EDITORIAL SPECIAL
  యుద్ధ సమయంలో ఎటువంటి పరిస్థితులలోను అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనేది భారత్ సిద్ధాంతం కాగా ఇపుడు జమ్మూ కాశ్మీర్ విషయమై పాకిస్తాన్ రెచ్చగొడుతున్న నేపథ్యంలో అవసరమైతే ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని రక్షణ శాఖా మంత్రి రాజనాధ్ సింగ్ సంచలన వ్యాఖ్య చేశారు. భారత్ తో తలపడటానికి జిహాద్ తప్ప వేరే మార్గం లేదని అలాగే అణు యుద్ధం కూడా తప్పదని మొన్న పాక్ అధ్యక్షుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా రాజనాధ్ పాక్ కు ఇలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అణ్వాయుధాల వాడకంపై మన విధానాన్ని భవిష్యత్తులో మార్చుకునే అవకాశాలున్నాయని రాజ్‌నాధ్ సింగ్ తెలిపారు. ఇండియా ముందుగా అణ్వాయుధ దాడి చెయ్యకూడదన్నది మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆలోచన అని, ఇప్పటివరకూ భారత్ ఈ విధానానికి కట్టుబడి ఉందని ఐతే భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చని అయన అన్నారు. వాజ్‌పేయి తొలి వర్ధంతి సందర్భంగా రాజ్‌నాథ్ ఆయనకు పోఖ్రాన్‌లో నివాళులు అర్పించారు.
  రాజకీయాల్లో అతని రూటే సెపరేటు... పార్టీ ఏదైనా, స్థానం ఎక్కడైనా గెలుపు గంట మోగాల్సిందేనన్నది అతని ఫిలాసఫీ... ఇప్పుడు కూడా విన్నింగ్ బెల్ మోగింది... కానీ సైకిల్‌ పంక్చరై కూర్చుంది.... అసలే చేతిలో పవర్‌ లేకపోతే అల్లాడిపోయే ఆయన... ఇప్పుడు ఏ పార్టీలో అధికార గంట మోగించాలా..అంటూ తెగ మధనపడిపోతున్నారట. ఫ్యాన్ చెంతకు వెళ్లి సేదతీరాలా... లేక రారా రమ్మంటున్న పువ్వు పరిమళానికి ఆకర్షితుడు కావాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారట. తన పొలిటికల్ ఫ్రెండ్స్ సుజనా... తిన్నావా అంటూ పలకరిస్తున్నా, మరోవైపు సీఎం రమేష్‌ రారమ్మంటూ పిలుస్తున్నా, వెళ్లాలా వద్దా అని తెగ థింక్ చేస్తున్నారట. అయితే గలగల గంట మోగించే ఆయన, నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టారనే మాట వినిపిస్తోంది. ఇంతకీ ఇతనెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది... ఇంకెవరు గంటా శ్రీనివాసరావే.... ఇంతకీ ఇతని గురించి ఇప్పుడెందుకనుకుంటున్నారా? ఎందుకంటే, టీడీపీ ఓటమి తర్వాత మొట్టమొదటిసారి జరిగిన కీలక సమావేశానికి ఈ గంటా సారు డుమ్మాకొట్టారు. గంటా సారుకి ప్రతిపక్షంలో కూర్చోవడమంటే అస్సలు ఇష్టముండదట. అందుకే పార్టీ మారైనా సరే పదవి సంపాదిస్తారని అంటారు. అందుకే వైసీపీలోకి వెళ్లి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారట. కానీ పార్టీలోకి రావాలంటే, రాజీనామా చేయాల్సిందేనన్న జగన్‌ నిబంధనతో చేసేదేమీలేక ఆగిపోయారట. ఇక మిగిలింది బీజేపీ. అయితే, తనతోపాటు పది పదిహేను మంది ఎమ్మెల్యేలతో కమలం గూటికి వెళ్తారంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదంటూ ఓ చిన్న స్టేట్ మెంట్ ఇచ్చినా, రూమర్లు మాత్రం ఆగలేదు. రాను రాను సైలెంట్ అయిపోవడం, పార్టీ కార్యక్రమాలకు, నియోజవర్గానికి దూరంగా ఉండటంతో, పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. దీనికితోడు అసెంబ్లీ అంత హాట్‌హాట్‌గా జరిగినా, గంటా మాత్రం సైలెంట్‌గా ఉండటం ఈ ప్రచారానికి మరింత బలమిచ్చింది. ఇప్పుడు టీడీపీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టడంతో పార్టీ మారడం ఖాయమనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. అసలే పదవి లేకపోతే ఉండలేరు... పైగా పీఏసీ ఛైర్మన్‌ పదవి దక్కకపోవడంతో, మరింత అసంతృప్తితో ఉన్నారట.  మొత్తానికి గంటా డుమ్మాపై టీడీపీ విస్తృతస్థాయి మీటింగ్లో వాడివేడి చర్చ జరిగిందట. గంటాపై వేటు వేయాల్సిందేనని పలువురు నేతలు చంద్రబాబును గట్టిగా కోరారట. మరి గంటా మౌనం వీడతారా? లేక అంతకంటే ముందే బాబు నిర్ణయం తీసుకుంటారా? ఎవరో ఒకరు మౌనం వీడితే తప్ప ఈ గంట మోగుతుందో లేక సైలెంట్ గా అలాగే కంటిన్యూ అవుతుందో తేలుతుంది.
  సీఎం కేసీఆర్ ఈరోజు తమిళనాడులోని కంచిలో ఉన్న శ్రీఅత్తివరదరాజ స్వామి ఆలయానికి వెళ్లున్నారు. 40 ఏళ్లకు ఒకసారి జరిగే అత్తి వరదరాజస్వామి దర్శనం ఈ ఏడాది ఆగస్టు 17తో ముగుస్తుంది. ఆగస్టు 18న స్వామిని తిగిరి పుష్కరిణిలో భద్రపరుస్తారు. మళ్లీ 2059లోనే అత్తి వరదరాజ స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. దీంతో ఈ ఆలయానికి ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో ఆలయంలో తొక్కిసలాటలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల తొక్కిసలాటలో భక్తులకు స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. మళ్ళీ 40 ఏళ్ళ వరకు స్వామిని చూసే అవకాశం లేకపోవడం, మనిషి జీవితం మొత్తం మీద ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువ స్వామి దర్శనం అయ్యే అవకాశం లేకపోవడంతో భక్తులు ఎగబడుతున్నారు. ఆ భక్తుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చేరిపోయారు. మొదట్నుంచి కేసీఆర్ కి పూజలు, దేవాలయాలపై మక్కువ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వరదరాజస్వామి దర్శనానికి పయనమయ్యారు. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. వరదరాజ స్వామి దర్శనంతో పాటు ఆయన వైసీపీ ఎమ్మెల్యే రోజాతో భేటీ కూడా కానున్నారని తెలుస్తోంది. సోమవారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కంచికి చేరుకుంటారు. మార్గమధ్యంలో కేసీఆర్ కుటుంబసభ్యులు రోజా ఇంటికి వెళ్లనున్నారు. వారికి టిఫిన్, మధ్యాహ్న భోజనం రోజా ఇంట్లోనే అని తెలుస్తోంది. ఇందుకోసం రోజా ఇంట్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరిగాయట. గతంలో కేసీఆర్ కుటుంబసభ్యులు తిరుమల వచ్చిన సందర్భంగా వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇప్పుడు రోజా ఇంటికి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రోజాకి మంత్రి పదవి రాలేదని అసంతృప్తిలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు రోజా దాని గురించి కేసీఆర్ వద్ద ప్రస్తావించే అవకాశం ఏమైనా ఉందా అనే చర్చ జరుగుతోంది.
