చిందేయడమే మంచి మందు

 

 

సంగీతమంటే ఇష్టం లేంది ఎవరికి..? మంచి పాటేదైనా అలా గాలివాటంగా వినిపిస్తుంటే.. చెవులు రిక్కించని వాళ్లు ఎవరైనా ఉంటారా.. ? మంచి రాగం చెవినపడితే వీలైతే కాళ్లూ చేతులూ లేకపోతే కనీసం వేళ్లైనా ఊపకుండా ఉండగలిగేవాళ్లు ఈ భూమ్మీద ఉన్నారంటారా.. ? లేరని గట్టిగా చెప్పొచ్చు. ముమ్మాటికీ ఆలాంటివాళ్లు ఈ పుడమిమీద దొరకరుగాక దొరకరని ఢంకా బజాయించి మరీ చెప్పొచ్చు. ఆ అలవాటే ఇప్పుడు కొన్ని జబ్బులకు మందుగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


పార్కిన్ సన్స్ డిసీజ్ కి నచ్చినపాటకి నచ్చినట్టుగా స్టెప్పులేస్తే చాలా ఉపశమనం కలుగుతుందని వైద్య శాస్త్రవేత్తలు అంటున్నారు. తాజా పరిశోధనల్లో తెలిసిన ఈ విషయాన్ని వెంటనే అందరికీ చెప్పేయాలన్న ఉబలాటంతో శాస్త్రవేత్తలు టమకేసి మరీ చెబుతున్నారు. అంతే కాదు.. ఇలా ఇష్టమైన పాటలకి స్టెప్పులేయడంవల్ల ఒక్క పార్కిన్ సన్స్ డిసీజ్ కి మాత్రమే కాదు, బీపీ, షుగర్ లాంటి మొండి జబ్బులకుకూడా చాలా ఉపశమనం కలుగుతుందంటున్నారు. సో.. మీ కిష్టమైన మంచి పాటకి స్టెప్పులేయడంవల్ల ఇన్ని మంచి లాభాలున్నాయని తెలిసినప్పుడు మరింకెందుకు ఆలస్యం.. లెట్స్ డూ ఇట్ ఫాస్ట్..