ఆర్టీసీ సమ్మె చివరకి ఇంత ఉద్రిక్తంగా మారడానికి కారణం ఏమిటి?

తెలంగాణ ఆర్టీసీ సమ్మె పరిస్థితి రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఉడుం పట్టుతో ఉన్నారు. తమను దిక్కరించి చట్ట విరుద్ధంగా సమ్మె చేస్తారా, ప్రజలు నలిగిపోతున్నారని అంటూ ప్రభుత్వం మండిపడుతోంది.ఆర్టీసిలో ఈ స్థాయి పరిస్థితి రావటానికి చాలా కారణాలే ఉన్నాయి. సమస్యలను మొదటి నుంచి సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల ఆర్టీసీ, ప్రభుత్వం ఎవరికి వారే తమ లాభం చూసుకోవటం తప్ప దీర్ఘకాల ప్రణాళికలు లేకపోవటంతోనే పరిస్థితి ఇంత వరకూ వచ్చింది. ఆర్టీసీకి మూడు వేల కోట్ల అప్పు, యాభై వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. మరి ఈ సమస్య పరిష్కారం అసాధ్యమా లేక  సమ్మె కొనసాగుతుందా ఏం జరుగుతుంది అన్నది చర్చనీయాంశంగా మారింది . డిమాండ్ లు నెరవేర్చే వరకు వెనక్కు తగ్గేది లేదంటున్నాయి కార్మిక సంఘాలు. ఏం చేయాలి ఏం చేస్తే సమస్య పరిష్కారమవుతుంది, బాకీలు ఎలా తీరుతాయి అన్న విషయాల పై దృష్టి పెట్టకుండా కార్మికులందరూ సెల్ఫ్ డిస్మిస్ అంటోంది ప్రభుత్వం.దీనితో పోరాటం ఉధృతమవుతోంది. 

దీనంతటికి కారణం ఆర్టీసీకి, ప్రభుత్వానికి మధ్య ఆర్థిక క్రమశిక్షణ లోపించటమే. రాయితీలు ఇస్తూ వాటినీ అలాగే వాయిదా పెట్టుకుంటూ డీజిల్ పై వ్యాట్ ను బాదుతూ ఇలా ఎక్కడికక్కడ లోటు పెరుగుతోంది. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలున్నట్లు ఆర్టీసీ సమస్యలకు అన్నే కారణాలున్నాయి. ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థనే అయిన ఆర్థిక క్రమశిక్షణ లేక పోవడం కొత్తగా ఆలోచించక పోవటంతోనే సమస్యలు పెరిగాయి. ఆర్టీసీ సేవలను వాడుకుంటున్న ప్రభుత్వం ఆ స్థాయిలో తిరిగి చెల్లింపులు చేయకపోవడం ఈ స్థాయి కష్టాలకు కారణం. నిజానికి ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే ఆర్టీసీ మంచి లాభాల్లోకి వెళుతుంది. ఆర్టీసీకి ఇప్పుడున్న లెక్కల ప్రకారం మూడు వేల కోట్ల రూపాయల అప్పులున్నాయి. అయితే అదే ఆర్టీసీకి యాభై వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆ స్థాయి సంస్థకు ప్రభుత్వం తలచుకుంటే మూడు వేల కోట్ల అప్పు ఒక లెక్క కూడా కాదు. సమ్మెకు వెళ్లడమంటే ధిక్కారమే అని ప్రభుత్వం అనుకుంటోంది. జీతాలు కాదు, సంస్థ మనుగడ కోసమే ఇరవై ఆరు డిమాండ్ లు పెట్టామంటున్నారు కార్మికులు. ఆర్టీసీకి ఐదు వందల కోట్ల బస్ భవన్ ఉంది. తొంభై ఏడు బస్ డిపోలు ఉన్నాయి. మొత్తం మూడు వందల అరవై నాలుగు బస్ స్టేషన్ లు పది వేల బస్సులు ఉన్నాయి.

