LATEST NEWS
తెలుగు దేశం పార్టీ కి మొదటి నుండి స్నేహ హస్తం ఇస్తూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ మధ్య ఆ పార్టీ పై పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. 2014 ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన జన సేన అధినేత, ప్రతిసారి, రాష్ట్రంలో టీడీపీ ని కేంద్రంలో బీజేపీ ని వెనకేసుకుంటూ వచ్చారు. కానీ, ఎవరు ఊహించని విధంగా చంద్రబాబు నాయుడు, ఆయన పుత్రుడు నారా లోకేష్ పై విరుచుకుపడ్డాడు. అసలు, పవన్ తిరుగుబాటుకు అసలు కారణం ఏమై ఉండోచ్చబ్బా అని ఎవరి విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు. అయితే, పవన్ కి బాబు మీద కన్నా ఆయన పుత్రుడు లోకేష్ మీదే కోపం ఎక్కువ ఉందట. దీనికి కారణం ఏంటంటే, లోకేష్ మొదటి నుండి పవన్ కళ్యాణ్ ని చిన్న చూపు చూస్తున్నాడట. పార్టీ మీటింగ్స్ లో గానీ, ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ప్రస్తావన వస్తే, ఆయన వల్ల ఒరిగేదేమి లేదు, లైట్ తీసుకోండి అంటూ సమాధానం ఇచ్చేవాడట. జన సేన తో పొత్తు కావాలంటే, తమకు ఎక్కువ సీట్లు కావాలని పవన్ డిమాండ్ చేస్తే, లోకేష్ ససేమీరా అన్నాడట. ఆ మధ్య పవన్ ని చంద్రబాబు ఎక్కువగా పట్టించుకోకపోవడానికి కారణం కూడా లోకేషే నట. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఇక టీడీపీ కి దూరం గా ఉందామని డిసైడ్ అయ్యాడట. తన స్పీచ్ ద్వారా మొత్తానికి బాబు, లోకేష్ పై కక్ష తీసుకున్నాడని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్  బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నివాసంలో జరిగిన భేటీకి అపోజిషన్ పార్టీ లీడర్ వై యస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాజరవడం చర్చనీయాంశం అయింది. బీజేపీకి జాతీయ స్థాయిలో వ్యూహకర్తగా నియమితుడయిన ప్రశాంత్ కిషోర్ ఈ భేటీకి హాజరై... రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై వివరించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో పొత్తుకు లైన్ క్లియర్ చేశారు అని ప్రచారం జరుగుతుంది. అయితే, పీకే కి చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చింది. తన ట్విట్టర్ అకౌంట్లో ఓ టీవీ ఛానల్ క్లిప్ను జతచేస్తూ మరీ...`పూర్తిగా అవాస్తవ కథనం. అసత్యకథనాలను ప్రచారం చేసేందుకు దురుద్దేశపూరితంగా చేస్తున్న ప్రచారం ఇది. ఇలాంటి ప్రచారం గురించి వదిలేయండి. ఎందుకంటే ఇవాళ ప్రశాంత్ కిషోర్ ఢిల్లీలోనే లేరు` అంటూ తేల్చిచెప్పింది. అంతేకాకుండా  బీజేపీ జాతీయ స్థాయి వ్యూహకర్తగా  ప్రశాంత్ కిషోర్ను నియమించడం కూడా పూర్తిగా అబద్దమని పేర్కొంది. ఇదిలా ఉంటె, రాజకీయ విశ్లేషకులు మాత్రం బీజేపీ కి, వైకాపా కి పోతుకుదుర్చే పనిలో ఉన్నారని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్‌కు గుండెపోటు రావడంతో చెన్నై లోని గ్లోబల్ హెల్త్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వెంటలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో తన భర్తని చూసేందుకు తనకు వెంటనే పెరోల్ మంజూరు చేయాలని శశికళ దరఖాస్తు చేసుకున్నారు. కాగా, 72 ఏళ్ల నటరాజన్‌కు లివర్ చెడిపోవడంతో 2017 అక్టోబర్‌లో కిడ్నీ మరియు లివర్ మార్పిడి ఆపరేషన్ జరిపారు. అయితే రెండు వారాల క్రితం ఆయన అస్వస్థతతో తిరిగి ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి హృద్రోగ సమస్య తలెత్తడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ఇంతకు మునుపు నటరాజన్ కి హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటికి వచ్చినప్పుడు, శశికళ పెరోల్ పై వచ్చి భర్తని పరామర్శించి వెళ్లిన సంగతి తెలిసిందే.
ALSO ON TELUGUONE N E W S
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అలీకి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే పవన్ ప్రతి సినిమాలో అలీ ఉండాల్సిందే. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. గత కొద్దిరోజులుగా పవన్ కు అలీకి మధ్య మనస్పర్థలు వచ్చాయని... అందుకనే ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కూడా అలీ లేడని గుసగుసలు వినిపించాయి. ఆ తరువాత ఈ వార్తలపై స్పందించిన అలీ..తనకు పవన్ కల్యాణ్ కు ఎలాంటి మనస్పర్థలు రాలేదని, బిజీ షెడ్యల్ కారణంగానే తాను ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటించలేకపోయాని ఎన్నోసార్లు వివరణ ఇచ్చారు. కానీ వార్తలు మాత్రం ఆగలేదు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రశ్న అలీని అడుగగా... చిర్రెత్తుకొచ్చిన అలీ...  ’పవన్ కల్యాణ్  హీరో కాకముందు నుంచే మా ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆయన తొలి సినిమాలో నేను చేయలేదు.  అలాగే ‘అజ్ఞాతవాసి’లోనూ చేయలేదు. మిగిలిన అన్నీ సినిమాల్లో నేను ఉన్నప్పటికీ మా ఇద్దరి మధ్య గొడవైందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవునండీ నిజమే మా ఇద్దరికీ గొడవైంది .. అదీ ‘ఇవాంకా ట్రంప్’ వల్ల.‘  అంటూ నవ్వేశారు.  గుంటూరులో జరిగిన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి కూడా పవన్ కల్యాన్ నన్ను పిలిచారని, తాను కూడా వెళ్లానని.. ఎన్నిసార్లు చెప్పాలని అన్నారు.
