Publish Date:Dec 27, 2018
Publish Date:Dec 12, 2018
Publish Date:Dec 11, 2018
Publish Date:Dec 10, 2018
Publish Date:Dec 6, 2018
Publish Date:Dec 4, 2018

LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
ALSO ON TELUGUONE N E W S
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా 'యాత్ర' సినిమా తెరకెక్కింది. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి నటించిన ఈ సినిమాకు 'ఆనందో బ్రహ్మ' ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకుడు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా విడుదల కానుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే.. వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా ఓ సినిమా తెరకెక్కుతోందట. నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి జ‌గ‌న్‌పై సినిమా తీస్తున్నారని ఫిలింనగర్ టాక్. తెలుగు ఇండ‌స్ట్రీలో  వైఎస్సార్‌సీసీ మద్దతుదారుల్లో పోసాని ఒకరు. చంద్ర‌బాబు, తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరుగుతూ జగన్ పార్టీకి మద్దతుగా పోసాని పలుసార్లు మాట్లాడారు. ఇప్పుడు సినిమా తీస్తున్నారని సమాచారం. ఆల్రెడీ పులివెందుల పరిశ్రమ ప్రాంతాల్లో చిత్రీకరణ ప్రారంభించారట. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జగన్ మనోగతాన్ని, ఆయనలో పోరాట పటిమను ఆవిష్కరించేలా ఈ సినిమా వుంటుందట.
వెంక‌టేష్ కామెడీ టైమింగ్ కి త‌గ్గ కాన్సెప్ట్ ప‌డాల‌నే కానీ,  ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్వించ‌డం ఖాయం అంటుంటారు. అలా` నువ్వు నాకు న‌చ్చావ్, మ‌ల్లీశ్వ‌రి త‌ర్వాత అనిల్ రావిపూడి , వెంక‌టేష్ శైలిలో `ఎఫ్ 2` చిత్రాన్ని తెరకెక్కించాడు. సంక్రాంతి పండుగ‌కు విడుద‌లైన ఈ చిత్రం సంక్రాంతి చిత్రాల్లో స‌క్సెస్ సాధించి  బ్లాక్ బ‌స్ట‌ర్ బొమ్మ‌గా దూసుకెళ్తోంది. ఈ సంద‌ర్భంగా శుక్రవారం హైద‌రాబాద్ లో `ఎఫ్‌2` స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో  వెంక‌టేష్ మాట్లాడుతూ... ``సినిమా హిట్ సూప‌ర్ హిట్ అనుకుంటే...ప్రేక్ష‌కులు సూప‌ర్ డూప‌ర్ హిట్ చేశారు. మ‌న‌స్పూర్తిగా ప్రేక్ష‌కుల క‌ళ్ల‌లో ఆనందం చూసిన‌పుడు ...ప‌దేళ్ల త‌ర్వాత థియేట‌ర‌కు వెళ్ళి అక్కడ ఆడియ‌న్స్ రెస్పాన్స్ చూసి నాకు క‌ళ్ల‌లో నీళ్ళు ఆగ‌లేదు. మేం క‌ష్ట‌ప‌డి చేసిన‌పుడు...అది ప్రేక్ష‌కులకు న‌చ్చిన‌ప్పుడు వ‌చ్చే ఆనంద‌మే వేరు. గ‌ణేష్‌, ప్రేమించుకుందాంరా, బొబ్బిలి రాజా, నువ్వు నాకు న‌చ్చావ్, మ‌ల్లీశ్వ‌రి ఇలా చాలా సినిమాల‌ను నాకు స‌క్సెస్ చేశారు. చాలా ఏళ్ల త‌ర్వాత పెద్ద స‌క్సెస్ ఇచ్చినందుకు ఆనందంగా ఉంది.  మీరు మ‌ళ్లీ ఎంట‌ర్ టైన్ మెంట్ సినిమా చేయాలి...అని ఆడియ‌న్స్ అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం, స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హెల్ప‌య్యాయి. వ‌రుణ్‌, త‌మ‌న్నా, మెహ‌రీన్ చాలా బాగా న‌టించారు.  ఇంత మంచి సినిమా ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు నా ధ‌న్య‌వాదాలు`` అన్నారు.
'ఎఫ్ 2' ట్రైల‌ర్ విడుద‌లైన వెంట‌నే మ‌హేష్‌బాబు ట్వీట్ చేశారు. సినిమా యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా విడుదలైన తరవాత మరోసారి ట్వీట్ చేశారు. సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. ఆల్మోస్ట్ ఆ ట్వీట్ రివ్యూలో వెంకటేష్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడిని మెచ్చుకున్నారు. వెంక‌టేష్‌తో 'సీత‌మ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో నటించారు మహేష్. ఆ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఇప్పుడీ 'ఎఫ్ 2'కీ నిర్మాత ఆయనే. ప్ర‌స్తుతం మ‌హేష్‌బాబు న‌టిస్తున్న 'మ‌హ‌ర్షి' నిర్మాత కూడా దిల్ రాజే. అటు వెంకటేష్.. ఇటు దిల్ రాజు.. వీళ్లిద్దరి కోసం సినిమా చూసి బావుండటంతో ట్వీట్ చేశారని ప్రేక్షకులు అనుకున్నారు. అయితే మహేష్ ట్వీట్స్ వెనుక మర్మం వేరే వుందట! 'ఎఫ్ 2' విడుదలకు ముందే మహేష్ బాబును కలిసిన అనిల్ రావిపూడి టూకీగా ఓ కథ చెప్పారట. గతంలో మహేష్ సినిమాలకు అనిల్ రచయితగా వర్క్ చేశారు. ఇద్దరికీ పరిచయం వుంది. అనిల్ కామెడీ టైమింగ్ మహేష్ బాబుకు తెలుసు. స్టోరీలైన్ విన్న మహేష్, కంప్లీట్ స్టోరీ డెవలప్ చేసుకు రమ్మని అడిగారట. ఈలోపు విడుదలైన 'ఎఫ్ 2' చూసి ట్వీట్ రివ్యూ ఇచ్చారు. 'పటాస్', 'రాజా ది గ్రేట్‌', 'సుప్రీమ్', 'ఎఫ్ 2' వరుసగా నాలుగు విజయాలతో అనిల్ రావిపూడి రెట్టించిన ఉత్సాహంలో వున్నారు. అతడి ట్రాక్ రికార్డు చూస్తే మహేష్ బాబు సినిమా చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
'పెళ్లి చూపులు' సినిమాతో విజయ్ దేవరకొండకు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా తరవాత 'ఈ నగరానికి ఏమైంది?' అని మరో సినిమా తీశాడు. ఇప్పుడే దర్శకుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనే సంగతి తెలిసిందే. తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తున్నది విజయ్ దేవరకొండే. తన నిర్మాణ సంస్థ 'కింగ్ ఆఫ్ ది హిల్' పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇందులో తరుణ్ భాస్కర్ సరసన హీరోయిన్‌గా అనసూయను ఎంపిక చేశారని సమాచారం. 'సోగ్గాడే చిన్ని నాయనా', 'క్షణం' సినిమాల్లో అనసూయ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. 'విన్నర్'లో ప్రత్యేక గీతం చేశారు. ఇటీవల విడుదలైన 'ఎఫ్ 2'లో ఓ పాటలో మెరిశారు. కానీ, ఫుల్ లెంగ్త్ హీరోయిన్‌గా సినిమాలు చేయలేదు. బహుశా... అనసూయకు హీరోయిన్‌గా ఇదే మొదటి సినిమా కావొచ్చు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందట. తరుణ్ భాస్కర్, అనసూయ జంటతో పాటు మరో ఇద్దరు యాక్టర్స్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారట.
మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు క‌ల్యాణ్‌దేవ్ ఇటీవ‌ల తండ్రి అయిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి చిన్న కుమార్తె, క‌ల్యాణ్‌దేవ్ సతీమణి శ్రీజ కొన్ని రోజుల క్రితం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. శుక్రవారం ఆ అమ్మాయికి పేరు పెట్టారు. ఆ పేరేంటో తెలుసా? 'నవిష్క'. అంటే.. 'ఎప్పటికీ కొత్తగా ఉంటుంది' అని అర్థమని కల్యాణ్ దేవ్ తెలిపారు. పాప పేరు అయితే చెప్పారు గానీ.. పాపను మాత్రం ప్రేక్షకులకు ఇంకా చూపించలేదు. చిన్నారికి దిష్టి తగులుతుందని కెమెరాకు దూరంగా వుంచినట్టున్నారు. ఉయ్యాలలో పాప పడుకుంటే ఆమె ముఖాన్ని కనిపించకుండా చేతులతో దాచేశారు కల్యాణ్ దేవ్. మెగాస్టార్ నాలుగో మనవరాలు నవిష్క. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితకు ఇద్దరు అమ్మాయిలు. శ్రీజ తొలి సంతానం కూడా అమ్మాయే. మెగాస్టార్‌ ఇంట మనవడు ఎప్పుడు అడుగుపెడతాడోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
  ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ పార్కు, వావిలాల ఘాట్‌ ప్రారంభించారు. సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్టీఆర్‌ ఒక మహానాయకుడు, యుగపురుషుడు అని కొనియాడారు. సత్తెనపల్లికి వన్నె తెచ్చేలా తారకరామసాగర్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో ఎన్టీఆర్‌ హయాంలో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే తరహాలో సత్తెనపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటైందన్నారు. ఎన్టీఆర్‌ భారీ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్రని, చరిత్రలో మళ్లీ అలాంటి యుగపురుషుడు పుట్టడని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయనతో ఎవరూ పోటీ పడలేరు.. ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని, సమాజమే దేవాలయం.. పేదలే దేవుళ్లని నిర్వచించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు ఎంతో నమ్మకంతో తనను గెలిపించారని, రాష్ట్రానికి బీజేపీ మేలు చేస్తుందని భావించామన్నారు. కానీ, బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు నమ్మకద్రోహం చేసిందని మండిపడ్డారు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే తెలుగుజాతి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. కేంద్రం సహకరించక పోయినా ప్రాజెక్టులకు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నామని అన్నారు. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయని, దానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేస్తున్నామన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా 8శాతం సేద్యంలో వృద్ధిరేటు సాధించిన ఏకైక ప్రభుత్వం మనదేనని అన్నారు. రైతులకు రూ. 24 వేల కోట్ల రుణ విముక్తి చేసిన ప్రభుత్వం టీడీపీయేనని అన్నారు. కేంద్ర హోంమంత్రి ఈ రోజు కడపలో పర్యటిస్తున్నారని, హోదా విషయంలో మోసం చేసి మళ్లీ ఎందుకు వచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. తుపాన్ వస్తే, రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడికి రారని, గుంటూరులో పార్టీ ఆఫీస్‌ ప్రారంభోత్సవానికి మాత్రం వస్తారని చంద్రబాబు కేంద్రంపై మండిపడ్డారు. పుండు మీద కారం చల్లి సంతోషిస్తున్నారని, విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలయి ఉంటే తమకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు. రాష్ట్రంలో కష్టాలకు, ఇబ్బందులకు ప్రధాని మోదీయే కారణమని అన్నారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. వందమంది కేసిఆర్, జగన్ లు కలిసినా ఆంధ్రప్రదేశ్ ను ఏమీ చేయలేరని చంద్రబాబు అన్నారు. నాకేదో గిప్ట్ ఇస్తానని కేసిఆర్ బెదిరిస్తున్నాడని.. కేసిఆర్ ఒక్క గిప్ట్ ఇస్తే తెలుగు ప్రజలు మూడు గిప్ట్ లు ఇస్తారన్నారు. కేసిఆర్ కు అవినీతి తమ్ముడు జగన్ తోడయ్యాడని విమర్శించారు.
