జగన్నాటకం... పిన్నెల్లిపై దాడి చేసింది కడప వైసీపీ కార్యకర్తలే!!

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనం పై దాడి ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. అసలు దాడి చేసింది రైతులా లేక రైతుల ముసుగులో ఉన్న వేరే వ్యక్తులా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రహదారి దిగ్బంధం భాగంగా రైతులు రాస్తారోకో నిర్వహిస్తుండగా అదే సమయంలో మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అటుగా వచ్చారు. ఉద్యమానికి సంఘీభావం తెలపాలని రైతులు కారును ఆపారు. పిన్నెల్లి కారుముందు బైటాయించిన రైతులు రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ క్రమం లోనే కొందరు ఆందోళనకారులు ఎమ్మెల్యే కారు పై రాళ్లు రువ్వడంతో కారు వెనుక భాగం అద్దాలు పగిలిపోయాయి. ఈ వ్యవహారంపై స్థానికుల్లో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యూహం ప్రకారమే పిన్నెల్లి పై రాజధాని వ్యతిరేక శక్తులు దాడి చేశాయని అంటున్నారు స్థానికులు. పిన్నెల్లి కారును అడ్డుకున్న చోట వైసీపీ కార్యకర్తలు ఉన్నారంటున్నారు స్థానిక రైతులు. రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమంలో కడప జిల్లా వైసీపీ కార్యకర్తలకు పని ఏంటని రాజధాని రైతులు నిలదీస్తున్నారు. 

పిన్నెల్లి ఉద్దేశ పూర్వకంగానే ఆందోళనకారుల వద్దకు వచ్చి కారు ఆపారని డోర్ కూడా తీశారని చెబుతున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడ్డ తరవాత దాడి జరిగిందని రాజధాని రైతులంటున్నారు. దాడి జరిగిన సమయంలో కడప జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్తలు అక్కడే ఉన్నారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యే కారు అడ్డగింపు వ్యవహారాల్లో అనుమానాలు బలపడుతున్నాయి. టీడీపీ కార్యకర్తలే పిన్నెల్లి కారుపై దాడి చేశారంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు తెలుగుదేశం నేతలు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే ఆనం, మంత్రి సురేష్ ను అడ్డుకోని రైతులు అతడిని మాత్రమే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నిస్తున్నారు ఏపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు. సీఎం ఆదేశాలతోనే పిన్నెల్లి అక్కడకు వచ్చారని ఆరోపించారు. అటు రాజధాని రైతులు చెబుతున్న మాటలతో దాడి ఘటన పై మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి.