గిఫ్టులు..రిటర్న్ గిఫ్టులతో తరిస్తున్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు!

తెలంగాణ వారికి ఆంధ్ర సహజవనరులు అప్పనంగా దోచి పెడుతున్నారు అనటానికి స్పష్టమైన ఋజువు..ఫిబ్రవరి10 న వచ్చిన జీఓ ఎం ఎస్ 10. తెలంగాణలో ప్రముఖ వ్యాపారవేత్త, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మ బంధువు (మై హోమ్) జూపల్లి రామేశ్వరరావుకి చెందిన జయజ్యోతి సంస్థకి కర్నూలులో 343 ఎకరాల సున్నపురాయి గనులు 50 ఏళ్ల పాటు తవ్వుకోవటానికి అనుమతి ఇచ్చారు.  

కెసిఆర్ బర్త్ డే కి మన సహజవనరులు 50 సంవత్సరాల పాటు రాసిచ్చాడు...ఈ ఘనత వహించిన ముఖ్యమంత్రి... వచ్చే బర్త్ డే కి బందరు పోర్ట్ రాసిస్తాడు..ఆ తర్వాత మనందరి బతుకులు కూడా రాసిచ్చేస్తాడు...అని ఆంద్రప్రదేశ్ జనాలు అనుకుంటున్నారు. 

మన రాష్ట్రంలో ఉద్యోగాలు 75 శాతం స్థానికులకు ఇవ్వాలని మంత్రి మండలిలో తీర్మానం చేసిన ప్రభుత్వం మన సహజ వనరులను మాత్రం పక్క రాష్ట్రాల వ్యాపారవేత్తలకు దారదత్తం చేయడమేంటని విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ జగన్ ను ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి గిఫ్టుగా ఇచ్చి..రిటర్న్ గిఫ్టులు బాగానే తీసుకుంటున్నాడని అనుకుంటున్నారు.