వృద్ధి రేటులో రాష్ర్టాలు కూడా భాగస్వామ్యం

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కేంద్ర బడ్జెట్ 2015-16ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశ ఆర్థిక పరిస్థితి పటిష్టంగానే ఉందని మంత్రి చెప్పారు. భారత్‌లో మళ్లీ వృద్ధి రేటు పెరుగుతోందన్నారు. వృద్ధిరేటులో రాష్ర్టాలు కూడా భాగస్వామ్యం అవుతున్నాయని తెలిపారు. ఆర్థికాభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు:

ఆర్థికాభివృద్ధిలో ప్రజలును భాగస్వాములను చేస్తాం.
దేశ ఆర్థిక పరిస్థితి పటిష్టంగా ఉంది.
భారత్‌లో మళ్లీ వృద్ధి రేటు పెరుగుతోంది.
తొమ్మిది నెలలుగా అభివృద్ధిపై కేంద్రం పలు చర్యలు చేపట్టింది.
వృద్ధి రేటులో రాష్ర్టాలు కూడా భాగస్వామ్యమవుతున్నాయి.
వృద్ధి రేటు పెంచేందుకు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం
ఆర్థిక వృద్ధి రేపు పెంపునకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం.
ద్రవ్యోల్బణం 5.1శాతానికి తగ్గించాం.
ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం.
ప్రపంచం ప్రస్తుతం భారతదేశం వైపు చేస్తుంది.
పెట్టుబడులకు భారత్ అనువైన ప్రదేశం.
విదేశీ మారక నిల్వలు 320 బిలియన్లకు పెరిగాయి.
ఇప్పటి వరకు 50 లక్షల మరుగు దొడ్ల నిర్మాణం పూర్తయింది.
ఇంకా ఆరు కోట్ల మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉంది.
ద్రవ్యోల్భణం నియంత్రణలో మా ప్రభుత్వం విజయం సాధించింది.
2015-16లో వృద్ధిరేటు 8 నుంచి 8.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం.