చంద్రబాబులో రెండు లక్షణాలు.. ఛాదస్తపు మొగుడు, అనుమానపు మొగుడు

 

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలల్లో తీవ్రంగా మండిపడ్డారు వసంత కృష్ణ ప్రసాద్. వల్లభనేని వంశీ ఎపిసోడ్ పై.. ఆయన ప్రసంగిస్తూ.. " సభలో ఒక సభ్యుడిగా కొన్ని విషయాలను స్పీకర్ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించిన ఒక సొంత పార్టీ సభ్యుడిని అమానుషంగా సస్పెండ్ చేయించడం కరెక్ట్ కాదని.. అది కూడా ఎంతో అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు చేయడం సమంజసమే కాదన్నారు వసంత కృష్ణ ప్రసాద్.

అంతేకాక తనకు చంద్రబాబులో రెండు లక్షణాలు కనిపిస్తున్నాయని.. ఒకటి ఛాదస్తపు మొగుడు , మరొకటి అనుమానపు మొగుడని ఎద్దేవా చేశాడు. అనుమానపు మొగుడు ఎందుకంటే.. తన సొంత పార్టీ సభ్యుడు తన నియోజక వర్గ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి గారి దగ్గరకొస్తే బాధపడిపోయి సొంత పార్టీ సభ్యుని అనుమానించి బయటికి గెంటేశారన్నారు. అదే విధంగా   ఛాదస్తపు మొగుడు ఎందుకంటే.. ఆయన తన బాధని ఈ రోజు సభలో చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఆ బాధను కూడా చెప్పుకోనివ్వకుండా చేశారని వసంత కృష్ణ ప్రసాద్ ఆవేదనను వ్యక్తపరిచారు.

తమ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ గారి గురించి.. వారు తీసుకున్న విధాన నిర్ణయాలు బాగున్నాయని.. ఆయన పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించటం కరెక్టని ప్రతి ప్రతిపక్ష సభ్యుడు నాలుగు మంచి మాటలు చెప్పాలి కానీ ఇలా చెయ్యకూడదన్నారు. అవన్నీ పక్కకి పెట్టి అనవసరపు విషయాల పట్ల, ఉత్తుత్తి విషయాల పట్ల, రాష్ట్రంలో లేని కొరతను వీళ్లు సృష్టించి వేరే విషయాల పట్ల ధర్నాలు చేసి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. అలా చేయొద్దని.. అనవసర విషయాల పై జోక్యం వద్దని సూచించిన సభ్యుడని  భరించలేక వాళ్ళు దూరం పెట్టటం ఎంతో దురదృష్టం అన్నారు. ఏదేమైనా ఈ రాష్ట్ర చరిత్రలో ప్రతిపక్షానికి చెందిన సభ్యుడు కూడా ముఖ్యమంత్రిని చేసిన మంచి పనులు పొగుడుతుండటం చూడలేక బయటికెళ్లిన సంఘటన 40 ఏళ్ళలో ఎన్నడూ చూడలేదని వసంత కృష్ణ ప్రసాద్ వ్యక్తపరిచారు.