షర్మిలా పై విహెచ్ ఫైర్

 

 

ys sharmila padayatra, congress rahul gandi, chandrababu pdayatra

 

 

వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. తమ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శించే నైతిక హక్కు షర్మిలకు లేదన్నారు. నిత్యం ప్రజా సంక్షేం గురించి ఆలోచించే తమ పార్టీ ముఖ్య నేతలను ఏమైనా అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జగన్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కూడా విహెచ్ సూచనలు చేశారు.


కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్లకు పరిమితం కాకుండా ప్రజల్లో తిరగాలను సూచించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వలే కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరుగాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలహీనపడుతోందన్నారు. బొత్స, కిరణ్ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీపై ప్రజలకు విశ్వాసం పోతోందన్నారు. నిన్న గాక మొన్న వచ్చిన పార్టీ, రాజకీయాలు తెలియని షర్మిల ప్రజల్లో తిరుగుతున్నారని బొత్స, కిరణ్‌లకు గుర్తు చేశారు. రాహుల్ రాష్ట్ర పర్యటన కంటే ముందుగానే పార్టీని బలోపేతం చేయాలన్నారు.