ట్రంప్ కు ఓటు వేసినందుకు...

 

ట్రంప్ కు ఓటు వేసినందుకు గాను అమెరికాలో ఓ భార్య తన భర్తకు విచిత్రమైన శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ట్రంప్ కు ఓటు వేసినందుకు ఓ తల్లి ఏకంగా తన కొడుకును ఇంట్లో నుండి గెంటేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఓటు వేసింది నిజమైన ఎన్నికల్లో కూడా కాదు.. స్కూల్ లో. యూఎస్‌లోని టెక్సాస్‌ నగరంలో ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. స్కూల్లో జరిగిన మాక్‌ ఎలక్షన్స్‌లో ట్రంప్‌కు ఓటు వేశాడని తెలుసుకున్న ఆ బాలుడి తల్లి కొడుకుపై చేయి చేసుకోవడమే కాక.. అతని బట్టలు, సామాగ్రిని సూట్‌కేస్‌లో సర్ది ఇంటి నుంచి బయటకి పంపింది. ‘బై.. డొనాల్డ్‌ ట్రంప్‌ లవర్‌’ అంటూ ఆ తల్లి బాలుడి ముఖంపై తలుపు వేసేసింది. దీంతో ఆ బాలుడు బోరున విలపించాడు. తలుపు తీయమంటూ తల్లిని బతిమాలాడు. రేపు తనకు స్కూలుందని చెప్పాడు. అయినా ఆమె వినిపించుకోలేదు సరికదా ఆ విషయం ముందే ఆలోచించి ఉండాల్సింది అని కోప్పడింది.

 

కాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపొందిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన ట్రంప్ 45వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.