  ఎలక్షన్‌ మిషన్‌ 2019పై టీడీపీ నేతలతో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 'ఏపీ అంటే మోదీకి అసూయ. గుజరాత్‌కన్నా ఏపీ మించిపోతుందనే భయం. ఏపీ అభివృద్ధి చెందకూడదని కేసీఆర్‌ పంతం. తన చేతగాని తనం భయటపడుతుందని కేసీఆర్‌కు భయం. తన కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భయం. అసూయపరులంతా ఏకమయ్యారు. అక్కసుతోనే బీజేపీ, టీఆర్ఎస్, వైసీపీ ఒకే చోటుకు చేరి ఏపీపై కుట్రలు చేస్తున్నాయి' అని ఆరోపించారు. 'గద్దల మాదిరిగా ఏపీపై వాలి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారు. తెలంగాణలో సెంటిమెంట్‌ రెచ్చగొట్టారు.. ఇప్పుడు ఏపీలో కులాల మధ్య చిచ్చు రగిలిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు స్పందనలేదు. హడావుడిగా నిన్న జగన్‌తో కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ భేటీతో టీఆర్ఎస్, వైసీపీ ముసుగు తొలగిపోయింది' అని విమర్శించారు.బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చాలని కుట్ర జరుగుతుందని అన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అజెండా అమలుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ అని విమర్శించారు. పార్టీలను గందరోగళ పరిచి.. ప్రజల్లో  అయోమయం పెంచడం వీరి లక్ష్యం అని ఆరోపించారు.  ఏపీకి హోదా ఇస్తే తమకూ ఇవ్వాలని కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థల విభజనకు అడ్డంకులు పెట్టారన్నారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారు. 26 కులాలకు అన్యాయం చేసిన వారితో జగన్‌ అంటకాగుతున్నారు. టీఆర్ఎస్ తో జట్టుకట్టిన వైసీపీకి 26 కులాల బీసీలే బుద్ధి చెప్పాలి' అని పిలుపునిచ్చారు. అవినీతి గొంగళి పురుగును కేసీఆర్‌ కౌగిలించుకున్నారు. అవినీతి గొంగళిపురుగుతో స్నేహం తెలంగాణ కోసమేనా? ప్రజలకు కేసీఆర్‌, కేటీఆర్‌ జవాబు చెప్పాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేసారు.
  శాసనసభ పక్ష నాయకునిగా టీఆర్ఎస్ పార్టీ నేతలు కేసీఆర్‌ను ఏకపక్షంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాను చేయాల్సిన పనిచేయకుండా అధికారాలు పెట్టుకొని రాష్ట్రాలపై పెత్తనం చేస్తోందని, ఇదే అభిప్రాయం చాలా రాష్ట్రాలు, పార్టీల్లో ఉందని విమర్శించారు. రూరల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, వైద్యం, విద్య కేంద్రం తన దగ్గర ఉంచుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయం విధానం అవసరమని, మూస వ్యవసాయ విధానం పోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని చెప్పుకుంటుంది.. కానీ రాష్ట్రానికో పాలసీ ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌, బీజేపీది పచ్చి రాజకీయ అవకాశం వాదమని ఆరో్పించారు. బీజేపీ, కాంగ్రెస్‌ లకు తేడా లేదని.. దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. కొత్త మోడల్ దేశానికి అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ ప్రయత్నం దేశ రైతాంగం తరపున తాను చేస్తానని అన్నారు. వీలైనంత త్వరగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. జర్నలిస్టులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆదరించారని కేసీఆర్ అన్నారు. నాలుగేళ్ల పాలన మమ్మల్ని తిరిగి గెలిపించిందని అన్నారు. చేసిన పని సిన్సియర్‌గా చేశామని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో కోటి మందికి కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుదన్న భావన ప్రజల్లో వచ్చిందని, పేదలకు కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి పథకాలు ఎంతో ఉపయోగపడ్డాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో బాల్య వివాహాలు జరగడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో సమానమైన ఆదరణ కనిపించిందని కేసీఆర్ అన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలను వందకు వంద శాతం అమలుపరిచిన ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ఎవరితోనైనా, ఏ ఛాలెంజ్‌కైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. తాము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఏం చేస్తామని చెప్పామో వంద శాతం అది చేశామని, మేనిఫెస్టోలో లేని ప్రజలకు ఉపయోగపడే 76 అంశాలను కూడా అమలుపరిచిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. బీడీ కార్మికుల పెన్షన్ తమ మేనిఫెస్టోలో లేదని, కానీ మంజూరు చేశామని తెలిపారు. ఎన్నికల ముందు రైతుబంధు చెప్పలేదని.. ఆయినా చేశామన్నారు. కొంతమంది కావాలనే ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పినట్లు ప్రచారం చేశారని.. తాను కానీ, తమ పార్టీ కానీ ఆ మాట అనలేదని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగాలు కల్పిస్తామని మాత్రమే చెప్పామని, ఆంధ్రా వాళ్లు వెళ్లిపోతే వచ్చే ఖాళీలు మనకొస్తాయని చెప్పామని కేసీఆర్ తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తాం. రానున్న పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఎమ్మెల్యేలకు సూచించాం అని తెలిపారు. ఫెడరల్‌ ఫ్రంట్ వస్తే దేశవ్యాప్తంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తాం అన్నారు. దీనికోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చవుతుంది. తాము వచ్చాక కచ్చితంగా చేస్తాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 29.9శాతం ఆర్థికవృద్ధి ఉంది. దేశంలో ఏ రాష్ట్రమూ తెలంగాణకు దరిదాపుల్లో లేదు. రూ.70వేల కోట్లతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తవుతాయి. అప్పులు చేశామని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పూర్తి అవగాహనతోనే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. తమకంటే ముందు 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని ఉద్యోగాలిచ్చాయి? నిరుద్యోగులను మోసం చేసి కనీసం ఐదులక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు అని విమర్శించారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో.. వాటిని త్వరలోనే భర్తీ చేస్తాం అని స్పష్టం చేశారు. ఏపీ ప్రత్యేక హోదాపై చంద్రబాబుకే క్లారిటీ లేదని కేసీఆర్‌ విమర్శించారు. ప్రత్యేక హోదాతో వచ్చేది ఏముందని పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, హోదా విషయంలో బాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా అడిగేవాళ్లు మూర్ఖులని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు ఆయనే హోదా అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాకు రమ్మని తనను పిలుస్తున్నారని.. వందలు, వేల సంఖ్యలో ఆహ్వానాలు అందుతున్నాయని అన్నారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వందకు వంద శాతం వెళ్తానని కేసీఆర్ స్పష్టం చేశారు.
