చూపించగలిగితే 'సరిలేరు నీకెవ్వరు' అనేది ఒక మెమరబుల్ సినిమాగా మిగిలిపోతుంది. ఇప్పుడు నేను చేస్తున్నది ఆ పనే" అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. 'సరిలేరు నీకెవ్వరు'లో మహేశ్ జోడీగా తొలిసారి రష్మికా మందన్న నటిస్తోంది. 2020 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
  ఓవర్సీస్ మార్కెట్‌లో శర్వానంద్ సినిమా 'రణరంగం'ను, అడివి శేష్ సినిమా 'ఎవరు' ఓడించింది. ప్రధానంగా యు.ఎస్.లో 'రణరంగం' కలెక్షన్లు డిజాస్ట్రస్‌గా ఉంటే, 'ఎవరు' వసూళ్లు మెరుగ్గా ఉన్నాయి. నిజానికి శేష్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. బుధవారం 'ఎవరు' ప్రీమియర్ షోస్‌కు 61,499 డాలర్లు వసూలవడం యు.ఎస్.లో అతని మార్కెట్ వాల్యూ పెరుగుతోందని చెప్పడానికి గట్టి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా బాగుందనే టాక్‌తో గురువారం వసూళ్లు కూడా బాగున్నాయంటున్నారు. గురువారం ఆ సినిమా 43,320 డాలర్లను వసూలు చేసింది. ఇక సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన 'రణరంగం' సినిమాకు బుధవారం ప్రీమియర్ షోస్ వెయ్యకపోవడం అక్కడి వసూళ్లను తీవ్రంగా ప్రభావితం చేసిందని చెబుతున్నారు. గురువారం తొలిరోజు ఆ సినిమా కేవలం 24,014 డాలర్లను మాత్రమే వసూలు చేసింది. ప్రీమియర్ షోస్‌ను పక్కనపెట్టినా, తొలిరోజు వసూళ్లలో 'ఎవరు'తో పోలిస్తే 'రణరంగం' ఎంత వెనుకబడి ఉందో స్పష్టమవుతోంది. రివ్యూస్, బ్యాడ్ మౌత్ టాక్ 'రణరంగం' వసూళ్లను బాగా దెబ్బ తీశాయి. దీంతో యు.ఎస్.లో ఆ సినిమా డిజాస్టర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
  'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన పూరి వెంటనే క్రేజీ హీరో విజయదేవరకొండ హీరో గా ఓ సినిమా చేయబోతున్నట్లుగా ఇటీవల ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. పూరి , ఛార్మి నిర్మాతలుగా వ్యహరిస్తున్నారు. విజయ్ సరసన హీరోయిన్ గా అతిలోకసుందరి కూతురు జాన్వీ కపూర్ నటించనున్నట్లు సమాచారం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసిన పూరి.. ఇటీవల పూరి జాన్వీ తండ్రి బోనికపూర్ ని సంప్రదించినట్లు వినికిడి. ఆయన కూడా సుముఖంగానే ఉన్నారట. త్వరలో జాన్వీ ఎంట్రీ పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఇక కాఫీ విత్ కరణ్ షో లో విజయ్ దేవరకొండ తో నటించాలని ఉంది అని చెప్పింది జాన్వీ. ఇక తన కోరికను పూరి తీర్చుతున్నాడు అంటున్నారు సినీ జనాలు. విజయ్ దేవరకొండ, జాన్వీ కాంబినేషన్ సెట్ అవ్వాలే కానీ సినిమాకు విపరీతమైన హైప్ రావడం ఖాయం. చూద్దాం ఎలా ఉంటుందో మరి.
  ఇంతవరకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో తన గ్లామర్  తో అలరించిన  తమన్నా త్వరలో మలయాళం లో కూడా అలరించబోతుందట. అది కూడా ఒక హారర్ సినిమా తో మలయాళం లో ఎంట్రీ ఇస్తోంది ఈ గ్లామర్ బ్యూటీ. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే ... సంధ్య మీనన్ డైరెక్షన్ లో ఒక సినిమా ప్లాన్ జరుగుతోందట. సెంట్రల్ జైల్ నేపథ్యం లో జరిగే కథాశంతో ఈ సినిమా తెరకెక్కుతోందట. దీనికి `సెంట్రల్ జైలిలే దెయ్యం ` అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో తమన్నా అందంతో పాటు అభినయం ప్రదర్శించే పాత్ర దక్కినట్లు సమాచారం.  ప్రెసెంట్ తమన్నా సైరా లో క్యారక్టర్ చేసింది. ఈ సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ కి రెడీ అవుతోంది. త్వరలో తమన్నా మళయాలం  సినిమా కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలున్నాయి.
  నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాని  అంధుడుగా ఓ చిత్రం లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. నాని జెర్సీ సినిమా బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమం లో నాని బాలీవుడ్ సినిమా అంధాదున్  తెలుగు రీమేక్ లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. అయుష్మాన్ ఖురానా హీరో గా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో సుపుర్హిట్ చిత్రం గా నిలిచింది. ఇందులో నటనకు గాను ఆయుశ్మాన్ జాతీయ అవార్డు కూడా పొందాడు.  ఇప్పటికే తమిళ్ వెర్షన్ లో ప్రశాంత్ హీరోగా నటించనున్నాడట. ప్రెసెంట్ గ్యాంగ్ లీడర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నాని ఇంద్రగంటి డైరెక్షన్ లో `వి` చిత్రం లో నటిస్తున్నాడు . నెగెటివ్ క్యారక్టర్ లో నటిస్తున్న నాని తదుపరి సినిమా అంధాదున్ తెలుగు రీమేక్ లో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  
  ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కి వరద ముప్పు ఉందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇంటిని ఖాళీ చేశారు. అయితే ఇదంతా అధికార పార్టీ వైసీపీ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంది. కృష్ణానది ప్రవాహంపై ముందస్తు చర్యలు తీసుకోలేదని, రాజధాని భూముల్లోకి వరద రావాలని కుట్రలు చేస్తున్నారన్నారని.. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపణలు చేస్తున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం ఏపీ సీఎం జగన్ కి ఇష్టం లేదని.. అందుకే అమరావతికి వరద నీరు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారని ఉమా విమర్శించారు. ఈ వరద నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద 4 రోజుల క్రితమే మానిటర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం కావాలనే ఈ వరదను సృష్టించిందని ఉమా ఆరోపించారు. చంద్రబాబు ఇంటిలోకి నీళ్లు తీసుకురావాలన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదని ఉమా విమర్శించారు. వరద పరిస్థితిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రివ్యూ చేస్తాడా? మరి సీఎం ఏం చేస్తున్నాడు? ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నాడు? అని ఉమా ప్రశ్నించారు. అయ్యా జగన్ మోహన్ రెడ్డి.. నీకు మళ్లీ చెబుతున్నా. నువ్వు అమెరికాలో ఉన్నట్లు ఉన్నావ్. ఇక్కడ వర్షం పడలేదు. మున్నేరు, వైరా, కట్లేరు, బుడమేరు వాగుల్లో నీళ్లు రాలేదు. అయినా 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చినా ఇవాళ నువ్వు జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, గద్దె రామ్మోహన్ ఏరియా అంతా ముంచేశావ్ అని విమర్శించారు. రాజధానిని కడప జిల్లాలోని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని జగన్ కుట్ర పన్నారు. అందుకే అమరావతిలో రైతుల భూములు ముంచాలని నిర్ణయించారు. అందుకే శ్రీశైలం దగ్గర నీటిని నిలబెట్టారు అని ఉమా విమర్శలు గుప్పించారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఇటువంటి ప్రచారమే జరుగుతోంది. కావాలనే ప్రకాశం బ్యారేజి గేట్లు ముందే ఎత్తలేదని కొందరు విమర్శిస్తున్నారు. "బ్యారేజి నిల్వ 3 టీఎంసీ లు అయితే అందులో 1.5 టీఎంసీ పూడిక పోతే మిగిలేది 1.5 టీఎంసీ సామర్ధ్యం. భారీ వరద వస్తుంది అని ముందే తెలుసు. నాగార్జున సాగర్  నిండ బోతున్నది  అని తెలుసు అందుకే గేట్లు అన్ని ఎత్తి నీరు కిందకి వదులుతున్నారు, దిగువన ఉన్న పులిచింతల  కూడా నిండుకుండా లా ఉంది అక్కడ నుంచి కూడా నీరు వదులుతున్నారు. ఈ విషయం గత వారం రోజులు గా అందరికి తెలుసు. అధికారులకు ముందే తెలుసు. కానీ ఇప్పటికే పట్టిసీమ జలాలతో నిండుగా ఉన్న ప్రకాశం బ్యారేజి గేట్లు నిన్నటి వరకు ఎందుకు ఎత్తలేదు? నీరు కిందకి  ఎందుకు వదలలేదు.? రోజు కి 4 నుంచి6 లక్షల క్యూసెక్ ల నీటి ని సాగర్ నుంచి వదులుతున్నారు. ముందు గానే ప్రకాశం బ్యారేజి ని కొద్దిగా ఖాళీ చేసి పై నుంచి వచ్చే నీటి ని వచ్చినది వచ్చినట్టు గా కిందకి వదిలితే బ్యారేజి మీద వత్తిడి తగ్గేది.