టీఆర్ఎస్ నాలుగు చోట్ల డిపాజిట్‌ కోల్పోయింది.!!

 

ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోతే నాయకులకు బాధ ఉంటుంది. మరి డిపాజిట్లు కోల్పోయిన వారి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి చాలామంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఎన్నికల్లో మొత్తం 1821 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 1515 మంది డిపాజిట్ కోల్పోయారు. వీరిలో ఆంధోల్‌ నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ కూడా ఉన్నారు. దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ.. 30కి పైగా స్థానాల్లో డిపాజిట్‌ కోల్పోయింది. బీజేపీకి అతి తక్కువగా కోదాడలో 542 ఓట్లు వచ్చాయి. ఇక కోదండరాం టీజేఎస్ పార్టీకి దుబ్బాక, సిద్దిపేట, అంబర్‌పేట, ఆసిఫాబాద్‌, మల్కాజిగిరిలలో డిపాజిట్‌ దక్కలేదు. అలాగే బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి కూటమి తరుపున పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్‌ కూడా డిపాజిట్‌ కోల్పోయారు. వీరేకాదు ఘన విజయం సాధించి మళ్లీ అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా కొందరు డిపాజిట్ కోల్పోయారు. టీఆర్ఎస్.. ఎంఐఎం గెలిచిన స్థానాల్లోని ఓ నాలుగు చోట్ల డిపాజిట్‌ కోల్పోయింది.