ALSO ON TELUGUONE N E W S
  త్వరలో  డా. రాజశేఖర్ కొత్త సినిమాను ప్రారంభించబోతున్నారు. సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ సినిమాను క్రియేటివ్ ఎంటర్ టైనర్స్ అండ్ డిస్ర్టిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మిస్తున్నారు. సింగిల్ లైన్ కథ వినగానే ఎగ్జైట్ అయిన రాజశేఖర్ వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషం. ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు. ఇటీవల విడుదలైన 'కిల్లర్' సినిమాకు సంగీతాన్ని అందించిన సైమన్. కె. కింగ్   డా. రాజశేఖర్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. తెలుగు 'క్షణం' ను శిబిరాజ్ తో 'సత్య'గా తీయటంతో పాటు 'బేతాళుడు'  సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు మెగాఫోన్ పట్టనున్నారు. హీరో్యిన్ తో పాటు మిగిలిన పాత్రధారులు, సాంకేతిక నిపుణులను త్వరలో ఎంపిక చేయనున్నారు. సినిమా టైటిల్ నిర్ణయించి త్వరలో షూటింగ్ మొదలు పెడతామని నిర్మాత జి. ధనుంజయన్ చెబుతున్నారు. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేసి మార్చి 2020లో సినిమాను విడుదల చేస్తామంటున్నారు ధనుంజయన్. సింగిల్ సిట్టింగ్ లో కథను ఓకె చేసి వెంటనే షూటింగ్ మొదలు పెడదామన్న డా. రాజశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు నిర్మాత ధనుంజయన్. తమిళంలో రెండు సార్లు జాతీయ అవార్డ్ గెలుచుకున్న నిర్మాత డా. జి. ధనుంజన్. సమంత అక్కినేని నటించిన 'యు టర్న్' సినిమాతో పాటు ను విజయ్ ఆంటోని 'కొలైకారన్' ను తమిళంలో విడుదల చేశారు ధనుంజయన్. ఇటీవల మురళీ కార్తీక్, గౌతమ్ కార్తీక్, రెజీనాతో తిరు దర్శకత్వంలో 'మిస్టర్ చంద్రమౌళి' సినిమాతో పాటు జ్యోతిక, లక్ష్మీ మంచు తో రాధామోహన్ దర్శకత్వంలో 'కాట్రిన్ మొళి' సినిమాను నిర్మించారు ధనుంజయన్. తాజాగా విజయ్ ఆంటోనీతో రెండు వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు ధనుంజయన్. డా. రాజశేఖర్ సినిమాతో తెలుగు చిత్రరంగంలోకి అడుగు పెడుతున్నారు.
  బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ని హీరోగా `అల్లుడు శ్రీను` సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.  తాను నాలుగైదు సినిమాలు చేసినా ఏ సినిమా పెద్దగా ఆడలేదు. ఇటీవల చేసిన `రాక్షసుడు` సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి శ్రీనివాస్. ఇదిలా ఉంటె బెల్లకొండ తన రెండో  కుమారుడు సాయి గణేష్ ని హీరో గా పరిచయం చేస్తూ పవన్ సాధినేని డైరేక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో కూడా బెల్లం కొండ సురేష్  తన రెండో కుమారుడు హీరో గా సినిమా చేయబోతున్నట్లు హింట్  ఇచ్చాడు. ఇక ఈ సినిమా లవ్ స్టోరీ  గా తెరకెక్కనున్నట్లు సమాచారం. బెక్కం వేణుగోపాల్ తో  కలిసి బెల్లంకొండ ఈ  చిత్రాన్ని నిర్మించనున్నారట. దసరాకు ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. మరి సాయి శ్రీనివాస్ ని కమర్షియల్ హీరోగా నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి సన్ స్ట్రోక్ తెచ్చుకున్న సురేష్ తన రెండో కొడుకు విషయం లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అంటున్నారు సినీ జనాలు.
ప్రెజెంట్ బన్నీ , త్రివిక్రమ్ డైరెక్షన్ లో `అల వైకుంఠపురం లో` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం . ఇదిలా ఉంటే బన్నీ , సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఇక ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజు ఆగష్టు 22 న ప్రారంభం కానున్నట్లు సమాచారం అందుతోంది.  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ కావొచ్చాయట.  రెగ్యులర్ షూటింగ్ మాత్రం నవంబర్ ఫస్ట్ వీక్ లో మొదలవుతుందని టాక్ వినిపిస్తోంది. సుక్కు , బన్నీ కాంబినేషన్ లో గతం లో ఆర్య , ఆర్య -2 చిత్రాలు వచ్చాయి.  రెండు సినిమాలకు మంచిపేరొచ్చింది. ఇక ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి సుక్కు ప్లాన్ చేస్తున్నాడట.  హీరోయిన్ గా రష్మిక మందన్న నటించే అవకాశాలున్నాయట.  ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.
కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది రకుల్. కొన్ని గంటల నుండి హాట్ హాట్ ఫోటోలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. హాట్ అంటే అటువంటి ఇటువంటి హాట్ కాదు. యమా హాట్! బికినీ ఫొటోలతో యువతకు పిచ్చి ఎక్కిస్తోంది. ఇప్పుడీ హీరోయిన్ స్పెయిన్ దేశంలోని ఐబిజా అనే ఏరియాలో ఉంది. అక్కడి బీచ్ లో బికినీ ఫొటోలు దిగి పోస్ట్ చేస్తున్నారన్నమాట. నిజానికి, కొన్ని నెలలుగా రకుల్ రెస్ట్ లేకుండా సినిమాలు చేస్తోంది. ఆల్రెడీ ఆయా సినిమాల్లో హాట్ హాట్ గానే కనిపించింది. హిందీ సినిమా 'దే దే ప్యార్ దే' వర్కవుట్ కూడా అయింది. కానీ, ఆ సినిమా విడుదల తర్వాత మరో హిందీ సినిమా అవకాశం రకుల్ కి రాలేదు. తెలుగులో 'మన్మథుడు 2', తమిళంలో సూర్య, కార్తి సోదరులతో చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇక్కడ పరిస్థితి కూడా అంత బాలేదు. ఈ నేపథ్యంలో పరాజయాలను ప్రేక్షకులు, పరిశ్రమ వర్గాలు మరిచిపోయేలా హాట్ హాట్ ఫొటోలతో పిచ్చి ఎక్కిస్తోంది. సినిమాలతో కంటే వీటితో ప్రేక్షకులకు ఎక్కువ ఆనందాన్ని పంచుతోంది.
