బడ్జెట్ ‌2015-16: బడ్జెట్ లో ఇచ్చిన హామీలు

2015-16 కేంద్ర బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ఇచ్చిన హామీల వివరాలు.

  12.5 కోట్ల కుటుంబాలకు జనధన్ యోజన
    6 కోట్ల మరుగుదొడ్లను నిర్మిస్తాం.
    ఎంపీలందరూ గ్యాస్ సబ్సిడీలను వదులుకోవాలి.
    సబ్సిడీలు హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంది.
    ఏడాదికి రూ.12 బీమాతో రూ.2 లక్షల ప్రీమియం.
    నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ
    ద్రవ్యలోటును మూడేళ్లలో 3 శాతానికి తగ్గిస్తాం.
    ప్రతి కుటుంబంలో ఒకరైనా ఉద్యోగాలు కలిగి ఉండేలా చేస్తాం
    ఇండియాను తయారీ రంగం ద్వారా వృద్ధిలోకి తెస్తాం
    స్కిల్ ఇండియా.. మేక్ ఇండియాకు మరింత ప్రాధాన్యం
    2015-16 వ్యవసాయానికి 8.5 లక్షల రుణాలు ఇస్తాం
    స్కాలర్ షిప్ లు, ఎల్పీజీ సబ్సిడీలు నేరుగా లబ్ధిదారులకే.
    11.5 కోట్ల మందికి ఎల్పీజీ సబ్సీడీ అందించాం.
    యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
    ద్రవ్యోల్భణం 5.1శాతానికి తగ్గింది
    లక్ష కిలో మీటర్ల రోడ్లు నిర్మాణంలో ఉన్నాయి. మరో లక్ష కిలోమీటర్లు నిర్మాస్తాం
    పన్నుల్లో రాష్ట్రాలకు 42శాతం ఇస్తున్నాం
    ఆధార్ జన్ధన్ ద్వారా లబ్ధిదారులకు పథకాలు వర్తిస్తున్నాయి
    వ్యవసాయ, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం
    2022 నాటికి గ్రామాల్లో 4 కోట్లు, పట్టణాల్లో 2 కోట్లు ఇళ్ల నిర్మాణం
    త్వరలో రెండంకెల వృద్ధిరేటును చేరుకుంటాం.
    2020 నాటికి ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం.
    ప్రతి ఇంటకి మరుగ దొడ్డి, తాగునీరు అందిస్తాం.
    ప్రతి ఇంటికి 24 గంటలు విద్యుత్ సౌకర్యం కల్సిస్తాం.
    ఏపీ తెలంగాణ విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తాం.
    బీహార్, బెంగాల్తోపాటు ఏపీ ఆర్థిక సాయం.
    గోల్డ్లోన్ల పథకం స్థానంలో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్.
    హైదరాబాద్లోని కుతుబ్ షాహీ టోంబ్స్ రక్షణకు నిధులు.