ఘోరాతి ఘోరంగా ఓడిన పాకిస్థాన్

 

క్రైస్ట్‌చర్చ్‌లో వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీల్లో భాగంగా పాకిస్థాన్ - వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోరంగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 310 పరుగులు చేసింది. 311 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చివరికి ముక్కీ మూలిగి 39 ఓవర్లలో 160 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ ఓటమితో పాకిస్థాన్ వరుసగా రెండుసార్లు ఘోర పరాజయం ఎదుర్కొన్నట్టు అయింది. వెస్టిండీస్ బౌలింగ్ ధాటికి పాకిస్థాన్ కకావికలు అయిపోయింది. వెస్టిండీస్ బౌలర్ జెరోమీ టేలర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే పాక్ రెండు వికెట్లు కోల్పోయింది. పాక్ పరుగుల ఖాతా తెరవకుండానే ఓపెనర్ నాజిర్ జంషెడ్ పెవిలియన్ చేరాడు. ఇదే ఓవర్లో యూనిస్ ఖాన్ కూడా ఔటయ్యాడు. టేలర్ తన మరుసటి ఓవర్లో హారిస్ సొహైల్ను ఔట్ చేశాడు. ఇక విండీస్ బౌలర్ హోల్డర్ ఆ తర్వాతి బంతికి హెహజాద్ను ఔట్ చేశాడు. దీంతో పాక్ ఒక్క పరుగుకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 160 పరుగులకే పాకిస్థాన్ ప్రయాణం ముగించి చేతులెత్తేసింది. స్కోర్లు: West Indies 310/6, Pakistan 160 (39/50 ov). West Indies won by 150 runs.