డేటింగ్ కింగ్ యువరాజ్ సింగ్.. నయా గర్ల్ ఫ్రెండ్



 భారత క్రికెట్ జట్టులో యువరాజ్ సింగ్ మంచి బ్యాట్స్ మాన్ అది అందరికి తెలిసిన విషయమే దాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటలోనే కాదు యువరాజ్ సింగ్ అందమైన అమ్మాయిలతో డేటింగ్ చేయడంలో కూడా కింగే అది కూడా స్పెషల్ గా చెప్సాల్సిన అవసరం లేదనుకోండి. గతంలో బాలీవుడ్ బాలీవుడ్ భామలు దీపిక పదుకోన్‌, ప్రీతి జింతా, కిమ్‌ శర్మ, నేహా ధూపియాలతో అఫైర్ నడిపి వార్తల్లో నిలిచాడు. గత కొంత కాలంగా అనారోగ్యం కారణంగా సింగిల్ గా ఉన్న యూవీ ఇప్పుడు మళ్లీ ఫిట్ ఉండటంతో మళ్లీ డేటింగ్ మొటలేట్టేశాడు. ప్రస్తుతానికి బ్రిటిష్‌ మోడల్‌, యాక్టర్‌ హాజెల్‌ కీచ్‌తో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దానికి తోడు వీరిద్దరూ లండన్‌లో బాగా ఎంజాయ్‌ చేసి మళ్లీ భారత్‌కు రావడంతో ఈ వార్తలు మరీ ఊపందుకున్నాయి.

యాక్టర్‌ హాజెల్‌ కీచ్‌ సల్మాన్ ఖాన్ నటించిన 'బాడీగార్డ్' లో, బిల్లా సినిమాతో పాటు నటించింది.