అమెరికా ఖాకీ కర్కశం

 

పోలీసులు ఎక్కడున్నా పోలీసే. వారిలో ఉన్న కర్కశత్వం మాత్రం తగ్గడంలేదు. ఆవిషయంలో అమెరికా పోలీసులు కాస్త ముందజలో ఉన్నారు. వారిలో ఉన్న కర్కశత్వాన్ని మరోసారి రుజువు చేశారు. సొంత గూడు కూడా లేని ఓ ఆఫ్రికన్ వ్యక్తిని నడిరోడ్డు మీద కాల్చి చంపేశారు. చుట్టుప్రక్కల వాళ్లు ఎందుకలా చేస్తున్నారని అడిగినా ఏం జరుగుతుందో మాత్రమే చూడండని, ప్రశ్నించవద్దని తుపాకులతో బెదిరించారు. ఆఫ్రికన్ వ్యక్తికి మతి స్థిమితం లేదని, అతను తన టెంట్ కింద ఎవరితోనో గొడవపడుతున్నాడని స్థానికులు తెలిపారు. దొంగతనం మోపి ఇంతటి దారుణానికి పాల్పడ్టారని, అమెరికా పోలీసుల కావరానికి ఇంకా ఎంతమంది అమాయకులు బలైపోతారో అని మానవహక్కుల సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. అమెరికా పోలీసులు ఇంతకు ముందు కూడా ఓ భారతీయ వృద్ధుడిపై దాడి చేసిన విషయం తెలిసిందే.