Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'కిస్' టిజర్ డైలాగ్స్ కేక
posted on: Jun 17, 2013 2:48PM

టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో అడివి శేష్ న్యూ మూవీ 'కిస్' రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ టిజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. టిజర్ లోని డైలాగులు యూత్ బాగా ఆకట్టుకుంటున్నాయి. 'కొంప దీసి పెళ్ళిచేసుకుంటావా ఏమిటి'..'నువ్వు సూపర్ ఫిగర్' వంటి డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కిస్ ఆడియోని ఈ నెల 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆడియో లో పెట్టాలని అనుకోవడం వల్ల వాయిదా వేయడం జరిగింది. ఈ సినిమా ఆడియోని జూన్ 22 తేదిన లేదా 23 తేదిన విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
''అమెరికా లో వుండి అడివి శేష్ తెలుగు సినిమా మీద ఫ్యాషన్ ఈ సినిమా చేశాడు. సాయి నాకు కథ చెప్పినప్పుడు చాలా బాగుంది. కానీ రిస్క్ ఎందుకు అని చెప్పాను. ఈ సినిమా లో కొన్ని సీన్స్ చూశాక ఆల్ రెడీ హిట్ కొట్టేశారు అన్న ఫీలింగ్ కలిగింది. నిర్మాతగా సాయి కి మంచి డబ్బులు వస్తాయి. అడివి శేష్ చాలా మంచి నటుడు అవుతాడు'' అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
'కిస్' అంటే 'కీపిట్ సింపుల్ స్టుపిడ్' ఇదే ఈ సినిమా ట్యాగ్ లైన్. ప్రతిదాన్ని సరదాగా తీసుకునే యువకుడి పాత్రలో అడివి శేష్ కనిపించనున్నారు.


.jpg)