'సాహో' విడుదలకు పట్టుమని పది రోజులు కూడా లేదు. ఈ సమయంలో ఎవరైనా నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందని మాట్లాడుకోవాలి. ఎందుకంటే... 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన చిత్రమిది. కానీ, 'సాహో' ఎంత కలెక్ట్ చేస్తే నిర్మాతలకు ఎంత లాభం వస్తుందని ఫిలింనగర్ వ్యాపార వర్గాలు చర్చించుకుంటున్నాయి‌. ఎందుకంటే... సినిమాకు భారీగా ఖర్చు పెట్టారు. ప్రభాస్ కూడా ఇదే విషయాన్ని ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చెప్పారు. "సినిమాను జాగ్రత్తగా చేసి ఉంటే 100 కోట్లు లాభం వచ్చింది. కానీ, లాభాన్ని వదిలేసుకుని నా స్నేహితులు సినిమా కోసం ఖర్చు పెట్టారు. అనుకున్నదానికంటే యువి క్రియేషన్స్ సంస్థ భారీగా ఖర్చుపెట్టి సినిమా తీశారు. ఇటువంటి స్నేహితులు అందరికీ ఉండాలి" అని ప్రభాస్ అన్నారు. స్టిల్స్, టీజర్ కంటే ట్రైలర్ విడుదల చేసిన తర్వాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో అదేస్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తొలుత కొందరు ఈ సినిమా పై సందేహాన్ని వ్యక్తం చేసినా... ప్రస్తుతం ప్రేక్షకుల్లో నెలకొన్న అంచనాలు చూస్తుంటే ఓపెనింగ్స్ ద్వారా నిర్మాతలకు లాభం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
  ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ కి వరద ముప్పు ఉందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా ఇంటిని ఖాళీ చేశారు. అయితే ఇదంతా అధికార పార్టీ వైసీపీ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంది. కృష్ణానది ప్రవాహంపై ముందస్తు చర్యలు తీసుకోలేదని, రాజధాని భూముల్లోకి వరద రావాలని కుట్రలు చేస్తున్నారన్నారని.. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా ఆరోపణలు చేస్తున్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం చేయడం ఏపీ సీఎం జగన్ కి ఇష్టం లేదని.. అందుకే అమరావతికి వరద నీరు తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారని ఉమా విమర్శించారు. ఈ వరద నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల వద్ద 4 రోజుల క్రితమే మానిటర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం కావాలనే ఈ వరదను సృష్టించిందని ఉమా ఆరోపించారు. చంద్రబాబు ఇంటిలోకి నీళ్లు తీసుకురావాలన్న దుర్మార్గమైన ఆలోచనతోనే ప్రభుత్వం ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తలేదని ఉమా విమర్శించారు. వరద పరిస్థితిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రివ్యూ చేస్తాడా? మరి సీఎం ఏం చేస్తున్నాడు? ఇరిగేషన్ మంత్రి ఏం చేస్తున్నాడు? అని ఉమా ప్రశ్నించారు. అయ్యా జగన్ మోహన్ రెడ్డి.. నీకు మళ్లీ చెబుతున్నా. నువ్వు అమెరికాలో ఉన్నట్లు ఉన్నావ్. ఇక్కడ వర్షం పడలేదు. మున్నేరు, వైరా, కట్లేరు, బుడమేరు వాగుల్లో నీళ్లు రాలేదు. అయినా 2009లో 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. కానీ ఇప్పుడు 7 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చినా ఇవాళ నువ్వు జగ్గయ్యపేట, కంచికచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం, గద్దె రామ్మోహన్ ఏరియా అంతా ముంచేశావ్ అని విమర్శించారు. రాజధానిని కడప జిల్లాలోని ఇడుపులపాయకు తీసుకెళ్లాలని జగన్ కుట్ర పన్నారు. అందుకే అమరావతిలో రైతుల భూములు ముంచాలని నిర్ణయించారు. అందుకే శ్రీశైలం దగ్గర నీటిని నిలబెట్టారు అని ఉమా విమర్శలు గుప్పించారు. అయితే సోషల్ మీడియాలో కూడా ఇటువంటి ప్రచారమే జరుగుతోంది. కావాలనే ప్రకాశం బ్యారేజి గేట్లు ముందే ఎత్తలేదని కొందరు విమర్శిస్తున్నారు. "బ్యారేజి నిల్వ 3 టీఎంసీ లు అయితే అందులో 1.5 టీఎంసీ పూడిక పోతే మిగిలేది 1.5 టీఎంసీ సామర్ధ్యం. భారీ వరద వస్తుంది అని ముందే తెలుసు. నాగార్జున సాగర్  నిండ బోతున్నది  అని తెలుసు అందుకే గేట్లు అన్ని ఎత్తి నీరు కిందకి వదులుతున్నారు, దిగువన ఉన్న పులిచింతల  కూడా నిండుకుండా లా ఉంది అక్కడ నుంచి కూడా నీరు వదులుతున్నారు. ఈ విషయం గత వారం రోజులు గా అందరికి తెలుసు. అధికారులకు ముందే తెలుసు. కానీ ఇప్పటికే పట్టిసీమ జలాలతో నిండుగా ఉన్న ప్రకాశం బ్యారేజి గేట్లు నిన్నటి వరకు ఎందుకు ఎత్తలేదు? నీరు కిందకి  ఎందుకు వదలలేదు.? రోజు కి 4 నుంచి6 లక్షల క్యూసెక్ ల నీటి ని సాగర్ నుంచి వదులుతున్నారు. ముందు గానే ప్రకాశం బ్యారేజి ని కొద్దిగా ఖాళీ చేసి పై నుంచి వచ్చే నీటి ని వచ్చినది వచ్చినట్టు గా కిందకి వదిలితే బ్యారేజి మీద వత్తిడి తగ్గేది.