వైసిపి రాజీనామాస్త్రం

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్ రెడీ చేస్తుంది అనుకుంటున్న త‌రుణంలో రాష్ట్రంలోని మిగ‌తా పార్టీలు ఇరుకున ప‌డ్డాయి.. కేంద్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఎవ‌రికి అనుకూలంగా జ‌రుగుతున్నాయో తెలియ‌క పోయినా ఇన్నాళ్లు ఇరు పక్షాల‌వారు త‌మ‌కే అనుకూలంగా జ‌రుతున్నాయని చెపుతూ వ‌చ్చారు.. కాని ఇప్పుడు సీన్ మారింది కాంగ్రెస్ అడుగులు ప్రత్యేక రాష్ట్రం వైపే అన్న సంకేతాలు అంద‌డంతో మిగ‌తా పార్టీలు త‌మ అస్త్రాల‌కు ప‌దును పెడ‌తున్నారు.. 

శుక్రవారం కోర్ క‌మిటీ భేటి నేప‌ధ్యంలో రాష్ట్రంలో ప‌రిణామాలు వేగంగా మారాయి.. ఉద‌యాన్నే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన వీర‌శివారెడ్డి త‌న ఎమ్మేల్యే ప‌ద‌వితోపాటు కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామ చేశాడు.. ఇదే స‌మ‌యంలో రేసులో తాము వెన‌క ప‌డ‌కూడ‌దూ అని భావించిన వైసిపి నేత‌లు కూడా రాజీనామాస్త్రాల‌ను ప్రయోగించారు..

వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంభందించిన వైయ‌స్ విజ‌య‌మ్మ త‌ప్ప మిగ‌తా అంద‌రూ ఎమ్మెల్యేలు రాజీనామాలు స‌మ‌ర్పించారు.. స్పీక‌ర్ ఫార్మెట్లో రాసిన రాజీనామ ప‌త్రాలను స్పీక‌ర్ కార్యాల‌యానికి ఫ్యాక్స్ చేశారు.. దీనితో పాటు రాష్ట్రం స‌మైఖ్యంగా ఉంచ‌డానికి ఎటువంటి త్యాగాల‌కైనా సిద్దమ‌ని ప్రక‌టించారు..తమ పదవులకు రాజీనామా చేస్తూ జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దీని వెనుక పెద్ద రాజ‌కీయ వ్యూహ‌మే ఉంద‌టున్నారు విశ్లేష‌కులు.. తెలంగాణ‌లో కేడ‌రే లేని వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ క‌నీసం సీమాంద్రలో అయిన హీరోలు అనిపించుకోవాలి అనే ప్లాన్‌లో భాగంగానే ఆ పార్టీ నాయ‌కులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావిస్తున్నారు..