శ్రీవారి సొమ్ము భద్రంగా జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చెయ్యనున్నారు

 

టిటిడి పాలక మండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. శ్రీ వారి సొమ్మును ఇక పై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ బ్యాంకులో భద్రత లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకోనునట్లు తెలిపారు. త్వరలోనే 15 వందల కోట్లను జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వంలో టీటీడీ సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో పలువురు భక్తులు కోర్టును ఆశ్రయించారు. 14 వందల కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడంతో అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు సూచనల మేరకు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలని పాలక మండలి తీర్మానం తీసుకోనుంది. దీని పై ప్రతిపాదనను కూడా సిద్ధం చేసింది.అయితే టీటీడీ తీసుకోబోతున్న ఈ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీ వారి భక్తులు. 

ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు వెయ్యి కోట్ల రూపాయలను ఇండస్ అండ్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. నేనొక భక్తుడిగా హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వాజ్యం వేశానని పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి తెలిపారు. హైకోర్టు చాలా ఘాటుగా స్పందించి జాతీయ బ్యాంకులు ఉండగా ప్రైవేటు బ్యాంకులో ఏ ఉద్దేశంతో డిపాజిట్ చేశారని చెప్పి టిటిడిని ప్రశ్నించటం జరిగింది. అప్పుడు తాత్కాలికంగా షార్ట్ టర్మ్ డిపాజిట్ కోసం వెయ్యి కోట్ల రూపాయల మేము ఇండస్ అండ్ బ్యాంక్ లో వేశామని ఆ గడువు ముగిసినాక వెనక్కి తీసుకుంటామని ఈవో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు దాదాపు 12 వేల కోట్ల రూపాయలు శ్రీవారి నిధులున్నాయి. ఆ నిధులన్ని కూడా ఖచ్చితంగా భవిష్యత్ లో జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ లు చేయాలి. భద్రత విషయం దృష్టిలో పెట్టుకొని ఉండాలని శ్రీ వారి భక్తుడు హెచ్చరించారు.