ఉత్తమ్ చూపు ఢిల్లీ వైపు... జైపాల్ స్థానం భర్తీకి పావులు...

ఏఐసీసీ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా, హుజూర్ నగర్ ఉపపోరులో తన భార్యను గెలిపించులేకపోవడంతో కొద్దిరోజులు స్టేట్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నారట. ఇంకా నాలుగేళ్ల వరకు అసెంబ్లీ ఎన్నికలు లేకపోవడంతో ... ఈలోపు ఢిల్లీలో ఎక్కువగా ఉంటూ జాతీయ నాయకత్వంతో కలిసి పనిచేసేందుకు ఉత్తమ్ ప్రయత్నిస్తున్నారట. ఒకవైపు, అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉండటం.... మరోవైపు ఎంపీగా ఉండటంతో... ఏఐసీసీ లేదా సీడబ్ల్యూసీల్లో ఏదో ఒక పదవి సాధించుకుని... ఢిల్లీ స్థాయిలో తన పరపతి, పలుకుపడిని మరింత పెంచుకోవాలని భావిస్తున్నారట.

మొన్నటివరకు జైపాల్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేవారు. అలాగే, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీలో పెద్దదిక్కుగాను, అండగాను ఉండేవారు. అదేసమయంలో జైపాల్ రెడ్డి మాటకు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర విలువ ఉండేది. సోనియా అండ్ రాహుల్... జైపాల్ రెడ్డికి అత్యంత గౌరవం ఇచ్చేవారు. అయితే, జైపాల్ రెడ్డి మరణం తర్వాత... తెలంగాణ తరపున హైకమాండ్ దగ్గర అంత పలుకుబడి కలిగిన నేత లేకుండా పోయారు. అందుకే, జైపాల్ రెడ్డి స్థానాన్ని తాను భర్తీ చేయాలని ఉత్తమ్ భావిస్తున్నారట. అలా, ఢిల్లీ స్థాయిలో పేరు తెచ్చుకుని, అసెంబ్లీ ఎన్నికల సమయానికి మళ్లీ స్టేట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలన్నది ఉత్తమ్ ప్లాన్ గా సన్నిహితులు చెబుతున్నారు. మరి, జైపాల్ రెడ్డి మాదిరిగా... కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర ఉత్తమ్ తన పలుకుబడిని పెంచుకోగలుతారో లేదో చూడాలి.