ముంపు ఉండేది కాదు . కానీ లోతట్టు ప్రాంతాలు మునిగినాపర్లేదు అని రెండు రోజులు ఆలస్యం గా గేట్లు ఎత్తిన కారణం కేవలం రాజకీయం. పై నుంచి వస్తున్న భారీ వరద కారణం గా ముంపు కలగాలి. ఆ ముంపుకి లోతట్టు ప్రాంతాలు మునగాలి. ప్రజావేదిక స్థలం , చంద్రబాబు ఉంటున్న ఇల్లు ముంపుకి గురి కావాలి. చూసారా మునిగిపోయే ప్రాంతం లో రాజధాని కట్టారు అని , చంద్రబాబు ఉంటున్న ఇల్లు కట్టిన ప్రజావేదిక మునిగి పోయింది అందుకే రాజధాని ఇక్కడ వద్దు అన్నది.. అనే విష ప్రచారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు  తెలుస్తోంది." "ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎదురు చూశారు. కానీ, ఇంకా కనీసం 2 మీటర్లు అంటే కనీసం మరో 6.5 అడుగులు మట్టం పెరిగితే కానీ, ఆ ఇంటి గార్డెన్ ఏరియా ని టచ్ చేయలేవు. ఈ లోపు కేంద్ర జల శక్తి శాఖనుండి.. బారేజ్ గేట్లు ఎత్తనందుకు  అక్షింతలు పడ్డాయి. ఇంత కౄరమైన ఆలోచన ఎందుకు? అమరావతి కి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేయాలి. అమరావతి మునగాలంటే ఇంకా 23 అడుగులు మట్టం పెరగాలి.. అది జరిగే పని కాదు." అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
  చంద్రబాబుతో మీటింగ్ అంటే, సాధారణంగా ఆయనే మాట్లాడారు. ఆయనే చెబుతారు. ఎంత పెద్ద లీడరైనా, బాబు కంటే సీనియర్ అయినాసరే సెలైంట్ గా వినాల్సిందే. అలాంటింది పార్టీ ఘోర ఓటమి తర్వాత జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. తమ ముందున్నది పార్టీ అధినేత అనే సంగతి మర్చిపోయి లావా లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. రొటీన్‌కు భిన్నంగా హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ లో హాట్‌హాట్‌గా సాగిన మీటింగ్ లో ఒకరిద్దరు నేతలు నిప్పులు చెరిగారు. తమ గుండెల్లో దాగున్న బాధనంతా వెళ్లగక్కారు. ఎన్నడూ అధినేత మాటకు ఎదురుచెప్పని లీడర్లు కళ్లెర్ర చేశారు. ఇదేనా పార్టీలో క్రమశిక్షణ, ఇంతేనా పార్టీలో కొందరి నేతల బాధ్యతా అంటూ శివాలెత్తారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా కాలేదు, అప్పుడే విమర్శలేంటంటూ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తంచేశారు. కొత్త సర్కారుకు కొంత సమయం ఇద్దాం, తప్పులు చేయనిద్దాం, ఆ తప్పులు ప్రజల్లోకి వెళ్లేవరకు ఆగుదాం, ఆ తర్వాతే ప్రజల తరపున రోడ్డెక్కుదామంటూ తన వాదనను కుండబద్దలు కొట్టారు. ఇప్పుడే విమర్శలుచేస్తే టీడీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయంటూ చంద్రబాబు ముందు గట్టిగానే వాదించారట. అయినా ఆకలేసినప్పుడే అన్నం పెట్టాలి... అప్పుడే అన్నం విలువ తెలుస్తుందని, ముందే పెడితే ప్రజలకు అర్ధంకాదంటూ అయ్యన్న చెలరేగి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రజలకు తాను చెప్పే నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చంటూనే, పరోక్షంగా లోకేష్, దేవినేని ఉమాపై విరుచుకుపడినట్లు తెలిసింది. ప్రతి విషయానికీ ట్విట్టర్లోనో, లేదంటే తిట్ల దండకాలో ఎందుకంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ ప్రక్షాళన విషయంలో చంద్రబాబు మొహమాటపడకుండా, కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అయ్యన్న సూచించారు. ఇక టీడీపీలో అత్యంత సీనియర్‌ లీడరైన గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా, గట్టిగానే మాట్లాడారు. ఓడిపోయిన నేతలను ఇంకా నెత్తిన పెట్టుకుని ఊరేగడం కరెక్టు కాదన్నారు. పార్టీలో స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారని, లాయలిస్టులకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ముందే గుండెల్లో బాధను గోరంట్ల బయటపెట్టారు. కొంతమంది డబ్బు సంపాదించి, పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారని, ఇకనైనా అలాంటి తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని కోరారు. పార్టీలో యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే తన టీడీఎల్పీ ఉపనేత పదవిని బీసీకి ఇవ్వాలని సూచించారు. అయితే, బోండా ఉమతో పాటు కొందరు కాపు నేతలను ఉద్దేశించే గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.  అయితే, ఎప్పుడూ గొంతెత్తని నేతలు గుండెల్లో బాధనంతా వెళ్లగక్కుతుంటే, వామ్మో, సీనియర్ నేతల్లో ఇంత ఆక్రోశం దాగుందా అంటూ చంద్రబాబు షాకైనట్లు తెలుస్తోంది. ఒకానొక టైమ్ లో అయ్యన్న సీరియస్‌గా మాట్లాడుతుంటే, కొంతమంది నేతలు వారించినట్టు తెలిసింది. అయితే వెనక్కి తగ్గని అయ్యన్న... నిజాలు మాట్లాడుకుని, లోపాలు సరిదిద్దుకుని, పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవాలనేదే తన ఉద్దేశమని, ఆత్మస్తుతి, పరనిందలా సమావేశం జరిగితే ఉపయోగం ఉండదని రివర్స్ అయ్యారట. అతి విశ్వాసం, ప్రత్యర్థుల బలాన్ని తక్కువగా అంచనా వేయడం, కొందరు నేతల అవినీతిని చూసీచూడనట్టు వ్యవహరించడమే పార్టీ కొంపముంచిందని అన్నట్టు తెలిసింది. అయితే, నేతల మాటలను సావధానంగా విన్న అధినేత, ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని, పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్దామని నేతలకు హామీ ఇచ్చారట.
  జగన్ ఆలోచనలకు, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీడీపీని కార్నర్ చేయాలనో... లేక చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలనో... తెలియదు కానీ జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలను అటు కేంద్రం... ఇటు ప్రజలు తప్పుబడుతున్నా... తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న మాదిరిగా జగన్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా నవ్యాంధ్ర జీవనాడైన పోలవరంపై జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్రం తప్పుబట్టగా, ఇఫ్పుడు స్వయంగా పోలవరం అథారిటీయే షాకిచ్చింది. పోలవరం టెండర్ల రద్దు నిర్ణయం అత్యంత బాధాకరమంటూ, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలవనరులశాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టు వ్యయం పెరగడంతోపాటు ఇది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటూ దాదాపు చేతులెత్తేశారు. సేమ్ టు సేమ్ ఇలాంటి కామెంట్సే చేసింది పోలవరం అథారిటీ. కొత్తగా టెండర్లు పిలవడం వల్ల కాలాతీతమవుతుందని, వ్యయం భారీగా పెరుగుతుందని, చివరికి పోలవరం భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలవరం టెండర్ల రద్దు, ప్రీ-క్లోజర్ పై నాలుగైదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన అథారిటీ... రివర్స్ టెండరింగ్ తో రిస్కేనని తేల్చిచెప్పింది. ప్రస్తుత కాంట్రాక్టు సంస్థల పనితీరు సంతృప్తికరంగానే ఉందని, అలాంటప్పుడు టెండర్లు రద్దు చేయడం ఎందుకుని అభిప్రాయపడింది. ఏదేమైనా రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం సరికాదన్న పోలవరం అథారిటీ... పునరాలోచించుకోవాలంటూ జగన్ సర్కారు సూచించింది. అయితే, తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టంచేసింది. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోలవరం అథారిటీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంతోపాటు సంచలనంగా మారింది. మరి పోలవరం అథారిటీ కామెంట్స్ పై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.
  జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూట్ మారినట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో ఆయనకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. దీంతో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అసెంబ్లీలో పవన్ గొంతుకై వినిపిస్తారు, పవన్ గొంతుకై ప్రశ్నిస్తారు అని భావించారంతా. కానీ రాపాక మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని రాపాక వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో జన సైనికులే కాదు, సాధారణ జనాలు కూడా షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే రాపాక రూట్ మార్చారు. జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాపాక విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజులకే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రాపాక పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, దేశంలోనే ఏపీ చాలా వెనకబడి ఉందని రాపాక తెలిపారు. ప్రభుత్వం పాలనపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కానీ ప్రభుత్వం ఆ పని చెయ్యకపోవటం వల్లే ఇప్పుడు వ్యతిరేకత వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని రాపాక ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇంతకాలం జగన్ ప్రభుత్వ పాలన విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయని రాపాక పవన్ ఇచ్చిన సూచనలతోనే తన పంధా మార్చుకున్నారనే భావన వ్యక్తమవుతుంది. ఇటీవల రాపాకతో సమావేశం అయిన పవన్ రాపాక కు పలు సూచనలు చేసినట్టు సమాచారం. అందుకే రాపాక రూట్ మార్చి జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారని తెలుస్తోంది.
  ఏపీ ప్రభుత్వం సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల జీతాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు సాక్షి పే రోల్స్‌లో ఉన్న 8 మంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు.. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల పేరుతో జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జీతాలు కూడా లక్షల్లో ఉండటం, అదే స్థాయిలో అలవెన్స్‌లు కూడా మంజూరు చేయడం విమర్శలకు కారణమవుతోంది. ఇప్పటికే 8 మందిని ఇలా తీసుకున్నారని.. మరికొంత మందిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ బంధువు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజాసంబంధాల సలహాదారుగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఉండేవారు. తర్వాత పూర్తిగా వైసీపీ వ్యవహారాలు చూస్తున్నారు. అయినప్పటికీ.. ఆయనకు సాక్షి నుంచి జీతం అందేది. ఇప్పుడు ప్రజాసంబంధాల సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు. ఈయన జీతం రూ. మూడు లక్షలకుపైనే. 