పధ్నాలుగు దవాఖానాలు, రెండు జోనల్ వర్క్ షాప్ లు, ఒక బస్ బిల్డింగ్ యూనిట్, రెండు టైర్ రీట్రేడింగ్ సెంటర్ లు, ఒక ప్రింటింగ్ ప్రెస్ లేక ఆర్టీసీ బస్సుల తిరుగుతున్నాయా అన్న కోణంలో పరిశీలిస్తే ఒక ప్రింటింగ్ ప్రెస్, ఒక ట్రాన్స్ పోర్ట్ అకాడమీ ఉంది. ఒక్కో డిపో సుమారు పది ఎకరాల విశాల స్థలంలో ఉంటుంది. బస్ స్టేషన్ లు రెండు నుంచి నాలుగు ఎకరాల్లో ఉంటాయి. సుమారు ఐదు వందల కోట్ల విలువ చేసే బస్ భవన్, అంతే విలువ చేసే ఎండి ఆఫీస్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ముషీరాబాద్ లో ఉన్నాయి. ముషీరాబాద్ ఒకటి, రెండు, మూడు డిపోలతో పాటు ఒక గెస్ట్ హౌస్ ఉంది. ఇవన్నీ కలిపి దాదాపు పదెకరాల విస్తీర్ణంలో ఉంటాయి. అంటే కేవలం ఒక్కచోటే ఆర్టీసీకి పదిహేను వందల కోట్ల విలువ చేసే భూములు ఉన్నాయి. వీటికి దగ్గర్లోని రెండెకరాల్లో ఆర్టీసీ కళ్యాణ మండపం కూడా ఉంది. తార్నాకలో విశాలమైన కార్పొరేట్ తరహా హాస్పిటల్ ఉంది. విశాలమైన ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్ లో గోషా మహల్ డోమ్ ఆర్టీసీ విలువైన స్థలాలలో ముఖ్యమైనవి. వీటితో పాటు కరీంనగర్, వరంగల్ పలు జిల్లాల్లో కీలకమైన ప్రాంతాల్లో అన్నీ కలిపి యాభై వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులున్నాయి. రాష్ట్రంలో రోజూ దాదాపుగా కోటి మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో రెండు వేల వరకు అద్దె బస్సులు నడుస్తున్నాయి.

ఇవన్నీ లాభాల్లోనే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులే నష్టాల్లో ఉన్నాయి. లాభాలు వచ్చే మార్గాల్లో అద్దె బస్సుల తిరుగుతున్నాయా లేక ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయా అన్న కోణంలో పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుంది. అయితే పల్లె వెలుగు బస్సులలో అంతగా లాభాలు రాకపోయినా అన్ని ప్రాంతాలకు బస్సులు తిప్పాలన్న ఉద్దేశంతో ఈ ట్రిప్పులు కొనసాగుతున్నాయి, వాటితోనూ నష్టాలు వస్తున్నాయి. ఆర్టీసీ అప్పులు మూడు వేల రెండు వందల కోట్లు ఉంది. పేరుకు పోయిన నష్టాలు మరో మూడు వేల మూడు వందల ఎనిమిది కోట్లు ఉన్నట్లు తేలింది. ఇంత భారీ ఎత్తున ఆస్తులున్న సంస్థకు అప్పు పది శాతం లోపే, ఆర్టీసీలో ఏటా ఐదు నుంచి పది శాతం బస్సులకూ కాలం తీరిపోతుంది. ఆర్టీసీని లాభాల్లోకి తేవాలంటే చాలా మార్గాలున్నాయి అంటున్నాయి కార్మిక సంఘాలు కానీ వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఆర్టీసీ అప్పులపై వడ్డీ, జీతాల చెల్లింపు కొత్త బస్సుల కొనుగోలు భారంగా మారుతోందని ప్రభుత్వం చెబుతోంది. ఆర్టీసీలో ప్రైవేట్ కు పార్ట్ నర్ షిప్ కల్పిస్తేనే లాభముంటుందని వాదిస్తుంది. ఈ వ్యాపారం అంతా అక్కడికి తరలి పోయి, అది కొత్త వాణిజ్య కేంద్రంగా మారుతోంది. ఇంతటి కమర్షియల్ యాక్టివిటీకి కేంద్రంగా ఉన్న బస్టాండ్ ల ఆస్తి విలువ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆర్టీసీ యాజమాన్యం ఈ విషయాన్ని గుర్తించి కొన్ని బస్టాండ్ లను కమర్షియల్ అవసరాలకు తగ్గట్లు అద్దెలు వచ్చేలా షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేశాయి. టెండర్ల ద్వారా ఈ షాపులను వ్యాపారులకు కేటాయిస్తున్నారు. చెప్పాలంటే ఆర్టీసీకి ఇప్పుడు ఉన్నది పెద్ద సమస్యనే కాదు, పరిష్కరించుకునే విషయాన్ని పక్కన పెట్టి దేనికైనా రెడీ అంటూ ఉండటమే సమస్యను పెంచుతుంది. నిజానికి ఈ నెల ఐదు నుంచి సమ్మె జరగడానికి ముందు ప్రభుత్వం రవాణా శాఖ మంత్రితో చర్చలకు ఆహ్వానించిన, హామీ ఇచ్చినా వెనక్కు తగ్గే పరిస్థితి ఉండేదంటున్నారు కార్మికులు. కానీ అధికారుల కమిటీ చర్చలతో ఏదీ జరగదని నిర్ధారించుకున్నాకే సమ్మెకు వెళ్లామని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు .ఇప్పుడు ఈ సమ్మే ఆర్టీసీ వారి జీవితాలపై ఎలాంటి మార్పులు చేబడుతోందో వేచి చూడాలి.