మాల్యాకు నాన్ బెయిల‌బుల్ వారెంట్లు...

 

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు ఢిల్లీ కోర్టు  నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఫెరా ఉల్లంఘ‌న కేసులో కోర్టు జారీ చేసిన స‌మ‌న్ల‌ను ప‌ట్టించుకోనందుకు ఈ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయ‌న‌కు దేశానికి తిరిగి వ‌చ్చే ఉద్దేశం లేద‌ని, ఇక్క‌డి న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ఆయ‌న అస‌లు గౌర‌వించ‌డం లేద‌ని ఈ సంద‌ర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.