స్థానిక ఖర్చు.. తడిసి మోపెడు

 

 

 

ఎన్నికల్లో డబ్బు కీలకంగా మారింది. అభ్యర్థుల జయాపజ యాలను శాసిస్తోంది. పేరు, పలుకుబడితోపా టు ప్రజాసేవ చేయాలన్న తపన ఉన్నా ఎన్నికల్లో గెలవడం కష్టంగా మారింది. మునిసిపల్, జిల్లా పరిషత్, సార్వత్రిక ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఎన్నికల వ్యయం భారీగా పెరిగింది. అభ్యర్థుల రోజువారీ ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాలంటే, డబ్బులిచ్చి పది మందిని వెంట తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఒక్కొక్కరికీ రూ.300 కూలితో పాటు బిర్యానీ ప్యాకెట్, మద్యం అందించాల్సి వస్తోంది. ఒక్కో అభ్యర్థి రోజుకు సగటున రూ.20 వేల ఖర్చు చేయాల్సి వస్తోందట.

 

ఇదే మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి అయితే రోజుకు రూ.40 వేల దాకా వ్యయం చేయాల్సి వస్తోంది. 2005 మునిసిపల్ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి ఖర్చు బాగా పెరిగినట్లు అభ్యర్థులే చెబుతున్నారు. అప్పట్లో కేవలం ఓట్లు కొనేం దుకు మాత్రమే లక్షల్లో వెచ్చించే అభ్యర్థులు నేడు నామినేషన్, ప్రచారం, పోలింగ్ ఖర్చులు కూడా భరించాల్సి వ స్తోంది.



పశ్చిమగోదావరి జిల్లాలో.. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు మునిసిపాలిటీల్లో ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన పార్టీల వార్డు అభ్యర్థులు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ వ్యయం చేసేందుకు సిద్ధమయ్యారు. అదే చైర్మన్ అభ్యర్థి అయితే రూ. 25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా.