షర్మిలా ‘పాదయాత్ర’ రహస్యం ఏమిటి ?

 

ys sharmila padayatra, ys sharmila ysr congress, sharmila jagan, ysrcongress sharmila

 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిలా ‘పాదయాత్ర’ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి ? అలుపనేది లేకుండా ఆమె మూడు వేలకిలోమీటర్ల పాదయాత్ర ను నిరవధికంగా ఎలా చేస్తుంది ? ఈ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా?


అయితే వినండి. కండరాలు, కీళ్ళ నొప్పనేది లేకుండా ఆమె ఇంత సుదీర్ఘ యాత్ర చేయడానికి అసలు కారణం ఆమె ధరించిన హైటెక్ షూసే. జర్మనీలో తయారు చేయబడిన ఈ షూస్ ధరించడం వల్ల, ఎంత దూరం నడచినా, అలుపనేది ఉండదు.

అంతే కాదు. ఇవి ధరించడం వల్ల పాదాల మీద వత్తిడి అనేది అస్సలు ఉండదు. వీటి వల్ల పాదాలకు తగిన భద్రత కూడా కలుగుతుంది. వీటి వల్లే షర్మిలా విరామం లేకుండా ఈ యాత్ర చేయగలుగుతుంది.