క‌రోనాను జ‌యించే రోజు వ‌స్తుంది!

కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుందనుకునే వారు.
ఐన్ స్టీన్ రాకతో కాంతి పెద్ద ఖగోళాల దగ్గర గురుత్వాకర్షణ కు లొంగి, ఒంగి ప్రయాణిస్తందని తేలింది. ఒకప్పుడు స్ఫోటకం అమ్మోరు వల్ల వస్తుందనుకుని బలులు, జాతర్లు చేశారు.
ఇప్పుడు సూక్ష్మ జీవశాస్త్రం రోగాలకు కారణం వైరస్ కారణమనే సరికి, టీకాలతో దాన్ని నిర్మూలించారు.

అంగ వైకల్యం జరిగితే పూర్వ జన్మ వికృత ఫలితమని సర్దుకున్నారు. కాని, ఇప్పుడు రెండు పోలియో టీకా చుక్కలతో దాన్ని అంతమొందించారు. గ్రహణమొస్తే బయటకు రాకూడదని, చూడకూడదని ,అది ఐన తర్వాత పూజలు చేసే వారు.
కాని, నేడు లక్షలాది మంది , కాంతి ఫిల్టర్ల సాయంతో గ్రహణందాలను వీక్షిస్తున్నారు.

ఒకప్పుడు దెయ్యం పట్టిందని వేప మండలతో థూ థూ అని తూతూ మంత్రాలు పెట్టిస్తే, నేడు అది మానసిక వికారమని, మందు బిళ్ళలతో నయం చేయించుకుంటున్నారు.

ఒకప్పుడు కలరా విరోచనాలు వస్తే జాతర్లకు లంకించుకున్నారు,
కాని, కలుషిత చెరువు నీరు వద్దని, ఫిల్టరు వాటర్ తాగి ద్రవ విరోచనాలను నిర్మూలిస్తున్నారు. ఒకప్పుడు నలతగా ఉందని మంత్రాలు పెట్టించుకుంటే, నేడు డాక్టర్లతో వైద్యం చేయించుకుంటున్నారు.

ఒకప్పుడు పాము కరిస్తే పాముల నరసయ్యలకు ఫోను చేసి, మంత్రాలు పెట్టించుకుంటే, నేడు, హాస్పటల్ ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన యాంటీ సీరం ఇంజక్షన్ ను చేయించుకుని బతుకు తున్నారు.

ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. పెరిగిన జ్ఞానం, పెరిగిన చికిత్స.
క‌రోనాను క‌ట్ట‌డి చేసే రోజు వ‌స్తుంది. దీనికీ టీకాని కనుగొంటారు, ఈ రోజు కాకపోతే రేపు. ప్రస్తుతానికి, లాక్‌డౌన్‌. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డే వ‌ర‌కు ధైర్యంగా స్వ‌యం నియంత్ర‌ణ‌లో వుండ‌ట‌మే మేలు. పులి వేటాడేట‌ప్పుడు ఓపిక‌గా ఒక చోట కూర్చొని ఎదురుచూసిన‌ట్లు మ‌నం కూడా ఇంట్లోనే వుందాం. క‌రోనా విస్త‌రించ‌కుండా స‌హ‌క‌రించుదాం. క‌రోనా కాటు నుంచి త‌ప్పించుకుందాం.