ఎన్టీఆర్ సినిమాకి ప‌క్క‌లో బ‌ల్లెంలా త‌యార‌య్యాడు అనిరుధ్‌. ఈ సినిమా క్రేజ్ అనిరుధ్ వ‌ల్ల స‌ర్వ‌నాశ‌నం అయ్యేలా క‌నిపిస్తోందిప్పుడు. దానికి బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంది. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా క‌థ గురించి, క‌థ‌లోకి కీల‌క‌మైన విష‌యాల గురించి బ‌య‌ట చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా వార్త‌లొస్తున్నాయి. వీటి వెనుక అనిరుధ్ హ‌స్తం ఉంద‌ని టాక్‌.  ఎన్టీఆర్ సినిమాకీ అనిరుధ్‌కీ లింకేమిటి?  అనుకుంటున్నారా?   అక్క‌డికే వ‌స్తున్నాం.. ఈ సినిమాకి సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశం ముందు అనిరుధ్ ద‌గ్గ‌ర‌కే వెళ్లింది. ఆ త‌ర‌వాత ఏమైందో ఏంటో.. త్రివిక్ర‌మ్ అనిరుధ్‌ని ప‌క్క‌న పెట్టి దేవిశ్రీ ప్రసాద్‌ని తీసుకున్నాడు. త‌న‌ని స‌డ‌న్‌గా ప‌క్క‌న పెట్ట‌డం అనిరుధ్‌కి న‌చ్చ‌డం లేదు. అందుకే ఎన్టీఆర్ సినిమా క‌థ‌ని అడిగిన వాళ్ల‌కీ, అడ‌గ‌నివాళ్ల‌కీ చెప్పేస్తున్నాడ‌ట‌. అలా.. ఈ సినిమా విశేషాలు బ‌య‌ట‌కు లీకైపోతున్నాయ‌ని తెలుస్తోంది. ఈ విష‌యం తెలుసుకున్న ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ అనిరుధ్‌ని పిలిచి మ‌రీ గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చిన‌ట్టు ఫిల్మ్‌న‌గర్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సినిమా అవ‌కాశం చేజారినంత మాత్రాన‌.. ఇలా ర‌హ‌స్యాల‌న్నీ బ‌య‌ట‌పెట్టేస్తారా??  ఈ విష‌యంలో ఎన్టీఆర్‌కి అనిరుధ్ మోస‌మే చేస్తున్నాడు మ‌రి.
  జ‌బ‌ర్‌ద‌స్త్ జంట‌... ర‌ష్మీ.. సుధీర్‌ల‌కు ఘ‌నంగా పెళ్లి జ‌రిగిపోయింది. అదీ.. జ‌బ‌ర్ ద‌స్త్ టీమ్ మ‌ధ్యే. నాగ‌బాబు, రోజా ఈ పెళ్లికి పెద్ద‌లు. జ‌బ‌ర్‌ద‌స్త్‌లో ఎంత గోల చేస్తారో, ఈ పెళ్లి వేడుక‌లోనూ ఈ జంట అంతే గోల చేశారు. అంతే కాదు.. ఇద్ద‌రూ డ్యూయెట్లు పాడి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ఇంత స‌డ‌న్‌గా వీళ్లిద్ద‌రి పెళ్లి ఎప్పుడు జ‌రిగిపోయింది, ఎలా జ‌రిగిపోయింది అనుకుంటున్నారా?  ఇదీ... ఓ టీవీ షోలో భాగ‌మే.  జ‌బ‌ర్ ద‌స్త్ ఎప్పుడు మొద‌లైందో అప్పటి నుంచీ.. ర‌ష్మీ, సుధీర్‌ల‌పై ర‌క‌ర‌కాల పుకార్లు. ఇద్ద‌రూ ల‌వ్‌లో ఉన్నార‌ని, పెళ్లి చేసుకోబోతున్నార‌ని ర‌క‌ర‌కాల కామెంట్లు. సుధీర్ కూడా.. ర‌ష్మీపై ఇలాంటి ప్రాక్టిక‌ల్ జోక్సే వేస్తుంటాడు. దాంతో నిజంగానే వీళ్లిద్ద‌రి మ‌ధ్యా ఏదో ఉందేమో అన్న అనుమానాలు రేకెత్తాయి. దానికి త‌గ్గ‌ట్టుగా... ఓ టీవీ ఛాన‌ల్ వీరిద్ద‌రికీ ఉత్తుత్తి పెళ్లి చేసి ఆ అనుమానాలకు మ‌రింత ప్రాణం పోసింది. ఏమాట‌కామాట చెప్పుకోవాలంటే పెళ్లి దుస్తుల్లో ర‌ష్మీ, సుధీర్ అదిరిపోయారు. నిజం పెళ్లిలా.. వాళ్లిచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ చూస్తుంటే.. మ‌న‌సులోనూ అలాంటి ఆలోచ‌న‌లు ఏమైనా ఉన్నాయేమో అనిపిస్తోంది.  ఓ టీవీ షో యాంక‌ర్ల‌కు ఇలా.. సెట్లో ఉత్తుత్తి పెళ్లి చేయ‌డం బ‌హుశా... ఇదే తొలిసారేమో. ఇది ఉత్తుత్తి పెళ్లేనా.. లేదంటే పెళ్లికి రిహార్స‌ల్స్ ఏమైనా చేసుకున్నారా? అంటూ నెటిజ‌న్లు కౌంట‌ర్లు కూడా వేసుకుంటున్నారు.