ముంపు ఉండేది కాదు . కానీ లోతట్టు ప్రాంతాలు మునిగినాపర్లేదు అని రెండు రోజులు ఆలస్యం గా గేట్లు ఎత్తిన కారణం కేవలం రాజకీయం. పై నుంచి వస్తున్న భారీ వరద కారణం గా ముంపు కలగాలి. ఆ ముంపుకి లోతట్టు ప్రాంతాలు మునగాలి. ప్రజావేదిక స్థలం , చంద్రబాబు ఉంటున్న ఇల్లు ముంపుకి గురి కావాలి. చూసారా మునిగిపోయే ప్రాంతం లో రాజధాని కట్టారు అని , చంద్రబాబు ఉంటున్న ఇల్లు కట్టిన ప్రజావేదిక మునిగి పోయింది అందుకే రాజధాని ఇక్కడ వద్దు అన్నది.. అనే విష ప్రచారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు  తెలుస్తోంది." "ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తకుండా, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుందేమోనని ఎదురు చూశారు. కానీ, ఇంకా కనీసం 2 మీటర్లు అంటే కనీసం మరో 6.5 అడుగులు మట్టం పెరిగితే కానీ, ఆ ఇంటి గార్డెన్ ఏరియా ని టచ్ చేయలేవు. ఈ లోపు కేంద్ర జల శక్తి శాఖనుండి.. బారేజ్ గేట్లు ఎత్తనందుకు  అక్షింతలు పడ్డాయి. ఇంత కౄరమైన ఆలోచన ఎందుకు? అమరావతి కి ముంపు ప్రమాదం ఉందని ప్రచారం చేయాలి. అమరావతి మునగాలంటే ఇంకా 23 అడుగులు మట్టం పెరగాలి.. అది జరిగే పని కాదు." అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
  చంద్రబాబుతో మీటింగ్ అంటే, సాధారణంగా ఆయనే మాట్లాడారు. ఆయనే చెబుతారు. ఎంత పెద్ద లీడరైనా, బాబు కంటే సీనియర్ అయినాసరే సెలైంట్ గా వినాల్సిందే. అలాంటింది పార్టీ ఘోర ఓటమి తర్వాత జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. తమ ముందున్నది పార్టీ అధినేత అనే సంగతి మర్చిపోయి లావా లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. రొటీన్‌కు భిన్నంగా హండ్రెడ్ డిగ్రీస్ సెల్సియస్ లో హాట్‌హాట్‌గా సాగిన మీటింగ్ లో ఒకరిద్దరు నేతలు నిప్పులు చెరిగారు. తమ గుండెల్లో దాగున్న బాధనంతా వెళ్లగక్కారు. ఎన్నడూ అధినేత మాటకు ఎదురుచెప్పని లీడర్లు కళ్లెర్ర చేశారు. ఇదేనా పార్టీలో క్రమశిక్షణ, ఇంతేనా పార్టీలో కొందరి నేతల బాధ్యతా అంటూ శివాలెత్తారు. జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనా కాలేదు, అప్పుడే విమర్శలేంటంటూ అయ్యన్నపాత్రుడు అసహనం వ్యక్తంచేశారు. కొత్త సర్కారుకు కొంత సమయం ఇద్దాం, తప్పులు చేయనిద్దాం, ఆ తప్పులు ప్రజల్లోకి వెళ్లేవరకు ఆగుదాం, ఆ తర్వాతే ప్రజల తరపున రోడ్డెక్కుదామంటూ తన వాదనను కుండబద్దలు కొట్టారు. ఇప్పుడే విమర్శలుచేస్తే టీడీపీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోందన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయంటూ చంద్రబాబు ముందు గట్టిగానే వాదించారట. అయినా ఆకలేసినప్పుడే అన్నం పెట్టాలి... అప్పుడే అన్నం విలువ తెలుస్తుందని, ముందే పెడితే ప్రజలకు అర్ధంకాదంటూ అయ్యన్న చెలరేగి మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రజలకు తాను చెప్పే నిర్ణయాలు కొందరికి నచ్చకపోవచ్చంటూనే, పరోక్షంగా లోకేష్, దేవినేని ఉమాపై విరుచుకుపడినట్లు తెలిసింది. ప్రతి విషయానికీ ట్విట్టర్లోనో, లేదంటే తిట్ల దండకాలో ఎందుకంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పార్టీ ప్రక్షాళన విషయంలో చంద్రబాబు మొహమాటపడకుండా, కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అయ్యన్న సూచించారు. ఇక టీడీపీలో అత్యంత సీనియర్‌ లీడరైన గోరంట్ల బుచ్చయ్యచౌదరి కూడా, గట్టిగానే మాట్లాడారు. ఓడిపోయిన నేతలను ఇంకా నెత్తిన పెట్టుకుని ఊరేగడం కరెక్టు కాదన్నారు. పార్టీలో స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారని, లాయలిస్టులకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు ముందే గుండెల్లో బాధను గోరంట్ల బయటపెట్టారు. కొంతమంది డబ్బు సంపాదించి, పదవులు అనుభవించి వెళ్లిపోతున్నారని, ఇకనైనా అలాంటి తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని కోరారు. పార్టీలో యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతే తన టీడీఎల్పీ ఉపనేత పదవిని బీసీకి ఇవ్వాలని సూచించారు. అయితే, బోండా ఉమతో పాటు కొందరు కాపు నేతలను ఉద్దేశించే గోరంట్ల ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.  అయితే, ఎప్పుడూ గొంతెత్తని నేతలు గుండెల్లో బాధనంతా వెళ్లగక్కుతుంటే, వామ్మో, సీనియర్ నేతల్లో ఇంత ఆక్రోశం దాగుందా అంటూ చంద్రబాబు షాకైనట్లు తెలుస్తోంది. ఒకానొక టైమ్ లో అయ్యన్న సీరియస్‌గా మాట్లాడుతుంటే, కొంతమంది నేతలు వారించినట్టు తెలిసింది. అయితే వెనక్కి తగ్గని అయ్యన్న... నిజాలు మాట్లాడుకుని, లోపాలు సరిదిద్దుకుని, పార్టీని తిరిగి బలోపేతం చేసుకోవాలనేదే తన ఉద్దేశమని, ఆత్మస్తుతి, పరనిందలా సమావేశం జరిగితే ఉపయోగం ఉండదని రివర్స్ అయ్యారట. అతి విశ్వాసం, ప్రత్యర్థుల బలాన్ని తక్కువగా అంచనా వేయడం, కొందరు నేతల అవినీతిని చూసీచూడనట్టు వ్యవహరించడమే పార్టీ కొంపముంచిందని అన్నట్టు తెలిసింది. అయితే, నేతల మాటలను సావధానంగా విన్న అధినేత, ప్రతి ఒక్కరి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని, పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్దామని నేతలకు హామీ ఇచ్చారట.
  జగన్ ఆలోచనలకు, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీడీపీని కార్నర్ చేయాలనో... లేక చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలనో... తెలియదు కానీ జగన్ తీసుకుంటోన్న నిర్ణయాలను అటు కేంద్రం... ఇటు ప్రజలు తప్పుబడుతున్నా... తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్న మాదిరిగా జగన్ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోంది. ముఖ్యంగా నవ్యాంధ్ర జీవనాడైన పోలవరంపై జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే కేంద్రం తప్పుబట్టగా, ఇఫ్పుడు స్వయంగా పోలవరం అథారిటీయే షాకిచ్చింది. పోలవరం టెండర్ల రద్దు నిర్ణయం అత్యంత బాధాకరమంటూ, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జలవనరులశాఖామంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రివర్స్ టెండరింగ్ తో ప్రాజెక్టు వ్యయం పెరగడంతోపాటు ఇది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటూ దాదాపు చేతులెత్తేశారు. సేమ్ టు సేమ్ ఇలాంటి కామెంట్సే చేసింది పోలవరం అథారిటీ. కొత్తగా టెండర్లు పిలవడం వల్ల కాలాతీతమవుతుందని, వ్యయం భారీగా పెరుగుతుందని, చివరికి పోలవరం భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలవరం టెండర్ల రద్దు, ప్రీ-క్లోజర్ పై నాలుగైదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన అథారిటీ... రివర్స్ టెండరింగ్ తో రిస్కేనని తేల్చిచెప్పింది. ప్రస్తుత కాంట్రాక్టు సంస్థల పనితీరు సంతృప్తికరంగానే ఉందని, అలాంటప్పుడు టెండర్లు రద్దు చేయడం ఎందుకుని అభిప్రాయపడింది. ఏదేమైనా రివర్స్ టెండరింగ్ కు వెళ్లడం సరికాదన్న పోలవరం అథారిటీ... పునరాలోచించుకోవాలంటూ జగన్ సర్కారు సూచించింది. అయితే, తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని స్పష్టంచేసింది. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోలవరం అథారిటీ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశంతోపాటు సంచలనంగా మారింది. మరి పోలవరం అథారిటీ కామెంట్స్ పై జగన్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.
  జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రూట్ మారినట్లు కనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో ఆయనకు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది. దీంతో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక.. అసెంబ్లీలో పవన్ గొంతుకై వినిపిస్తారు, పవన్ గొంతుకై ప్రశ్నిస్తారు అని భావించారంతా. కానీ రాపాక మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేశారు. కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే, కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని రాపాక వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో జన సైనికులే కాదు, సాధారణ జనాలు కూడా షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే రాపాక రూట్ మార్చారు. జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని రాపాక విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 60 రోజులకే ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని రాపాక పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, దేశంలోనే ఏపీ చాలా వెనకబడి ఉందని రాపాక తెలిపారు. ప్రభుత్వం పాలనపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. కానీ ప్రభుత్వం ఆ పని చెయ్యకపోవటం వల్లే ఇప్పుడు వ్యతిరేకత వస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని రాపాక ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇంతకాలం జగన్ ప్రభుత్వ పాలన విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయని రాపాక పవన్ ఇచ్చిన సూచనలతోనే తన పంధా మార్చుకున్నారనే భావన వ్యక్తమవుతుంది. ఇటీవల రాపాకతో సమావేశం అయిన పవన్ రాపాక కు పలు సూచనలు చేసినట్టు సమాచారం. అందుకే రాపాక రూట్ మార్చి జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మొదలు పెట్టారని తెలుస్తోంది.
  ఏపీ ప్రభుత్వం సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి లక్షల జీతాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు సాక్షి పే రోల్స్‌లో ఉన్న 8 మంది ఉన్నత స్థాయి ఉద్యోగులకు.. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుల పేరుతో జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ జీతాలు కూడా లక్షల్లో ఉండటం, అదే స్థాయిలో అలవెన్స్‌లు కూడా మంజూరు చేయడం విమర్శలకు కారణమవుతోంది. ఇప్పటికే 8 మందిని ఇలా తీసుకున్నారని.. మరికొంత మందిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ బంధువు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ప్రజాసంబంధాల సలహాదారుగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన సాక్షి ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఉండేవారు. తర్వాత పూర్తిగా వైసీపీ వ్యవహారాలు చూస్తున్నారు. అయినప్పటికీ.. ఆయనకు సాక్షి నుంచి జీతం అందేది. ఇప్పుడు ప్రజాసంబంధాల సలహాదారుగా ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు. ఈయన జీతం రూ. మూడు లక్షలకుపైనే. 8 మంది వరకూ సిబ్బందిని నియమించునే అవకాశం, కారు, ఫోన్, ఇంటి అద్దె ఇలా అన్ని రకాల అలవెన్సులు కలిపి.. నెలకు రూ. 10 లక్షలకు పైగానే అవుతుంది. అంటే ఏడాదికి 1 కోటి 20 లక్షలు.. ఐదేళ్లలో ఇది 6 కోట్లు పైనే.. ఇలా ఒక్క సాక్షి ఉద్యోగికి ఏపీ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కమ్యూనికేషన్ సలహాదారుడిగా జీవీడీ క్రిష్ణమోహన్ ని నియమించారు. ఈయన సాక్షిలో బ్యూరో చీఫ్ స్థాయిలో పనిచేసేవారు. జగన్ సభలలో మాట్లాడే స్పీచ్‌లు ఈయనే రాసేవారని సమాచారం. రెండు నెలల క్రితం వరకూ సాక్షి తరపునే జీతం ఇచ్చేవారు. అయితే ఇప్పుడు కమ్యూనికేషన్స్ సలహాదారుగా నియమించి జీవీడీ క్రిష్ణమోహన్ కి ఏడాది 1 కోటి 20 లక్షలకు పైనే.. ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించనున్నారని తెలుస్తోంది. సీపీఆర్వోగా పూడి శ్రీహరి అనే సాక్షి ఉద్యోగిని నియమించుకున్నారు. సాక్షిలో.. రూ. 50 వేలలోపే జీతం తీసుకునే ఈ ఉద్యోగి.. జగన్ పాదయాత్ర సమయంలో ఆయన వెంట ఉంటూ మీడియా వ్యవహారాలు చూసుకున్నారని తెలుస్తోంది. ఈయనను ఇప్పుడు సీపీఆర్వోగా నియమించారు. ఈయన జీతం కూడా.. సీనియర్ సలహాదారుల స్థాయిలోనే ఉందని చెబుతున్నారు. అన్నీ కలిపి నెలకు.. రూ. 