  తెలంగాణలో ప్రజకూటమి అంచనాలను తారుమారు చేస్తూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి లభించిన విజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయమని అభివర్ణించారు. ప్రచారంలో కాళేశ్వర కావాలా? శనేశ్వరం కావాలా అని అడిగామని, ప్రజలు కాళేశ్వరమే కావాలని తీర్పునిచ్చారని అన్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు, పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితులు, కులాలకు మతాలకు అతీతంగా సకల జనులు నిండుగా దీవించి అందించిన విజయమని అన్నారు. కార్యకర్తలెవరూ విజయంతో గర్వించాల్సిన అవసరం లేదని, అంతిమ తీర్పు ప్రజలే కాబట్టి కర్తవ్య నిష్ఠతో బాధ్యతను నిర్వహించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ అభివృద్ధిలో ఒక బాట వేసిందని, ఇక ఆ బాటను చేరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోటి ఎకరాలు పచ్చబడాలి అన్న తమ లక్ష్యాన్ని కచ్చితంగా చేరతామని అన్నారు. లక్ష ఎకరాలకు నీరందించడమే కర్తవ్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రైతుల కోసం కచ్చితంగా పనిచేస్తామని, వారికి ఏ బాధలు లేకుండా చేస్తామని ప్రకటించారు. గిరిజనులు, గిరిజనేతరులు పోడు భూముల కోసం పడుతున్న బాధలను తొందరలోనే పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు తానే వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని ప్రకటించారు. కుల వృత్తులు మరింత అభివృద్ధి పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగతను అధిగమిస్తామని తెలిపారు. ఉద్యోగ ఖాళీలను అత్యంత వేగంగా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వేతర రంగాల్లో కూడా విరివిగా దొరికేలా చూస్తామని అన్నారు. విజయం ఎంత ఘనంగా ఉందో బాధ్యత కూడా అంతే బరువుగా ఉందని అన్నారు. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్షేత్రంలో ఉందని, అలాగే ఇప్పుడు ఈఎన్‌టి, డెంటల్ పరీక్షలను చేసి ఆరోగ్య తెలంగాణను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉన్న అన్ని రకాల మైనారిటీలకు మరింత సంక్షేమాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. వీరితో పాటు దళితులు, గిరిజనుల బాధలకు భరతవాక్యం పాడతామని, ఇందుకోసం ఏం చేయాలనే అంశంపై ఆలోచించి కచ్చితమైన లక్ష్యాలతో ముందుకు సాగుతామని అన్నారు. బీసీలతో పాటు రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు కూడా గురుకులాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజా సమస్యలే కేంద్ర బిందువుగా, పరిష్కారం ఇతివృత్తంగా, పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లో కూడా పాత్ర పోషించాల్సిన బాధ్యత మనపై ఉంది అన్నారు. ప్రేక్షక పాత్ర పోషించం. చైతన్యం కల్గినది తెలంగాణ గడ్డ. తానేంటో నిరూపించుకున్న భూమి తెలంగాణ. 116 సభల్లో నేను పాల్గొన్నా. ప్రతి సమావేశంలో నేను ప్రజలకు విజ్ఞప్తి చేశాను. పార్టీలు, నాయకులు కాదు. ప్రజలే గెలవాలని అన్నాను అని గుర్తు చేశారు. ఈ రోజు ప్రజలే గెలిచారు. ఎవరు ఏమన్నా, ఎన్ని విమర్శలు చేసినా మేం పట్టించుకోలేదు అన్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తాం. ఈ దేశానికి ఓ దిక్సూచి తెలంగాణ. జాతీయ రాజకీయాలకు ఓ కొత్త నిర్వచనం ఇస్తాం అన్నారు. 'దేశంలో పెద్ద గందరగోళం ఉంది. నూరు శాతం బీజేపీయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్‌లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాం. ప్రజలకే ఏజెంట్లం. ప్రజలే మమ్మల్ని ఏజెంట్లుగా నియమించారు. వారి కోసమే మేం పనిచేస్తాం. మేమెవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అదే విధంగా ఈ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబు మీద తనదైన శైలిలో సెటైర్లు వేశారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పడు తాము అక్కడకు వెళ్లమా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని.. మరి తాము కూడా ఆంధ్రాకు వెళ్లి పనిచేయాలా వద్దా అని అన్నారు. బర్త్‌‌డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమా? అని అన్నారు. దేశ రాజకీయాల్లో పనిచేసే క్రమంలో ఏపీకి కూడా వెళ్లబోతున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తనకు లక్ష ఫోన్ కాల్స్ వచ్చాయని.. ఏపీ రాజకీయాల్లో తాను కూడా కలగజేసుకోవాల్సిందిగా అక్కడి ప్రజలు కోరుతున్నారన్నారు. చంద్రబాబు గురించి విజయవాడ వెళ్లి మొత్తం చెబుతానన్నారు. తమ గిఫ్ట్ ప్రభావం ఎంతుంటుందో త్వరలో అందరూ చూస్తారన్నారు.
  తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు ప్రజకూటమికే అనుకూలంగా ఉన్నాయని నిన్న లగడపాటి రాజగోపాల్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే లగడపాటి ఒకప్పుడు టీఆర్ఎస్ కి అనుకూలంగా సర్వే ఉందని చెప్పి.. ఇప్పుడు ఒత్తిడి వల్ల మాట మారుస్తున్నారు. ఆయన మాటలు ప్రజలు పట్టించుకోవద్దు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై తాజాగా లగడపాటి స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. వ్యక్తిత్వం ముఖ్యమని అన్నారు. ఒత్తిడితో సర్వేను మార్చానని కేటీఆర్‌ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సెప్టెంబర్‌ 16న తన బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని.. అప్పుడే సర్వే గురించి కేటీఆర్‌ తనను అడిగినట్లు చెప్పారు. సర్వే రిపోర్టులు పంపిస్తానంటే కేటీఆర్‌ మెయిల్‌ అడ్రస్‌ కూడా ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, కోదండరాం విడివిడిగా ఉన్నప్పుడు ఆ సర్వే చేశామని లగడపాటి చెప్పుకొచ్చారు. వారందరూ కలిస్తే పోటాపోటీగా ఉంటుందని కూడా కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు. టీడీపీ బలం టీఆర్ఎస్‌కు కలిస్తే.. విజయం ఏకపక్షమవుతుందని అన్నానన్నారు. పొత్తులతో వెళ్లాలని తాను సూచించినప్పటికీ.. కేటీఆర్ మాత్రం ఒంటరిపోరుతోనే విజయం సాధిస్తానని తెలిపారన్నారు. 65 శాతం ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కేటీఆర్‌కు చెప్పానని తెలిపారు.   కేటీఆర్‌ 23 నియోజకవర్గాల జాబితా పంపించి సర్వే ఫలితాలు కోరారని, నవంబర్‌ 11న కేటీఆర్‌ మరో 37 నియోజకవర్గాల జాబితా పంపారన్నారు. 37 నియోజకవర్గాల విషయంలో సర్వే చేయగా.. కాంగ్రెస్‌ పార్టీకి ఆధిక్యం ఉందని కేటీఆర్‌కు మెసేజ్‌ పెట్టా. పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే ప్రధానం అవుతారని చెప్పా. మళ్లీ నవంబర్‌ 20న మరోసారి మెసేజ్‌ పెట్టా. అప్పటికీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టీఆర్ఎస్ 65-70 వస్తాయని చెప్పా. వాళ్లకు 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశా. దీనిపై కేటీఆర్‌ స్పందించి దానికంటే ఎక్కువే వస్తాయని నాకు బదులిచ్చారు. ఆ తర్వాత ప్రజల ఆలోచన వేగంగా మారింది అన్నారు. నవంబర్‌ 28 తర్వాత తనకు అనేక రిపోర్టులు వచ్చాయని, ఏ రిపోర్ట్‌ను ఎవరితో షేర్‌ చేసుకోలేదన్నారు. 8 మంది ఇండిపెండెట్లు గెలుస్తారని చెప్పానని.. ఏ పార్టీకి వ్యతిరేకంగా చెప్పలేదని లగడపాటి పేర్కొన్నారు. మొన్నటి దాకా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న వరంగల్‌ జిల్లాలో కూడా కాంగ్రెస్‌ ఆధిక్యత ఉందని.. ఈ ఉదయమే సమాచారం వచ్చిందన్నారు. డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లు, ఎస్టీ రిజర్వేషన్లు, మూడెకరాల భూమి విషయంలో ఎస్సీ, ఎస్టీలు టీఆర్‌ఎస్‌పై గుర్రుగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ రూ.2 లక్షల రుణమాఫీ హామీ బాగా పనిచేసిందని లగడపాటి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని లగడపాటి అన్నారు. ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని తెలిపారు. కేటీఆర్, తన మధ్య ఎలాంటి గొడవలు లేవని అన్నారు. అలాగే తాను ఎప్పుడూ బోగస్ సర్వేలు చేయలేదని లగడపాటి స్పష్టం చేశారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో పరిస్థితి గురించి లగడపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 28న తాను గజ్వేల్ కు వెళ్లానని వెల్లడించారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా తన కారును ఆపారన్నారు. తనను వారు గుర్తుపడతారని అనుకోలేదనీ, కానీ ఓ కానిస్టేబుల్ గుర్తుపట్టి కారు దిగమని కోరారని వివరించారు. తనతో వారు సెల్ఫీలు దిగారన్నారు. గజ్వేల్ లో పరిస్థితి ఎలా ఉందని అక్కడి కానిస్టేబుళ్లను తాను అడిగానన్నారు. దానికి ‘పోతారు సార్’ అని ఏడుగురు కానిస్టేబుళ్లు బదులిచ్చారన్నారు. గజ్వేల్ లో ఎవరు పోతారో? ఎవరు గెలుస్తారో? ఇప్పుడే బయటపెట్టడం తనకు ఇష్టం లేదని లగడపాటి వ్యాఖ్యానించారు.