అవును.. రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో చిరంజీవి మాట‌లు మెగా అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రంగ‌స్థ‌లం వేడుక‌లో చిరు చేసిన కామెంట్స్ ఆ సినిమాపై ఉన్న న‌మ్మ‌కాన్ని, అంచ‌నాల్ని కాస్త కింద‌కు దించే ప్ర‌య‌త్నం చేశాయ‌న్న‌ది ఇప్పుడు బ‌లంగా వినిపిస్తున్న‌మాట‌. `ఈ సినిమాకు అవార్డులు రావ‌డం ఖాయం.. జాతీయ అవార్డు కూడా వ‌స్తుంది. రాక‌పోతే ఈ సినిమాకి అన్యాయం జ‌రిగిన‌ట్టు` అంటూ చిరంజీవి ఆవేశ ప‌డ్డాడు.  జ‌నం చ‌ప్ప‌ట్లు కొట్టారు, వేదిక‌మీద ఉన్న‌వాళ్లంతా పుల‌కించిపోయారు. కాక‌పోతే.. అవార్డు సినిమా అంటే బాక్సాఫీసు ద‌గ్గ‌ర కాసుల వ‌సూళ్లు కుర‌వ‌వు అనే ఓ న‌మ్మ‌కం బ‌లంగా ఉంది. పైగా జాతీయ అవార్డులు సాధించుకున్న సినిమాల‌న్నీ.. దాదాపుగా ఆర్ట్ చిత్రాలే. అంటే... రంగ స్థ‌లం కూడా ఆ బాప‌తు సినిమా అని చిరంజీవి ప‌రోక్షంగా చెప్పిన‌ట్టే క‌దా?  అంత‌టితో ఆగ‌లేదు.. క్లైమాక్స్ చూసి ఏడ్చేశాన‌ని, తాను కంట్రోల్‌లో ఉన్నా భార్య సురేఖ మాత్రం చ‌ర‌ణ్‌ని ప‌ట్టుకుని గుక్క‌ప‌ట్టి మ‌రీ ఏడ్చింద‌ని చెప్పుకొచ్చాడు చిరు. చ‌ర‌ణ్ లోని న‌ట‌న చూసి చిరు అలా పుల‌కించి ఉండొచ్చు. కాక‌పోతే.. హెవీ క్లైమాక్స్‌లు థియేట‌ర్లో చూడ‌డం క‌ష్టం. `ఇదో ఏడుపుగొట్టు సినిమా` అనే ముద్ర వేస్తే.. జ‌నాలు థియేట‌ర్ల‌కు వెళ్ల‌డానికి భ‌య‌ప‌డ‌తారు. అంతేకాదు.. హెవీ క్లైమాక్స్ సినిమాలు బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఆడిన దాఖ‌లాలు చాలా త‌క్కువ‌. ఇలా.. చిరు కామెంట్స్‌తో ఈ సినిమా ఎలా ఉండ‌బోతోందో అని కాస్త గంద‌ర‌గోళంలో ప‌డ్డారు అభిమానులు.  అటు డ‌బ్బులు, ఇటు అవార్డులూ వ‌స్తే ఫ‌ర్వాలేదు. చిరు చెప్పిన‌ట్టు ఈ సినిమా అవార్డుల‌కే ప‌రిమిత‌మైతే మాత్రం.. చ‌ర‌ణ్ అండ్ కో మెగా అభిమానుల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన‌ట్టే.
Mega Prince Varun Tej who is on success streak with back to back hits is teaming up with critically acclaimed director Sagar Chandra of Appatlo Okadundevadu fame. Ram Achanta & Gopi Achanta will bankroll this project on 14 Reels Plus as their maiden production.On this auspicious occasion marking the beginning of Telugu New Year Ugadi, makers hereby announce their production #1.More details will be officially announced very soon.
  ఎవ్వరూ ఉహించని విధంగా గుంటూరు జనసేన ఆవిర్భావ సభలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ టీడీపీ పై విమర్శలు గుప్పించి ఏపీ రాజకీయ పరిణామాలనే మార్చేశారు. అసలు పవన్ కళ్యాణ్ టీడీపీ పై యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటి.. ఇన్ని రోజులు టీడీపీని విమర్సించని పవన్ కళ్యాణ్ టీడీపీపై ఈ రేంజ్ లో విమర్శలు గుప్పించడానికి కారణం ఏంటీ అని.. ఆలోచనపడ్డారు. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేశ్ పై అవినీతి ఆరోపణలు గుప్పించారు.. ఇసుక నుంచి  మట్టి వరకు  నేల తల్లిని అమ్ముకుంటున్నారు..  ఇదంతా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నా మీద్రుష్టికి రాలేదా? ఒకవేల వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. లేకపోతే మీకు తెలిసే అన్నీ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. అలాగే తమిళనాడుకు చెందిన టీటీడీ మాజీ బోర్డ్ మెంబర్ శేఖర్ రెడ్డికి లోకేష్ కు సబంధాలున్నాయని దీనికి మీరు ఏం సమాధానం చెబుతారంటూ నిలదీశారు పవన్.   దీంతో అసలు పవన్ స్ట్రాటజీ ఏంటని అనుకుంటున్నారు. ఇక పవన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎదురుదాడికి దిగింది. పవన్ వెనుక బీజేపీ ఉందని కొంతమంది వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పై తాను అవినీతి ఆరోపణలు చేయడానికి కారణం ఏంటో పవన్ చెప్పాడు. ఓ న్యూస్ ఆఫీస్ కు వెళ్లిన పవన్ ను ఒక ముఖ్యమంత్రి కొడుకుపై మీ లాంటి సెలబ్రిటీ అటువంటి ఆరోపణలు చేశారు.. మీ దగ్గరేమన్నా.. ఆధారాలున్నాయా అని అడుగగా.. దీనికి పవన్ సమాధానం చెప్తూ.. లోకేష్ పై ఉన్న ఆరోపణలు అందరి దృష్టిలో ఉన్నవేనని.. వాటినే నేను మళ్లీ గుర్తు చేశానని అన్నారు. అందరి దృష్టిలో ఉండి నీ దృష్టికి రాలేదా అని అందరూ అడుగుతారనే తాను ఖచ్చితంగా మాట్లాడాల్సి వచ్చిందంటూ వివరణ ఇచ్చారు. మరి శేఖర్ రెడ్డితో తనకు పరిచయాలు ఉన్నాయని అంటున్నారు అది ఎంత వరకూ నిజమో చెప్పాలి అని అన్నారు...దానికి లోకేశ్..  శేఖర్ రెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కదా అని అడుగగా.. అంటే.. ఇలాంటివి కూడా ఉన్నాయి ఒకసారి చూసుకోండి అంటూ చెప్పాను అంతే అంటూ చాలా తేలిగ్గా తేల్చారు.
  రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో అన్న దానికి పవన్ కళ్యాణ్ స్పీచే ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. నిన్నటి వరకూ టీడీపీ పై ఎలాంటి విమర్సలు గుప్పించని పవన్.. ఎవరూ ఊహించని విధంగా టీడీపీ ని టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురిచేశాయి. ఎప్పుడు సభలు పెట్టినా.. వైసీపీ పార్టీ పై లేదా బీజేపీ పై సెటైర్లు, విమర్శలు చేసే పవన్ ఈసారి మాత్రం టీడీపీ పైనే విమర్శలు గుప్పించారు. కేంద్రంపై, వైసీపీపై ఏదో రెండు మూడు విమర్శలు చేసినా.. టార్గెట్ మొత్తం టీడీపీపైనే చేశారు. ముఖ్యంగా టీడీపీపై అవినీతి ఆరోపణలు గుప్పించారు.   అయితే ఇక్కడే ఓ ఆసక్తిర విషయం ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. ఏపీలో ప్రతిపక్ష పార్టీగా జనసేనను తీర్చిదిద్దాలని పవన్ ఆలోచన చేస్తున్నట్టుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రతిపక్షపార్టీగా ఉంది. అయితే ఆ విషయం జనాలు ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకంటే... వైసీపీ ప్రతిపక్షపార్టీ అన్న పేరే కానీ ప్రజా సమస్యలపై అధికార పార్టీతో పోరాడింది లేదు. ఇక పాదయాత్ర కోసం ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం మానేశారు. పోనీ తాను రాకపోయినా.. పార్టీ నేతలను అయినా పంపిస్తారంటే అదీ లేదు... తాను వెళ్లకపోతే.. ఎవ్వరూ వెళ్లడానికి వీల్లేదు అని కండీషన్స్ పెడుతుంటాడు. సరే ప్రజలు ఏదైనా సమస్యలు చెప్పినా.. దానిని పరిష్కరించకుండా.. నేను సీఎం అయిన తరువాత చేస్తా.. అప్పుడు చూస్తా అని కబుర్లు చెబుతుంటాడు. దీంతో వైసీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైపోయింది. ఇక సీబీఐ కేసుల భయంతో పూర్తిగా ఢిల్లీకి లొంగిపోయింది. పొత్తో.. విలీనమో.. ఖరారు చేసుకోవడానికి ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష స్థానానికి పూర్తి స్థాయి ఖాళీ ఏర్పడింది.   ఇక దీన్నే పవన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు పవన్ కల్యాణ్… తెలుగుదేశం పార్టీకి అనేక విషయాన్ని మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ కల్యాణ్ లేవనెత్తే అంశాపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ… పరిష్కరించే ప్రయత్నం చేశారు. అందుకే పవన్ కల్యాణ్ టీడీపీ పార్టనర్ అంటూ… విమర్శలు ప్రారంభించారు. దీనిని తిప్పికొట్టడంతో పాటు.. ఇక నుంచి తామే ప్రతిపక్షం అన్నట్లుగా ఉండేలా.. పవన్ కల్యాణ్ .. టీడీపీకి పూర్తి స్థాయిలో తన విధానాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అలా వెళితేనే రాజకీయంగా ముందుంటామని నిర్ణయించుకున్నట్టుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే కనుక నిజమైతే.. జగన్ సీఎం అవ్వడం ఏమో కానీ.... ప్రతిపక్ష నేతగా ఉండటం కష్టమవుతుంది. మరి ఇన్ని రోజులు టీడీపీకి సపోర్ట్ గా ఉన్న పవన్ ఇప్పుడు ఇలా రివర్స్ పంచ్ ఇవ్వడానికి అసలు రీజన్ ఏంటో పవన్ కే తెలియాలి. ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
  తెలంగాణ అసెంబ్లీలో సోమవారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసింది నిజంగా ఘోరం, నేరం! తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు సదరు ఎమ్మెల్యేలందర్నీ సస్పెండ్ చేసేసి, అవసరమైతే డిస్మిస్ కూడా చేసేయాల్సినంత దారుణం. లేకపోతే ఏమిటండీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికైనవారు అసెంబ్లీలో కళ్ళకి, చెవులకి పని చెప్పి సైలెంట్‌గా కూర్చోవాలి. అధికార పార్టీ ఎలా పరిపాలించినా కిక్కురుమనకుండా పడి వుండాలి. అంతే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేయడమేంటసలు? పైగా బంగారు తెలంగాణను సాధించడానికి నిరంతరం శ్రమపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన తెలియజేయడమేంటి? తప్పుకదా? అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి తగిన శాస్తి చేయడానికి ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తోందట.   అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి బొత్తిగా లోకజ్ఞానం లేనట్టుంది. వాళ్ళ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు కేసీఆర్ పాలన భలే నచ్చేసి ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరిపోయి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. మిగిలిన కొద్దిమంది కూడా టీఆర్ఎస్ జీవన స్రవంతిలో కలసిపోయి ధన్యులైపోవాలి. అలా కాకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే వుంది ఆందోళనలు చేయడం ఏమైనా పద్ధతిగా వుందా? పైగా గవర్నర్ మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ సభ్యులు గోలగోల చేయడం ఎంతమాత్రం బాగాలేదని టీఆర్ఎస్ నాయకులు ఎంత బాధపడిపోతున్నారో చూడండి. ఏంటీ? తెలంగాణ ఉద్యమం సమయంలో అసెంబ్లీలో టీఆర్ఎస్ నాయకులు చేసిన గోలతో పోల్చుకుంటే ఈ గోల ఏపాటిదని అంటున్నారా? అప్పుడు ఇదే గవర్నర్ నరసింహన్ మీద టీఆర్ఎస్ సభ్యులు కాగితాలు చించి విసిరారని, మైకు లాగారని, ఎమ్మెల్యే జె.పి. మీద డ్రైవర్ చేత దాడి చేయించారని గుర్తు చేసుకోండని అంటున్నారా? అసలు మీ వాదనలో అర్థం వుందా? అప్పుడంటే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏది చేసినా కరెక్ట్... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మాత్రం అది తప్పున్నర తప్పు. అలాంటి తప్పు చేశారు కాబట్టి కాంగ్రెస్ సభ్యులకు తగిన శిక్ష పడాల్సిందే.   అది సరేగానీ, తెలంగాణ విధాన మండలిని ప్రజాస్వామ్యబద్ధంగా నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్న శాసన మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెడ్ ఫోన్ విసిరారు. అది డైరెక్టుగా వెళ్ళి ఛైర్మన్ గారి కంటిమీద తగిలింది. ఆ దెబ్బ చాలా బాధ కలిగిస్తున్నప్పటికీ ఆయన బాధ్యతాయుతమైన పదవిలో వున్నారు కాబట్టి ఆ బాధని చాలాసేపు భరించారు. గవర్నర్ గారి ప్రసంగం పూర్తయ్యే వరకూ ఆయన ఆ బాధని భరిస్తూనే వున్నారు. ఆయన ఓర్పుకి జోహార్. ఆ తర్వాత ఆయన సీఎం గారి సలహా మేరకు కంటి డాక్టర్ దగ్గరకి వెళ్ళారు. కంటి డాక్టర్లు ఆయన కంటికి డాక్టర్ గారు పెద్ద కట్టు కట్టారు. గౌరవనీయులైన స్వామి గౌడ్ గారి కంటికి వున్న ఆ కట్టును చూసి తెలంగాణలో ప్రజలు కన్నీరు పెట్టుకుంటున్నారు. స్వామి గౌడ్ గారి కంటికి ఏమీ కాదని డాక్టర్లు భరోసా ఇచ్చారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ పెద్ద దెబ్బ తగిలి ఒక కన్ను పోతే పరిస్థితి ఎంత దారుణంగా వుండేదో! ఒక కంటితో ఆయన సమావేశం హాలు మొత్తాన్నీ ఒకేసారి చూడలేక చాలా ఇబ్బంది పడేవారు. అలా జరగనందుకు దేవుడికి ధన్యవాదాలు. ఏది ఏమైనప్పటికీ బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తూ రయ్యిమని దూసుకుని వెళ్తున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తగిన విధంగా శిక్షించాల్సిందే.
