జానారెడ్డి కథలో తెలంగాణావాదే

posted on: Aug 6, 2012 5:09PM

jana reddy congress, jana reddy telangana, telangana jana reddy, congress telangana issueకొందరు రచయితలు అప్పటికప్పుడు కథలను అల్లేస్తుంటారు. ఇది చేయితిరిగిన రచయిత చేసే పని. అలానే మంత్రులు, రాజకీయ నేతలు తమ ప్రసంగాల్లో పిట్టకథలు, పిల్లల కథలు, నేతల కథలు చేర్చి చెబుతుంటారు. అప్పటికప్పుడు అల్లే ఈ కథల్లో నీతి ఎప్పుడు రాజకీయ నాయకులు చెప్పే అంశం ఆధారంగానే ఉంటుంది. ఇలానే కథలు చెప్పటంలో అంతో ఇంతో అనుభవం గడిరచిన రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖామంత్రి జానారెడ్డి తాను తెలంగాణావాదినని చెప్పుకునేందుకు ఓ కథ అల్లేశారు. ఆ సమావేశం కూడా అచ్చ తెలంగాణావాదుల సమావేశం కావటంతో ఆయన కథ బాగా పండిరదనే అనుకోవాలి.


 

అయితే మంత్రుల మాటలు ఎవరూ నమ్మరు కాబట్టి చివరిలో ఆయనకు వ్యతిరేక నినాదాలు కూడా చేసేశారు. అసలు ఆయన అల్లిన కథ చూడండి. అది కూడా మంత్రికి రామాయణంపై ఉన్న పట్టును నిరూపిస్తోంది. ‘‘ రామాయణంలో రామ, రావణ యుద్ధం జరిగినప్పుడు మొత్తం కపిసేనను సమీకరించిన రాముడుకు రావణున్ని చంపేందుకు విభీషణుడు, ఇంకా  కొందరు సహకరించారు. ఆ దేవతలు, సేన మాట పక్కన ఉంచితే ఉడత కూడా వారధి నిర్మాణంలో సహకరించింది. ఎవరిపాత్ర ఏమిటో వారివారి అంతరాత్మలకు తెలుస్తాయి. మీకు చెప్పాల్సిన పని లేదు.



తెలంగాణా ఉద్యమంలో అరెస్టు అయిన వారిని బయటకు  తీసుకువచ్చేందుకు నేనెంత శ్రమించానో నాకు తెలుసు. అలానే వారిపై కేసులు ఎత్తేసేందుకు నావంతు కృషి చేస్తానని మాట ఇస్తున్నాను.’’అని జానారెడ్డి తెలివిగా ఓ హామీ ఇచ్చి ప్రసంగాన్ని ఆపేశారు. అయినా సరే! జానారెడ్డిని తెలంగాణావాదులు నమ్మలేదు. మరి రాజకీయనాయకుడు కదా ఎలా నమ్ముతారు? మీరు చెప్పండి? అసలు గొడవ మరిచిపోకూడదు ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా జానారెడ్డిని ప్రకటిస్తే ఆయన పాలించాల్సింది సమైక్యాంథ్రానే అని తెలంగాణావాదులు అంటున్నారు. మరి అది నిజమే కదా

google-ad-img
    Related Sigment News
    • Loading...