Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రభాస్ 'బాహుబలి' రెమ్యూనరేషన్ 20 కోట్లు!
posted on: May 25, 2013 12:35PM

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ 'మిర్చి' బ్లాక్ బాస్టర్ తరువాత సడన్ గా టాలీవుడ్ టాప్ లీగ్ లోకి దూసుకువెళ్ళాడు. తెలుగు సినిమాలో ఎక్కువగా పారితోషకం తీసుకుంటున్న హీరోలలో పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ పేర్లు ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఈ హీరోలందరికి షాక్ ఇచ్చే రేంజ్ లో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో, భారీ స్థాయిలో రూపొందుతున్న 'బహుబలి' కోసం ప్రభాస్ కి భారీ పారితోషకం ఇచ్చారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని అంటున్నారు. దీంతో తెలుగులో అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించినట్టేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమాకు ప్రభాస్ ఈస్థాయి పారితోషకం తీసుకోవడం పెద్ద విశేషమేమీ కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా రెండు సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉందని, ఇంతే సమయంలో ప్రభాస్ కనీసం మూడు సినిమాలను పూర్తి చేసుకొనే అవకాశాన్ని మిస్ అయినట్టేనని వీరి వాదన!