  వైసీపీ పార్టీ పరిస్థితి ఏపీలో ఏంటో అందరికీ తెలిసిందే. పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, జగన్ తీరు నచ్చక పార్టీ నుండి కీలక నేతల సైతం జంప్ అవ్వడం ఇవన్నీ పార్టీ స్థాయిని ఎప్పుడో పడేశాయి. ఇక జగన్ పాదయాత్ర గురించి తమ ఛానెల్ కు తప్ప మరో ఛానెల్ కు గుర్తుండదు. అలాంటిది జగన్ గురించి జాతీయా మీడియాలో రావడం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. దీనికి కారణం.. బీజేపీతో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకోవడమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఎలాంటి సంబంధం లేకపోయినా... బీజేపీ మౌత్ పీస్ గా పేరున్న రిపబ్లిక్ టీవి.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి అందరికీ షాకిచ్చింది. అప్పుడే బీజేపీ-వైసీపీ పొత్తు పెట్టుకుంటాయేమో అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే చెబుతూ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని చెప్పకనే చెబుతున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.   ఒకపక్క ఏపీ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. టీడీపీ నేతలందరూ పార్లమెంట్లో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. రాజీనామాలు చేస్తున్నారు. ఏపీలో కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా గురించే మాట్లాడుకుంటున్నారు. అలాంటిది... దాని గురించి వార్తలు రాయడం మానేసి.. సమయం సందర్బం లేకుండా... జగన్ కు వకాల్తా పుచ్చుకొని కొన్నిజాతీయ మీడియా సంస్థలు జగన్ గెలుస్తాడు అని వార్తలు రాయడం పిచ్చికి పరాకాష్ట అని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే...వైకాపా అధికారంలోకి రాకపోయినా...టిడిపి దగ్గరకు చేరుతుందని...టైమ్స్‌ఆఫ్‌ఇండియా కథనంలో పేర్కొంది. టిడిపికి...వైకాపాకు కేవలం రెండుశాతం మాత్రమే ఓట్లు తేడా ఉందని..రాబోయే రోజుల్లో లోటును అధిగమించి..అధికారం వైపు వైకాపా దూసుకుపోతుందని..'జగన్‌' చేస్తోన్న పాదయాత్ర, రాష్ట్రానికి ప్రత్యేకహోదా..వంటి అంశాలు..ప్రజల్లోకి బాగా వెళ్లాయని...దీంతో...'జగన్‌' గెలుస్తారని రాసుకొచ్చారు. మొత్తానికి ఈ రకంగా బీజేపీ-వైసీపీ పొత్తు ఖాయమని తెలుస్తుంది. లేకపోతే.. ఇక్కడ తెలుగు రాష్ట్రాలే పట్టించుకోవడం లేదుకానీ.. దేశంలో వార్తలు ఏం లేనట్టు జాతీయ మీడియా జగన్ కు గురించి ఇలాంటి రాతలు రాయడం నిజంగా నవ్వుకోవాల్సిన విషయం. బీజేపీ హ్యాండ్ లేకపోతే ఇలాంటి వార్తలు రావడం.. అందులో జాతీయ మీడియా సంస్థల్లో రావడం అంటే కష్టం. మరి ఇప్పటికే 'బిజెపి'తో 'జగన్‌' కుమ్మక్కయ్యారని ప్రజలు భావిస్తున్నారు.. ఈ వార్తలు చూసి వైసీపీ-బీజేపీ పొత్తు పై క్లారిటీ వచ్చినట్టే అంటున్నారు. మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోసం చేసిన బీజేపీతో వైసీపీ కలిస్తే ఏముంటుంది.. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్న సామెత లాగ ఉంటుంది..
   తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు శుక్రవారం మీడియా సమావేశంలో వ్యక్తం చేసిన ఆవేదన చూసిన వాళ్ళకి చాలా బాధ కలగడం ఖాయం. ఇంతకూ అయన ఆవేదనకి కారణం ఏమిటంటే, హరీష్ రావు తెరాస పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారని, ఒక ప్రముఖ పార్టీలో అయన జాయిన్ అవడానికి రంగం సిద్ధం అయిందని సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. అలాగే సీఎం కెసిఆర్ తన కుమారుడు కేటీఆర్ కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించి తాను జాతీయ రాజకీయాలకి వెళ్తారని, అందువల్ల హరీష్ రావు హర్ట్ అయి తెరాస పార్టీని విడిచి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.   ఇలాంటి వార్తలు తనని ఎంతో బాధకి గురి చేస్తున్నాయని హరీష్ రావు వాపోయారు. తాను కెసిఆర్ ఆజ్ఞని పాటించే వ్యక్తిని అని అంటున్నారు. తనమీద జరుగుతున్న ఈ ప్రచారాన్ని భరించలేక పోతున్నా అని అయన అన్నారు. తన మీద ఇలాంటి ప్రచారం చేస్తున్న వారి మీద పోలీస్ ఉన్నతాధికారులకు ఆల్రెడీ ఫిర్యాదు చేసానని అన్నారు. తాను తన కంఠంలో ప్రాణం వున్నంత వరకు తెరాసలోనే ఉంటానని, ప్రాణం పోయినా పార్టీ  మారను అని చెప్పారు.   అయినా హరీష్ ఇంతలా ఎందుకు హర్ట్ అవుతున్నారో అర్థం కాని విషయం. ప్రాణం పోయినా పార్టీ మారను అని పెద్ద పెద్ద మాటలు ఎందుకో. రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది మామూలు విషయం. అదేదో నేరం, ఘోరం కాదు. ఇప్పుడు తెరాసలో వున్న వాళ్లు పార్టీలు మారిన వాళ్లే కదా. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితోనే తెరాస విజయవంతంగా నడుస్తోంది కదా. ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి రావడం మంచి విషయం... మీ పార్టీ నుంచి వెళ్ళిపోవడం మాత్రం చెడ్డ విషయం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  సోషల్ మీడియాలో వచ్చే వాటి గురించి ఇంత ఫీల్ ఎందుకు అవుతున్నారు, దీని వెనుక వేరే కారణాలు ఏవైనా వున్నాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
  చెయ్యెత్తి జై కొట్టిన తెలుగుబిడ్డలు ఇప్పుడు తిరగబడ్డారు. ఇద్దరూ కూడబలుక్కుని కాకపోయినా, ఒకేసారి ఢిల్లీ ఆధిపత్యం మీద తిరబడటం యాదృచ్ఛికం. మొన్నటి వరకూ ఢిల్లీ ఆధిపత్యానికి సాహో అన్న ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఇప్పుడు ఎవరి దారిలో వారు తెలుగు పౌరుషాన్ని చూపిస్తున్నారు. ఢిల్లీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఎవరి దారిలో వారు తిరుగుబాటలో నడుస్తున్నారు. మార్గాలు వేరైనా గమ్యం ఒకటే అన్నట్టు ఇద్దరూ తమ తమ రాష్ట్రాల హక్కుల సాధన కోసం  నిరసన గళం వినిపిస్తున్నారు.   నాలుగేళ్ళుగా ఢిల్లీ ప్రభువు నరేంద్ర మోడీ ఆధిపత్యం ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అణిగి మణిగి వుండక తప్పలేదు. చేతికి చిప్ప ఇచ్చి తరిమేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా గట్టె్క్కించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఇంతకాలం అనేక అంశాల మీద మౌనం వహించారు. ఢిల్లీ బీజేపీ పెద్దల అవమానాలను భరించారు. లోకల్ బీజేపీ నాయకుల తోక ఊపుడును సహించారు. సహనం ఎక్కువైపోతే మిగిలేది దహనమే అన్నట్టుగా ఆయన సహనం పరిధులు దాటిపోయి ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇద్దరు టీడీపీ కేంద్రమంత్రుల రాజీనామాల రూపంలో నిరసన వ్యక్తమైంది. పూర్తిగా తెగేదాకా లాగడం ఎందుకన్నట్టుగా కేంద్ర మంత్రుల పదవులకు రాజీనామాలు చేసినప్పటికీ టీడీపీ ఎన్డీఏలో కొనసాగుతోంది.   ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన తొలినాళ్ళలో ప్రధాని మోడీ మీద బోలెడన్ని సెటైర్లు వేశారు. ఆ తర్వాత మోడీ హవాని అర్థం చేసుకున్న ఆయన మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఎంతగా పొగిడినా కేంద్రం దగ్గర తెలంగాణ పప్పులు ఉడకకపోవడంతో మళ్ళీ రివర్స్ గేరు వేశారు. రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం ఏంటంట అని ధిక్కరించారు. మోడీని ’గాడు‘ అనే సాహసం కూడా చేశారు. అయితే ఆ తర్వాత నేనలా అనలేదని చెప్పేశారు. రాష్ట్రాల గౌరవం నిలబడాలంటే మూడో ఫ్రంట్ మొదటెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన రిజర్వేషన్ల పెంపుదలను కేంద్రం ఒప్పుకోకపోవడంతో పోరాటం తీవ్రంచేశారు. త్వరలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంమీద ఇద్దరు తెలుగుబిడ్డలూ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటంలో విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి.
