కర్నూలు తెలుగుదేశం పిలుస్తోంది రా..

 

రాజులు.. రాజ్యాలు పోయినా .. ప్రజాస్వామ్యం పుణ్యమా అని నేతల కోటలు .. పార్టీల కంచు కోటలు మిగిలాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట అయిన కర్నూలు జిల్లా వైఎస్ హయాంలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది.

 

సీనియర్ నేత ఎస్వీ సుబ్బారెడ్డి రాజకీయాలనుంచి విరమించుకున్నారు. భూమా, బైరెడ్డి వంటి నాయకులు పార్టీని వీడారు.ఎస్వీ సుబ్బారెడ్డి తనయుడు ఎస్వీ మోహనరెడ్డి కాంగ్రెస్ లో చేరి అట్నుంచి ఆటే బావ భూమా బాటలో వైసీపీలో చేరారు. అనారోగ్యంతో మాజీ మంత్రి బీవీ మోహనరెడ్డి మృతి చెందారు. తనకు ప్రాధాన్యం దక్కలేదనే అక్కసుతో మాజీ మేయర్ బంగి అనంతయ్య .. టీడీపీ అధినేతకు వ్యతిరేకంగా నిరసనల భంగిమలు ప్రదర్శించి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. 14 నియోజకవర్గాలలో 4 టీడీపీ చేతిలోనే ఉన్నా కంచుకోటకు శిధిలావస్థకు చేరుకుంది.

 

రాష్ట్ర విభజనను షురూ చేయడం సీమాంధ్రలో కాంగ్రెస్ ఖాళీ కావడం ఆరంభమైంది. వైసిపీ, టీడీపీల వైపు కాకలు తిరిగిన కాంగ్రెస్ వాదులు వలస ప్రారంభించారు. కర్నూలు లో జగన్ పార్టీ వైపు కన్నెత్తి చూసేందుకే నేతలు భయపడుతున్నారు. జగన్ పార్టీలో కీకకంగా వ్యవహరిస్తున్న ఆ నేత.. ఒకప్పుడు టీడీపీ గూటి పక్షె.. చిరు చెంతకు చెరి.. అంతలోనే యువనేత వైపు తిరిగిపోయిన ఆ ప్రముఖుడు యువనేతకు బంధువు కూడా. వైసిపీలో చేరితే ఆ నేత కనుసన్నల్లో పని చేయాల్సి వస్తుందని భయపడే టీడీపీ గూటికి చేరుతున్నారని కర్నూలు వాసులు గుసగుసలాదుకున్తున్నారు.

 

సీనియర్ టీడీపీ నేత, గ్రీన్సిగ్నల్ ఇస్తే చాలు టీడీపీ లోకి రూట్ క్లియర్ అవుతుందని కాంగ్రెస్ అన్నయ్యలు ..తెలుగు తమ్ముల్లుగా మారిపోయేందుకు తెగ ఉబలాట పడిపొతున్నారు. మాజీ మంత్రులైన టీజీ, ఏరాసు తెలుగుదేశంలో గూటికి చెరారు. అన్నీ అనుకూలిస్తే నేడే రేపో మాజీ మంత్రి శిల్పా కూడా బాబు చెంతకు చేరనున్నారు. జగన్ అసలు స్వరూపం ఏంటో తెలిసిందని మీడియాకు ఎక్కినా మాటల మాంత్రికుడు మాజీ మంత్రి మారెప్ప కూడా పసుపు పచ్చ జెండా కోసం నిరీక్షిస్తున్నారని రాజకీయ వర్గాల సమాచారం. సీనియర్ కాంగ్రెస్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే గంగుల, ఆలూరు తాజా మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి, తిక్కారెడ్డిలు కాంగ్రెస్ ను వీడెందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎవరిని చేర్చుకుంటారు? ఎవరిని వద్దంటారు? అనేది ఇంకా సస్పెన్సే.. ఇప్పటికే వలసలను ప్రోత్సహించడంపై సీనియర్ టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. కర్నూలు కాంగ్రెస్ లీడర్లను హోలేసేల్ గా చేర్చుకుంటే టీడీపీ లోనూ కుమ్ములాటలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు ఎక్కువవుతున్నాయే