నా వెనుక త్రివిక్రమ్ లేడు: పవన్

 

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తున్నాను అని ప్రకటించినప్పటి నుంచి ఆయన నిర్ణయం వెనుక దర్శకుడు, స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వున్నాడని మీడియాలో జోరుగా ప్రసారం జరిగింది. అయితే ఈ రోజు ఆవిర్భావ సభలో మాట్లాడిన పవన్..తన నిర్ణయం వెనుక త్రివిక్రమ్ లేడని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడం త్రివిక్రమ్‌కు ఇష్టం లేదని ఆయన అన్నారు. దీంతో ఆయనతో నాకు విభేదాలు కూడా వచ్చాయని తెలిపారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఆపేశానని అందరూ అకున్నారని, అది నేను ఆపలేదని, అది ఇప్పుడు జనసేన అయిందని ఆయన అన్నారు.