8 మంది వరకూ సిబ్బందిని నియమించునే అవకాశం, కారు, ఫోన్, ఇంటి అద్దె ఇలా అన్ని రకాల అలవెన్సులు కలిపి.. నెలకు రూ. 10 లక్షలకు పైగానే అవుతుంది. అంటే ఏడాదికి 1 కోటి 20 లక్షలు.. ఐదేళ్లలో ఇది 6 కోట్లు పైనే.. ఇలా ఒక్క సాక్షి ఉద్యోగికి ఏపీ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కమ్యూనికేషన్ సలహాదారుడిగా జీవీడీ క్రిష్ణమోహన్ ని నియమించారు. ఈయన సాక్షిలో బ్యూరో చీఫ్ స్థాయిలో పనిచేసేవారు. జగన్ సభలలో మాట్లాడే స్పీచ్‌లు ఈయనే రాసేవారని సమాచారం. రెండు నెలల క్రితం వరకూ సాక్షి తరపునే జీతం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించి జీవీడీ క్రిష్ణమోహన్ కి ఏడాది 1 కోటి 20 లక్షలకు పైనే.. ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించనున్నారని తెలుస్తోంది. సీపీఆర్వోగా పూడి శ్రీహరి అనే సాక్షి ఉద్యోగిని నియమించుకున్నారు. సాక్షిలో.. రూ. 50 వేలలోపే జీతం తీసుకునే ఈ ఉద్యోగి.. జగన్ పాదయాత్ర సమయంలో ఆయన వెంట ఉంటూ మీడియా వ్యవహారాలు చూసుకున్నారని తెలుస్తోంది. ఈయనను ఇప్పుడు సీపీఆర్వోగా నియమించారు. ఈయన జీతం కూడా.. సీనియర్ సలహాదారుల స్థాయిలోనే ఉందని చెబుతున్నారు. అన్నీ కలిపి నెలకు.. రూ. 10 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వీరు మాత్రమే కాదు.. సాక్షి పేరోల్స్‌లో కాస్త ఎక్కువ జీతం అనుకున్న మరో ఐదుగురికి కూడా.. ఇదే తరహాలో సలహాదారుల పోస్టులు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇలా నియమించుకుంటున్న సలహాదారులకు.. కావాల్సిన సిబ్బంది కూడా సాక్షి గ్రూప్ లో పనిచేసే ఉద్యోగులేనని చర్చ నడుస్తోంది. ప్రమాణస్వీకారం చేసేటప్పుడు తాను నెలకు ఒకే ఒక్క రూపాయి జీతం తీసుకుంటానని ప్రకటించిన సీఎం జగన్.. దయనీయస్థితిలో ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడం తన ముందున్న ప్రథమకర్తవ్యం అని ప్రకటించారు. తాను చంద్రబాబులా హిమాలయ వాటర్ తాగనని, కిన్లే తాగడం వల్ల ఖజానాకు రోజుకు 80 నుంచి 120 రూపాయలు మిగిల్చుతానని చెప్పుకొచ్చారు. అయితే.. ఏపీ ఆర్థిక కష్టాల్లో ఉందని.. తాను ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించిన జగన్.. ఇలా సలహాదారులు, వారి సహాయకుల కోసం.. కోట్లకు కోట్లు జీతభత్యాలు వెచ్చించడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ప్రభుత్వానికి అవసరం అయి తీసుకుంటే పర్వాలేదు కానీ.. తమ సొంత సంస్థలో జీతాలు తీసుకునేవారిని ఇలా నియమిస్తూండటంతో.. ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  కాశ్మీర్ అంశంలో మోడీ సర్కార్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు సిద్దమవుతుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన సమావేశమైన జాతీయ భద్రతా కమిటీ నిన్న కీలక నిర్ణయాలను తీసుకుంది. భారత్ దౌత్య సంబంధాలను తెంచేసుకోవాలని నిర్ణయించుకున్న పాక్ యుద్దానికి వెనుకాడొద్దని సైన్యానికి పరోక్ష అలర్ట్స్ పంపింది. లాహోర్-ఢిల్లీ మధ్య బస్సు సర్వీసును కూడా నిలిపివేసిన పాకిస్తాన్ వాఘా సరిహద్దును కూడా మూసివేయాలని ఆదేశించింది.  ఆగష్టు 15ను బ్లాక్ డేగా నిర్వహించాలని, భారత్ హై కమిషన్ ను వెనక్కు పంపాలని, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ను వెనక్కు రావాలని ఆదేశాలిచ్చింది. ద్వైపాక్షిక  ఒప్పందాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని.. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటన విషయంలోనే యుద్ధం వస్తుందని భావించినా పాక్ తేలు కుట్టిన దొంగలా ఉండిపోవడం వలన అది సద్దుమణిగింది.  అయితే ఆర్టికల్‌-370ని మోదీ సర్కారు నిర్వీర్యం చేయడం భారత్‌-పాక్‌ మధ్య యుద్ధానికి దారితీయొచ్చని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో భారత్‌లో మరిన్ని ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని, కశ్మీరీలను ఎంత అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే, తమ హక్కుల కోసం వారు అంతగా పోరాటం చేస్తారని ఆయన హెచ్చరించారు.  కశ్మీరీలకు సాయం చేసేందుకు ఎంతదాకైనా వెళతామని, ఇందుకు తమ బలగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వా కూడా ప్రకటించారి. తాజాగా కమాండర్లతో సమావేశం నిర్వహించారు. కశ్మీరీలకు చివరి క్షణం వరకూ పాక్‌ సైన్యం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవద్ చౌదరి యుద్ధానికి వెనుకాడొద్దని, యుద్ధమంటే గెలుపోటముల కోసం చేసేది కాదని, గౌరవం కోసం, పరువు, ప్రతిష్ఠల కోసం చేసేదని చెప్పుకొచ్చారు.  ఈ నేప‌థ్యంలో ప‌రిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని భార‌త్‌, పాక్ ప్ర‌జ‌లు ఆసక్తిగా గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌ధానంగా పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన ప్ర‌సంగాన్ని ఒక‌సారి గ‌మ‌నిస్తే.. ఇరుదేశాల మ‌ద్య యుద్ధం త‌ప్ప‌దేమోన‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.  చూద్దాం ఏమవుతుందో ?