10 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వీరు మాత్రమే కాదు.. సాక్షి పేరోల్స్‌లో కాస్త ఎక్కువ జీతం అనుకున్న మరో ఐదుగురికి కూడా.. ఇదే తరహాలో సలహాదారుల పోస్టులు ఇచ్చి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఇలా నియమించుకుంటున్న సలహాదారులకు.. కావాల్సిన సిబ్బంది కూడా సాక్షి గ్రూప్ లో పనిచేసే ఉద్యోగులేనని చర్చ నడుస్తోంది. ప్రమాణస్వీకారం చేసేటప్పుడు తాను నెలకు ఒకే ఒక్క రూపాయి జీతం తీసుకుంటానని ప్రకటించిన సీఎం జగన్.. దయనీయస్థితిలో ఉన్న ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడం తన ముందున్న ప్రథమకర్తవ్యం అని ప్రకటించారు. తాను చంద్రబాబులా హిమాలయ వాటర్ తాగనని, కిన్లే తాగడం వల్ల ఖజానాకు రోజుకు 80 నుంచి 120 రూపాయలు మిగిల్చుతానని చెప్పుకొచ్చారు. అయితే.. ఏపీ ఆర్థిక కష్టాల్లో ఉందని.. తాను ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటానని ప్రకటించిన జగన్.. ఇలా సలహాదారులు, వారి సహాయకుల కోసం.. కోట్లకు కోట్లు జీతభత్యాలు వెచ్చించడం ఏంటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ప్రభుత్వానికి అవసరం అయి తీసుకుంటే పర్వాలేదు కానీ.. తమ సొంత సంస్థలో జీతాలు తీసుకునేవారిని ఇలా నియమిస్తూండటంతో.. ప్రజాధనాన్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  కాశ్మీర్ అంశంలో మోడీ సర్కార్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు సిద్దమవుతుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన సమావేశమైన జాతీయ భద్రతా కమిటీ నిన్న కీలక నిర్ణయాలను తీసుకుంది. భారత్ దౌత్య సంబంధాలను తెంచేసుకోవాలని నిర్ణయించుకున్న పాక్ యుద్దానికి వెనుకాడొద్దని సైన్యానికి పరోక్ష అలర్ట్స్ పంపింది. లాహోర్-ఢిల్లీ మధ్య బస్సు సర్వీసును కూడా నిలిపివేసిన పాకిస్తాన్ వాఘా సరిహద్దును కూడా మూసివేయాలని ఆదేశించింది.  ఆగష్టు 15ను బ్లాక్ డేగా నిర్వహించాలని, భారత్ హై కమిషన్ ను వెనక్కు పంపాలని, ఢిల్లీలోని పాక్ హైకమిషన్ ను వెనక్కు రావాలని ఆదేశాలిచ్చింది. ద్వైపాక్షిక  ఒప్పందాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని.. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటన విషయంలోనే యుద్ధం వస్తుందని భావించినా పాక్ తేలు కుట్టిన దొంగలా ఉండిపోవడం వలన అది సద్దుమణిగింది.  అయితే ఆర్టికల్‌-370ని మోదీ సర్కారు నిర్వీర్యం చేయడం భారత్‌-పాక్‌ మధ్య యుద్ధానికి దారితీయొచ్చని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో భారత్‌లో మరిన్ని ఘటనలు చోటుచేసుకునే ప్రమాదముందని, కశ్మీరీలను ఎంత అణగదొక్కేందుకు ప్రయత్నిస్తే, తమ హక్కుల కోసం వారు అంతగా పోరాటం చేస్తారని ఆయన హెచ్చరించారు.  కశ్మీరీలకు సాయం చేసేందుకు ఎంతదాకైనా వెళతామని, ఇందుకు తమ బలగాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ కమర్‌ జావెద్‌ బజ్వా కూడా ప్రకటించారి. తాజాగా కమాండర్లతో సమావేశం నిర్వహించారు. కశ్మీరీలకు చివరి క్షణం వరకూ పాక్‌ సైన్యం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవద్ చౌదరి యుద్ధానికి వెనుకాడొద్దని, యుద్ధమంటే గెలుపోటముల కోసం చేసేది కాదని, గౌరవం కోసం, పరువు, ప్రతిష్ఠల కోసం చేసేదని చెప్పుకొచ్చారు.  ఈ నేప‌థ్యంలో ప‌రిణామాలు ఎటువైపు దారితీస్తాయోనని భార‌త్‌, పాక్ ప్ర‌జ‌లు ఆసక్తిగా గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌ధానంగా పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ చేసిన ప్ర‌సంగాన్ని ఒక‌సారి గ‌మ‌నిస్తే.. ఇరుదేశాల మ‌ద్య యుద్ధం త‌ప్ప‌దేమోన‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.  చూద్దాం ఏమవుతుందో ?
  అనగనగా ఓ మధ్యతరగతి ఉద్యోగి. అతను రోజూ తన కార్యాలయానికి వెళ్తూ వస్తూ దారిలో కనిపించే విశేషాలను గమనిస్తూ ఉండేవాడు. అంతా బాగానే ఉండేది కానీ, దారి మధ్యలో కనిపించే ఆ రాజభవనాన్ని చూడగానే ఉద్యోగి మనసు కలుక్కుమనేది. ‘ఆహా! హాయిగా ఆ రాజకుటుంబంలో పుట్టినా బాగుండేది, ఎలాంటి కష్టమూ లేకుండా పట్టుపరుపుల మీద నుంచే అష్టైశ్వార్యాలూ అనుభవించవచ్చు’ అంటూ తెగ ఈర్ష్యపడిపోయేవాడు ఉద్యోగి. రాజకుటుంబం సంగతేమో కానీ ఈ ఉద్యోగిని చూసి అసూయపడేవారు కూడా లేకపోలేదు. రోజూ ఉదయాన్నే ఠంచనుగా ఉద్యోగి గొడుగుని ఊపుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక పళ్ల దుకాణం వాడు అతణ్నే గమనిస్తూ ఉండేవాడు. ‘ఛీ వెధవ బతుకు! చిన్నప్పుడు మా నాన్న మాట విని బుద్ధిగా చదువుకుని ఉంటే హాయిగా ఆ ఉద్యోగిలాగా ఉండేవాడిని కదా! ఉద్యోగం ఉంటే దర్జాగా బతకవచ్చు’ అనుకునేవాడు దుకాణదారుడు.  ఇదిలా ఉండగా ఉద్యోగికి ఓసారి అరుదైన అవకాశం దక్కింది. కార్యాలయం తరఫున యువరాజుని కలిసి కొన్ని సంతకాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ మాట వినగానే ఉద్యోగి ఎగిరి గంతేశాడు. ‘తను ఎప్పటికీ ఆ భోగాలను అనుభవించలేడు. కనీసం వాటిని ఒక రోజు పాటు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది కదా!’ అనుకున్నాడు. రాజభవనంలో తన సమయం ఎలా గడవబోతోందో తెగ ఊహించుకోసాగాడు ఉద్యోగి. అతని ఊహలతో పని లేకుండా ఆ రోజు రానే వచ్చింది. తనకున్న వాటిలో బాగున్న దుస్తులను వేసుకుని, తలని ఒకటికి పదిసార్లు దువ్వుకుని రాజభవనానికి బయల్దేరాడు ఉద్యోగి. ఉద్యోగి రాక గురించి వినగానే యువరాజుగారు నేరుగా అతణ్ని తన మందిరానికి పంపించమన్నారు. యువరాజుగారు పట్టుపరుపు మీద పడుకునో, అలంకరించుకుంటూనో ఉంటారనుకుంటూ బెరుకుగా ఆ గదిలోకి అడుగుపెట్టిన ఉద్యోగికి ఆయన కిటికీ దగ్గర నిల్చొని కనిపించారు. ‘యువరాజా! నేను మీ సంతకాల కోసం వచ్చాను’ అని ఉద్యోగి ఒకటికి రెండుసార్లు చెప్పినా యువరాజుగారు వినిపించుకోలేదు. ఇక లాభం లేదని ఉద్యోగి ఆయనకు దగ్గరగా వెళ్లి చూస్తే ఏముంది… యువరాజుగారు తీక్షణంగా ఆ పళ్లు అమ్ముకునేవాడినే చూస్తున్నారు. ‘యువరాజా! అతనేమన్నా అపచారం చేశాడా? అంత తీక్షణంగా చూస్తున్నారు?’ అంటూ కాస్త చొరవగా అడిగాడు ఉద్యోగి.  ‘అపచారమా పాడా! అతణ్ని చూసినప్పుడల్లా నాకు మహా అసూయగా ఉంటుంది. హాయిగా ఏ రోజుకారోజు కాయకష్టం చేసకుంటూ, వచ్చినదానితో తృప్తిగా బతుకుతూ, భవిష్యత్తు గురించి ఎలాంటి బాధా లేకుండా ఉండే అతని జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో కదా! కావాలంటే దుకాణాన్ని తీసి ఉంచుతాడు, లేకపోతే మధ్యలోనే కట్టేసి తన భార్యాపిల్లలతో కలిసి షికారుకి వెళ్లిపోతాడు. అంత స్వేచ్ఛగా, సాదాసీదాగా జీవించడంలో ఉన్న ఆనందం బందిఖానాలాంటి ఈ రాజభవనంలో ఎక్కడ ఉంటుంది,’ అంటూ నిట్టూర్చారు యువరాజులవారు. యువరాజులవారి మాటలు విన్న ఉద్యోగికి ఏదో కొత్త విషయం బోధపడింది. సుఖానికీ, సంతోషానికీ ఉన్న వ్యత్యాసం తెలిసి వచ్చింది. మరి అదే విషయం దుకాణదారుడుకి ఎప్పుడు తెలిసివస్తుందో!
