కోపానికి కాస్త పంచదార

 

ఊరికే కోపం వస్తుందంటే కాస్త నోట్లో పంచదార వేసుకోండి అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే చక్కర ఉద్రేకాన్ని నియంత్రిస్తుందంటున్నారు ఒహియో విశ్వవిద్యాలయం అధ్యయన కర్తలు ఈ పంచదారాకి ఉద్రేకానికి సంబంధం ఏంటని పరిశీలిస్తే బహుశా మెదడకు శక్తిని అందించే గ్లూకోజ్ కారణమెమోనని భావిస్తున్నారు. మీరు ఉద్రేకపడకుండా ఉండాలంటే ఎంతో controlling powerఅవసరం దానికి శరీరంలో చాలా శక్తి ఖర్చవుతుంది. ఈ శక్తిని గ్లూకోజ్ మెదడుకు అందిస్తుంది అంటే గ్లుకోజ్ కూ,ఉద్రేకానికి దగ్గర సంబంధం ఉందని అంటున్నారు. శరీరంలో గ్లూకోజ్ వినియోగించుకునే ప్రక్రియ దెబ్బతిన్నవారు త్వరగా ఉద్రేకం తెచ్చుకుంటారని ఇతరులపై అరవటం, దౌర్జన్యం చేయటం వంటివి చేస్తారని చెబుతున్నారు. so కోపం కట్టలు తెంచుకుంతుంటే చటుక్కున ఓ చెంచాడు పంచదార నోట్లో వేసుకోండి.

-రమ