  ఓ గురువుగారు సీతాపురం అనే పల్లెటూరి గుండా వెళ్తున్నారు. ఆ పల్లెటూరు అలాంటి ఇలాంటిది కాదు. అందులో అందరూ వీరులే! రాజుగారికి ఉన్న సైన్యంలో సగభాగం అక్కడి నుంచే వస్తుంటారు. సాక్షాత్తూ రాజుగారి సైన్యాధ్యక్షుడు కూడా అక్కడి వాడే. మల్లవిద్య, కర్రసాము, కత్తియుద్ధం… ఇలా ఎలాంటి యుద్ధవిద్యలో అయినా సరే, ఆ ఊరి జనానికి సాటి లేదు. అలాంటి సీతాపురం గుండా గురువుగారు వెళ్తున్నారు. అదే సమయంలో వారికి ఆ ఊరిలోనే విడిది చేసి ఉన్న సైన్యాధ్యక్షుడు ఎదురుపడ్డాడు. గురువుగారిని చూసిన సైన్యాధ్యక్షుడు `గురువుగారూ మీ గురించి చాలా విన్నాను. ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎన్నాళ్ల నుంచో ఒక అనుమానం పీడిస్తోంది. దయచేసి నివృత్తి చేయండి` అని అడిగాడు. `నాకు చేతనైతే తప్పక నివృత్తి చేస్తాను. ఏమిటా అనుమానం` అన్నారు గురువుగారు. `మన పెద్దవాళ్లు ఎంతసేపూ స్వర్గం, నరకం అని ఊదరగొడుతుంటారు కదా! నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే వాటికి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి?` అని అడిగాడు. `ఇంత మంచి ప్రశ్న అడిగావు. ఎవరు నువ్వు` అని అడిగారు గురువుగారు. `నేను ఈ రాజ్యానికే సైన్యాధ్యక్షుడిని. రాజుగారి విజయాలన్నింటికీ కారణం నేనే!` అని గర్వంగా బదులిచ్చాడు సైన్యాధ్యక్షుడు. `అబ్బే నిన్ను చూస్తే సైన్యాధ్యక్షునిలా లేవే. ఎవరో పగటివేషగాడిలా ఉన్నావు. నిన్ను చూస్తే నవ్వు వస్తోంది కానీ భయం వేయడం లేదు` అని ఎగతాళిగా అన్నారు గురువుగారు. `ఎంతమాట! నేను పగటివేషగాడిలా ఉన్నానా! నన్ను చూస్తుంటే నవ్వులాటగా ఉందా! నీ నవ్వుని గొంతులోనే ఆగిపోయేలా చేస్తాను. ఉండు!`అంటూ తన కత్తిని దూసి గురువుగారి కంఠానికి గురిపెట్టాడు సైన్యాధ్యక్షుడు. `ఇదే నాయనా నువ్వు చూడాలనుకున్న నరక ద్వారం. నీ కోపంతోనూ, ఉద్వేగంతోనూ, అహంకారంతోనూ… దాన్ని ఇప్పుడే నువ్వు తెరిచావు` అన్నారు గురువుగారు. గురువుగారి మాటలకు సిగ్గుపడి సైన్యాధ్యక్షుడు తన కత్తిన తీసి ఒరలో ఉంచుకుని బాధగా నిలబడ్డాడు. `ఇప్పుడు నువ్వు స్వర్గంలోకి అడుగుపెట్టావు. నీ ఆలోచనతోనూ, ప్రశాంతతతోనూ, పశ్చాత్తాపంతోనూ స్వర్గపు ద్వారాలను తెరిచావు` అన్నారు గురువుగారు చిరునవ్వుతో! అపై సైన్యాధ్యక్షుడిని చూస్తూ ఇలా అన్నారు `చూశావా! స్వర్గం, నరకం రెండూ నీలోనే ఉన్నాయి. నువ్వు అనాలోచితంగా ప్రవర్తించిన రోజు నరకానికి దారిని తెరుస్తావు. జాగ్రత్తగా, ఖచ్చితంగా ఆలోచించగలిగిన రోజు స్వర్గానికి తలుపులు తీస్తావు. స్వర్గనరకాలు ఎక్కడో కాదు, నీ మనసులోనే ఉన్నాయి.` అంటూ సాగిపోయారు గురువుగారు.