  ఓ గురువుగారు సీతాపురం అనే పల్లెటూరి గుండా వెళ్తున్నారు. ఆ పల్లెటూరు అలాంటి ఇలాంటిది కాదు. అందులో అందరూ వీరులే! రాజుగారికి ఉన్న సైన్యంలో సగభాగం అక్కడి నుంచే వస్తుంటారు. సాక్షాత్తూ రాజుగారి సైన్యాధ్యక్షుడు కూడా అక్కడి వాడే. మల్లవిద్య, కర్రసాము, కత్తియుద్ధం… ఇలా ఎలాంటి యుద్ధవిద్యలో అయినా సరే, ఆ ఊరి జనానికి సాటి లేదు. అలాంటి సీతాపురం గుండా గురువుగారు వెళ్తున్నారు. అదే సమయంలో వారికి ఆ ఊరిలోనే విడిది చేసి ఉన్న సైన్యాధ్యక్షుడు ఎదురుపడ్డాడు. గురువుగారిని చూసిన సైన్యాధ్యక్షుడు `గురువుగారూ మీ గురించి చాలా విన్నాను. ఇవాళ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఎన్నాళ్ల నుంచో ఒక అనుమానం పీడిస్తోంది. దయచేసి నివృత్తి చేయండి` అని అడిగాడు. `నాకు చేతనైతే తప్పక నివృత్తి చేస్తాను. ఏమిటా అనుమానం` అన్నారు గురువుగారు. `మన పెద్దవాళ్లు ఎంతసేపూ స్వర్గం, నరకం అని ఊదరగొడుతుంటారు కదా! నిజంగా స్వర్గం, నరకం అనేవి ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే వాటికి ద్వారాలు ఎక్కడ ఉన్నాయి?` అని అడిగాడు. `ఇంత మంచి ప్రశ్న అడిగావు. ఎవరు నువ్వు` అని అడిగారు గురువుగారు. `నేను ఈ రాజ్యానికే సైన్యాధ్యక్షుడిని. రాజుగారి విజయాలన్నింటికీ కారణం నేనే!` అని గర్వంగా బదులిచ్చాడు సైన్యాధ్యక్షుడు. `అబ్బే నిన్ను చూస్తే సైన్యాధ్యక్షునిలా లేవే. ఎవరో పగటివేషగాడిలా ఉన్నావు. నిన్ను చూస్తే నవ్వు వస్తోంది కానీ భయం వేయడం లేదు` అని ఎగతాళిగా అన్నారు గురువుగారు. `ఎంతమాట! నేను పగటివేషగాడిలా ఉన్నానా! నన్ను చూస్తుంటే నవ్వులాటగా ఉందా! నీ నవ్వుని గొంతులోనే ఆగిపోయేలా చేస్తాను. ఉండు!`అంటూ తన కత్తిని దూసి గురువుగారి కంఠానికి గురిపెట్టాడు సైన్యాధ్యక్షుడు. `ఇదే నాయనా నువ్వు చూడాలనుకున్న నరక ద్వారం. నీ కోపంతోనూ, ఉద్వేగంతోనూ, అహంకారంతోనూ… దాన్ని ఇప్పుడే నువ్వు తెరిచావు` అన్నారు గురువుగారు. గురువుగారి మాటలకు సిగ్గుపడి సైన్యాధ్యక్షుడు తన కత్తిన తీసి ఒరలో ఉంచుకుని బాధగా నిలబడ్డాడు. `ఇప్పుడు నువ్వు స్వర్గంలోకి అడుగుపెట్టావు. నీ ఆలోచనతోనూ, ప్రశాంతతతోనూ, పశ్చాత్తాపంతోనూ స్వర్గపు ద్వారాలను తెరిచావు` అన్నారు గురువుగారు చిరునవ్వుతో! అపై సైన్యాధ్యక్షుడిని చూస్తూ ఇలా అన్నారు `చూశావా! స్వర్గం, నరకం రెండూ నీలోనే ఉన్నాయి. నువ్వు అనాలోచితంగా ప్రవర్తించిన రోజు నరకానికి దారిని తెరుస్తావు. జాగ్రత్తగా, ఖచ్చితంగా ఆలోచించగలిగిన రోజు స్వర్గానికి తలుపులు తీస్తావు. స్వర్గనరకాలు ఎక్కడో కాదు, నీ మనసులోనే ఉన్నాయి.` అంటూ సాగిపోయారు గురువుగారు.