కొన్ని దేశాలలో ద్రాక్ష తోటల్లో పర్యటకులని అనుమతిస్తుంటారు. ఆ తోటల్లో తిరుగుతూ, ద్రాక్షపళ్లతో ఆడుకుంటూ, ద్రాక్ష సారాయిని తయారుచేస్తూ పర్యటకులు సంబరపడిపోతుంటారు. వీళ్ల సరదా ద్రాక్షతోటల యజమానులకి కాసులను కురిపిస్తుంటుంది. మన రైతులకి కూడా ఇలాంటి అవకాశం ఉంటే బాగుంటుంది కదా! అందుకోసం మన దగ్గర ద్రాక్షతోటలు లేకపోతే ఏం... పళ్లకు రారాజైన మామిడి తోటలు ఉన్నాయి కదా!   మేంగో టూరిజం (mango tourism) ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రచారం పొందుతోంది. మహారాష్ట్రలోని రైతులు ఇప్పటికే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగా... ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఈ ఏడాది విస్తృతంగా మేంగో టూరిజంని అందిపుచ్చుకునే ఆశతో ఉన్నాయి. ఇంతకీ ఈ మేంగో టూరిజంలో ఏం చేస్తారంటారా! అబ్బో చెప్పుకోవాలంటే బోలెడు విశేషాలే ఉన్నాయి!   - మేంగో టూరిజంలో భాగంగా, విశాలమైన మామిడి తోటలలోకి పర్యటకులను అనుమతిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వమే కొందరు మామిడి రైతులో ఒప్పందం చేసుకొని, వారి తోటల దగ్గరకు యాత్రికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది.   - మామిడి తోటల్లోకి ప్రవేశించిన పర్యటకులను రైతులు తమ తోటలన్నీ తిప్పి చూపిస్తారు. మామిడి చెట్లను పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, పూత కాయగా మారేవరకు ఎంత శ్రద్ధగా చూసుకుంటారు, కాయలను ఎలా మగ్గపెడతారు... లాంటి వివరాలన్నింటినీ ఓపికగా చెబుతారు.   - పర్యటకులకు కావల్సిన అల్పాహారం, టీ కాఫీలు, భోజనం... అన్నీ కూడా రైతులే ఏర్పాటు చేస్తారు. వాటివల్ల అటు రైతులకీ ఆదాయం కలుగుతుంది, ఇటు యాత్రికులకీ స్వచ్ఛమైన పల్లె ఆహారం తిన్నట్లుంటుంది.   - మామిడి తోటల్లో తిరగడమే కాదు... మామిడి కాయలు కోసుకోవడానికి కూడా పర్యటకులకు స్వేచ్ఛ ఉంటుంది. అందుకోసం ఎలాంటి మామిడిపళ్లను ఎంచుకోవాలో రైతులు సలహా కూడా ఇస్తారు. కాకపోతే ఇలా కోసుకున్న పండ్లని చివరికి తూకం వేసి, వాటికి సరిపడా ధరని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పర్యటకులకు తాజా పళ్లు, రైతులకి తగిన గిట్టుబాటు ధరా లభిస్తాయి.   - కేవలం పళ్లే కాదు! చాలా తోటల్లో మామిడితాండ్ర, జాం, జ్యూస్, పచ్చళ్లు.. ఇలా మామిడితో చేసిన పదార్థాలన్నీ కూడా దొరికే అవకాశం ఉంటుంది.   - తోటల్లో తినడం, తిరగడంతోనే కాలం గడిపేస్తే మజా ఏముంటుంది! అందుకే చాలాచోట్ల ఎడ్లబండి మీద ప్రయాణం, మామిడి పళ్లని తినే పోటీలు పెట్టడం, జానపద నృత్యాలు ప్రదర్శించడం లాంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇవేవీ ఇష్టం లేకపోతే హాయిగా నులకమంచం మీద చెట్టు కింద పడుకుని సేదతీరే అవకాశం ఎలాగూ ఉంటుంది.   - ఒక్క రోజులో హడావుడిగా గడిపేస్తే ఎలా అనుకునేవారికి... తోటల్లోనే ఒకటి రెండు రోజులు సేదతీరే సదుపాయాలూ కొన్ని చోట్ల ఉన్నాయి.   అదీ విషయం! మొత్తానికి ఏదో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ మేంగో టూరిజం ఇప్పుడు రైతులకీ, ప్రభుత్వానికీ కాసులు పండిస్తోంది. అటు కొత్తదనం కోరుకునే పర్యటకులకీ సరికొత్త అనుభూతిని అందిస్తోంది. అందుకనే ఈ తోటల్లో విహరించేందుకు విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తున్నారట. మరి మామిడి పంటకు ప్రసిద్ధమైన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి టూరిజం మొదలైతే భలే ఉంటుంది కదా! - నిర్జర.      
  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్....పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ ముగిసింది. ఈ సందర్బంగా మీడియా సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ...2019 ఎన్నికల కోసం థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్పించామని.. ప్రత్యేక ఫెడరల్ ప్రంట్ ఏర్పాటు అవశ్యకతపై చర్చించామని తెలిపారు.  రాజకీయ ప్రత్యామ్నయం అవసరం అన్న భావన ప్రజల్లో ఉంది...అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్తాం.. మా పంథా నూతనంగా ఉంటుంది...కలిసి వచ్చే పార్టీలతో సంప్రదింపులు జరుపుతామని అన్నారు.   మమతా బెనర్జీ మాట్లాడుతూ.. దేశాభివృద్ది, రైతు సమస్యలపై చర్చించాం..ఫెడరల్ ప్రంట్ పటిష్టంగా ఉండాలి.. ఇందుకోసం ఇతర పార్టీలతో కూడా మాట్లాడుతాం... దేశంలో ఒకే పార్టీ అధికారంలో ఉండకూడదని స్పష్టం చేశారు.
  కేంద్ర పభుత్వ తీరుపై పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో టీడీపీకి ఇప్పటికే పలు పార్టీలు మద్దతునిచ్చాయి. అయితే అవిశ్వాస తీర్మానం విషయంలో శివసేన మద్దతిస్తుందా.. ? లేదా..? అని.. బీజేపీ పై గుర్రుగా ఉంది కావున మద్దతిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు శివసేన ఆశ్చర్యపరిచే ప్రకటన చేశారు. ఈ రోజు ఆ పార్టీ ఎంపీ అరవింద్ సావంత్ ‘‘మేం ప్రభుత్వానికి మద్దతు పలకడం లేదు. అలాగని విపక్షానికీ మద్దతు ఇవ్వడం లేదు. మేం దూరంగా ఉంటాం’’ అంటూ ఆయన ప్రకటన చేశారు. కాగా ఇటీవలే బీజేపీ మిత్రపక్షం నుండి శివసేన బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
  లాలూ ప్రసాద్ యాదవ్ కి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఈయన దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కాంకు సంబంధించిన నాలుగో కేసులో కూడా లాలూను దోషిగా నిర్ధారిస్తూ రాంచీలోని సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది. 1995 డిసెంబర్ నుంచి 1996 జనవరి మధ్య దుంబా ట్రెజరీ నుంచి రూ. 3.13 కోట్లను అక్రమంగా విత్ డ్రా చేసినట్టు రుజువైందని కోర్టు తెలిపింది. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు ఊరట లభించింది. ఆయనతో పాటు మరో 14 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది.