  Raksha Bandhan, means the “Knot of Protection” and is one of the important festivals celebrated by Hindus throughout the world. Celebrated on Sravana Pournami Day, this festival stands testimony of  the beautiful relationship shared between brothers and sisters. It has been termed as a lifelong promise of protection made on this special occasion. The beautiful relationship of love, care and affection between siblings is further enhanced with the tying of the sacred thread – the Raakhi, by the sister on her brothers wrist. Story of Raksha Bandhan There are many tales as to why Raksha Bandhan became a an important festival and one of them is the story of King MahaBali and Lakshmi Devi. As the story goe,s King Mahabali was a great devotee of Lord Vishnu and asked him to come down from his heavenly abode of Vaikuntam and protect his Kingdom. Lord Vishnu agreed and came down disguised as a door keeper. But Lakshmi his consort was left alone and wanted to bring back Vishnu back to his abode. She went to his kingdom disguised as a Brahmin woman and took refuge in his palace on the pretext that her husband was away and needed protection. On the Shravana Pournami day she tied a sacred thread on the king’s hand and asked him for a boon. Mahabali acceded and she requested for the door men who was actually Lord Vishnu to be sent back to Vaikuntam along with her. Mahabali recognizing her to be Goddess Lakshmi, realized his folly and requested Lord Vishnu to accompany Lakshmi back to Vaikuntam and to his rightful place. In return, Vishnu promised to return and stay with Bali for four months of each year. Hence the festival is also called Baleeva and on this day sisters come to their brothers’ home and tie Raakhis’ to their brothers. We are indeed truly blessed to have this tradition of brothers and sisters bonding where the woman folk and are respected and taken care of by their brothers lifelong and given wonderful gifts as a token of love and affection.     So with Raksha Bandhan right around the corner and you're probably wondering as to what you should be getting for your sister when she ties the Rakhi? Check out our Tone shop for interesting Gifting ideas this Raksha Bandhan Day ! Beautiful Raakhis for your brothers and wonderful gifting ideas for your sisters...
    Busy life, Work starts at 9, we start off with improper breakfast and rush to work by some local train or cab or personal vehicle. From then all our work at desk makes us stick to a place, where there's no moment Physically and mentally as well, because your brain is occupied with lot of work stress. This cycle not only ruins your health but your mental abilities as well . Here are few steps which you can follow at your workplace and become Fit and Firm. 1. One of the best ways, always choose stairs instead of taking the elevator. 2. The inflatable exercise balls helps you make an effort to sit straight. People tend to slouch and use bad posture, and sitting in a chair puts your abs on 'slack' and decreases core strength. Using this ball counteracts  both of these things.   3. You can try Triceps desk dips, and shoulder spin while you're at desk work. 4. Keep moving in your office, don't just get stick up at a place. 5. Raising your hands  and stretching your body can help you burn some calories. 6. Laugh Happily, Yes it burns few calories too. 7. An hour of standing  while working can help to burn few calories. 8. If you can't take time for gym after office. Just keep dumb-bells at your desk. Helps your muscles and body to be active. 9. Avoid diet sodas and choose a bowl of fruits from Office Pantry. 10. Sit up straight with your shoulders back and abs tight, helps burn some calories. 11. Why Bike ? Try cycling helps you to stay fit, reduce stress. Try these simple methods, you'll definitely get good results. Stay Health. Stay Happy.   Alekya.N
  తెలంగాణ టీడీపీ సీనియర్‌ నాయకుడు దేవేందర్‌గౌడ్‌ బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు ఆయన కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా పార్టీ మారుతున్నారని అంటున్నారు. టీడీపీలో అత్యంత సీనియర్‌ లీడర్‌ అయిన దేవేందర్‌గౌడ్‌ గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గనడం లేదు. అనారోగ్య కారణాలతో ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.  ఒకప్పుడు టీడీపీలో నెంబర్‌ టూగా వెలుగొందిన దేవేందర్‌గౌడ్‌.. తరువాత తెలంగాణ అంశంతో చంద్రబాబుతో విభేదించి 'నవ తెలంగాణ ప్రజా పార్టీ' పేరుతో స్వంతంగా పార్టీని ప్రారంభించారు. తరువాత ఆ పార్టీని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేసి.. ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం మళ్లీ టీడీపీ గూటికి చేరారు. అయితే తరువాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరుపున దేవేందర్‌గౌడ్‌ పోటీ చేసినా గెలవలేకపోయారు. అయితే ఆయనకు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా రాజకీయంగా ఆయన క్రియాశీలకంగా లేకపోయినా.. ఆయన కుమారుడు రాజకీయ ప్రవేశం చేసారు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా, 2018 ఎన్నికల్లో ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు తెలంగాణలో టీడీపీ పూర్తిగా డీలా పడిపోవడంతో.. దేవేందర్‌గౌడ్‌ కుటుంబం రాజకీయంగా బాగా వెనుక పడిపోయింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయంగా ఎదుగుతోన్న బీజేపీ ఆయనను పార్టీలోకి తీసుకోవాలని భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఆయన వస్తే తెలంగాణ బీసీల్లో బలమైన నాయకుడు పార్టీలో చేరినట్లు అవుతుందనే భావనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. జరుగుతున్న ప్రచారం ప్రకారం దేవేందర్‌గౌడ్‌ కుటుంబం త్వరలోనే టీడీపీని వీడి బీజేపీ గూటికి చేరనుందని సమాచారం.