  Raksha Bandhan, means the “Knot of Protection” and is one of the important festivals celebrated by Hindus throughout the world. Celebrated on Sravana Pournami Day, this festival stands testimony of  the beautiful relationship shared between brothers and sisters. It has been termed as a lifelong promise of protection made on this special occasion. The beautiful relationship of love, care and affection between siblings is further enhanced with the tying of the sacred thread – the Raakhi, by the sister on her brothers wrist. Story of Raksha Bandhan There are many tales as to why Raksha Bandhan became a an important festival and one of them is the story of King MahaBali and Lakshmi Devi. As the story goe,s King Mahabali was a great devotee of Lord Vishnu and asked him to come down from his heavenly abode of Vaikuntam and protect his Kingdom. Lord Vishnu agreed and came down disguised as a door keeper. But Lakshmi his consort was left alone and wanted to bring back Vishnu back to his abode. She went to his kingdom disguised as a Brahmin woman and took refuge in his palace on the pretext that her husband was away and needed protection. On the Shravana Pournami day she tied a sacred thread on the king’s hand and asked him for a boon. Mahabali acceded and she requested for the door men who was actually Lord Vishnu to be sent back to Vaikuntam along with her. Mahabali recognizing her to be Goddess Lakshmi, realized his folly and requested Lord Vishnu to accompany Lakshmi back to Vaikuntam and to his rightful place. In return, Vishnu promised to return and stay with Bali for four months of each year. Hence the festival is also called Baleeva and on this day sisters come to their brothers’ home and tie Raakhis’ to their brothers. We are indeed truly blessed to have this tradition of brothers and sisters bonding where the woman folk and are respected and taken care of by their brothers lifelong and given wonderful gifts as a token of love and affection.     So with Raksha Bandhan right around the corner and you're probably wondering as to what you should be getting for your sister when she ties the Rakhi? Check out our Tone shop for interesting Gifting ideas this Raksha Bandhan Day ! Beautiful Raakhis for your brothers and wonderful gifting ideas for your sisters...
    తెలంగాణ లో బలపడి అధికారం చేపట్టాలని బీజేపీ డిసైడ్ ఐన దగ్గర నుండి బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. నిన్న తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా రాష్ట్రం లోని టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రజలకు అందకుండా అడ్డుపడుతోందని, అలాగే మిషన్  కాకతీయ, కమిషన్ల మిషన్ గ మారిందని తీవ్ర విమర్శలు చేసారు. దీని పై స్పందించిన టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కర్ణాటక తరహా రాజకీయాలు తెలంగాణాలో చెల్లవని అవినీతి ఉంటే నిరూపించాలని బీజేపీకి సవాల్ విసిరారు. అలాగే బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐతే ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యల పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తన స్థాయి మరచి మాట్లాడుతున్నారని అన్నారు. అలాగే హెచ్చరికలకు పోవద్దని త్వరలోనే మెక్కింది అంతా కక్కిస్తామంటూ కేటీఆర్ ను హెచ్చరించారు. రెండోసారి అధికారంలోకివచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం  తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేశారని అయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మొత్తం అవినీతిమయంగా మారిపోయిందంటూ లక్ష్మణ్ తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ ఎన్నికల్లో  ఇచ్చిన హామీలు ఏవీ అమలుకు నోచుకోలేదంటూ మండిపడ్డారు. రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, రైతు రుణమాఫీ వంటి పథకాలు పూర్తిగా పడకేశాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం కనీసం ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉందంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయి నాలుగు రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ కంటే ఆయుష్మాన్ భవ పథకం గొప్పదేం కాదంటూ వ్యతిరేకించిన కేసీఆర్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో చెప్పాలని బీజేపీ నేత నిలదీశారు. రూ.30వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80వేల కోట్లకు పెంచేశారని అయన ఆరోపించారు. 6శాతం కమీషన్ల కోసమే కేసీఆర్ ఈ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారంటూ లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు.  
  'చూడప్పా సిద్ధప్పా.. నేను సింహం లాంటోడిని.. సింగిల్ గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతా' అన్నట్టుంది ప్రస్తుతం కర్ణాటక సీఎం యడ్యూరప్ప పరిస్థితి. కాంగ్రెస్- జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వానికి చెక్ పెట్టి 'రాజు' అయితే అయ్యారు కానీ పాపం తోడుగా 'మంత్రులే' లేరు. దీంతో సోలోగానే మంత్రి వర్గ సమావేశాలు నిర్వహిస్తున్నారట. మూడు వారాల క్రితం కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు కానీ ఇప్పటి వరకు మంత్రివర్గం ఏర్పాటే చెయ్యలేదు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిద శాఖలకు చెందిన అధికారులతో యడ్యూరప్ప మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా.. ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వంలో ఒకే ఒక మంత్రి (ముఖ్యమంత్రి) యడ్యూరప్ప. మంత్రివర్గ సమావేశం నిర్వహించినట్లు సంతకాలు చేసే రిజిస్టర్ లో యడ్యూరప్ప ఒక్కరే సంతకం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు సమస్యలు పరిష్కరించడం కోసం సీఎం మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఇంత వరకు మంత్రివర్గం ఏర్పాటు కాకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్ని శాఖలకు చెందిన ఐఏఎస్ అధికారులతో పాటు సీనియర్ అధికారులతో సీఎం సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సీఎం యడ్యూరప్ప నేతృత్వంలో అధికారికంగా నాలుగు మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అనుమతి కోసం యడ్యూరప్ప ఇన్నిరోజులు వేచి చూశారు. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ అనుమతితో యడ్యూరప్ప ఆగస్టు 20వ తేదీ మంగళవారం మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడానికి సిద్దం అయ్యారని తెలుస్తోంది. 
  ఒక కేసులో నిందితుడైన భర్త ఆచూకీ కోసం గర్భవతి ఐన అతని భార్య తో మహిళా ఐపీఎస్ అధికారిణి వ్యవహరించిన తీరు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓడిశాలో గత జులై 3న సుందర్‌గఢ్ జిల్లా కణిక గ్రామంలో కారు ఢీ కొని యువకుడు చనిపోయాడు. ఈ ఘటన పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసు స్టేషన్ వద్దకు చేరి నిరసన చేస్తూ విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఉత్తమ్ డే తో సహా 14 మందిని నిందితులుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు ఎస్పీ స్వయంగా రంగం లోకి దిగారు. దీనిలో భాగంగా ఉత్తమ్ డే ఇంటికి వచ్చిన ఆ మహిళా ఎస్పీ సౌమ్య మిశ్రా నిందితుడు అందుబాటులో లేకపోవడం తో అతని ఆచూకీ చెప్పాలని అతని భార్య ఐన ప్రియా డే ను కోరగా ఆమె తనకు తెలియదని చెప్పటంతో ఆగ్రహానికి గురై బూటు కాలితో ఆమె పొత్తి కడుపు మీద తన్నడంతో మరి కొన్ని రోజులలో పండంటి బిడ్డకు తల్లి కావాల్సిన ఆమెకు గర్భస్రావం జరిగి మాతృత్వాన్ని కోల్పోయింది. తన భర్త చేసిన నేరానికి తనకు ఎందుకు శిక్ష విధించారని ఆమె ఎంత రోదించిన ఫలితం లేక పోయింది. ఐతే తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదని డిసైడ్ ఐన ప్రియా డే ఒడిశా కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం ఆ మహిళా ఐపీఎస్ అధికారిణి పై క్రిమినల్ కేసు నమోదు చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.