    టైమ్ లేదనో బద్దకించో బ్రేక్ ఫాస్ట్‌ని మిస్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్‌ని మిస్ చేసుకోకూడదట. నిపుణులు అలా ఎందుకు చెబుతున్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=VxL3LfFOUWM  
కొన్ని ఆచారాలను చెక్కుచెదరకుండా శతాబ్దాల తరబడి పాటిస్తూ ఉంటాము. మరికొన్ని ఆచారాలు మాత్రం కాలానుగుణంగా మరుగున పడిపోతుంటాయి. అశోక వృక్షపు ప్రాధాన్యత తగ్గిపోవడం వాటిలో ఒకటి. ఒకప్పుడు వసంత రుతువు వచ్చిందంటే చాలు... హోళీ పండుగ సందర్భంగా, ఉగాది సమయంలోనూ అశోక వృక్షం లేనిదే పనిజరిగేది కాదు. మన్మధుని అయిదు బాణాలలో అశోక పూలు కూడా ఒకటని చెబుతారు. అలాగే ఉగాది పచ్చడిలో అశోక వృక్షపు చిగుళ్లు కూడా వేసుకోవాలని శాస్త్రంలో కనిపిస్తుంది.   అశోక వృక్షం భారత ఉపఖండంలోనే అవిర్భవించిందన్నది శాస్త్రవేత్తల మాట. అందుకే దీనిని Saraca Indica అనే శాస్త్రీయ నామంతో పిల్చుకుంటారు. భారతదేశానికి చెందిన SARACA జాతి వృక్షమని దీని అర్థం. ఇందుకు అనుగుణంగానే మన దేశ చరిత్రలో, పురాణాలలో అశోక వృక్షం పెనవేసుకుపోయి కనిపిస్తుంది. బుద్ధుడు జన్మించినది, హనుమంతుడు సీతమ్మ జాడ కనుగొన్నదీ అశోక వృక్షం దిగువునే అని చెబుతారు.     అశోక వృక్షం ఏడాది పొడవునా పచ్చగా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలను ఔషధంగా పనిచేస్తుంది. అందుకనే దానికి అశోకము అన్న పేరు వచ్చి ఉండవచ్చు. గత ఏడాది బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కు చెందిన పరిశోధకులు అశోక వృక్షంలో క్యాన్సర్ను నివారించే రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. కానీ ఇలాంటి ఆధునిక పరిశోధనలు జరగక పూర్వమే... మన పెద్దలు అశోక వృక్షంలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసుకొన్నారు. వాటిలో కొన్ని... *  అశోక వృక్షం స్త్రీలకు గొప్ప వరం. స్త్రీలలో రుతుక్రమం, గర్భధారణకి సంబంధించి అనేక సమస్యలకి అశోక బెరడు, పువ్వులతో చేసిన మందులని సూచిస్తుంటారు. అధిక రక్తస్రావం, సంతానం కలగకపోవడం, రుతుస్రావం సమయంలో కడుపులో నొప్పి, రుతుస్రావం తరువాత కండరాల నొప్పులు... వంటి అనేక సమస్యలకు అశోక వృక్షం అధిక ఫలితాన్నిస్తుందట. గర్భవతులు ఈ మందుల జోలికి పోతే మాత్రం గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది.. * అశోకపూలని కాస్త నీటితో కలిపి రుబ్బి.... ఓ పావు గ్లాసుని తీసుకుంటే విరేచనాలు తగ్గుముఖం పడుతాయని ప్రాచీన వైద్యం చెబుతోంది.   * అశోక వృక్షం నుంచి తయారుచేసిన లేపనాలతో చర్మరోగాలు తగ్గిపోతాయనీ, చర్మం మృదువుగా మారుతుందనీ అంటారు. అశోక వృక్షపు బెరడుతో చేసిన కషాయంతో రక్తం శుద్ధి అవుతుంది కాబట్టి... ఎలాంటి మొటిమలూ, మచ్చలూ లేకుండా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. * అశోకవృక్షపు గింజలని పొడి చేసుకుని తింటే.. కిడ్నీ, మూత్రాశయంలో ఉన్న రాళ్లు త్వరగా బయటకి వచ్చేస్తాయనీ... అవి మూత్రం ద్వారా వచ్చే సమయంలో నొప్పి కూడా తెలియదనీ చెబుతారు. * పైల్స్ నుంచి ఉపశమన్నా కలిగించే మందులు చాలా అరుదు. కానీ అశోక వృక్షపు పూలు, బెరడు నుంచి తీసిన కషాయంతో పైల్స్ నుంచి రక్తం స్రవించడం, నొప్పి తగ్గుతాయట. అంతర్గతంగా ఉండి బాధపెడుతున్న పైల్స్ కూడా అశోకంతో అదుపులోకి వస్తాయన్నది అనుభవజ్ఞుల నమ్మకం. * మధుమేహంతో బాధపడేవారు అశోక వృక్షపు పూలని ఎండపెట్టి పొడిచేసుకుని తింటే మంచిదని సూచిస్తున్నారు. * అశోక వృక్షపు బెరడుకి యాంటీఫంగల్, యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకని బెరడుతో చేసిన చూర్ణం లేదా కషాయం- క్షయ, కడుపులో నులిపురుగులు, మూత్రకోశ వ్యాధులు వంటి అనేక సమస్యలకి ఔషధంగా పనిచేస్తుంది. ఇన్ని ఔషధ గుణాలున్న అశోక చిగుళ్లని ఉగాది పచ్చడిలో వాడటంలో ఆశ్చర్యం లేదు కదా! అయితే రానురానూ ఈ పద్ధతిని మానుకోవడానికి ఒక కారణం కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో అశోక వృక్షం పేరుతో మనం చూస్తున్న చాలా చెట్లు నిజానికి అశోక చెట్లు కావు. వీటిని FALSE ASHOKA అని పిలుస్తారు. ఇవి అశోక వృక్షంలాగానే ఉంటాయి. కానీ సన్నగా, పొడుగ్గా, దట్టమైన ఆకులతో ఎదుగుతాయి. నిజమైన అశోకవృక్షం కాస్త విశాలంగా ఎర్రటిపూలతో కనిపిస్తే... FALSE ASHOKA ఆకుపచ్చని పూలతో ఉంటుంది. FALSE ASHOKA ఆకులు, పూలు విషప్రాయం కావచ్చు. వృక్షాల గురించి అంత అవగాహన లేని వ్యక్తులకు, అందునా... ఇప్పటి తరం వారికి ఏది నిజమైన అశోక చెట్టు, ఏది FALSE ASHOKA అని గుర్తించడం కష్టం కావచ్చు. ఇలాంటి సమస్యను నివారించేందుకే పెద్దలు క్రమేపీ ఉగాది పచ్చడి నుంచి అశోక చిగుళ్లని తొలగించి ఉంటారు. - నిర్జర.