అద్దె బస్సులతో ఆర్టీసీ బతుకు బస్టాండు...

 

అద్దె బస్సులతో ఆర్టీసీ బతుకు కష్టాలపాలవుతోంది. సంస్థకు నష్టాలకు అద్దె బస్సులే సగం కారణమవుతున్నాయి. ఆర్టీసీని ఎన్ని రకాలుగా దోచుకోవాలో ప్రైవేటు బస్సుల యజమానులు అన్ని రకాలుగా దోచేస్తున్నారు. సాధారణంగా ఏదైనా వాహనాన్ని అద్దెకు తీసుకోవాల్సి వస్తే ఎవరైనా రోజుకి ఇంతని చెల్లిస్తారు. దాని నిర్వహణ ఖర్చులు, బీమా, వాహన పన్ను వంటివి ఆ వాహన యజమానే కట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ రోజు అద్దె ఇస్తూ దాని నిర్వహణ చార్జీలు కూడా భరించరు. కానీ ఆర్టీసీలో ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నడుస్తోంది. బస్సులకూ అద్దె చెల్లిస్తూనే వాటి నిర్వహణ ఖర్చులను ఆర్టీసీనే భరిస్తుంది. మోటారు వాహన పన్ను, బీమా ప్రీమియం వంటివన్ని చెల్లిస్తోంది. కేవలం చార్జీల రూపంలోనే ఇప్పటి వరకు రెండు వేల నాలుగు వందల పదకొండు కోట్లు చెల్లించింది. విచిత్రమేంటంటే గత ఐదేళ్లుగా కేవలం అద్దె బస్సుల మెయింటినెన్స్ కిందే ఆర్టీసీ వెయ్యి అరవై ఆరు కోట్లను ఖర్చు చేసింది. ఇక భ్హీమా ప్రీమియం, ఎంవీ టాక్స్ రూపంలో మరో రూ నాలుగు వందల ముప్పై కోట్ల వరకూ చెల్లించింది. 

అద్దె బస్సుల ద్వారా కిలోమీటరుకు సగటున ఇరవై తొమ్మిది రూపాయల ముప్పై తొమ్మిది పైసలు ఆదాయం వస్తుండగా, ముప్పై నాలుగు రూపాయల డెబ్బై మూడు పైసలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇందుకు కారణం లేకపోలేదు. అద్దె బస్సుల యజమానులు తమకు ఇష్టమైన రూట్లలోనే కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. టైర్ల అరుగుదల లేకుండా రోడ్లు బాగున్న రూట్లనే ఎంపిక చేసుకుంటున్నారు. గ్రావెల్, కచ్చా రూట్లలో బస్సులు నడపడానికి ఇష్టపడటం లేదు. ఇలాంటి అధ్వాన రూట్లలో ఆర్టీసీ సొంత బస్సులను నడపాల్సి వస్తోంది. స్పీడ్ బ్రేకర్ లు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే గ్రేటర్ హైదరాబాద్ జోన్ లో అద్దె బస్సులను నడపడం లేదు. కేఎంపీఎల్ ఎక్కువగా వచ్చే రూట్లు, ట్రాఫిక్ రద్దీ లేని రూట్లలో మాత్రమే అద్దె బస్సులను నడుపుతున్నారు. అందుకే వీటిలో ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువగా ఉండటం లేదు.టీఎస్ ఆర్టీసీలో మొత్తం బస్సులు పది వేల నాలుగు వందల అరవై వాటిలో ఆర్టీసీ సొంత బస్సులు ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు, అద్దె బస్సులు రెండు వేల నూట మూడు అంటే మొత్తం బస్సుల్లో అద్దె బస్సులు దాదాపు ఇరవై శాతం. కానీ ఆర్టీసీ మంగళవారం మరో వెయ్యి ముప్పై ఐదు అద్దె బస్సుల కోసం టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బస్సులో వచ్చి చేరితే కార్పొరేషన్ లో అద్దె బస్సులు ముప్పై శాతానికి చేరతాయి. అద్దె బస్సులు మరో పది శాతం పెరిగితే అదే స్థాయిలో నష్టాలు పెరగనున్నాయి. 

ఆర్టీసీలో సొంత బస్సు రోజుకు సగటున పదమూడు వేల నూట ఇరవై ఒక్క రూపాయలు సంపాదిస్తుంటే, అద్దె బస్సు ఆదాయం పది వేల ఐదు వందల నలభై నాలుగు మాత్రమే అంటే ఆర్టీసీ బస్ తో పోలిస్తే అద్దెబస్సు వల్ల రోజుకు సగటున రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయల నష్టం వస్తుంది. మొత్తం అద్దె బస్సులతో రోజుకు సగటున నలభై లక్షల ఎనభై ఏడు వేల రూపాయలలో నష్టాలు వస్తున్నాయి.గత ఐదేళ్లుగా కేవలం అద్దె బస్సులే ఆర్టీసీకి ఆరు వందల ముప్పై కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. నిజానికి తెలంగాణ ఏర్పడే నాటికి అంటే రెండు వేల పద్నాలుగులో అద్దె బస్సుల సంఖ్య కేవలం పదిహేను వందల నలభై రెండు మాత్రమే కానీ కేవలం ఐదేళ్లలోనే అద్దె బస్సులు మరో ఐదు వందల అరవై ఒకటి పెరిగాయి. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన అద్దె బస్సులు దాదాపు రెండు వందల మాత్రమే ఇక అద్దె బస్సుల వల్ల రెండు వేల పద్నాలుగు, పదిహేనులో రోజుకు ఇరవై మూడు లక్షల రూపాయల నష్టాలు మాత్రమే వచ్చేవి. ఇవి క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. రెండు వేల పదహారు, పదిహెడులో రోజుకు ముప్పై నాలుగు లక్షలు. రెండు వేల పధ్ధెనిమిది, పంతొమ్మిదికు వచ్చే సరికి నలభై లక్షలకు ఈ నష్టాలు చేరాయి. ఇప్పుడు వీటి సంఖ్యను సగానికి పెంచితే, ఆర్టీసీ మునగడం ఖాయమని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఈ ఆర్టీసీ సమ్మే తో మొత్తానికి ప్రైవేట్ వాహనదారులు తెగ లాభాల బాట పడుతున్నారని చెప్పుకోవచ్చు.