టీడీపీ డ్రామా పార్టీ, దొంగల పార్టీ, పప్పు పార్టీ

 

ఏపీ ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత జగన్ పై దాడి జరిగింది విదితమే.అయితే జగన్ పై జరిగిన దాడి టీడీపీ నేతలే చేయించారంటూ రోజా విమర్శలు చేస్తున్నారు.దాడి జరిగినప్పుడు కూడా కత్తికి విషం పూసారనే అనుమానానికి తెరలేపింది కూడా రోజానే.తాజాగా రోజా మరోసారి చంద్రబాబు పై విమర్శలు చేశారు.దాడి కేసులో ఏ-1 నిందితుడు చంద్రబాబే అని రోజా ఆరోపించారు. జగన్‌ కేసు నుంచి తప్పించుకోడానికి బాబు డ్రామాలాడుతున్నారన్నారు. కేసు నీరుగార్చేందుకు చంద్రబాబు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ము టీడీపీకి లేదని రోజా అన్నారు. జగన్‌పై దాడి కేసును డైవర్ట్‌ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫ్యూజన్‌ హోటల్‌ కేంద్రంగానే దాడికి కుట్ర చేశారని ఆరోపణలు గుప్పించారు. టీడీపీని తెలుగు డ్రామా పార్టీ, దొంగల పార్టీ, పప్పు పార్టీగా మార్చారని అన్నారు. జగన్‌ అభిమానులమని శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులతో చెప్పించి కేసును తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. జనవరి నుంచి ఆ కత్తి హోటల్‌లో ఉంటే హర్షవర్ధన్ ఎందుకు అడ్డు చెప్పలేదని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.

ప్రతిపక్ష నేతకు భద్రత కల్పించలేని ఈ సీఎం, సిగ్గు మాలిన ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుని ఇకపై శునకానంద పార్టీ అధ్యక్షుడు అని పిలుస్తామని రోజా ఎద్దేవా చేశారు.చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న ఎవరూ కూడా బాగుపడిన సందర్భం లేదని, జాతీయ రాజకీయాల్లో ఆయనది ఐరన్ లెగ్ అని విమర్శించారు. గుంటూరు పర్యటనలో రాహుల్ గాంధీపై చెప్పులు వేయించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన చెప్పులను నెత్తిన పెట్టుకుంటున్నాడని ధ్వజమెత్తారు. అధికారం కోసం టీడీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన ఆశ్చర్యం ఉండదని రోజా ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు కోసమే చంద్రబాబు కోడలు బ్రాహ్మణి రాహుల్ గాంధీని కలిసిందని రోజా ఆరోపించారు.