కార్యకర్తను బూటు కాలితో తన్నిన ప్రజాప్రతినిధి

 

ప్రచారానికి వెళ్లిన ఓ ప్రజాప్రతినిధికి ఉహించని పరిణామం ఎదురవ్వటంతో ఆగ్రహానికి లోనయ్యారు. ప్రచారం అడ్డుకున్న వారిని బూటుకాలుతో తన్ని వివాదంలో చిక్కుకున్నారు.తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు రానుండటంతో ప్రచారాలహోరు మొదలు పెట్టారు తెరాస పార్టీ నాయకులు.ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెరాస నాయకుడు వొడితెల సతీశ్‌ కుమార్‌ వెళ్లారు.

ప్రచారానికి వచ్చిన వొడిదలను అడ్డుకొని నాలుగేళ్ల తెరాస పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని, తమ గ్రామాన్ని అనవసరంగా అక్కన్నపేట మండలంలో కలిపారని రోడ్డుపై బైఠాయించి నిరసన గళం వినిపించారు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు,కొందరు స్థానికులు.అంతేకాకుండా వొడితెలకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో సహనం కోల్పోయిన వొడితెల వారిని బూటు కాలుతో తనుకుంటూ వెళ్లారు. అసలు ఏం జరుగుతుందో అర్ధం అయ్యేలోపే వొడిదల అనుచరులు,తెరాస కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి దిగారు.ఇరువర్గాల మధ్య తోపులాటతో యుద్ధ వాతావరణం నెలకొంది.చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకొచ్చింది.