ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ర‌ద్దు..

తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకంది. ముఖ్య‌మంత్రి ఆదేశాలతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విద్యాశాఖ తెలిపింది. ఫెయిల్ అయిన విద్యార్థులంతా పాస్ అయినట్లు ఇంటర్ బోర్డు ప్ర‌క‌టించింది. కంపార్ట్మెంట్ లో పాస్ అయినట్లుగా సర్టిఫికెట్ లో బోర్డు పేర్కొన‌నుంది. ఈ నిర్ణయంలో 1.47 లక్షల మంది విద్యార్థులకి ప్రయోజనం క‌ల‌గ‌నుంది. రి-కౌంటింగ్, రి-వెరిఫికేషన్ ఫలితాలను 10 రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేర‌కు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వివ‌రాలు వెల్ల‌డించారు.