  రివర్స్ టెండరింగ్ లు, ఒప్పందాల రద్దులు, స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు వంటి నిర్ణయాలతో.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఏపీకి కంపెనీలు రాకుండా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుండి కంపెనీల వరకు.. జగన్ తీసుకున్న నిర్ణయాలను మళ్ళీ ఆలోచించి వెనక్కి తీసుకోవాలని సూచిస్తున్నాయి. అయితే జగన్ మాత్రం వెనకడుగు వేయట్లేదు. దీంతో ఏపీ వైపు కంపెనీలు చూడవని టీడీపీ సహా పలువురు విమర్శిస్తున్నారు. ఒకవైపు జగన్ నిర్ణయాలతోనే కంపెనీలు వస్తాయా రావా అన్న సందేహాలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు కొందరు స్థానిక వైసీపీ నేతల పుణ్యమా అని ఉన్న కంపెనీలు కూడా పోయేలా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల కిందట.. అనంతపురం జిల్లాలో ఉరవకొండ నియోజకవర్గంలో వైసీపీ నేతలు తమ పార్టీకి చెందిన వారికే ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇవ్వాలని 'సీమెన్స్ గమేషా' సంస్థ ప్రతినిధులకు హుకుం జారీ చేశారట. తమ నేతతో మాట్లాడి సెటిల్ చేసుకోవాలని హెచ్చరించారట. వాహనాల సరఫరా కాంట్రాక్టుతో పాటు సెక్యూరిటీ గార్డు కాంట్రాక్టును తమకే కేటాయించాలని ఒత్తిడికి గురిచేశారట. గత ప్రభుత్వంలో తీసుకున్న ఉద్యోగులు, కాంట్రాక్టర్లను వెంటనే తొలగించాలంటూ ఒత్తిడి చేస్తున్నారట. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు యాజమాన్యానికి సమాచారం ఇచ్చి అనంతపురం నుంచి పరారైపోయారని తెలుస్తోంది. గత ఐదేళ్ళలో అనంతపురం జిల్లాకు ప్రతిష్టాత్మకమైన సంస్థలు వచ్చాయి. కియా తో పాటు అనుబంధ సంస్థలు, అలాగే పవన విద్యుత్ సంస్థలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సంస్థల యజమానులను కొందరు వైసీపీ నేతలు బెదిరిస్తున్నారట. పరిశ్రమల్లో కాంట్రాక్ట్ పనులు, ఉద్యోగాలు తమ వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. పవన విద్యుత్ సబ్ స్టేషన్లు మూసి వేయాలంటూ కార్యాలయం ముందు గొడవలకు దిగుతున్నారట. ఈ రకంగా వైసీపీ నేతలు పారిశ్రామికవేత్తలను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెదిరింపులకు గురవుతున్న పారిశ్రామికవేత్తలు పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం ఉండటం లేదట. వైసీపీ నేతలతో సెటిల్ చేసుకోమని పోలీసులు సలహాలిస్తున్నారట. మొత్తానికి కొందరు స్థానిక వైసీపీ నేతల పుణ్యమా అని అనంతపురం జిల్లాలోని సంస్థల ప్రతినిధులు బెదిరిపోతున్నారట. దీంతో సోషల్ మీడియాలో.. 'వైసీపీ అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం వస్తుందని చెప్పారు. ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం' అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
  అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కేపీ దొడ్డి గ్రామంలో దారుణం జరిగింది. గ్రామస్థులంతా చూస్తుండగానే.. ఆ ఊరి పెద్ద దళిత మైనర్ అమ్మాయిపై దాడికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన దళిత యువతీయువకులు వన్నూరమ్మ, బాబు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీళ్లిద్దరు పెద్దలకు భయపడి.. పెళ్లి చేసుకోవాలని భావించి మూడు రోజుల క్రితం ఊరి నుంచి పారిపోయారు. కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కనిపెట్టి తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఎస్సీ కాలనీ వద్ద ఉన్న రచ్చబండ వేదికగా గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించారు. ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. వరసకు అన్నాచెల్లెళ్లవుతారని.. ఇరువురి తల్లిదండ్రులు వివాహానికి నిరాకరించారు.   గ్రామానికి చెందిన వైసీపీ నేత లింగప్ప, మాజీ ఎంపీటీసీ బ్రహ్మానందరెడ్డిని కూడా ఈ పంచాయితీకి పిలిచారు. మైనర్‌ అయిన వన్నూరమ్మ మాత్రం బాబునే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పింది. దీంతో ఆగ్రహించిన లింగప్ప తొలుత వన్నూరమ్మ చెంపలపై చేతితో తీవ్రంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా.. విచక్షణారహితంగా కర్రతో బాదాడు. కాలితో గుండెలపై తన్నాడు.  ప్రేమించుకున్నారనే కారణంతో ఇద్దరు మైనర్లను గ్రామస్థుల ముందే గ్రామ పెద్దలు తీవ్రంగా కొట్టారు. కాగా, యువతిని చితకబాదుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఘటనపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గ్రామానికి వెళ్లి ఘటనపై విచారణ చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.