  ఖమ్మంలో ప్రజా కూటమి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. టీఆర్ఎస్ మీద, బీజేపీ మీద విమర్శల వర్షం కురిపించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ సంస్కరణలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నాలుగేళ్ల ఎన్డీయే పాలనలో దేశ ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మోదీకి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, సీబీఐ, ఆర్బీఐ, గవర్నర్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని ఆరోపించారు. జీఎస్టీ వల్ల ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైందని, ధరలు పెరిగి పేదలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అసహనం పెరిగిపోయిందని.. దళితులు, ముస్లింలను అభద్రతాభావంతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో ప్రజా కూటమి అవసరం చాలా ఉందని, ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే కాంగ్రెస్‌తో కలిశామని, తెలుగుజాతి ఐక్యత కోసం టీడీపీ పనిచేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. విభజన జరిగినప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులున్నాయని, రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయాలని కోరామని ఆయన గుర్తుచేశారు. తెలుగు జాతి ఎప్పటికీ ఒకటిగానే ఉండాలని ఆకాంక్షించారు. బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన విశ్వవిద్యాలయాల గురించి మోదీని టీఆర్ఎస్ అడగడం లేదన్నారు. తాను పెత్తనం చేయడానికి రాలేదని, తెలంగాణ ప్రజల హితం కోసం పనిచేస్తానని తెలిపారు. తాను ఇక్కడకు వచ్చి పోటీ చేసే పరిస్థితి లేనప్పుడు పెత్తనం ఎలా చేస్తానని ప్రశ్నించారు. కృష్ణానదిలో నీళ్లు రాలేదనీ, గోదావరిలో 2వేల టీఎంసీలకు పైగా నీళ్లు సముద్రంలోకి వెళ్లాయని వాపోయారు. ఆ నీళ్లను ఉపయోగించుకుంటే రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయన్నారు. దిగువ రాష్ట్రం.. ఎగువన ఉన్నరాష్ట్రానికి నీళ్లు రాకుండా ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. తాను తెలంగాణ ప్రాజెక్టులకు అన్ని విధాలా సహకరిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తానెప్పుడూ అడ్డుపడలేదని.. తానెక్కడ ఉన్నా తెలంగాణ తనకు ఇష్టమైన ప్రాంతమని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్‌ను నిర్మించానని తాను చెప్పినట్లు అంటున్నారని.. తాను నిర్మించలేదని, సైబరాబాద్‌కు తన హయాంలో రూపకల్పన చేశామని చంద్రబాబు చెప్పారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు కృషి చేశా.. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేశామని గుర్తుచేశారు. విభజన జరిగాక తెలంగాణ మిగులుబజ్జెట్‌లో ఉంది. ఏపీ అప్పులో ఉంది. ప్రత్యేక హోదా సాధించుకుని ముందుకు పోతా అని చెప్పా. ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదు. ఈ రోజు వరకు నేను ఒకే మాట మీద ఉన్నా. కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో నాకేం అర్థం కాలేదు. నన్ను దూషించడం న్యాయమా అని అడుగుతున్నా. నేనేం తప్పు చేశాను? తెలంగాణ అభివృద్ధికి టీడీపీ అడ్డుపడిందా? టీడీపీ లేకుంటే కేసీఆర్ ఎక్కడినుంచి వచ్చేవారు. నాకు సభ్యత ఉంది. నేను కేసీఆర్‌ను విమర్శించను. మీ ఉత్సాహం చూస్తోంటే నూటికి నూరు శాతం కాదు..  వెయ్యి శాతం మనమే గెలుస్తున్నామనిపిస్తోంది అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఆ అమ్మాయిది అందమైన మనసు. ఆ అబ్బాయిది వెనుదిరకని వ్యక్తిత్వం. వాళ్లిద్దిరికీ మధ్య ప్రేమ చిగురించింది. అదో అందమైన ప్రేమకథ! ఆ ప్రేమకి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో ఆ కథ సుఖాంతం అయ్యింది. పెళ్లయిన కొత్తజంత విహారయాత్రకి బయల్దేరారు. దారిలో నది అడ్డువస్తే, దానిని దాటేందుకు చిన్న నావని తీసుకుని వెళ్లారు. నావ నది మధ్యకి రాగానే అప్పటిదాకా ఆహ్లాదంగా ఉన్న వాతావరణం కాస్తా భీకరంగా మారిపోయింది. సన్నటి చినుకులతో మొదలై పెనుతుపాను చెలరేగింది. అంతటి తుపానుకి నావ అల్లల్లాడిపోవడం మొదలుపెట్టింది. ఎటు చూసినా కారుమబ్బులు, అన్ని వైపుల నుంచీ సూదుల్లా పొడుస్తున్న చినుకులు. వాటిని చూసి యువతి చిగురుటాకులా వణికిపోయింది. కానీ యువకుడిలో మాత్రం ఎలాంటి కలవరమూ లేదు. పైగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడేమో అన్నంతగా అతని మోములో చిరునవ్వు చెక్కుచెదరడం లేదు.   యువకునిలోని నిశ్చలత్వం చూసి అతని ప్రేయసికి ఒళ్లుమండిపోయింది. ‘ఇంత ప్రమాదంలో కూడా ఇంత నిబ్బరంగా ఎలా ఉన్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా! బెల్లం కొట్టినరాయిలా కదలకుండా కూర్చుండిపోతావేంటి?’ అంటూ అతన్ని నిందించడం మొదలుపెట్టింది. ప్రేయసి మాటలు విన్న ప్రియుడు ఒక్క ఉదుటున తన ఒరలోంచి కత్తి తీసి ఆమె గొంతు మీద పెట్టాడు. ‘నా చేతిలో ఇంత పదునైన కత్తి నీ గొంతు మీద ఉంటే... నీకు భయం వేస్తోందా!’ అని అడిగాడు. దానికి ప్రియురాలు ‘ఇన్నిరోజులుగా నిన్ను చూస్తున్నాను. నీ స్వభావం ఏమిటో నాకు తెలియదా! చూస్తూ చూస్తూ నా గొంతు కోస్తావని ఎలా అనుకుంటాను. నీ చేతిలో ఎంత ప్రమాదకరమైన ఆయుధం ఉన్నా సరే. అది నా గొంతు మీద ఉన్నా సరే. నువ్వు మాత్రం నాకు హాని తలపెట్టవనే నమ్మకం నాకుంది,’ అంది.   ‘ఈ తుపాను కూడా ఆ భగవంతుని చేతిలో ఆయుధంలాంటిదే. ఆయన నాకు హాని తలపెట్టడనే నా నమ్మకం. ఒకవేళ నిజంగానే మన ఆయుర్దాయం ఇంతటితో సరి అని ఆయన తలిస్తే మాత్రం, ఇప్పుడు మనమేం చేయగలం! మన నావ నది మధ్యలో ఉంది. మన ఇద్దరికీ ఈత రాదు. చుట్టూ ఆదుకునే వారు లేరు. ఈ ఆపద నుంచి ఎలాగైనా బయటపడితే బాగుండు అని కోరుకుంటూ కూర్చోవడం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఇలాంటి సమయంలో కంగార పడి అటూఇటూ తిరగడం వల్ల నావ కాస్తా బోల్తా పడక మానదు. అందుకని ప్రశాంతంగా కూర్చోవడాన్ని మించి తెలివైన పని మరొకటి ఉందంటావా?’ అని అడిగాడు ఆ యువకుడు. ఆ మాటలకి అతని ప్రియురాలి వద్ద సమాధానం లేకపోయింది.   కాసేపటికి తుపాను ఆగిపోయిన. దంపతులు ఇద్దరూ హాయిగా ఆవలి తీరానికి చేరుకున్నారు. కానీ ఆ వీరుడు చెప్పిన మాటలని మాత్రం ఆ యువతి ఎప్పటికీ మర్చిపోలేదు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. వాటి నుంచి బయటపడేందుకు చేయగలిగిన ప్రయత్నం చేయడం, ఫలితాన్ని ఆ ప్రకృతి మీద వదిలి నిబ్బరంగా ముందుకు సాగిపోవడం! ఆనాడు తన వీరుడు చెప్పిన ఈ సూత్రాన్ని జీవితాంతమూ ఆ యువతి మర్చిపోలేదు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  
  ప్రపంచం మారిపోయి ఉండవచ్చు. మనం జీవించే విధానమూ మారిపోయి ఉండవచ్చు. కానీ పెద్దలు చెప్పిన మంచి మాటలకి మాత్రం ఎప్పటికీ రోజులు చెల్లిపోవు. అందుకు ఉదాహరణగా రాత్రిపూట ఆహారం గురించి పెద్దలు చెప్పే మాటల గురించే చెప్పుకోవచ్చు. ‘రాత్రివేళ మనం తినే ఆహారం పడుకునే సమయానికల్లా అరిగిపోయేలా ఉండాల’న్నది పెద్దల మాట. అంటే కనీసం రాత్రి ఎనిమిదింటికల్లా తినేయాలన్నమాట. ఇదెంత ఆరోగ్యకరమో ఒక పరిశోధన రుజువుచేస్తోంది చూడండి!   పెన్సిల్వేనియాకు చెందిన పరిశోధకులు... ఆలస్యంగా ఆహారం తినడానికీ అనారోగ్యానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం కొంతమంది అభ్యర్థులను ఎంపికచేసి వారికి వేర్వేరు అలవాట్లను సూచించారు. మొదటి బృందంలో ఉన్నవాళ్లు ఉదయం ఎనిమిదిగంటల నుంచి రాత్రి ఏడుగంటల లోపు ఆహారం తీసుకోవాలని సూచించారు. రెండో బృందంలోని వారిని మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకూ ఆహారం తీసుకోవచ్చని చెప్పారు. నిద్రపోయే సమయాలు మాత్రం, అభ్యర్థులందరికీ ఒకేలా ఉండేలా జాగ్రతత్తతీసుకున్నారు.   ఒక ఎనిమిదివారాలపాటు సాగిన ఈ పరిశోధనతో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆహారం తినే సమయాన్ని బట్టి మన శరీరంలోని జీవక్రియలు వేర్వేరుగా ఉండటాన్ని గమనించారు. ఆలస్యంగా తిన్నప్పుడు ఆహారంలోని కొవ్వు, శరీరానికి ఎక్కువగా అందుతున్నట్లు తేలింది. శరీరం పీల్చుకునే ఆక్సిజన్కంటే వదులుతున్న కార్బన్డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. శరీరంలోని ఈ ఆక్సిజన్, కార్బన్డైఆక్సైడ్ల మధ్య నిష్పత్తిని Respiratory quotient అంటారట. ఈ నిష్పత్తి ఎక్కువగా ఉంటే, శరీరం హానికారక పదార్థాలనే ఎక్కువగా స్వీకరిస్తోందని అర్థం.   ఆలస్యంగా తినడం వల్ల శరీరం ఆహారాన్ని భిన్నంగా స్వీకరిస్తోందని అర్థమైపోయింది. దీని వల్ల శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి, గుండె పనితీరు, కొవ్వు శాతం, గ్లూకోజు నిల్వలు... అన్నింటి మీదా ప్రతికూల ప్రభావం ఉన్నట్లు గమనించారు. అంతేకాదు! పగటివేళ ఆహారానికి అలవాటుపడితే, మనలో ఆకలిని కలిగించే ghrelin అనే హార్మోను కూడా పగటివేళే చురుగ్గా పనిచేస్తోందని తేలింది. అలాగే పొట్ట నిండుగా ఉండే భావనని కలిగించి, చిరుతిళ్లకు దూరంగా ఉంచే leptin అనే హార్మోను అదుపులో కనిపించింది.   ఒక్కమాటలో చెప్పాలంటే- రాత్రి ఆలస్యం కాకుండానే ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, అధికబరువు వంటి సమస్యల నుంచి కూడా త్వరగా దూరం కావచ్చునని అంటున్నారు. ఈ చిన్నపాటి చిట్కాలను పాటిస్తే ఆరోగ్యంలో చాలా మార్పులు స్పష్టంగా వచ్చితీరతాయని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. - నిర్జర  
      Whenever we see the rich and famous we always wondered what is that they do to become rich. In a radio interview, best-selling author Tom Corley talked about the differences between the habits of the rich vs. those of the not so rich. Here’s a list of things the rich do to which makes them what they are!   1. 80% of wealthy are focused on accomplishing some single goal. 2. 67% of wealthy write down their goals. 3. 81% of wealthy maintain a to-do list. 4. 86% of wealthy believe in life-long educational self-improvement 5. 86% of wealthy simply love to read 6. 88% of wealthy read 30 minutes or more each day for education or career reasons 7. 63% of wealthy listen to audio books during commute to work 8. 63% of wealthy parents make their children read 2 or more non-fiction books a month 9. Only 33% of wealthy watch more than 1 hour of TV every day 10. Only 6% of wealthy watch reality TV 11. 84% of wealthy believe good habits create opportunity luck 12. 76% of wealthy believe bad habits create detrimental luck 13. 70% of wealthy eat less than 300 junk food calories per day. 14. Only 23% of wealthy gamble. 15. 44% of wealthy wake up 3 hours before work starts 16. 74% of wealthy teach good daily success habits to their children 17. 70% of wealthy parents make their children volunteer 10 hours or more a month 18. 80% of wealthy make ‘Happy Birthday” calls 19. 79% of wealthy network 5 hours or more each month 20. 76% of wealthy exercise aerobically 4 days a week. Rich Habits – The Daily Success Habits of Wealthy Individuals by Tom Corley
