వైఎస్ జగన్ కేసు పిబ్రవరి 28కి వాయిదా!

ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల ఆరోపణల కేసు ఈ నెల 28వ తేదీకి వాయిదా పడింది.  వచ్చే శుక్రవారం ప్రభుత్వ సెలవు కావడంతో కేసును తదుపరి విచారణను 28కి వాయిదా వేసినట్టు సమాచారం అందుతుంది. అయితే ఈకేసులో ఏ 1 నిందితుడిగా ఉన్న జగన్ ఈ రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు రాలేకపోయారు అన్న విషయాన్ని న్యాయమూర్తికి ఆయన తరఫు న్యాయవాదులు చెప్పడంతో అందుకు కోర్ట్ అంగీకరించలేదు. ఏ2 నిందితుడిగా ఉన్న రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి కూడా హాజరు కాలేదు. తెలంగాణ విద్యా శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, విరిగి రాజగోపాల్ మరొక ఇద్దరు ఈ కేసులో హాజరయ్యారు. దీంతో సీబీఐ విచారణలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ వైఎస్ జగన్ వేసిన పిటిషన్ లో.. ఈడీ కేసులో తప్పక హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. ఈరోజు ఢిల్లీ పర్యటణ కారణంగా హాజరు కాకపోవడంతో కేసు 29వ తేదీకి వాయిదా పడింది.