అన్నదమ్ముల రగడ.. అయ్యన్నపాత్రుడు ఇంటిపై వైసీపీ జెండా

చింతకాయల అయ్యన్న పాత్రుడు టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి. ఈయనకు ఒక తమ్ముడు ఉన్నారు. ఆయన పేరు చింతకాయల సన్యాసిపాత్రుడు. మొన్నటి వరకు అన్నదమ్ములిద్దరూ టిడిపిలో ఉండేవారు. 2019 ఎన్నికల్లో నర్సీపట్నం నుండి పోటీ చేసి అయ్యన్న పాత్రుడు ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆయన ఇంట్లో పొలిటికల్ లొల్లి మొదలైంది. అయ్యన్న పాత్రుడు ఇంటిపై ఇంతకు ముందు టిడిపి జెండా ఉండేది. అయితే ఇప్పుడు అదే ఇంటి పై వైసీపీ జెండా ఎగురుతోంది. ఈ జెండాల లొల్లే ఇప్పుడు ఇంట్లో చిచ్చుపెట్టింది. 

అయ్యన్నపాత్రుడి తమ్ముడు సన్యాసిపాత్రుడు ఇటీవలై వైసిపిలో చేరారు. అయ్యన్నపాత్రుడు తన కొడుకు విజయ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని సన్యాసిపాత్రుడు తన దారి తాను చూసుకున్నారు. సరిగ్గా అయ్యన్నపాత్రుడి బర్త్ డే రోజే మెడలో కండువా మార్చారు. ఇక్కడ వరకు వివాధం లేదు. కానీ ఇప్పుడు ఇంటి పై జెండా ఎగరడమే ఇంట్లో గొడవకు కారణమైంది. అయ్యన్న పాత్రుడు సన్యాసిపాత్రుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు. పై ఫ్లోర్ లో సన్యాసిపాత్రుడు ఉంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో అయ్యన్న పాత్రుడు ఉంటున్నారు. ఇంతకు ముందు టిడిపి జెండా ఇంటి పై ఉండేది. అయితే సన్యాసిపాత్రుడు ఇంటి పై వైసీపీ జెండా కూడా పెట్టటంతో ఇంట్లో వాళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ విషయం పై మాటా మాటా పెరిగి అయ్యన్నపాత్రుడు పిన్ని బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరింది. తమ ఇంటి పై వైసీపీ జెండా ఎలా ఎగుర వేస్తారనేది అయ్యన్న ప్రశ్న. అయితే తన ఇంటి పై తాను తన పార్టీ జెండా ఎగురవేశానని సన్యాసి అంటున్నారు. మొత్తానికి ఈ వివాదం పోలీసు స్టేషన్ కు చేరింది.