  సోషల్ మీడియా వల్ల అప్ డేట్స్ ఎంతలా తెలుస్తాయో.. ఫేక్ అప్ డేట్స్ కూడా అంతలా తెలుస్తాయి. ఫేక్ అప్ డేట్స్ నే నిజమనుకొని ప్రజలు పప్పులో కాలేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఈమధ్య ఫేక్ అప్ డేట్స్ ట్రెండ్ బాగా ఎక్కువైంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎన్నికల రిజర్వేషన్ల జాబితా రాకముందే సోషల్ మీడియాలో దర్శనమిస్తుంది. అలా దర్శనమిచ్చే ఒక ఊళ్ళో కొంపముంచింది. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల జాబితా పేరుతో కొన్ని మెసేజ్‌లు వాట్సాప్‌ లో చక్కర్లు కొట్టాయి. అదే నిజమని నమ్మిన ఓ గ్రామంలో రెండు వార్డులకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయి మండలం రంజిత్‌నాయక్‌తండాలో వెలుగు చూసింది. ఎన్నికల అధికారిక ప్రకటనకు ముందే రిజర్వేషన్‌ జాబితా ఒకటి వాట్సాప్‌లో విస్తృతంగా తిరిగింది. తర్వాత రోజు అధికారులు అసలైన జాబితా ప్రకటించినా గ్రామస్థులు పట్టించుకోలేదు. వాట్సాప్‌ సమాచారం ఆధారంగా సర్పంచి, వార్డు సభ్యులను ఏకగ్రీవం చేసుకొన్నారు. ఈ మేరకు నామపత్రాల దాఖలు చివరి రోజైన శుక్రవారం సర్పంచి అభ్యర్థితోపాటు ఆరుగురు వార్డు సభ్యుల అభ్యర్థులు పత్రాలు దాఖలు చేయడానికి వెళ్లారు. రద్దీ అధికంగా ఉండడంతో సాయంత్రానికి అవకాశం వచ్చింది. లోనికి వెళ్లిన ఆరుగురు వార్డు సభ్యుల్లో ఇద్దరు కేటాయించిన రిజర్వేషన్లకు విరుద్ధంగా పత్రాలు సమర్పించడంతో అధికారులు వాటిని తిరస్కరించారు. ఎస్టీకి రిజర్వు చేసిన వార్డు స్థానాల్లో బీసీలు వేయడానికి వీలులేదని చెప్పడంతో అవాక్కయ్యారు. తమ దగ్గర ఉన్న జాబితాలో బీసీలకు ఇచ్చారని వాదించినా ఫలితం లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో రెండు వార్డు స్థానాలకు ఎన్నికలు నిలిచిపోనున్నాయి. కేటాయించిన రిజర్వేషన్లను పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులు ప్రదర్శించకపోవడంతోనే తమకు అన్యాయం జరిగిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
  విశాఖ విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై కోడి కత్తితో జరిగిన దాడి కేసులో ఎన్‌ఐఏ విచారణ కొనసాగుతోంది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.విజయప్రసాద్‌ను సీతమ్మధారలోని ఆయన ఇంటి వద్ద ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు. విజయప్రసాద్‌తో పాటు వైసీపీకి  చెందిన పలువురు నేతలు కూడా ఆయన ఇంట్లోనే ఉన్నారు. దీంతో ఎన్‌ఐఏ అధికారులు అక్కడికి చేరుకొని విచారిస్తున్నారు. జగన్‌పై దాడి సమయంలో ఆయన వెంట ఎయిర్‌పోర్టులో విజయప్రసాద్, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, జియ్యాని శ్రీధర్‌,బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, పీడిక రాజన్నదొర, తైనాల విజయ్‌ ఉన్నారు. దీంతో ఎన్‌ఐఏ అధికారులు వీరిని విచారిస్తున్నారు. ప్రధానంగా.. దాడి ఘటన ఏ సమయానికి, ఎలా జరిగింది? ఆ సమయంలో విమానాశ్రయంలో ఎవరెవరు ఉన్నారు? నిందితుడు దాడిచేసినప్పుడు  అక్కడ నెలకొన్న పరిస్థితేంటి? ఆ ఘటన జరిగిన సమయంలో అక్కడ జరిగిన పరిణామాలేంటి? తదితర అంశాలపై ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.
  ఏపీ రాజకీయాల్లో ఏ ప్రజాప్రతినిధి ఎప్పుడు ఏ పార్టీలోకి మారతాడో అర్ధం కానీ పరిస్థితి. ముఖ్యంగా మాజీ ప్రజాప్రతినిధుల దారెటో కనిపెట్టటం ఎవరి తరం కావటం లేదు. వరుసపెట్టి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులని కలుస్తున్నారుగాని ఏ పార్టీలో చేరతారు అనేదానిపై స్పష్టత ఇవ్వట్లేదు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్త ఆ కోవకు చెందిన వారే. 2009 ఎన్నికల్లో మధుసూదన్ గుప్తా గుంతకల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఈయన ఏ పార్టీ తరఫునా పోటీ చేయలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో తను మళ్లీ పోటీ చేయడం మాత్రం ఖాయమని గుప్తా గతంలో ప్రకటించారు. అయితే ఏ పార్టీ తరఫున అనే అంశం గురించి ఆయన స్పష్టతను ఇవ్వలేదు. గత ఏడాది అనంతపురం జిల్లాలో  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో మధుసూదన్ గుప్తా కనిపించారు. జగన్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు జగన్ తో కలిసి పని చేసిన అనుభవం ఉందని, ఆ అనుబంధంతోనే జగన్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించినట్టుగా మధుసూదన్ గుప్తా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ లో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కానీ అనూహ్యంగా ఆయన నిన్న వెలగపూడిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. దీంతో ఆయన టీడీపీలో చేరుతున్నారని ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టే గుప్త కూడా కొంతకాలంగా టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాలుపంచుకుంటున్నారు. అంతేకాకుండా మధుసూదన్‌ గుప్తను టీడీపీలోకి తీసుకొచ్చి గుంతకల్లు ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా గత కొంతకాలంగా తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. వైసీపీ,టీడీపీ అధ్యక్షులని కలిసిన గుప్తా..ఏ పార్టీలో చేరతారో లేక ఇంకే పార్టీ అధ్యక్షున్ని కలుస్తారో చూద్దాం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.