ఉత్తరఖండ్ ముఖ్యమంత్రిగా హరీశ్ రావత్ బాధ్యతలు

 

ఉత్తరఖండ్ లో హైకోర్టు రాష్ట్రపతి పాలన రద్దు చేసిన  సంగతి తెలిసిందే. కోర్టు అలా రద్దు చేసిందో లేదో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తిరిగి హరీశ్ రావత్ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే ఆయన కొన్ని అంశాలమీద ముఖ్యంగా పన్నెండు అంశాలమీద నిర్ణయాలు తీసుకొని వాటిని శీఘ్రంగా అమలు చేయాలని ఆదేశించారు. వీటిలో నీటి సంక్షోభం అనే అంశం ప్రధానంగా ఉంది. రావత్ ఉత్తరాఖండ్ లో మెజారిటీ కోల్పోయారని ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం తెలిసిందే.